కూర్మ మహా పురాణము
15వ అధ్యాయము
వ్యాస ఉవాచ:-
వేదం వేదౌ తథా వేదాన్ వేదాన్వా చతురో ద్విజాః ।
అధీత్య చాధిగమ్యార్ధం తత స్స్నాయా ద్ద్విజోత్తమః ॥
గురవే తు వరం దత్వా స్నాయీత తదనుజ్ఞయా ।
చీర్ణవ్రతోఽథ యుక్తాత్మా స శక్తి స్స్నాతు మర్హతి ॥
వ్యాస మహర్షి చెప్పెను.
ఒక వేదమును, రెండు వేదములను, మూడువేదములను లేదా నాల్గు వేదములను ద్విజుడు అధ్యయనము గావించి అర్థమును తెలిసికోనీ స్నాతకుడు కావలెను. గురువుకు దక్షిణ సమర్పించి, గురువు ఆజ్ఞతో సమావర్తనము చేసికొనవలెను. బ్రహ్మచర్య వ్రతము పరిపూర్ణముగా అనుష్ఠించి, ఆ ప్రతఫలరూపముగా, శక్తి సంపన్నుడై, స్నాతకుడు కావచ్చును.
వైష్ణవీం ధారయే ద్యష్టిం అంతర్వాస స్తధోత్తరమ్ ।
యజ్ఞోపవీతద్వితయం సోదకం చ కమండలుమ్ ॥
ఛత్రం చోష్ణీష మమలం పాదుకే చాప్యుపానహౌ ।
రౌక్మేచ కుండలే వేదం కృత్తకేశనఖ శ్శుచిః ॥
స్వాధ్యాయే నిత్యయుక్త స్స్యా ద్భహిర్మాల్యం న ధారయేత్ ।
అన్యత్ర కాంచనా ద్విప్రో న రక్తాం బిభృయా త్స్రజమ్ ॥
వైష్ణవ దండము (ఉత్తరేణి దండము) ధరించవలెను. కౌపీనము, ధోవతి, ఉత్తరీయము, రెండు యజ్ఞోపవీతములు, జలపూర్ణ కమండలము, ఛత్రము, మురికిలేని తలపాగ, పొదుకలు, పాదరక్షలు, బంగారు కుండలములు, దర్భముష్టిని ధరించి, కేశ నఖములను యధా సమయముగ తీసివేయించుకొని పవిత్రుడై, నీత్యస్వాధ్యాయ యుక్తుడై, కంఠము నుండి పై భాగమున మాలలు ధరించరాదు. బంగార్డు హార విషయమున తప్ప, ఎర్రనీ మాలలు ధరించరాదు.
శుక్లాంబరధరో నిత్యం సుగంధః ప్రియదర్శనః ।
న జీర్ణమవద్వాసా భవే ద్వై విభవే సతి ॥
న రక్త ముల్బణం చాన్యధృతం వాసో న కుండికామ్ ।
నోపానహౌ స్రజం చాథ పాదుకే చ ప్రయోజయేత్ ॥
ఉపవీత మలంకారం దర్భాన్ కృష్ణాజినాని చ ।
నాపసవ్యం పరీదధ్యాత్ వాసో న వికృతం పసేత్ ॥
నిత్యము శుక్ల వస్త్రధరుడై సుగంధమును ధరించుచు, ప్రియదర్శనుడుగా నుండవలెను. జీర్ణ వస్త్రములను, మలిన పస్త్రములను విభవమున్నపుడు ధరించరాదు. రక్తవస్త్రములను, చూచు వారికి ఉద్వేగము కలిగించు వస్త్రములను, ఇతరులు ధరించి, విడిచిన వస్త్రములను, కమండలమును, పాదరక్షలను, పుష్పహారములను, పాదుకలను ఉపయోగించరాదు. ఉపవీతమును అలంకారములను, దర్భలను, కృష్ణాజినమును, అపసవ్యముగా ధరింపరాదు. వస్త్రమును వికృతముగా ధరింపరాదు.
