4 - అథ ప్రాకృతసర్గః

సూతఉవాచ :-

శ్రుత్వా శ్రమవిధిం కృత్స్న మృషయో హృష్టచేతసః

నమస్కృత్య హృషీకేశం పునర్వచన మబ్రువన్

మునయ ఊచుః –

భాషితం భవ సర్వం చాతురాశ్రమ్య ముత్తమమ్

 ఇదానీం శ్రోతు మిచ్చామో యథాసమ్భవతో జగత్

   కుతః సర్వ మిదం జాతం కస్మింశ్చ లయ మేష్యతి

 నియన్హా కశ్చ సర్వేషాం వదస్వ పురుషోత్తమ

   శ్రుత్వా నారాయణో వాక్య మృషీణాం కూర్మరూపధృక్

ప్రాహ గమ్భీరయా వాచా భూతానాం ప్రభవోఽవ్యయః   

  కూర్మఉవాచ :-

మహేశ్వరః పరోవ్యక్తః చతుర్వ్యూహః సనాతనః

 అనన్తశ్చాప్రమేయశ్చ నియన్హా సర్వతోముఖః

ప్రాకృత సర్గము -

సూతుడిట్లుపలికెను - సంపూర్ణమైన ఆశ్రమ విధానమునువిని సంతోషించిన మనస్సులుగల ఋషులు, నారాయణునికి నమస్కరించి మరల ఈ మాటలు పలికిరి.

నీచేత ఉత్తమమైన నాలుగు ఆశ్రమాల వివరమంతయు చెప్పబడినది. ఇప్పుడిక ప్రపంచము యొక్క ఉత్పత్తి విధానమును వినుటకు కోరుతున్నాము.

ఈ సమస్తము దేనినుండి పుట్టినది? దేనిలో నాశము పొందగలదు? ఈ యన్నిటిని నియమించు వాడెవడు? ఓ పురుషోత్తమా! మాకు తెల్పుము.

కూర్మరూపమును ధరించిన నారాయణుడు ఋషుల మాటనువిని, భూతములకు మూలకారణము, నాశములేనివాడు అగు అతడు గంభీరమైన వాక్కుతో ఇట్లు పలికెను.  

కూర్మస్వామి పలికెను :-

పరమేశ్వరుడు, పరమపురుషుడు, వ్యక్తముకానివాడు, నాలుగు వ్యూహములుకలవాడు, సనాతనుడు, అంతములేనివాడు, కొలుచుటకు శక్యముకానివాడు, అంతట వ్యాపించినపొడు, నియమించువాడు కూడ.  

అవ్యక్తం కారణం యత్ర న్నిత్యం సదసదాత్మకం

  ప్రధానం ప్రకృతి శ్చేతి య మాహు స్తత్వచిత్తకాః

   గస్థవర్ణరసై రీనం శబ్దస్పర్శవివర్జితమ్  

అజరం ధృవ మక్షయ్యం నిత్యం స్వాత్మన్యవస్థితమ్

   జగద్యోని ర్మహాభూతం పరబ్రహ్మ సనాతనమ్

విగ్రహః సర్వభూతానా మాత్మనా ధిష్ఠితం మహత్

   అనాద్యస్త మజం సూక్ష్మం త్రిగుణం ప్రభవావ్యయమ్

 అసామ్రత మవిజ్ఞేయం బ్రహ్మాగ్రే సమవర్తత

  గుణసామ్యే తదా తస్మిన్ పురుషేచాత్మని స్థితే

  ప్రాకృతః ప్రళయో షైయో యావ ద్విశ్వసముద్భవః

   వ్యక్తరూపముకానీ కారణమేదో అది, నిత్యము, సత్తు అసత్తు రూపాలలో ఉండునది, దేనిని తత్త్వవేత్తలు ప్రధానమని, ప్రకృతి అని వ్యవహరింతురో;  వాసన, రంగు, రుచిలేని, ధ్వని, స్పర్శలచే విడువబడినది, ముసలితనము, తరుగుదల లేనిది, శాశ్వతము, ఆత్మయందే నిలిచిఉన్నది;  ప్రపంచమునకు మూలకారణము, మహాభూతస్వరూపము, అతిపురాతనము, పరబ్రహ్మరూపము, సమస్తభూతములకు మూర్తీవంటిది, ఆత్మచే అధిష్టించబడినది మహత్తత్వము.

