26వ ఆధ్యాయము

వ్యాస ఉవాచ:-

అథాతః సంప్రవక్ష్యామి దానధర్మ మనుత్తమమ్

బ్రహ్మణాభిహితం పూర్వ మృషీణాం బ్రహ్మవాదినామ్

అర్ధానా ముచితే పాత్రే శ్రద్ధయా ప్రతిపాదనమ్

దాన మిత్యభినిర్దిష్టం భుక్తిముక్తిఫలప్రదమ్

యద్దదాతి విశిష్టేభ్యః శిష్టేభ్యః శ్రద్ధయా యుతః

తద్విచిత్ర మహం మన్యే శేషం కస్యాపి రక్షతి

నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం దాన ముచ్యతే

చతుర్థం విమలం ప్రోక్తం సర్వదానోత్తమోత్తమమ్

అహన్యహనీ యత్కించి ద్దీయతేఽనుపకారిణే

అనుద్దిశ్య ఫలం తస్మాద్ బ్రాహ్మణాయ తు నిత్యకమ్

యత్తు పాపోపశాన్త్యర్థం దీయతే విదుషాం కరే

నైమిత్తికం తదుద్దిష్టం దానం సద్భి రనుష్ఠితమ్

అపత్యవిజయైశ్వర్యస్వర్గార్థం యత్ప్రదీయతే

దానం తత్కామ్య మాఖ్యాత మృషిభి ర్ధర్మచింతకైః

యదీశ్వరప్రీణనార్థం బ్రహ్మవిత్సు ప్రదీయతే

చేతసా ధర్మయుక్తేన దానం తద్ విమలం శివమ్

దానధర్మం నిషేవేత పాత్ర చూసొద్య శక్తితః

ఉత్పత్స్యతే హీ తత్పాత్రం యత్తారయతి సర్వతః

కుటుంబభక్తవసనా ద్దేయం యుదతిరిచ్యతే

అన్యథా దీయతే యుద్ధి న తద్దానం ఫలప్రదమ్

వ్యాస మహర్షి పలికెను :

ఇక ఇప్పుడు పూర్వము చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మవాదులగు ఋషులకు బోధించిన సర్వోత్తమమగు దాన ధర్మమును వివరించేదను. తాను సంపాదించిన ధనమును వేద వేదాంగములను చక్కగా అధ్యయనము చేసిన సతాత్రలో శ్రద్దా పూర్వకముగా సమర్పించుట దాసమనబడును. ఇది భోగమోక్షములను ప్రసాదించును. అత్యంత శ్రద్ధతో విశిష్ట వ్యక్తులకు దానము చేసినదే విత్తమనబడును. ఇతరము ఇతరులది తాను కాపాడుచున్న దనియే భావించవలయును. దానము నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు విధములు. నాలుగవది విమలమని సర్వదానము లలో అత్యుత్తమము. తనకు ఎలాంటి ఉపకారము చేయనివానికీ ఏ ఫలాపేక్ష లేకుండా దానమిచ్చు దానము నిత్య మనబడును. తాను చేసిన పాపము నశించుటకు విద్వాంసులకరించు దానము నైమిత్తిక మనబడును. దీనిని సజ్జనులాచరింతురు. సంతానము సంపదలు విజయము స్వర్గాది ఫలముల నుద్దేశించి చేయుదానము కొమ్యమనీ ధర్మచింతకులగు ఋషులు తెలిపిరి. పరమేశ్వర ప్రీతి కొరకు బ్రహ్మజ్ఞులకు ధర్మ యుక్త మగు మనసుతో అర్పించునది. వీనుల మనబడును. ఇది శుభప్రదము. సతాత్ర లభించినపుడు యధాశక్తి దానము చేయవలయును. అటువంటి సత్పాత్ర ఎపుడో కానీ లభించదు. ఆ పాత్ర అన్నీ పాపముల నుండి ఉద్దరించును. కుటుంబ పోషణకు కావలసిన దానికంటే అధికముగా నున్న దానినే దానము చేయవలయును. వేరుగా దానము చేసినచో ఆది ఫలమును అందీయజాలదు.

