6 - అథ పృథివ్యుద్ధారః

కూర్మ ఉవాచ :

ఆసీ దేకార్లవం ఘోర మవీభాగం తమోమయమ్

శాస్తవాతాదికం సర్వం న ప్రాజ్ఞాయత కీఇ్చన

ఏకార్ణవే తదా తస్మి నష్ట స్థావరజజ్గమే

తదా సమభవ ద్బ్రహ్మా సహస్రాక్షః సహస్రపాత్

సహస్రశీర్షా పురుషో రుక్మవర్ణో హ్యతీన్షియః

బ్రహ్మా నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే తదా

ఇమం చోదాహరం త్యత్ర శ్లోకం నారాయణం ప్రతి

బ్రహ్మస్వరూపిణం దేవం జగతః ప్రభవావ్యయమ్

ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపోవై నరసూనవః

అయనం తస్య తా యస్మాత్తైన నారాయణః స్మృతః

కూర్మస్వామి చెప్పెను

మొట్టమొదట ఈ సృష్టి ఒకేసముద్రమయముగా, విభాగరహితముగా, భయంకరముగా, చీకటితోనిండి, వాయువుమొదలగునవి విరమించినట్లు, ఏమియు తెలీయరాకుండ ఉండెను.

అప్పుడు స్థావర జంగమాలన్నీ నశించి, ఒక సముద్ర రూపములో జగత్తు ఏర్పడినప్పుడు, వేయికన్నులు, వేయి పాదములు కలిగిన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను.

వేయి శిరస్సులు కలవాడు, బంగారు వర్ణము కలవాడు, ఇంద్రియములను జయించిన వాడు అగుపురుషుడు, నారాయణుడను పేరుకల పరబ్రహ్మ ఆసముద్ర జలముపై శయనించెను.

ఈ సందర్భములో నారాయణునిగూర్చి యీ శ్లోకమును ఉదాహరింతురు. ప్రపంచముయొక్క సృష్టికి కారణభూతుడు, నాశరహితుడు అగు బ్రహ్మరూపుడైన దేవుని గూర్చి ఇట్లు చెప్పుదురు.

నారములనగా ఉదకములు. అవి మనుష్యులకు ప్రభవ కారణములు. అతనికి అవి మార్గము అయిన కారణముచేత నారాయణుడని చెప్పబడుచున్నాడు.

తుల్యం యుగసహస్రస్య నైశం కాల మపాస్య సః

శర్వర్యనే ప్రకురుతే బ్రహ్మత్వం సర్గకారణాత్

తతస్తు సలిలే తస్మి న్విజ్ఞాయాం తర్గతాం మహీమ్

అనుమానా తదుద్దారం కర్తుకామః ప్రజాపతిః

జలక్రీదాసు రుచిరం వారాహం రూపమాస్థితః

అధృష్యం మనసా ప్యన్యై ర్వాజ్మయం బ్రహ్మ సంజ్ఞితమ్

పృథివ్యుద్ధరణార్థాయ ప్రవిశ్య చ రసాతలమ్

దంష్ట్రయా భ్యుజ్జహారైనా మాత్మాధారో ధరాధరః

దృష్యా దంషాగవిన్యస్తాం పృథ్వీం ప్రణిత పౌరుషమ్

అసువ ఞ్జనలోకస్థాః సిద్దా బ్రహ్మర్షయో హరిమ్

వేయి యుగాలకు సమానమైన రాత్రిమయమైన కాలాన్ని గడిపి, రాత్రి గడిచిన తరువాత ఆభగవంతుడు సృష్టికార్యకారణముగా మరల బ్రహ్మ రూపమును ధరించును.