ఆది, అంతములేనిది, పుట్టుకలేనిది, సూక్ష్మరూపము, త్రిగుణాత్మకము, ఉత్పత్తికారణము, నాశములేనిది, ఏకాంతము, తెలియరానిది అగు బ్రహ్మరూపము ముందుగా ఆవిర్భవించెను.

ఆత్మరూపుడైన ఆపురుషునియందు సత్త్వాది త్రిగుణముల సామ్యము సంభవించునప్పుడు, మరల విశ్వసృష్టిజరుగు పర్యంతము ప్రాకృత ప్రళయమని తెలియవలెను.

  బ్రాహ్మీ రాత్రి రియం ప్రోక్తా హ్యయః సృష్టి రుదాహృతా

  అహర్నవిద్యతే తస్య న రాత్రిర్హ్యుపచారతః

   నీశానే ప్రతిబుచో సౌ జగదాదిరనాదిమాన్

 సర్వభూతమయోఽ వ్యక్తా దస్తర్యామిశ్వరః పరః

  ప్రకృతిం పురుషం చైవ ప్రవీశ్యాలు మహేశ్వరః

  క్షోభయామాస యోగేన పరేణ పరమేశ్వరః

   యథా మదో నరస్త్రీణాం యథా వో మాధవోఽనీలః

 అనుప్రవిష్టః క్షోభాయ తథా సౌ యోగమూర్తిమాన్

  స ఏవ క్షోభకో విప్రాః క్షోభశ్చ పరమేశ్వరః

  స సంకోచవికాసాభ్యాం ప్రధానత్వే వ్యవస్థితః

ఇది బ్రాహ్మీరాత్రి అనిచెప్పబడినది. ఇనుము మయమైన సృష్టిగా పేర్కొనబడినది. దానికి వ్యవహారరీత్యాపగలుకాని, రాత్రీకాని లేదు.

రాత్రి ముగిసిన తరువాత, లోకాలకు ఆదిపురుషుడు, మొదలులేనివాడు, సమస్తభూతమయుడు, అన్నీటియందు వ్యాపించిఉన్న పరమపురు షుడైన ఈశ్వరుడు మేల్కొన్నాడు.

మహేశ్వరుడు ప్రకృతిని, పురుషునిగూడ ప్రవేశించి శీఘ్రముగా తనశ్రేష్టమైన యోగబలముతో కలతచెందించెను.

పురుషులకు స్త్రీలకు మదము ఎట్లో, వసంతకాలపు మలయమారుతము ఎట్లో, యోగమూర్తినిధరించిన పరమేశ్వరుడు కూడ అట్లే ప్రవేశించి క్షోభమును కలిగించేను.

ఓ బ్రాహ్మణులారా! క్షోభింపజేయువాడు అతడే, క్షోభకుగురి అయ్యే పరమేశ్వరుడు కూడ అతడే. సంకోచ వికాసములనే కర్మల ద్వారా అతడు ప్రధాన కారకుడుగా నిలిచి ఉన్నాడు.

