11వ అధ్యాయము

ఈశ్వర ఉవాచః:-

అతః పరం ప్రవక్ష్యామి యోగం పరమదుర్లభమ్

యోగాత్మానం ప్రపశ్యంతి భానుమంత మివేశ్వరమ్

ఈశ్వరుడు చెప్పెను.

ఇకమీద అత్యంత దుర్లభమైన యోగమును వివరించేదను. ఈయోగము చేత సూర్యుని సాక్షాత్కరించుకొనునట్లు ఈశ్వర సాక్షాత్కారము పొందగలరు.

 యోగాగ్ని ర్దహతి క్షిప్ర మశేషం పాపపంజరమ్

 ప్రసన్నం జాయతే జ్ఞానం సాక్షా న్నిర్వాణసిద్ధిదమ్

యోగాత్ సంజాయతే జ్ఞానం జ్ఞానా ద్యోగః ప్రవర్తతే

యోగజ్ఞానాభియుక్తస్య ప్రసీదతి మహేశ్వరః

ఏకకాలం ద్వికాలం వో శ్రీకాలం నిత్య మేవ వా  యే

యుంజంతీహ మద్యోగం తే విజ్ఞేయా మహేశ్వరాః

యోగాగ్ని త్వరితముగా సకలపాపరాశిని భస్మము చేయగలదు. సాక్షాత్తు మోక్షమును ప్రసాదించు ప్రసన్నమైన జ్ఞానము కలుగును. యోగము వలన జ్ఞానము కలుగును. జ్ఞానము యోగమును ప్రవర్తింపజేయును. యోగ జ్ఞానములు కలవారికి ఈశ్వరుడు ప్రసన్నుడగును. ప్రతి దినము ఒకమారు, రెండు మారులు లేదా మూడుమారులు లేక అన్ని కాలములందు నా యోగసాధనలో నున్నవారు సాక్షాత్తు మహేశ్వరుడనియే తెలియవలెను.

యోగ స్తు ద్వివిధో జ్ఞేయో హ్యభావః ప్రధమో మతః

అపరస్తు మహాయోగః సర్వయోగోత్తమోత్తము

శూన్యం సర్వనిరాభాసం స్వరూపం యత్ర చింత్యతే

అభావయోగ స్స ప్రోక్తో యేనాత్మానం ప్రపశ్యతి

యత్ర పశ్యతి చాత్మానం నిత్యానందం నీరంజనమ్

మయైక్యం స మహాయోగో భాషితః పరమేశ్వరః

యోగము రెండు విధములుగా తెలియుము. మొదటిది అభావయోగము, రెండవది సర్వయోగములలో ఉత్తమ యోగమనబడు మహా యోగము. నిర్వికల్ప స్వరూపము ధ్యానించబడునది అభావ యోగము. దీనివలన యోగాత్మను దర్శించగలుగును. ఇక నిత్యానంద రూపుడు, నిరంజనుడునగు పరమాత్మ దర్శనము చేయించునది, నాలో ఐక్యము కలిగించునది మహాయోగమనబడును.

 యే చాన్యే యోగినాం యోగాః శ్రూయతే గ్రంథవిస్తరే

సర్వే తే బ్రహ్మయోగస్య కలాం నార్హంతి షోడశీమ్

యత్ర సాక్షా త్ప్రపశ్యంతి విముక్తి విశ్వ మిశ్వరమ్

సర్వేషా మేవ యోగానాం స యోగః పరమో మత

సహస్రశోథ శతశో యే చేశ్వరబహిష్కృతాః

న తే పశ్యంతి మా మేకం యోగినో యతమానసాః

ఇతర గ్రంథములలో యోగులు ఆచరించు ఇతర యోగములు చాలా చెప్పబడి యున్నవి. కాని అవియన్నియు బ్రహ్మయోగమునకు వ అంశముతో సాటిరావు. విముక్తులైనవారు ఈశ్వరుని ప్రపంచమున, ప్రపంచమును ఈశ్వరునిగా చూచెడి యోగము అన్ని యోగాలలో ఉత్తమోత్త మము. ఈశ్వరునీ చూపనీ వేదబాహ్యములైన వందలు వేలు యోగములు అభ్యసించబడుచున్నవి. కానీ వాని వలన నో సాక్షాత్కారము లభించదు.

ప్రాణాయామ స్తధా ధ్యానం ప్రత్యాహారోఽధ ధారణా

సమాధిశ్చ మునిశ్రేష్ఠా యమో నియమ ఆసనమ్

మయ్యేకచిత్తతాయోగో వృత్త్యన్తరనిరోధతః 

తత్సాధనా న్యష్టధా తు యుష్మాకం కధితాని తు

ప్రాణాయామము, ధ్యానము, ప్రత్యాహారము, ధారణ, సమాధి, యమము, నియమము ఆసనము, ఇతర విషయముల నుండి మరల్చి చిత్తమును నా యందే యుంచుట యను నీ ఎనిమిది యోగ సాధనములుగా చెప్పబడినవి.  

అహింసా సత్య మస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ

యమా స్సంక్షేపత ప్రో శ్చిత్తశుద్ధిప్రదా నృణామ్

కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా

అక్లేశజననం ప్రోక్తం త్వహింసా పరమర్షి భిః

 అహింసాయాః పరో ధర్మో నాస్ర్య హింసాపరంసుఖమ్

విధిగా యా భవే ద్ధింసా త్యహింసై వ ప్రకీర్తితా

సత్యేన సర్వ మాప్నోతి సత్యే సర్వం ప్రతిష్ఠితమ్

యథార్థకథనాచారః సత్యం ప్రోక్తః ద్విజాతిభిః

పరద్రవ్యాపహరణం చౌర్యాత్ వాధ బలేన వా

 స్త్యం తస్యా నాచరణా దస్తేయం ధర్మసాధనమ్

కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా

సర్వత్ర మైథునత్యాగం బ్రహ్మచర్యం ప్రచక్షతే

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవీ సంక్షేపముగా యమములనబడును. ఇవి మానవులకు చిత్త శుద్ధిని ప్రసాదించును. కర్మతో, మనసుతో మాటతో అన్ని వేళల యందు అన్ని ప్రాణుల యందు కష్టము కలిగించకుండుట అహింసయని పరమరులు చెప్పిరి. అహింసను మించిన ధర్మము, అహింసను మీంచీన సుఖము లేదు. వేద విధితో చేయు హింస అహింసగానే పేర్కొనబడినది. సత్యముతో అన్నింటిని పొందగలడు. ఈ జగమంతయు సత్యములోనే నిలిచియున్నది. యథార్థమును చెప్పు ఆచారమే సత్యమని ద్విజులు చెప్పిరి. దొంగతనముగా గాని బలవంతముగా గానీ, పరద్రవ్యమును హరించుట సేయమనబడును. స్తేయము నాచరింపకుండుట అస్తేయమనబడును. ఇది ధర్మ సాధనముగా చెప్పబడినది. కర్మచేత, మనసుచేత, వాక్కుచేత అన్నివేళల, అన్ని అవస్థలలో, అన్నిచోట్ల మిధున ధర్మమును త్యజించుట బ్రహ్మచర్య మనబడును.  

