కూర్మ మహా పురాణము
7 - సృష్టివర్ణనమ్
కూర్మ ఉవాచ ।
సృష్టిం చిన్తయత స్తస్య కల్పాదిషు యథా పురా ।
అబుద్ధిపూర్వకః సర్గః ప్రాదుర్భూత స్తమోమయః ॥
తమోమోహో మహామోహ స్తామిస్ర శ్చాన్ధ్ సంజ్ఞాతః ।
అవిద్యా పఞ్చమో తేషాం ప్రాదుర్భూతా మహాత్మనః ॥
పఞ్చధా వస్థితః సర్గో ధ్యాయతః సోఽభిమానినః ।
సంవృత స్తమసా చైవ బీజకుమ్భవ దావృతః ॥
బహి రన శ్చాప్రకాశ స్తబ్ధో నిఃసంగ ఏవ చ ।
ముఖ్యా నగా ఇతిప్రోక్తా ముఖ్య సర్గస్తు స స్మృతః॥
తం దృష్ట్వ్యా సాధకం సర్గ మమన్య దపరం ప్రభుః ।
తస్యా భిధ్యాయతః సర్గం తీర్యక్ స్రోతోఽభ్యవర్తత ॥
కూర్మస్వామి ఇట్లనెను.
ఆవిష్ణువు సృష్టిని గూర్చి ఆలోచించుచుండగా, ఆయాకల్పాలలో పూర్వము జరిగినట్లుగా, బుద్ధిపూర్వకము కాని అంధకారమయమైన సృష్టి ఆవిర్భవించెను.
మహాత్ముడైన ఆవిష్ణువునుండి తమోమోహము, మహామోహము, తామసము, అంధము, అవిద్య అని అయిదు విధములుగా తమయమైన సర్గము కలిగినది.
అభిమానము కలిగి ధ్యానించుచున్న ఆ భగవంతునికి అయిదుప్రకారములుగా ఉన్న సర్గము, కుండనే కప్పబడిన బీజమువలె చీకటితో కప్పబడి ఉండేను.
లోపల, బయట కూడ వెలుతురు లేనిదీ, జడముగా ఉన్నది. సంబంధరహితము, ముఖ్యములైన పర్వతములనీ చెప్పబడినది, ప్రధాన సరమని తలపబడినదీ.
ప్రభువైన విష్ణువు ఆసర్గము సమగ్రము కాదని తలచి మరోకసృష్టిని గూర్చి చింతించుచుండగా అడ్డముగా ఒక ప్రవాహము బయలు దేరినది.
యస్మాత్తిర్యక్ ప్రవృత్తః స తిర్యక్స్రోతః తతః స్మృతః ।
పశ్వాదయ స్తే విఖ్యాతా ఉత్పథగ్రాహిణి ద్విజోః ॥
తమ ష్యసాధకం జ్ఞాత్వా సర్గ మన్యం ససర్జ హ ।
ఊర్ధ్వస్రోత ఇతి ప్రోక్తో దేవసర్గ స్తు సాత్త్వికః ॥
తే సుఖప్రీతిబహులా బహి రన్తస్త్వనావృతాః ।
ప్రకాశా బహి రన్తశ్చ స్వభావా ద్దేవసంజ్ఞితాః ॥
తతోఽభిధ్యాయత స్తస్య సత్యాభిధ్యాయిన స్తదా ।
ప్రాదురాసీ త్తదా వ్యక్తా దర్వాక్ స్రోతస్తు సాధకః ॥
తత్ర ప్రకోశబహులా సమోద్రిక్తా రజోధీకాః ।
దుఃఖోత్కటాః సత్త్వయుతా మనుష్యాః పరికీర్తితాః ॥
ఆ ప్రపోహము అడ్డముగా ప్రసరించినందున తిర్యక్స్రోతమని చెప్పబడినది. బ్రాహ్మణులారా! భిన్నమార్గమును గ్రహించినందున అవి పశ్వాదులుగా ప్రసిద్ధములైనవి.
అది కూడ తృప్తికరము కాదని తలచి మరియొక సర్గమును సృష్టించినాడు. అది సత్వగుణ ప్రధానమైన దేవతజాతి సర్గము. ఊర్ధ్వస్తోతమని చెప్పబడినది.
