18 - అథవంశానుకీర్తనమ్

సూతఉవాచః -

బలేః పుత్రశతం త్వాసీ న్మహాబలపరాక్రమమ్

తేషాం ప్రధానో ద్యుతీమాన్ బాణో నామ మహాబలః

సోఽతీవ శంకరే భక్తో రాజా రాజ్య మపాలయత్

త్రైలోక్యం వశ మానీయ బాధయామాస వాసవమ్

తతః శక్రాదయో దేవా గత్వోచుః కృత్తివాససమ్

త్వదీయో బాధతే హ్యస్మాoబాణో నామ మహాసురః

వ్యాహృతో దైవతైః సర్వైర్ధేవదేవో మహేశ్వరః

దదాహ బాణస్య పురం శరేణైకేన లీలయా

ఆ బలికి గొప్పబలపరాక్రమములుకల నూరుగురు కుమారులుండిరి. వారందరిలో ముఖ్యుడు తేజోవంతుడు, గొప్పబలవంతుడుఐన బాణుడనువాడు.

అతడు శంకరుని యందేక్కువ భక్తికలరాజుగా తనరాజ్యమును పాలించేను. మూడులోకములను తనవశముచేసికొని దేవరాజైన ఇంద్రుని బోధించెను.

తరువాత ఇంద్రుడు మొదలగు దేవతలందరు శంకరునీవద్దకు వెళ్లి యిట్లు పలికిరి, ప్రభూ మీ భక్తుడైన బాణుడను గొప్ప అసురుడు మమ్ములను బాధించుచున్నోడు.

దేవతలకు దేవుడైన ఆపరమేశ్వరుడు దేవతలందరిచేత అట్లు ప్రార్ధింపబడినవాడై, ఒక్కబాణముచేతనే విలాసముగా బాణునీ పట్టణమును కాల్చివేసెను.

దహ్యమానే పురే తస్మిoబాణో రుద్రం త్రిశూలినమ్

యయౌ శరణ మీశానం గోపతిం నీలలోహితమ్

మూర్థ న్యాధాయ తల్లిఙ్గం శామ్భవం రాగవర్జితః

నిర్గత్య తుపురాత్తస్మాత్తుష్టావ పరమేశ్వరమ్

సంస్తుతో భగవా నీశః శంకరో నీలలోహితః

గాణపత్యేన బాణం తు యోజయామాస భావతః

అథైవం చ దనోః పుత్రా స్తారాద్యా శ్చాతిభీషణాః

తార స్తథా శమ్బరశ్చ కపిలః శంకర స్తథా

స్వర్భాను ర్వృషపర్వా చ ప్రాధాన్యేన ప్రకీర్తితాః

సురసాయాః సహస్రం తు సర్వాణా మభవ ద్ద్విజాః

తనపట్టణము కాల్చబడుచుండగా చూచి ఆ బాణుడు త్రిశూలధారి, నీలలోహితుడు, గోవులకు పతీ, ఈశ్వరుడును అగురుద్రుని శరణము కోరెను.

కోరికలను వదలినవాడై బోణుడు, శివసంబంధియైన ఆ లింగమును తలపై ధరించీ ఆపట్టణమునుండి వెలుపలికి వచ్చి పరమేశ్వరుని స్తోత్రము చేసెను.

అట్లుబాణునిచేత సుతింపబడిన భగవంతుడు, నీలలోహితుడు, ప్రభువు అగు శంకరుడు, గణపతిదేవతగా కల బాణమును సంకల్ప బలముతో ప్రయోగించెను.

తరువాత ఈవిధముగా మిక్కిలి భయంకరులైన తారుడు, శంబరుడు, కపిలుడు, శంకరుడు, స్వర్భానువు, వృషపర్వుడు అనువారు దనువుకు కుమారులుగా ప్రధానులుగా చెప్పబడినారు.

ఓ బ్రాహ్మణులారా సురస అను నాగమాతకు వేయిసంఖ్యగల సర్పములు సంతతిగా కలిగెను.

అనేకశిరసాం తద్వ త్ఖేచరాణాం మహాత్మనామ్

అరిష్టా జనయామాస గంధర్వాణాం సహస్రకమ్

అనంతాద్యా మహానాగాః కాద్రవేయాః ప్రకీర్తితాః

తామ్రా చ జనయామాస షట్కన్యా ద్విజపుంగవాః

శుకీం శ్యేనీంచ భాసించ సుగ్రీవాం గ్రoథికాం శుచిమ్

గాస్తథా జనయామాస సురభి ర్మహిషీ స్తథా

ఇరా వృక్షలతావల్లీ తృణ జాతీశ్చ సర్వశః

తథావై యక్షరక్షాంసి ముని రప్సరసస్తథా

రక్షోగణం క్రోధవశా జ్జనయామాస సత్తమాః

వినతాయాశ్చ పుత్రౌ ద్వౌప్రఖ్యాతౌ గరుడారుణౌ

అరిష్టనునామె అదేవిధముగా అనేక శిరస్సులు కలిగిన, ఆకాశసంచారులు, మహాత్ములును అగు వేయిమంది గంధర్వులను సంతానముగా పొందెను.

