13వ అధ్యాయము

వ్యాస ఉవాచః-

భుక్త్వా పీత్వా చ సుప్త్వాచ స్నాత్వా రధ్యోపసర్పణే

ఓష్ఠావలోమకౌ స్పృష్ట్వా వాసో విపరిధాయ చ

రేతోమూత్రపురీషాణా ముత్సర్గె యుక్త భాషణే

  ష్ఠీవిత్వా ధ్యయనారంభే నాసశ్వాసాగమే తథా

చత్వరం వా స్మశానం వా సమాక్రమ్య ద్విజోత్తమః

సంధ్యయో రుభయో స్తధ్వ దాచాన్తో ప్యా చమేత్ పునః

చండాలమేచ్ఛసంభాషే స్త్రీశూద్రోచ్ఛిష్టభాషణే 

ఉచ్ఛిష్టం పురుషం స్పృష్ట్వా భోజ్యం చాపి తథావిధమ్

భోజనే సంధ్యయోః స్నాత్వా పీత్వా మూత్రపురీషయోః 

ఆ ఛాంతో ప్యాచ మేత్ సుప్వా సకృత్స కృదధాన్యతః

వ్యాసుడు చెప్పెను.

భోజనముచేసి, నీరుత్రాగి, పడుకొనీ లేచి, స్నానముచేసి, దారిలోనడచి, రోమములు లేని పేదవిని తాకి, వస్త్రమును ధరించినపుడు రేతస్సు, మూత్రము, పురీషము విడచినపుడు, అయుక్తముగా మాట్లాడినపుడు, నిఫ్టీవనము చేసినపుడు, అధ్యయనారంభమున, దగ్గువచ్చినపుడు, ఆయాసము వచ్చినపుడు, సొల్లుదారుల కూడలినిగాని, స్మశానమునుగాని చేరినపుడు, ఉభయ సంధ్యలలోను మొదట ఆచమనము చేసియున్నను మరల ఆచమించవలయును. చండాలురతో, మ్లేచ్చులతో మాట్లాడినపుడు, స్త్రీలతో, శూద్రులతో, ఉచ్చిష్ట ముఖము గలవారితో మాట్లాడినప్పుడు, ఉచ్చిష్టుడైన పురుషునీ, ఉచ్చిష్టమైన భోజనము స్పృశించినపుడు, కన్నీరుగానీ, రక్తము గాని స్రవించినపుడు ఆచమించవలెను. భోజన సమయమున, రెండు సంధ్యలలో స్నానము చేసిన పిదప, మూత్ర పురీష ఉత్సర్గము తరువాత, నిదురించి లేచిన తరువాత, ఆచమనము చేసియున్నను మరల ఆచమించవలయును. ఇట్లే ఇతర సమయములలో కూడా ఆచమించవలయును.  

అగ్నే ర్గవా ముధాలంభే స్పృష్ట్వా ప్రయుతమేవ వా

  స్త్రీణా మధ్యాత్మ న స్సర్ళే నీవీం వా పరిధాయ చ

ఉపస్పృశే జ్జలం వార్ధం తృణం పో భూమి మేవ వా

కేశనాం చాత్మన స్సర్ళే వాససోఽ క్షాలితస్య చ

అగ్నిని గోవును స్పృశించినపుడు, పరిశ్రమ చేయుచున్నవానిని, స్త్రీని స్పృశించినపుడు, తనను తాను అవసరము లేనిచోట స్పృశించినపుడు, కటివస్త్రము ధరించినపుడు తన కేశములను స్పృశించినపుడు, ఉదకని వస్త్రములు స్పృశించినపుడు, జలమునుగాని, తృణమునుగాని, భూమినిగాని స్పృశించ వలయును.  

