కూర్మ మహా పురాణము
3వ అధ్యాయము
ఈశ్వర ఉవాచః-
అవ్యక్తా దభవ త్కాల: ప్రధానం పురుషః పరః ।
తేభ్యః సర్వ మీదం జాతం తస్మాద్ బ్రహ్మమయం జగత్ ॥
సర్వతః పాణిపాదాన్తం సర్వతోఽక్షి శిరోముఖమ్ ।
సర్వతః శ్రుతిమ ల్లోకే సర్వ మావృత్య తిష్ఠతి ।
సర్వేన్ద్రయగుణాభాసం సర్వేన్ద్రయవివర్జితమ్ సర్వాధారం।
సదా నత్త మవ్యక్తం ద్వైతవర్జితమ్ ॥
సర్వోపమానరహితం ప్రమాణాతీతగోచరమ్ ।
నిర్వికల్పం నిరాభాసం సర్వావాసం పరామృతమ్ ॥
అభిన్నం భిన్నసంస్థానం శాశ్వతం ధ్రువ మవ్యయమ్ ।
నిర్గుణం పరమం జ్యోతి స్తజ్ఞానం సూరయో విదుః ॥
ఈశ్వరుడిట్లనెను.
అవ్యక్త తత్త్వమునుండి కాలము పుట్టినది. ప్రధానము, పరమపురుషుడు కూడ పుట్టెను. వాని నుండి యీ సమస్తము కలిగినది. అందువలన ప్రపంచము బ్రహ్మమయము.
బ్రహ్మము అన్నివైపుల వ్యాపించిన చేతులు, కాళ్లు కలది, అంతట కన్నులు, తలలు, ముఖములు కలిగినది, అన్నివైపుల శ్రవణములు కలిగి మొత్తము నావరించి యుండును.
అన్ని ఇంద్రియముల గుణముల యొక్క ఆభాసము కలది, అన్నీ ఇంద్రియముల నుండి విడువబడినది, అన్నిటికాధారమైనదీ, అంతములేనిది, వ్యక్తమునిది, భేదశూన్యమైనది బ్రహ్మ స్వరూపము.
సమస్తోపమాన శూన్యమైనది, ప్రమాణముల కతీతముగా గోచరించునది, వికల్పశూన్యము, ఆభాసరహితము, అన్నిటికాధారభూతము, శ్రేష్ఠమై అమృతరూపమైనది.
భిన్నముకానిది, భిన్నమైన కూర్పుకలది, శాశ్వతము, స్థిరము, నాశరహితము, గుణశూన్యము, గోప్పతేజస్సు అగు ఆ జ్ఞానమును పండితులు తెలిసి కొందురు.
స ఆత్మా సర్వభూతానాం స బాహ్యాభ్యన్తరః పరః ।
సోఽహం సర్వత్రగః శాన్తో జ్ఞానాత్మా పరమేశ్వరః ॥
మయా తత మిదం విశ్వం జగత్ స్థావరజజ్గమమ్ ।
మత్థ్సాని సర్వభూతాని య స్తం వేదవిదో విదుః ॥
ప్రధానం పురుషం చైవ త ద్వస్తు సముదాహృతమ్ ।
తయో రనాది రుద్దిష్టః కాలః సంయోగజః పరః ॥
త్రయ మేత దసాద్యన్త మవ్యక్తే సమనస్థితమ్ ।
తదాత్మకం త దన్యత్ స్యా త గ్రూపం మామకం విదుః॥
మహదాద్యం విశేషాన్తం సంప్రసూతేఽఖిలం జగత్ ।
యా సా ప్రకృతి రుద్దిష్టా మోహినీ సర్వదేహినామ్ ॥
పురుషః ప్రకృతిస్థో వై భుజ్కై యః ప్రాకృతా గుణాన్ ।
అహజ్కారవిముక్త త్వాత్ ప్రోచ్యతే పంచవింశకః॥
సమస్త భూతములకు అతడాత్మరూపుడు, అతడు బాహ్య, ఆభ్యంతరరూపుడు. అట్టి నేను అంతట నిండినవాడను, శాంతుడను, జ్ఞానరూపుడగు పరమేశ్వరుడను.
