కూర్మ మహా పురాణము
22వ అధ్యాయము
వ్యాస ఉవాచః-
గోమయే నోదకై ర్భూమిం శోధయిత్వా సమాహితః ।
సన్నిమంత్ర్య ద్విజాన్ సర్వాన్ సాధుభిః సన్నిమంత్రయేత్ ॥
శ్వో భవిష్యతి మే శ్రాద్ధం పూర్వేద్యు రభిమంత్ర్య చ ।
అసంభవే పరేగ్యు ర్వా యథో క్తై ర్లక్షణె ర్యుతాన్ ॥
వ్యాస మహర్షి చెప్పెను
సావధానముగా గోమయముతో నీటితో భూమిని చక్కగా లీకి, ద్వజసమూహమును చేరి సజ్జనుల ద్వారా బ్రాహ్మణులను నియంత్రణ గావించవలయును. శ్రాద్ధపూర్వదినమున బ్రాహ్మణులను చక్కగా పూజించి రేపు మా ఇంటిలో శ్రాద్ధము జరుగగలదు. తాము దయతో రావలయును. ఇట్లు నియంత్రణ చేయవలయును. ఒక దినము ముందు, అపకాశము లేనిచో శ్రాద్ధ దినముననే వెళ్ళి పూర్వము చెప్పిన లక్షణములు కలపోరిని పిలువవలయును.
తస్య తే పితరః శ్రుత్వా శ్రాద్ధకాల ముపస్థితమ్ ।
అన్యోన్యం మనసా ధ్యాత్వా సంపతంతి మనోజవాః ॥
తై ర్భ్రాహ్మణైః సహాశ్నస్తి పితరో హ్యన్తరిక్షగాః ।
వాయుభూతా స్తు తీష్ఠని భుక్త్వా యాంతి పరాంగతిమ్॥
ఆమంత్రితాశ్చ తే విప్రాః శ్రాద్ధకాల ఉపస్థితే ।
వసేయు ర్నియతాః సర్వే బ్రహ్మచర్యపరాయణాః॥
మనోవేగముకల పొరీ పితృదేవతలు ఈనిమంత్రణమును విని శ్రాద్ధకాలము వచ్చినది అని పరస్పరము ఆలోచించుకొనీ శ్రాద్ధకర్త ఇంటికి చేరెదరు. అంతరిక్షమున సంచరించు పీతరులు వాయురూపమున నుండి బ్రాహ్మణులతో కలిసి భుజించెదరు. భోజనము చేసి పరమగతిని పొందెదరు. నియంత్రణ చేయబడిన విప్రులు శ్రాద్ధకాలమున నియమపరులు బ్రహ్మచర్య పరాయణులుగా నుండవలయును.
ఆక్రోధనోని త్వరో మత్తః సత్యవాదీ సమాహితః ।
భారం మైధున మధ్వానం శ్రాద్ధకృ ద్వర్జయే ద్ధ్రువమ్॥
శ్రాద్ధము చేయువాడు క్రోధము, తొందరపాటు, ఏమరుపాటులేనివాడుగా ఉండపలయును. సత్యపోది సావధానిగా నుండవలయును, బరువును మోయుట, స్త్రీ సంగమము, యాత్రను విడువవలయును.
ఆమంత్రితో బ్రాహ్మణో వై యో న్యస్మై కురుతే క్షణమ్ ।
స యాతి నరకం ఘోరం సూకరత్వం ప్రయాతి చ ॥
ఆమంత్రయిత్వా యో మోహా దన్యం చా మంత్రయే ద్వైజః ।
స తస్మా దధికః పాపీ విష్ఠాకీటో భిజాయతే ॥
శ్రాద్దే నీమంత్రితో విప్రో మైథునం యోనిధిగచ్ఛతి ।
బ్రహ్మహత్యా మవాప్నోతి తిర్యగ్యోనౌ విధీయతే ॥
నియంత్రిత స్తు యోఽ విప్రో హ్యధ్వానం యాతి దుర్మతిః।
భవన్తో పితర స్తస్య తన్మాసం పాపభోజనాః ॥
శ్రాద్దము కొరకు పిలువబడినవాడు ఇతరుల నియంత్రణమును స్వీకరించినచో ఘోరనరకమును పొందును. మరల సూకరముగా పుట్టును. ఒకబ్రాహ్మణుని నియంత్రణజూపి అతన్ని కాదని ఇంకొకరిని పిలిచినవాడు రెట్టింపు పాపమును పొంది పలకీటముగా పుట్టును. శ్రాద్ధమున నీమంత్రించబడినవాడు మైధునమాచరించినచో బ్రహ్మహత్యాపాపమును పొందును. పశుజాతిలో పుట్టును, శ్రాద్ధమున నీమంత్రితుడు ప్రయాణము చేసినచో అతని పితలు ఆనెల పాంసు భోజునులగుదురు.
