కూర్మ మహా పురాణము
10వ అధ్యాయము
ఈశ్వర ఉవాచః-
అలిజ్కమేక మవ్యక్తం లీజ్గం బ్రహ్మేస్మృతి నిశ్చితమ్ ।
స్వయంజ్యోతిః పరం తత్త్వం పరం మ్యోమ్ని వ్యవస్థితమ్ ॥
అవ్యక్తం కారణం యత్తదక్షరం పరమం పదం ।
నిర్గుణం శుద్ధ విజ్ఞానం తద్ వై పశ్యన్తి సూరయః ॥
తన్నిష్ఠాః శాన్తసంకల్పా నిత్యం తద్భవభావితాః ।
పశ్యన్తి తత్ పరం బ్రహ్మ య తల్లిజ్గమితి శ్రుతిః ॥
ఈశ్వరుడు పలికెను.
ఏ చిహ్నము లేనిది అద్వితీయమైనది, అవ్యక్తమగు లింగము బ్రహ్మమని నిశ్చయించబడినది. ఈ బ్రహ్మము స్వయం ప్రకాశము పరతత్వము పరమాకాశమున నుండునది. ఇదియే అవ్యక్త కారణరూపము అక్షరమగు పరచుపదము. ఇది నిర్గుణము శుద్ద విజ్ఞానము, దానిని పండితులు మాత్రమే చూడగలరు. వీరు బ్రహ్మ నిష్టులు శాంత సంకల్పులు ఎపుడు దానినే ధ్యానించువారు ఆ పరబ్రహ్మను తల్లింగమని శ్రుతి చెప్పు దానిని తెలియగలరు.
అన్యథా నహి మాం ద్రష్టుం శక్యం పై మునిపుంగవాః।
నహి తత్ విద్యతే జ్ఞానం యత స్త జ్ఞాయతే పరమ్ ॥
ఏత త్తత్పరమం జ్ఞానం కేవలం కవయో విదుః ।
అజ్ఞాన మితరత్ సర్వం యస్మా స్మాయామయం జగత్ ॥
ఇతరోపాయములతో నన్ను చూడజాలరు. పరమతత్త్వమును తెలుపు ఇతర జ్ఞానమేదియూ లేదు. ఈ పరమ జ్ఞానమును విద్వాంసులు మాత్రమే తెలియగలరు. పరమ జ్ఞానము తప్ప ఇతర మంతయూ అజ్ఞానమే. ఈ అజ్ఞానము వలననే మాయ, మాయ జగత్తు ఉత్పన్న మాయెను.
యత్ జ్ఞానం నిర్మలం సూక్ష్మం నిర్వికల్పం య దవ్యయమ్।
మమా త్మాసౌ తదేవేద మితి ప్రాహు ర్వపశ్చితః ॥
యే ప్యనేకం ప్రపశ్యన్తి తేఽపి పశ్యన్తి తత్ పరమ్ ।
ఆశ్రితాః పరమాం నిషాం బుద్ద్వైకం తత్త్వ మవ్యయమ్ ॥
యే పునః పరమం తత్త్వ మేకం వానేక మిశ్వరమ్ ।
భక్త్యా మాం సమ్ర్పపశ్యన్తి విజ్ఞేయా స్తే తదాత్మకాః ॥
ఈ జ్ఞానము నిర్మలము సూక్ష్మము నిర్వికల్పము నాశము లేనిది. ఇదియే నా ఆత్మ స్వరూపము. అనీ పండితులు చెప్పుచున్నారు. అనేక రూపములుగా చూచువారు కూడా భక్తిని ఆశ్రయించి అద్వితీయము అవినాశియగు తత్వమును తెలిసి దాని ద్వారా పరమతత్త్వమును తెలియుదురు, ఇతరులు పరమాత్మకు ఏకరూపముగా కాని అనేక రూపములుగా కాని భక్తితో చూచువారు కూడా బ్రహ్మ స్వరూపులుగానే చూడవలయును.
సాక్షా దేవ ప్రపశ్యన్తి స్వాత్మానం పరమేశ్వరం ।
నీత్యానందం నిర్వికల్పం సత్యరూప మితి స్థితిః॥
భజంతే పరమానందం సర్వగం య త్తదాత్మకమ్ ।
స్వాత్మ వ్యవస్థీతోః శాస్త్రాః పరేఽవ్యక్తీ సరస్వతు ॥
ఏషా విముక్తిః పరమా మమ సాయుజ్య ముత్తమమ్।
నిర్వాణం బ్రహ్మ ణాచైక్యం కైవల్యం కవయోవీదుః॥
తస్మా దనాదీమధ్యాన్తం వస్త్వేకం పరమం శివం ।
స ఈశ్వరో మహాదేవ స్తం విజ్ఞాయ విముచ్యతే ॥
తనలోనే నిత్యానంద స్వరూపము నీర్వికల్పము సత్యస్వరూపమును అగు సాక్షాత్ పరబ్రహ్మను చూచుట యథార్థ స్థితి. పరమానంద స్వరూపుడు సర్వవ్యాపి యగు వానిని తనలో నున్నవానీనీ పరము నందు అవ్యక్తమున నున్న పరతత్త్వమును ఉపాసింతురు. ఇదియే పరమ విముక్తి ఇదియే నా సాయుజ్యము, ఇదియే బ్రహ్మైక్యము కైవల్యనుని కవులు తెలియుదురు. కావున ఆది మధ్యాంతములు లేనిది రెండవది లేనిది పరమ శుభ ప్రదము అగుతత్వమే ఈశ్వరుడు. ఇతడే మహాదేవుడు. ఇతనిని తెలిసినవారు విముక్తిని పొందెదరు.
