25వ అధ్యాయము

వ్యాస ఉవాచ:-

ఏష వోఽభిహితః కృత్స్నో గృహస్థాశ్రమవాసినః

ద్విజాతేః పరమో ధర్మో వర్తనాని నిబోధత

ద్వివిధస్తు గృహీ జ్ఞేయః సాధక శ్చాష్యసాధకః

అధ్యాపనం యాజనం చ పూర్వస్యాహుః ప్రతిగ్రహమ్

కుసీదకృషివాణిజ్యం ప్రకుర్వన్తః స్వయం కృతమ్

కృషే రభావే వాణిజ్యం తదభావే కుసీదకమ్

అపత్కల్ప స్త్వయం జ్ఞేయః పూర్వోక్తో ముఖ్య ఇష్యతే

స్వయం వా కర్షణం కుర్యా ద్వాణిజ్యం వా కుసీదకమ్

కష్టా పాపీయసీ వృత్తిః కుసీదం తద్వివర్జయేత్

క్షాత్రవృత్తిం పరాం ప్రాహు ర్న స్వయం కృషణం ద్విజైః

తస్మాత్ క్షాత్రేణ వర్తత వర్తతే ఽ వాపది ద్వీజః

తేన చా వాప్య జీవంస్తు వైశ్యవృత్తిం కృషిం ప్రజేత్

న కథంచన కుర్వీత బ్రాహ్మణః కర్మ కర్షణమ్

లబ్ధలాభః పితృ న్దేవాన్ బ్రాహ్మణాంశ్చాపి పూజయేత్

తే తృప్తా స్తస్య తం దోషం శమయన్తి న సంశయః

దేవేభ్యశ్చ పితృభ్యశ్చ దద్యా ద్భగన్తు వింశకమ్

త్రింశద్భాగం బ్రాహ్మణానాం కృషిం కుర్వ న్న దుష్యతి

వాణిజ్యే ద్విగుణం దద్యాత్ కుసీదీ త్రిగుణం పునః

వ్యాస మహర్షి చెప్పెను.

గృహస్థాశ్రమ వాసి యగుద్విజుని పరమ ధర్మములను వివరించితిని. ఇపుడు పారి వృత్తులను తెలిపేదను వినుడు.

గృహస్థాశ్రమ వాసి సాధకుడని అసాధకుడని రెండు విధములు. అందులో సాధకునికి అధ్యాపనము యజ్ఞము చేయించుట దానము తీసుకొనుట ఇవి జీవితవృత్తులు. తాను చేయక ఇతరుల ద్వారా కృషి వాణిజ్యములను చేయించవచ్చును. కృషి లేనపుడు పొణిజ్యము పాణిజ్యము లేనపుడు కుసీదముతో (వడ్డీవ్యాపారము) జీవించ వచ్చును. ఇవి ఆపత్కాలమున చెప్పబడినవి మాత్రమే. ముఖ్యమైనవి అధ్యాపన యాజనాదులు మాత్రమే. ఆపత్కాలములో స్వయముగా కూడా కృషి వాణిజ్యము కుసీదము (వడ్డీ వ్యాపారము) చేయవచ్చును. కాని కుసీదవృత్తి అత్యంత కష్ట కరము. పాప వృత్తి కావున దానిని పరిత్యజించవలయును. బ్రాహ్మణునికి కృషి కంటే క్షత్రియవృత్తి ఉత్తమముగా చెప్పబడినది. బ్రాహ్మణులకు స్వయముగా వ్యవసాయము చేయరాదు. కావున బ్రాహ్మణులు ఆపదలో క్షాత్ర వృత్తిలో జీవించవలయుసు. కాని వ్యవసాయము చేయరాదు. శస్త్ర వృత్తిలో కూడా జీవించజాలనపుడు కృషీ రూపమగు వైశ్య వృత్తిని స్వీకరించవలయును. అయిననూ ఎట్టి పరిస్థితులలోను బ్రాహ్మణుడు భూమిని దున్నరాదు. ఇతర వృత్తిలో, లాభమును పొందినపుడు పితరులను దేవతలను బ్రాహ్మణులను పూజించవలయును. దానితో తృప్తి పొందినవారు. అతని దోషమును తొలగించగలరు. దేవతలకు పితరులకు 20వ భాగమును బ్రాహ్మణులకు రెండు రెట్ల భాగమును ఇచ్చినచో కృషి దోషము నశించును. వాణిజ్యము చేయువారు వ్యవసాయము శాతము కంటే రెండురెట్లు, వడ్డీ వ్యాపారము పోరు మూడు రెట్లు సమర్పించినచో ఆ దోషము లంటవు.