ప్రధానాత్క్షోభ్యమానాచ్చ తథా పుంసః పురాతనాత్

ప్రాదురాసీ న్మహద్బీజం ప్రధానపురుషాత్మకమ్

మహా నాత్మా మతిర్బ్రహ్మా ప్రబుద్ధిః ఖ్యాతి రీశ్వరః

ప్రజ్ఞా ధృతిః స్మృతిః సంవి దేతస్మాదితి తత్స్మృతమ్

వైకారిక స్తైజసశ్చ భూతాది శ్చైవ తామసః

త్రివిధోఽయ మహంకారో మహతః సంబభూవ హ

అహంకారోఽభిమాన శ్చ కర్తా మనా చ స స్మృతః

ఆత్మాచ మత్పరో జీవో యతః సర్వాః ప్రవృత్తయః

పశ్చాభూతా న్యహంకారా త్తన్మాత్రాణి చ జజ్ఞిరే

ఇంద్రియాణి చ సర్వాణి సర్వం తస్యాత్మజం జగత్

క్షోభింపజేయబడిన ప్రధాన తత్త్వమునుండి, పురాతనుడైన పురుషుని నుండి, ప్రధాన పురుష స్వరూపమైన గొప్ప బీజము ప్రాదుర్భ వించినది.

మహత్తత్వము, బుద్ధి, బ్రహ్మ ప్రబుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, ధృతి, స్మృతి, సంవిత్తు అనునవి యీప్రధాన పురుష బీజము నుండి కలిగినవి.

వికారజన్యమైనదీ, తేజస్సంబంధి, తామసమైన భూతాదీకము అని మూడు విధములైన అహంకారము మహత్తు నుండి ఆవిర్భవించినది.

అహంకారము, అభిమానము అనబడు ఈతత్త్వము కర్తగా, ఆలోచించునదిగా పేర్కొనబడినది. ఆత్మమత్పరమైన జీవుడని, దానివలన ప్రవృత్తులు జరగునని తెలియవలెను.

అహంకారము నుండి పంచభూతములు, తన్మాత్రలు కూడ జనించినవి. అన్ని ఇంద్రియములు, లోకమంతయుదానినుండి కలిగినదే.

మనస్త్వ వ్యక్తజం ప్రోక్తం వికారః ప్రథమః స్మృతః

యేనాసౌ జాయతే కర్తా భూతాదీం శ్చానుపశ్యతి

వైకారీకా దహంకారా త్సర్గో వైకారికోఽభవత్

తైజసా నీంద్రియాణి స్యుద్దేవా వైకారీకా దశ

ఏకాదశం మన సత్ర స్వగుణీ నోభయాత్మకమ్

భూతతన్మాత్రసర్గోఽయం భూతాదే రభవ ద్ద్విజాః

భూతాది స్తు వికుర్వాణః శబ్దమాత్రం ససర్జ హ

ఆకాశో జాయతే తస్మా త్తస్య శబ్లో గుణోమతః

ఆకాశస్తు వికుర్వాణః స్పర్శమాత్రం ససర్ణ హ

వాయు రుత్పద్యతే తస్మా త్తస్య స్పర్శం గుణం విదుః

మనస్సు అవ్యక్తతత్త్వము నుండి పుట్టినది. ఇది మొదటి వికారమని చెప్పబడినది. దానిచేత కర్తయగు పురుషుడు కలిగి భూతములు మొదలగు వానిని చూచుచున్నాడు.

వికారజన్యమైన అహంకారమునుండి వైకారిక సర్గము జరిగినది. ఇంద్రియములు తేజస్సునుండి జనించినవి. ఓ దేవతలారా! ఇవీ పది వికార జన్యములైన సర్గములు.

మనస్సు పదునొకండవది. అది తన స్వభావముచేత ఉభయ విధమైనది. బ్రాహ్మణులారా! పంచభూతములు, దానితన్మాత్రముల యొక్క సృష్టియైన యీ మనస్సు భూతాదుల నుండి పుట్టినది.

వికారమును పొందుచున్న భూతాదీకము మొట్టమొదట శబ్దమును మాత్రము సృష్టించెను. ఆశబ్దమునుండి ఆకాశముపుట్టుచున్నది. శబ్దము ఆకాశగుణమని గుర్తించబడినది.

ఆకాశము కూడ వికారమును చెందుచు స్పర్శమును మాత్రము సృష్టించెను. ఆస్పర్శనుండి వాయువు పుట్టినది. స్పర్శము వాయుగుణమని తెలియుదురు.

