కూర్మ మహా పురాణము
38వ అధ్యాయము
సూతఉవాచః-
ఏషా పుణ్యతమా దేవీ దేవగంధర్వ సేవితా ।
నర్మదా లోకవిఖ్యాతా తీర్థానా ముత్తమా నదీ॥
తస్యాః శ్రుణుధ్వం మాహా త్య్మం మార్కండేయేన భాషితం ।
యుధిష్ఠిరాయ తు శుభం సర్వపాపప్రణాశనమ్ ॥
సూతమహర్షి పలికెను.
ఈ నర్మదాదేవి పరమ పావనురాలు. దేవతలచే గంధర్వులచే సేవించబడి, ప్రసిద్ధిగాంచీ, నదీరూపముగా పరిణమించి, ఉత్తమ తీర్థముగా పేరొందిను. మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన ఈ తీర్థమాహాత్మ్యమును వినుడు. ఇది శుభము, సర్వపాప ప్రణాశనము.
యుధిష్ఠిర ఉవాచః-
శ్రుతా స్తు వివిధా ధర్మా స్త్వత్ప్రసాదాత్ మహామునే ।
మాహాత్మ్యం చ ప్రయాగస్య తీర్థాని వివిధానీ చ ॥
నర్మదా సర్వతీర్ణానాం ముఖ్యా హి భవతే రితా ।
తస్యా స్త్విదానీం మాహాత్మ్యం వక్తు మర్హసి సత్తమ ॥
ధర్మరాజు ఇట్లు అడిగెను
ఓ మహామునీ నీచే పలువిధములగు ధర్మములను వింటిని. ప్రయాగ మాహాత్మ్యము, పలు తీర్థముల మాహాత్మ్యము కూడా వింటిని. అన్ని తీర్థములలో ముఖ్యమైనది నర్మద అని మీరు చెప్పితిని. ఇప్పుడు ఆ నర్మదా మాహాత్మ్యమును తెలుపవలసినదిగా ప్రార్థించుచున్నాను.
మార్కండేయ ఉవాచ
నర్మదా సరితాం శ్రేష్టా రుద్రదేహాత్ వినిస్సృతా ।
తారయేత్ సర్వభూతాని స్థావరాణి చరాణి చ॥
నర్మదాయాస్తు మాహాత్మ్యం పురాణే య న్మయా శ్రుతమ్ ।
ఇదానీం త్వాం ప్రవక్ష్యామి శృణుష్వైకమనాః శుభమ్ ॥
పుణ్యా కనఖలే గంగా కురుక్షేత్ర సరస్వతీ ।
గ్రామే వా యది వారణ్యే పుణ్యా సర్వత్ర నర్మదా ॥
త్రిభిః సారస్వతం తోయం సప్తాహేన తు యామునమ్ ।
సద్యః పుతి గంగేయం దర్శనా దేవ నార్మదమ్ ॥
కలింగదేశపశ్చార్థే పర్వతే మరకంటకే ।
పుణ్యా చ త్రిషు లోకేషు రమణీయా మనోరమా ॥
సదేవాసురగంధర్వ ఋషయశ్చ తపోధనాః ।
తప స్తత్త్వాతు రాజేంద్ర సిద్దిం తు పరమాం గతిమ్ ॥
తత్ర స్నాత్వా నరో రాజన్ నీయమస్తో జితేంద్రియః।
ఉపోష్య రజనీ మేకాం కుళానాం తారయే చ్ఛతమ్ ॥
యోజనాసోం శతం సాగ్రం శ్రూయతే సరి దుత్తమా ।
విస్తారేణ తు రాజేంద్ర యోజనద్వయ మాయతా ॥
షష్టితీర్ధసహస్రాణి షష్టికోట్య స్తథైవ చ ।
పర్వతస్య సమంతాత్ తు తిష్ఠం త్యమరకంటకే ॥
బ్రహ్మచారీ శుచిర్భూత్వా జీతక్రోధో జితేంద్రియః ।
సర్వహింసానివృత్త స్తు సర్వభూతహితే రత॥
ఏవం సర్వసమాచారో యస్తు ప్రాణాన్ సముత్సృజేత్ ।
తస్య పుణ్యం ఫలం రాజన్ శ్రుణుష్వా మహితో నృప ॥
మార్కండేయుడిట్లు చెప్పెను.
