కూర్మ మహా పురాణము
14 - స్వాయంభువ మను వంశము
సూత ఉవాచ –
ప్రియవ్రతోత్తానపాదౌ మనోః స్వాయమ్భువస్య తు ।
ధర్మజ్ఞౌ తౌ మహావీర్యౌ శతరూపా వ్యజీజనత్ ॥
స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు ధర్మము తెలిసినవారు, గొప్ప పరాక్రమము కలవారు అగు పుత్రులను ‘శతరూప’ కనెను.
తత స్తూత్తానపాదస్య ధ్రువో నామ సుతోఽభవత్ ।
భక్త్యా నారాయణే దేవే ప్రాప్తవాన్ స్థాన ముత్తమమ్ ॥
ధ్రువా చ్ఛిష్టిశ్చ భావ్యశ్చ భావ్యా చ్ఛముర్వ్యజాయత ।
శిష్టే రాధత్త సుచ్ఛాయా పఞ్చ పుత్రా నకల్మషాన్ ॥
వసిష్ఠవచనా ద్దేవీ తప స్తప్త్వా సుదుశ్చరమ్ ।
ఆరాధ్య పురుషం విష్ణుం శాలగ్రామే జనార్దనమ్ ॥
రిపుం రేపుఞ్చయం విప్రం కపిలం వృషతేజసమ్ ।
నారాయణపరా స్శుద్దాన్ స్వధర్మపరిపాలకాన్ ॥
రీపో రాధత్త మహిషీ చాక్షుషం సర్వతేజసమ్ ।
సోఽజీజన త్పుష్కరిణ్యాం సురూపం చాక్షుషం మనుమ్ ॥
తరువాత ఆ ఉత్తానపాదునికి ధ్రువుడను కుమారుడు కలిగెను. అతడు భగవంతుడైన నారాయణుని యందలి భక్తి చేత శ్రేష్టమైన స్థానమును పొందెను.
ఆ ధ్రువుని వలన శిష్టి, భావ్యుడు అను వారు జన్మించగా, భావ్యుని వలన శంభువు పుట్టెను. శిష్టి వలన అతని భార్య సుచ్ఛాయ పాప రహితులైన అయిదుగురు కుమారులను కనెను.
ఆ సుచ్ఛాయ వసిష్టుని మాట ప్రకారం మిక్కిలి కష్ట సాధ్యమైన తపస్సుచేసి, శాలగ్రామ క్షేత్రము వద్ద జనార్దనుడైన విష్ణుదేవుని పూజించి,
రీపువు, రిపుంజయుడు, విప్రుడు, కపిలుడు, పృషతేజసుడు అను గష్ణుభక్తులు, నీర్మలులు, స్వధర్మమును పరిపాలించువారును అగు పుత్రులను పొందినదీ.
రిపువు వలన అతని భార్య, సంపూర్ణ తేజస్సు కలిగిన, చక్కని రూపము కలిగిన చాక్షుష మనువును పుష్కరిణి యందు పుత్రునిగా పొందెను.
ప్రజాపతే రాత్మజాయాం వీరణస్య మహాత్మనః ।
మనో రజాయన్త దశ సుతా స్తే సుమహౌజసః ॥
కన్యయాం సుమహావీర్యో వైరాజస్య ప్రజాపతేః ।
ఊరుః పురుః శతద్యుమ్న స్తపస్వీ సత్యవాక్ఛుచిః ॥
అగ్నిష్టు రతిరాత్రశ్చ సుద్యుమ్న శ్చాభిమన్యుకః ।
ఊరో రజనయ త్పుత్రాన్ షడాగ్నేయీ మహాబలాన్ ॥
అఙ్గం సుమనసం ఖ్యాతిం క్రతు మాజ్గిరసం శివమ్ ।
అఙ్గా ద్వేనో ఽ భ వ త్పశ్చాద్వైన్యో వేనా దజాయత ॥
యోఽసౌ పృథురితి ఖ్యాతః ప్రజాపాలో మహాబలః ।
యేన దుగ్థా మహీ పూర్వం ప్రజానాం హితకామ్యయా ॥
మహాత్ముడగు వీరణుడను మనువుకు ప్రజాపతి యొక్క కూతురి యందు చాల గొప్ప బలము కలిగిన పదిమంది కుమారులు కలిగిరి.