నీమంత్రిత స్తు యః శ్రాద్దే కుర్యా ద్వై కలహం ద్వీజః ।
భవస్తి పితరస్తస్య తన్మాసం మలభోజనాః ॥
తస్మా న్నిమంత్రితః శ్రాద్ధే నియతాత్మా భవే ద్వీజః।
అక్రోధనః శాచపరః కర్తా చైవ జితేంద్రియః ॥
శ్వోభూతే దక్షిణాం గత్వా దేశం దర్భా న్వీచక్షణః ।
సమూలా నాహరే ద్ద్వారి దక్షిణాగ్రాన్ సునిర్మలాస్॥
దక్షిణా ప్రవణం స్నిగ్ధం విభక్తం శుభలక్షణమ్ ।
శుచిం దేశం వివిక్తం చ గోమయ నోపలేపయేత్ ॥
నదీతీరేషు తీర్దేషు స్వభూమౌ చైవ నాంబుషు ।
వీవిక్తేషు చ తుష్యని దత్తన పితరః సదా ॥
పారక్యే భూమిభాగేతు పితృణాం నైవ నిర్వపేత్।
స్వామీభి స్తధ్వీహన్యేత మోహా ద్యత్ క్రీయతే నరైః॥
అటవ్యః పర్వతాః పుణ్యా స్తీర్థా న్యాయతనాని చ ।
సర్వా ణ్యస్వామికాన్యాహు ద్న హ్యేతేషు పరిగ్రహః ॥
తిలాన్ ప్రవికిరే తత్ర సర్వతో బంధయే దజమ్ ।
అసురోపహతం శ్రాద్ధం తిలైః శుధ్యత్వజేన తు ॥
శ్రాద్దమున పిలువబడిన బ్రాహ్మణుడు కలహించినచో అతని పితరులు ఆమాసముమల భోజనులగుదురు. కావున శ్రాద్ధమున నియంత్రణ చేయబడిన గాడు మనోనిగ్రహము కలిగియుండవలయును. కోపరహితుడు శౌచపరుడు కావలయును. కర్తకూడో జితేంద్రియుడు కావలయును, శ్రాద్దదినమున కంటే పూర్వదినమున సావధానమనస్కుడై దక్షిణ దీక్కునకువెళ్ళి దక్షిణ దిక్కునకు వంగియున్న వేళ్ళతోనున్న దర్భలను జలమును గొనిరావలయును. దక్షిణమునకు వంపుగా వున్నదిస్నిగ్ధమైనది ఇతర సంబంధరహితమగు నది, శుభలక్షణ సమన్వితము పవిత్రము జన సమ్మర్థరహితమునగు స్థలమును ఆవుపేడతో నలుకవలయును. నదీతీరములందు, తీర్థములందు స్వభూమియందు, పర్వతశిఖరములందు, ఏకాస్త ప్రదేశమునందు చేయబడు శ్రాద్దమున పితరులు ఎప్పుడు సంతసించుచుందురు. పరకీయభూమియందు పితృశ్రాద్ధము చేయరాదు. మోహముతో అట్లు చేసినచో ఆభూమి యజమానివలన ఆశ్రాద్ధముఫలము చేరబడును. అరణ్యములు పర్వతములు పుణ్యతీర్ధములు దేవాలయములు ఇవన్నియు అస్వామికములు ఈభూమిలో అంతటా నువ్వులను చల్లవలయును. రాక్షసులచేత ఆక్రమించబడిన భూమి నువ్వులచే శుద్ధిచేయబడును.
తతోఽ న్నం బహుసంస్కారం నైకవ్యంజనమధ్యగమ్ ।
చోష్యం పేయం సంస్కృతం చ యథాశక్తి ప్రకల్పయేత్ ॥
తతో నివృత్తే మధ్యాహ్నే లుప్తరోమనఖా నిజాన్ ।
అనుగమ్య యథామార్గం ప్రయచ్ఛే ద్దంతధావనమ్ ॥
ఆసధ్వ మితి సంజల న్నాసీరనే పృథక్ పృథక్ ।
తైల మభ్యంజనం స్నానం స్నానీయం చ పృథగ్విధమ్ ॥
పాత్రై రౌదుంబ రై ర్దద్యా ద్వైశ్వదేవత్వ పూర్వకమ్ ।
తతః స్నానో న్నివృత్తేభ్యః ప్రత్యుత్థాయ కృతాంజలిః ॥
పొద్య మాచమనీయం చ సంప్రయచ్ఛే ద్యథాక్రమమ్ ।
యే చాత్ర విశ్వేదేవానాం ద్విజాః పూర్వం నియంత్రితాః ॥
ప్రాజ్ముఖా న్యాసనాన్యేషాం త్రిదర్భోపహతాని చ ।
దక్షిణాభిముఖాక్తానీ పితృణా మాససాని చ ॥
దక్షిణాగ్రేషు దర్భేషు ప్రోక్షినీ తిలోదకైః, తేషూ పవేశమే దేతా నాసనం సంసృశ న్నపి ॥
పలువిధములుగా సంస్కరించబడిన అన్నమును అనేకవ్యంజనములు కలదానిని చోష్యాదీసమృద్ధమును యధాశక్తి కల్పించవలయును. తరువాత మధ్యాహ్నకాలము గడిచినతరువాత క్షవరము చేసుకొనిన వారిని నఖరోమములు బయటికి రాని వారిని బ్రాహ్మణులను సమీపించి మార్గమధ్యలో దంతధావనమున కీయవలయును. వైశ్వదేవ మంత్రముల నుచ్చరించుచు మేడిచెక్కతో చేయుపాత్రలతో అభ్యంజనము కోరకు తైలమును స్నానమునకు జలమును ఈయవలయును, స్నానము చేసి తిరిగి వచ్చిన వారిని ప్రత్యుత్థానముగావించి చేతులు జోడించుకొని యధాక్రమముగా పాద్యమును ఆచమనీయమును ఈయవలెను విశ్వేదేవతలకొరకు నియంత్రించబడిన బ్రాహ్మణులను మూడు దర్బలతో ప్రొజ్ముఖాసనములనుంచవలయును. పితృదేవతలకు దక్షిణాముఖాసనములను ఒకే దర్భకలవి తిలోదకములతో ప్రోక్షించబడవలయును. ఆసనమును స్పృశించి వాటి పై వీరిని కూర్చోబెట్టవలయును. కూర్చొనుడనిపలికి విడివిడిగా ఏర్పాటు చేయవలయును.