శ్రోత్రియాయ కులీనయ వినీతాయ తపస్వినే

వ్రతస్థాయ దరిద్రాయ యద్దేయం భక్తిపూర్వకమ్

యస్తు దద్యా న్మహీం భక్త్యా బ్రాహ్మణాయాహితాగ్నయే

స యాతి పరమం స్థానం యత్ర గత్వా న శోచతి

ఇక్షుభిః సంతతాం భూమీం యవగోధూమశాలినీమ్

దదాతీ వేదవిదుషే యః స భూయో న జాయతే

గోచర్మమాత్ర మపి వా యో భూమిం సంప్రయచ్ఛతి

బ్రాహ్మణాయ దరిద్రాయ సర్వపాపైః ప్రముచ్యతే

భూమిచానా త్సరం దానం విద్యతే నేహ కించన

అన్నదానం తేన తుల్యం విద్యాదానం తతోఽథికమ్

యో బ్రాహ్మణాయ శుచయే ధర్మశీలాయ శీలినే

దదాతి విద్యాం విధినా బ్రహ్మలోకే మహీయతే

దద్యా దహర హ స్త్వన్నం శ్రద్ధయా బ్రహ్మచారిణే

సర్వపాపవినిర్ముక్తో బ్రాహ్మణం స్థాన మాప్నుయాత్

గృహస్థాయాన్నదానేన ఫలం ప్రాప్నోతి మానవః

ఆగమే చాస్య దాతవ్యం దత్త్వాప్నోతి పరాం గతిమ్

వైశాఖ్యం పౌర్ణమాస్యోన్తు బ్రాహ్మణా న్సప్త పంచ వా

ఉపోష్య వీధినా శాంతాన్ శుచీన్ ప్రయతమానసః

పూజయిత్వా తిలైః కృష్ణైః ర్మధునా చ విశేషతః

గంధాదిభిః సమభ్యర్చ్య వాచయే ద్వా స్వయం పదేత్

ప్రీయతాం ధర్మరాజేతి యద్వా మనసి వర్తతే

యావజ్జీవం కృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి

కృష్ణాజినే తిలాన్ దత్త్వా హిరణ్యం మధుసర్పిషీ

శ్రోత్రియుడు, గురువు వద్ద చక్కగా అభ్యసించినపోడు, సత్కుల సంజాతుడు తపస్సంపన్నుడు, సదాచార పరుడగు దరిద్రునికి భక్తి పూర్వకముగా ఈయవలయును, ఆపోతాగియగు బ్రాహ్మణునకు భూదానము గావించినవాడు మరల తిరిగి రాని మోక్షమును పొందును. చెరుకు యప గోధుమలతో నుండు (పండు) భూమిని వేదజ్జున కిచ్చువాడు మరల పుట్టడు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోచర్మ మాత్ర భూమిని (1500 గజము) దానము చేసినచో సకల పాప నిరోచనము జరుగును. భూదానమును మించిన దానమింకొకటి లేదు. అన్నదానము దానితో సమాన మగునది. విద్యాదానము అంతకంటే గొప్పది, శాంతుడు శుచి ధర్మ శాలియగు బ్రాహ్మణునకు యథావిధిగా విద్యాదానము గావించినవాడు బ్రహ్మ లోకమును పొందును. బ్రహ్మచారికి శ్రద్ధతో ప్రతి దీనము అన్నము పెట్టినవాడు అన్నిపాపములు తొలగి ప్రాహ్మలోకమును పొందును.

గృహస్థుడగు బ్రాహ్మణునకు చేసిన అన్నదానము మహాఫలమును ఇచ్చును. కాని గృహస్థునకు అపక్వమునే ఈయవలయును. అట్లు ఇచ్చిన ఉత్తమ గతిని పొందును.

వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు తానుపవసించి అయిదుగురిని 7గురినీ కాని యధావిధిగా శాంతుడై, శుచియై ఏకాగ్ర మనస్కుడై నల్ల నువ్వులు తేనే గంధాదులతో చక్కగా పూజించి యధావిధిగా భుజింపచేసి ‘ధర్మరాజు ప్రీతి పొందునుగాక’ ఇట్లు చెప్పవలయును లేదా చెప్పించ వలయును లేక తన మనసులోనున్న దానిని చెప్పవలయును. ఇట్లు చేసినచో జీవితకాలమున చేసిన పాపము నశించును.

దదాతి యస్తు విప్రాయ సర్వం తరతి దుష్కృతమ్

కృతాన్న ముదకుంభం చ వైశాఖ్యాం చ విశేషతః

నిర్దిశ్య ధర్మరాజాయ విప్రేభ్యో ముచ్యతే భయాత్

సువర్ణతిలయుక్తైస్తు బ్రాహ్మణా స్సప్త పంచవా

తర్పయే దుదపాత్రాణి బ్రహ్మహత్యాం వ్యపోహతి

శుక్లాంబరధరః కృష్ణై స్తిలై ర్హుత్వా హుతాశనమ్

ప్రదద్యాద్ బ్రాహ్మణేభ్యస్తు విప్రేభ్యః సుసమాహితః

జన్మప్రభృతి యత్పాపం సర్వం తరతి వై ద్విజః

అమావాస్యామనుప్రాప్య బ్రాహ్మణాయ తపస్వినే

యత్కించి ద్దేవదేవేశం దద్యాద్వోద్దిశ్య శంకరమ్

ప్రీయతా మీశ్వరః సోమో మహాదేవః సనాతనః

సప్తజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి

యస్తు కృష్ణచతుర్దశ్యాం స్నాత్వా దేవం పినాకీనమ్

ఆరాధయే ద్ద్విజముఖే న తస్యాస్తి పునర్భవః

కృష్ణాష్టమ్యాం విశేషేణ ధార్మికాయ ద్వీజాతయే

స్నాత్వాభ్యర్చ్య యథాన్యాయం పొదప్రక్షాళనాదిభిః

ప్రీయతాం మే మహాదేవో దద్యా ద్ద్రవ్యం స్వకీయకమ్

సర్వపాపవినిర్ముక్తః ప్రాప్నోతి పరమాం గతిమ్

ద్వీజైః కృష్ణచతుర్దశ్యాం కృష్ణాష్టమ్యం విశేషతః

అమావాస్యాన్తు వై భక్తైః పూజనీయ స్త్రిలోచనః

ఏకాదశ్యాం నిరాహారో ద్వాదశ్యాం పురుషోత్తమమ్

కృష్ణాజినమును తీలలను, హిరణ్యమును, తేనెను, నెయ్యిని బ్రాహ్మణునకు దానము గావించినచో సకల పాపములు తొలగును. వైశాఖ పూర్ణిమనాడు పక్వాన్నమును జలకుంభమును ధర్మరాజునుద్దేశించి బ్రాహ్మణులకు దానము గావించినచో అన్ని భయములు తొలగును. బంగారము నువ్వులతో కూడిన జలకుంభములను 5 గురికి కాని 7గురికీ కాని ఇచ్చినచో బ్రహ్మహత్యాది పాపములు కూడా తొలగును. మాఘశుద్ధ ద్వాదశి సోడు ఉపవసించి శుక్లవస్త్రములను ధరించి సల్లనువ్వులతో అగ్నిలో హోమముగావించి బ్రాహ్మణులకు తిలదానముగావించినచో పుట్టిననాటి నుండి చేసిన అన్నీ పాపములను నశింపచేయును. అమావాస్యనాడు తపస్వియగు బ్రాహ్మణునకు శంకరుని ఉద్దేశించి ఏ కొంచెమైనను దానము గావించి సనాతనుడగు మహాదేవుడు సోముడు ప్రసన్నుడగు గాక అని పలికనచో 7 జన్మల పాపములు నశించును. కృష్ణ చతుర్దశినాడు స్నానము గావించి బ్రాహ్మణముఖముగా శంకరుని ఆరాధించినవాడు మరల పుట్టడు. కృష్ణాష్టమినాడు విశేషముగా స్నానము గావించి ధార్మికుడగు బ్రాహ్మణునకు పాద ప్రక్షాలనాదులతో యధావిధిగా పూజించి మహాదేవుడు ప్రీతి చెందుగాక అని తన ద్రవ్యమును దానము గావించినచో సర్వ పాపములు తొలగి ఉత్తమగతినీ పొందును.