అనంతుడు మొదలగు గొప్పనాగులు కద్రువు సంతానముగా ప్రసిద్ధులు. బ్రాహ్మణవర్యులారా తామ అనువనిత ఆరుగురు కన్యలను పొందెను.

శుకీ, శ్యేని, భాసి, సుగ్రీవ, గ్రంథిక, శుచీ అని ఆ కన్యల పేర్లు. సురభీ గోవులను, మహిషులను సంతతిగా పొందినది.

'ఇర', వృక్షములను, తీగలను, తృణజాతిమొక్కలను అంతట ప్రసవించేను. 'ముని' యను స్త్రీ యక్షులను, రాక్షసులను, అప్సరసలను కనెను.

కోపకారణమున రాక్షస సమూహమును జన్మింపజేసెను. వినతాదేవి కుమారులు గరుడుడు, అరుణుడు అనువారు ప్రసిద్ధులు.

తయోశ్చ గరుడో ధీమాం స్తపస్తప్త్వా సుదుశ్చరమ్

ప్రసాదా చ్చూలినః ప్రాప్తో వాహనత్వం హరేః స్వయమ్

ఆరాధ్య తపసా దేవం మహాదేవం తధారుణః

సారథ్యే కల్పితః పూర్వం ప్రితేనా ర్కస్య శంబునా

ఏతే కశ్యపదాయాదాః కీర్తితాః స్థాణుజఙ్గమాః

వైవస్వతేఽoతరే హ్యా్స్మిం ఛృణ్వతాం పాపనాశనమ్

సప్తవింశసుతాః ప్రోక్తాః సోమపత్న్యశ్చ సువ్రతాః

అరిష్టనేమిపత్నీనా మపత్యానాం హ్యనేకశః

బహుపుత్రస్య విదుష శ్చతస్రో విద్యుతః స్మృతాః

తద్వ దంగీరసః శ్రేష్ఠా ఋషయో వృషసత్కృతాః

పొరిలో బుద్ధిమంతుడగు గరుడుడు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సునుచేసి శివునియొక్క అనుగ్రహము వలన విష్ణువునకు వాహనముగా పదవిని పొందినాడు.

అట్లే అరుణుడుకూడ తపస్సుతో మహాదేవుని పూజించి, పూర్వము సంతోషించిన అతనిచేత సూర్యునికి సారధి పదవిలో నియమించబడినాడు.

కశ్యప ప్రజాపతి వంశజాతులైనవీరు, స్థావర జంగమరూపులు నాచేత తెలుపబడినారు. ఈవైవస్వతమన్వంతరములో వినువారి పాపములను నశింపజేయునది ఈ వృత్తాంతము.

మంచి నీయమము కలిగిన చంద్రుని భార్యలు ఇరువది యేడుమందీ కూతుళ్లు చెప్పబడినారు. అరిష్టనేమి భార్యలయొక్క సంతానము యొక్క చాలామంది పుత్రులు కలిగిన పండితునియొక్క నలుగురు విద్యుత్తులు, అదే విధముగా శ్రేష్ఠులు, ఇంద్రుని చేత సత్కరింపబడిన ఋషులు కూడ అంగీరసునికి కలిగిరి.

 కృశాశ్వస్య తు దేవర్షే ర్దేవః ప్రహరణః సుతః

ఏతే యుగసహస్రాస్తే జాయస్తే పున రేవ హి

మన్వన్తరేషు నియతం తుల్యకార్యైః స్వనామభిః

ఇతి శ్రీ కూర్మపురాణే వంశానుకీర్తనం నామ అష్టాదశోఽధ్యాయః  

దేవతల ఋషిఅయిన కృశాశ్వునికి ప్రహరణుడను దేవ కుమారుడు జన్మించినాడు. వీరు వేయి యుగాల తరువాత మరల కూడ జన్మిస్తారు. ఆయా మన్వంతరాలలో తమపేర్లతో, సమానమైన కార్యములతో నియతముగా జన్మింతురు.

శ్రీ కూర్మపురాణములో వంశానుకీర్తనమును పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.