అనుష్ణాభి రఫేనాభి రదుష్టా భి శ్చ ధర్మతః

శాచేప్పు స్సర్వదాచామేత్ ఆసీనః ప్రాగుదబ్ముఖః

శిరః ప్రావృత్య కంఠం వా ముక్తకచ్ఛశిఖోఽపివా 

అకృత్వా పాదయో చం ఆచాన్తో ష్య శుచి ర్భవేత్

సోపానత్కో జలస్థో వా నోష్ణిషి వాచమే ద్బుధః

న చైవ వర్షధారాభిః న తిష్ఠ న్నోద్ధృతోదకైః

నైకహస్తారితజలై ర్వినా సూత్రేణ వా పునః

న పాదుకాసనస్థో వా బహిర్జాను రథాపి వా

వేడిలేని, నురుగులేని, దోషములేని, జలముతో ధర్మానుసారి అయినవాడును. ప్రాజ్ముఖముగాగాని, ఉదఙ్ముఖముగా గానీ కూర్చుని ఆచమనము చేయవలయును. తలనుగానీ, కంఠమునుగాని, వంకరగా త్రిప్పినపుడు, శీఖోబంధము, కచ్ఛము వీడినపుడు పాద ప్రక్షాళనము చేయక ఆచమనము చేసినను అశుచియే యగును. పాదరక్షలు ధరించినవాడు, నీటిలో ఉన్నవాడు, తలపాగ ధరించి ఆచమనము చేయరాదు.న రధారలతోగానీ, నిలబడిగాని, తానుగా బయటికి తెచ్చిన జలముతో గాని, ఒక హస్తముతో అర్పీంచిన జలముతో గాని, యజ్ఞోపవీతము లేకుండగా గాని, పాదుకాసనమున కూర్చుండిగాని, మోకాళ్ల ముందరికి చేతులు వుంచిగానీ ఆచమనము చేయరాదు.

  న జల్ప న్న హసన్ ప్రేక్షన్ శయానః ప్రహ్వ ఏవ చ

నా వీక్షితాభిః ఫేనా ద్యైః ఉపేతాభి రధాపీ వా

శూద్రాశుచికరోన్ముక్తైః న క్షారాభి స్తథైవ చ

 న చైవాంగులిచి శ్శబ్దం న కుర్వన్నాన్య మానసః

న వర్ణరసదుష్టాభి ర్న చైవ ప్రదరోదకైః

న పొణిక్షుభితాభి ర్వా న బహిష్కక్ష ఏవ వా

మాటలాడుచు, నవ్వుచు, ఇతరుల వంక చూచుచు, పడుకోని, వంగి ఆచమనము చేయరాదు. నీటిని చక్కగా చూచి, నురుగు మొదలగు దోషములు లేని వాటితో, శూద్రులు అపవిత్రులు కాని వారితో తెచ్చినవి, ఉప్పునీరు కాని పోటీతో ఆచమనము చేయవలెను. ప్రేళ్లతో శబ్దము చేయుచు, అన్య మనస్కముగా నుండి, వర్ణరస దుష్టములగు జలముతో, చిన్న మడుగులోని జలముతో, చేతులుంచి కలచిన నీటితో కక్షభ్రంశముతో, ఆచమనము చేయరాదు.

 హృద్గాభిః పూయతే విప్రః కంఠ్యాభిః క్షత్రియ శ్శుచిః 

ప్రాశీతాభి స్తథా వైశ్య స్త్రీ శూద్రౌ స్పర్శతోంఽశతః

ఆచమన జలము హృదయము వరకు చేరినపుడు బ్రాహ్మణుడు, కంఠమున చేరినప్పుడు క్షత్రియుడు, నోటిలో పడగానే వైశ్యుడు, తాకినంత మాత్రమున స్త్రీలు శూద్రులు పవిత్రులగుదురు.  

