కూర్మ మహా పురాణము
12వ అధ్యాయము
వ్యాస ఉవాచః:-
శృణుధ్వ దృషయ స్సర్వే వక్ష్యమాణం సనాతనమ్।
కర్మయోగం బ్రాహ్మణానా మాత్యంతికఫలప్రదమ్॥
వ్యాసుడు చెప్పెను.
ఋషులారా! మీరందరు ఇప్పుడు చెప్పబోవునది, బ్రాహ్మణులకు శాశ్వత ఫలమునిచ్చునదీ, సనాతనమైన కర్మయోగమును వినుడు!
ఆమ్నాయసిద్ధ మఖిలం బ్రహ్మణాఽ నుప్రదర్శితమ్।
ఋషీణాం శృణ్వతాం పూర్వం మను రాహ ప్రజాపతిః॥
సర్వపాపహరం పుణ్యం ఋషిసం ఘై ర్నిషేవితమ్।
సమాహితధియో యూయం శృణుధ్వం గదతో మమ॥
కృతోపనయనో వేద నధీయీత ద్వీజోత్తమాః ।
గర్భాష్టమేఽష్టమే వాబ్ధే స్వసూత్రోక్తవిధానతః ॥
దండీ చ మేఖలీ సూత్రీ కృష్ణాజినధరో మునిః।
భిక్షాహారో గురుహితో వీక్షమాణో గురో ర్ముఖమ్॥
పూర్వకాలమున ప్రజాపతియగు మనువు, వీనగోరిన ఋషులకు బ్రహ్మచేత చెప్పబడినది, అఖిల వేదసిద్దమైనది, అన్ని పాపములు తోలగించునది, పవిత్రమైనది, ఋషులచే సేవించబడినది యగు కర్మయోగమును చెప్పెను. మీరందరు సావధోన మనస్కులై నేసు చెప్పుచుండగా వినుడు. బ్రాహ్మణోత్తముడు ఉపనయనము గావించుకొని వేదాధ్యయనము చేయవలయును. ఈ ఉపనయనము గర్భాష్టమమునగానీ, అష్టమ వర్షమున గాని స్వస్తూత్రోక్త వీధి విధానముగా చేసికొనవలెను. దండమును, మేఖలమును, సూత్రమును, కృష్ణాజినమును ధరించి, మునివృత్తి ననుసరించి, భిక్షాన్నమును గ్రహించుచు, గురుహితమును కోరుచు, నిత్యము గురు సమీపమున నుండి, గురువును చూచుచు అధ్యయనమును కొనసాగించవలయును.
కార్పాస ముపవీతార్థం నిర్మితం బ్రహ్మణా పురా ।
బ్రాహ్మణానాం త్రివృత్ సూత్రం కౌశం వో వాస్త్రమేవవా॥
సదోపవీతీ చైవస్యాత్ సదా బద్దశిభో ద్విజః ।
అన్యథా యత్కృతం కర్మ తద్భవ త్యయధాకృతమ్॥
పూర్వము బ్రహ్మ ఉపవీతముకై, కార్వాసము (ప్రత్తి)ను నిర్మించేను. బ్రాహ్మణులకిది మూడు వరుసలుండును. కార్ఫాసము లభించనపుడు కుశలతోగానీ, వస్త్రముతోగాని ఏర్పరచుకొనవలెను. ద్విజుడు ఎప్పుడు యజ్ఞోపవీతమును ధరించియే యుండవలెను. అట్లే శిఖను ధరించవలెను. శిఖా యజ్ఞోపవీతములు లేక చేసిన కర్మ చేయనట్లేయగును.
