భాగవత మహా పురాణము
5 - శ్రీకృష్ణ జననోత్సవము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను -- నందునిది పెద్ద మనసు. పుత్రుడు పుట్టగానే ఆయనకు ఆహ్లాదము కలిగెను. ఆయన వేదవేత్త లైన బ్రాహ్మ ణులనాహ్వానించెను. తాను స్నానమాడి శుచియై అలంకరించుకొనెను.
ఆయన వేదవేత్తలచే స్వస్తివాచనమును చేయించి, పుత్రునకు జాత కర్మను, పితృదేవతలకు దేవతలకు యథావిధిగా అర్చనను చేయించెను.
ఆయన వేదవేత్తల కొరకు రెండు లక్షల ఆవులను చక్కగా అలంకరించి దానము చేసెను. మరియు, ఏడు తలల పర్వతము (పదీ కుంచములు) లను పైన రత్నముల గుట్టలను పోసి బంగరు రసము పూసిన వస్త్రములను కప్పి దానము చేసెను.
కాలముచే మట్టి ఉన్న నీరు, స్నానముచే దేహము, ఉతుకుటచే వస్త్రము, గర్భాధాసాది సంస్కారములచే గర్భము మొదలైనవి, తపస్సుచే ఇంద్రియములు, యాగముచే బ్రాహ్మణుడు, దానములచే ధనము, సంతోషముచే మనస్సు అనే ద్రవ్యములు శుద్ధములగును. జీవుడు ఆత్మవిద్యచే పరిశుద్ధుడగును.
వేదవేత్తలు, పౌరాణికులు, మాగధులు (వంశమును కీర్తించువారు), వందులు (సందర్బమునకు తగ్గట్లుగా స్తుతించువారు), చక్కని మంగళవచనములను పలికిరి. పాటగాళ్లు కూడ పాడిరి. భేరీలు, దుందుభులు మ్రోగినవి.
నందవ్రజములోని జనులు ఇళ్ల ద్వారములను, వాకిళ్లను, మధ్యభాగములను అలికి పన్నీరు చల్లిరి. ఇళ్లను రంగురంగుల టెక్కెములతో, జెండాలతో అలంకరించి, పుష్పమాలలను వస్త్రములను చిగుళ్ల మాలలను తోరణములుగా కట్టిరి.
ఆవులకు, ఎద్దులకు, ఎదిగిన దూడలకు పసుపు కలిపిన నువ్వుల నూనె పూసిరి. రంగురంగుల రాతి రంగులు, నెమలి పింఛముల మాలలు, వస్త్రములు, బంగరు గొలుసులతో వాటిని అలంకరించిరి.
ఓ రాజా! గోపాలకులు మిక్కిలి విలువైన వస్త్రములను, చొక్కాలను, తలపాగలను. దాల్చి, ఆభరణములతో అలంకరించుకొనిరి. వారు వేతులలో బహుమతులను పట్టుకొని విచ్చేసిరి.
గోపికలు కూడ యశోదకు కొడుకు పుట్టినాడని విని ఆనందించిరి. పొరు కొత్త వస్త్రములను దాల్చి కాటుక దిద్దుకొని నగలు పెట్టుకొని వందనాదులతో తమను తాము అలంకరించుకొనిరి.
అతిశయించిన సౌందర్యము గల గోపికలు. తమ పద్మములవంటి ముఖములపై అలంకరించుకున్న కొత్త కుంకుమ పుప్పొడి శోభను కలిగి యుండెను. వారు బహుమతులతో తొందరగా యశోద యింటికి వెళ్లిరి.
గోపికలు స్వచ్చమైన మణుల కుండలములను, మెడలయందు మణుల పదకములను ధరించిరి. వారు రంగు రంగుల కోకలను దాల్చి నందుని ఇంటికి వెళ్తూ ఉంటే వారి జుట్టుముడులనుండి జారిన మాలల వర్షములు మార్గముపై పడుచుండెను. అధికముగా కదలాడే కుండలములతో, వక్షోజములయందలి హాగములతో, కంకణములతో వారు విశేషముగా ప్రకాశించిరి.