ఆహరేత్ విధివ ద్దారాన్ సదృశా సత్మన శ్శుభాస్ ।
రూపలక్షణసంయుక్తాన్ యోనీదోషవివర్జితాన్ ॥
అమాతృగోత్రప్రభవా మసమానర్షిగోత్రజామ్ ।
ఆహరే ద్బ్రాహ్మణో భార్యాం శీలశౌచసమన్వితామ్ ॥
తరువాత తనకు సమాన కుల రూపములు గల సులక్షణయగు కన్యను, జాతి దోషము లేనిదానిని వివాహ మాడవలెను. బ్రాహ్మణుడు మాతృ గోత్రములో పుట్టని దానిని, తమ ఋషుల గోత్రములో పుట్టని దాని, శీల శౌచ సమన్వితయగు కన్యను వివాహ మాడవలెను.
ఋతుకాలాభిరామి స్యాత్ యావత్పుత్రోఽభి జాయతే ।
వర్జయే త్ప్రతిషిద్ధాని ప్రయత్నేన దీనాని తు ॥
షష్ఠ్యష్టమాం పంచదశీం ద్వాదశీం చ చతుర్దశీమ్ ।
బ్రహ్మచారీ భవే న్నిత్యం తద్వజ్జన్మత్రయాహన ॥
పుత్రుడు కలుగువరకు, ఋతు కాలమున భార్యను అనుగమించవలేను. అట్లే నిషిద్ధ దినములను విడువవలెను. షష్టి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, చతుర్దశి, తన జన్మ దినము నుండి మూడు దినములు బ్రహ్మచర్యమును అనుసరించవలయును.
ఆదధ్మీతా వసథ్యాగ్నిం జుహుయా జ్జాతవేదసమ్ ।
వ్రతానీ స్నాతకో నీత్యం పావనాని చ పాలయేత్ ॥
వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యా దతంద్రితః ।
అకుర్వాణః పతత్యాకు నరకా నతిభీషణాన్ ॥
అభ్యసే త్ర్పయతో వేదం మహాయజ్ఞా న్న హాపయేత్ ।
కుర్యా ద్గృహ్యాణి కర్మాణి సంధ్యోపాసన మేవ చ ॥
గార్హస్త్య అగ్నిని (ఆవపథ్యము) ప్రతిదినము హెూమము చేయవలయును. ప్రతినిత్యము పవిత్రములైన వ్రతములను ఆచరించు చుండవలయును. వేద విహితమైన నిత్యకర్మలను, స్వకర్మలను, సోమరితనము విడిచి ఆచరించవలయును. పై కర్మలను ఆచరించనిచో, అతి భయంకరమైన నరకములు పొందును. వినయ సంపన్నుడై వేదాభ్యాసము చేయవలయును. పంచ మహాయజ్ఞములు విడువరాదు. సంధ్యోపాసనను గృహ్యసూత్ర విహిత కర్మలను ఆచరించుచుండవలెను.
సఖ్యం సమాధికైః కుర్యాత్ ఉపేయా దీశ్వరం సదా ।
దైవతా న్యపీ గచ్ఛేత కుర్యా ద్భార్యాభిపోషణమ్ ॥
న ధర్మం ఖ్యాపయే ద్విద్వాన్ న పాపం గూహమే దపి ।
కుర్వీతా త్మహితం నిత్యం సర్వభూతానుకంపకః ॥
వయసః కర్మణోఽర్థస్య శ్రుతస్యా భిజనస్య చ ।
వేషవాగ్బుద్ధిసారూప్య మాచరన్ విచరే త్సదా ॥
శ్రుతిస్మృత్యుదిత స్సమ్యక్ సాధుభి ర్యశ్చ సేవితః ।
త మాచారం నిషేవేత నేహా తాన్యత్ర కర్హిచిత్ ॥
తనతో సమానులైన వారితో, తన కన్న అధికులైన వారితో స్నేహము చేయవలయును, భగవంతుని ఆరాధించవలెను. దేవతా పూజన చేయవలెను. భార్యాపోషణము చేయవలెను. తాను ఆచరించిన ధర్మమును చెప్పరాదు. తాను చేసిన పాపము దాచరాదు. ప్రతిదినము తనకు హితమును చేసికొనవలెను. సర్వ భూతములపై దయచూపు చుండవలెను. వయసునకు, కర్మకు సంపదకు, శాస్త్రమునకు, వంశమునకు తగిన విధముగా వేషమును, వాక్కును, బుద్ధిని అలవరచుకొని ఆచరించుచు సంచరింపవలెను. శ్రుతి స్మృతులలో చెప్పబడినది, సజ్జనులచే ఆచరింపబడినది మాత్రమే సదాచారమగును. అట్టి ఆచారమునే సేవించవలెను. ఇతరమును అనుసరించరాదు.