వసే దవికృతం వాసః కార్పాసం వా కషాయకమ్।
తదేవ పరీధానీయం శుక్ల మచ్చిద్ర ముత్తమమ్॥
ఉత్తరం తు సమాఖ్యాతం వాసః కృష్ణాజినం శుభమ్।
అభవే దివ్య మజినం రౌరవం వా విధీయతే ॥
అట్లే వికారము చెందని (జీర్ణము కానిది, దగ్గముగానిది) వస్త్రము ధరించవలెను. ఈ వస్త్రము తెల్లనిది, చిల్లులు లేనిది, ఉత్తమమైనది కావలయును. ఉత్తరీయార్థము కృష్ణాజీన ధారణము ఉత్తమము. కృష్ణాజినము లభింపనిచో దివ్యాజీనము, (రురుమృగ చర్మము, గజ చర్మము, చిరుత చర్మముగాని) ధరింపవలెను.
ఉద్ధృత్య దక్షిణం బాహుం సవ్యే బాహ సమర్పితమ్।
ఉపవీతం భవే న్నిత్యం నివీతం కంఠ సజ్జనే॥
సవ్యబాహుం సముద్ధృత్య దక్షిణేతు ధృతం ద్విజాః।
ప్రాచీనావీత మిత్యుక్తం పిత్యైకర్మణి యోజయేత్॥
అగ్న్యా గారే గవాం గో ష్ఠే హోమే జాష్యే తథైవ చ।
స్వాధ్యాయే భోజనే నిత్యం బ్రాహ్మణానాం చ సన్నిధౌ॥
ఉపాసనే గురూణాం చ సంధ్యయోః సాధుసంగమే।
ఉపవీతీ భవే న్నిత్యం విధి రేష సనాతనః॥
మౌంజీత్రివృత్ సమా శ్లక్షా కార్యా విప్రస్య మేఖలా।
ముంజాభావే కుశ నాహు ర్గ్రంధి నైకేన వా త్రిభిః॥
ధారయేత్ బైల్వపాలాశా దండౌ కేశాంతికే ద్విజః ।
యజ్ఞా ర్హ వృక్షజం వాథ సౌమ్య మవ్రణ మేవ చ॥
దక్షిణ బాహువును ఎత్తి, సవ్యబాహువుపై ఎపుడు యజ్ఞోపవీతము నుంచవలెను. మెడలో హారమువలె వేసికొన్న నివీతమనబడును. (ఎడమచేతినెత్తి, కుడిచేతిపై యజ్ఞోపవీతము నుంచుకొనిన ప్రాచీనావీతమందురు. ఇది పితృకర్మలలో చేయవలెను. అగ్నిశాలలో, గోశాలలో, హెూమమున, జపకర్మలో, స్వాధ్యాయమున, భోజన సమయమున, బ్రాహ్మణుల సన్నిధిలో, గురూపాసనలో, రెండు సంధ్యలలో, సాధు సంగమమున, ఎపుడు ఉపవీతిగానే యుండవలెను. ఇది సనాతన విధి. మౌంజిని, బ్రహ్మచారికి యజ్ఞోపవీతమువలే మూడు వరుసలుగా, సమముగా, మృదువుగా ఏర్పరచవలెను. ముంజతృణము లభించనపుడు దర్భతో ఒక గ్రంధితోగాని, మూడు గ్రంథులతోగాని చేయవలయును. అట్లే మారేడు దండముగాని, మోదుగదండముగాని ద్విజుడు కేశాంతపర్యంతము ధరించవలెను. బిల్వపాలాశములు లభించనపుడు, యజ్ఞమునకు పనికివచ్చు వృక్షదండమును చక్కనిది, సుడులు, ఛిద్రములు లేనిదగు దండమును ధరించవలెను.