అర్చయే ద్బ్రాహ్మణముఖే స గచ్ఛే త్పరమం పదమ్

ఏషా తిథి ర్వైష్ణవీ స్యా ద్ద్వాదశీ శుక్లపక్షకే

తస్యా మారాధయే ద్దేవం ప్రయత్నేన జనార్దనమ్

యత్కించి ద్దేవ మీశాన ముద్దిశ్య బ్రాహ్మణే శుచౌ

దీయతే విష్ణవే వాపి తదనంతఫలప్రదమ్

యో హి యాం దేవత మిచ్ఛే త్సమారాధయితు న్నరః

బ్రాహ్మణాన్ పూజయే ద్విద్వాన్ స తస్యా స్తోషహేతుకః

ద్వీజానాం వపు రాస్థాయ నిత్యం తిష్ఠంతి దేవతాః

పూజ్యంతే బ్రాహ్మణాలాభే ప్రతిమాది ష్వపి క్వచిత్

తస్మా త్సర్వప్రయత్నేన తత్ఫలానా మభీప్సుభిః

ద్విజేషు దేవతా నిత్యం పూజనీయా విశేషతః

వీభూతికామః సతతం పూజయేద్వై పురందరమ్

బ్రహ్మవర్చసకామస్తు బ్రహ్మాణం బ్రహ్మకాముకః

ఆరోగ్యకామోఽథ రవిం ధేనుకామో హుతాశనమ్

కర్మణాం సిద్ధికామస్తు పూజయే ద్వై వినాయకమ్

భోగకామస్తు శశినం బలకామః సమీరణమ్

ముముక్షుః సర్వసంసారా త్ప్రయత్నేనార్చయే ద్ధరిమ్

బ్రాహ్మణులు విశేషముగా కృష్ణచతుర్దశి, కృష్ణాష్టమి, అమావాస్య దినములలో శంకరుని పూజించవలయును. ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశి దీనమున బ్రాహ్మణముఖముగా శ్రీమన్నార్ధాయణుని పూజించినచో పరమపదమును పొందును. శుక్ల పక్ష ద్వాదశి శ్రీవిష్ణు తీధి. కావున ఆ తిధి యందు ప్రయత్నముతో జనార్ధనుని ఆరాధించవలయును. ఈశ్వరుని ఉద్దేశించి విష్ణువు నుద్దేశించి బ్రాహ్మణునికి దానము గావించినచో అనంత ఫలము నిచ్చును. తానే దేవతనారాధించ దలచిననూ విశేష ప్రయత్నముతో ఆ దేవతా ఉద్దేశ్యకముగా బ్రాహ్మణుని పూజించినచో ఆ దేవత ప్రీతి చెందును. దేవతలందరు బ్రాహ్మణునీ దేహమున ఎప్పుడూ ఉందురు. బ్రాహ్మణులు లభించనపుడు ప్రతిమాదులతో పూజించవలయును. కావున ఆయా ఫలములను కోరువారు సర్వ ప్రయత్నములతో బ్రాహ్మణులలో దేవతలను పూజించవలయును. విభూతిని కోరువాడు ఇంద్రుని పూజించవలయును. బ్రహ్మ తేజస్సును పొందగోరువాడు బ్రహ్మను ఆరాధించవలయును. ఆరోగ్యమును కోరువాడు సూర్యునీ, ధనమును కోరువాడు అగ్నిదేవుని, కర్మసీద్దీని కోరువాడు వినాయకునీ ఆరోధించవలయును.