ఆ దేవతలు సుఖములందు ఎక్కువ ప్రీతికలవారు, లోపల, బయటకూడ ఆవరణము లేనివారు, లోపలవెలుపల ప్రకాశముకలవారు స్వభావమును బట్టి దేవతలని పేర్కొనబడినారు.
తరువాత మరల ఆ బ్రహ్మ ధ్యానించుచుండగా అవ్యక్తరూపమునుండి, ప్రయోజనకరమైన అర్వాక్స్రోతస్సు ప్రాదుర్భవించినది.
దానియందు అధికప్రకాశము కలవారు, తమోగుణముచేత ఉద్రేకము పొందువారు, రజోగుణము ఎక్కువగా కలవారు, అధికదుఃఖముతో బాధపడువారు, సత్త్వగుణముతో కూడినవారు అగు మనుష్యులుగా వ్యవహరింపబడినారు.
తం దృష్ట్వా చాపరం సర్గ మమన్య ద్భగవా నతః ।
తస్యా భిధ్యాయతః సర్గం సర్గో భూతాదికోఽభవత్ ॥
తే పరిగ్రహిణః సర్వే సంవిభాగరతాః పునః ।
ఖాదీనశ్చాష్యశీలోశ్చ భూతాద్యాః పరికీర్తితాః ॥
ఇత్యేతే పఞ్చకథితాః సర్గా వై ద్విజపుంగవాః ।
ప్రధమో మహతః సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తు సః ॥
తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్లో హి సంస్మృతః ।
వైకారీక స్తృతీయస్తు సర్గ ఇన్ర్దియకః స్మృతః ॥
ఇత్యేష ప్రాకృతః సర్గః సంభూతో బుద్ధిపూర్వకః ।
ముఖ్యసర్గ శ్చతుర్ధస్తు ముఖ్యావై స్థావరాః స్మృతాః ॥
ఆ రెండవ సృష్టిని చూచి భగవంతుడైన బ్రహ్మ ధ్యానించెను. ఆ సృష్టిని గూర్చి అతడు ధ్యానించుచుండగా ప్రాణులు మొదలగువానీతో కూడిన సృష్టి ఏర్పడినది.
అవి అన్నీ సంవిభాగముతోకూడి, పరిగ్రహించునవై, ప్రాణులనుతినేవి, శీలరహితములు అయిన భూతాదులుగా చెప్పబడినాయి.
ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఇవి అయిదు సర్గములు అని చెప్పబడినవి. వీనిలో మొదటిది మహత్తత్వము యొక్క సర్గము. అది బ్రహ్మకు సంబంధించినదిగా తెలియదగును.
రెండవది పంచతన్మాత్రలకు సంబంధించిన ప్రాణుల సృష్టిగా గుర్తింపదగినది. మూడవది తన్మాత్రల వికారములైన ఇంద్రియములకు సంబంధించిన సర్గము.
ఈవిధముగా బుద్ధిపూర్వకమైన సకల ప్రాకృతసర్గము ఏర్పడినది. నాలుగవ సర్గము ముఖ్యమైనది. అవి స్థావరరూపములైన పదార్థములుగా ముఖ్యసర్గముగా పేర్కొనబడినవి.
తిర్యక్ స్తోత్ర స్తు యః ప్రోక్త స్తిర్యగ్యోన్యః స పఞ్చమః ।
తతోర్ధ్వ ప్రోతసాం షష్ఠో దేవసర్గస్తు స స్మృతః ॥
తతో ర్వాక్స్రోతసాం సర్గః సప్తమః సతు మానుషః ।
అష్టమో భౌతికః సర్గో భూతాదీనాం ప్రకీర్తితః ॥
నవమ శ్చైవ కౌమారః ప్రాకృతా వైకృతాస్త్విమే ।
ప్రాకృతాస్తు త్రయః పూర్వే సర్గాస్తే బుద్ధిపూర్వకః ॥
బుద్ధిపూర్వం ప్రవర్తనే ముఖ్యాద్యా మునిపుంగవాః ।
అగ్రే ససర్జ వై బ్రహ్మా మానసా నాత్మనః సమాన్ ॥
సనకం సనాతనం చైవ తథైవ చ సనన్దనమ్ ।
క్రతుం సనత్కుమారం చ పూర్వమేష ప్రజాపతిః ॥
తిర్యక్స్రోతస్సుగా చెప్పబడినది అయిదవసర్గము. అదిపశుపక్ష్యాది రూప ప్రాణులతో కూడి ఉన్నది. తరువాత ఊర్ధ్వరేతస్సు కల దేవతల సర్గము (స్పషి) ఆరవవీభాగానికి చెందుతుంది.