సాయం ప్రాత ర్ద్విజ స్సంధ్యా ముపాసీత సమాహితః।
కామా ల్లోభాత్ భయా న్మోహాత్ త్యక్తేన పతీతో భవేత్॥
అగ్నికార్యం తతః కుర్యాత్ సాయం ప్రాతః ప్రసన్నధీః ।
స్నౌత్వా సంతర్పయే ద్దేవా నృషీన్ పితృగణాం స్తథా॥
దేవతాభ్యర్చనం కుర్యాత్ పు ష్పైః పత్రణవాద విభిః ।
అభివాససశీల స్స్యాత్ నిత్యం వృద్ధేషు ధర్మతః ॥
అసా వహం భో సామేతి సమ్యక్ ప్రణతిపూర్వకమ్।
ఆయురారోగ్యసిద్ధ్యర్థం శకంద్రాదిపరివర్జితః ॥
ఆయుష్మాన్ భవ సౌమ్యేతి వాచో విప్రోఽభి వాదనే।
అకార శ్చాస్య నామ్నోoతే వాచ్యః పూర్వాక్షరః ప్లుతః॥
ద్విజుడు సావధాన మనసుడై ప్రాతః సాయం సంధ్యలలో సంధ్యావందన మాచరింపవలేను. కోమముతోగానీ, లోభముతోగానీ, భయము వలన మోహము వలన సంధ్యను విడచినచో పతితుడగును. తరువాత ప్రాతః కాలమున, సాయంకాలమున ప్రసన్న చిత్తముతో అగ్నికార్యము చేయవలయును. స్నానము చేసి దేవ ఋషి పితృగణములను తృప్తి పరచవలెను. పుష్ప పత్ర జలములతో దేవతలను పూజించవలయును, ధర్మాను సారముగా నీత్యము వృద్ధులకు అభివాదము చేయవలయును. సోమరితనమును విడచి, “అసౌ అహంభో?” అనీ సొమోచ్చారణ పూర్వకముగా చక్కగా వంగి ఆయురారోగ్య సిద్ధి కొరకు నమస్కరించవలెను. ఆయుష్మాన్ భవ సౌమ్యై, అనీ అభివాదము చేసిన వానికి ద్విజుడు ప్రత్యభివాదము చేయవలెను. పేరు చివర లేదా వాక్యము చివర వ్యంజనమున్నచో, దాని కన్నొ మొదట ఉన్న అచ్చును పుతముగా పలుకవలెను.
న కుర్యాత్ యోఽభివాదస్య ద్విజః ప్రత్యభివాదసమ్।
నాభివాద్య స్స విదుషా యథా శూద్ర స్తథైవ సః ॥
వ్యత్యస్త పాణినా కార్యం ఉపసంగ్రహణం గురోః।
సవ్యేన సవ్యః స్ప్రష్టవ్యో దక్షిణేన తు దక్షిణః ॥
లౌకికం వైదికం చాపీ తథాధ్యాత్మిక మేవ వా।
ఆదదీత యతో జ్ఞానం తం పూర్వ మభివాదయేత్॥
నోదకం ధారయేత్ భైక్షం పుష్పాణి సమిథ స్తథా ।
ఏవంవిధానీ చాన్యాని న దైవాద్యేషు కర్మసు॥
బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ క్షత్రబంధు మనామయమ్।
వైశ్యం క్షేమం సమాగమ్య శూద్ర మారోగ్య మేవ తు ॥
అభిపోదము చేసిన తరువాత ప్రత్యభివాదము చేయనివానికి మరల విద్వాంసుడు అభివాదము చేయరాదు. ప్రత్యభివాదము చేయనివాడు శూద్రస ముడగును. గురువుకు అభివాదము చేయునపుడు వ్యత్యస్తపాణియై చేయవలెను. అనగా ఎడమచేతితో ఎడమపాదమును, కుడిచేతితో. కుడి పాదమును స్పృశించవలెను. ఈ ప్రక్రియ లౌకిక వైదిక, ఆధ్యాత్మికములలో సమానము. ఎవని నుండి జ్ఞానము పొందుతామో అతనికి మొదట నమస్కరించవలెను. దేవ పూజనము మొదలగు కర్మల యందు భీక్షలో లభించిన జల పుష్ప సమిధలను, ఇతర పదార్థములను గ్రహించరాదు. బ్రాహ్మణుడు కలిసినపుడు కుశలమును, క్షత్రియుడు కలిసినప్పుడు అనామయము (రోగరాహిత్యము) వైశ్యుడు కలిసినపుడు క్షేమమును, శూద్రుని ఆరోగ్యమును అడుగవలెను.