ద్వౌదేవో ప్రొబ్ముథా పిత్రే త్రయ శోదబ్ముఖాస్తథా ।
ఏకైకం తత్ర దేవంతు పితృమాతామహేష్వపి ॥
సత్క్రియాం దేశకాలౌ చ శౌచం బ్రాహ్మణసంపదమ్ ।
పంచైతాన్విస్తరో పలు తస్మా న్నే హేత విస్తరమ్ ॥
అపి వా భోజయే దేకం బ్రాహ్మణం వేదపారగమ్
శ్రుతశీలాదిసంపన్న సు లక్షణవివర్జితమ్ ॥
ఉద్ధృత్య పాత్రే చాన్నం త త్సర్వస్మాత్ ప్రకృతాత్తతః ।
దేవతాయతనే వాసౌ నివేద్యా న్యత వర్తయేత్॥
ప్రాశే దన్నం తదగ్నౌతు దద్యా ద్వై బ్రహ్మచారిణే ।
తస్మా దేకమపి శ్రేష్ఠం విద్వాంసం భోజయే ద్ద్విజమ్ ॥
భిక్షుకో బ్రహ్మచారీ వా భోజనార్థ ముపస్థితః ।
ఉపవిష్టస్తు యః శ్రాద్ధే కామం తమపి భోజయేత్ ॥
అతిథి ర్యస్య నాశ్నాతి న తచ్ఛ్రాద్ధం ప్రశస్యతే ।
తస్మాత్ ప్రయత్నా చ్ఛ్రాద్ధేషు పూజ్యా హ్యతిథయో ద్వీజైః॥
ఆతిథ్యరహితే శ్రాద్ధే భుంజతే యే ద్విజాతయః ।
కాకయోనిం ప్రజన్యేతే దాతా చైవ న సంశయః ॥
హీనాంగః పతితః కుష్ఠీ ప్రణయుక్తస్తు నాస్తికః ।
కుక్కుటః శూకరశ్వానౌ వర్జ్యాః శ్రాద్ధేషు దూరతః ॥
బీభత్స మశుచిం నగ్నం మత్తం ధూర్తం రజస్వలామ్॥
నీలకాషాయవసనపాషండాంశ్చ వివర్జయేత్ ॥
విశ్వేదేవస్థానమున ఇద్దరు విప్రులు ప్రొజ్మఖముగా, పితృస్థానమున ముగ్గురు ఉదఙ్ముఖమున కూర్చొనవలయును. ఇట్లు వీలుకానిచో దేవస్థానమున ఒకరిని పితృస్థానమున ఒకరిని నిమంత్రించవలయును. శ్రాద్ధమున విస్తృతి జరిపిన సత్కారము దేశకాలము శౌచము బ్రాహ్మణ సంపద అను ఈ అయిదు లోపించును. కావున శ్రాద్దమున వేదపారగుడగు బ్రాహ్మణుని ఒకనిభుజింప చేసిననూ పోలుసు. సిద్దము చేసిన భోజన పదార్థములనుండి తగినంత ఒక పాత్రలో తీసుకొని దేవాలయమున భగవంతునికి నివేదన జరిపిన తరువాత ఇతర కార్యమును ప్రవర్తింపచేయవలయును. శ్రాద్దాన్నమును అగ్నీలో కానీ బ్రహ్మచారికి కాని నివేదించవలయును. కావున ఒకరినైనా విద్వాంసుని శ్రేష్టుని భుజింప చేయవలయును. శ్రాద్ధమున భుజించుటకు బ్రాహ్మణులు కూర్చున్నపుడు భిక్షుకుడు కానీ బ్రహ్మచారి కాని వచ్చినచో వారితోపాటు అతనిని కూడా భుజింప చేయవలయును. అతిథి భుజించని శ్రాద్ధమున శ్రేష్ఠము కాజాలదు. కావున శ్రాద్దములందు విశేష ప్రయత్నముతో అతిథులను పూజించవలయును. ఆతిథ్యములేని శ్రాద్ధము భుజించిన ద్విజులు, భుజింప చేసిన కర్త కూడా కాకులుగా పుట్టెదరు. అంగవికలుడు, పతితుడు, కుష్టురోగి గాయము తగిలినవాడు, పులసలు, నాస్తికుడు, కోళ్ళు వరాహములు,శునకములు శ్రాద్దమునకు దూరముగా పరిహరింబడవలయును. భయంకరుని, అపవిత్రుని, నగ్నుని, మత్తుని, ధూర్తుని, రజస్వల స్త్రీని, నీలవస్త్రని, కాషాయ వస్తునీ పాఖండులను శ్రాద్ధములో దూరముగా విడువవలయును.
