17వ అధ్యాయము

వ్యాస ఉవాచ:-

నాద్యా చ్ఛూద్రస్య విప్రోఽన్నం మోహాద్వా యది వాన్యతః

స శూద్రయోనిం వ్రజతి యస్తు భుఙ్త్కే హ్య నాపది

షణ్మాసాన్ యో ద్విజో భుఙ్త్కే శూద్ర స్యాన్నం విగర్హితమ్

జీవ న్నేవ భవే చ్ఛూద్రో మృతః శ్వా చాభిజాయతే

వ్యాస మహర్షి పలికెను.

మోహము వలన కాని ఇతర కారణముల వలన కానీ బ్రాహ్మణుడు శూద్రుని అన్నమును భుజించరాదు. ఆపదలేనపుడు శూద్రాన్నమును భుజించినచో శూద్రునిగా పుట్టును. ఆరునెలలు శూద్రాన్నమును భుజించినచో బ్రతికుండగానే శూద్రుడగును. మరణించిన తరువాత శునకముగా పుట్టును.

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రస్య చ మునీశ్వరాః

యస్యా న్నేనోదరస్థేన మృత స్తద్యోని మాప్నుయాత్

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాన్నములలో ఎవరి అన్నము కడుపులో నుండగా మృతి చెందునో ఆ జాతిలో పుట్టును.

రాజాన్నం నర్తకాన్నం చ తక్షణోన్నం చర్మకారిణః

గణాన్నం గణికన్నం చ షండాన్నం చైవ వర్జయేత్

చక్రోపజీవి రజక తస్కర ధ్వజినాం తధా

గాంధర్వలోహకారాన్నం సూతకాన్నం చ వర్జ యేత్

రాజాన్నమును నర్తకాన్నమును వడ్రంగి అన్నమును చర్మకారుల అన్నమును, బ్రాహ్మణ సమూహాన్నమును, వేశ్యాన్నమును, నపుంసకుని అన్నమును విడువ వలయును. గానుగతో బ్రతుకు వారి అన్నమును, రజకుల, తస్కరుల, మద్య విక్రేతల గాయకుల లోహికుల, సూతకుల అన్నమును విసర్జించ వలయును.

కులాలచిత్రకర్మాన్నం వార్ధు షేః పతీతస్య చ

పౌనర్భవచ్ఛత్రీకయో రభిశప్తస్య చైవహి

సువర్ణకార శైలూష వ్యాధ బద్ధాతురస్య చ

చికిత్సకస్య చైవాన్నం పుంశ్చర్యా దండికస్య చ

స్తేననాస్తిక యో రన్నం దేవతానిందకస్య చ

సోమవిక్రయిణ శ్చాన్నం శ్వపాకస్య విశేషతః

భార్యాజీతస్య చైవాన్నం యస్య చోపపతీ ర్గృహే

ఉత్సృష్ఠస్య కదర్యస్య తథైవో చ్ఛిష్టభోజినః

కుమ్మరి, చిత్రకారీ, వడ్డీ వ్యాపారి, పతితుల అన్నమును, భర్త చనిపోయిన తరువాత ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ అన్నమును, మంగలి అన్నమును, నిందితుని అన్నమును విసర్జించవలయును. స్వర్ణకారుల, నటులు, వ్యాధుల, బంధనము పొందిన వాని, వ్యాధితుని, వైద్యుని పుంశ్చలి అన్నమును దండించు వాని అన్నమును భుజించరాదు. చోరుని అన్నమును నాస్తికుల అన్నమును దేవతానించకుల అన్నమును సోమ లతను విక్రయించు వారీ ఆన్నమును, విశేషించి చండాలుని అన్నమును, భార్యా విధేయుని అన్నమును ఉపపతి ఇంటిలోనే ఉన్న భార్యా విధేయుని అన్నముసు, సమాజ బహిష్కృతుని అన్నమును, లోభి అన్నమును, ఉచ్చిష్టమును భుజించువాని అన్నమును భుజించరాదు.