అంగుష్ఠమూలాంతరతః రేఖాయాం బ్రాహ్మ ముచ్యతే

అంతరంగుష్ఠదేశిన్యో పితృణాం తీర్థ ముత్తమమ్

కనిష్ఠమూలతః పశ్చాత్ ప్రాజాపత్యం ప్రచక్షతే

అంగుల్యగ్రే స్మృతం దైవం తదేవర్షం ప్రకీర్తితమ్

మూలే పో దైవ మార్షం స్యాత్ ఆగ్నేయం మధ్యత స్సృతమ్

తదేవ సౌమీకం తీర్ధం ఏతజ్ జ్ఞాత్వా న ముహ్యతి

బ్రాహ్మేణైవతు తీర్ధేన ద్విజో నిత్య ముపస్పృశేత్

 కాయేన వాథ దైవేన నతు పిత్ర్యేణ వై ద్విజాః

త్రిః ప్రాశ్నీయా దపః పూర్వం బ్రాహ్మణః ప్రయత స్తతః

సమ్మృజ్యాంగుష్ఠమూలేన ముఖం వై సముపస్పృశేత్

అంగుష్ఠమూలమున రేఖలో ఉన్న జలమును బ్రహ్మ తీర్థమందురు. తర్జనీ అంగుష్ఠ మధ్య భాగమున ఉన్నదానిని పితృతీర్థమని, కనిష్ఠికా మూలమున ఉన్న తీర్థమును ప్రాజాపత్యమని యందురు. అంగుళి అగ్ర భాగమున ఉన్నదీ దైవ తీర్థము, ఋషి తీర్ధము అందురు. అంగుష్ఠ మూలమున ఉన్నను దైవము ఆర్షము అనవచ్చును. అంగుష్ఠ మధ్యమున ఉన్నచో అగ్ని తీర్థమందురు. దీనినే సౌమిక తీర్ఘమని కూడా అందురు. ఈ విధీ తెలిసినవాడు మోహమును చెందడు. ద్విజుడు బ్రహ్మ తీర్థముతోనే ఆచమనము చేయవలయును లేదా ప్రాజాపత్య తీర్థము, దైవ తీర్దముతోను చేయ వచ్చును. కాని పితృతీర్థముతో చేయరాదు. బ్రాహ్మణుడు సావధానుడై మొదట మూడుసార్లు ఆచమనము చేయవలయును. తరువాత అంగుష్ఠమూలముతో ముఖమును స్పృశించవలయును.

అంగుష్ఠానామికాభ్యాం తు స్పృశే నేత్రద్వయం తతః

తర్జన్యంగుష్ఠయోగేన స్పృశేన్నోసాపుటద్వయమ్

కనిషాంగుష్ఠయోగేన శ్రవణే సముప స్పృశేత్

సర్వాసా మధ యోగేన హృదయం తు తలేన వా

సంస్పృశే ద్వ శిరస్తద్వత్ అంగుష్ఠనా ధవా ద్వయమ్

త్రిః ప్రాశ్నీయా ద్యదంభస్తు సుప్రీతాస్తేన దేవతాః

బ్రహ్మా విష్ణు ర్మహేశశ్చ భవంతీత్యను శుశ్రుమ

గంగా చ యమునా చైవ ప్రీయతే పదిమార్జనాత్

సంస్పృష్ట యోర్లో చనయోః ప్రీయేతే శశీ భాస్కరౌ

అంగుష్ఠ అనామికలతో నేత్రద్వయమును స్పృశించవలయును. తర్జనీ అంగుష్ఠములతో నాసికాపుటములను స్పృశించవలయును. కనిష్ఠికా అంగుష్ఠములు చెవులను స్పృశించవలెను. అన్ని ప్రేళ్లతోగాని, అరచేతితోగానీ హృదయమును స్పృశించవలెను. అట్లే శిరమును కూడా స్పృశించవలేను లేదా అంగుష్ఠముతో, రెండు వ్రేళ్లతో గాని స్పృశించవచ్చును. మూడు మారులు జలప్రాశనము చేసిన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సంప్రీతులగుదురు. పరిసర్జనము వలన గంగా యమునలు ప్రీతి చెందుదురు, నేత్రములను స్పృశించుట వలన సూర్య చంద్రులు ప్రీతులగుదురు.

 నాసత్యదగ్రౌ ప్రీయేతే స్పృష్టే నాసాపుటద్వయే

 కర్ణ స్పృష్టయో సద్వత్ ప్రీయేతే చానిలానలౌ

సంస్కృష్టే హృదయే చాస్య ప్రీయంతే సర్వదేవతాః 

మూర్ద్ని సంస్పర్శనా దేకః ప్రీత స్స పురుషో భవేత్

నాసా పుటములు స్పృశించిన అశ్వినీ దేవతలు ప్రీతి చేందుదురు. కర్ణములు స్పృశించుటతో అగ్ని వాయువులు ప్రీతి చెందుదురు. హృదయమును స్పృశించుట వలన సర్వదేవతలు సంప్రీతులగుదురు. శిరస్సును స్పృశించుట వలన పురుషోత్తముడగు విష్ణువు ప్రసన్నుడగును.