తరువాత ఏడవసర్గము మనుష్యులకు సంబంధించినది. అది అధోరేతస్కుల యొక్క సృష్టి ఊర్ధ్వరేతస్కులు కానివారిది. ఎనిమిదవది. భౌతికసర్గము. అది భూతములు మొదలగువానికి సంబంధించినది.
తొమ్మిదవది కౌమారసర్గము. ఈ సర్గములలో కొన్ని ప్రాకృతములు, మరి కొన్ని వైకృతములు. మొదటి మూడు ప్రాకృతసర్గములు, అవి బుద్ధిపూర్వకమైనవి.
మునిశ్రేష్ఠులారా! ముఖ్యతత్వము మొదలగునవి బుద్ధిపూర్వకముగా ప్రవర్తించును. బ్రహ్మ ముందుగా తనతోసమానులైన యీక్రిందివారిని మానసపుత్రులుగా సృజించెను.
సనకుని, సనాతనుని, అట్లే సనందనుని, క్రతువును, సనత్కుమారుని కూడ ప్రజాపతి అగు బ్రహ్మ సృజించెను.
పఞ్చైతే యోగీనో విప్రాః పరం వైరాగ్య మాశ్రితాః ।
ఈశ్వరాసక్తమనసో న సృష్టౌ దధిరే మతిమ్ ॥
తేష్వేవం నిరపేక్షేషు లోకసృష్టౌ ప్రజాపతిః ।
ముమోహ మాయయా సద్యో మాయినః పరమేష్ఠినః ॥
సంబోధయామాస చ తం జగన్మాయో మహామునిః ।
నారాయణో మహాయోగీ యోగిచిత్తానురఞ్జనః ॥
బోధిత స్తేన విశ్వాత్మా తతాప పరమం తపః ।
సతష్యమానో భగవా న్న కిఞ్జ త్ప్రత్యపద్యత ॥
తతో దీర్ఘణ కాలేన దుఃఖాత్కాధోఽభ్యజాయత ।
క్రోధావిష్టస్య నేత్రాభ్యం ప్రాపత న్నశ్రుబిన్హవః ॥
ఓ బ్రాహ్మణులారా! ఈ అయిదుగురు యోగులు గొప్పవైరాగ్యము నాశ్రయించి, భగవంతునియందే మనస్సుగలవారై, సృష్టికార్యము నందు బుద్ధిని ప్రసరింపజేయరైరి.
వారు ఈరీతిగా కోరికలేని వారు కాగా ప్రజాపతియగు బ్రహ్మ లోకమును సృజించుటయందు, మాయామయుడైన పరమేష్ఠివలన మాయచే వెంటనే మోహితుడాయెను.
మోహితుడైన బ్రహ్మను, లోకమును మాయలోనింపిన నారాయణుడు, మహాముని, మహాయోగిస్వరూపుడు, యోగీశ్వరుల మనస్సును సంతోషపరచు వాడునై మాయనుండి మేలుకొలిపెను.
ఆనారాయణునిచేత మేలుకొలుపబడిన విశ్వాత్ముడైన బ్రహ్మ తీవ్రమైన తపస్సును చేసెను. తపస్సుచేయుచున్న ఆభగవంతుడు ఇతరము దేనిని గూడ గుర్తించక ఉండెను.
తరువాత చాలా కాలమునకు తపస్సులోని క్లేశదుఃఖమువలన అతనికి కోపము కలిగినది. కోపముతో కూడిన ఆయన కన్నులనుండీ బాష్పబిందువులు జారీపడినవి.