యేనాస్య పితరో యాతాః యేన యాతాః పితామహా ।
తేన యాయాత్ సతాం మార్గం తేన గచ్చన్ న రిష్యతి ॥
తండ్రులు తాతలు నడచిన దారిలోనే తాను నడువవలయును. ఇదియే సన్మార్గము. ఈ మార్గము నవలంబించినవాడు వత్తుడు కాడు.
నిత్యం స్వాధ్యాయశీల స్స్యాత్ నిత్యం యజ్ఞోపవీతవాన్ ।
సత్యవాదీ జితక్రోధో బ్రహ్మభూయాయ కల్పతే ॥
సంధ్యాస్నానపరో నిత్యం బ్రహ్మయజ్ఞపరాయణః ।
అనసూయో మృదు ర్ధాన్తో గృహస్థః ప్రేత్య వర్ధతే ॥
వీతరాగభయక్రోధ లోభమోహవివర్జితః ।
సావిత్రీ జాప్యనీరతః శ్రాద్ధకృ న్ముచ్యతే గృహే ॥
మాతాపిత్రో ర్హితే యుక్తో గోబ్రాహ్మణహితే రతః ।
దాంతో యజ్వా దేవభక్తో బ్రహ్మలోకే మహీయతే ॥
త్రివర్గసేవీ సతతం దేవతానాం చ పూజనమ్ ।
కుర్యా దహదహర్నిత్యం నమస్యే త్ర్పయత స్సురాన్ ॥
ప్రతినిత్యము స్వాధ్యాయపరాయణుడు కావలెను. నిత్యముయజ్ఞోపవీతధారియై యుండవలెను. సత్యవాది, క్రోధమును జయించువాడు, బ్రహ్మ స్వరూపమును పొందును. ప్రతినిత్యము స్నాన సంధ్యల నాచరించుచు, బ్రహ్మ యజ్ఞములను సల్పుచు, అసూయా రహితుడై, మృదు స్వభావియై ఇంద్రియ నీగ్రహము కలవాడు ఇహ పరములలో అభ్యుదయమును పొందగలడు. రాగ భయ క్రోధములు విడిచినవాడు, లోభ మోహములు లేనివాడు, సావిత్రీ జపము చేయువాడు, శ్రాద్ధకారి, అయిన గృహస్థుడు ముక్తిని పొందును. తల్లిదండ్రులకు, గోబ్రాహ్మణులకు హీతము నాచరించువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, యజనశీలుడు, దైవభక్తుడు, బ్రహ్మలోకమున నివసించును. ఎల్లప్పుడు ధర్మ కామార్థములు సేవించుచు, దేవతలను పూజించుచు, ప్రతినిత్యము యత్న పూర్వకముగా దేవతలకు నమస్కరించుచుండవలెను.