ఉపాధ్యాయః - పీతా జ్యేష్ఠో భ్రాతా చైవ మహీపతిః।
మాతుల శ్వశుర స్త్రీతా మాతామహ పితామహో॥
వర్ణజ్యేష్ఠః పితృవ్యశ్చ పుంసోత్ర గురవః స్మృతాః।
మాతా మాతామహీ గుర్వీ పితు ర్మాతుశ్చ సోదరాః।
శ్వశ్రూః పితామహీ జ్యేష్ఠా ధాత్రీ చ గురవః స్త్రియః ॥
ఇత్యుక్తో గురువర్గోఽ యం మాతృతః పితృతో ద్వజాః।
అనువర్తన మేతేషాం మనోవాక్కాయకర్మభిః ॥
ఉపాధ్యాయుడు, తండ్రి, జ్యేష్టభాత, రాజు, మేనమామ, కన్యనిచ్చిన మామ రక్షకుడు, తల్లితండ్రి, తండ్రితండ్రీ, జ్యేష్ఠ వర్ణుడు, పెదతండ్రి పినతండ్రి వీరిని గురువులందురు. తల్లి, తల్లితల్లి, గురుపత్ని పినతల్లి, మేనత్త, అత్త, తండ్రితల్లి, పెద్దక్క పోషించినది ఈ స్త్రీలు గురువులుగా చెప్పబడిరి. ఇట్లు తల్లి నుండి తండ్రి నుండి గురువులు చెప్పబడిరి. మనోవాక్కాయ కర్మలతో వీరిని అనుసరించవలయును.
గురుం దృష్ట్వా సముత్తిష్ఠే దభివాద్య కృతాంజలి :।
నై తై రుపవిత్ సార్ధం వివదే న్మాత్మకారణాత్ ॥
జీవితార్థ మపి ద్వేషాత్ గురుభీ ర్నేవ భాషణమ్।
ఉదితోఽపి గుణై రన్యై ర్గురుద్వేషీ పతత్యథః ॥
గురువును చూచిన వెంటనే ఆసనము నుండి లేచి, చేతులు జోడించుకొని, అభివాదన వీధితో నమస్కరీంచవలెను. వీరితో కలిసి ఒకే ఆసనముపై కూర్చుండరాదు. తన కొరకుగాని, బ్రతుకు తెరువునకు గాని, గురువుతో వాదించరాదు. గురువుతో ద్వేషముతో సంభాషింపరాదు. ఇతర గుణములున్నను గురువును ద్వేషించినవాడు అథఃపతీతుడగును.
గురూణా మపి సర్వేషాం పూజ్యాః పంచ విశేషతః।
తేషా మాద్యా స్త్రయ శ్ర్మేష్ఠా స్తేషాం మాతా సుపూజితా॥
యో భావయ తియా సూతే యేన విద్యోపదిశ్యతే ।
జ్యేష్ఠో భాతా చ భర్తా చ పంచైతే గురువస్మృతాః॥
ఆత్మన స్సర్వయత్నేన ప్రొణత్యాగేన వా పునః ।
పూజనీయా వీశేషేణ పంచైతే భూతిమిచ్ఛతా ॥
గురువులందరీలో, విశేషించి అయిదుగురు పూజ్యులు. వారిలోను మొదటి ముగ్గురు శ్రేష్టులు, వారిలోను మాత ఉత్తమ గురువు. కన్నతండ్రి, కన్న తల్లి విద్యనుపదేశించినవారు, జ్యేష్ఠభాత, భర్త - యీ అయిదుగురు గురువులుగా చెప్పబడిరి. వీరిని సర్వప్రయత్నముతో చివరికి ప్రాణముల నర్పించియైనను అభివృద్ధి కోరువాడు, విశేషించి పూజించవలెను.