వాయు శ్చాపి వికుర్వాణో రూపమాత్రం ససర్జ హ

జ్యోతి రుత్పద్యతే వాయో స్తద్రూప గుణముచ్యతే

జ్యోతి శ్చాపి వికుర్వాణం రసమాత్రం ససర్జ హ

సమ్భవస్తి తతోఽమ్భాలసి రసాధారాణి తాని చ

ఆప శ్చాపి వికుర్వాణా గస్థమాత్రం ససర్జిరే

సజ్ఘాతో జాయతే తస్మా త్తస్య గనో గుణో మతః

ఆకాశం శబ్దమాత్రం తు స్పర్శమాత్రం సమావృణోత్

ద్విగుణ స్తు తతో వాయుః శబ్దస్పర్శాత్మకోఽభవత్

రూపం తథైవా ఏశతః శబ్దస్పర్శౌ గుణా వుభౌ

త్రిగుణః స్యా త్తతో వహ్నిః స శబ్దస్పర్శరూపవాస్

వాయువుకూడ వికారమును చెందుచు రూపమను తన్మాత్రను సృజించినది. పాయువువలన తేజస్సు పుట్టుచున్నది. అది రూపము గుణముగా కలదని చెప్పబడినది.

తేజస్సు కూడ వికారమును చెంది రసమను తన్మాత్రను సృజించినది. దాని నుండి జలములు పుట్టినవి. రసమునీటియొక్క గుణమే యున్నది.

జలములు కూడ వికారము పొంది గంధతన్మాత్రను సృష్టించినవి. గంధము నుండి సంఘాతము జనించినది. దానీకి గంధము గుణముగా గుర్తింపబడినది.

ఆకాశము శబ్దమాత్రను, స్పర్శమాత్రను ఆవరించెను. దానికి రెండురెట్లుగా వాయువు శబ్దస్పర్శాత్మకమైనది.

అట్లే శబ్దస్పర్శగుణములు రెండు, రూపము కూడ కలిగియున్న త్రిగుణాత్మకుడు అగ్ని అయినాడు.

శబ్దః స్పర్శశ్చ రూపఞ్చ రసమాత్రం సమావిశత్

తస్మా చ్చతుర్గుణా ఆపో విజ్ఞేయాస్తు రసాత్మికాః

శబ్దః స్పర్శ శ్చ రూపఞ్చ రసో గస్థం సమావిశత్

తస్మాత్పఞ్చగుణా భూమిః స్థూలో భూతేషు శబ్ద్యతే

శానాత్ ఘోరాశ్చ మూఢాశ్చ విశేషా స్తేన తే స్మృతాః

పరస్పరాను ప్రవేశా ద్ధారయన్తి పరస్పరమ్

ఏతే సప్త మహాత్మానో హ్యన్యోన్యస్య సమాశ్రయాత్

నాశక్నువన్ ప్రజాః స్రష్టు మసమాగమ్య కృత్స్నశః

పురుషాధిష్ఠితత్వా చ్చ అవ్యక్తానుగ్రహేణ చ

మహదాదయో విశేషాన్త్ హ్యణ ముత్పాదయన్తి తే

శబ్దము, స్పర్శము, రూపము కూడ రసమను తస్మాత్రలో చేరగా జలములు శబ్దస్పర్శరూపరసములను నాలుగు గుణములు కలవైనవి.

శబ్దము, స్పర్శము, రూపము, రసము కలిసి గంధమునుచేరగా, భూమి శబ్దాది పంచగుణములు కలదిగా, భూతములన్నిటి యందు స్థూలమైనదిగా చెప్పబడుచున్నది.

ఆ పంచభూతములు శాంతములు, ఘోరములు, మూఢములు అని మూడు విశేషములు కలిగి యున్నవి. అవి ఒకదానిలో మరొకటి ప్రవేశించుటవలన పరస్పరము ఆధారమగుచున్నవి.