యత్తత్ర క్రియతే కర్మ పైతృకం బ్రాహ్మణాన్ ప్రతి ।
తత్సర్వమేవ కర్తవ్యం వైశ్వదైవత్యపూర్వకమ్ ॥
యధో పవిష్ట్రాన్ సర్వాం స్తా నలంకుర్దూద్విభూషణైః ।
స్రగ్దామభిః శిరో వేష్టై దూపవాసోనులేపనైః ॥
తత స్త్వావాహమే ద్దేవాన్ బ్రాహ్మణానామనుజ్జయా ।
ఉదజ్ముఖో యధాన్యాయం విశ్వేదేవాస ఇత్యృచా ॥
ద్వే పవిత్ర గృహీత్వాస్య భోజనే క్షాళితే పునః ।
శన్నో దేవీత్యపః క్షిప్త్వా యవో సీతి యవాం స్తథా ॥
యా దివ్యా ఇతి మంత్రేణ హస్తే త్వర్థ్యం వినిక్షేసేత్ ।
అపసవ్యం తతః కృత్వా పితృణాం దక్షిణాముఖః ।
ఆవాహనం తతః కుర్యా దుశన స్తేత్యృచా బుధః ॥
ఆవాహ్య తదనుజ్ఞాతో జపే దాయస్తున స్తతః ।
శన్నో దేవ్యోదకం పాత్రే తిలో సీతి తిలాం స్తథా ॥
క్షిప్తా చార్ఘ్యం యథాపూర్వం దత్వా హస్తేషు పో పునః ।
సంగ్రవాంశ్చ తతః సర్వాన్ పాత్రే కుర్యా త్సమాహితః ॥
పితృభ్యః స్థాన మేతచ్చ న్యుబ్జ పాత్రం నిధాషయేత్ ।
అగ్నౌ కరిష్య న్నాదాయ పృచ్ఛేదన్నం ఘృతప్లుతమ్ ॥
కురుష్వే త్యభ్యనుజ్జుతో జుహుయా దుపవీతవిత్ ।
యజ్ఞోపవీతినే హోమః కర్తవ్యః కుశపాణీనా॥
ప్రాచీనావీతినా పిత్ర్యం వైశ్వదేవం తు హోమనీత్।
దక్షిణం పాతయే జ్ఞానుం దేవాన్ పరిచరన్నదా ॥
పితృణాం పరిచర్యాసు పాతయే దీతరం తథా
పితృకర్మలో బ్రాహ్మణుల విషయమున చేయవలసిన దంతయూ వైశ్వ దేవ పూర్వకముగా ఆచరించవలయును, యధావిధిగా కూర్చొనియున్న బ్రాహ్మణులందరినీ పుష్పహారములతో శిరోవేష్టనములతో వస్త్ర ధూప విభూషణాదులతో అలంకరించవలయును. తరువాత బ్రాహ్మణాజ్ఞతో ఉత్తరాభి ముఖముగా కూర్చున్న వారిలో విశ్వేదేవాస” అను మంత్రముతో విశ్వ దేవతలను ఆపోహించవలయును. చకగ్రా కడిగిన పాత్రలో రెండు పవిత్రములను తీసుకోని 'శంనోదేమీ' అను మంత్రముతో జలమును ప్రోక్షించి 'యవోసి' అను మంత్రముతోయవములను చల్లి, 'యాదీవ్యా' అను మంత్రముతో హస్తమున అర్ఘ్యమును విడువవలయును. తరువాత శక్త్యానుసారము గంధమాల్య ధూపాదులను సమర్పించవలయును.
తరువాత అపసవ్యముగా దక్షిణాముఖుడై పితృదేవతలకు 'ఉశంతస్వ' అను మంత్రముతో ఆవాహన చేయవలయును. తరువాత వారి అనుమతితో 'ఆయంతునః' అను మంత్రమును జపించవలయును. ‘శంనో దేవీ” అను మంత్రముతో పాత్రలో ఉదకమును, “తిలోసి' అను మంత్రముతో తిలలను చల్లి, యధా పూర్వముగా హస్తములలో అర్ఘ్యమునిచ్చి తరువాత మిగిలిన జలమును సావధానముతో పాత్రలో ఉంచ వలయును. 'పితృభ్యః స్థానం' అను మంత్రముతో పాత్రను బోర్లించవలయును, 'అగ్నౌ కరిష్యే' అని అడిగి 'కురుష్వ' అని వారి ఆజ్ఞను పొంది ఘృతప్ను తాన్నమును ఉపవీతియై హవనము చేయవలయును. దర్భపాణియే ఉపవీతియై హోమము చేయవలయును. వైశ్వదేవమను హోమము సవ్యముగా పితృకర్మను అపసవ్యముగా చేయవలయును.
ఆచాంతా ననుజానీయా దభితో రమ్యతామితీ ।
స్వధా స్త్ర్వీతి చ తే బ్రూయు ర్భ్రాహ్మణా స్తదనన్తరమ్ ॥
తతో భుక్తవం తేషా మన్నశేషం నివేదయేత్।
యథా బ్రూయు స్తథా కుర్యా దనుజ్ఞాతస్తు తై ర్వ్ది జైః ॥
పిత్రే స్వధిత మిత్యేవ హాచ్యం గోష్ఠీషు సుశ్రీతమ్ ।
సంపన్న మిత్యభ్యుదయే దేవే సేవిత మిత్యపి ॥
విస్తృజ్య బ్రాహ్మణాన్ తాన్వై పితృపూర్వస్తు వాగ్యతః।
దక్షిణాం దిశ మాకాంక్షన్ యాచేతే మా స్వరాస్ పీతౄన్॥
దాతారో నోభీ వర్ధనాం వేదాః సంతతి దేవ చ ।
శ్రద్ధా చ నో మా విగమ ద్భహుదేయం చ నోస్వీతి ॥
పిండోంస్తు గోజు విప్రేభ్యో దద్యా ద్న జలేపి వా ।
మధ్యమంతు తతః పిండ మద్య త్పత్నీ సుతార్థినీ ॥
ప్రక్షాళ్య హస్తా వాచమ్య జ్ఞాతిం శేషేణ తోషయేత్ ।
సూపశాకఫలా సీక్షూన్ పంగే దధి ఘృతం మధు ॥
అన్నం చైవ యథాలామం వివిధ భోజ్య పేయకమ్ ।
యద్యదిష్టం ద్విజేంద్రాణాం తత్సర్వం వినివేదయేత్॥
ధాన్యాం స్తిలాంశ్చ వివిధాన్ శర్కరా వివిధ స్తథా ।
ఉష్ణమన్నం ద్విజాతిభ్యో దాతవ్యం శ్రేయ ఇచ్ఛతా ॥
అన్యత్ర ఫలమూలేభ్యో పానకేభ్య సతైవ చ ।
న భూమౌ పాతయే జ్ఞానుం న కుష్యేన్నా నృతం వదేత్ ॥
విశ్వే దేవుల పరిచర్యలో కుడి మోకాలును పరచవలయును. పితృ పరిచర్యలో వామ జానువును వంచవలయును. తరువాత 'సోమాయ తే పితృమతే స్వధానమః' అని, 'అన్నయే కవ్యహవ్యాయ స్వధా' అని హోమము చేయవలయును. అగ్నిలేనిచో బ్రాహ్మణుని చేతిలోను జలమును విడువవలయును. మహాదేవుని సన్నిధిలో కాని గోశాలలోను విడువవలయును. తరువాత వారితో అనుమతీ బడసి దక్షిణా ధీశకు వెళ్ళి భూమిని గోమయముతో అలికి ఇసుకతో వేదికను చేసి దక్షిణా వనతముగా చతురస్రముగా మండలముగా కాని వేదికను నిర్మించి ఆ వేదిక మధ్యమున ఒక దర్భతో మూడు మార్లు ఉల్లేఖించి తరువాత ఆ వేదికపై దక్షిణాగ్రములుగా దర్భలను పరిచి అచట మూడు పిండముల నుంచ వలయును. ఇట్లు పిండప్రదానము తరువాత లేప భాగ అధికారులు పితరులకు పింజధారకుశ మూలమున పిండశేష సంసృష్ట హస్తమును ప్రోక్షించి తరువత మంత్రవేత్త ఆచమనము చేసి మూడుమార్లు ప్రాణాయామము చేసి ఆ అన్నమునకు పితరులకు నమస్కారము చేసి పిండముల వద్ద జలమును వీడువ వలయును. తరువాత ఆ పిండములను ఆఘ్రాణించవలయును. తరువాత పిండదానము తరువాత మిగిలిన అన్నమును బ్రాహ్మణులను విధి పూర్వకముగా భుజింప చేయవలయును. సూప శాక ఫలములను చేరుకులను పాలను పేరుగు నెయ్యి తేనెను అన్నము వివిధ భక్ష్యములను పేయములను ఇయ్యవలయును.