యావత్పితా చ మాతా చ ద్వావేతా నిర్వికారీణౌ।
లౌవత్సర్వం పరిత్యజ్య పుత్ర స్స్యాత్తత్పరాయణః ॥
పితా మాతా చ సుప్రీతా స్యాతాం పుత్రగుణే ధ్యది।
స పుత్ర స్సకలం ధర్మ మాప్నుయాత్ తేన కర్మణా ॥
నాస్తి నశృసనుం దైవం నాస్తి పిత్రా సమో గురుః ॥
తయోః ప్రత్యుపకారోపి న కథంచన విద్యతే ।
యోభ్రాతరం పితృసమం జ్యేష్ఠం మూర్ఖోఽవమచ్యతే॥
తల్లిదండ్రులు ఎంతవరకు, గోహత్య, గురుహత్య, బ్రహ్మహత్యాది మహాపాతకములు చేయనివారుగా ఉందురో అంతవరకు పుత్రులు అన్నిటిని విడిచి వారిని సేవించవలెను. పుత్ర గుణములతో తల్లిదండ్రులు సంప్రీతులైనచో, ఆపుత్రుడు సకల ధర్మములను పొందును. మాతృ సమమైన దైవము, పితృసముడైన గురువు లేడు. ఎంత కష్టపడినను వారికీ ప్రత్యుపకారము చేయలేడు, పితృసముడైన జ్యేష్ఠ భాతను అవమానించిన మూర్ఖుడు దానితో ఘోరమైన నరకమును పొందును.
తయో ర్నిత్యం ప్రియం కుర్యాత్ కర్మణా మనసా గిరా ।
న తాభ్యా మననుజ్ఞాతో ధర్మ మన్యం సమాచరేత్॥
వర్జయిత్వా ముక్తిఫలం నిత్యం నైమిత్తికం తధా।
ధర్మసార స్సముద్దిష్టః ప్రేత్యానన్త ఫలప్రదః ॥
సమ్యు గారాధ్య వక్తారం విసృష్టి స్త దనుజ్ఞయా।
శిష్యోవిద్యాఫలం భుంక్తే ప్రేత్య చాపద్యతేదివి ॥
యోభ్రాతధం పితృసమం జ్యేష్టం మూర్ఖోఽవ ముచ్యతే।
తేన దోషేణ స ప్రేత్య నిరయం ఘోర మృచ్ఛతి॥
మనోవాక్కాయములతో ఎప్పుడు తల్లిదండ్రులకు ప్రియమునే చేయవలెను.
వారీ అనుమతి లేనిదే ఇతర ధర్మములు ఆచరించరాదు. మోక్ష సంబంధము, నీత్య నైమిత్తిక ధర్మముల విషయమున ఈ నియమము వర్తించదు. తల్లిదండ్రుల సేవ ఇహమున ధర్మసారము, పరమున మోక్ష ప్రదముగా చెప్పబడినది. గురువును చక్కగా ఆరాధించి, వారి ఆజ్ఞతో వెడలిన శిష్యుడు, ఇహమున విద్యాఫలము, పరమున ధర్మ ఫలమును అనుభవించును.
పుంసా వర్మనివిష్టేన పూజ్యో భర్తా తు సర్వదా।
యాతి దాతరి లోకేఽ స్మిన్ ఉపకారా ద్ధి గౌరవమ్॥
యే నరా భర్తృపిండార్థం స్వాన్ ప్రాణాన్ సంత్యజంతి హి।
తేషా మధాక్షయాం ల్లోకాన్ ప్రోవాచ భగవాన్ మనుః॥
సన్మోర్గమును అనుసరించు పురుషుడు తనను భరించి పోషించిన వానిని సర్వదా పూజించవలయును. ఉపకారము చేసినదాత అత్యధిక గౌరవమునకు యోగ్యుడు. తాను పొందిన బ్రతుకు తెరువునకు ప్రత్యుపకారముగా తన ప్రాణములను అర్పించినవారు అక్షయలోకములను పొందుదురనీ మనువు చెప్పెను.