ఈయేడుగురు మహాత్ములు పరస్పరము ఆశ్రయించుకొని యుండుటవలన సంపూర్ణముగా మీలితము కాకుండా ప్రజలను సృజించుట కసమర్థులైరి.

పురుషునిచేత అధిష్ఠింపబడి యుండుటవలన, అవ్యక్తతత్వముయొక్క అనుగ్రహముచేతను మహత్తునుండి విశేషమువరకు గల తత్వములు బ్రహ్మాండమును పుట్టించుచున్నవి.

ఏకకాలసముత్పన్నం జలబుద్బుదవచ్చ తత్

విశేషేభ్యోఽణ్డ మభవ ద్బృహత్తదుదకేశయమ్

తస్మిన్ కార్యస్య కరణమ్ సంసిద్ధం పరమేష్ఠినః

ప్రకృతేఽణ్డే వివృద్ధే తు క్షేత్రజ్ఞో బ్రహ్మసంజ్ఞితః

సవై శరీరీ ప్రథమః స వై పురుష ఉచ్యతే

ఆదికర్తా స భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత

యమాహుః పురుషం హంసం ప్రధానా త్పరతః స్థితమ్

హిరణ్యగర్భం కపిలం ఛన్దమూర్తిం సనాతనమ్

మేరురుల్బ మభూ త్తస్య జరాయుశ్చాపీ పర్వతాః

గర్భోదకం సముద్రాశ్చ తస్యాస నరమాత్మనః

అది నీటి బుడగ వలె ఏకకాలములో సంభవించినది. విశేషములనుండి అండము కలిగినది. అది బృహద్రూపమై నీటిలో వసించును.

దానియందు పరమేష్టియొక్క కార్యము, కరణముకూడ సిద్దమైయుండును. ఆ అండము వృద్ధిపొందగా బ్రహ్మసంజ్ఞకలిగిన క్షేత్రజ్ఞుడు మొదటి శరీరధారిగా, పురుషుడుగా చెప్పబడువాడు, ప్రాణుల సృష్టికర్తయగు ఆ బ్రహ్మ అట్లు ప్రాదుర్భవించెను.

ఎవనిని ప్రధానముకంటే పరముగా నున్న పురుషుడని, హంసుడని, హిరణ్యగర్భుడు, కపిలుడు, ఛందోమూర్తీ, సనాతనుడు అని అందురో, అతడే ఆ బ్రహ్మ.

ఆ పరమాత్మకు మేరువు మావిగాను, పర్వతములు జరాయువుగాను, సముద్రములు గర్భోదకములుగాను ఆయెను.

తస్మిన్నణ్డేఽ భవ ద్విశ్వం సదేవాసురమానుషమ్

చన్ర్దాదీత్రౌ సనక్షత్రా సగ్రహౌ సహవాయునా

అద్భి ర్దశగుణాభిశ్చ బాహ్యతోఽణ్డం సమావృతమ్

ఆపో దశగుణేనైవ తేజసా బాహ్యతో వృతాః

తేజో దశగుణేనైవ బాహ్యతో వాయునావృతమ్

ఆకాశేనా వృతో వాయుః ఖంతు భూతాదినా వృతమ్

భూతాది ర్మహతా తద్వత్ అవ్యక్తీనా వృత్ మహాన్

ఏతే లోకా మహాత్మానః సర్వే తత్వాభిమానినః

వసత్తి తత్ర పురుషాః తదాత్మానో వ్యవస్థితాః

ఈశ్వరా యోగధర్మాణో యే చాన్యే తత్త్వచిస్తకాః

ఆ అండంలో దేవతలు, అసురులు, మనుష్యులతోకూడిన ప్రపంచము, నక్షత్రాలతో కూడ సూర్యచంద్రులు, ఇతరగ్రహాలు, వాయువుకూడ ప్రభవించాయి.