భృకుటీకుటిలా త్తస్య లలాటా త్పరమేష్ఠినః ।
సముత్పన్నో మహాదేవః శరణ్యే నీలలోహితః ॥
స ఏవ భగవా నీశ స్తేజోరాశిః సనాతనః ।
యం ప్రపశ్యంతి విద్వాంసః స్వాత్మస్థం పరమేశ్వరమ్ ॥
ఓంకారం సమనుస్మృత్య ప్రణమ్య చ కృతఞ్చలిః ।
త మాహ భగవాన్ బ్రహ్మా సృజేమా వివిధాః ప్రజాః ॥
నిశమ్య భగవద్వాక్యం శంకరో ధర్మవాహనః ।
ఆత్మనా సదృశాస్ రుద్రాస్ ససర్జ మనసా శివః ॥
కపర్దినో నిరాటఙ్కాం స్త్రిణేత్రా న్నీలలోహితాన్ ।
తంప్రాహ భగవాన్ బ్రహ్మా జన్మమృత్యుయుతాః ప్రజాః ॥
సృజేతి సోఽబ్రవీ దీశో నాహం మృత్యుజరాన్వితాః ।
ప్రజాః స్రక్ష్యే జగన్నాథ సృజ త్వ మశుభః ప్రజాః ॥
బొమ్మముడిచేత వంకరయిన బ్రహ్మయొక్క నొసటినుండి, శరణుపొందదగినవాడు, నీలలోహితుడును అగు మహాదేవుడు (శివుడు) పుట్టెను.
అతడే భగవంతుడు, తేజస్సులసమూహము, అతిపురాతనుడు. ఎవనిని పండితులు తమ ఆత్మలయందున్న పరమేశ్వరునిగా భావింతురో అతడే ఆశివుడు.
అప్పుడు భగవంతుడైన బ్రహ్మ ఓంకారమును స్మరించి, శివునికి నమస్కరించి, చేతులు జోడించి, వివిధ ప్రజలను సృజింపుమని అతనితో పలికెను.
ధర్మము వాహనముగా కల శంకరుడు బ్రహ్మయొక్క వాక్యమును విని తనతో సమానులైన మరికొందరు రుద్రులను సంకల్పముతో సృజించెను.
వారు జటాజూటముకలవారు, మూడుకన్నులుకలవారు, ఆటంకరహీతులు, నీలలోహితులుగా ఉండిరి. భగవంతుడగు బ్రహ్మ శివునితో, జననమరణములు కల ప్రజలను.
సృజించుము. అని పలికెను. అప్పుడా శివుడు ఇట్లుపలికెను. నేను జరామరణములుకల జనులను సృజించను. ఓ జగన్నాథా! అటువంటి అశుభప్రజలను నీవే సృష్టించుము” అనెను.
నివార్య స తదా రుద్రం ససర్జ కమలోద్భవః ।
స్థానాభిమానినః సర్వాన్ గదత స్తాన్నిబోధత ॥
ఆపోఽగ్ని రంతరిక్షం చ ద్యౌర్వాయుః పృథివీ తథా ।
సద్యః సముద్రాః శైలాశ్చ వృక్షావీరుధ ఏవచ ॥
లవాః కాష్ఠాః కరా శ్చైవ ముహూర్తా దివసాః క్షపాః ।
అర్ధమాసాశ్చ మాసాశ్చ అయనాబ్దయుగాదయః ॥
మరీచిభృగ్వజ్గిరసః పులస్త్యం పులహం క్రతుమ్ ।
దక్ష మత్రిం వసిష్ఠంచ ధర్మం సంకల్ప మేవచ ॥
అప్పుడు బ్రహ్మ శివుని వారించి స్థానాభిమానులైన అన్నిటిని సృష్టించినాడు. వానిని చెప్పుదును, తెలుసుకొనుడు.
జలము, అగ్ని, ఆకాశము, వాయువు, భూమి, స్వర్గము, నదులు, సముద్రాలు,పర్వతాలు, వృక్షములు, తీగలును;
లవములు, కాష్ఠలు, కలలు, ముహూర్తములు, పగళ్ళు, రాత్రులు, పక్షములు, మాసములు, అయనములు, సంవత్సరాలు, యుగములు మొదలగు కాలభేదములు.