మాతులోం శ్చ పితృవ్యాం శ్చ శ్వశురా నృత్విజో గురూన్।
అసా వహ మితి బ్రూయుః ప్రత్యుత్థాయ యవీయసః ॥
అవాచ్యో దీక్షితో నామ్నా యవీయా నదీ యో।
భవేత్ భో భవత్పూర్వకం త్వేన మభిభాషేత ధర్మవిత్।
అభివాద్య శ్చ పూజ్య శ్చ శిరసా వంద్య ఏవ చ ॥
బ్రాహ్మణః క్షత్రియాద్యైశ్చ శ్రీకామై స్సాదరం సదా॥
మేనమామలను, పినతండ్రులను, మామలను, ఋత్విజులను, లేచి ఎదురేగి అసౌ అహం అభివాదయే” అని చిన్నవారు పలుకవలేను. తన కన్నా వయసులో చిన్నవారైనను యజ్ఞాదులలో దీక్షితుడైన పేరుతో పిలువరాదు. ధర్మము తెలిసిన వాడు “అయ్యా 'తమరు' అని భాషించ వలెను. సంపదలను కోరు క్షత్రియులు నిత్యము ఆదరముతో బ్రాహ్మణులకు అభిపోదము, పూజ, నమస్కారములు గావించవలయును.
నాభివాద్యా స్తు విప్రేణ క్షత్రియాద్యాః కథంచన।
జ్ఞానకర్మగుణోపేతా యద్యస్యేతే బహుశ్రుతాః॥
బ్రాహ్మణ స్సర్వవర్ణానాం స్వస్తి కుర్యా దితి స్థితి: ।
సవర్ణేషు సవర్ణానాం కార్య మేవా భివాదనమ్॥
గురు రగ్ని ర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురుః।
పతిరేకో గురు:స్త్రీణాం సర్వత్రా భ్యాగతో గురుః ॥
బ్రాహ్మణుడు, క్షత్రియాదులకు ఏ స్థితిలోను అభివాదము చేయరాదు. క్షత్రియాదులు జ్ఞాన గుణ కర్మలు కలిగియున్నను, బహుశాస్త్ర అధ్యయనము గావించినను అభివాదము చేయరాదు. బ్రాహ్మణుడు అన్ని వర్ణముల వారికి శుభము కలిగించునన్నది వస్తు స్థితి. సవర్ణులు సవర్ణులకు అభివాదము చేయవచ్చును. ద్విజులకు అగ్ని గురువు. వర్ణములలో బ్రాహ్మణుడు గురువు. స్త్రీలకు పతి గురువు. అభ్యాగతుడు అందరికీ గురువు.
విద్యా కర్మ వయో బంధు ర్వత్తం భవతి పంచమమ్।
మాన్యస్థానాని పంచాహుః పూర్వం పూర్వం గురూత్తరాత్॥
పంచానాం త్రిషు వర్ణేషు భూయాంసి బలవంతి చ।
యత్ర స్యుః సోఽత్ర మాసార్హః శూద్రోఽపి దశమిం గతః॥
విద్య, కర్మ, వయసు, బంధుత్వము, ధనము యీ ఐదు పూజ్య స్థానములు. వీనిలో తరువాతి దానికంటే మొదటిది శ్రేష్ఠము. త్రివర్ణికులలో యీ అయిదు మిక్కిలీ బలీయములు. ఇవి ఉన్నవాడు పూజ్యుడగును. ఈ అయిదు గుణములను పొందిన శూద్రుడు దశవర్ష వయస్కుడైనచు పూజారుడైయగును.