పదిరెట్లు పరిమాణం కల నీళ్లచేత అండం ఆవరించబడింది. దానికి పదిరెట్ల పరిమాణపు తేజస్సుచేత వెలుపలి నుండి నీళ్లు కప్పబడ్డాయి. దానికి పదిరెట్ల వాయువుచేత తేజస్సుకప్పబడింది. ఆ వాయువు ఆకాశంచేత, ఆకాశము భూతములు మొదలగు వానిచేత ఆవరించబడ్డాయి.

దానివలెనే భూతాదులు మహత్తుచేత, మహత్తు అవ్యక్తముచేత ఆవరింపబడ్డాయి. ఓ మహాత్ములారా! ఈలోకాలు అన్నీ తత్త్వాన్ని అభిమానించేవి. దానిలో పురుషులు తత్స్వరూపులుగా నివసిస్తారు. యోగ స్వభావులు, తత్త్వచింతకులైన ఇతరులు కూడ నీయతులై ఉంటారు.

సర్వజ్ఞాః శాన్తరజసో నిత్యం ముదితమానసాః

ఏతై రావరణై రణ్డం ప్రాకృతైః సప్తభి ర్వృతమ్

ఏతావ చ్ఛక్యతే వక్తుం మాయైషా గహనా ద్విజాః

ఏత త్ప్రాధానికం కార్యం యస్మయా బీజ మిరితమ్

ప్రజాపతిః పరామూర్తి రితీయం వైదికీశ్రుతిః

బ్రహ్మాణ్డ మేత త్సకలం సప్తలోకబలాన్వితమ్

ద్వితీయం తస్య దేవస్య శరీరం పరమేష్ఠినః

హిరణ్యగర్భో భగవాన్ బ్రహ్మా వై కనకాణ్ణజః

తృతీయం భగవద్రూపం ప్రాహుర్వేదార్థవేదినః

రజోగుణమయం చాన్య ద్రూపం తస్యైవ ధీమతః

సర్వజ్ఞులు, రజోగుణము తొలగినవారు, ఎల్లప్పుడు సంతుష్టచిత్తము కలవారు, ఈశ్వరులగుపొరు ఆఅవ్యక్తతత్వంలో నివసిస్తారు. ఆ అండము ప్రాకృతములైన ఈఏడు ఆవరణాలతో కూడి ఉంటుంది.

ఓ బ్రాహ్మణులారా! ఇంతవరకే చెప్పుటకు వీలవుతుంది. ఈ మాయా స్వరూపము గహనమైనది. నాచేత బీజమని చెప్పబడినది యీ మాయ ప్రధానంగాకల కార్యరూపము.

ఈసమస్త బ్రహ్మాండము, సప్తలోక బలములతోకూడినది. సృష్టికర్త ప్రజాపతి యొక్క “పరామూర్తి” అని వేదములో వర్ణించబడినది.

ఆ దేవునియొక్క రెండవ శరీరభాగము, హిరణ్యగర్భుడుగా సువర్ణపు అండము నుండి పుట్టిన భగవంతుడగు బ్రహ్మదేవుడు.

వేదార్థము తెలిసిన పండితులు, రజోగుణమయమైన మరొకరూపము ఆ ధీమంతుడైన దేవుని మూడవరూపముగా చెప్పుదురు.