విభాగశీల స్సతతం క్షమాయుక్తో దయాలుకః ।
గృహస్థ స్తు సమాఖ్యాతో న గృహేణ గృహీ భవేత్ ॥
క్షమా దయా చ విజ్ఞానం సత్యం చైవ దమ శృమః ।
అధ్యాత్మనిరతం జ్ఞానం ఏత ద్బ్రాహ్మణ లక్షణమ్ ॥
ఏతస్మా న్న ప్రమాద్యేత విశేషేణ ద్విజోత్తమః ।
యధాశక్తి చర న్కార్మ నిందితాని వివర్జయేత్ ॥
తన సంపదను శాస్త్రానుసారముగా విభజించుచు, అనగా ధర్మము కొరకు, కీర్తికొరకు, సంపదను పెంచుటకు, తన భోగమునకు, తనవారి కొరకు - ఇట్లు 5 విధములుగా సంపదలు విభజించినవాడు ఇహ పరములలో కీర్తిని పొందును. ఓర్పు, దయ కలవాడైన గృహస్థుడు మాత్రమే గృహస్థుడనబడును. గృహమున ఉన్నంత మాత్రమున గృహస్థుడు కాజాలడు. క్షమ, దయ, విజ్ఞానము, సత్యము, శమము, దమము, ఆధ్యాత్మిక జ్ఞానము - ఇవి బ్రాహ్మణ లక్షణములు. కావున బ్రాహ్మణుడు వీనిని విడువరాదు. శక్త్యానుసారము కర్మను ఆచరించుచు, నిందితములను వీడువవలయును.
విధూయ మోహ కబిలం లబ్ధ్వా యోగ మనుత్తమమ్ ।
గృహస్థో ముచ్యతే బంధాత్ నాత్ర కార్యా విచారణా ॥
విగర్హాతిక్రమాక్షేపహింసాబంధవధాత్మనామ్ ।
అన్యమన్యు సముత్థానాం దోషాణాం మర్షణం క్షమా ॥
మోహమును తోసిరాజనీ, ఉత్తమ యోగమునుపొందిన గృహస్థుడు సంసార బంధమును వీడును. ఈ విషయమున సందేహముతో పనిలేదు, ఇతరుల కోపము వలన కలిగిన నీంద, అనాదరము, ఆక్షేపము, హింస, బంధనము, వధ మొదలగు దోషములను సహించుట క్షేమ అనబడును.
స్వదుఃఖే ష్వివ కారుణ్యం పరదుఃఖేన సౌహృదాత్ ।
దయేతి మునయః ప్రాహుః సాక్షా ద్ధర్మస్య సాధనమ్ ॥
చతుర్ధశానాం విద్యానాం ధారణం హి యథార్ధతః ।
విజ్ఞాన మితి త ద్విద్యాత్ యేన ధర్మో వివర్ధతే ॥
అధీత్య విధివత్ విద్యా మర్థం చై వోపలభ్య తు ।
ధర్మకార్యా న్నీవృత్త శ్చేత్ న త ద్విజ్ఞాన మీప్యతే ॥
సత్యేన లోకాన్ జయతి సత్యం తత్పరమం పదమ్ ।
యథాభూతప్రవాదం తు సత్య మాహు ర్మనీషిణః ॥
సౌహార్దముతో తమ దుఃఖమునవలె, పర దుఃఖమున కూడా కరుణ కలిగి యుండుట దయ అని మునులు పలికిరి. ఇది సాక్షాత్తు ధర్మ సాధనము. యథార్థముగా చతుర్ధశ విద్యలు ధరించుట విజ్ఞాన మనబడును. ఈ విజ్ఞానముతో ధర్మము వృద్ధియగును. యధావిధిగా అధ్యయనము చేసి, ధనమును పొంది, ధర్మ కార్యములను ఆచరించనిచో అదీ విజ్ఞాన మనబడదు. సత్యముతో అన్ని లోకములు జయించవచ్చును. సత్యమే పరమ పదము. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటను సత్యమని పండితులు చెప్పెదరు.