అపాంక్త్య న్నం చ సంఘాన్నం శస్త్రాజీవస్య చైవహి

క్లీబ సన్యాసినో శ్చాన్నం మత్తోన్మత్తస్య చైవహి

భీతస్య రుదిత స్యాన్నం అవక్రుష్టం పరిక్షుతమ్

బ్రహ్మాద్విషః పాపరుచేః శ్రాద్ధాన్నం సూతకస్య చ

వృథాపాకస్య చైవాన్నం శావాన్నం శ్వశురస్య చ

అప్రజానాం తు నారీణాం భృతకస్య తథైవ చ

పంక్తి బహిష్కృతుని అన్నమును, సమూహాన్నమును, శస్త్ర జీవి అన్నమును, నపుంసకుని అన్నమును, సన్యాసి అన్నమును, మత్తుని ఉన్మత్తుని అన్నమును, భయపడుచున్న బౌనీ అన్నమును, ఏడ్చుచున్న వాని అన్నమును అభిశప్మనీ అన్నమును, తుమ్ము వలన అపవిత్రనుగు అన్నమును, బ్రాహ్మణులను ద్వేషించు వారి అన్నమును, పాపమునందు అభిరుచిగల వారీ అన్నమును, శ్రిద్యోన్నమును, సూతకాన్నమును, ప్రయోజన శూన్యముగా వండిన అన్నమును భుజించరాదు. (భగవన్నివేదితము కానిది) శవములు మోసి జీవించువారీ అన్నమును సోమరిగా వృత్తి శూన్యునిగా నుంటూ మామ గారింటిలో భోజనమును, సంతానము లేని స్త్రీ అన్నమును భృత్యుల భోజనమును, శిల్ప కారుల అన్నమును, విశేషించి శస్త్రముల నమ్మువాని అన్నమును భుజించరాదు.

శౌండాన్నం ఘటికాన్నం చ భిషజా మన్న మేవ చ

విద్దప్రజనన స్యాన్నం పరీవి త్త్యన్న మేవ చ

పునర్భువో విశేషేణ తధైవ దీధిషూపతేః

అవజ్ఞాతం చావధూతం సరోషం విస్మయాన్వితమ్

గురో రపి న భోక్తవ్యం అన్నం సంస్కారవర్జితమ్

దుష్కృతం హి మనుష్యస్య సర్వ మన్నే వ్యవ స్థితమ్

యో యస్యాన్నం సమశ్నాతి స తస్యా శ్నాతి కిల్బిషమ్

మద్యమును చేయువారి అన్నమును, సుతీగాయకుల అన్నమును, వైద్యుల అన్నమును, విద్ధలింగుల అన్నమును అన్నకు వివాహము కాకుండగా వివాహము చేసుకున్న తమ్ముని అన్నమును భుజించరాదు. రెండవ వివాహము చేసుకున్న స్త్రీ అన్నమును రెండవ వివాహము చేసుకున్న స్త్రీ భర్త అన్నమును విశ్లేషించి పరిత్యజించవలయును. అనాదరముతో ఇచ్చినది, తిరస్కారముతో ఇచ్చినది, కోపముతో ఇచ్చినది, ఆశ్చర్యముతో ఇచ్చినది అన్నము గురువుదైననూ భుజించరాదు. సంస్కార హీనమగు అన్నమును భుజించరాదు. మనుష్యుని పాపమంతయూ అన్నములోనే ఉండును. ఎవరి అన్నమును తినునో వారి పాపము కూడో అనుభవించవలసి వచ్చును.