చతుర్ముఖ స్తు భగవాన్ జగత్సృష్టా ప్రవర్తతే

సృష్టం చ పాతీ సకలం విశ్వాత్మ విశ్వతోముఖః

సత్త్వం గుణ ముపాశ్రిత్య విష్ణు ర్వశ్వేశ్వరః స్వయమ్

అంతకాలే స్వయం దేవః సర్వాత్మా పరమేశ్వరః

తమోగుణం సమాశ్రిత్య రుద్రః సంహరతే జగత్

ఏకోఽపి స న్మహాదేవ స్త్రిధాసౌ సమవస్థితః

సర్గరక్షాలయగుణైః నిర్గుణోపి నిరఞ్జనః

ఏకథా స ద్వీధా చైవ త్రిధాచ బహుధా గుణైః

యోగీశ్వరః శరీరాణి, కరోతి వీకరోతి చ

నానాకృతిక్రియారూపనామవంతి స్వలీలయా

భగవంతుడైన చతుర్ముఖబ్రహ్మ లోకాలను సృష్టించుటలో నిమగ్నుడై ఉన్నాడు. అతనిచే సృజించబడిన సమస్త విశ్వాన్ని విశ్వరూపుడు, విశ్వవ్యాప్తుడు అయినట్టి విశ్వేశ్వరుడగు విష్ణువు సత్వగుణాన్నాశ్రయించి స్వయంగా కాపాడుతాడు. కల్పాంతంలో సర్వాత్ముడైన పరమేశ్వరుడు స్వయముగా తమోగుణాన్నాశ్రయించి రుద్రరూపుడై జగత్తును సంహరిస్తాడు. ఆమహాదేవు డొక్కడే అయినప్పటికి మూడు భిన్నప్రకారాలతో ఉంటాడు.

నిర్గుణుడు, నిర్వికారుడు అయినప్పటికి ఆభగవంతుడు సృష్టి, స్థితి లయములనే మూడుగుణాలతో ఒకడుగా, ఇద్దరుగా, ముగ్గురుగా, బహురూపుడుగా కూడ ఆయాగుణాలతో ఒప్పుచున్నాడు.

యోగేశ్వరుడైన ఆదేవుడు శరీరాలను సృష్టించుట, లయింపజేయుట, అనేక విధాలైన వికారాలకు గురిచేయుట అను పోటిని తనలీలలతో జరుపుతున్నాడు.

హితాయ చైవ భక్తానాం స ఏవ గ్రసతే పునః

త్రిధా విభజ్య చాత్మానం త్రైలోక్య సంప్రవర్తతే

సృజతే గ్రసతే చైవ వీక్షతే చ, విశేషతః

యస్మా త్సృష్ట్వా నుగృహ్లాతి గ్రసతేచ పునః ప్రజాః

గుణాత్మకత్వా త్రైకాల్యే తస్మాదేకః స ఉచ్యతే

అగ్రే హిరణ్యగర్భః స ప్రాదుర్భూత స్సనాతనః

ఆదిత్వా దాదిదేవోఽసా వజాత త్వా దజః స్మృతః

పాతి యస్మా త్ప్రజాః సర్వాః ప్రజాపతి రీతి స్మృతః

దేవేషు చ మహాదేవో మహాదేవ ఇతి స్మృతః

బృహత్త్వాచ్చ స్మృతోబ్రహ్మా పరత్వాత్పరమేశ్వరః

భక్తుల మేలు కొరకే ఆదేవుడు మరల లోకాలను మ్రింగుతున్నాడు. తనను మూడు ప్రకారాలుగా విభజించుకొని ముల్లోకాలలో ప్రవర్తిస్తున్నాడు.

ప్రపంచాన్ని సృజిస్తూ, దాన్ని కాపాడుతూ, చివరకు తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. సృష్టికర్మ, అనుగ్రహము, విలయము అనే మూడు కర్మలకు ప్రజలను వశం చేస్తున్నాడు.

పైమూడు విధాలైన గుణాలు కలిగిఉన్నందువల్ల ఆదేవు డొక్కడే అని చెప్పబడుతున్నాడు. మొదట అతడు సనాతనుడైన హిరణ్యగర్భుడుగా అవతరించినాడు.

ఆదిపురుషుడు కనుక ఆదిదేవుడని, జన్మలేనివాడు కనుక అజుడని, ప్రజలనందరిని రక్షిస్తున్నందువలన ప్రజాపతి అని అతడు చెప్పబడుతున్నాడు.

దేవతలలో గొప్పవాడు కనుక మహాదేవుడని, బృహత్త్వ గుణము వలన బ్రహ్మ అని, పరమ పురుషుడు కనుక పరమేశ్వరుడని పిలువబడు తున్నాడు.