స్థానాభిమానులైన వానిని సృజించి మరల సాధకములను సృష్టించెను. మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వసిష్ఠుడు, ధర్ముడు, సంకల్పుడు అనువారిని;
ప్రాణా ద్బహ్మ్రా సృజ దక్షం చక్షుర్భ్యాం చ మరీచినమ్ ।
శిరసోఽజ్గిరసం దేవో హృదయా ద్భృగు మేవ చ ॥
నేత్రాభ్యా మత్రినామానం ధర్మం చ వ్యవసాయతః ।
సంకల్పం చైవ సంకల్పాత్ సర్వలోకపితామహః ॥
పులస్త్యంచ తథోదానా ద్వ్యానాచ్చ పులహం మునిమ్ ।
అపానాత్ క్రతు మవ్యగ్రం సమానాచ్చ వసిష్ఠకమ్ ॥
ఇత్యేతే బ్రహ్మణా సృష్టాః సాధకా గృహమేధీనః ।
ఆస్థాయ మానవం రూపం ధర్మ స్తైః సంప్రవర్తితః ॥
తతో దేవాసురపితృన్ మనుష్యాం శ్చ చతుష్టయమ్ ।
సిసృక్షు ర్భగవా నీశః స్వ మాత్మాన మయోజయత్ ॥
బ్రహ్మదేవుడు ప్రాణమునుండి దక్షుని సృష్టించినాడు. కన్నులనుండి మరీచిని, శిరస్సునుండి అంగిరసుని, హృదయము నుండి భృగువును సృజియించినాడు.
కన్నులనుండి అత్రియనుపేరుగల మునిని, తన వ్యవసాయమునుండి ధర్మపురుషుని, సంకల్పమునుండి సంకల్పదేవతను, సర్వలోక పితామహుడైన బ్రహ్మ సృష్టించినోడు.
ఉదానవాయువునుండి పులస్త్యుని, వ్యానవాయువునుండి పులహుని, అపానమునుండి విచలితుడుకాని క్రతువును, సమానవాయువునుండి వసిష్ఠుని సృజించెను.
ఈ చెప్పబడినవారందరు బ్రహ్మదేవునిచే సృజింపబడిన సాధకులైన గృహస్థులు. మానవశరీరమునధిష్టించి వారిచేత లోకములో ధర్మము ప్రవర్తింపచేయబడినది.
తరువాత దేవతలను, అసురులను, పితరులను, మనుష్యులను నాలుగువర్గాలుగా సృజించదలచినవాడై భగవంతుడైన సృష్టికర్త, తనను ఆకార్యములో నిమగ్నునికావించుకొనెను.
యుక్తాత్మన స్తమోమాత్రా హ్యుద్రిక్తా భూ త్ప్రజాపతేః ।
తతోఽస్య జఘనా త్పూర్వం అసుర జజ్ఞిరే సుతాః ॥
ఉత్ససర్జా సురాన్ సృష్ట్వా తాం తసుం పురుషోత్తమః ।
సాచోత్సృష్టా తనుస్తేన సద్యోరాత్రి రజాయత ॥
సా తమోబహులా యస్మాత్ ప్రజా స్తస్యాం స్వపన్య్తతః ।
సత్త్వమాత్రాత్మికాం దేవ స్తను మన్యాం గృహీతవాన్ ॥
తతోఽస్య ముఖతో దేవా దీవ్యతః సంప్రజజ్ఞిరే ।
త్యక్తా సాపి తనుస్తేన సత్వప్రాయ మభూద్దినమ్ ॥
తస్మా దహో ధర్మయుక్తా దేవతాః సముపాసతే ।
సత్వమాత్రాత్మికా మేవ తతోఽన్యాం జగృహే తనుమ్ ॥
తనను నియమించుకొన్న ప్రజాపతి నుండి తమోగుణముయొక్క పరిమాణము వృద్ధిచెందెను. అప్పుడతని జఘనభాగమునుండి ముందుగా కుమారులుగా అసురులు జన్మించిరి.
అసురులను సృజించిన తరువాత పురుషోత్తముడు ఆపూర్వ శరీరమును విడిచి పెట్టెను. అతడా శరీరము విడువగానే వెంటనే రాత్రి ఏర్పడెను.
ఆరాత్రి చీకటీ ఎక్కువగా కలదైనందున దానియందు ప్రజలు నిద్రించుచుండిరి. అప్పుడు భగవంతుడు సత్త్వగుణము ప్రధానముగా గల మరియొక శరీరమును స్వీకరించెను.
తరువాత ప్రకాశించుచున్న అతని ముఖమునుండి దేవతలు జన్మించిరి. అప్పుడా శరీరము కూడ అతనిచే విడువబడెను. తరువాత సత్త్వగుణాధికమైన పగలు ఏర్పడెను.