నోచ్ఛిష్టం కుర్వతే ముఖ్యా విప్రుషోo గం నయంతి యాః

 శంతన ద్దంత లగ్నేషు జిహ్వాస్పర్శే శుచి ర్భవేత్ 

   స్పృశస్తి బిందవః పాదౌ య ఆచామయతః పరాన్

భూమిగై స్తే సమా జ్ఞేయా న తై రప్రయతో భవేత్

మధుపర్కే చ సోమే చ తాంబూలస్య చ భక్షణే 

ఫలమూలే చేక్షుడుండే న దోషం ప్రాహ వై మనుః

ప్రచరం శ్చాన్నపానేషు ద్రవ్యహస్తో భవే న్నరః

  భూమౌ నిక్షిప్య తద్ద్రవ్యం ఆచమ్య భ్యుక్షయేత్తు తత్

 ఆచమన సమయమున శరీరమున పడు జలకణములతో శరీరము ఉచ్ఛిష్టము కాజాలదు. దంతముల మధ్యనున్న పదార్థములు దంతములకు సమానమగును. కానీ జిహ్వతో స్పృశించినపుడు మాత్రము అశుచియగును. ఆచమనము చేయించునపుడు పాదములపై పడిన జలబిందువులు భూమిమీద పడినట్లు భావించవలెను. వానితో అశుచికాజోలదు. మధుపర్కము గ్రహించినపుడు, సోమపానమున, తాంబూల భక్షణమున, ఫలమూల ఇక్షుదండ భక్షణమున (ఎవరి నుండి గ్రహించినా) దోషము లేదని మనువు చెప్పెను. మార్గమున నడుచుచున్నపుడు, ఉచ్చిష్ట స్పర్శచే దూషితమగు వస్తువు మనచేతిలో ఉన్నను, అట్లే అన్న భక్షణమున, పానీయ సమయమున ఆ వస్తువుతో జలమును స్వీకరించిన (ఆచమనము చేసిన) తరువాత భూమిపై ఉంచి, ఆ వస్తువులను ప్రోక్షించి తీసుకొని వెళ్ళవలయును.  

తైజసం వై సమాదాయ యద్యుచ్ఛిష్టో భవే ద్ద్విజః 

భూమౌ నిక్షిప్య తద్ద్రవ్య మాచమ్యా భ్యుక్షయేత్తు తత్

యద్యమత్రం సమాదాయ భవే దుచ్ఛోషణాన్వితః

అనిధాయైవ తద్ద్రవ్య మాచాదతః శుచితా మియాత్

  వస్త్రాదిషు వికల్పస్స్యాత్ తత్సంస్పృష్ట్వా చమే దీహా

అరణ్యే నుదకే రాత్రా చౌరహ్యాఘ్రకులే పథి

కృత్వా మూత్రం పురీషం వా ద్రవ్య హస్తో న దుష్యతి

తైజసమును (ఘృతమును) తీసికొని బ్రాహ్మణుడు అన్నపానాదుల వలన ఉచ్చిష్టుడగుచు, ఆ ఘృతమును భూమిపై ఉంచి, ఆచమనము చేసి ప్రోక్షించవలెను. ఏదేని ఒక పాత్రను తీసికొనిన వ్యక్తి ఉచ్చిష్టుడగుచు, ఆ పాత్రను క్రింద పెట్టకనే ఆచమన మాత్రముననే శుద్దుడగును. వస్తాడుల విషయమున, స్పర్శ అయినపుడు (ఉచ్చిష్ట స్థితిలో) ఆచమనము చేయవలయును, అరణ్యమున, జలములేని ప్రాంతమున, రాత్రియందు, చోరవ్యాఘ్ర సంకుల మార్గమున ద్రవ్యహస్తుడై మూత్ర పురీష ఉత్సర్గము చేసినను అశుచి కాజాలడు. ద్రవ్యము కూడా, అపవిత్రము కాదు.

 నిధాయ దక్షిణే కర్ణే బ్రహ్మసూత్ర ముదబ్ముఖః 

అహ్ని కుర్యా చ్ఛకృన్మూత్రం రాత్రౌ చే దక్షిణా ముఖః

అంతర్ధాయ మహీం కాష్ఠైః పత్రై ర్లోష్ట తృణేన వా

ప్రావృత్య చ శిరః కుర్యాత్ విణ్మూత్రస్య విసర్జనమ్

దక్షిణ కర్ణమున యజ్ఞసూత్రము ఉంచుకొని, పగలు ఉత్తరాభి ముఖముగా మూత్ర పురీష ఉత్సర్గము చేయవలయును. రాత్రీ దక్షిణాముఖముగా చేయవలయును. భూమిని కట్టెలతో, ఆకులతో, తృణములతో, మట్టిబెడ్డలతో కప్పి, శిరమునకు వస్త్రము చుట్టుకొని మలమూత్రములను విడువవలయును.  