ద్రవ్యాణా మప్యనాదాన మాపద్యపీ యథేచ్ఛయా

 అపరిగ్రహ ఇత్యాహు స్తం ప్రయత్నేన పాలయేత్

తపస్వాధ్యాయసంతోషా శ్చౌచ మిశ్వర పూజనమ్

 సమాసా న్నియమాః ప్రోక్తాః యోగసిద్ధిప్రదాయినః

ఉపవాసపరాకాషీ కృచ్చ్రః చాంద్రాయణాదిభిః

 శరీరశోషణం ప్రాహు స్తాపసా స్తప ఉత్తమమ్

ఆపదలో కూడా ఇష్టపూర్వకముగా ఏ ద్రవ్యమును స్వీకరింపకుండుట ఆపరిగ్రహమనబడును. ఈ అపరిగ్రహమును అత్యంత యత్నముతో పాటించవలెను. తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, ఈశ్వర పూజనము - ఇవి యోగసిద్ధిని ప్రసాదించు నియమములు. ఉపవాసము, పరాకము, కృచ్ఛము, చాంద్రాయణము మొదలగు వ్రతములతో శరీరమును శోషింపచేయుట ఉత్తమతపస్సని తాపసులు చెప్పిరి.  

వేదాంతశతరుద్రీయ ప్రణవాది జపం బుధాః

సత్త్వశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరీచక్షతే

స్వాధ్యాయస్య త్రయో భేదాః వాచికోపోంశుమానసాః

ఉత్తరోత్తరవైశిష్ట్యం ప్రాహుర్వేదార్థ వాచినః

య శ్శబ్దబోధజననః పరేషాం శృణ్వతాం స్ఫుటమ్

 స్వాధ్యాయో వాచికః ప్రోక్త ఉసాంశో రథ లక్షణమ్

ఓష్ఠయోః స్పన్దమాత్రేణ పరస్యాశబ్దబోధకః

ఉపాంశు రేష నిర్దిష్టః సాహస్రో వాచికా జ్ఞపః

యత్పదాక్షరసంగత్యా పరిస్పందసవర్జితమ్ 

చింతనం సర్వశబ్దానాస మానసం తం జపం వీదుః

యదృచ్ఛాలాభతో నిత్య మలం పుంసో భవే రీది

యాధీ స్తో మృషయః ప్రాహుః సంతోషం సుఖలక్షణమ్

వేదాంతశాస్త్రమును, శతరుద్రీయమును, ప్రణవము మొదలగు - సినీ జపించుట స్వాధ్యాయమనబడును. ఇది మనసును పరిశుద్ది చేయునని పండితులు చెప్పెదరు. ఈ స్వాధ్యాయము చికము, ఉసాంశము, మానసము అని మూడు విధములు. మొదటి దానికన్నా తరువాత

ఉత్తమము అని వేదార్థము తెలిసినవారు చెప్పెదరు. విను వారికి ఎదుటివారికి స్పష్టముగా శబ్దములు తెలియునట్లు పలుకుట పాచిక స్వాధ్యాయమందురు. ఇక ఉపాంశు లక్షణము వినుము. పెదవులు మాత్రము కదలును. ఇతరులకు శబ్దము వినరాదు, ఇది ఉపాంశు స్వాధ్యాయుము. వాచికముకన్న ఇది వేయిరెట్లు ఉత్తమము. పదములు, అక్షరములు కలిపీ చేయుచున్నను పెదవుల కదలిక కూడా లేకుండగా అన్ని శబ్దములను చింతించుట మానస జపమందురు. దైవ సంకల్పము వలన లభించునదే చాలును అను బుద్ధి సంతోషమనబడును. ఇది పరమానందమును కలిగించును.  

బాహ్య మాభ్యంతరం శౌచం ద్విధా ప్రోక్తం ద్విజోత్తమాః

మృజ్జలాభ్యోం స్మృతం బాహ్యం మనశ్శుద్ధి రధాంతరమ్

స్తుతిస్మరణపూజాభి ర్వాజ్మనఃకాయకర్మభిః

సునీశ్చలా శివే భక్తి రేత దీశ్వర పూజనమ్

యమా స్సనియమాః ప్రోక్తాః ప్రాణాయామం నిబోధత 

ప్రాణ స్స్వదేహజో వాయు రాయామ స్తన్నిరోధనమ్

ఉత్తమాధమమధ్యత్వాత్ త్రిధాయం ప్రతిపాదితః

స ఏవ ద్వీవీధః ప్రోక్తః స గర్భోఽగర్భ ఏవ చ

మాత్రాద్వాదశ కో మంద శ్చతుర్వింశతి మాత్రికః

మధ్యమః ప్రాణసంరోధ ష్పత్రింశన్మాశ్రీకోత్తమః

  ప్రస్వేదకంపనోత్థానజనకత్వం యధాక్రమమ్

మంద మధ్యమ ముఖ్యానా మానందా దుత్తమోత్తమః

శాచము బాహ్యమని ఆభ్యంతరమని రెండు విధములుగా చెప్పబడినది. మృత్తికచేత, జలముచేత చేయబడునది బాహ్యశౌచమని, మనః పరిశుద్ది అభ్యంతర శౌచమని యందురు. స్తుతి, స్మరణము, పూజ - ఇవి వాజ్మనః కాయకర్మలు. ఈ మూడింటిచే పరమశివుని యందు నీశ్చలమైన భక్తి ఈశ్వర పూజన మనబడును. ఇట్లు యమ నియమములు చెప్పబడినవి. ఇక ప్రాణాయామమును తెలియుము. తన దేహము వలన కలుగు పోయువు ప్రాణమనబడును. ప్రాణమును నిరోధించుట ప్రాణాయామము. ఈ ప్రాణాయామము ఉత్తమ, మధ్యమ, అధమ భేదములతో మూడు విధములు. మరల సగర్భము, అగర్భము అని రెండు విధములు. ద్వాదశ మాత్రాకాలము ఆచరింపబడునదీ మందమని. (అధమమని), ఇరువది నాలుగు మాత్రలకాలము ఆచరింపబడునది. మధ్యమమని, ముప్పదియారు మాత్రల కాలమాచరింపబడునది ఉత్తమమని చెప్పబడుచున్నది. స్వేదమును మాత్రము కలిగించు ప్రాణాయామము అధమమని, కంపనము కలిగించునది మధ్యమమని, ఉత్తానము కలిగించునది ఉత్తమమని చెప్పబడును. ఆనందము కలిగించు ప్రాణాయామము ఉత్తమోత్తమము అని తెలుపబడును. అనగా ఒకదానికంటే మరియొకటి అధికానందము కలిగించునని తెలియవలెను.

 సగర్భ మాహు స్సజప మగర్భం విజపం బుధాః

ఏత ద్వై యోగినా ముక్తం ప్రాణాయామస్య లక్షణమ్  

సవ్యాహృతిం సప్రణవాం గాయత్రీం శిరసా సహ

త్రిర్జపే దాయత ప్రాణః ప్రాణాయామః స ఉచ్యతే  

రేచకః పూరకశ్చైవ ప్రాణాయామోఽధ కుంభకః

ప్రోచ్యతే సర్వశాస్త్రేషు యోగిభి ర్యతమానసైః ॥। 

జపముతోపాటు చేయు ప్రాణాయామము సగర్భమని, జపహీనులుగా చేయు ప్రాణాయామము అగర్భమని యోగులు చెప్పిన ప్రాణాయామ లక్షణము. వ్యాహృతులతో, ప్రణవముతో, శీర్షమంత్రముతో కూడియున్న గాయత్రిని ప్రాణాయామముతో మూడుసార్లు జపించిన అతి ఉత్తమ ప్రాణాయామమనబడును. మనో నిగ్రహముగల యోగులు రేచకము, పూరకము, కుంభకమని యీ ప్రాణాయామము మూడు విధములని చెప్పిరి.