నర్మదానది అన్నీ సదులలో శ్రేష్టమైనది. ఈనదీ రుద్రదేహమునుండి వెడలినది. స్థావరములను, చరములను అన్నింటిని తరింప చేయును. పురాణకాలమున నేను వినిన నర్మదా మాహాత్మ్యమును నీకు చెప్పెదను. సావధానముగా వినుము. కనఖల క్షేత్రమున గంగ కురుక్షేత్రమున సరస్వతి పాపనమని చెప్పుదురు. కాని నర్మదానది గ్రామమున గాని, అరణ్యమునగానీ, అంతట పవిత్రమైనదేకదా సరస్వతీనదిని మూడు దీనములు, యమునానదిని ఏడు దీనములు, గంగానదిని స్పృశించిన వెంటనే పవిత్రులగుదురు. కాని నర్మదానది దర్శనమాత్రముచే పునీతము చేయును. కళింగదేశపు పశ్చిమభాగమున అమరకంటకమను పర్వతమునుండియే, పవిత్రము, మూడులోకముల రమణీయము, మనోహరమునగు నర్మదానదీ వెలువడినది. ఓ రాజేంద్రా దేవతలు, అసురులు, గంధర్వులు, తపోధనులగు ఋషులు ఇచ్చటనే తపస్సుచేసి, పరమమగు సిద్ధిని పొందిరి. నరుడెవరేని అచటస్నానముచేసి, ఆత్మసంయమనము కలిగి, జితేంద్రియుడై ఒక్కరాత్రి ఉపవసించెనేని, నూరు తరముల ఆతని వంశమును తరింప చేయును.
రాజేంద్రా ఈ ఉత్తమమగు నది నూరు యోజనముల పొడవు, రెండుయోజనముల వెడల్పు విస్తరించేనని విందుము. ఆ అమరకంటక పర్వత సమీపమున లెక్కకు మిక్కిలి తీర్థములున్నవి. ఓ రాజా ఎవరైనను బ్రహ్మచర్యమును పాటించుచు, శుచియై, క్రోధమును జయించి, ఇంద్రియములు జయించి, సర్వవిధముల హింసనువీడీ, సర్వభూతములందు హితమును పాటించుచు, వీటినన్నింటిని అసిధారావ్రతముగా పాటించు వాడు ఇచట ప్రాణములవీడెనేని, వానికి లభించు పుణ్యమును సావధానచిత్తుడవైవినుము.
శతవర్షసహస్రాణి స్వర్గే మోదతి పాండవ ।
అప్సరోగణసంకీర్ణో దివ్యస్తీపరివారితః ॥
దివ్యగంధానులిప్తశు దివ్యపుష్పోపశోభితః ।
క్రీడతే దేవలోకేతు దైవతైః సహ మోదతే ॥
తతః స్వర్గాత్ పరిభ్రష్టో రాజా భవతి ధార్మికః ।
గృహం తు లభతే సౌ వై నానారత్నసమన్వితమ్॥
స్తంబైర్మణిమయై ర్దివ్యై ద్వజ్రవైఢూర్యభూషితమ్ ।
ఆలేఖ్య వాహనైః శుభ్రై ర్దాసీదాససమన్వితమ్॥
రాజరాజేశ్వరః శ్రీమాన్ సర్వసీజనవల్లభః ।
జీవేత్ వర్షశతం సాగ్రం తత్ర భోగసమన్వితః ॥
ఓ రాజా అతడు దేవతాస్త్రీలతో పరివేష్టించబడి, అప్సరోగణముల సమ్మర్ధమైన స్వర్గలోకమున నూరువేల సంవత్సరములు ఆనందించును. దీవ్యగంధమును ఒంటినిండ అలదుకొని, దివ్యపుష్పదామముల అలంకరింపబడి, దేవలోకములో క్రీడించుచు, దేవతాబృందముతో ఆనందించును.
అంతట పుణ్యానుభవము పూర్తి అయిన పిదప స్వర్గమునుండి భువికి జారీ, ధార్మికుడగు రాజుగా జన్మించును. అతనిని నానారత్న సమన్వితమును, దీవ్యమణిమయములు, వజ్రవైడూర్యములచే అలంకరింపబడు స్తంభములతో, వర్ణింపనలవికాని వైభవముగల వాహనములతో, దాసదాసీజన సమన్వితమైన భవంతి లభించును. సకల స్త్రీలోక మనోవల్లభుడై, రాజరాజేశ్వరుడై శ్రీయుతుడై నూరు వత్సరముల పర్యంతము సకలభోగములను అనుభవించుచు జీవించును.
