కూర్మ మహా పురాణము
21వ అధ్యాయము
వ్యాస ఉవాచః:-
స్నాత్వా యథోక్తం సంతర్ప్య పితరాంశ్చంద్రక్షయే ద్విజః।
పిండాన్వాహార్యకం శ్రాద్ధం కుర్యాత్ సౌమ్యమనాః శుచిః ॥
పూర్వ మేవ సమీక్షేత బ్రాహ్మణం వేదపారగమ్।
తీర్థం తద్ధవ్యకవ్యానాం ప్రదానానాం చ స స్మృతః ॥
వ్యాస మహర్షి చెప్పెను.
ద్విజుడు, అమావాస్యనాడు స్నానము చేసి శాస్త్రోక్త వీధీతో పితృదేవతలకు సంతర్పణము గావించి శుచియై శాంత మనస్కుడై పిండాన్యాహార్యక శ్రాద్ధము నాచరించవలయును. మొదటనే వేద పారగుడగు బ్రాహ్మణునీ అన్వేషించి ఉంచుకొనవలయును. వేదపారగుడగు బ్రాహ్మణుడే హవ్యకవ్య ప్రదానమునకు తగిన అతిథి.
యే సోమషా విరజసో ధర్మజ్ఞాః శాన్తచేతసః ।
ప్రతినో నియమస్థాశ్చ ఋతుకాలాభిగామినః ॥
పంచాగ్ని రష్యధీయానో యజుర్వేదవి దేవ చ ।
బహ్యృచశ్చ త్రిసౌపర్ణ స్త్రిమధుర్వా చ యోఽభవేత్ ॥
త్రిణాచికేతచ్ఛందోగో జ్యేష్ఠసామగ ఏవ చ ।
అథర్వశిరసో ధ్యేతా రుద్రాధ్యాయీ విశేషతః ॥
సోమపాయి రజోగుణరహితుడు, ధర్మము తెలిసినవాడు, శాంత చిత్తుడు, వ్రతపరాయణుడు, నియమపాలకుడు ఋతుకాలమున మాత్రమే భార్యా సంగమును చేయువాడు, పంచాగ్నులను సేవించువాడు, వేదాధ్యయన శీలుడు, యజుర్వేదము తెలిసినవాడు, ఋగ్వేదము తెలిసినవాడు, ఋగ్వేద విశేష వేద భాగమును త్రిమధు భాగములు తెలిసినవాడు, యజుర్వేద విశేషాంశములు బాగా తెలిసినపొడు, సామవేదము తెలియువాడు, సామవేద విశేషము తెలిసినపొడు, అధర్వవేదము తెలిసినపోడు, రుద్రాధ్యాయి వీరందరూ పంక్తి పావనులుగా తెలియవలయును.
అగ్నిహోత్రపరో విద్వాన్ న్యాయవిచ్చ షడంగవిత్ ।
మంత్రబ్రాహ్మణవి చైవ యశ్చ స్యాద్ధర్మపాఠకః ॥
ఋషిప్రతీ ఋషీకశ్చ శాస్తచేతా జితేంద్రియః ।
బ్రహ్మదేయానుసంతానో గర్భశుద్ధః సహస్రదః ॥
చాంద్రాయణవ్రతచరః సత్యవాదీ పురాణవిత్ ।
గురుదేవాగ్నిపూజాసు ప్రసక్తో జ్ఞానతత్పరః ॥
విముక్తః సర్వతో ధీరో బ్రహ్మభూతో ద్విజోత్తమః ।
మహాదేవార్చనరతో వైష్ణవః పంక్తిపావనః ॥
అహింసానిరతో నిత్య మప్రతిగ్రహక స్తథా ।
సత్రీ చ దాననీరతో విజ్ఞేయః పంక్తిపావనః ॥
అగ్ని హోత్ర పరాయణుడు, విద్వాంసుడు, న్యాయవేత్త, వేదాంగములను తేలీయువాడు, మంత్రమును బ్రాహ్మణములను తెలిసినవాడు, ధర్మ శాస్త్రమును తెలిసినవాడు, ఋషి, ప్రతి, ఋషీ వంశములోనివాడు, ద్వాదశ వార్షిక వ్రతమును యజ్ఞములను ఆచరించువాడు, వివాహము ద్వారా ధర్మపత్నియందు కలిగిన సంతానము కలషాడు, గర్భాధానాది సంస్కారముతో పరిశుద్ధుడు, వేల మంది శిష్యులకు విద్యా ప్రదానము గావించినవాడు పోంద్రాయణాది వ్రతముల నాచరించువాడు, సత్యవాది, పురాణములను తెలిసినవాడు, గురుదేవ అగ్నిపూజలను జరుపుపోడు, జ్ఞాన తత్పరుడు. రాగేద్వషాదులు లేనివాడు, ధీరుడు, బ్రహ్మ స్వరూపుడు, ద్విజోత్తముడు, మహా దేవార్చనాసక్తుడు, విష్ణుభక్తుడు, పంక్తీ పావనుడగును. అహింసా నీరతుడు, పరిగ్రహము లేనివాడు, సత్రము నాచరించువారు, కూడా పంక్తి పావనులుగా నుందురు.