యద్యదిష్టం ద్విజేంద్రాణాం తత్సర్వం వినివేదయేత్ ।
ధాన్యాంక్తిలాంశ్చ వివిధాన్ శర్కరా వివిధ స్తథా ॥
ఉష్ణమన్నం ద్విజాతీభ్యో దాతవ్యం శ్రేయ ఇచ్ఛతా ।
అన్యత్ర ఫలమూలేభ్యో పానకేభ్య స్తథైవ చ ॥
న భూమౌ పాతయే జ్ఞానుం న గుష్యే న్నా నృతం వదేత్।
న పాదేన స్పృశే దన్నం న చైవ మవధూనయేత్ ॥
క్రోధేనైవ చ యద్భుక్తం యద్భుక్తం త్వయథావిధి ।
యాతుధానా విలుంపంతి జల్పతా చోపపాదితమ్ ॥
స్వీన్న గోత్రో న తిష్ఠత సన్నిధౌ చ ద్విజోత్తమాః ।
న చ పశ్యత కాకాదీన్ పక్షిణః ప్రతిలోమగాన్ ॥
తద్రూపాః పితర సత్ర సమాయాన్తో బుభుక్షవః ।
క న దద్యా త్తత్ర హస్తేన ప్రత్యక్షం లవణం యథా ॥
న చాయసీనపాత్రేణ న చైవా శ్రద్ధయా పునః ।
కాంచమేన తు పాత్రేణ రజతోదుంబరేణ వా ॥
దత్తమక్షయతాం యాతి ఖడ్గేన చ విశేషతః।
పౌత్రేతు మృణ్మయే యోవై శ్రాద్ధేవై భోజయే ద్ద్విజాన్ ॥
స యాతి నరకం ఘోరం భోక్తా చైవ పురోధసః ।
న పంక్త్యాం విషమం దద్యా న్న యాచేత న దాపయేత్ ॥
యాచితా దాపితా దాతా నరకా న్యాతి భీషణాన్ ।
భుంజీర న్నగ్రతః శ్రేష్ఠం న బ్రూయుః ప్రాకృతాన్షుణాన్ ॥
బ్రాహ్మణోత్తములకిష్టమగు దానినంతను నివేదించవలయును, ధాన్యమును తీలలను వివిధ శర్కరలను వేడి అన్నమును సంపదను కోరుపాడు బ్రాహ్మణులకీయ వలయును. ఫలముల పానకములను మాత్రము ఈయరాదు. శ్రాద్ధకర్త ఆ ప్రదేశమున కన్నీటిని విడువరాదు. కోపించరాదు. అబద్దమాడరాదు. అన్నమును పొదముతో స్పృశించరాదు. పాదముతో రాయరాదు, కోపముతో ఇచ్చినది త్వరత్వరగా భుజించినది మాటలాడుచు భుజించినది కూడా రాక్షసులచే హరించబడును. చెమటబట్టిన దేహముతో బ్రాహ్మణుల వద్ద నిలువరాదు. అచటికి వచ్చిన శ్యేనకాణాది పక్షులను వెళ్ళగొట్టరాదు. పితృదేవతలు కవ్యమును భుజించుటకు ఆ రూపములోనే వచ్చెదరు. శ్రాద్ధమున చేతిలో ప్రత్యక్ష లవణమును ఈయరాదు. ఇనుప పాత్రతోకాని అశ్రద్దతోకాని వడ్డించరాదు విశ్లేషించి కంచు పాత్రతో ఇచ్చిన అక్షయ ఫలము లభించును. మృణ్మయపాత్రలో భోజనము పెట్టినవాడు, భుజించినవాడు ఘోర. నరకమును పొందును. పంక్తిలో భేదబుద్దితో భేదముగా వడ్డించరాదు. అడుగరాదు. అట్లు వడ్డించినవాడు యాచించినవాడు ఇప్పించినవాడు నరకమును చేరును. శిష్టులు మౌనముగా భుజించవలయును. ప్రాకృత గుణములను వర్ణించరాదు. భోజ్యప దార్థ గుణములను వర్ణించకుండా భుజించినంతవరకే పితరులు భుజింతురు.