అందువలన ధర్మయుక్తులైన దేవతలు సత్త్వగుణము మాత్రమే స్వరూపముగాగల మూర్తినే సేవించుచుండిరి. తరువాత ఆభగవానుడు మరొక శరీరమును స్వీకరించెను.
పితృవ న్మన్య మానస్య పితరః సంప్రజజ్ఞిరే ।
ఉత్ససర్జ పితృస్ సృష్ట్వా తతస్తా మపి విశ్వదృక్ ॥
సా పవిద్ధా తను స్తేన సద్యః సన్ద్యా వ్యజాయత ।
తస్మా దహర్దైవతానాం రాత్రిః స్యాద్దేవవిద్విషామ్ ॥
తయో ర్మధ్యే పితృణాంతు మూర్తిః సన్య్ధా గరీయసీ ।
తస్మా ద్దేవాసురాః సర్వే మునయో మానవా స్తదా ॥
ఉపాసతే సదాయుక్తా రాత్ర్యహ్నో ర్మధ్యమాం తనుమ్ ।
రజోమాత్రాత్మికాం బ్రహ్మా తను మన్యాం తతోఽసృజత్ ॥
తతోఽస్య జజ్ఞిరే పుత్రా మనుష్యా రజసావృతాః ।
తా మథా శు స తత్యాజ తనుం సద్యః ప్రజాపతి ॥
తండ్రివలె భావించుచున్న ప్రజాపతికి పితృదేవతలు జనించిరి. పితరులను సృష్టించిన తరువాత ఆ శరీరమును కూడ విశ్వద్రష్ట అగుదేవుడు వదలిపెట్టెను.
అతనిచేత అశరీరము కప్పివేయబడినది. అప్పుడే సంధ్య ఏర్పడెను. అందువలన దేవతలకు పగలు రాక్షసులకు రాత్రిగా ఆయెను.
ఆ పగలు రాత్రులకు మధ్యలో పితరులకు సంధ్యారూపమైనమూర్తి గొప్పదిగా ఉండెను. ఆ కారణమువలన దేవతలు, అసురులు, మునులు, మనుష్యులు అందరుకూడు అప్పుడు రాత్రికి, పగటికి మధ్యమందున్న సంధ్యారూష. శరీరమును ఎల్లప్పుడు సేవింతురు. తరువాత బ్రహ్మ రజోగుణము మాత్రము ముఖ్యముగా కల ఇతర శరీరమును కల్పించెను.
పిమ్మట ఆయనకు ఆశరీరము నుండి రజోగుణముచేత కప్పబడిన మనుష్యులు కుమారులుగా జన్మించిరి. అప్పుడు ప్రజాపతి ఆశరీరము కూడ శీఘ్రముగా విడిచిపెట్టెను.
జ్యోత్స్నా సా చాభవ ద్విప్రాః ప్రాక్సంధ్యా యా భిధీయతే ।
తతః స భగవాన్ బ్రహ్మా సంప్రాప్య ద్విజపుంగవాః ॥
మూర్తిం తమోరజఃప్రాయాం పున రేవా భ్యపూజయత్ ।
అన్థాకారే క్షుధావిష్టా రాక్షసా స్తష్య జిజ్ఞతే ॥
పుత్రా స్తమోరజఃప్రాయా లలినస్తే నిశాచరాః ।
సర్పాయుధాస్తథాభూతా గన్థార్వాః సంప్రజ్ఞిరే ॥
రజస్తమోభ్యా మవిష్టాం స్తతోఽ న్యా న సృజ త్ర్పభుః ।
వయాంసి వయసః సృష్ట్వా అవీ న్వై వక్షసోఽసృజత్ ॥
ముఖతోఽజాన్ ససర్జా వ్యాన్ ఉదరాద్గాశ్చ నిర్మమే ।
పద్భ్యాం చాశ్వాన్న మాతంగాన్రాసభాన్ గవయాన్మృగాన్ ॥
బ్రాహ్మణులారా! ఏది పూర్వసంధ్య అని చెప్పబడుచున్నదో, అది వెన్నెలగా అయినది. తరువాత భగవంతుడైన ఆబ్రహ్మ, తమస్సు, రజస్సు అనుగుణములు అధికముగాకల శరీరమును ధరించి మరల పూజించెను. అప్పుడాయనకు చీకటిలో ఆకలితో కూడిన రాక్షసులు పుట్టిరి.