రేచకోఽ జస్రనిఃశ్వాసాత్ పూరక స్తన్నిరోధతః

సామ్యేన సంస్థితి ర్యా సా కుంభకః పరిగీయతే  

ఇంద్రియాణాం విచరతాం విషయేషు స్వభావతః

నిగ్రహః ప్రోచ్యతే సద్భిః ప్రత్యాహార స్తు సత్తమాః  

హృత్పుండరీకే నాభ్యాం వా మూర్ధ్ని పర్వతమస్తకే

ఏవమాదిషు దేశేషు ధారణా చిత్తబంధనమ్  

దేశావస్థితి మాలంబ్య బుద్ధే ర్యా వృత్తిసంతతిః

వృత్యంతరై రసంసృష్టా తద్ద్యానం సూరయో విదుః  

ఏకాకార స్సమాధి స్స్యాత్ దేశాలంబనవర్జితః

ప్రత్యయో హ్యర్థమాత్రేణ యోగసాధన ముత్తమమ్  

ధారణా ద్వాదశాయామా ధ్యానం ద్వాదశధారణాః

నం ద్వాదశకం యావత్ సమాధి ర భిధీయతే  

ఎల్లప్పుడు వాయువును బయటికి విడచుట రేచకమని, వాయువును నిరోధించుట పూరకమని, వాయు సామ్యస్థితి కుంభకమని యనబడును. శబ్దస్పర్శాది విషయములందు సహజముగా ప్రవర్తించు ఇంద్రియములను నిగ్రహించుట ప్రత్యాహారమని సజ్జనులందురు. హృదయ పద్మమున, నాభియందు, శిరసునందు, పర్వతశిఖరమున మనసును నిలుపుట 'ధారణ' అనబడును. ఒక్కొక్క దేశస్థితిని అనుసరించి, బుద్ధిని, ఏకాగ్రము చేయుట, ఇతర దేశముల నుండి సంబంధమును పరిత్యజించుట ధ్యానమనబడును. ఏ దేశమును ఆశ్రయించకుండగా, ఒకే ఆకారముతో, చిత్తమును నిలుపగలుగుట సమాధియనబడును. ఈ సమాధిలో అర్థము మాత్రము భాసించును. ఇది ఉత్తమ యోగసాధనము. ద్వాదశ ఆయామములు ఒక ధారణ, ద్వాదశ ధారణలు ఒక ధ్యానము, ద్వాదశ ధ్యానములు ఒక సమాధి అని చెప్పబడును. 

ఆసనం స్వస్తికం ప్రోక్తం పద్మ మర్ధాసనం తథా !

సాధనానాం చ సర్వేషా మేత త్సాధన ముత్తమమ్  

ఊర్వో రుపరి విప్రేన్ద్రా: కృత్వా పాదతలే ఉభే

సమాసీతాత్మనః పద్మ మేత దాసన ముత్తమమ్  

ఏకపాద మథైకస్మిన్ విన్యస్యోరుణి సత్తమాః

ఆసీతార్ధాసన మిదం యోగసాధన ముత్తమమ్  

ఉభే కృత్వా పాదతలే జానూర్వో రంతరేణ హి

సమాసీ తాత్మనః ప్రోక్తం ఆసనం స్వస్తికం పరమ్  

ఆసనము స్వస్తికమని పద్మమని, అర్ధాసనమని మూడు రకములు. ఈ ఆసనములు అన్ని సాధనములలో ఉత్తమ సాధనములు. రెండు పాదములను రెండు ఊరువులపై నుంచి కూర్చొనుటను పద్మాసనమని చెప్పుదురు. ఇది ఉత్తమాసనము. ఒక పాదమును ఒక ఊరువుపై నుంచి కూర్చొనుట అర్థాసనమనబడును. ఇదియు ఉత్తమ యోగసాధనమే ! రెండు పాదములు రెండు మోకాళ్లపై నుంచి కూర్చొనుట స్వస్తికాసనమని పేరు.

అదేశకాలే యోగస్య దర్శనం హి న విద్యతే

అగ్న్యభ్యాసే జలే వాపి శుష్కపర్ణచయే తథా  

జంతువ్యాప్తే శ్మశానే చ జీర్ణగోష్ఠే చతుష్పథే

సశభ్ధే సభయే వాపి చైత్యవల్మీకసంచయే  

అశుభే దుర్జనాక్రాంతే మశకాదిసమన్వితే

నాచరే ద్ధేహబాధే వా దౌర్మనస్యాదిసంభవే  

సుగుప్తే సుశుభే దేశే గుహాయాం పర్వతస్య తు

నద్యా స్తీరే పుణ్యదేశే దేవతాయతనే తథా  

. గృహే వా సుశుభే రమ్యే విజనే జంతువర్జితే

యుంజీత యోగీ సతత మాత్మానం మత్పరాయణః  

అదేశమున, అకాలమున యోగము నాచరింపరాదు. అగ్ని సమీపముగా, జల ప్రవాహ సమీపమున, ఎండుటాకుల మధ్య, జంతువులు సంచరించుచోట, స్మశానము, ప్రాత యింటిలో, నాల్గుబాటల కూడలిలో ఎక్కువ ధ్వని కలుగుచోట, భయము కలిగించుచోట, దిష్టిబొమ్మల దగ్గర, పుట్టల వద్ద, అశుభ ప్రదేశమున, దుర్జనులున్నచోట, 

దోమలు, చీమలు మొదలగు కీటకములు సంచరించుచోట, శరీరమునకు బాధ ఉన్నపుడు, మనసున చెడు ఆలోచనలు కలిగియున్నపుడు యోగమును ఆచరించరాదు. ఏకాంతప్రదేశములో, శుభప్రదేశమున, పర్వతగుహలో, నదీతీరమున, పుణ్యప్రదేశమున, దేవాలయమున, ఇంటిలో శుభకరమగు సమయమున, సుందరమగుచోట, జనులు లేనిచోట, జంతువులు సంచరించనిచోట, నా యందు చిత్తమును లగ్నముచేసి యోగమును ఆచరించవలెను.

నమస్కృత్య తు యోగీన్హాన్ సశిష్యాంశ్చ వినాయకమ్

గురుం చైవా థ మాం యోగీ యుంజీత సుసమాహితః

ఆసనం స్వస్తికం బద్దో పద్మ మర్ధ మథాపి వా

నాసికాగ్రే సమాం దృష్టి మీషదున్మీలితేక్షణః

కృత్వాథ నిర్భయ శ్శాంత స్యక్త్వా మాయామయం జగత్

స్వాత్మ స్యవస్థితం దేవం చింతయే త్పరమేశ్వరమ్

శిష్యులతో కూడిన యోగీంద్రులను, వినాయకుని, గురువును, నన్ను, నమస్కరించి, సావధాన చిత్తుడై యోగమును ప్రారంభించవలెను. స్వస్తికమును, పద్మమును, అర్ధాసనమును అధిష్టించి, అర్ధనిమాలితనేత్రుడై, నాసికాగ్రమున దృష్టి నిలిపి, భయరహితుడై, శాంతుడై, మాయామయ జగత్తును విడిచి, తన ఆత్మలో అంతర్యామిగానున్న పరమేశ్వరుని ధ్యానింపవలెను.  