విరాట్పుత్రుడైన ప్రజాపతి యొక్క కన్యయందు గొప్పపరాక్రమము కల ఊరువు, పురువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, శుచి, అగ్నిష్ణుత్తు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అని ఆ పది మంది కుమారులపేర్లు- ఆగ్నేయి అనునామే, ఊరువు వలన ఆరుగురు కుమారులను, గొప్పబలవంతులను కనెను.
అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, ఆంగిరసుడు, శివుడు అని వరుసగా వారి పేర్లు. అంగుని వలన వేనుడను పుత్రుడు కలుగగా, అతనికి వైన్యుడను వాడు జన్మించెను.
ఏ యీ వేనపుత్రుడు పృథువను పేరుతో ప్రసిద్ధుడు, గొప్పుబలము కలవాడు ప్రజలను పాలించెనో, ఎవని చేత పూర్వము ప్రజల యొక్క మేలును కోరి భూమి పితుక బడినదో;
నియోగా ద్రహ్మణః సార్థం దేవేన్దేణ మహౌజసా ।
వేనపుత్రస్య వితతే పురా పైతామహే మభే॥
సూత: పౌరాణికో జజ్జీ మాయారూప।
స్వయం సరీః ప్రసక్తా సర్వశాస్త్రాణాం ధర్మజ్లో గురువత్సల॥
తం మాం విత్త ముని శ్రేష్టాః పూర్వోద్భూతం సనాతనమ్।
అస్మి నన్వన్తరే వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్॥
శ్రావయానస మాం ప్రీత్యా పురాణః పురుషో హరిః ।
సుదస్వయే తు యే సూతాః సంభూతో వేదపర్జితాః ॥
తేషాం పురాణవక్తృత్వం వృత్తి రాసీ దజాజ్ఞయా।
స చ వైన్యః పృధుద్ధీమా న్సత్యసనో జితేన్షియః ॥
బ్రహ్మదేవుని శాసనమువలన గొప్పబలవంతుడైన ఇంద్రునితో కూడ, వేనుని కుమారుడైన పృధువుతో, పూర్వము బ్రహ్మదేవుని చేత చేయించబడిన యజ్ఞము నందు,
సూతుడను పౌరాణికుడుగా మాయారూపుడగు విష్ణువే స్వయముగా అవతరించెను. అతడు అన్ని శాస్త్రములను గూర్చి బోధించువాడు, ధర్మము తెలిసినవాడు, పెద్దల యందావరము కలవాడుగా ఉండెను.
ఓ ముని శ్రేష్ఠులారా ఆ సూత పౌరాణికుని, పూర్వమే అవతరించిన, అతి పురాతనుడనైన నన్నుగా తెలిసికొనుడు. ఈ మన్వంతరమందు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు,
పురాణ పురుషుడైన హరియొక్క రూపొంతరమైన వాడు, స్వయముగా ప్రేమతో నాకు వినిపించినాడు. (పురాణకథలను) నావంశములో జన్మించిన వేదాధికారము లేని యే సూత వంశ, జులు కలరో
వారికి బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత పురాణములను ప్రవచించుట వృత్తిగా ఏర్పడింది. పూర్వము చెప్పబడిన వేన పుత్రుడైన ఆ పృథువు బుద్ధి మంతుడు, సత్యవ్రతము కలవాడు, ఇంద్రియములను జయించినవాడుగా ఉండెను.