తరువాత నీటిలో మునిగియున్న భూమిని, అనుమాన ప్రమాణముతో గుర్తించి, దానిని నీటినుండి పైకి తీయుటకు సృష్టికర్త అయిన ప్రజాపతి తలచినవాడై జలక్రీడలయందు మనోహరముగా ఉండు వరాహరూపమును ధరించినవాడై, ఇతరులకు మనస్సుచేత కూడ చలింప జేయుటకు శక్యముకాని బ్రహ్మ అనుపేరుగల వాజ్మయమును, భూమినీ జలమునుండి ఉద్ధరించుటకు పాతాళమును ప్రవేశించి, వరాహరూపుడు తన కోరతో భూమిని పైకి ఎత్తినాడు. అప్పుడు తనకు తానే ఆధారముగా కలిగిఉండెను.

వరాహ పురుషుని దండ్రకొనపై నిలుప బడిన భూమిని చూచి, జనలోకమందున్న సిద్దులు, బ్రహ్మరులు, తన పరాక్రమమును ప్రదర్శించిన విష్ణువును ప్రశంసించిరి.

ఋషయ ఊచుః

నమస్తే దేవదేవాయ బ్రహ్మణే పరమేష్ఠినే

పురుషాయ పురాణాయ శాశ్వతాయ జయాయ చ

నమః స్వయమ్ళువే తుభ్యం స్రష్ట్రే సర్వార్థ వేదినే

నమో హిరణ్యగర్భాయ వేధసే పరమాత్మనే

నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయే

నారాయణాయ దేవాయ దేవానాం హితకారిణే

నమోఽస్తుతే చతుర్వక్త్రశార్జచక్రాసిధారిణే

సర్వభూతాత్మభూతాయ కూటస్థాయ నమోనమః

నమో వేదరహస్యాయ నమస్తే వేదయోనయే

నమో బుద్ధాయ శుద్ధాయ నమస్తే జ్ఞానరూపిణే

ఋషులు ఇట్లన్నారు :

దేవతలకు దేవుడవు, పరమేష్ఠివి, బ్రహ్మదేవుడవు, పురాణపురుషుడవు, శాశ్వతుడవు, జయ రూపుడవు అగునీకు వందనము.

స్వయంభువు అయిననీకు, సమస్త విషయములు తెలిసిన సృష్టికర్తవు, హిరణ్యగర్భుడవు, పరమాత్మ స్వరూపుడవు, బ్రహ్మవు అగునీకు నమస్కారము.

వాసుదేవుడవు, ప్రపంచమునకు కారణభూతుడవు, సర్వవ్యాపివి, దేవతలకు మేలు చేయువాడవు, నారాయణదేవుడవైన నీకు నమస్కారము.

నాలుగు ముఖములు కలిగి, శార్జ్ఞమనే ధనుస్సు, చక్రము, ఖడ్గమును ధరించి, సమస్త ప్రాణులకు ఆత్మరూపుడవు. కూటస్థ పురుషుడవగు నీకు వందనము.

వేద ప్రతిపాద్యరహస్యములు కలవాడవు, వేదములకు కారణభూతుడవు, జ్ఞానాత్మకుడవు, నీర్మలాత్ముడవు అగునీకు నమస్కారము.

నమోఽస్తానన్దరూపాయ సాక్షిణే జగతాం నమః

అనన్తాయా ప్రమేయాయ కార్యాయ కరణాయ చ

నమస్తే పఞ్చభూతాయ పఞ్చభూతాత్మనే నమః

నమో మూలప్రకృతయే మాయారూపాయ తే నమః

నమోఽస్తు తే వరాహాయ నమస్తే మత్స్యరూపిణే

నమో యోగాధీగమ్యాయ నమః సంకర్షణాయ తే

నమ స్త్రీమూర్తయే తుభ్యం త్రిధామ్నే దివ్యతేజసే

నమః సిద్ధాయ పూజ్యాయ గుణత్రయవిభాగినే

నమోఽస్త్వాదిత్యరూపాయ నమస్తే పద్మయోనయే

నమోఽమూర్తియ మూర్తాయ మాధవాయ నమోనమః

ఆనందస్వరూపుడవు, లోకములకు సాక్షిభూతుడవు, అంతములేనివాడవు, కొలుచుటకు శక్యము కానివాడవు, కార్యభూతుడవు, కారణ రూపుడవును అయిన నీకు నమస్కారము.