యస్తు యోగం తథా మోక్ష మిచ్ఛేత్వా జ్ఞానమైశ్వరమ్

సోఽర్చయే ద్వై విరూపాక్షం ప్రయత్నేన మహేశ్వరమ్

యో వాంఛతి మహాయోగాత్ జ్ఞానాని చ మహేశ్వరమ్

తే పూజయంతి భూతేశం కేశవం చాపి భోగినః

వారీదస్తృప్తి మాప్నోతి సుఖ మక్షయ్య మన్నదః

తిలప్రదః ప్రజామిష్టాం దీపద శ్చక్షు రుత్తమమ్

భూమీదః సర్వమాప్నోతి దీర్ఘమాయు ర్హిరణ్యదః

గృహదోఽగ్ర్యాణి వేశ్మానీ రూప్యదో రూప ముత్తమమ్

వాసోద శ్చంద్రసాలోక్య మశ్వీసాలోక్య మశ్వదః

అనడుద్దః శ్రియం పుష్టాం గోదః బ్రధ్నస్య విష్టపమ్

యానశయ్యప్రదో భార్యా మైశ్వర్య మభయప్రదః

ధాస్యదః శాశ్వతం సౌఖ్యం బ్రహ్మదో బ్రహ్మసాత్య్మతామ్

ధాన్యాన్యపి యథాశక్తి విప్రేషు ప్రతిపాదయేత్

వేదవిత్సు విశిష్టీషు ప్రేత్య స్వర్గం సమశ్నుతే

గవాం హి సంప్రదానేన సర్వపాపైః ప్రముచ్యతే

ఇంధనానాం ప్రదానేన దీప్తాగ్ని ర్జాయతే నరః

ఫలమూలాని శాకాని భోజ్యాని వివిధాని చ

ప్రదద్యా ద్బ్రాహ్మణేభ్య స్తు ముదా యుక్తః స్వయం భవేత్

ఔషధం స్నేహ మాహారం రోగిణే రోగశాంతయే

దదానో రోగరహితః సుఖీ దీర్ఘాయు రేవ చ

అసిపత్రవనం మార్గం క్షుధధారాసమన్వితమ్

తీవ్రతాపం చ తరతి ఛత్రోపానత్ర్పదో నరః

యద్వా దిష్టతమం లోకే య చ్చాపి దయితం గృహే

తత్త ద్గుణవతే దేయం తదేవాక్షయ మిచ్ఛతా

అయనే విషువే చైవ గ్రహణే చంద్రసూర్యయోః

సంక్రాంత్యాదిషు కాలేషు దత్తం భవతి చాక్షయమ్

భోగములు కోరువాడు చంద్రుని, బలమును కోరువాడు వాయువును, సంసార మోక్షమును కోరుపోడు విశేష భక్తితో శ్రీహరిని పూజించ వలయును. యోగమును, మోక్షమును బ్రహ్మజ్ఞానమును కోరువాడు విరూపాక్షునీ అనగా మహేశ్వరుని పూజించవలయును. మహాయోగములను మహా జ్ఞానములను కోరువారు ఈశ్వరుని కేశవుని పూజింతురు.

జలదానము చేయువారు తృప్తిని, అన్నదానము వలన అక్షయ సుఖముసు, తిలదానము వలన ఇష్ట సంతానము, దీపదానము వలన ఉత్తమ నేత్రములు, భూమి దానము వలన సకలాభీష్టములను, బంగారము నిచ్చిన దీర్ఘాయుష్యమును పొందును. గృహముల నిచ్చుట ఉత్తమ భవనములను రజితదానము సౌందర్యమును, వస్త్రదానము చంద్ర సాలోక్యమును అశ్వదానము అశ్వినీ దేవతల లోకమును, వృషభ దానము పుష్టీకల సంపదను, గోదానము బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించును. వాహనమును శయ్యను దానము చేసిన చక్కని భార్యను, అభయమునిచ్చినవాడు ఐశ్వర్యమును పొందును. ధాన్యదానము శాశ్వత సౌఖ్యమును, వేద దానము బ్రహ్మ తాదాత్మ్యమును పొందును. తను శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు ధాన్యములనీయవలయును. ఉత్తములగు వేదజ్జులకిచ్చినచో స్వర్గలోక ప్రాప్తి కలుగును.