అగ్నిప్రవేశే ధ జలే అథవా నశనే కృతే ।
అనివర్తికా గతి స్తస్య పవన స్యాం బరే యథా॥
పశ్చిమే పర్వతతటే సర్వపాపవినాశనః ।
హ్రదో జలేశ్వరో నామ త్రిషులోకేషు విశ్రుతః ॥
తత్ర పిండప్రదానేన సంధ్యోపాసనకర్మణా ।
దశవర్షాణి పితర స్తారితాః స్యు ర్న సంశయః ॥
దక్షిణే నర్మదాకూలే కపిలాఖ్యా మహానదీ ।
సరళార్జునసంఛన్నా నాతిదూరే వ్యవస్థితా॥
సా తు పుణ్యా మహాభాగా త్రిషు లోకేషు విశ్రుతా ।
తత్ర కోటిశతం సాగ్రం తీర్ధానాం తు యుధిష్ఠిర ॥
తస్మిం తీర్థతు యే వృక్షాః పతీతాః కాలపర్యయాత్ ।
నర్మదాతోయసంస్పృష్టా స్తే యాన్తి పరమాం గతిమ్ ॥
ద్వితీయా తు మహాభాగా విశల్యకరణీ శుభా ।
తత్ర తీర్దే నరః స్నాత్వా విశల్యో భవతి క్షణాత్ ॥
కపిలా చ విశల్యా చ శ్రూయతే రాజసత్తమ ।
ఈశ్వరేణ పురా ప్రోక్తా లోకానాం హితకామ్యయా ॥
అనాశకం తు యః కుర్యాత్ తస్మిం తీర్దే నరాధిప ।
సర్వపాపవిశుద్దాత్మా రుద్రలోకం స గచ్ఛతి ॥
తత్ర స్నాత్వానరో రాజ న్నశ్వమేధఫలం లభేత్ ।
యే వస త్యుత్తరే కూలే రుద్రలోకే వసంతి తే॥
ఈ తీర్థములో అగ్ని ప్రవేశముచేసి, జలప్రవేశము చేసిన, అనశన వ్రతమాచరించిన ఆకాశమున వాయువులో, పునరావృత్తి రహితమైన ఉత్తమపదము ప్రాప్తించును. అమరకంటక పర్వత పశ్చిమతటమున జలేశ్వరమను హ్రదము సర్వపాపవినాశకము, మూడులోకములలో ప్రసిద్ధి గలది. ఈ తీర్థమున సంధ్యావందనము చేసి, పిండప్రదాన మాచరించిన పితృదేవతలు పదిసంవత్సరముల వరకు తృప్తి చెందుదురు. నర్మదా దక్షిణ తటమున కపిల అను మహానది కలదు. ఈనదికి రెండువైపుల సరళ, అర్జునవృక్షములు హ్యాపించియున్నవి. కపిలానది పరమపావనము. మూడులోకముల ప్రసిద్దిగాంచినది. ఈ తీర్థమున కోటి తీర్థముల కంటే ఎక్కువ తీర్థములే కలిసి ఉన్నవి. కాలవశమున, ఈ తీర్థమున పడిపోయిన వృక్షములు గూడ నర్మదాజల స్పర్శ సంభవించినచో ఉత్తమ గతినీ పొందును. మరియొక మహానది మహాభాగ అనునదీ. ఇది శుభంకరము; విశల్యకరణి కూడ ఈ తీర్థములో స్నానము చేసిన వానికి శల్యములు, (పాపములు) తొలగిపోనును. కపిల, విశల్య అను రెండు నదులు పురాణ కులమున లోకహితమునుగోరీ ఈశ్వరునిచే ఏర్పరచబడినవి. ఈ తీర్థమున ఉపవసించినవాడు అన్ని పాపములు తొలగి పరిశుద్ధుడై రుద్రలోకమును పొందును. ఈ తీర్ధమున స్నానము చేసినవాడు అశ్వమేధ ఫలమును పొందును. ఈ నది ఉత్తరతీరమున ఉన్నవారు రుద్రలోక పోసమును పొందెదరు.