ఛాయాకూసనదీగోష్ఠ చైత్యాంభఃపఠిభస్మసు

అగ్నౌ చైవ స్మశానే చ విణ్మూత్రే న సమాచరేత్

  న గోమయే న కృష్టే వా మహావృక్షో న శాద్వలే

న తిష్ఠన్ సచ నిర్వాసో న చ పర్వతమస్తకే

న జీర్ణదేవాయతనే న వల్మీకే కదాచ న

న ససత్త్వేషు గర్తేషు న గచ్ఛన్వా సమాచరేత్

తుషాంగారకపాలేషు రాజమార్గే తథైవ చ

  న క్షేత్రే న బీలే చాపి న తీర్దే న చతుష్పథే

నోద్యానోదసమిపేవా నోషరే న పరాశుచౌ

 న సోపానత్పాదుకో వా ఛత్రీవా నాంతరిక్షకే

న చైవాభిముఖే స్త్రీణాం గురుబ్రాహ్మణయో ర్గవాయ్ 

న దేవదేవాలయయో రపా మపి కదాచన

తన నీడ పై, బావిలో, నదీలో, వాని సమీపమున, గోశాలలో, గ్రామదేవతా స్థానములలో, భస్మము పై, అగ్నిలో, స్మశానములో, మలమూత్రములు విడువరాదు. గోమయమున, దున్నిన భూమిలో, మహా వృక్ష సమీపమున, పచ్చిక పెరిగిన భూమిపై, పర్వతశిఖరముపై నిలబడిగాని, వస్త్ర రహితుడైగానీ మలమూత్ర విసర్జన చేయరాదు. జీర్ణదేవాలయమున. పుట్టపైన, ప్రాణులు చరించు బిలములలో, నడచుచు, మల మూత్ర విసర్జనము చేయరాదు. ధాన్యపు పొట్టుపై, మండుచున్న అగ్నిలో, మట్టి మూకుళ్లలో (యజ్ఞపురోడాశములు ఏర్పరచు కపాలములలో), రాజ మార్గమున, క్షేత్రమున, బిలమున, తీర్థమున, నాలుగు దారుల కూడలిలో, ఉద్యానాది సమీపము, చవుటీనేలలో, అతి అపవిత్రమగు ప్రదేశమున, మలమూత్రములను విడువరాదు. పొదరక్షలతో, ఛత్రములతో, అంతరిక్షమున, స్త్రీలకు అభిముఖముగా, గురు బ్రాహ్మణ గోవులకు అభిముఖముగా, దేవ దేవాలయ జలములకు అభిముఖముగా మల మూత్రములు వీడువరాదు.

 న జ్యోతీంషి నిరీక్ష న్వా న సంధ్యాభిముఖోఽపి వా

ప్రత్యాదిత్యం ప్రత్యనలం ప్రతిసోమం తథైవ చ

ఆహృత్య మృత్తికాం కూలాత్ లేపగంధాపకర్షణమ్ 

కుర్యాదతంద్రిత శ్శౌచం విశుద్దై రుద్ధృతోదకైః

నక్షత్రములను చూచుచు, సంధ్యాకాల సమయమున, సూర్యచంద్రాగ్నులకు అభిముఖముగా మలమూత్రములను విడువరాదు. సోమరితనము విడచి, నది నుండి గాని, చెరువు నుండిగాని మట్టిని తీసుకొని పరిశుద్ధమైన కూపాదుల నుండి తీసికొనిన జలముతో శౌచము సాచరించవలయును.

 నా హరే స్మృత్తికాం విప్రః పాంశులా న్న చ కర్దమత్

న మార్గా న్నో షరా ద్దేశా చ్ఛౌచశిష్టా పరస్య చ

న దేవాయతనా త్కూపాత్ గ్రామా న్న చ జలా త్తధా

ఉపస్పృశే త్తతో నిత్యం పూర్వోక్తేన విధానతః

ఇతి శ్రీ కూర్మపురాణే షట్సాహస్రంసహితాయా ఉత్తరార్ధే త్రయోదశోధ్యాయః    

బ్రాహ్మణుడు ధూళీ నుండి, బురదనుండి, మట్టిని తీసికొనరాదు. మార్గము నుండి, చౌడు భూమీ నుండి, ఇతరులు శౌచము చేయగా మిగిలిన దాని నుండి, దేహాలయము నుండి, బావినుండి, గ్రామము నుండి, జలము నుండి, మట్టిని తీసికొన రాదు. శౌచము తరువాత పూర్వోక్త విధానము ననుసరించి ఆచమనము చేయవలయును.

ఇది కూర్మపురాణమున షట్ సాహస్ర సంహితలో ఉపరివిభాగమున పదమూడవ అధ్యాయము.