యువానః శ్రోత్రియాః స్వస్తా మహాయజ్ఞపరాయణాః సావిత్రీజాపనీగతో బ్రాహ్మణోః పంక్తీ పావనాః
కులానాం శ్రుతవంతశ్చ శీలవంత స్తపస్వినః అగ్నీచిత్ స్నాతకో విప్రో విజ్ఞేయః పంక్తిపావనః ॥
జ్ఞాననిష్ఠో మహాయోగీ వేదార్థవిచింతకః ।
శ్రద్ధాళుః శ్రాద్ధనీరతో బ్రాహ్మణః పంక్తిపావనః ॥
వేదవిద్యారతః స్నాతో బ్రహ్మచర్యపరః సదా ।
అథర్వణీ ముముక్షుశ్చ బ్రాహ్మణః పంక్తీపావనః ॥
అసమానప్రవరకో హ్యసగోత్ర స్తథైవ చ ।
సంబంధశూన్యో విజ్ఞేయో బ్రాహ్మణః పంక్తిపావనః ॥
భోజయే ద్యోగినం శాస్త్రం తత్త్వజ్ఞానరతం యతః ।
అభావే నైష్ఠికం దాస్త ముపకుర్వాణకం తథా ॥
తదలాభే గృహస్థం తు ముముక్షుం సంగవర్జితమ్ ।
సర్వాలాభే సాధకం వా గృహస్థ మపి భోజయేత్ ॥
యువకులు, శ్రోత్రియులు, ఆరోగ్యవంతులు, మహాయజ్ఞపరాయణులు, గాయత్రీ జప నిరతులు బ్రాహ్మణులు పంక్తి పావనులగుదురు. సత్కుల సంజాతులు శాస్త్ర జ్ఞానము కలవారు, సచ్ఛీలులు, తపః పరాయణులు, నిత్యాగ్ని హోత్రులు స్నాతకులు పంక్తి పావనులుగా తెలియుడు. తల్లిదండ్రుల హితమును చింతించువాడు, ప్రాతః కాలమున స్నానము చేయువాడు, ఆధ్యాత్మిక జ్ఞానము కలవాడు, ముని, ఇంద్రియ నిగ్రహము కలవాడు పంక్తి పావనుడగును. జ్ఞాన నిష్ఠుడు, మహాయోగి, వేదాంతార్థ చింతకుడు, శ్రద్దాలువు, శ్రాద్ధనిరతుడు, పంక్తి పొవునుఁగును. వేద విద్యారతుడు, స్నానశీలుడు, బ్రహ్మచర్య పరాయణుడు, అధర్వ వేదాధ్యయనశీలి, మోక్షాసక్తి కలవాడు, పంక్తి పావనుడగును. అసమాన ప్రవరుడు, అసమాన గోత్ర సంబంధము చేయువాడు, నీషిద్ధ సంబంధము లేనివాడు పంక్తి పావనునిగా తెలియవలయును. మొట్టమొదట తత్త్వ జ్ఞాననిరతుడు యతచిత్తుడగు యోగీని శ్రాద్దమున భుజింప చేయవలయును. యతి దొరకనిచో ఇంద్రియ జయము కలవానిని నిష్టాశీలిని, బ్రహ్మచర్య వ్రతమును ముగించి గృహస్థాశ్రమము స్వీకరించిన వానిని, అతనూ లభించనిచో సంగరహితుడై మోక్షేచ్ఛ గల గృహస్థుని, ఇతనూ లభించనిచో బ్రాహ్మణ గృహస్థుని భుజింప చేయవలయును.