తావద్ధి పితరోఽ శృప్తి యావన్నోకా హవిర్గుణాః ।
నాగ్రాసనోపవిష్టస్తు భుంజీత ప్రథమం ద్విజః ॥
బహూనాం పశ్యతాం సో న్యః పంక్త్యా హరతి కిల్బిషమ్ ।
న కించి ద్వర్జయే చ్ఛ్రాద్దే నియుక్తస్తు ద్విజోత్తమః ॥
న మాంసస్య నిషేధేన న చాన్య స్యాన్న మీక్షయేత్ ।
యో నాశ్నాతి ద్విజో మాంసం నియుక్తః పితృకర్మణి॥
స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిమ్ ।
స్వాధ్యాయా చ్ఛావయే దేషాం ధర్మశాస్త్రానీ చైవ హి ॥
ఇతిహాసపురాణానీ శ్రాద్ధ కల్పాంశ్చ శోభనాన్ ।
తతోన్న ముత్సృజే ద్భోక్తా సాగ్రతో వికిర్భువి ॥
పృష్ట్వా స్వదితమిత్యేవం తృప్తా నాచామయేత్తతః ।
ఆచాన్హా సనుజానీయా దభితో రమ్యతామీతీ ॥
స్వధాస్తితి చ తం బ్రూయు గ్రాహ్మణా స్తదనన్తరమ్ ।
తతో భుక్తవతాం తేషా మన్నశేషం నీవేదయేత్ ॥
యథా బ్రూయు స్తథా కుర్యా దనుజ్ఞాతస్తు తై ర్ద్విజై।
పిత్ర్యే స్వదిత ఇత్యేవ వాక్యం గోష్ఠేషు సూత్రీతమ్ ॥
విసృజ్య బ్రాహ్మణాన్ స్తుత్వా పితృపూర్వం తు వాగ్యతః ।
దక్షిణాం దిశమా కాంక్షన్ యా చేతేమాన్ వరానితన్ ॥
దాతారో నోభి వర్ధన్హాం వేదాః సంతతి గేవ చ ।
శ్రద్ధా చ నో మావ్యగము ద్బహుదేరుం చ నోస్త్వితి ॥
పంక్తిలో అగ్రాసనమున కూర్చున్నవాడు మొదట భుజించరాదు. చాలా మంది చూచు చుండగా ఒక్కడు భుజించినచో వారి పాపములను తాను పొందును. నియంత్రించబడిన ద్విజోత్తముడు శ్రాద్ధమున ఏ కొంచెము విడువరాదు. మాంసమును నిషేధించరాదు. ఇతరుల అన్నమును చూడరాదు. పితృకర్మలో నియంత్రించబడిన బ్రాహ్మణుడు వడ్డించిన మాంసమును భుజించనిచో పరలోకమున ఇరువది యొక జన్మలు పశురూపమును పొందును. భుజించువారలకు వేదములను ధర్మశాస్త్రములను ఇతిహాస పురాణములను శ్రాద్దకల్పములను వినిపీంచవలయును. వారు భుజించినతరువాత ‘తమరు తృప్తి చెందితిరా’ అని అడిగి వారి తృప్తిని వినిన తరువాత వారి భోజన పాత్రమందు వడ్డించగా మిగిలిన అన్నమును వెదచల్లవలయును. తరువాత వారిని ఆచమింప చేయవలయును. ఆచమించిన తరువాత నాలుగు దిక్కులలో విహరించుడని పలుకవలయును. అంతట బ్రాహ్మణులు 'స్వథాస్తు' అనీ కర్తతో పలుకవలయును. తరువాత అన్న శేషమును వారికే నివేదించి వారు చెప్పినట్లు చేయవలయును. ఏకోద్దిష్ట శ్రాద్ధమున ‘స్వదితం' అని గోష్ఠి శ్రాద్దమున ‘సూనృతం' అని, అభ్యుదయ శ్రాద్దమున 'సంపన్నం' అనీ దైవ శ్రాద్ధమున రోచతే' అని పలుకవలయును. పితృ పూర్వముగా ఆ బ్రాహ్మణులను సాగనంపీ మౌనముతో దక్షిణాభిముఖుడై పితరులను ఇట్లు వరమునడుగ వలయును. దానము చేయు మా వంశము, వేద ములు, సంతానము వర్ణిల్ల వలయును. మాలో శ్రద్ద పెరగవలయును. దాన మిచ్చుటకు మా వద్ద బహు పదార్థములు ఉండవలయును.