శిఖాగ్రే ద్వాదశాంగుల్యే కల్పయిత్వోథ పంకజమ్

ధర్మకందసముద్భూతం జ్ఞానకాలం సుశోభనమ్

ఐశ్వర్యాష్టదలం శ్వేతం పరం వైరాగ్యకర్ణికమ్ 

చింతయే త్సరమర కోశం కర్ణికాయాం హిరణ్మయమ్

  సర్వశక్తి మయం సాక్షాత్ రుం ప్రాహు ర్దివ్య మవ్యయమ్

ఓంకార వాచ్య మవ్యక్తం రశ్మిజాలమాకులమ్

  చింతయే తత్ర విమలం పరం జ్యోతి ర్యదక్షరమ్

తస్మిన్ జ్యోతిషి విన్యస్య స్వాత్మానం తదభేదతః

  ధ్యా తా కాశమధ్యస్థ మిశం పరమకారణమ్

తదాత్మా సర్వగో భూత్వా న కించిదపి చింతయేత్

శీఖాగ్ర భాగమున పండ్రెండంగుళముల ప్రదేశమున, ఒక పద్మమును కల్పించు (భావించు) కొనవలయును. ఈ పద్మము ధర్మ స్కంధము నుండి పుట్టినది. జ్ఞానమను నాళము కలది. పరమ సుందరము. అప్లైశ్వర్యములు దళములుగా గలది. తెల్లనిది. వైరాగ్యమను కర్ణిక కలది. ఆ కర్ణికలో హిరణ్మయ కోశమును సర్వశక్తి మయమును చింతించవలెను. ఈ కోశము నందు దివ్యము, అవ్యయము, ఓంకార పొచ్యము, అవ్యక్తము, బహుకాంతి పుంజ సమన్వితము, అక్షరము, పరిశుద్దమగు జ్యోతిని చింతించవలెను. తన ఆత్మను అభేద బుద్దీతో ఆజ్యోతిస్సులో ఉంచి, ఆకాశ మధ్యమున నున్న పరమకారణమైన ఈశ్వరుని ధ్యానించవలయును. అపుడు ఆత్మ సర్వవ్యాపి యగును. ఇంక దేనిని చింతించరాదు.  

ఏత ద్గుహ్యతమం ధ్యానం ధ్యానాంతర మథోచ్యతే

చింతయిత్వా తు పూర్వోక్తం హృదయే పద్మము త్తమమ్

ఆత్మాన మథ కర్తారం తత్రా నలసముత్విషమ్

 మధ్యే వహ్నిశిఖాకారం పురుషం పంచవింశకమ్

 చింతయే త్పరమాత్మానం తన్మధ్యే గగనే పరమ్ 

ఓంకారే బోధితం తత్త్వం శాశ్వతమ్ శివ మచ్యుతమ్

ఇది పరమ గుహ్యమైన ధ్యానము. ఇప్పుడు యింకోక ధ్యానమును చెప్పెదను. మొదట చెప్పబడిన పద్మమును హృదయమున చింతించు కొనుచు, ఆ కమలమున అగ్నితో కూడిన ఆత్మను కర్త ఇరువది అయిదవ తత్త్వమైన పురుషుని అగ్నిశిఖ సమాహాకారునీ, మధ్యమున చింతించుచు, ఆ ఆత్మ మధ్యమున ఓంకార పాచ్యుడు పరమాకాశమయుడు శాశ్వతమగు శివతత్త్వమును ధ్యానించవలయును.

అవ్యక్తం ప్రకృతౌ లీనం పరం జ్యోతి రనుత్తమమ్

తదంతః పరమం తత్త్వ మాత్మాధారం నిరంజనమ్

ధ్యాయీత తన్మయో నిత్య మేకరూపం మహేశ్వరమ్

విశోధ్య సర్వతత్త్వాని ప్రణవేనాథ వో పునః

సంస్థాష్య మయి చాత్మానం నిర్మలే పరమే పదే

 ప్లావయిత్వా త్మనో దేహం తేనైవ జ్ఞానవారిణా

మదాత్మా మన్మయో భస్మ గృహీత్వా హ్యగ్నిహోత్రజమ్

తేనోద్వృత్య తు సర్వాంగ మగ్నిరిత్యాది మంత్రతః

 చింతయే దాత్మనాత్మనం పరం జ్యోతి స్వరూపిణమ్

ఆ జ్యోతి మధ్యన ప్రకృతిలో లీనమైన అవ్యక్తమును, సర్వోత్తమమైన పరంజ్యోతిని సర్వాధారమును, నిరంజనమును, ఏకరూపుడగు "మహేశ్వరుని, తన్మయుడై ధ్యానించవలయును లేదా అన్ని తత్త్వములను ప్రణవముతో పరిశుద్ధీ గావించి, నిర్మలము పరమ పదమైన నాయందు ఆత్మను నిలిపి, జ్ఞాన జలముతో దేహమును ముంచి, నా స్వరూపుడై సోయందే మనసునిల్పి, అగ్నిహెూత్రము వలన కలిగిన భస్మమును తీసుకొని “అగ్నిమీడే...” ఇత్యాది మంత్రములతో అన్ని అవయములకు అందుకొని, పరంజ్యోతి స్వరూపుడైన ఈశ్వరుని తనలో ధ్యానించ వలయును.

 ఏష పొశుపతో యోగః పశుపాశవిముక్తయ

సర్వవేదాంతసారో య మత్యాశ్రమ మీతీ శ్రుతీః

ఏతత్పరతరం గుహ్యం మత్సాయుజ్యోపపాదకమ్

ద్విజాతీనాం తు కథితం భక్తానాం బ్రహ్మచారిణామ్

బ్రహ్మచర్య మహింసా చ క్షనూ శౌచం తపో దమః 

సంతోష స్సత్య మాస్తిక్యం వ్రతాంగానీ విశేషతః

ఏకేనా ప్యథ హీనేన ప్రత మస్య తు లుప్యతే

తస్మా దాత్మగుణోపేతో మద్ర్వతం వోడు మర్హతి

జీవ బంధమును విడిపించు నీ యోగమును పాశుపత యోగమందురు. ఇది సర్వవేదాంతసారము, సర్వాశ్రమములలో ఆచరించదగినదని చెప్పుదురు. ఇది పరమోత్కృష్టము. పరమ రహస్యము. నా సాయుజ్యమును కలిగించునది. భక్తులు, బ్రహ్మచారులగు ద్విజులకు ఈ యోగము చెప్పబడినది. బ్రహ్మచర్యము, అహింస, క్షమ, శౌచము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, సంతోషము, సత్యము, ఆస్తిక్యము, అనునవి ఈ యోగమునకు అంగములు. వీనిలో ఒకటి లోపించినను ప్రతమే లోపించును. కావున ఆత్మగుణ సమన్వితుడై యీ వ్రతమును అనుష్ఠించవలెను.