సార్వభౌ మహాతేజాః స్వధర్మపరిపాలకః।
తస్య బ్యాత్ ప్రభృత్యేవ భక్తీ ర్నారాయణ్ ఖైభవత్॥
గోవర్ధనం ప్రొప్త సప సేపే జితే నియ।
తపసా భగవా నీతః శంఖచక్రగదాధరః ॥
ఆగత్య దేవో రాజానం ప్రాహ దామోదరః స్వయమ్ ।
భార్మీకే రూపసమ్పన్నౌ సర్వశస్త్ర భృతాం వరౌ ॥
ముత్రసాదా డసస్టిగ్గా పుత్రా తప భవిష్యతః ।
ఏవ ముక్త్వా హృషీకేశః స్వకీయం ప్రకృతిం గతః॥
వైనోవి పి వేదవిధిని నిశ్చలాం భక్తి ముద్వహన్।
సోఽపాలయ త్స్వకం రాజ్యం చిన్తయ స్మధుసూదనమ్॥
విశాలమైన భూమిని పాలించువాడు, గొప్ప తేజస్సు కలవాడు, తన ధర్మమును చక్కగా పరిపాలించుపొడు ఆ పృధువు. అతనికి చిన్నతనము నుండి యే నారాయణుని యందు భక్తి కలిగినదీ, అతడు గోవర్థనపర్వతమును చేరుకొని, ఇంద్రియములను జయించిన వాడై తపస్సు చేసెను. అతని తపస్సు చేత శంఖ చక్రములను, గదను ధరించిన భగవంతుడగు విష్ణువు సంతోషించెను.
దామోదరుడగు ఆ విష్ణువు స్వయముగా వచ్చి రాజును గూర్చి ఇట్లు పలికెను. ఈ ధర్మమును పాలించుపోరు, సౌందర్యముతో ఒప్పువారు, ఆయుధములు ధరించిన వారందరిలో శ్రేష్ఠులు, అగు ఇద్దరు కుమారులు నా అనుగ్రహము వలన నీకు నిశ్చయముగా కలుగుదురు ఈ విధముగా చెప్పి నారాయణుడు మరల తసనీవాసమున కరిగెను. వేసపుత్రుడైన పృధువు కూడ వేదములందు చెప్పబడిన పద్ధతి ప్రకారము నిశ్చలమైన భక్తిని కలిగి, మధుసూదనుడైన విష్ణువును ధ్యానించుచు తన రాజ్యమును పరిపాలించెను.
అచిరాదేవ తన్వజీ భార్యా తస్య శుచిస్మితా ।
శిఖణ్ణనం హర్ధాన మస్తర్ధానా ద్యజాయత ॥
శీఖడ్జినో భవ త్పుత్రః సుశీల ఇతి విశ్రుతః ।
ధార్మికో రూపసమ్పన్నో వేదవేదాఙపారగ॥
సోధీత్యవిధివ ద్వేణాస్ ధర్మేణ తపసిఃస్థిత।
మతిం చక్రే భాగ్యయోగా త్సన్యాసంప్రతి ధర్మవిత్ ॥
స కృత్వా తీరసంసేవాం స్వాధ్యాయే తపసి స్థితః।
జగామ హిమవత్పృష్టం కదాచి త్సిద్దసేవితమ్ ॥
తత్ర ధర్మవనం నామ ధర్మసిద్దిప్రదం వనమ్।
అపశ్య ద్యోగినాం గమ్య మగమ్యం బ్రహ్మవిద్విషామ్॥
తత్ర మన్దాకినీ నామ సుపుణ్యా విషళా నదీ ।
పద్మోత్సలవనోపేతా సిద్ధాశ్రమవిభూషితా ॥
కొద్దికాలమునకే సన్నని శరీరము కలది, స్వచ్ఛమైన చిరునవ్వు కలది అగు అతని భార్య ఆగ్నిహోత్రరూపుడైన శిఖండిని హవిరానుని అంతర్థానమై పుత్రునిగా పొందెను.
ఆ శీఖండికి సుశీలుడని ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతడు ధర్మము నాచరించువాడు, సౌందర్యము కలవాడు, వేదములు వేదాంగముల యొక్క పొగమును చూచిన వాడుగా ఉండేను.