పంచభూతాత్మకుడవు, పంచభూతముల వ్యక్తరూపుడవు, మూల ప్రకృతివి, మాయారూపుడవు అయిన నీకు వందనము.

వరాహరూపుడవు, మత్స్యరూపమును ధరించినవాడవు, యోగసాధనచేత తెలియదగినపోడవు, ఇంద్రియములను నిగ్రహించువాడవు అగునీకు నమస్సులు.

త్రిమూర్తి స్వరూపుడవు, మూడులోకములు నివాసముగా కలవాడవు, దివ్యమైన తేజస్సు కలిగిన సంకల్పసిద్దుడవు, పూజింపదగినవాడవు, సత్త్వరజస్తమోగుణములనే మూడిటి విభాగముచేయు నీకు నమస్కారము.

సూర్యస్వరూపుడవు, కమలము జన్మస్థానముగా కలవాడవు, ఆకార రహితుడవు, మూర్తిమంతుడవు, లక్ష్మీపతివి అగునీకు వందనము.

త్వయైవ సృష్ట మఖిలం త్వయ్యేవ సకలం స్థితమ్

పాలయ్తెత జ్జగత్సర్వం త్రాతా త్వం శరణం గతిః

ఇత్థం స భగవాన్ విష్ణుః సనకాద్యై రభీష్టుతః

ప్రసాద మకరో త్తేషాం వరాహవపు రీశ్వరః

తతః స్వస్థాన మానీయ పృథివీం పృథివీధరః

ముమోచ రూపం మనసా ధారయిత్వా ధరాధరః

తస్యోపరి జలౌఘస్య మహతీ నౌరవ స్థితా

వితతత్వా చ్చ దేహస్య న మహీ యాతి సంప్లవమ్

పృథివీం స సమీకృత్య పృథివ్యాం సోఽచినోద్గిరీస్

ప్రాక్సర్గదగ్ధా నఖిలాన్ తతః సర్గే దధస్మసః

ఇతి శ్రీకూర్మపురాణే పృథివ్యుద్దారో నామషష్ఠోధ్యాయః -   

ఈ సమస్తము నీచేతనే సృష్టిచేయబడినది. నీయందే అదిఅంతా నిలిచిఉన్నది. ఈ సమస్తలోకాన్ని కాపాడుము. నీవే రక్షకుడవు, శరణమైన వాడవు. దిక్కునీవే.

ఈవిధముగా ఆవిష్ణువు సనకాదిమునులచేత స్తోత్రము చేయబడినవాడై, వరాహరూపము ధరించిన ఆ భగవంతుడు వారియందు అనుగ్రహము చూపెను.

తరువాత భూమిధరుడైన ఆవరాహపురుషుడు, భూమిని తనపూర్వపు స్థానమును పొందించి, మనస్సులో ధ్యానించుకొని ఆవరాహ రూపమును విడిచిపెట్టెను.

ఆనీటి సమూహము యొక్క పైభాగములో భూమి పెద్దనామవలే నిలిచి ఉండెను. దాని ఆకారము చాలా విశాలముగా వ్యాపించిఉన్నందు. వలన భూమి నీటిలో ప్రయాణము చేయకుండెను.

వరాహరూపి యగునీశ్వరుడు భూమిని సమానముగాచేసి, దానియందు పర్వతములను నిలిపెను. పూర్వకల్పములో నశించినవానినన్నిటిని మరల సృజించుటకు సంకల్పించెను.

శ్రీ కూర్మపురాణములో షృథివ్యుద్ధారమను ఆరవ అధ్యాయము సమాప్తము.