 వీతరాగభయక్రోధా మన్మయా మా ముపాశ్రితాః

బహవోఽనేన యోగేన పూతో మద్బావ మాగతాః

యే యధా మాం ప్రపద్యంతే తాం స్త జైవ భజా మ్యహమ్

  జ్ఞానయోగేన మాం తస్మాత్ యజేత పరమేశ్వరమ్

అధవా భక్తియోగేన వైరాగ్యేణ పరేణ తు

చేతసా బోధయుక్తేన పూజయే న్మాం సదా శుచిః

సర్వకర్మాణి సంన్యస్య భిక్షాశీ నిష్పరిగ్రహః

ప్రాప్నోతి మమ సాయుజ్యం గుహ్య మేత న్మయోదితమ్

రాగమును, భయమును, క్రోధమును విడచి, మన్మయులై నన్నే ఆశ్రయించి, ఈ యోగముతో పవిత్రుల్లో చాలా మంది నా రూపమును పొందిరి. ఎవరు ఏ విధముగా నన్ను ఆశ్రయింతురో నేను గూడా వారిని ఆ విధముగానే పరిగ్రహించెదను. కావున పరమేశ్వరుడనైన నన్ను జ్ఞాన యోగముతో ఉపాసించవలయును. లేనిచో భక్తియోగముతో లేదా వైరాగ్యముతో సేవించవలయును. సర్వకాలములయందు శుభమై జ్ఞానముతో కూడిన మనస్సుతో, నన్ను పూజించవలయును. అన్ని కర్మలను విడిచి, భిక్షతో లభించినదానిని భుజించుచు, పరిగ్రహమును విడచి, ఈ యోగమును ఆచరించిన నా సాయుజ్యమును పొందుదురు. ఇది పరమ రహస్యమైన యోగము. నీకు చెప్పబడినది, 

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ 

నీర్మమో నిరహంకారో యో మద్భక్త స్స మే ప్రియః

సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా దృడనిశ్చయ

 మ య్యర్చితమనోబుద్ధి ర్యో మద్భక్త స్స మే ప్రియః

యస్మా న్నో ద్విజతే లోకో లోకా న్నో ద్విజతే చ య

  హర్షామర్ష భయోద్వేగై ర్ముక్తో య స చ మే ప్రియః

అనపేక్ష శుచి ర్దక్ష ఉదాసీనో గతవ్యథః

సర్వారంభపరిత్యాగీ భక్తి మా న్యస మే ప్రియః

తుల్యనీందాస్తుతి ర్మౌనీ సంతుష్ణో యేన కేన చీత్

అనికేత స్థిరమతి ర్మద్భక్తి మా ముపేష్యతీ

సర్వకర్మాణ్య పి సదా కుర్వాణో మత్పరాయణః

మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పరమం పదమ్

ఏ ప్రాణిని ద్వేషించక, మిత్రభావము కరుణ కలిగి, అహంకార మమకారములు లేని నా భక్తుడు, నాకు ప్రియతముడు, నిత్యసంతోషి, నిత్య యోగి, మనసును నియమించినవాడు, దృఢనిశ్చయము కలవాడు, మనసును బుద్ధిని నా యందు నిలిపీన నా భక్తుడు నాకు ప్రియతముడు. ఎవని వలన లోకము భయపడదో, ఎవడు లోకమునుండి భయపడడో, సంతోషము, అసూయ, భయము, ఉద్వేగము లేనివాడు నాకు ప్రీతిపాత్రుడు. అపేక్షలేనివాడు, శుచి, దక్షుడు, ఉదాసీనుడు, వ్యధచెందనివాడు, అన్ని ప్రయత్నములు విడిచినపోడు, భక్తికలవాడు, నాకు ప్రీతిపాత్రుడు. నీందాస్తుతులను సమముగా స్వీకరించువాడు, మౌనమునవలంబించువాడు, లభించిన దానితో సంతోషించెడివాడు, ఒకేచోట స్థిరనివాసము లేనివాడు, స్థిరమైన బుద్ధిగల నా భక్తుడు నన్ను చేరగలడు. నా యందు మనసుంచి, అన్నివేళల అన్ని పనులు ఆచరించుచు, నా అనుగ్రహము వలన శాశ్వతమైన పరమపదము పొందగలడు.

 చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః

నిరాశీ ర్నిర్మమో భూత్వా మా మేకం శరణం వ్రజేత్

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృషో నిరాశ్రయః

కర్మ ణ్యభి ప్రవృత్తోపి నైవ తేన నిబధ్యతే

నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రవాః

శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి తత్పదమ్

మనః పూర్వకముగా అన్ని కర్మలను, నా యందు ఉంచి, సన్నే ధ్యానించుచు, కోరికలు లేనివాడై, మమకారమును విడచి, నన్ను ఒక్కనీ మాత్రమే శరణు వేడవలెను. కర్మఫల సంగమును విడచి, ఎల్లప్పుడు తృప్తితో నిలిచి, ఆశ్రయరహితుడై, కర్మల నాచరించినను, ఆ కర్మలతో బద్ధుడు కాడు. ఆశలను విడచి, మనసును నియమించి, అన్ని పరిగ్రహములను విడచి, కేవలము శరీర కర్మలను మాత్రము ఆచరించగలవాడు పరమపదమును పొందును.  

యదృచ్ఛాలాభతుష్టస్య ద్వంద్వాతీతస్య చైవ హి

కుర్వతో మత్ర్పసొదార్థం కర్మ సంసారనాశనమ్

మన్మనా మున్నమస్కారో మద్యాజీ మత్పరాయణః

మా ముపైష్యతి యోగీశం జ్ఞాత్వా మాం పరమేశ్వరమ్

మద్బుద్ధయో సూం సతతం బోధయంతః పరస్పరమ్ 

కథయంత శ్చ మాం నిత్యం మమ సాయుజ్య మాప్నుయుః

 ఏవం నిత్యాభియుక్తానాం మాయికం కర్మ సాన్వగమ్

నాశయామి తమః కృత్స్నం జ్ఞానదీపేన భస్వతా

దైవ సంకల్పమున లభించిన దానితో సంతుష్టిని పొందుచు, శీతోషాది ద్వంద్వములు సహించుచు, నా అనుగ్రహము కొరకు సంసార సౌశకమగు కర్మనాచరించుచు, నాయందు మనసుంచి, నాకు నమస్కరించుచు, నన్ను పూజించుచు,నా యందు మనసు నిలుపుచు, నన్ను యోగీశ్వరునిగా, పరమేశ్వరునిగా తెలిసినవాడు నన్నే చేరును. నా యందు బుద్ది నిలిపినవారు ఎపుడు ఒకరికొకరు నా గురించియే బోధించు కొనుచు, నా గురించియే చెప్పుకొనుచు, నా సాయుజ్యమునే పొందగలరు. ఇట్లు నిత్యయోగముతోనున్న వారికి ప్రకాశవంతమైన జ్ఞాన దీపముతో అజ్ఞానాంధకారమును, సకల కర్మలను నశింపచేయుదును.

మద్బద్ధయో మాం సతతం పూజయంతీ పొ యే జనాః

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్

యేఽన్యే చ కామభోగార్థం యజస్తే హ్యన్య దేవతాః

తేషాం తదంతం విజ్ఞేయం దేవతానుగతం ఫలమ్

యే చాన్యదేవతాభక్తాః పూజయంతీహా దేవతాః

మద్భావనాసమాయుక్తా ముచ్యంతే తేఽపి భావతః

తస్మా దనీశ్వరా నన్యాం స్యక్త్వా దేవా నశేషతః

మా మేవ సంశ్రయే దేశం స యాతి పరమం పదమ్

నా యందు బుద్ధి కలిగి నిత్యము నన్నే పూజించువారీ యోగక్షేమములను నేను వహించెదను. కామ భోగముల కొరకు, ఇతర దేవతలను పూజించు వారు, విషయ భోగ రూప ఫలమును మాత్రమే పొందగలరు. అన్య దేవతా భక్తులగువారు ఆయా దేవతలను పూజించుచున్నను, నా భావన కలిగియున్నచో వారు కూడా ముక్తిని పొందెదరు. కావున ఈశ్వరులు కాని ఇతర దేవతలను విడచి, ఈశ్వరుడనైన నన్నే ఆశ్రయించినచో పరమపదమును పొందును.