అతడు శాస్త్రము ప్రకారము వేదములను చదివి ధర్మమార్గముతో తపస్సునందు పూనిక కలవాడై, అదృష్ట వశముచే ధర్మవిదుడైన వాడై సన్న్యాసమునందు బుద్ధిని నిలిపెను.
ఆ సుశీలుడు తీర్ధ స్థలములను సేవించి, వేదాధ్యయనము నందు, తపస్సునందు నిష్ఠకలవాడై ఒక సమయమున సిద్ధులచేత సేవించబడుచున్న హిమాలయశిఖరమును చేరెను.
అక్కడ ధర్మవనమను పేరుగల ధర్మసిద్ధిని కలిగించునది, యోగులకు పొందదగినది, వేదశత్రుపులకు గోచరము కానిది అగు వనము నాతడు చూచెను.
అక్కడ పుణ్యవతి, నిర్మలమైనది, కమలములు, కలువలతో కూడినది, సిద్ధుల ఆశ్రమాలచే అలంకరింపబడిన మందాకిని అనునది (ఉండెను).
స తస్యా దక్షిణే తీరే మునీనై రోగిభి ర్యుతమ్ ।
సుపుణ్య మాశ్రమం రమ్య మపశ్య శ్రీమతిసంయుతః॥
మన్దాకినీజలే స్నాత్వా సన్తర్ప్య పితృదేవతాః ।
అర్చయిత్వా మహాదేవం పుషైః పద్మోత్సలాదిభిః ॥
ధ్యాత్వా ర్కసంస్థ మీశానం శిరస్యాధాయ చాజలిమ్ ।
సంప్రేక్షమాణో భాస్వస్తం తుష్టావ పరమేశ్వరమ్ ॥
రుద్రాధ్యాయేన గిరిశం రుద్రస్య చరితేన చ అన్యైశ్చ ।
వివిధైః స్తోతైః శామ్భవై ర్వేదసంభవైః ॥
అథాస్మిన్ననరే పశ్య త్సమాయాత్తం మహామునిమ్ ।
శ్వేతాశ్వతరనామానం మహాపాశుపతోత్తమమ్॥
అతడు దానియొక్క దక్షిణతీరమందు ముని శ్రేష్ఠులతో, యోగులతో కూడియున్న మిక్కిలి పుణ్యప్రదమైన, అందమైన ఆశ్రమమును ప్రీతితో చూచెను.
ఆమందాకిని నీటిలో స్నానము చేసి, పితృదేవతలకు తర్పణములిచ్చి, తామరలు కలువలు మొద పుష్పములతో మహాదేవుని పూజించి;
సూర్యమండలములో నివసించుదేవుని ధ్యానించి, తల పై దోసిలి ఒగ్గి సూర్యునివైపు చూచుచు, పరమేశ్వరుని స్తోత్రము చేసెను.
వేదములోని రుద్రాధ్యాయముతో, రుద్రుని చరిత్ర పఠనముతో, ఇతరములైన అనేక విధముల స్తోత్రములతో, వేదములందు చెప్పబడిన శివునికి సంబంధించిన మంత్రములతో, స్తుతించెను
ఇంతలో తన వద్దకు వచ్చుచున్న శ్వేతాశ్వతరుడను పేరుగల, పాశుపతులలో గొప్పవాడైన మహామునిని ఆ సుశీలుడు చూచెను.
భస్మసల్జిఢసర్వాణ్ణం కౌపీనాచ్ఛాదనాన్వితమ్ ।
తపసా కర్శితాత్మానం శుక్లయజ్ఞోపవీతినమ్॥
సమాప్య సంస్తవం శంభో రానన్దాస్రవిలేక్షణ : ।
వవన్డే శిరసా పాదౌ ప్రాంజలి ర్వాక్య మబ్రవీత్ ॥
ధన్యో 2స్యనుగృహీతో ఒస్మి యన్మే సాక్షా న్మునీశ్వర ।
యోగీశ్వరో ఒద్య భగవాన్ దృష్ణో యోగవిదాం వరః॥
అహో మే సుమహ ద్భాగ్యం తపాంసి సఫలోని ।
మేకిం కరిష్యామీ శిష్యో ఒహం తవ మాం పాలయానఘ ॥
సో నుగృహ్యాద రాజానం సుశీలం శీలసంయుతమ్।
శిష్యత్వే ప్రతిజగ్రహ తపసా క్షీణకల్మషమ్ ॥
భస్మము లేపనము చేయబడిన సమస్తావయవములు కలవాడు, కౌపీనమను ఆచ్చాదన వస్త్రముతో కూడి యున్నవాడు, తపస్సుచేత కృశించిన శరీరము కలవాడు, తెల్లని యజ్ఞోపవీతము ధరించినవాడు అగు మునీని చూచేను.