గోవులకు తృణదాసము చేయుటవలన సకలపాప వినిర్ముక్తి లభించును. ఇంధనముల నిచ్చినచో దీప్త జఠరాగ్ని కలుగును, ఫల మూలకములు శాకములు వీవీధ భోజ్యములను బ్రాహ్మణులకు ఇచ్చినచో నిత్య సంతోషియగును. రోగికి ఔషధమును ఆహారమును తైలాదులను ఇచ్చినపోడు రోగరహితుడై సుఖ దీర్ఘాయుష్యములు కలవాడగును. ఛత్రదానము పాదరక్షల దానము గావించినచో క్షుర ధారా సమన్వితమగు అసి పత్ర వనమను తీవ్ర తాపమును కలిగించు నరకమును దాటివేయును. తనకు ఏదీ అత్యంతము ఇష్టమో ఇంటిలోని పోరికేదిష్టమో దానిని గుణవంతు డగు బ్రాహ్మణునికి దానము గావించినచో అక్షయ ఫలమును పొందును.

ప్రయాగదీషు తీర్ధేషు పుణ్యేష్వాయతనేషు చ

దత్త్వా చాక్షయ మాప్నోతి నదీషు చ వనేషు చ

తస్మా ద్విప్రాయ దాతవ్యం శ్రోత్రియాయ ద్విజాతిభిః

స్వర్గాయుర్భూతికామేన తథా పాపోపశాంతయే

ముముక్షుణా చ దాతవ్యం బ్రాహ్మణేభ్య స్తథాన్వహమ్

దీయమానం తు యో మోహాద్గొవిప్రాగ్ని సురేషు చ

నీవారయతి పాపాత్మా తిర్యగ్యోనిం వ్రజేత్తు సః

యస్తు ద్రవ్యర్జనం కృత్వా నార్చయే బ్రాహ్మణాన్ సురాన్

సర్వస్వ మపహృత్యైనం రాష్ట్రా ద్విప్రతివాసయేత్

యస్తు దుర్భిక్షవేళాయా మన్నాద్యం న ప్రయచ్ఛతి

ప్రియమణేషు సత్త్వేషు బ్రాహ్మణుః స తు గర్హితః

తస్మాన్న ప్రతిగృహ్ణీయా న్న వై దేయఞ్చ తస్య హి

యస్తు సద్భ్యో దదాతీహ న ద్రవ్యం ధర్మసాధనమ్

స పూర్వాభ్యాధికః పాపీ నరకే పచ్యతే నరః

స్వాధ్యాయవంతో యే విప్రా విద్యావంతో జితేంద్రియాః

సత్యసంయమసంయుక్తా స్తేభ్యో దద్యాద్ద్విజోత్తమాః

ఉత్తరాయణ దక్షీణాయన పుణ్య కాలములలో, మేష తులా సంక్రమణములలో, చంద్ర సూర్య గ్రహణములలో ఇతర సంక్రమణ కోలములలో దానము అక్షయ ఫలప్రదమగును. ప్రయాగాదీ పుణ్య తీర్థములలో పుణ్యక్షేత్రములలో ఇతర పుణ్య నదులలో పుణ్య వనములలో ఇచ్చిన వానీకి అక్షయ ఫలమును ప్రసాదించును. మానవులకు దానధర్మమును మించిన ధర్మము నురొకటి లేదు. కావున ద్వీజులు శ్రోత్రియుడగు విప్రునికి దానము గావించవలయును. స్వర్గమును, ఆయుష్యమును, ఐశ్వర్యమును కోరుసారు, పాపనాశమును కోరువారు మోక్షమును కోరువారు కూడా ప్రతిదినము బ్రాహ్మణులకు దానము చేయవలయును.