వశిత్వా దస్య వశ్యత్వా దీశ్వరః పరిభాషితః

ఋషిః సర్వత్రగత్వేన హరిః సర్వహరోయతః

అనుత్పాదాచ్చ పూర్వత్వాత్ స్వయమ్భూరితి స స్మృతః

నరాణా మయనం యస్మాత్తేన నారాయణః స్మృతః

హరః సంసాధహరణా ద్విభుత్వా ద్విష్ణు రుచ్యతే

భగవా న్సర్వవిజ్ఞానాత్ అవనా దోమతిస్మృతః

సర్వజ్ఞః సర్వవిజ్ఞానాత్ సర్వః సర్వమయో యతః

శివః స్యాన్నిర్మలో యస్మాత్ విభుః సర్వగతో యతః

తారణా త్సర్వదుఃఖానాం తారకః పరిగీయతే

బహునాఽత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్

తనకు తాను అధీనుడై ఉండుట, ఇతరులకు వశుడుకాకుండుటవలన ఇతడు ఈశ్వరుడని చెప్పబడుతున్నాడు. అంతట గమనం కలవాడై నందున ఋషిఅని, సమస్తమును తన అధీనంలోకి హరించేవాడు కనుక హరి అనీ చెప్పబడుతున్నాడు.

పుట్టుకలేకపోవుట, అన్నిటికి పూర్వమందే ఉండుట అనే కారణాలవలన అతడు స్వయంభువు అని చెప్పబడినాడు. మనుష్యులకు పొందదగిన మార్గస్వరూపుడు కనుక నారాయణుడుగా తలచబడుతున్నాడు.

సంసారబంధాన్ని నశింపజేసేవాడు కనుక హరుడని, అంతటా వ్యాపించి ఉన్నందువలన విష్ణువు అని చెప్పబడుతున్నాడు. సమస్త విషయ విజ్ఞానం కలవాడు కనుక భగవంతుడని, లోక రక్షణ చేయటంవలన ఓంకారస్వరూపుడని తలచబడుచున్నాడు.

సమస్త విజ్ఞానమయుడు కావున సర్వజ్ఞుడని, సర్వప్రపంచస్వరూపుడు కనుక సర్వుడని అతడు చెప్పబడుతున్నాడు. నిర్మల రూపుడైనందు వలన శ్రీవుడని, అంతటా వ్యాపించినందున విభువని పిలువబడుతున్నొడు.

సమస్త దుఃఖాలనుండి దాటించువాడు కనుక తారకుడని చెప్పబడుతున్నాడు. పెక్కు మాటలతో పనియేమి? ఈసమస్తలోకముకూడ బ్రహ్మమయమే.

అనేకభేదభిన్న స్తు క్రీడతే పరమేశ్వరః

ఇత్యేష ప్రాకృతః సర్గః సంక్షేపా త్యథితో మయా

అబుద్ధిపూర్వకాం విప్రా బ్రాహ్మీం సృష్టిం నిబోధత

ఇతి శ్రీకూర్మపురాణే ప్రాకృతసర్గ వర్ణనం నామ చతుర్ధాధ్యాయః -   

ఆ పరమేశ్వరుడు అనేకాలైన భేదాలతో వేర్వేరు రూపొలతో క్రీడిస్తూ ఉంటాడు. ఈవిధంగా ప్రాకృత సృష్టి క్రమము నాచేత సంగ్రహంగా చెప్పబడింది.

ఓ బ్రాహ్మణులారా! బుద్ధిపూర్వకము కానీదానిగా ఈబ్రహ్మచేత చేయబడిన సృష్టిని తెలిసికొనండి. అవిద్యామూలమని భావము.

ఇది శ్రీకూర్మమహాపురాణంలో ప్రాకృతసర్గవర్ణన మనబడు నాలుగవ అధ్యాయము సమాప్తము.