ఆ గోపికలు, ఓ ఈశ్వరా! చాలకాలము ఈ పిల్లవానిని రక్షించుము, ని ఆశీస్సులను పలుకుచుండిరి. వారు పసుపు పొడి, నూనె కలిపిన టీని జనము పై చల్లుతూ బిగ్గరగా పాటలను పాడిరి.
జగన్నియామకుడు, కాలాతీతుడు అగు శ్రీహరి నల్లనివాడై నంద గోకులమువతరించగా పెద్ద ఉత్సవము జరిగెను. వారు రంగు ioగుల పొద్యములను వ్రాయించిరి.
హర్షితులైన గోపాలకులు ఒకరి పైనొకరు పొలను, నేతిని, నీళ్లను చల్లి, న్నలను పూసీ, పెరుగును విసరుకొనిరి.
పెద్ద మనసు గల నందుడు ఆ గోపీగోపాలకులకు, పౌరాణికులకు, వంశమును కీర్తించువారలకు, స్తుతిపాఠకులకు, ఇంకా ఇతరులెవరైతే సంగీతాది విద్యలే బ్రదుకు దెరువుగా గలవారో వారికి, వస్త్రములను, ఆభరణములను, గోవులను, ధనమును ఇచ్చెను.
దైన్యమునేరుగని మనస్సు గల నందుడు శ్రీహరిని ఆరాధించుట అనే ప్రయోజనము మరియు తన పుత్రుని అభివృద్ధి సిద్దించుటకై, జనులకు వారి యోగ్యతకు తగ్గట్లుగా వివిధములగు భోగ్యములనిచ్చి పూజించెను.
రోహిణి భాగ్యము గొప్పది. ఆమెను (ఆమె పుత్రుని) నందుడు, గోపాలకులు అభినందించిరి. ఆమె దివ్యమైన వస్త్రమును, దాల్చి, మాలలను ముడిచి, కంఠాభరణమునలంకరించుకొని ఇటునటు తిరిగెను.
ఓ రాజా! ఆ నాటినుండి నందుని గోకులము సకలసంపదలకు నెలవై తనదైన సౌందర్యాది గుణములతో విలసిల్లెను. శ్రీహరి నివసించుటచే ఆ పల్లె లక్ష్మీదేవికి విహారస్థానమాయెను.
కురవంశశ్రేష్ఠుడవగు ఓ రాజా! నందుడు గోకులమును రక్షిస్తూ ఉండుడని గోపాలకులకు ఆదేశములనిచ్చి, కంసునకు ప్రతి సంవత్సరము కట్టవలసిన పన్నును కట్టుటకై మథురానగరమునకు వెళ్లెను.
వసుదేవుడు సోదరుడగు నందుడు వచ్చినాడని వినెను. ఆయన కంసరాజునకు పన్ను కట్టినాడని కూడ తెలిసెను. అప్పుడాయన నందుడు బళ్లను విప్పుకుని నివసించిన డేరాకు వెళ్లెను.
నందునకు వసుదేవుడు మిక్కిలి ప్రియమైనవాడు. ప్రాణము తిరిగి రాగా దేహము నిలబడునట్లుగా, ఆయన వసుదేవుని చూచి ప్రేమతో వ్యాకులుడై వెంటనే లేచి నిలబడెను. నందుడాయనను రెండు చేతులతో కౌగిలించెను.
ఓ నృపతీ! నందుడు వసుదేవునీ సాదరముగా సత్కరించెను. ఆయన ఖముగా కూర్చుండి క్షేమసమాచారమునడీగేను. ఆయన మనస్సు తన ద్దరు పుత్రుల పైననే లగ్నమై యుండెను. ఆయన నందునితో నిట్లనెను.
ఓ సోదరా! నీది పెద్ద వయస్సు. నీకు సంతానము లేకుండెను. తానము కలుగననే ఆశయైననూ నీనుండి తొలగిపోయేను. అట్టి నీకు ప్పుడు సంతానము కలిగెననేది యేది గలదో, అదీ మంగళము.