స్థావర జంగమరూపమైన ఈ విశ్వమునాచేత వ్యాప్తమైయున్నది. సమస్త ప్రాణులు నాయందున్నవి. అట్టి వానిని వేదవేత్తలు తెలిసి కొందురు.
ఆ తత్వము ప్రధానము, పురుష రూపము అనీ చెప్పబడినది. ఆ రెండిటి యొక్క సంయోగము వలన పుట్టినది, అనాది యగు కాలమనీ చెప్పబడినది.
ఈ మూడు ప్రధానము, పురుషుడు, కాలము ఆద్యంత రహితము అవ్యక్త తత్త్వము నందు నిలిచియున్నది. దాని స్వరూపము కలది, తద్భిన్నమైనది అగునట్టి రూపము నొదిగా తేలిసికొందురు.
మహత్తత్త్వము మొదలు విశేషమువరకు సమస్తలోకమును సృజించును. ఆ ప్రకృతి యేది కలదో అదీ సర్వప్రాణులను మోహింపజేయును.ప్రకృతి యందున్న జీవరూప పురుషుడు ప్రకృతి గుణముల ననుభవించుచు, అహంకార విముక్తుడయినందున 25వ తత్వముగా చెప్పబడును.
ఆద్యో వీకారః ప్రకృతే ర్మహా నితి చ కథ్యతే ।
విజ్ఞాతృశక్తివీఙ్ఞానాత్ హ్యహఙ్కార స్తదుత్థితః॥
ఏక ఏవ మహా నాత్మా సోఽహజ్కారోఽభిధీయతే ।
స జీవః సోబస్తరాత్మేతి గీయతే తత్త్వచిన్లకై: 11
తేన వేదయతే సర్వం సుఖం దుఃఖం చ జన్మసు ।
స విజ్ఞానాత్మక స్తస్య మనః స్యా దుపకారకమ్ ॥
తేనాపి తన్మయ స్తస్మా త్సంసారః పురుషస్య తు ।
సచీ వివేకః ప్రకృతా సంగా త్కాలేన సోఽభవత్ ॥
కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః ।
సర్వే కాలస్య వశగా న కాలః కస్యచి ద్వశే ॥
సోఽన్తరా సర్వ మేవేదం నియచ్ఛతి సనాతనః ।
ప్రోచ్యతే భగవాన్ ప్రాణః సర్వజ్ఞః పురుషోత్తమః॥
ప్రకృతి యొక్క మొదటి వికారము ‘మహత్తు’ అని చెప్పబడును. తెలిసికొను శక్తి కలిగి యుండుట వలన దాని నుండి అహంకారము కల్గినది.
మహద్రూపమైన ఆత్మఒక్కటే. అది అహంకారమని చెప్పబడును. తత్త్వవిమర్శకులచేత జీవుడని, అంతరాత్మయని, ఆ ఆత్మయే పేర్కొనబడు చున్నది.
జన్మలయందలి సమస్త సుఖదుఃఖములు దానిచేతనే తెలియబడును. ఆ యాత్మ విజ్ఞానాత్మకము. మనస్సు దానీ కుపకరించును.
దానిచేత తన్మయమైన సంసారము జీవునకు కలుగుచున్నది. ఆ జీవపురుషుడు కాలముచేత, ప్రకృతి సంబంధము వలన వివేక శూన్యుడగు చున్నాడు.
కాలము భూతములను సృజించును. కాలము ప్రజలను సంహరించును. అన్నియు కాలమునకు వశములగును. కాలము దేనికిని వశము కాదు.
ఆ కాలము సనాతనము. అది యీ సర్వమును మించును. అది భగవంతుడని, సర్వజ్ఞమని, పురుషోత్తముడని చెప్పబడుచున్నది.