పిండాంస్తు గోజనీప్రేభ్యో దద్యా దగ్నౌ జలేపి వా ।
మధ్యమం తు తతః పిండ మద్యత్పత్నీ సుతార్థినీ ॥
ప్రక్షాళ్య హస్తా నాచన్యు జ్ఞాతీన్ శేషేణ భోజయేత్ ।
జ్ఞాతిష్వపి చ తుష్టేషు స్వాన్ భృత్యాన్ భోజయే త్తతః॥
పశ్చా త్స్వయం చ పత్నీభిః శేషమన్నం సమాచరేత్ ।
నోద్వాసయేత్ తదుచ్ఛిష్టం యావ స్నోస్తంగతో రవిః ॥
బ్రహ్మచారీ భవేశాం తు దంపతీ రజనీం తు తామ్ ।
దత్త్వా శ్రాద్ధం తథా భుక్త్వా సేవతే యస్తు మైథునమ్ ।
మహారౌరవ మాసాద్య కీటయోనిం వ్రజే త్పునః ॥
శుచి రక్రోధనః శాన్తః సత్యవాదీ సమాహితః ।
స్వాధ్యాయం చ తథా ధ్యానం కర్తా భోక్తా చ వర్జయేత్ ॥
శ్రాద్ధం భుక్త్వా పరశ్రాద్ధే భుంజతే యే ద్వీజాతయః ।
మహాపాతకిభి స్తుల్యా యాంతి తే నరకాన్ బహూన్ ॥
ఏష వో విహితః సమ్యక్ శ్రాద్ధకల్పః సమాసతః ।
అనేన వర్ధయే న్నిత్యం బ్రాహ్మణీ వ్యసనాన్వితః ॥
ఆమశ్రాద్ధం యదా కుర్యా ద్వీధిజ్ఞః శ్రద్ధయాన్వితః।
తే నాగ్నౌ కరణం కుర్యాత్నిండాంస్తేనైవ నిర్వపేత్ ॥
యో నేన విధినా శ్రాద్ధం కుర్యాద్వై శాస్తమానసః ।
వ్యపేతకల్మషో నిత్యం యతీనాం వర్తయే త్పదమ్ ॥
తస్మా త్సర్వప్రయత్నేన శ్రాద్ధం కుర్వాద్ద్విజోత్తమః ।
ఆరోధితో భవే దీశ స్తేన సమ్యక్ సనాతనః ॥
పిండములను గోవులకు మేకలకు లేదా బ్రాహ్మణులకు అగ్నిలో జలములో కానీ అర్పించవలయును. శ్రాద్ధకర్త పత్నీ పుత్రేచ్చ కలదైనచో మధ్యమ పిండమును భుజించవలయును. చేతులు కడుగుకోని ఆచమనము చేసి శ్రాద్ధ శేషముతో బంధువులను సంతోషింప చేయవలయును, బంధువులు తృప్తి పొందిన తరువాత భృత్యులను భుజింప చేయవలయును. తరువాత తాను భార్యతో మిగిలిన అన్నమును భుజింపవలయును. సూర్యాస్తమయము వరకు శ్రాద్ధ స్థలము నుండి ఉచ్ఛిష్టమును తీసి వేయరాదు. ఆ రాత్రి దంపతులు బ్రహ్మచర్యముతో నుండవలయును. శ్రాద్ధమును ఆచరించి తాను భుజించీ స్త్రీ సంగము గావించినచో మహా రౌరవ నరకమును పొంది కీటకముగా పుట్టును. ఆ దినము పవిత్రునిగా కోప రహితునిగా, శాంతునిగా, సత్యవాది సావధానునిగా నుండవలయును. స్వాధ్యాయమును ప్రయాణమును పరిత్యజించవలయును. భోక్త కూడా ఈ నియమమును పాటించవలయును. ఒక శ్రాద్దమున భుజించి మరొక శ్రాద్ధమున భుజించినచో మహో పొతకులతో సమానముగా నరకమును చేరుదురు. ఇట్లు మీకు చక్కగా సనాతనమగు శ్రాద్ధ కల్పము చెప్పబడినది. అనాసక్తుడగు తత్త్వవేత్త అయినచో అపక్వముతో శ్రాద్ధమునా చరించవలయును, అగ్ని హోత్ర రహితుడు, యాత్రలో ఉన్నవాడు, ఆపదలోనున్నవాడు, వీధీనీ తెలిసి శ్రద్ధతో ఆమశ్రాద్ధము నోచరించ చలయును, ఆ అపక్వముతోనే అగ్నిలోను ఈయవలయును. పిండ ప్రదానము కూడా చేయవలయును. మనో నిగ్రహముతో ఈ వీధితో శ్రాద్ధము నాచరించినవాడు పాపములు తొలగి యోగి స్థానమున నిలుచును. కావున ద్విజోత్తముడగు వాడు సర్వ ప్రయత్నముతో శ్రాద్ధమును చేయు వలయును. శ్రాద్ధ మాచరించినచో సనాతనుడగు పరమాత్మ ఆరాధించబడును.
అపి మూలైః ఫలైర్వాషి ప్రకుర్యాన్నిర్ధనో ద్వీజః ।
తిలోదకై స్తర్పయిత్వా పితృన్ స్నాత్వా సమాహితః ॥
న జీవతితృకో దద్యా దోమాస్త్రం వా విధీయతే ।
యేషాం వాపి పీతా దద్యా తేషాం చైకే ప్రచక్షణే ॥
పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః ।
యో యస్య ప్రియతే తస్మై దేయం సన్యస్య తేన తు ॥
భోజయే ద్వాపి జీవన్తం యధాకామంతు భక్తితః ।
న జీవన్త మతిక్రమ్య దదాతి ప్రయతః శుచిః ।
ద్వ్యాముష్యాయణికో దద్యా ద్బీజిక్షేత్రికయోః సమమ్ ।
అధికారీ భవేత్సో థ నియోగోత్పాదితో యది ॥
అనియుక్తా త్సుతో యశ్చ శుక్రతో జాయతే త్విహ ।
ప్రదద్యా ద్బీజినే పిండం క్షేత్రణే తు తతో న్యథా ।
ద్వౌ పిండౌ నిర్వపే త్తాభ్యాం క్షేత్రిణే బీజినే తథా ।
కీర్తయే దథ చైవాస్మిన్ బీజినం క్షేత్రణం తతః ॥
మృతాహని తు కర్తవ్య మేకోద్దిష్టం విధానతః ।
ఆశాచే స్వే పరిక్షీణే కామ్యం వై కామతః పునః ॥
పూర్వాహ్ణి చైవ కర్తవ్యం శ్రాద్ధ సభ్యుదయార్దినా ।
దేవవ త్సర్వ మేవ స్యా న్నైవ కార్యా స్త్రీలైః క్రియాః ॥
దర్భాశ్చ ఋజవః కార్యా యుగ్మాన్వే భోజమే ద్ద్విజాన్।
నాందీముఖాస్తు పితరః ప్రీయన్తమితి వాచయేత్ ॥