ఈ సంసారమండలము (సమాజజీవితము) నందుండే నీవు మరల ట్రినోవా యన్నట్లు ఈనాడు (కారాగారములో మగ్గిన) నా కంట బడితివి. దీ మంగళము. ప్రియమిత్రుని చూచుట దుర్లభము.
ఓ మిత్రమా! నదీప్రవాహముచే కొట్టుకుపోబడే కట్టెలకు కలిసి ఉండుట సంభవము కాదు. అదే విధముగా, నానావిధములైన కర్మలు గల మిత్రులకు కూడ ఒకే చోట ప్రేమతో కలిసి ఉండుట ఘటిల్లదు.
ఎక్కడనైతే నీవు మిత్రులతో గూడి నివసించుచున్నావో, ఆ పెద్ద అడవి ఇప్పుడు పశువులకు హితకరముగా ఉన్నదా? పశువులకు, జనులకు రోగములు లేవు గదా? నీరు, గడ్డి, తీగలు సమృద్ధిగా ఉన్నాయా?
ఓ సోదరా! నా కొడుకు తల్లితో గూడి నీ గోకులమునందున్నాడు. ఆతడు నిన్ను తండ్రినిగా భావించుచున్నాడా? నీవు, యశోద ఆ బాలకుని లాలించుచున్నారా?
బంధువులనుద్దేశించి సంపాదించబడిన ధర్మార్థకామములనే త్రివర్గము త్రమే మనిషికి యుక్తము, శాస్త్రవిహితము. భార్యాపుత్రాదీబంధువులు పడుచుండగా, వ్యక్తి సంపాదించిన ధర్మాదులు సుఖమునీయలేవు.
నంద ఉవాచ ।
నందుడు. ఇట్లు పలికెను – అయ్యో! నీకు దేవకికి పుట్టిన మేకపుత్రులను కంసుడు తన పొట్టన పెట్టుకొనెను. అందరికంటే చిన్నదైన క్క అమ్మాయి కూడ స్వర్గమును చేరినది.
ఈ మానవుని స్థితి నిశ్చయముగా ప్రారబ్ధకర్మయందు మాత్రమే గలదు గదా! మానవుని నియమించేది ప్రారబ్దమే. తనకు సుఖదుఃఖాది హేతువు ప్రారబ్ధకర్మయేనని తెలియువాడు సుఖదుఃఖాదులయందు వ్యామోహమును పొందడు.
వసుదేవ ఉవాచ ।
వసుదేవుడిట్లు పలికెను --- రాజునకు ప్రతి ఏడాది కట్టే పన్నును కట్టితివి. నన్ను కూడ చూచితివి. ఇచట చాల రోజులు ఉండవద్దు. గోకులమునందు అపశకునములు కలుగుచున్నవి.
శ్రీశుక ఉవాచ ।
శుక మహర్షి ఇట్లు పలికెను. --- శూరపుత్రుడగు వసుదేవుడు ఈ విధముగా చెప్పగా, నందుడు మొదలుగా గల ఆ గోపాలకులు ఆయన సెలవు తీసుకొని, ఎద్దులు పూన్చిన బళ్లపై గోకులమునకు వెళ్లిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణ జననోత్సవమును వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది (5).
Summary of chapter 5 of the Bhāgavata Mahā Purana is as follows:
In the pastoral settlement of Gokula, Nanda Mahārāja celebrated the birth of his divine son with grand Vaidika festivities. The cowherd community decorated the village with garlands, archways, and fragrant ointments, pouring milk, curd, and melted butter over one another in boundless joy. Nanda Mahārāja distributed thousands of decorated cows, cloth, and gold to brāhmaṇas and citizens. Later, Nanda Mahārāja traveled to Mathurā to pay annual taxes to King Kaṁsa. There, he met his dear friend Vasudeva. Vasudeva embraced Nanda, congratulated him on obtaining a son in his old age, and subtly warned him that disturbances and ominous signs were manifesting in Gokula, advising him to return home immediately to protect the children.