త్యక్త్వా పుత్రాదిషు స్నేహం నీశోకో నిప్పర గ్రహః

యజే చ్చో మరణా ల్లింగే విరక్తః పరమేశ్వరమ్

యేఽర్చయంతి సదా లింగం త్యక్త్వా భోగా నశేషతః

ఏకేన జన్మనా తేషాం దదామి పరమైశ్వరమ్

పరానందాత్మకం లింగం కేవలం సన్నిరంజనమ్

జ్ఞానాత్మకం సర్వగతం యోగినాం హృది సంస్థితమ్

పుత్రాదులయందు స్నేహమును, శోకమును విడిచి, సర్వపరిగ్రహములను త్యజించి, దేహమునందు విరక్తి పొంది, మరణించువరకు, పరమేశ్వరుని ఆరాధించవలేను. అన్ని భోగములను వదలి, ఈ దేహమున పరమేశ్వరుని ఆరాధించుచున్న పోరు ఒకే జన్మలో ముక్తిని పొంద -గలరు. పరమానంద స్వరూపము, లింగాకారము, కేవలము సద్రూపము, నిరంజనము, జ్ఞాన స్వరూపము, సర్వవ్యాపీ, ఎపుడు యోగుల హృదయములో నిలుచునదిగా ధ్యానించవలయును.

యే చాన్యే నీయతా భక్తా భావయిత్వా విధానతః

యత్ర క్వచన తల్లింగం అర్చయంతీ మహేశ్వరమ్

జలే వా వహ్నిమధ్యే వా వ్యోమ్ని సూర్యేఽథ వాన్యతః

రత్నాదౌ భావయిత్వేశం అర్చయే ల్లింగ మైశ్వరమ్

సర్వం లింగమయం హ్యేతత్ సర్వం లింగే ప్రతిష్ఠితమ్

తస్మా ల్లింగేఽర్చయే దేశం యత్ర క్వచన శాశ్వతమ్

ఇతరులు కూడా నియమపూర్వకముగా, యధావిధిగా ఎక్కడో ఒకచోట, లింగమును భావించి, మహేశ్వరుని అర్చించువారు ముక్తిని పొందెదరు. జలమధ్యమున, అగ్నిమధ్యమున, ఆకాశమున, సూర్యునిలో, ఇతర ప్రదేశములలో, రత్నాదులయందు, ఈశ్వర లింగమును భావించి శివుని ఆరాధించవలెను. ఈ జగమంతయు లింగమయము. లింగమందే సకల జగత్తు ప్రతిష్టించబడినది. కావున లింగమున యీశ్వరుని శాశ్వతుని ఏదో ఒక ప్రదేశములో అర్చించవలయును.

అగ్నౌ క్రీయావతా మప్పు వ్యోమ్ని సూర్యే మనీషిణామ్

కాష్ఠాదిష్వే వ మూర్ఖాణాం హృది లింగం తు యోగినామ్

య ద్యనుతున్న విజ్ఞానో విరక్తః ప్రీతిసంయుతః

యావజ్జీవం జపే ద్యుక్తః ప్రణవం బ్రహ్మణే వపుః

అథవా శతరుద్రీయం జపే దామరణా ద్ద్విజ:

ఏకాకీ యతచిత్తాత్మా స యాతి పరమం పదమ్

వసేద్వా మరణా ద్విపో వారాణస్యాం సమాహితః

సోఽపీశ్వరప్రసాదేన యాతి తత్పరమం పదమ్

తత్రోత్ర్కమణ కాలేహి సర్వేషా మేవ దేహినామ్

దదాతి తత్పరం జ్ఞానం యేన ముచ్యత బంధనాత్

క్రియాశీలురగు, అనగా శ్రాత స్మార్త కర్మలను సావధానముగా ఆచరించువారు అగ్నిలో, లింగమును ఆరాధించవలయును. యధావిధిగా శ్రాతస్మార్తములను ఆచరించి శుద్ధాంతః కరణుడై, బ్రహ్మనిష్ఠుడగు మనిషి, ఆకాశమున గానీ, సూర్యుని యందుగాని లింగమును ఆరాధించ వలయును. వేదశాస్త్రములయందు శ్రద్ద ఉన్నను ఐహ లౌకిక భోగముల యందు ఆశకలిగి, ఆ భోగ ప్రాప్తికి ప్రయత్నించు మూర్చులు కాషాదులలో లింగమును అర్చించవలయును. యోగులు హృదయమున అర్చించవలెను. విజ్ఞానము కలుగకున్నను సంసారము నందు విరక్తి కలిగి, నాయందు ప్రీతిగలవాడై పరబ్రహ్మ స్వరూపమగు ప్రణవమును జీవించినంతకాలము జపించవలయును లేదా మరణించువరకు శతరుద్రీయమును, ఏకాకియై మనోనిగ్రహముతో జపించిన పరమ పదమును పొందును. జీవితకాలమంతయు నాయందే మనసు నీలిపీ, వారణాసిలో వసించినను ఈశ్వరాను గ్రహముతో పరమపదము చేరును. శరీరము నుండి జీవులు బయలు వెడలు సమయములో వారణాసిలో నివసించువారందరికి సంసార బంధమును విడిపించు జ్ఞానమును ఈశ్వరుడు ప్రసాదించును.

వర్ణాశ్రమవిధిం కృత్స్నం కుర్వాణో మత్పరాయణః

తేనైవ జన్మనా జ్ఞానం లబ్ధ్వా యాతి శివం పదమ్

యేఽపి తత్ర వసన్త హ నీచా వా పాపయోనయః

సర్వే తరంతి సంసార మీశ్వరానుగ్రహా ద్ద్విజాః 

కింతు విఘ్నా భవిష్యంతి పాపోప హత చేతసామ్

 ధర్మం సమాశ్రయేత్తస్మా న్ముక్తయే నియతం ద్విజాః

ఏతద్రహస్యం వేదానాం న దేయం యస్య కస్య చిత్

ధార్మికా యైన దాతవ్యం భక్తాయ బ్రహ్మచారిణే

సకల వర్ణాశ్రమ ధర్మములను సోయందు మనసు నిలిపి ఆచరించుచు, అదే జన్మయందు జ్ఞానమును పొందీ శివసాయుజ్యమును పొందును. వారణాసిలో నీవసించువారు నీచులైనను, పాపులైనను, ఈశ్వరానుగ్రహము వలన సంసారమును తరింతురు. కానీ పాప బుదులకు బహు విఘ్నములు కలుగుచుండును. కావున ముక్తికోరువారు ధర్మము నోచరించ వలయును. ఇది సకల వేద రహస్యము, అందరికీ చెప్పరాదు. ధార్మికునికి, భక్తునికి, బ్రహ్మచారికి మాత్రమే చెప్పవలయును.  

వ్యాస ఉవాచః:-

ఇత్యేత దుక్త్వా భగవాన్ ఆత్మయోగ మనుత్తమమ్

వ్యాజహార సమసనం నారాయణ మనామయమ్

మయైత ద్భాషితం జ్ఞానం హితార్థం బ్రహ్మవాదినామ్

దాతవ్యం శాంతచిత్తేభ్యః శిష్యభ్యో భవతా శివమ్

ఉక్వైవ మథ యోగీన్ద్రా నబ్రవీ ద్భగవో నజః

హితాయ సర్వభక్తానాం ద్విజోతీనాం ద్విజోత్తమాః

భవంతోఽపి హి ముజ్జానం శిష్యాణాం వీధిపూర్వకమ్

ఉపదేక్ష్యంతి భక్తానాం సర్వేషాం వచనా న్మము

వ్యాసుడు చెప్పెను.