ఆర్థికః కులమిత్ర శ్చ స్వగోపాల శ్చ నాపితః

ఏతే శూద్రేషు భోజ్యాన్నాః య శ్చాత్మానం నివేదయేత్

కుశీలవః కుంభకారః క్షేత్రకర్మక ఏవ చ

ఏతే శూద్రేషు భోజ్యాన్నా దత్త్వా స్వల్పం పణం బుదైః

పొయసం స్నేహపక్వం యత్ గోరసం చైవ సక్తవః

పిణ్యాకం చైవ తైలం చ శూద్రా ద్గ్రాహ్యం ద్విజాతిభిః

బ్రాహ్మణుని పొలమును సేద్యము చేసి డబ్బు సంపాదించు కొనిన వానీ అన్నమును, తాత ముత్తాతల నుండి బ్రాహ్మణుని ఇంటిలో ఉంటున్న వాని భోజనమును, తమ ఆవులను పాలించువాని అన్నమును, మంగలి అన్నమును తనను సంపూర్ణముగా బ్రాహ్మణులకు అర్పించిన వారి అన్నమును భుజించవచ్చును.

గాయకుల కుంభకారుల, రైతుల అన్నమును కొద్దిగా మూల్యమునిచ్చి భుజించవలయును. పాయసమును, నేతితో వండిన దానిని, పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలగు వానిని, సత్తు పిండిని, తెలక పిండి, నూనె ఇవి శూద్రుల నుండి గ్రహించవచ్చును.

వృంతాకం నాలికాశాకం కుసుంభోశ్మంతకం తధా

పలాండుం లశునం శుక్తం నిర్యాసం చైవ వర్జయేత్

ఛత్రాకం వీద్వరాహం చ శేలుం పీయూష మేవ చ

విలయం సుముఖం చైవ కవకానీ చ వర్జయేత్

గృంజనం కింశుకం చైవ కకుభాండం తథైవ చ

ఉదుంబర మలాబం చ జగ్ధ్వా పతతి వై ద్విజః

వంకాయ, నాలికా శాకము, అవిశపూవు, అశాంతకము, వుల్లి, వెల్లుల్లి, శుక్తము, చెట్టు బెరడును భుజించరాదు. పుట్టగొడుగు, ఊరు పంది, శ్లేష్మాతకము, జున్ను, విరిగిన పాలు, సుముఖమను శాక విశేషమును, కవకమును భుజించరాదు. గురివింద, మోదుగు, తంగేడు, మేడి, అల్ల నేరేడు భుజించినచో పతీతుడగును.

వృధా కృశర సంయావం పాయసాపూప మేవ చ

అనుపాకృత మాంసం చ దేహాన్నాని హవీంషి చ

యవాగూం మాతులింగం చ మత్స్యా నష్యనుపాకృతాన్

నీపం కపిత్థం ప్లక్షం చ ప్రయత్నేన వివర్జయేత్

వీణ్యాకం చోద్ధృతస్నేహం దేవధాన్యం తథైవ చ

రాత్రౌ చ తీలసంబంధం ప్రయత్నేన దధి త్యజేత్

నాశ్నీయా త్పయసా తక్రం న బీజా న్యుపజీవయేత్

క్రీయాదుష్టం భావదుష్టం అసత్సంగం చ వర్జయేత్

భగవంతునికి నివేదన చేయనీ నువ్వుల పొంగలిని, పాయసమును, అపూపములను సంస్కరీంచబడనీ మాంసము, దేవతలకు బలిగా సమర్పించిన అన్నమును పురోడాశాదీ హవ్యము, గంజి, కుడితి, సంస్కరించని మత్స్యములు, కదంబము, వెలగ, జువ్వులను, ప్రయత్న పూర్వకముగా విడువ వలయును. పిణ్యాకము (తెలగపిండీ) నెయ్యి నుండి తీసినవి దేవ ధాన్యము, రాత్రిపూట తీలసంబంధి పదార్థము, పెరుగు ప్రయత్నముతో విడువ వలయును. పాలతో కలిపి మజ్జిగ త్రాగరాదు. విత్తనముల నమ్మీ జీవించరాదు. భావ దుష్టము క్రియాదుష్టము దుస్సంగమును వీడువ వలయును.