సరస్వత్యాం చ గంగాయాం నర్మదాయాం యుధిష్ఠిర ।
సమం స్నానం చ దానం చ యథా మే శంకరో బ్రవీత్ ॥
పరిత్యజతి యః ప్రాణాన్ పర్వతే మరకంటకే ।
వర్షకోటీశతం సాగ్రం రుద్రలోకే మహీయతే॥
నర్మదాయాల జలం పుణ్యం ఫేనోర్మిసమలంకృతమ్।
పవిత్రశిరసాం వంద్య సర్వ పాపైః ప్రముచ్యతే ॥
నర్మదా సర్వతః పుణ్యా బ్రహ్మహత్యాపహారిణీ ।
అహెరాత్రోపవాసేన ముచ్యతే బ్రహ్మహత్యయా ॥
జాలేశ్వరం తీర్ధవరం సర్వపాపవినాశనమ్ ।
తత్ర గత్వా నియమబాస్ సర్వకామా ల్లభతే నరః ॥
చంద్రసూయ్యోపరాగే తు గత్వా హ్యమరకంటకం ।
అశ్వమేధాత్ దశగుణం పుణ్య మాప్నోతి మానవః ॥
ఏష పుణ్యే గిరీవరో దేవగంధర్వసేవితః ।
నానాద్రుమలతాకీ ర్ణో నానాపుష్పోపశోభితః॥
తత్ర సన్నిహితో రాజన్ దేవ్యా సహ మహేశ్వరః ।
బ్రహ్మా విష్ణు స్తధా చేంద్రో విద్యాధరగణై స్సహ ॥
ప్రదక్షిణం తు యః కుర్యాత్ పర్వతం హ్యమరకంటకం ।
పౌండరీకస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥
కావేరీ నామ వీపులా నదీ కల్మషనాశినీ ।
తత్ర స్నాత్వా మహాదేవ మర్చయేత్ వృషభధ్వజమ్ ।
సంగమే నర్మదాయా స్తు రుద్రలోకే మహీయతే ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్ధే ఆష్టత్రింశో ధ్యాయః
సరస్వతీ నదీలో, గంగానదిలో, నర్మదానదిలో చేసిన స్నానము, దానము సమఫలముల నీచ్చునని శంకరుడు చెప్పెను. అమర కంటక పర్వతమున మృతి చెందినవాడు రుద్రలోకమున నూరు కోట్ల సంవత్సరములు నివసించును. నురుగుల తరగలతో నిండిన, పరమపావనమైన పుణ్యకరమైన నర్మదానదీ జలమునకు, నమస్కరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడగును. నర్మద అన్ని విధముల పవిత్రమైనది. బ్రహ్మహత్యా పాపము గూడో నశింపచేయగల నది. ఇచట ఒక్కదినము ఉపవాసమున్నవారు బ్రహ్మహత్యాపాపము తొలగించుకొనగలరు. అట్లే జాలేశ్వరము అను మరియొక తీర్థము గలదు. ఇది కూడా సర్వపాప వినాశకరము. ఇచట మనో నియమముతో నివసించువారు సర్వాభీష్టములను పొందుదురు, సూర్యచంద్ర గ్రహణ సమయములో అమరకంటక పర్వతమునకు వెళ్లినవాడు అశ్వమేథయాగముకన్న పదిరెట్లు ఫలమును పొందును. ఈ అమర కంటక పర్వతము పుణ్యప్రదమైనది. దేవతలు గంధర్వులు సేవించిరి. పలు వృక్షములతో లతలతో కూడియున్నది. పలుప్రకృతులతో పరిశోభితమైనది. ఈ క్షేత్రమున పార్వతితో పరమేశ్వరుడు, బ్రహ్మ విష్ణువు, ఇంద్రుడు, విద్యాధరగణములు నిత్య నివాసమేర్పరచుకొనిరి. అమరకంటక పర్వతమునకు ప్రదక్షిణ చేసినవాడు పౌండరీకక్రతుఫలమును పొందును.
ఇట్లే కావేరియను విశాలమగు పాపనివారిణియగు నది కలదు. ఇచట స్నానమాడి, వృషభధ్వజుడైన మహాదేవుని పూజించవలయును. నర్మదాసంగమమున, శంకరుని ఆరాధించినపోడు, రుద్రలోకమును చేరును.
ఇది శ్రీ కూర్మపురాణములో షటిసాహస్రసంహితలో ఉపరివిభాగమున ముప్పది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 91 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa extols the supreme majesty of sacred Tīrthas, focusing on Prayāgarāja, the king of all pilgrimage sites at the holy Saṅgama of Gangā, Yamunā, and Sarasvatī. He describes how bathing at Prayāga during the month of Māgha, worshipping Veṇī Mādhava, and offering Śrāddha at Akshaya Vaṭa destroys all sins and grants immediate salvation.