గోవిప్ర అగ్ని దేవతలకు అర్పించు దానిని మోహముతో వారించినవాడు పశుపక్ష్యాదులలో పుట్టును. ద్రవ్యమును సంపాదించి దేవతలను బ్రాహ్మణులను అర్చించని వాని ధనము రాజు మొత్తము తీసుకోని రాజ్యము నుండి బహిష్కరించవలయును. కరువు కాటకాదులలో చనిపోవుచున్న పోనీకీ బ్రాహ్మణుడు అన్నాదులనీయనివాడు పరమనింద్యుడు. అతనికి ఇచ్చుట అతని నుండి తీసుకోనుట, అతనితో కలిసి కూర్చొనుట కూడా చేయరాదు. అతనికేదైనా గుర్తుపెట్టి రాజు తన రాజ్యము నుండి బహిష్కరించవలయును. ధర్మ సాధనముగు తన ధనమును దుష్టులకిచ్చిన వాడు పూర్వము చెప్పిన దానికంటే పాపి, నరకమున దుఃఖములను అనుభవించును.

సుభుక్తమపి విద్వాంసం ధార్మికం భోజయే ద్ద్విజమ్

న తు మూర్థ మవృత్తస్థం దశరాత్ర ముపోషితమ్

సన్నికృష్ట మతిక్రమ్య శ్రోత్రియం యః ప్రయచ్ఛతి

స తేన కర్మణా పాపీ దహత్యా సప్తమం కులమ్

యది స్యా దధికో వీప్రః శీలవిద్యాదిభిః స్వయమ్

తస్మై యత్నేన దాతవ్య మతిక్రమ్యాపి సన్నిధిమ్

యోఽర్చీతం ప్రతిగృహ్ణాతి దదో త్యర్చిత మేవ వా

తావుభౌ గచ్ఛతః స్వర్గం నరకన్తు విపర్యయే

న వార్యపీ ప్రయచ్ఛేత నాస్తికే హైతుకేఽపి చ

పాషండేషు చ సర్వేషు నివేదవీది ధర్మవీత్

అపూపం చ హిరణ్యం చ గా మశ్వం పృథివీం తీలాన్

అవిద్వాన్ ప్రతిగృహ్ణానో భస్మీభవతి కాష్ఠవత్

ద్వీజాతిభ్యో ధనం విప్సేత్ ప్రశస్తేభ్యో ద్విజోత్తమః

అపి వా జాతీమాత్రేభ్యో న తు శూద్రాత్మడం చన

వృత్తిసంకోచ మన్విచ్ఛేత్ నేహేత ధనవిస్తరమ్

ధనలోభే ప్రసక్తస్తు బ్రాహ్మణ్యా దేవ హీయతే

స్వాధ్యాయపరులు విద్యావంతులు జితేంద్రియులు సత్యము నియమము కలవారు అగు బ్రాహ్మణులకు దానము చేయవలయును. ధార్మికుడగు విద్వాంసుడు చక్కగా భుజించిన వాడైనను మరల భుజింప చేయవలయును కానీ పది దినములు ఉపవాసమున్ననూ వృత్తి హీనుడైన మూర్చుని భుజింప చేయరాదు. దగ్గరలోనున్న శ్రోత్రియుని విడిచి ఇతరునికిచ్చినచో ఆ పనితో ఆ పాపి 7 తరముల వరకు దహించబడును. ఒకవేళ దూరములో నున్నపోడు శీల విద్యాదులలో అధికుడైనచో దగ్గరనున్న మౌనిని అతిక్రమించి ఈయవచ్చును. ఇచ్చిన దానిని చక్కగా లాగుకొనువాడు, చక్కగా పూజించి ఇచ్చినవాడు స్వర్గమును చేరును. అట్లు చేయనివాడు నగకమును చేరును. నాస్తికునకు తర్కికి పాషండునకు వేదము తెలియనివానికి నీరు కూడా ధర్మవేత్త ఈయరాదు. అపూపము హిరణ్యము గోవు అశ్వము భూమి లీలలు విద్యా రహితుడు గ్రహించినచో వెంటనే కట్టేవలే భస్మమగును. బ్రాహ్మణుడు ఉత్తములగు ద్విజుల నుండియే ధనమును పొంద కోరవలయును లేదా స్వజాతి వలన గ్రహించవలయును. కానీ శూద్రుల నుండి గ్రహించరాదు.