పంథా దేయో బ్రాహ్మణాయ స్త్రీయై రాజ్ఞే హ్యచక్షుషే।
వృద్ధాయ భారభుగ్నాయ రోగిణే దుర్బలాయ చ ॥
భీక్షా మాహృత్య శిష్టానాం గృహేభ్యః ప్రయతోఽ న్వహమ్।
నివేద్య గురవేఽ శ్నీయాత్ వాగ్యతస్త దనుజ్ఞయా ॥
బ్రాహ్మణునికి, స్త్రీకి, రాజునకు, నేత్రహీనునకు, వృద్ధునకు, బరువు మోయుచున్న వానికీ, రోగికి, బలహీనునకు తాను తొలగి దారి విడువ వలెను. బ్రహ్మచారి శిష్టుల గృహము నుండి ప్రతి దినము శ్రద్ధాళువై భిక్షను తెచ్చి గురువునకు నివేదించి, అతని ఆజ్ఞతో మౌనముగా భుజించవలయును.
భవత్పూర్వం చరే ద్భైక్ష్యం ఉషనీతో ద్విజోత్తమః ।
భవన్మధ్యంతు రాజన్యో వైశ్యస్తు భవదుత్తరమ్॥
మాతరం వా స్వసారం వా మాతుర్వ భగినీం నిజామ్।
భిక్షేత భిక్షాం ప్రథమం యా చైవం న విమానయేత్॥
సజాతీయగృహే ష్వేవ సార్వవర్ణిక మేవ వా ।
భైక్ష్యస్య చరణం ప్రోక్తం పతితాదిషు వర్జితమ్॥
ఉపనీతుడగు ద్వీజుడు భిక్షా చరణమును 'భవత్' శబ్దము మొదట ఉపయోగించి చేయవలెను. రాజులు ‘భవత్' శబ్దమును మధ్యను, వైశ్యులు చివరను వాడవలెను. తల్లిని, పినతల్లిని, తన సోదరిని, తనను అవమానించని స్త్రీని ఉపనయన కాలమున మొదట భిక్ష చరించవలయును. సజాతీయుల గృహములలో తమకంటే ఉచ్చవర్గముల యిండ్లలో అందరి నుండి భిక్షాటన చేయవచ్చును. పతితులను మాత్రము విడువవలెను.
వేదయజ్ఞే రహీనానాం ప్రశస్తానాం స్వకర్మసు।
బ్రహ్మచార్యాహరే ద్భైక్షం గృహేభ్యః ప్రయతోఽన్వహమ్॥
గురోః కులే న భిక్షేతన జ్ఞాతికులబంధుషు।
అలాభే త్వస్య గేహానాం పూర్వం పూర్వం వివర్జయేత్॥
సర్వం వా విచరే ద్గ్రామం పూర్వోక్తానా మసంభవే।
నియమ్య ప్రయతో వాచం దిశ స్త్వనవలోకయన్॥
వేదములు యజ్ఞములు లోపించనిచోట, స్వకర్మాచరణములో శ్రేష్ఠులైన వారి యిండ్లలో ప్రతిదినము ప్రయత్న పూర్వకముగా భిక్షాటన గావించ వలయును. గురువుల యిండ్లలో, జ్ఞాతుల యిండ్లలో, బంధువుల యిండ్లలో భిక్షాటన చేయరాదు. ఇతరుల యిండ్లలో లభించనపుడు మొదటివానిని విడువవలేను: అనగా గురు జ్ఞాతి కులములను విడచీ, బంధుకులములలో ఆచరించవచ్చును. పైన చెప్పినవి చెప్పిన చోట లభించనపుడు ప్రయత్నపూర్వకముగా వాక్కును నియంత్రించుకొని, చీక్కులను చూడకుండ గ్రామమంతయు సంచరించవలయును.