కేశకీటావపన్నం చ సహృల్లేఖం చ నిత్యశః

శ్వాఘ్రాతం చ పున స్సీద్ధం చండాలావేక్షితం తథా

ఉదత్యయా చ పతితైః గవా చాఘ్రాతమేవ చ

అనర్చీతం పర్యుషితం పర్యాయాన్నం చ నిత్యశః

కాకకుక్కుటసంస్పృష్టం కృమిభి శ్చైవ సంయుతమ్

మనుష్యై రష్యవఘ్రాతం కుష్ఠినా స్పృష్ట మేవ చ

న రజస్వలయా దత్తం న పుంశ్చల్యా సరోషయా

మలవద్వాససా వాపి పరవాసోఽధ వర్జయేత్

వివత్సాయాశ్చ గోః క్షీరమౌష్ట్రం వా నిర్దశం తధా

ఆనికం సంధినీ క్షీరం అపేయం మనుర బ్రవీత్

కేశములతో కీటములతో కూడియున్నది. హృదయ చికిత్సకుపయోగించిన అన్నమును, కుక్కముట్టినది, మరల వేడి చేసినది చండాలుడు చూచినదీ రజస్వలచే, పతీతులచే, గోవుచే వాసన చూడబడినది, అనుదారముగా పెట్టినది, పొసినది, ఒకరీ అన్నమును ఇంకొకరు పెట్టినచో కొక సంస్పృష్టము, పురుగులతో కూడియున్నది, మనుష్యులు వాసన చూచినది, కుష్టువ్యాధి గలవారు తాకినది తినరాదు. రజస్వల పెట్టినది, వ్యభిచారిణీచే పెట్టబడిన, కోషించినవారు పెట్టినది, మురికి బట్టలతో పెట్టినది, ఇతరుల వస్త్రములను విడువవలయును. దూడలేని అవుపాలు, ఒంటెలు, ప్రసవించిన పదిరోజులలోపు ఆవుపాలు గొట్టిపాలు, గర్భిణీ గోవుపాలు త్రాగరాదు అని మనువు చెప్పెను.