ప్రకృతే ర్గుణతత్త్వజ్ఞో యస్యాశ్నోతి యతి ర్హవిః ।
ఫలం వేదాన్త విత్తస్య సహస్రా దతిరిచ్యతే॥
తస్మా ద్యత్నేన యోగీంద్ర మీశ్వరజ్ఞానతత్పరమ్ ।
భోజయే ద్ధవ్యకవ్యేషు అలాభా దితరాస్ ద్విజాన్ ॥
ఏష వై ప్రథమః కల్పః ప్రదానే హవ్యకవ్యయోః ।
అనుకల్ప స్త్యయం జ్ఞేయుః సదా సద్భి గనుష్ఠితః ॥
మాతామహం మాతులం చ స్వసీయం శ్వశురం గురుమ్।
దౌహిత్రం విట్పతిం బంధు మృత్విగ్యాజ్యౌ చ భోజయేత్ ॥
ప్రకృతి గుణ తత్త్వములను చక్కగా తెలిసినపోడు, ఇంద్రియ నిగ్రహము కల యతి భుజించినచో డజ్ఞుని భుజింప చేయు దానికంటే వేయిరెట్లు ఫలము లభించును. కావున సర్వ ప్రయత్నముతో ఈశ్వర జ్ఞాన తత్పరుడగు యోగీంద్రుని హవ్య కవ్యములందు భుజింప చేయవలయును. లభించనిచో ఇతరులను భుజింప చేయవలయును.
న శ్రాద్ధే భోజయే న్మిత్రం ధః కాగ్యోస్య సంగ్రహః ।
పైశాచీ దక్షిణాశా హీ నేహాముత్ర ఫలప్రదా ॥
కామం శ్రాద్దే ర్చయే న్నిత్రం నాభీరూప మపి త్వరీమ్ ।
ద్విషతా హి హావి ర్భుక్తం భవతి ప్రేత్య నిష్పలమ్ ॥
హవ్య కవ్య ప్రదానమున ఇది ప్రథమ కల్పము. ఈ కల్పము సజ్జనులు అనుష్టించిన సర్వాను మత మగు అను కల్పమును తెలియుము. తల్లితండ్రి మేనమామ, మేనల్లుడు, మామ, గురువు, దౌహిత్రుడు, అల్లుడు, బంధువు, ఋత్విజుని, యజమానుని భుజింప చేయవలయును.
బ్రాహ్మణో హ్యానధీయాన స్తృణాగ్ని రివ శామ్యతి ।
తస్మై హవ్యం న దాతవ్యం నహి భస్మని హూయతే ॥
యథోషరే భీజ ముప్తా న వత్తా లభతే ఫలమ్ ।
తథాఽ నృచే హవిర్దత్త్వా న దానా ల్లభతే ఫలమ్
శ్రాద్ధమున మిత్రుని భుజింప చేయరాదు. ధనదాన ప్రదానము ద్వారా మిత్రుని రక్షించుకొనవలయును. శ్రాద్దమున మీత్రుని భుజింపచేసి దక్షిణ ఇచ్చినచో అది పైశాచీ దక్షిణ యనబడును ఇహపరములలో ఫలము నీయ జాలదు. ఎవరూ లభించనపుడు మిత్రుడైననూ భుజింప చేయవచ్చును కాని యోగ్యుడైననూ శత్రువును భుజింప చేయరాదు. శత్రువు భుజించిన హవిస్సు పరలోకమున నిష్ఫలమగును.