అతడు శివుని స్తోత్రమును ముగించి, ఆనంద బాష్పములతో తడిసిన కన్నులు కలవాడై తన తలతో అతని పాదములకు ప్రణామము చేసెను. చేతులు జోడించి యీ వాక్యము పలికెను. ఓ మునీశ్వరా యోగీశ్వరుడవు, యోగవేత్తలలో శ్రేష్టుడవు, భగవంతుడవగు నీవు సాక్షాత్కరించినావు. అందువలన నేను ధన్యుడనైనాను. అనుగ్రహింపబడినాను.
ఆహా ఏమి నాయొక్క గొప్ప అదృష్టము నాతపస్సులు ఫలవంతములైనవి. నీ శిష్యుడనైన నేను మీకు ఏమి సేవచేయవలెనో చెప్పి, పుణ్యాత్ముడా నన్ను రక్షింపుము.
ఆశ్వేతాశ్వతరమహాముని శీలవంతుడు. రాజు అగు సుశీలుని అనుగ్రహించి, తపస్సు చేత నశించిన పాపములు కల అతనిని తన శిష్యుడుగా స్వీకరించెను.
సొన్న్యాసికం విధిం కృత్స్నం కారయిత్వా విచక్షణః ।
దదౌ తదైశ్వరం జ్ఞానం స్వశాభావిహితవ్రతమ్ ॥
అశేషం వేదసారం తత్పశుపాశ విమోచనమ్ ।
అన్యాశ్రమ మితి ఖ్యాతం బ్రహ్మాదిభి రనుష్ఠితమ్ ॥
ఉచ శిష్యా స్సంప్రేక్ష్య యే తదాశ్రమవాసినః।
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా బ్రహ్మచర్యపరాయణా ॥
మయా ప్రవర్తితాం శాఖా మధిత్యై వేహ యోగినః ।
సమాసతే మహాదేషం ధ్యాయనో విశ్వ మైశ్వరమ్ ॥
ఇపు దేవో మహాదేవో భయమాణః సహోమయా ।
అధ్యాస్తే భగవానీశో భక్తానా మనుకమ్పయా ॥
సన్యాసమునకు సంబంధించిన శాస్త్రవిధిని సంపూర్ణముగా జరిపించి, వివేకవంతుడైన అతడు తమ శాఖయందు విధింపబడిన వ్రతనీయమముకల ఈశ్వర విషయక జ్ఞానము నతనికుపదేశించెను.
ఆ జ్ఞానము సమస్త వేదములందలి సారభూతము, ప్రాణుల బంధ రూపాలైన పాశములను విడిపించునది. బ్రహ్మ మొదలగు వారిచే ఆచరింపబడిన చీపరీ ఆశ్రమమనీ ప్రసిద్ధమైనది.
ఆ ముని ఆశ్రమములో నివసించు వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, బ్రహ్మచర్య వ్రతమును పాటించువారును అగు యే శిష్యులు కలరో, వారిని చూచి ఆ ముని ఇట్లనెను.
ఇక్కడ యోగులు, సొచేత ప్రవర్తింప జేయబడిన శాఖను అధ్యయనము చేసియే, ఈశ్వర నిర్మితమైన విశ్వమును ధ్యానించుచు మహాదేవుడగు శివుని సేవించుచున్నారు. ఇక్కడ మహాదేవుడగు శివుడు పార్వతీదేవితో విహరించుచు, భక్తుల యందలి దయాగుణముతో నివసించి ఉన్నాడు.