సర్వేంద్రియేభ్య: పరమం మన ఆహు ర్మనీషిణః ।
మనసశ్చా ప్యహఙ్కార అహంకారా న్మహాన్పరః ॥
మహతః పర మవ్యక్త మవ్యక్తా త్పురుషః పరః ।
పురుషా ద్భగవాన్ ప్రాణ స్తస్య సర్వ మిదం జగత్ ॥
ప్రాణా త్పరతరం వ్యోమ వ్యోమాతీతోఽగ్నీ రీశ్వరః।
సోఽహం బ్రహ్మా వ్యయః శాన్తో మాయాతీత మిదం జగత్ ॥
నాస్తి మత్తః పరం భూతం మాఇ్చ విజ్ఞాయ ముచ్యతే ।
నిత్యం నాస్త్రీతీ జగతి భూతం స్థావరజజ్గమమ్॥
ఋతే మా మేవ నువ్యక్తం వ్యోమరూపం మహేశ్వరమ్ ।
సోఽహం సృజామీ సకలం సంహరామి సదా జగత్ ॥
మనస్సు శ్రేష్ఠమైనదని పండితులు చెప్పుదురు. మనస్సు కంటే అహంకారము, అహంకారముకంటే మహత్తత్వము గొప్పదనికూడ వారు చెప్పుదురు.
మహత్తుకంటే అవ్యక్తము పరమైనది. అవ్యక్తమున కంటే పురుషుడు అధికుడు. పురుషుని వలన భగవద్రూపమైన ప్రాణము (జీవుడు) కలుగును. ఈ సర్వలోకము ఆ జీవునిది.
ప్రాణముకంటే పరతరమైనదీ ఆకాశము, ఆకాశమునకతీతమైన అగ్ని యీశ్వర రూపుడు. అట్టి నేను నాశరహితమైన బ్రహ్మను, శాంతుడను. ఈ జగత్తు మాయకతీతమైనది.
నా కంటే పరమైన ప్రాణిలేదు. నన్ను తెలిసికొని ముక్తిని పొందును. ప్రపంచములో స్థావర జంగమాత్మకమైనది ఏదియు నిత్యము లేదని తెలిసికొనుడు.
అవ్యక్తుడను, ఆకాశరూపుడను, మహేశ్వరుడను అగు నన్ను విడిచి నిత్యమేదియులేదు. ఆ నేను సమస్త విశ్వమును సృజింతును మరల సంహరించుచుందును.
మాయీ మాయామయో దేవః కాలేన సహ సజ్గతః ।
మత్సన్నిధా వేష కాలః కరోతి సకలం జగత్ ।
నియోజ యత్యనన్తాత్మా హ్యేత ద్వేదానుశాసనమ్ ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్ధే ఈశ్వర గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ఋషి వ్యాస సంవాదే తృతీయోఽధ్యాయః ॥
మాయామయుడు, మాయలు కలవాడు నగు ఈశ్వరుడు కాలముతో కలియగా, ఈ కాలము నా సన్నిధిలో సకల లోకమును సృజించును. అనంతాత్మస్వరూపుడగు భగవంతుడు సమస్తమును నియమించును ఇది వేదములయందు చెప్పబడిన అనుశాసనము.
శ్రీ కూర్మపురాణము ఉత్తరార్ధములో ఈశ్వరగీతోపనిషత్తునందు, బ్రహ్మవిద్యయగు యోగశాస్త్రములో ఋషివ్యాససంవాదమను తృతీయాధ్యాయము సమాప్తము.
Summary of chapter 56 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Ishvara describes the all-pervading nature of Parabrahma, who possesses hands, feet, eyes, and ears in every direction, enveloping the entire cosmos while remaining entirely unattached and transcendental. From the unmanifest entity emerges Kāla, Pradhāna, and Purusha, through whose cosmic interplay the Mahattattva, Ahankāra, and elemental creation come into being. Eternal Kāla is revealed as the divine, unstoppable power of Mahādeva Himself, which systematically generates, sustains, and dissolves all living beings, Devas, and cosmic realms across endless Yugas. Bhagavān declares that whoever understands Kāla as the divine instrument of Parameshvara and takes refuge in the Supreme achieves immediate liberation from worldly bondage.