సర్వోత్తమమైన ఆత్మయోగమును చెప్పి ఈశ్వరుడు అచట ప్రక్కనే కూర్చొనియున్న నిరామయుడైన నారాయణునితో యిట్లు పలికెను. “బ్రహ్మవాదుల హితమును కోరి నేనీ యోగమును బోధించితిని. దీనిని మీరు ప్రశాంత చిత్తులగు శిష్యులకుపదేశించవలెను." ఇట్లు చెప్పి యోగీంద్రులతో మరల యిట్లు పలికెను. “బ్రాహ్మణులకు, భక్తులందరికి హితమును కలిగించుటకు మీరందరు విధి పూర్వకముగా శిష్యులకు నా జ్ఞానమును ఉపదేశించుడు.  

అయం నారాయణో యోఽహ మీశ్వరో నాత్ర సంశయః

నాంతరం యే ప్రపశ్యంతి తేషాం దేయ మిదం పరమ్

మమైషా పరమ మూర్తీ స్నోరాయణసమాహ్వయా

 సర్వభూతాత్మభూతస్థా శాంతా చాక్షరసంజ్ఞితా

యే త్వన్యధా ప్రపశ్యంతి లోకే భేదదృశో జనాః 

న తే మాం సంస్రపశ్యంతి జయంతే చ పునః పునః

యే త్విమం విష్ణు మవ్యక్తం మాం వా దేవం మహేశ్వరమ్

ఏకీభావేన పశ్యంతి న తేషాం, పునరుద్భవః

తస్మా దనాదినిధనం విష్ణు మాత్మాన మవ్యయమ్

మా మేవ సంప్రపశ్యధ్వం పూజయధ్వం తధైవహి

ఇతడు, శ్రీమన్నోరాయణుడు, నేను ఈశ్వరుడను. మా యిరువురిలో భేదమును చూడనివారికే యీ జ్ఞానమును ఉపదేశించవలయును, సో దివ్యరూపమే నారాయణ నామముతో వ్యవహరించబడును. అన్ని ప్రాణులలో అంతర్యామిగా నుండును. ఈ రూపము శాంతము, అక్షరము. లోకమున భేదమును చూచు జనులు ఇందుకు భిన్నముగా చూచినను, వారు నన్ను చూడజాలరు మరల మరల పుట్టు చుందురు. అవ్యక్తుడైన విష్ణువును, మహేశ్వరుడనైన నన్ను ఒక్కటిగా చూచువారు మరల పుట్టరు. కావున ఆద్యంతములు లేనివాడు, అవ్యయుడు, ఆత్మ స్వరూపుడైన శ్రీ మహా విష్ణువును నన్నుగానే చూచుచు, అట్లే పూజింపుడు.

 యే ఽన్యధా మాం ప్రపశ్యంతి మత్వేమం దేవతాంతరమ్

తే యాంతి నరకాన్ ఘోరాన్ నాహం తేషు వ్యవస్థితః

మూర్ఖం వా పండితం వాఽపి బ్రాహ్మణం వా మదాశ్రయమ్ 

మోచయామి శ్వపాకం వా న నారాయణనిందకమ్

తస్మా దేష మహాయోగీ మద్భక్తైః పురుషోత్తమః

అర్చనీయో నమస్కార్యో ముత్రీతిజనకాయ హీ

విష్ణువు మరియొక దేవతగా, నన్ను యింకొక దేవతగా భావించువారు ఘోర నరకములను పొందెదరు. నేను వారిలో నివసింపను. నన్ను ఆశ్రయించినవాడు మూర్ఖుడైనను, పండితుడైనను, బ్రాహ్మణుడైనను, చివరకు చండాలుడైనను ముక్తినిచ్చెదను. కాని నారాయణుని నిందించు పోరికీ మోక్షమియను. కావున మహాయోగి, పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణునీ నాకు ప్రీతి కలిగించుటకు, నా భక్తులు పూజించ వలయును, నమస్కరించవలయును.

 ఏవ ముక్త్వా సమాలింగ్య వాసుదేవం పినాకధృక్

  అంతర్హితోఽ భవ తేషాం సర్వేషా మేవ పశ్యతామ్

  నారాయణోఽపీ భగవాన్ తాపసం వేష ముత్తమమ్ 

జగ్రాహ యోగిన స్సర్వాం స్యక్త్వా నై పరమం వపుః

ఇట్లు పలికి శంకరుడు వాసుదేవుని ఆలింగనము చేసికొని, వారందరు చూచుచుండగానే అంతర్థానము చెందెను, నారాయణుడు కూడా దివ్య దేహము విడచి తాపస వేషము స్వీకరించెను, యోగులతో యిట్లు పలికెను.

 జ్ఞాతం భవద్భి రములం ప్రసాదాత్ పరమేష్ఠినః

  సాక్షా దేవ మహేశస్య జ్ఞానం సంసారనాశనమ్

గచ్ఛధ్వం విజ్వరా స్సర్వే విజ్ఞానం పరమేష్ఠినః

ప్రవర్తయథ్వం శిష్యేభ్యో ధార్మికేభ్యో మునీశ్వరాః

ఇదం భక్తాయ శాంతాయ ధార్మికాయా కొతాగ్నయే

విజ్ఞాన మైశ్వరం దేయం బ్రాహ్మణాయ విశేషతః

  ఏవ ముక్త్వా స విశ్వాత్మా యోగీనాం యోగవిత్తమః

  నారాయణో మహాయోగీ జగమ సదనం స్వయమ్

పరమశివుని అనుగ్రహముతో మీకు పరిశుద్దమగు జ్ఞానము లభించినది. ఈ మహేశ్వర జ్ఞానము సాక్షాత్తుగా సంసార నాశకము. మీ సంతాపము తొలగిపోయినది కదా కావున మీరందరు ధార్మికులైన శిష్యులకు పరమేశ్వర విజ్ఞానమును ప్రవర్తింపచేయుడు. ఈ జ్ఞానమును భక్తులకు శాంతులకు, ధార్మికులకు, ఆహితాగ్నికి, విశేషించి బ్రాహ్మణునికీ యీయవలయును. యోగ విదులలో ఉత్తముడగు విశ్వరూపుడగు నారాయణుడు యోగులతో యిట్లు పలికీ అంతర్థానము చెందెను.

 తేఽపి దేవాదిదేవేశం నమస్కృత్య మహేశ్వరమ్ 

నారాయణం చ భూతాదిం స్వాని స్థానాని భేజిరే

సనత్కుమారో భగవాన్ సంవర్త్య మహామునిః

దత్తవా నైశ్వరం జ్ఞానం సోఽపి సత్యవ్రతాయ తు

సనందనోఽపి యోగీన్ద్ర: పులహాయ మహర్షయే

ప్రదదౌ గౌతమాయాఽథ పులహ్కోఽపీ ప్రజాపతిః

అంగిరా వేదవిదుషే భరద్వాజాయ దత్తవాన్

జైగీషవ్యాయ కపీల స్తథా పంచశీఖాయ చ

  పరాశరోఽపీ సనకాత్ పితా మే సర్వతత్త్వదృక్

లేభే తత్పరషుర జ్ఞానం తస్మా ద్వాల్మీకీ రాప్తవాన్

  మా మువాచ పురో దేవః సతీదేహభవాంగజః

వామదేవో మహాయోగీ రుద్రః కిల పినాకధృక్

ఆ యోగులు కూడా దేవాది దేవుడగు మహేశ్వరునికి సకల జగత్కారణుడైన సొరాయణునికి సమస్కరించి, తమ తమ స్థానములకు వెడలిరి. ఈశ్వర జ్ఞానమును సనత్కుమార భగవానుడు సంవర్తునికి, సంవర్తుడు సత్యవ్రతునికి బోధించిరి. యోగీంద్రుడైన సనందుడు పులహునికీ, పులహ ప్రజాపతి గౌతమునికీ, అంగిర ప్రజాపతి వేదవిత్తను భరద్వాజునికి బోధించిరి. కపిలుడు జైగీషవ్యునికి, పంచశీఖునికి బోధించెను. సర్వతత్త్వములు తెలిసిన నా తండ్రియగు పరాశరుడు సనకుని వలన యీ పరమ జ్ఞానము పొందెను. పరాశరుని వలన వాల్మీకి పొందెను. శంకరుని అంశతో పుట్టిన మహాయోగియగు వామదేవుడు ఈ జ్ఞానమును నాకు తెలిపెను. ఈ పోమదేవుడు సాక్షాత్తు మహేశ్వర రూపుడు.  