ఇహాశేషజగద్ధాతా పురా నారాయణః స్వయమ్ ।
ఆరాధయ న్మహాదేవం లోకానాం హితకామ్యయా॥
ఇహైనం దేవ మీశానం దేవానా మపి దైవతమ్ ।
ఆరాధ్య మహతీం సిద్ధిం లేఖినే దేవదానవోః॥
ఇహైవ మునయ స్సర్వే మరీచ్యాద్యా మహేశ్వరమ్।
దృష్ట్వా తపోబలాద్ జ్ఞానం లేభిరే సార్వకాలికమ్ ॥
తస్మా త్వమపి రాజేన్త తపోయోగసమన్వితః ।
తిష్ఠ నిత్యం మయాసార్ధం తతః సిద్ధి మవాప్స్యసీ ॥
ఏవ మాభాష్య విపేన్లో దేవం ధ్యాత్వా పినాకినమ్ ।
ఆచచక్షే మహామన్తం యథావ త్సర్వసిద్ధయే ॥
ఈ ప్రదేశములో పూర్వము సమస్త లోకములను సృష్టించిన నారాయణుడు స్వయముగా, లోకముల మేలుసుకోరి, మహాదేవుని పూజించెను.
ఇక్కడ దేవతలకు గూడ దేవుడైన ఈశాన దేవుని ఆరాధించి దేవతలు, రాక్షసులు కూడ గొప్ప సిద్ధిని పొందిరి.
ఇచ్చటనే మరీచి మొదలగు మునులందరు మహేశ్వరుని దర్శించి, తమ తపస్సు యొక్క బలమువలన సర్వకాలీనమైన జ్ఞానమును పొందినారు.
ఓ రాజా అందువలన నీవు కూడ తపస్సు, యోగముతో కూడిన పొడవై నాతో కూడ ఎల్లప్పుడు ఉండుము. దాని వలన నీవు సిద్ధినిపొందగలవు.
ఆ బ్రాహ్మణోత్తముడీవిధముగా పలికి, భగవంతుడైన శివుని ధ్యానించి, అతనికి సర్వసిద్ధులు కలుగుటకు గాను మహా మంత్రమును విధి ప్రకారముపదేశించెను.
సర్వపాపోపశమనం వేదసారం విముక్తిదమ్।
అగ్ని రిత్యాదికం పుణ్య మృషిభిః సంప్రవర్తితమ్ ॥
సో2పి తద్వచనా ప్రొజా సుశీలః శ్రద్ధయాన్వితః।
సాక్షాతాశుపతో భూత్వా వేదాభ్యాసరతోఽభవత్ ॥
భస్మోద్ధూలితసర్వాణ్ణః కస్టమూలఫలాశనః ।
శాన్తో దాన్తో జితక్రోధః సంన్యాసవిధి మాశ్రితః ॥
హవిర్ధాన స్తథాగ్నేయ్యాం జనయామాస వై సుతమ్।
ప్రాచీనబర్హిషం నామ్నా ధనుర్వేదస్య పారగమ్॥
ప్రాచీనబర్షి ద్భగవాన్ సర్వశస్తభృతాంవరః।
సముద్రతనయాయాం వై దశపుత్రా నజ్జనత్ ॥
ఆ మంత్రము సమస్త పాపములను తొలగించునది, వేదముల సారభూతమైనది, మోక్షమునిచ్చునది, “అగ్నిః” అనునది ఆదియందుకలిగి ఋషులచేత ప్రవర్తింప జేయబడిన పుణ్యమైనది.
ఆ సుశీలుడను రాజుకూడ, అతని మాటలవలన శ్రద్ధతో కూడినవాడై, సాక్షాత్తుగా పాశుపతుడై వేదాభ్యాసమునందు నిమగ్నుగాడాయెను.