దమ శ్శరీరోపరమః శమః ప్రజ్ఞాప్రసాదజః ।
అధ్యాత్మ మక్షరం విద్యాత్ యత్ర గత్వన శోచతి ॥
యయా స దేవో భగవాన్ విద్యయా వేద్యతే పరః ।
సాక్షా ద్దేవో మహాదేవ స్తజ్ జ్ఞానమతి కీర్తితమ్ ॥
తన్నిష్ఠ స్తత్పరో విద్వాన్ నిత్య మక్రోధన శ్శుచిః ।
మహాయజ్ఞపరో విప్రో లభతే త దనుత్తమమ్ ॥
ధర్మ స్యాయతనం యత్నాత్ శరీరం పరిపాలయేత్ ।
న హి దేహం వినా రుద్రః పురుషై ర్విద్యతే పరః ॥
నిత్యం ధర్మార్థకామేషు యుజ్యేత నియతో ద్విజః ।
న ధర్మవర్జితం కామం అర్ధం నా మనసా స్మరేత్ ॥
సీద న్నపి హి ధర్మేణ న త్వధర్మం సమాచరేత్ ।
ధర్మో హి భగవాన్ దేవో గతి స్సర్వేషు జంతుషు ॥
భూతానాం ప్రియకరీ స్యాత్ న పరద్రోహకర్మధీః ।
న వేదదేవతానిందాం కుర్యా త్తైశ్చ న సంవసేత్ ॥
య స్త్వియం నియతం విప్రో ధర్మాధ్యాయం పఠే చ్ఛుచిః ।
అధ్యాపయే చ్ఛ్రావయే ద్వా బ్రహ్మలోకే మహీయతే ॥
ఇతి శ్రీ కూర్మపురాణే షట్సహస్ర సంహితాయాం ఉత్తరార్థే పంచదశోఽధ్యాయః
శారీరక ప్రక్రియా నియంత్రణమును (ఇంద్రియ నిగ్రహమును) దమమని, ప్రకృష్ట జ్ఞాన వికాసము శమమని, (మనో నిగ్రహము) ఆత్మ సంబంధ జ్ఞానమును అక్షరమని అందురు. ఈ జ్ఞానమును పొందినవాడు శోకించడు. మహాదేవుని పొందించు విద్య జ్ఞానమనబడును. ఆ జ్ఞానమున నిష్ఠ కలవాడు, ఆ జ్ఞానమందే తత్పరుడై యుండుపోడు విద్వాంసుడగును. ఇతడు సర్వకాలముల యందు కోపరహితుడై, శుచియై, పంచ మహాయజ్ఞములను ఆచరించుచు, ఆ ఉత్తమ పదమును చేరును. ధర్మమున కాధారమైన యీ శరీరమును, యత్న పూర్వకముగా పరిపాలించు. చుండవలయును, దేహము లేనిదే పరమాత్మ కూడా తెలియబడడు. ద్వీజుగు చునో నిగ్రహాము కలిగి, ధర్మార్థ కామముల యందు ప్రవర్తించు చుండవలెను. ధర్మ వర్జీతమైన కామమునుగాని, అర్థమునుగానీ మనసుతనైన స్మరింపరాదు, ధర్మాచరణతో కష్టములు కలిగినను, అధర్మము నాచరించరాదు. ధర్మమే భగవంతుడు. అన్ని ప్రాణులకు ధర్మమే గతి, ధర్మమే ప్రాణులకు ప్రియము కలిగించునది. కావున మానవుడు భూత ప్రీయమును ఆచరించవలయును కానీ, పరులకు ద్రోహము కలిగించు పనిని చేయరాదు. వేద సౌందను, దేవలోనిందను చేయరాదు. అట్లు చేయువారితో కలిసి యుండరాదు, ఇట్లు శాస్త్ర విధిని బోధించిన ఈ ధర్మాధ్యాయమును, నియమ పూర్వకముగా చదివినవాడు, చదివించినవాడు బ్రహ్మలోకమున నీవసీంచును.
ఇది కూర్మపురాణమున షట్ సాహస్ర సంహితలో ఉపరి విభాగమున పదునైదవ అధ్యాయము
Summary of chapter 68 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa presents the noble duties of Gṛhasthāshrama, which serves as the protective shelter for all other three Āshramas. He outlines the holy Samāvartana rite, selection of a righteous bride from an unblemished lineage, daily performance of the five Mahāyajñas, and maintenance of the sacred Agnihotra fire. Vyāsa highlights essential householder virtues, including hospitality toward guests (Atithi-pūjā), truthfulness, compassion, and the harmonious pursuit of Dharma, Artha, and Kāma.