యావతో గ్రసతే పిండాన్ హవ్యకవ్యే ష్వమంత్రవిత్ ।
తావతో గ్రసతే ప్రేత్య దీప్తాన్ స్తూలాం స్వయోగుడాన్ ॥
అపి విద్యాకులై ర్యుక్తా హీనవృత్తా నరాధమాః ।
యత్రైతే భుంజతే హవ్యం తద్భవే దాసురం ద్విజాః॥
యస్య వేదశ్చ వేదీ చ విచ్ఛిద్యేతే త్రిపూరుషమ్ ।
స వై దుర్బ్రాహ్మణో నార్హః శ్రాద్ధాదీషు కదాచన ॥
వేదాధ్యయనము చేయని బ్రాహ్మణుడు గడ్డిలో పడిన అగ్నివలె త్వరలో చల్లారును. అట్టి వానికి హవ్యము కవ్యములను ఈయరాదు. అట్లిచ్చిన అగ్నిలోని బూడిదలో హోమము చేసినట్లగును. చౌట భూమిలో విత్తనము వేసినపోడు ఫలమును పొందనట్లు అధ్యయనము చేయని పోనికీ భోజనము పెట్టినవాడు ఫలమును పొందడు. మంత్రజ్ఞుడుకాని వాడు పితృకార్యములలో భుజించిన పిండముల సంఖ్యలో పరలోకమున శూల తప్త అయః పిండములను భుజించవలసి వచ్చును.
శూద్రప్రేష్యో భృతో రాక్షో వృషబానాం చ యాజకః।
వధబంధోపజీవీ చ షడేతే బ్రహ్మబంధవః ॥
దత్త్వా సుయోగో ద్రవ్యార్థం పతితా న్మను రబ్రవీత్ ।
వేదవిక్రయిణో హ్యేతే శ్రాద్ధాదిషు నిగర్హీతాః ॥
సుతవిక్రయివో యే తు పరపూర్వా సముద్భవాః ।
అసామాన్యా న్యజస్తే యే పతితాస్తే ప్రకీర్తితాః ॥
విద్యా వంశములున్ననూ నీచ ప్రవర్తన కల నరాధములను భుజింప చేసినచో అది ఆసుర భోజనమగును. మూడు పురుషాంతరములు వేదము యజ్ఞములు విచ్ఛిన్నములగు వాడు దుస్రాహ్మణుడనబడును. శ్రాద్ధాదులకు యోగ్యుడు కాజాలడు, శూద్ర సేవకుడు, రాజుచే వేతనము తీసుకొనువాడు, పతితుడు, గ్రామ పురోహితుడు, వధ బంధనములతో జీవించువాడు ఈ ఆరుగురు బ్రహ్మ బంధువులనబడుదురు.