ధనహీనుడగు ,బ్రాహ్మణుడు కందమూలముతో ఫలముతో కూడా చేయవచ్చును. అది కూడా లేనిచో స్నానము చేసి సావధానియై తిలోదకములతో తర్పణము గావించవలయును. తండ్రి బ్రతికి యుండగా శ్రాద్ధము చేయరాదు. తప్పని సరిగా చేయవలసినచో హోమాంతము వరకే చేయవలయును. మరికొందరు తండ్రి ఎవరికీ పిండదానము చేయునో వారికే చేయవలయును అని చెప్పిరి. తండ్రి, తాత, ముత్తాత వీరిలో ఎవరు మరణించిన పోరికి మాత్రమే చేయవలయును. ఇతరులకు చేయరాదు. అతని అభిరుచికి అనుసారముగా జీవించిన పురుషుని భుజింప చేయవలయును. జీవించిన వానినీ అతిక్రమించి పిండదానము చేయరాదని శ్రుతి బోధించుచున్నది. ద్యాముషాయణ కుడు బీజ క్షేత్ర పితరు లను సమముగా పిండదానము చేయవలయును, (తన కన్య నిచ్చెదనని వాగ్దానము చేసిన తరువాత వాడు చనిపోయినచో ఆ కన్య చనిపోయిన దాని సంపదను పొందుటకు పిండాదీకమునిచ్చుటకు అధికారి దేవాలయములో సగోత్రునితో వివోహము జరిగిన తరువాత ఆ కన్యకు కలిగిన పుత్రుడు ద్యాముష్యాయణుడగును) ఇతను తన కన్నతండ్రికీ, మొదట చనిపోయిన వాగర్థానము భర్తకు ఇద్దరికీ పిండ ప్రదానము గావించవలయును. ఇట్లు గావించినవాడు సంపదలో సగ భాగమునకు అరుడు. తల్లిదండ్రుల నుండి కొనీ పుత్రునిగా స్వీకరించినచో అతను తన పుట్టుకకు కారణమగు తండ్రికి పిండదానము చేయవలయును. క్షేత్ర పీతకు అనగా తన తల్లిని మొదటి భార్యగా స్వీకరించిన వానికి పిండదానము చేయరాదు. నీయోగములో అనగా దేవరాదుల వలన కలిగిన పుత్రుడు క్షేత్రికి బీజికి ఇద్దరికీ పిండ ప్రదానము చేయవలయును. అట్లే ఒకే శ్రాద్ధములో విడివిడిగా ఇద్దరి పేర్లను కీర్తించవలయును.
మరణించిన దినమున యధావిధిగా ఏకోద్దిష్టము నాచరించవలయును. ఆశౌచము తొలగిన తరువాత కామ్య శ్రాద్దమును ఆచరించ. వలయును. అభ్యుదయ శ్రాద్ధమును (హిందీ) పూర్వహముననే ఆచరించవలయును. అంత దేవ కార్యము వలెనే ఆచరించవయలును. నువ్వులతో చేయవలసిన దానిని యవములతో చేయవలయును. చక్కని దర్భలు కావలయును. ఇద్దరిని ద్విజులను భుజింప చేయవలయును. 'నాందీముఖాః పీతరః ప్రియంతాం' అని ఉచ్చరించవలయును.
మాతృశ్రాద్దస్తు పూర్వం స్యా త్పితౄణాం తదనస్తరమ్ ।
తతో మాతామహాసాను వృద్ధౌ శ్రాద్ధత్రయం స్మృతమ్ ॥
దైవపూర్వం ప్రదద్యాద్వై న కుర్యో దప్రదక్షిణమ్ ।
ప్రాజ్ముఖో నిర్వపే ద్విద్వా నుపవీతీ సమాహితః ॥
పూర్వం తు మాతరః పూజ్యా భక్త్యా వై సగణేశ్వరః ।
స్థణ్డిలేషు విచిత్రేషు ప్రతిమాసు ద్విజాతీషు ॥
పుష్పై ర్ధూపైశ్చ నైవేద్యై ర్భూషణైరపీ పూజయేత్ ।
పూజయిత్వా మాతృగణం కుర్యా చ్ర్ఛాద్ధత్రయం ద్విజః ॥
అకృత్వా మాతృయోగస్తు యః శ్రాద్ధను నివేశయేత్ ।
తస్య క్రోధసమావిష్ణో హింసాం గచ్ఛన్త మాతరః ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే ద్వావింశోఽధ్యాయః
మొదట మాతృ శ్రాద్ధమును తరువాత పితృశ్రాద్దమును ఆచరించవలయును. తరువాత మాతామహులకు శ్రాద్ధము చేయవలయును. ఇది అభ్యుదయ శ్రాద్ధ విధి. ఇట్లు శ్రాద్ధత్రయముండును. ఇది దేవ పూర్వకముగా ఈయవలయును. ఇందు అప్రదక్షిణముగా ఈయరాదు. ఉపవీతీగానే ప్రాజ్ముఖుడై పిండ ప్రదానము గావించవలయును. మొదట గణేశ్వరులతో కలిసిన షోడశ మాతృకలను పూజించవలయును. విచిత్రములగు స్థండిలము లందు ప్రతిమలందు లేదా బ్రాహ్మణులందు ధూపదీప గంధ భూషణ నైవేద్యాదులతో మాతృ గణమును పూజించి శ్రాద్ధత్రయముగా నాచరించవలయును. మాతృయాగము చేయకుండా శ్రాద్ధము నాచరించినచో అతనిని క్రోధముకల మాతృ దేవతలు హింసింప తలచెదరు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 22వ అధ్యాయము.
Summary of chapter 75 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa presents the step-by-step ritual execution of the Śrāddha ceremony, beginning with welcoming invited Brāhmaṇas, ceremonial washing of feet, and offering seating facing East and North. He details the invocation of Vishvedevas and Pitṛs, offering of water, sesame, and flowers, performance of home-offering in fire or Brāhmaṇa's hand, and Piṇḍadāna upon sacred Kuśa grass. Vyāsa outlines the final farewell, Dakshiṇā presentation, and blessing requests that ensure ancestral satisfaction across cosmic ages.