బలాకం హంస దాత్యూహం కలవింకం శుకం తథా

కురరం చ చకోరం చ జాలపాదం చ కోకిలమ్

వాయసం ఖంజరీటం చ శ్యేనం గృధ్రం తథైవ చ

ఉలూకం చక్రవాకం చ భసం పారావతా నపి

కపోతం టిట్టిభం చైవ గ్రామకుక్కుట మేవ చ

సింహం వ్యాఘ్రం చ మార్జారం శ్వానం శూకర మేవ చ

శృగాలం మర్కటం చైవ గర్దభం చ న భక్షయేత్

న భక్షయే త్సర్వమృగాన్ పక్షిణోఽన్యా న్వనే చరాన్

జలేచరాన్ స్థలచరాన్ ప్రాణిన శ్చేతి ధారణా

గోధ కూర్మః శశః శ్వావిత్ శల్యక శ్చేతి సత్తమాః

భక్ష్యాః పంచనఖా నిత్యం మను రాహ ప్రజాపతిః

మత్స్యావ్ స శల్మాన్ భుంజీయా న్మాంసం రౌరవమేవ చ

నివేద్య దేవతాభ్య స్తు బ్రాహ్మణేభ్య స్తు నాన్యథా

మయూరం తిత్తిరం చైవ కపోతం చ కపింజలమ్

వార్ర్థాణసం బకం భక్ష్యం మినహంసపరాజితాః

శఫరం సింహతుండం చ తథా పాఠిన రోహితౌ

మత్స్యా శ్చైతే సముద్దిషా భక్షణాయ ద్విజోత్తమాః

ప్రోక్షితం భక్షయే దేషాం మాంసం చ ద్విజకామ్యయా

యథావిధి నియుక్తం చ ప్రాణానా మపి చాత్యమే

భక్షయే న్త్నెవ మాంసాని శేషభోజీ న లిప్యతే

ఔషధార్థ మశక్తౌ వా నీయోగా ద్యజ్ఞకారణాత్ 

ఆమంత్రిత స్తు యః శ్రాద్ధే దైవే వా మాంస ముత్సృజేత్

యావంతి పశురోమణి తావతో నరకా స్ర్వజేత్

అదేయం చాప్యపేయం చ తథైవా స్పృశ్య మేవ చ

ద్విజాతీనా మనాలోక్యం నిత్యం మద్య మితి స్థితిః

తస్మా త్సర్వప్రకారేణ మద్యం నిత్యం వివర్జయేత్

పీత్వా పతతి కర్మభ్య స్త్వసంభాష్యో భవే ద్ద్విజః

భక్షయిత్వా హ్యభక్ష్యాణి పీత్వాఽపేయా న్యసి ద్విజః

నాధికారీ భవే త్తావత్ యావ త్తన్న జహా త్యఘః

తస్మాత్పరిహరే న్నిత్యం అభక్ష్యాణి ప్రయత్నతః

అపేయాని చ విప్రో వై తథా చే ద్యాతి రౌరవమ్

ఇతి శ్రీ కూర్మపురాణే షట్సహస్రసంహితాయాం ఉత్తరార్థే సప్తదశోఽధ్యాయః

కొంగ, హంస, దాత్యూహ, కలవింకము, చిలుక, కురరము, చకోరము, జలపాదము, కోకిల, కాకి, కాటుకపిట్ట, డేగ, గద్ద, గుడ్లగూబ, చక్రపోకము భాసము, పార్వతము పావురము, తాబేలు, ఊరు కోడీ, సింహము, పెద్దపులి, పిల్లి, కుక్క పంది, నక్క కోతి, గాడిద మాంసములను తినరాదు. అన్ని మృగములను అన్ని పక్షులను అన్ని వనచరములను భక్షించరాదు. జలచరములను స్థలచారములను ప్రాణులను తినరాదు. ఉడుము, తాబేలు, కుందేలు, ముళ్ళఏదు, ఏదు, అయిదు అయిదు గోళ్ళుకలవి తినవచ్చునని మనువు చెప్పెను. మత్స్యములను మాంసమును దేవ బ్రాహ్మణులకు నివేదించియే భక్షించ వలయును. నివేదించక తినరాదు. నెమలీ, తిత్తిరి, పావురము, కపింజలము వార్ధాణసము, ఐకము తినదగినవి. చేపలు, హంసలు, శఫరములు సింహ తుండములు తాబేలు, లేడి, చేపలు ఇవి తీనదగినవి గా పేర్కొనబడినవీ వీటి మాంసమును పరిశుద్దిగాచించి యథావిధిగా నీయమీంచబడీయే తినవలయును. ప్రాణము పోయిననూ విధిని తప్పురాదు. మాంసములను తినరాదు. దేవతా శేషము భుజించిన తప్పులేదు. మందు కొరకో, శక్తి లేనపుడో, ఆజ్ఞవలననో, యజ్ఞకారణముననో తీనవచ్చును. శ్రాద్ధ భోజనమునకు దైవకర్మకు పిలువ బడినవారు శ్రాద్ధమున మాంసమును వడ్డించినవాడు ఆపశువు రోమములన్ని సంవత్సరాలు నరకముననివసించును. బ్రాహ్మణులు మద్యమును ఈయరాదు. త్రాగరాదు, తాకరాదు, చూడరాదు. కావున అన్ని విధములుగా ఎప్పుడూ మద్యమును పరిత్యజించవలయును. మద్యపానము చేసినవాడు పతీతుడగును. పోనీతో మాట్లాడరాదు. తినకూడని వానీని తీసిన, త్రాగకూడని వాటిని త్రాగిన ద్వేజుడు సర్వకర్మలకు అయోగ్యుడగును. కావున ఎపుడు విప్రుడు అభక్ష్యములను అపేయములను విడువవలయును. అట్లు విడువనిచో గౌరవ నరకమును పొందును.

ఇదీ కూర్మపురాణమున షట్సాహాస్ర సంహితలో ఉపరి భాగమున 17వ అధ్యాయము.