తమోరజోగుణ ప్రాయులైన, బలవంతులు, రాత్రించరులు అగుకుమారులు కలిగిరి. సర్పముల వంటి ఆయుధాలు కలవారు మరియు గంధర్వులు జన్మించిరి.
తరువాత రజస్తమోగుణములతో కూడియున్న ఇతరప్రాణులను బ్రహ్మ సృజించెను. పక్షులను సృష్టించి తరువాత తన హృదయస్థలము నుండి సర్పములను సృజించెను.
ముఖము నుండి మేకలను, పొట్టనుండి గోవులను సృష్టించినాడు. పాదములనుండి గుఱ్ఱములను, ఏనుగులను, గాడిదలును, గవయములను, ఇతర మృగములను సృష్టించినాడు.
ఉష్ట్రా నశ్వతరాం శ్చైవ అరత్నేశ్చ ప్రజాపతిః ।
ఓషధ్యః ఫలమూలాని రోమభ్య స్తస్య జజ్ఞిరే ॥
గాయత్రం చ ఋచ శ్చైవ త్రివృత్స్తోమం రథస్తరమ్ ।
అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమా న్ముఖాత్ ॥
యజూంషి త్రైష్టుభం ఛన్ద స్తోమం పఞ్చదశం తథా ।
బృహత్సామ తథోక్థఞ్చ దక్షిణా దసృజ న్ముఖాత్ ॥
సామాని జాగతం ఛన్దస్తోమం సప్తదశం తథా ।
వైరూప మతిరాత్రం చ పశ్చిమా దసృజ న్ముఖాత్ ॥
ఏకవింశ మధర్వాణం ఆప్తోర్యామాణ మేవ చ ।
అనుష్టుభం సవైరాజం ఉత్తరా దసృజ న్ముఖాత్ ॥
ప్రజాపతి తనమోచేతి నుండి ఒంటెలను, కంచరగాడిదలను సృజించెను. అతని రోమములనుండి ఓషధులు, పండ్లు, దుంపలు పుట్టినవి.
ప్రజాపతి తన మొదటి ముఖమునుండి గాయత్రీమంత్రమును, ఋక్కులను, త్రివృత్ స్తోమమును, రధంతరమను మంత్రమును, యజ్ఞములలో అగ్నిష్టోమమును సృజించెను.
యజుర్వేద మంత్రములను, త్రిష్టుప్ఛందస్సులోని మంత్రసమూహమును, బృహత్సామ మంత్రములను, ఉర్ధస్తోత్రమంత్రమును, దక్షిణపు ముఖమునుండి నిర్మించెను.
సామమంత్రములను, జగతీఛందస్సుల సమూహమును పదునేడింటిని, వైరూపము, అతిరాత్రము అను పేర్లుగల మంత్రసూక్తములను పడమటి ముఖమునుండి సృష్టించెను.
ఇరువదియొక్క అధర్వశాఖలను, ఆప్తోర్యామ శాఖను, వైరాజముతోకూడిన అనుష్టుప్ ఛందమును ఉత్తర ముఖమునుండి సృజించెను.
ఉచ్చావచాని భూతానీ గాత్రేభ్య స్తస్య జజ్ఞిరే ।
బ్రహ్మణో హి ప్రజాసర్గం సృజత స్తు ప్రజాపతేః ॥
యక్షాన్ పిశాచాన్ గన్ధ్ర్వాం స్తథైవా ప్సరసః శుభాః ।
సృష్ట్వా చతుష్టయం సర్గం దేవర్షపితృమానుషమ్ ॥
తతోఽసృజ చ్చ భూతాని స్థావరాణి చరాణి చ ।
నరకిన్నరరక్షాంసి వయఃపశుమృగోరగాన్ ॥
అవ్యయం చ వ్యయం చైవ ద్వయం స్థావరజజ్గమమ్ ।
తేషాం యే యాని కర్మాణి ప్రాక్ సృష్టేః ప్రతిపేదిరే ॥
తాన్యేవ తే ప్రపద్యన్తే సృజ్య మాసాః పునః పునః ।
హింసాహింస్రే మృదుక్రూరే ధర్మాధర్మా వృతానృతే ॥
ప్రజలను సృజిస్తున్న ప్రజాపతియగు బ్రహ్మయొక్క అవయవాల నుండి ఉచ్ఛనీచములైన ప్రాణులు జన్మించినవి.