సారాయణోఽపి భగవాన్ దేవకీతనయో హరిః

అర్జునాయ స్వయం సాక్షాత్ దత్తవా నీద ముత్తమమ్

య దహం లబ్ధవాన్ రుద్రాత్ వామదేవా దనుత్తమమ్

 విశేషాత్ గిరిశై భక్తి స్తస్మా దారభ్య' మే భవత్

శరణ్యం శరణం రుద్రం ప్రపన్నోఽహం విశేషతః

భూతేశం గిరిశం స్థాణుం దేవదేవం త్రిశూలీనమ్

భవంతోఽపీ హి తం దేవం శంభుం గోవృషవాహనమ్ 

ప్రపద్యధ్వం సప్నః స పుత్రాః శరణం శివమ్

  వర్తధ్వం తత్పగోదేన కర్మయోగేన శంకరమ్ 

పూణయడం మహాదేవం గోపతిం భూతిభూషణమ్

శ్రీమస్నోరాయణుడు దేవకీ తనయుని అవతరించీ, స్వయముగా అర్జునునకు ఈ జ్ఞానమును ఉపదేశించెను. నేను రుద్రరూపుడైన వామదేవుని వలన యీ జ్ఞానము పొందిన నాటి నుండి, శంకరుని యందు విశేషభక్తి కలిగెను. అప్పటి నుండి నేను సర్వలోక శరణ్యుడగు రుద్రుని పొంధితీనీ. రుద్రుడు భూతేశుడు, గిరిశుడు, స్థాణుడు, దేవదేవుడు, త్రిశూలి, గోవృష వాహసుడగు శంభుదేవుని భార్యాపుత్రులతో కలిసి మీరు కూడా శరణుపొందుడు. శివుని యనుగ్రహముతో, కర్మయోగముతో మహాదేవుడు, గోపతి భూతి భూషణుడగు శంకరుని పూజించుడు.

 ఏవముక్తేథ మునయః శౌనకాద్యా మహేశ్వరమ్

ప్రణేము శాశ్వతం స్థాణుం వ్యాసం సత్యవతీసుతమ్

అబ్రువన్ హృష్టమనసః కృష్ణద్వైపాయనం ప్రభుమ్

సాక్షి దేవ హృషీకేశం సర్వలోకమహేశ్వరమ్

ఇట్లు పలుకగా శౌనకాది మహర్షులు శాశ్వతుడు, స్థాణురూపుడు, సనాతనుడు, సత్యవతీసుతుడైన వ్యాసునికి నమస్కరించిరి. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు, సర్వలోక మహేశ్వరుడు అగు కృష్ణ ద్వైపాయనునితో సంతుష్టాంతరంగులై యిట్లు పలికిరి.  

భవత్ప్రసాదాదచలా శరణ్యే గోవృషధ్వజే

 ఇదానీం జాయతే భక్తి ర్యా దేవై రపి దుర్లభా

కథయస్వ మునిశ్రేష్ఠ కర్మయోగ మనుత్తమమ్

యేనాసౌ భగవానీశః సమారాధ్యో ముముక్షుభిః

త్వత్సంనిధ వేష సూతః శృణోతు భగవద్వచః

త ద్వదాఖిలలోకానాం రక్షణం ధర్మసంగ్రహమ్

యదుక్తం దేవదేవేన విష్ణునా కూర్మరూపిణా 

పృష్టేన మునిభిః పూర్వం శక్రేణా మృతమంధనే

మి అనుగ్రహము వలన సర్వలోక శరణ్యుడు గోవృషధ్వజుడైన శంకరుని యందు దేవతలకు కూడా లభించని భక్తి పుడు మాకు కలుగును. ఓ మునిశ్రేష్టా ఇపుడు మాకు సర్వోత్తమమైన కర్మయోగము బోధించుము. ఈ కర్మయోగముతో ముముక్షువులు ఈశ్వరుని ఆరాధించ గలరు. నీ సమీపములో సూతుడు తమ పొక్యములను వినుగాక అట్లే సకలలోక రక్షణ, ధర్మ సంగ్రహము, కూర్మరూపి, దేవదేవుడగు శ్రీ మహా విష్ణువు అమృతమథన సమయమున యింద్రుడడుగగా చెప్పిన దానిని కూడా వివరించును.

శ్రుత్వా సత్యవతీసూనుః కర్మయోగం సనాతనమ్

మునీనాం భాషితం కృష్ణః ప్రోపోచ సుసమాహితః

సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు మునుల మాటలను విని, సుసమాహితచిత్తుడై సనాతనమైన కర్మయోగమును చెప్పసాగెను.  

య ఇమం పఠతే నిత్యం సంవాదం కృత్తివాససః

సనత్కుమారప్రముఖైః సర్వపాపైః ప్రముచ్యతే

 శ్రావయే ద్వా ద్విజాన్ శుద్దాన్ బ్రహ్మచర్యపరాయణాన్

యోవా వీచారయే దర్థం స యాతి పరమాం గతిమ్

య శ్చైత చ్ఛృణుయా న్నిత్యం భక్తియుక్తో దృఢవ్రతః

సర్వపాసవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే

సనత్కుమారుడు మొదలగు ఋషులతో శంకరుడు చెప్పిన యీ సంవాదము వినీసపాడు అన్ని పాపముల నుండి విముక్తుడగును, బ్రహ్మ చర్య పరాయణులైన ద్వీజులకు వినిపించినవాడు, యీ అర్థమును విచారించినపోడు కూడా పరమపదమును పొందును, దృఢవ్రతుడై, భక్తి యుక్తుడై ప్రతిదినము ఈ సంవాదమును వినినవాడు అన్ని పాపముల నుండి వైదొలగి బ్రహ్మలోకమున అనందించును.  

తస్మా త్సర్వప్రయత్నేన పఠితవ్యో మనీషిభిః 

శ్రోతవ్య శ్చాడనంతవ్యో విశేషా ద్బ్రహ్మణై స్సదా

 ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వర గీతాసు ఏకాదశోఽధ్యాయః 

కావున పండితులందరు సర్వప్రయత్నముతో యీ శివ ఋషి సంవాదమును చదువవలెను, వినవలెను, మననము చేయవలెను. విశేషించి బ్రాహ్మణులకిది వర్తించును.

ఇది శ్రీ కూర్మపురాణమను షట్ సాహస్ర సంహితలో ఉపరి విభాగమున ఈశ్వరగీతలలో పదునొకండవ అధ్యాయము పూర్తి.

ఈశ్వరగీత సమాప్తము.