కూర్మ మహా పురాణము
42వ అధ్యాయము
సూత ఉవాచ -
అన్యచ్చ తీర్ధప్రవరం జప్యేశ్వర సమాపతః ।
నామ్నా పంచనదం పుణ్యం సర్వపాపప్రణాశనమ్ ॥
త్రిరాత్రోపోషిత స్తత్ర పూజతో మహేశ్వరం ।
సర్వపాపవిశుద్ధాత్మ రుద్రలోకే మహీయతే ॥
అన్యచ్చ తీర్థ ప్రవరం శంకరస్యామితౌజసః।
మహాభైరవ మీత్యుక్తం మహాపాతకనాశనమ్॥
తీర్థానాం చ పరం తీర్థం వితస్తా పరమా నదీ ।
సర్వపాపహరా పుణ్యా స్వయమేవ గిరీంద్రజా ॥
తీర్థం పంచతనం నామ శంభో రమితతేజసః ।
యత్ర దేవాదిదేవేన చక్రార్థం పూజితో భవః
పిండదానాదికం తత్ర ప్రేత్యానన్తఫలప్రదం ।
మృత స్తత్రాపి నియమాత్ బ్రహ్మలోకే మహీయతే ॥
కాయావరోహణం నామ మహాదేవాలయం శుభం ।
యత్ర మాహేశ్వరా ధర్మ మునిభిః సంప్రవర్తితాః॥
శ్రాద్ధం దానం తపో హేమ ఉపవాస స్తధాక్షయః ।
పరిత్యజతి యః ప్రాణాన్ రుద్రలోకం స గచ్ఛతి ॥
అన్యచ్చ తీర్థప్రవరం కన్యతీర్థ మీతీ స్మృతమ్।
తత్ర గత్వా త్యజేత్ ప్రాణాం శ్లోకాన్ ప్రాప్నోతి శాశ్వతాన్ ॥
జామదగ్న్యస్య తు శుభం రామస్యాక్లిష్టకర్మణః ।
తత్ర స్నాత్వా తీర్ధవ రే గోసహస్రఫలం లభేత్॥
మహాకాల మితి ఖ్యాతం తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ।
గత్వా ప్రాణాన్ పరిత్యజ్య గాణాపత్య మవాప్నుయాత్ ॥
గుహ్యా త్ గుహ్యతమం తీర్థం నకులీశ్వర ముత్తమమ్ ।
తత్ర సన్నిహితః శ్రీమాన్ భగవాన్ నకులీశ్వరః॥
సూతమహర్షి పలికెను.
మరియొక తీర్ణము జప్యేశ్వర సమీపమున పంచనదమని పరమపావనము సర్వపాప ప్రణాశనము. ఇచట స్నానమాడి మూడు దీనములుపవసించీ మహేశ్వరుని పూజించినవాడు సర్వపాపవినిర్ముక్తుడై రుద్రలోకమున నివసించును. శంకరుని మరియొక తీర్ఘ ప్రవరము మహాభైరవము మహాపాతకములనుకూడా నశింపచేయునది. ఈ తీర్థమున వితస్తలను పరమనది సర్వపాపహరము పుణ్యము. ఈనదీ సాక్షాత్తు పార్వతీరూపము, మరియొక తీర్థము పంచతపము అమితతేజస్వీయగు శంకరుని క్షేత్రమిది. ఇచట శ్రీ మహావిష్ణువు చక్రము కొరకు శంకరుని పూజించెను. ఇచట చేయబడిన పిండ ప్రదానోదకము పరలోకమున అనంతఫల ప్రదము. ఇచట మృతి చెందిన వాడు నీయమ పూర్వకముగా బ్రహ్మలోకమున విరాజిల్లును.
మరియొక శుభతీర్థము కాయావరోహణము. ఇది మహాదేవాలయము. ఇచట మునులు మహేశ్వరధర్మమును ప్రవర్తింప చేసిరి. ఈ తీర్థమున చేయబడిన శ్రాద్దము, దానము, తపస్సు, హోమము, ఉపవాసము అక్షయఫలము నిచ్చును. ఇచట ప్రాణములను విడిచినవాడు రుద్ర లోకమునకు వెళ్ళును. ఇచట మరియొక తీర్థము కన్యాతీర్థమని ప్రసిద్ధిగాంచినది. ఇచట ప్రాణములను, వీడుచువాడు శాశ్వతలోకములనుపొందును. అద్బుత కర్మల నాచరించిన పరశురాముని లీర్ణము కలదు. ఇచట స్నానమాడినపోడు గోసహస్ర ఫలమును పొందును. త్రిలోక ప్రసిద్ధమగు తీర్థము మహాకాలమని కలదు. ఇచట ప్రాణములను విడిచిన వాడు గాణాపత్యమును పొందును. అతిరహస్యమగు నకులీశ్వర తీర్థము కలదు. ఇచట నకులీశ్వర భగవానుడు ఎపుడూ నివసించును.