న తత్ర సూర్యః ప్రవిభాతీహ చంద్రో ।
న నక్షత్రాణి తపనో నోత విద్యుత్ ॥
తద్భాసేద మఖిలం భాతీ నీత్యం తన్నిత్య భాసమచలం సద్విభాతి॥
నిత్యోదీతం సంవిదా నీర్వికల్పం శుద్దం బృహంతం పరమం య ద్విభాతి ।
అత్రాంతరం బ్రహ్మ వీదోఽధ నిత్యం పశ్యంతి తత్వ మచలం యత్ స ఈశః ॥
ఆ పరంధామములో సూర్యుడు భాసించడు. చంద్రుడు భాసించడు. నక్షత్రములు భాసించవు. అగ్ని ప్రకాశించజాలడు. విద్యుత్ కూడా వెలుగొందదు. పరంధాముని కాంతితోనే ఇవన్నియూ వెలుగొందుచున్నవి. ఆ ధామము నిత్యము, ఆ కాంతి కూడా నీత్యముగా ప్రకాశించు చుండును. నీశ్చలము సత్గా భాసించు చుండును. ఎపుడూ ఉదయించియే యుండును. జ్ఞాన స్వరూపము నిర్వికల్పము శుద్దము బృహదా కారము పరమముగా భాసించుచుండును. ఈ ప్రకాశముననే బ్రహ్మ జ్ఞానులు ఎల్లప్పుడు నిత్యము అచలమగు తత్త్వమును దర్శింతురు. ఆ తత్త్వమే ఈశ్వరుడు.
నిత్యానంద మమృతం సత్యరూపం శుద్ధం వదంతి పురుషం సర్వవేదాః।
త మోమితి ప్రణవే నేశితారం ధ్యాయంతి వేదార్థవినిశ్చితార్థాః ॥
న భూమీ రాపో న మనో న వహ్నిః ప్రాణానిలో గగనం నోత బుద్ధి: ।
న చేతనోన్యత్ పరమాకాశమధ్యే విభాతి దేవః శివ ఏవ కేవలః ॥
ఆ పరమ పురుషుని అన్ని వేదములు నిత్యానందమయంగా, అమృత స్వరూపునిగా సత్యరూపునిగా పరిశుద్ధునిగా చెప్పుచున్నవి. వేదార్థ నిశ్చయము గలవారు ఆ పరమాత్మను ఓం అని ప్రణవముతో ధ్యానము చేతురు. ఆ పరమాకాశ మధ్యమున భూమి జలము అగ్నీ పాయువు ఆకోశము మనస్సు బుద్ధి ప్రాణము ఇవేవియూ ప్రకాశించవు. అచట ఏ చైతన్యము భాసించదు, అచట ఒకే ఒక శివుడు మాత్రమే భాసించు చుండును.
ఇత్యేత దుక్తం పరమం రహస్యం జ్ఞానామృతం సర్వవేదేషు గూఢమ్ ।
జానాతి యోగీ వీజనేథ దేశ యుంజీత యోగం ప్రయతో హ్యాజస్రమ్॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థ దశమోఽధ్యాయః ॥
ఇట్లు పరమ రహస్యమును సర్వ వేదములలో అతీగూఢముగా దాగియున్న దానిని జ్ఞానామృతమును నీకు వివరించితిని. ఏకాంత ప్రదేశమున యోగాభ్యాసమును చేయువాడే ఈతత్త్వమును తెలియగలుగును.
ఇది షట్సాహస్త్రీ సంహితయగు కూర్మపురాణమున ఉపరి విభాగమున ఈశ్వరగీతలలో 10వ అధ్యాయము.
Summary of chapter 63 of the Kūrma Mahā Purana is as follows:
Bhagavān Ishvara describes the unmanifest Linga as the self-effulgent, formless, and auspicious representation of Parabrahma, which shines in the supreme space beyond the reach of physical senses. This divine reality is not illuminated by the sun, moon, stars, lightning, or fire, but shines by its own intrinsic spiritual radiance. Dedicated Brahmavits, through silent meditation upon the sacred Omkāra and total withdrawal of the Indriyas, behold this supreme Linga within their own hearts and attain absolute liberation.