వేదా నదీత్య సకలాన్ యజ్ఞాం శ్చావాప్య సర్వశః

న తాం గతి మవాప్నోతి సంకోచే ద్యా మవాప్నుయాత్

ప్రతిగ్రహరుచి ర్న స్యా ద్యాత్రార్థం తు ధనం హరేత్

స్థిత్యర్థా దధికం గృష్ణన్ బ్రాహ్మణో యాత్యధోగతిమ్

యస్తు స్యా ద్యాచకో నిత్యం న స స్వర్గస్య భాజనమ్

ఉద్వేజయతి భూతాని యథా చౌర స్తథైవ సః

గురూన్ భృత్యాశ్చో జ్జిహీర్షస్ అర్చీష్య న్దేవతాతిథీన్

సర్వతః ప్రతిగృహ్ణీయాంన్న తు తృష్యే త్స్వయం తతః

ఏవం గృహస్థో యుక్తాత్మా దేవతాతిథిపూజకః

వర్తమానః సంయతాత్మా యాతి తత్పరమం పదమ్

పుత్రే నిధాయ వా సర్వం గత్వారణ్యం తు తత్త్వవిత్

ఏకాకీ విచరే న్నిత్య ముదాసీనః సమాహితః

ఏష వః కణితో ధర్మో గృహస్థానాం ద్విజోత్తమాః

జ్ఞాత్వా తు తిష్ఠే న్నియతం తథానుషాపయే ద్ద్విజాన్

ఇతి దేవ మనాది మేక మీశం గృహధర్మేణ సమర్చయే దజస్రమ్

తమతీత్య స సర్వభూతయోనిం ప్రకృతిం వై స పరం సయాతి జన్మ

ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే షద్వింశోఽధ్యాయః -  

బ్రాహ్మణుడు వృత్తిని సంకోచింప చేసుకొనవలయును. ధన విస్తారమును కోరరాదు. ధన లోభమున పడినచో బ్రాహ్మణ్యమునే కోల్పోవును. సకల వేదాధ్యయనము కానీ సకల యజ్ఞములు కాని వృత్తి సంకోచము వలన లభించు ఉత్తమ ఫలమును పొందజాలవు. దానము గ్రహించుటలో ఆసక్తి ఉండరాదు. జీవయాత్రకు యాత్రకు ధనమును గ్రహించవలయును. తనకు కావలసిన దానికన్నా అధికమును గ్రహించినవాడు అధోగతిని పొందును. ఎప్పుడూ యాచించువాడు స్వర్గమును పొందలేడు. అతను కూడా చోరులవలె జనులను భయ పెట్టును. గురువులను భృత్యులను ఉద్దరించగోరువారు అతిథులను దేవతలను పూజించ గోరువారు అందరి నుండి గ్రహించవచ్చును కానీ దానీనీ తన భోగమున కుపయోగించరాదు. ఇట్లు మనో నిగ్రహము కల గృహస్థుడు దేవతలను అతిథులను పూజించుచున్నచో పరమ పదమును పొందును, లేదా ఉన్నదంతయూ పుత్రుని కప్పగించి తత్త్వవిత్తు అరణ్యమునకు వెళ్ళి ఏకాకియై సావధానీ ఉదాసీనుడై సంచరించవలయును. ఇట్లు మీకు గృహస్థుల ధర్మమును చెప్పితిని. దీనిని తెలిసి నియమ పూర్వకముగా అనుష్టించవలయును. నిత్య మనుష్టింప చేయవలయును. ఇట్లు అనాదీయగు పరమాత్మను గృహస్థ ధర్మముతో చక్కగా అర్చించినవాడు ప్రకృతిని అతిక్రమించి పరమగతిని పొందును. మరల పుట్టడు.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగముస 26 వ అధ్యాయము