హిమువచ్ఛిఖరే రమ్యే గంగాద్వారే సుశోభనే ।
దేవ్యా సహ మహాదేవా నిత్యం శీష్యైశ్చ సంవృతః॥
తత్ర స్నాత్వా మహాదేవం పూజయిత్వా వృషధ్వజమ్ ।
సర్వపాపై ర్విముచ్యేత మృత స్తజ్ఞాన మాప్నుయాత్ ॥
అన్యచ్చ దేవదేవస్య స్థానం పుణ్యతమం శుభం ।
భీమేశ్వర మీతి ఖ్యాతం గత్వా ముంచతి పాతకమ్॥
తథాన్య చ్చండవేగాయాః సంభేదః పాపనాశనః ।
తత్ర స్నాత్వా చ పీత్వా చ ముచ్యతే బ్రహ్మహత్యయా॥
సర్వేషా మపి చైతేషాం తీర్థానం పరమ పురీ ।
నామ్నా వారణసీ దివ్యా కోటికోట్యయుతాధికా ॥
తస్యాః పురస్తా న్మాహాత్మ్యం భాషితం వో మయాస్వీహా ।
నాన్యత్ర లభ్యతే ముక్తి య్యోగినా ప్యేకజన్మనా ॥
ఏతే ప్రాధాన్యతః ప్రోక్తా దేశాః పాపహరా నృణాం ।
గత్వా సంక్షాలయేత్ పోపం జన్మాంతరశతైః కృతమ్ ॥
యః సర్వార్థాన్ పరిత్యజ్య తీర్థసేవాం కరోతి హి ।
న తస్య ఫలతే తీర్థ మహలోకే పరత్ర చ ।
ప్రాయశ్చిత్తీ చ విధుర స్తథా పాపా చరో గృహీ ।
ప్రకుర్యాత్ తీర్థసేవాం చ యే చాన్యే తాదృశా జనాః॥
సహాగ్ని ర్వా సపత్నీకో గచ్ఛేత్ తీర్థాని యత్నతః ।
సర్వపాపవినిర్ముక్తో యధోక్తాం గతి మాప్నుయాత్ ॥
ఋణానీ త్రీణ్యప్రాకృత కుర్యాత్ వా తీర్ధసేవనమ్ ।
విధాయ వృత్తిం పుత్రాణాం భార్యాం తేషు నిధాయ చ ॥
ప్రాయశ్చిత్తప్రసంగేన తీర్థమాహాత్మ్య మిరితమ్ ।
యః పఠేత్ శ్రుణుయాత్ వాపీ ముచ్యతే సర్వపాతకైః ॥
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ద్వీచత్వారింశోధ్యాయః
రమ్యమును హిమవచ్చిఖరమున సుశోభన మగు గంగా ద్వారమున, మహాదేవుడు దేవీతో శిష్యులతో కలసి నివసించియుండును, ఇచట స్నానము చేసి వృషధ్వజుడగు మహాదేవుని పూజించిన సర్వపాప వినిర్ముక్తుడగును. మరణించిన తరువాత బ్రహ్మజ్ఞానమును పొందును.
దేవదేవుని పరమపావనమగు స్థానము భీమేశ్వరమని సుప్రసిద్ధమైనది. ఇచటికి వెళ్ళిన చాలును పాపములు తొలగును. ఇట్లే మరియో , తీర్ధము చండవేగానదీ ఉర్గమస్థానము సర్వపాప నాశనము. ఇచట స్నానము చేసి జలమును త్రాగినచో బ్రహ్మ హత్యాపాతకము కూడా తొలగును. ఇట్లు ఇచట చెప్పబడిన అన్ని తీర్థములకన్నా వారాణసీ అనునది పరమపురి కలదు. ఇది పదివేలకోట్ల రెట్లు అధికఫలమును ఇచ్చును. నేను మొదట వారాణసీ మాహాత్మ్యమును చెప్పియుంటిని. ఒకే జన్మలో యోగికి కూడా మరియొక చోట ముక్తి లభించదు. ఈ ప్రదేశములను ముఖ్యమగు వానిని మాత్రమే చెప్పితిని. ఈ తీర్థములకు వెళ్ళి వందల జన్మల పాపమును కడిగివేసుకొన వలయును. స్వధర్మములను విడిచి తీర్థములను సేవించువానికి ఇహపరములలో ఫల ప్రదము కాజాలదు. ప్రాయశ్చిత్తములను చేయవలసిన వాడు, పాపములను ఆచరించినవాడు, పత్నీవీముక్తుడు. ఇటువంటి వాడు తీర్థయాత్రలను సంచరించవలయును. అగ్నితో పత్నితో కలిసి తీర్థయాత్రలను సంచరించవలయును. సర్వపాప వినిర్ముక్తుడై యధోక్తలోకములను పొందును. దేవఋషి పితృఋణములను తొలగించుకోని తీర్ధసేవనము చేయవలయును. పుత్రులకు జీవనవృత్తిని ఏర్పరిచి భార్యను పుత్రులయందుంచి తీర్థ యాత్రలను చేయవలయును. ప్రాయశ్చిత్త ప్రసంగమున తీర్థ మాహాత్మ్యము చెప్పబడినది. ఈ మాహాత్యమును చెప్పిననూ వినిననూ సర్వపాపములు నశించును.
ఇది కూర్మపురాణమున షట్సాహస్రిసంహితలో ఉపరి విభాగమున 42వ అధ్యాయము.
Summary of chapter 95 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa provides a comprehensive summary of the entire Kūrma Purāṇa, encompassing both Pūrvārdha and Uttarārdha. He reinforces the Purāṇa's central philosophy of Hari-Hara synthesis, the harmony of Bhakti, Karma, and Jñāna, and the strict observance of Vedic Varṇāshrama Dharma as the true pathway to spiritual perfection.