భస్మము చేత పూయబడిన సమస్త శరీరము కలవాడు, దుంపలు, వేర్లు, పండ్లు ఆహారముగా కలవాడై, శాంతుడు, ఇంద్రియముల నచినవాడు, కోపమును జయించినవాడు, సంస్యాసవీధి నాశ్రయించినవాడుగా ఆయెను.
హవిర్ధానుడు ఆగ్నేయి యనుభార్యయందు విలువిద్యయందు పారంగతుడైన ప్రాచీనబర్హిషుడను పేరుగల కుమారుని పొందెను.
పూజనీయుడైన ప్రాచీనబర్హి, ఆయుధములను ధరించిన వారందరిలో శ్రేష్ఠుడై సముద్రతనయ యగు తన భార్య యందు పదుగురు కుమారులను కనెను.
ప్రచేతస స్తే విఖ్యాతా రాజానః ప్రథితాజసః।
అధీతవస్తః స్వం వేదం నారాయణపరాయణాః॥
దశభ్య సు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః।
దక్ష జట్లే మహాభాగో యః పూర్వం బ్రహ్మణః సుతః ॥
స తు దక్షో మహేశేన రుద్రేణ సహ ధీమతా।
కృత్వా వివాదం రుద్రేణ శక్తః ప్రాచేతసో భవత్॥
సమాయాస్త్రం మహాదేవో దక్షం దేవ్యా గృహం హరః ।
దృష్ట్వా యథోచితాం పూజాం దక్షాయ ప్రదదౌ స్వయమ్॥
తదాపై తమసావిష్టః సోధిజాం బ్రహ్మణః సుతః।
పూజా మనర్జా మన్వచ్ఛస్ జగామ కుపితో గృహమ్ ॥
ఆ కుమారులు ప్రసిద్ధమైన బలముకల రోజులుగా ప్రచేతసులు అని ప్రఖ్యాతులైరి. తమ శాఖ వేదము నధ్యయనము చేసి నారాయణుని యందు భక్తి కలవారుగా ఉండిరి.
ఆ పదిమంది ప్రచేతసుల వలన మారిష అను స్త్రీ యందు పూర్వము బ్రహ్మదేవుని కుమారుడుగా నుండిన మహానుభావుడైన దక్షప్రజాపతి జన్మించెను.
ఆ ప్రాచేతసుడగు దక్షుడు ధీమంతుడైన మహేశ్వరునితో వివాదము కలిగించుకొని, అతనిచేత శపింపబడేను.
మహాదేవుడైన శివుడు తన దేవియొక్క ఇంటికి వచ్చుచున్న దక్ష ప్రజాపతిని చూచి, అతనికి తగిన అతిథి సత్కారమును స్వయముగా చేసెను.
అప్పుడు బ్రహ్మదేవుని కుమారుడైన దక్షుడు క్రోధముచే ఆక్రమింపబడినవాడై, తనకు జరిగిన సత్కారము తగినదిగా లేదని భావించి తన యింటికి వెళ్ళిపోయెను.
కదాచి త్స్వగృహం ప్రాప్తాం సతీం దక్షః సుదుర్మనాః।
భర్రా సహ వీనింద్యైనాం భరయామాస వై రుషా ॥
అన్యే జామాతరః శ్రేష్టా భర్డు స్తవ పినాకినః।
త్వ మప్యసత్సుతా స్మాకం గృహా ద్గచ్ఛ యథాగతమ్॥
తస్య త ద్వాక్య మాకర్ణ్య సా దేవీ శంకరప్రియా।
వినిన్త్య పితరం దక్షం దదా హాత్మాన మాత్మనా॥
ప్రణమ్య పశుభర్తారం భర్తారం కృత్తివాససమ్।
హిమవద్దుహితా సా భూ త్తపసా తస్య తోషితా॥
జ్ఞాత్వో తాం భగవే స్రుద్రః ప్రపన్నార్తిహరో హరః ।
శశాప దక్షం కుపితః సమాగత్యాథ తధృహమ్ ॥
తరువాత ఒక సమయమున తన యింటికి వచ్చిన తన పుత్రికయగు సతీదేవిని దక్షుడు, మిక్కిలి చెడ్డ మనస్సు కలవాడై భర్తతో కూడ ఆమెను నిందించి బెదరించెను.