సమాహృత్య తు తద్భైక్షం యావ దర్ధ మమాయయా।
భుంజీత ప్రయతో నిత్యం వాగ్యతో నన్యమానసః॥
భైక్ష్యేణ వర్తయే న్నిత్యం నైకోన్నాదీ భవేత్ ప్రతీ।
భైక్ష్యేణ ప్రతినో వృత్తిః ఉపవాససమా స్మృతా ॥
తనకు అవసరమున్నంత, నిష్కపటముగా, భిక్షమును సంపాదించుకొని మౌనముతో సావధాన మనస్కుడై వినయాన్వితుడై భుజించవలయును. ప్రతి దీనము భిక్షాన్నముతో జీవించవలయును. కాని ప్రతినిత్యము ఒకే అన్నమును, ఒకేచోట ఒకరిదీ భుజించరాదు. భిక్షాన్నము భుజించుపోని వృత్తి ఉపవాస సమమని చెప్పబడినది.
పూజయే దశనం నిత్యం అద్యాచ్చైత దకుత్సయస్।
దృష్టా హృష్యేత్ ప్రసీదేచ్చ ప్రతినందేచ్చ సర్వశః॥
అనారోగ్య మనాయుష్య మస్వర్గ్యం చాతి భోజనమ్।
అపుణ్యం లోకవీద్వీష్టం తస్మాత్త త్పరివర్జయేత్॥
అన్నమును ఎపుడు పూజించవలయును. అన్నమును నిందించరాదు. అన్నమును చూసి సంతోషించవలెను. ప్రసన్నుడు కావలయును. మనోవాక్కాయములతో అభినందించవలయును. అతిభోజనము, అనారోగ్యమును, అనాయుష్య మును, అస్వర్గము (నరకము)ను కలిగించును. అతిభోజనము పుణ్యదూరము, లోకుల చేత ద్వేషింపతగినది కావున అతిభోజనము విడువవలెను.
ప్రొజ్ముఖోఽ న్నాని భుంజీత సూర్యాభిముఖ ఏవ వా।
నాద్యా దుదజ్ముఖో నిత్యం విధి రేష సనాతనః॥
ప్రక్షాల్య పాణిపాదౌ చ భుంజానో ద్విరుషస్పృశేత్।
శుచౌ దేశే సమాసీనో భుక్త్వా చ ద్విరుపస్పృశేత్॥
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధే ద్వాదశోధ్యాయః
తూర్పుముఖముగా గాని, సూర్యాభీముఖముగా గాని, కూర్చుని భుజించ వలయును. ఉత్తరాభిముఖముగా భుజించరాదు. ఇది సనాతన విధి. భుజించు ముందు పాదములను హస్తములను కడిగికొని, రెండుసార్లు ఆచమనము చేసి పరిశుద్ధమైన ప్రదేశమున కూర్చుని భుజించవలయును. భోజనము తరువాత మరల రెండు మూగులు ఆచమనము చేయవలయును.
ఇది శ్రీ కూర్మపురాణము షట్ సాహస్ర సంహితలో ఉపరివిభాగమున పండ్రెండవ అధ్యాయము.
Summary of chapter 65 of the Kūrma Mahā Purana is as follows:
Following the conclusion of Ishvaragītā, Maharshi Vedavyāsa initiates the Vyāsagītā at the request of the Mahārshis, expounding Sanātana Varṇāshrama Dharma as originally revealed by Svāyambhuva Manu. Vyāsa details the sacred Upanayana ceremony for Brāhmaṇas, Kshatriyas, and Vaishyas, specifying the appropriate age, girdles, staff, and sacred thread. He outlines the strict vows of a Brahmachārin, emphasizing daily Sandhyāvandana, Agnihotra, reverence towards Gurus and parents, and the cultivation of mental purity through righteous living.