శిలోంచం వాప్యాదదీత గృహస్థః సాధకః పునః

విద్యాశిల్పాదయ స్త్వన్యే బహవో వృత్తిహేతవః

అసాధకస్తు యః ప్రోక్తో గృహస్థాశ్రమసంస్థితః

శిలోంచే తస్య కథితే ద్వే వృత్తీ పరమర్షిభిః

అమృతేనాథవా జీవే స్మృతే నాప్యథవా యది

అయాచితం స్యా దమృతం మృతం భైక్షన్తు యాచితమ్

కుశూలధాన్యకో వా స్యాత్కుంధీధాన్యక ఏవ చ

త్ర్యహ్నికో వాపి చ భవే దశ్వస్తనిక ఏవ చ

చతుర్ణామపి చై తేషాం ద్విజానాం గృహమేధినామ్

శ్రేయా స్పరః పరో జ్ఞేయో ధర్మతో లోక జిత్తమః

షట్కర్మకో భవే త్తేషాం త్రిభి దన్యః ప్రవర్తతే

ద్వాభ్యా మేక శ్చతుర్ధస్తు బ్రహ్మసత్రేణ జీవతీ

వర్తయంస్తు శిలోంఛాభ్యా మగ్నిహోత్రపరాయణః

ఇష్టీః పారాయణాన్తా యాః కేవలా నిర్వపేత్సదా

న లోకవృత్తం వర్తేత వార్తాన్తే వృత్తి హేతవే

అజిహ్మా మశఠాం శుద్ధాం జీవే ద్బ్రాహ్మణజీవికామ్

సాధకుడగు గృహస్థుడు శిలోంఛమును కాని ఇతరములగు విద్యాశిల్పములను కానీ వృత్తి కొరకు స్వీకరించవచ్చును. పశుపక్షులకు కూడా అధికారములేని ఒక్కొక్క ధాన్యకణమును ప్రతిదినము చేతివేళ్ళతో ఏరు కొని ఒక చోట చేర్చి వాటితో జీవించుట ఉంఛవృత్తి అందురు. ధాన్య సమూహము గుత్తులను కూడా ఒక చోట చేర్చి జీవించినచో శిల వృత్తి అందురు. వాటిలో మొదటిది ఉత్తమము.

గృహస్థాశ్రమములో నున్న అసాధకునికి వృత్తి కొరకు శిల ఉంఛ అను రెండు వృత్తులు చెప్పబడినవి. అమృతముతో కాని మృతముతో కాని జీవించవలయును. అయాచితమును అమృతమని యాచనమును మృతమని అందురు. బ్రాహ్మణుడు మూడు సంవత్సరముల వరకు సరిపడ సంపాదించి ఉంచుకోనీనపోడు లేదా ఒక సంవత్సరము వరకు కావలసిన దానిని సంపాదించినవాడుగా కాని, మూడు రోజులకు సరీ పడు దానిని దాచుకోనీన వాడుగా కానీ, రేపటికి కూడా లేనివానీలో కాని ఉండవచ్చును. ఈ నాలుగింటిలో మొదటి దానీకన్నా తరువాతది తరువాతది శ్రేష్టమని చెప్పబడినది. తనవద్ద ఎక్కువ భృత్య వర్గము కలవాడు షట్కర్మలతో, ఋత, అయాచిత, భైక్ష, కృషి, వాణిజ్య కుసీద అనువాటితో జీవించవచ్చును. తక్కువ భృత్యజనముకలవారు యాజన అధ్యాపన పరిగ్రహణములతో జీవించవచ్చును. ఇంకొందరు అనగా మరీ తక్కువ భృత్య జనము కలవారు యాజన అధ్యాపనములతో, ఇంకొందరు కేవలము అధ్యాపకముతో మాత్రమే జీవించవచ్చును.

శిలోంఛలతో జీవించుచు అగ్నిహోత్ర పరాయణుడై దర్శపూర్ణమాఫీయ ఇష్టులను జరుపుచుండవలయును. బ్రాహ్మణుడు జీవిక కొరకు లోక వృత్తిని (హాస పరిహాసాదులతో) ప్రవర్తించరాదు. కపటము దంభము లేని పరిశుద్ధ జీవనమును నడుపవలయును.

యాచిత్వా చార్థవద్భ్యోన్నం పితౄ న్దేవాంస్తు తోషయేత్

యాచయేద్వా శుచీ న్దాంతాన్ తేన తృప్యేత్ స్వయం తతః

యస్తు ద్రవ్యార్జనం కృత్వా గృహస్థ స్తోషయే న్న తు

దేవా న్నితృంస్తు విధినా శునాం యోనిం ప్రజత్యధః

ధర్మశ్చార్థశ్చ కామశ్చ శ్రేయో మోక్ష శ్చతుష్టయమ్

ధర్మావిరుద్ధః కామః స్యా ద్బ్రాహ్మణానాం తు నేతరః

యోఽర్థో ధర్మాయ నాత్మార్థం సోఽర్థో నార్థ స్తథేతరః

తస్మా దర్థం సమాసాద్య దద్యాద్వై జుహుయా ద్ద్విజః

ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే పంచవింశోఽధ్యాయః

సత్పురుషులను అన్నమును యాచించి ఐననూ దేవతలను పితృ దేవతలను సంతోషింప చేయవలయును. పవిత్రుని ఇంద్రియ నిగ్రహశీలుని యాచించవచ్చును కాని ధానిని తాను అనుభవించరాదు. ద్రవ్యార్జనము చేసిన గృహస్థుడు దేవతలను పితృదేవతలను యధావిధిగా సంతోషింప చేయనిచో కుక్కగా పుట్టును. ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్ధములు నాలుగు. బ్రాహ్మణులకు ధర్మమునకు విరుద్ధము కానీ కామమే యుండవలయును. ఇతర కామము ఉండరాదు. ధర్మము కొరకు ఉపయోగించబడే అర్థమే అర్థమగును. తన కొరకుపయోగించబడుచో అది అర్థము కాదు. అనర్థమగును. కావున అర్థమును సంపాదించి దానము చేయవలయును యజ్ఞము చేయవలయును. పూజించవలయును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 25వ అధ్యాయము.