అసంస్కృతాధ్యాషకా యే భృత్యర్థే ధ్యాపయన్తి చ ।
అధీయతే తథా వేదాన్ పతితా స్తే ప్రకీర్తితాః ॥
వృద్ధశ్రావకనిర్ధస్థాః సంచగాత్రమిదో జనాః ।
కాపాలికాః పాశుపతాః పాషండా యే చ తద్విధాః॥
యస్యాశస్తి హవీం ష్యేతే దురాత్మాన స్తు తామసాః ।
న తస్య తద్భవే చ్ఛ్రాద్ధం ప్రేత్య చేహ ఫలప్రదమ్ ॥
అనాశ్రమీ ద్విజో యుః స్యా దాశ్రమీ పో నిరర్ధకః ।
మిథ్యాశ్రమీ చ తే విప్రా విజ్ఞేయాః పంక్తిదూషకః ॥
దుశ్చర్మా కునభీ కుష్ఠీ శ్వత్రీ చ శ్యామదంతకః ।
విద్ధ్యజనన శ్చైవ స్తేనః క్లీబోథ నాస్తికః ॥
బ్రతుకు తెరువు కొరకు ఉద్యోగము చేయువాడు పతితుడని మనువు చెప్పెను. వీరు వేదమును అమ్ముకొను వారు శ్రాద్ధాదులందు అర్హులు కాజాలరు. వేదముల నమ్ముకొనువారు, హీన ఉచ్చవర్ష స్త్రీల యందు పుట్టినవారు, సమాన వర్ణులు కాని వారిని యజ్ఞము చేయించుపొరీని పతితులందురు. సంస్కారములేని వారినీ చదీవించువారు వేతనము తీసుకొని చదీవించువారు, వేతనము తీసుకోని చదువుపోరు కూడా పతితులే అగుదురు. బౌద్ధులు, జైనులు, పాంచరాత్రులు, కాపాలికులు, పాశుపతులు, పాషండులు వారిని అనుసరించువారు ఈ దుర్మార్గులు ఎవరి హవ్య కవ్యములను భుజింతురో వారు చేసిన శ్రాద్ధము ఇహపరములందు ఫలప్రదము కాజాలదు.
మద్యపో వృషలీసక్తో వీరహా దీదీషూపతిః ।
అగారజాహీ కుండాశీ సోమవిక్రయిణో ద్విజాః ॥
పరివేత్తా చ హింసశ్చ పరీవిత్తి ర్నిరాకృతిః ।
పౌనర్భవః కుసీదశ్చ తథా నక్షత్రదర్శకః ॥
గీతవాదిత్రశీలశ్చ వ్యాధితః కాణ ఏవ చ ।
హీనాంగ శ్బాతిరిక్తంగో హ్యావకీర్ణీ తథైవ చ ॥
అన్నదూషీ కుండగోళా అభిశస్తోథ దేవలః ।
మిత్రధృక్ పిశున శైవ నిత్యం భార్యానువర్తినః ॥
మాతాపిత్రో ర్గురో స్త్యాగీ దోరత్యాగీత థైవ చ ।
గోత్రస్పృక్ భ్రష్టశాచశ్చ కాండస్పృష్ట స్తథైవ చ ।
అనపత్యః కూటసాక్షీ యాచకో రంగజీవకః ॥
సముద్రయాయీ కృతహా తథా సమయభేదకః ।
వేదనిందారత శ్చైవ దేవనిందాపరస్తథా ॥
ద్విజనిందారత శ్చైవ వర్ష్యాః శ్రాద్ధాదికర్మణి ।
కృతఘ్నుః పీశునః క్రూరో నాస్తికో వేదనిందకః ॥
మిత్రధృక్ కుహకశ్చైవ విశేషా త్పంక్తి దూషకః ।
సర్వే పున రభోజ్యాన్నా న దానార్ణా సర్వ కర్మసు ॥
బ్రహ్మహా చాభిశప్తశ్చ వర్జనీయాః ప్రయత్నతః।
శూద్రన్నరస పుష్టాంగః సంధ్యోపాసనవర్జితః ॥
మహాయజ్ఞనిహీనశ్చ బ్రాహ్మణః పంక్తీ దూషకః।
అధీతనాశన శ్చైవ స్నానదానవీవర్జితః ।
తామసో రాజసశ్చైవ బ్రాహ్మణః పంక్తి దూషితః ॥
యధావిధిగా ఆశ్రమస్వీకారమును చేయనివాడు, నామమాత్రమునకు ఆశ్రమ స్వీకారము చేసినవాడు మిధ్యాశ్రమ యనబడును. వీరిరువురును పంక్తిదూషకులుగాను వికర చర్మము కలవాడు, చెడుగోళ్ళుకలవాడు, కుష్టురోగి, శ్వేత కుష్టురోగముకలవాడు, సహజముగా నలుపు దంతము కలవాడు, విద్ధలింగితస్కరుడు, నపుంసకుడు, నాస్తికుడు, మద్యపానము చేయువాడు, శూద్రస్త్రీ సక్తుడు, అగ్నిహోత్రము నశించినవాడు, విధవను వివాహము చేసుకొనినవాడు, గృహదాహకుడు, జారునిద్వారా పుట్టిన వాని అసమును భుజించువాడు, సోమలతను అమ్మువాడు వీరు శ్రాద్దారులు కారు.