నీ భర్తయగు శివునికంటే నా తక్కిన అల్లుండ్లందరు శ్రేష్ఠులైనవారు. నీవు కూడా మా పుత్రికలలో దుష్టులవు. అందువలన ఇక్కడి నుండి వచ్చిన దారిలో వెళ్ళుము.
ఆ దక్షుని వాక్యమును వినీ శంకరునీ భార్యయగు సతీదేవి, తన తండ్రియగు దక్షుని దూషించి, తన శరీరమును అగ్నిలో దహించు కొనేను. (పశుపతి, చర్మమును వస్త్రముగా ధరించిన భర్తయగు శివునకు నమస్కరించి ఆత్మత్యాగము కావించుకొనెను. తరుపోత ఆ సతీదేవి హిమవంతుని తపస్సుచే సంతోషించినదై అతనికి పుత్రికగా జన్మించెను.
ఆశ్రయించిన వారి బాధలను తొలగించు భగవంతుడగు రుద్రుడు, ఆమెను తన భార్యగా గుర్తించి, ఆమె మరణమునకు కారణమైన దక్షుని యింటికి వచ్చి అతనిని శపించెను.
త్యక్త్వా దేహ మిమం బ్రాహ్మం క్షత్రియాణాం కులే।
భవ స్వస్యాం సుతాయాం మూఢాత్మా పుత్ర ముత్పాదయిష్యసి ॥
ఏవ ముక్త్వా మహాదేవో యయా కైలాసపర్వతమ్।
స్వాయంభువో పి కాలేన దక్ష ప్రాచేత సో భవత్॥
ఏత ద్వః కథితం సర్వం మనోః స్వాయమ్భువస్య తు।
నిసర్గం దక్షపర్యస్తం శ్రుణ్వతాం పాపనాశనమ్ ॥
ఇతి శ్రీ కూర్మపురాణే రాజవంశానుకీర్తనే చతుర్దశోధ్యాయ।
ఈ బ్రహ్మ సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి క్షత్రియ వంశములో పుట్టుము. నీవు మూడబుద్ధి కలవాడవై నీ పుత్రిక యందే కుమారునికి జన్మనీయగలవు.
ఇట్లు పలికీ మహాదేవుడగు శివుడు కైలాస పర్వతమునకు వెళ్ళేను. ఆ స్వాయంభువుడగు దక్షుడు కూడా కొంతకాలమునకు ప్రాచేతసుడుగా పుట్టెను.
ఇది అంతయు స్వాయంభువ మనువు యొక్క చరిత్ర, దక్షుని వరకు జరిగిన దానిని వీను వారి పాపములను తొలగించు దానిని మీకు చెప్పినాను.
శ్రీ కూర్మపురాణములో రాజవంశానుకీర్తన మందు పదునాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 14 of the Kūrma Mahā Purana is as follows:
Sūta narrates the progeny of Svāyambhuva Manu through his sons Priyavrata and Uttānapāda. Uttānapāda's son Dhruva attained an eternal heavenly station through unwavering devotion to Nārāyaṇa. In his lineage appeared Chākshusha Manu and King Vena, whose son Pṛthu was an expansion of Vishṇu who milked the Earth for humanity's sustenance, during whose sacrifice Sūta himself manifested as a divine chronicler. Pṛthu's descendant King Susheela, a pious ruler devoted to Nārāyaṇa, renounced his kingdom to pursue severe asceticism in the Himalayas. At Mandākinī river, Susheela met the great sage Śvetāshvatara, embraced the sacred Pāshupata Vrata, smeared his body with holy ash, and attained highest spiritual wisdom. In the same lineage appeared the ten Prachetas, who married Mārishā and re-begot Daksha Prajāpati. When Daksha insulted Mahādeva and mistreated Satī, Satī immolated Her body in yogic fire, prompting the destruction of Daksha's sacrifice by Vīrabhadra, illustrating the supreme necessity of honoring Mahādeva.