యక్షులను, పిశాచాలను, గంధర్వులను, కల్యాణరూపులైన అప్సరసలను సృష్టించి, దేవతలు, ఋషులు, పితరులు, మనుష్యులు అను సొలుగు విధముల సర్గమును కల్పించి,
తరువాత స్థావరములు, జంగమములు అగు భూతములను సృష్టించెను. మనుష్య, కిన్నర, రాక్షసులను, పక్షులను, పశువులను, మృగములను, సర్పములను సృష్టించినాడు.
స్థావర జంగమములు రెండుకూడ నశించనిది, నాశము పొందునది అని రెండు విధములుగా ఉండును. వానిలో ఏవి ఏకర్మలను సృష్టికి పూర్వము పొందియుండేనో;
ఆకర్మలనే అవి మరల మరల సృజించబడినప్పుడు పొందుచుండును. హింసించునది - అహింసకలది, మృదువైనది - క్రూరమైనది, ధర్మము - అధర్మము, ఋతము - అనృతము;
తద్భావితాః ప్రపద్యన్తే తస్మాత్తత్తస్య రోచతే ।
మహాభూతేషు నానాత్వం ఇన్ర్దియార్ధేషు మూర్తిషు ॥
వినియోగం చ భూతానాం ధాతైవ వ్యదధా త్స్వయమ్ ।
నామ రూపం చ భూతానాం ప్రాకృతానాం ప్రపఞ్చనమ్ ॥
వేదశబ్దేభ్య ఏవాదౌ నిర్మమే స మహేశ్వరః ।
ఆర్షాణి చైవ నామాని యాశ్చ వేదేషు సృష్టయః ॥
శర్వర్యన్తే ప్రసూతానాం తాన్యే వైభ్యో దదా త్యజః ।
యావత్తి ప్రతిలిజ్గాని నానారూపాణి పర్యయే ॥
దృశ్యస్తే తానీ తాన్యేవ తథాభావా యుగాదిషు ।
ఇతి శ్రీ కూర్మపురాణే సప్తమోఽధ్యాయః॥
దానిచేత భావింపబడి ఆశ్రయింతురు. అందువలన అదీవానికి రుచించును. మహాభూతములయందు అనేకత్వమును, ఇంద్రియములకు విషయములైన శరీరములందు ప్రాణుల వినియోగమును కూడ బ్రహ్మయే స్వయముగా సృజించెను. నామరూపములను, ప్రాకృతములైన భూతముల విస్తారమును ఆమహేశ్వరుడు వేదశబ్దములనుండియే ఆదికాలమున నిర్మించెను. ఋషిప్రోక్తములైన నామములు, వేదములందు చెప్పబడిన సృష్టులు,
రాత్రిముగిసిన తరువాత మరల జనించిన వారికి మరల పూర్వపు పేర్లనే బ్రహ్మ కల్పించుచున్నాడు. పునః సృష్టిలో ఎన్ని ప్రతిలింగములు, నానారూపములు కలవో, యుగాది యందు మరల ఆయాభావములు నామరూపాదులతో కన్పించును.
శ్రీ కూర్మపురాణములో ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 7 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Kūrma describes how Brahmā produced the nine-fold creation under the impulse of cosmic impressions from previous Kalpas. The creation begins with the dark Avidyā-sarga, followed by the immovable creation of mountains and trees, the animal kingdom, the divine heavenly hosts, and human beings. Furthermore, Brahmā generated the elemental Bhūta-sarga and the holy Kaumāra-sarga of Sanaka, Sanātana, Sanandana, Kratu, and Sanatkumāra, who immediately embraced supreme Vairāgya and refused to procreate. When Brahmā fell into sorrowful contemplation, Bhagavān Nārāyaṇa awakened him from Māyā, leading Brahmā to perform intense Tapas. From the anger born of intense ascetic hardship, tears fell from Brahmā's eyes and from his brow emerged Nīlalohita Śiva, who, along with his equal manifestations, agreed to create immortal beings while leaving mortal creation to Brahmā. Brahmā then created time divisions, cosmic locations, and the mental progenitors including Marīchi, Bhṛgu, Angiras, Pulastya, Pulaha, Kratu, Daksha, Atri, Vashishṭha, Dharma, and Saṁkalpa to populate the cosmos according to Vedic names and forms.