అన్న వివాహము చేసుకొనకుండా తాను వివాహము చేసుకొనువాడు, హింసించువాడు, తమ్ముడు వివాహము అయిననూ తాను వివాహము చేసుకోననివాడు, పంచ మహాయజ్ఞములు చేయనివాడు, రెండవ వివాహము చేసుకొనిన స్త్రీకి కలిగిన పుత్రుడు, కపటజీవి, జ్యోతీషముతో జీవించువాడు వీరందరూ అనర్హులు. గీత వాదిత్ర నిరతులు, రోగి, ఒంటికంటివాడు, వికలాంగుడు, అధికంగుడు, స్త్రీ సంపర్కముతో బ్రహ్మ చర్య వ్రతమును నష్టపరచుకొనినవాడు, కన్యను చెరచువాడు, ఊరునిచే పతిజీవించి యుండగా పుట్టినపోడు, పతి మరణించిన తరుపోత పర పురుషుని వలన పుట్టినవాడు, అపనిందలను పొందినవాడు, మందిరాదులతో జీవించువాడు, మిత్రద్రోహి, లోభి, భార్యా విధేయుడు వీరందరూ శ్రాద్ధమునకు అయోగ్యులు. తల్లి తండ్రి గురువు భౌర్యవీరిని విడుచుపోడు తరిలో భేదమును సృజించువాడు, శౌచ భ్రషుడు, శస్త్ర జీవి, సంతానహీనుడు, కూట సాక్ష్యము చెప్పుకోడు, యాచకుడు, చిత్రకారుడు, నాట్యకారుడు, సముద్ర ప్రయాణము చేయువాడు, కృతఘ్నుడు, ప్రతి భంగము-చేయువాడు, దేవనిందాపరుడు, వేదనిందారకుడు, బ్రాహ్మణ నిందారకుడు, శ్రాద్ధాది కర్మలలో అనర్హులు. కృతఘ్నుడు, లోభి. క్రూరుడు, నాస్తికుడు, వేదనిందకుడు, మీత్ర ద్రోహి, కుటిలుడు వీరు విశ్లేషించి పంక్తి భోహ్యులు.
బహునాత్ర కీముక్తేన విహితాన్ యే న కుర్వతే ।
నిందితా నాచర న్యేతే వర్జ్యాః శ్రాద్దే ప్రయత్నతః ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్ధే ఏకవింశోధ్యాయః
పైన చెప్పిన వారందరు శ్రాద్దమున భుజింప చేయదగనివారు, అన్ని కర్మలలోను దానమునకు అపాత్రులు బ్రాహ్మణత్వము నుండి భ్రష్టులు వీరినీ విశ్లేషించి విడువ వలయును. శూద్రాన్నముచే పోషించబడువారు సంధ్యాహీనులు, పంచ మహాయజ్ఞములు చేయనివారు, పంక్తి దూషకులు. చదివిన దానిని మరచినవారు స్నాన హోమ శూన్యులు తామసులు రాజసులు పంక్తీ దూషకులు. ఇంకేమి చెప్పవలయును. శాస్త్ర విహితముల నాచరించక నిందీతముల నాచరించువారు విశేష ప్రయత్నముతో విడువదగినవారు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున ఇరువది యొకటవ అధ్యాయము.
Summary of chapter 74 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa details the stringent criteria for selecting Brāhmaṇas to represent Devas and Pitṛs during Śrāddha ceremonies. He emphasizes inviting scholars well-versed in the Vedas, Vedāṅgas, Purāṇas, and those who practice severe penance, daily Agnihotra, and Śiva-Vishṇu devotion. Conversely, Vyāsa strictly forbids inviting degraded, unlettered, greedy, or morally compromised persons, as improper invitations ruin the sacrificial merit.