స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
40వ అధ్యాయము
నారదుడిట్లన్నాడు - ఆమోహెరక పురమందు జ్ఞాతిభేదం సంభవిస్తే త్రైవిద్యులు ఏంచేశారో ఓ బ్రహ్మ! నాకు చెప్పండి (1) అనగా బ్రహ్మ ఇట్లన్నాడు - తమ స్థానమందు బాడబులంతా హర్షంతో నిండిన మనస్సు గలవారై కొందరు అగ్నిహోత్ర పరులైనారు. కొందరు యజ్ఞ పరులైనారు (2) కొందరు అగ్ని సమాధానులైనారు. కొంద రెల్లప్పుడు స్మృతి పరాయణు లైనారు. పురాణ, న్యాయవేత్తలు, వేద వేదాంగ వాదులు (3) సుఖంగా, తమ సదాచారములను ఆచరిస్తున్నారు. బ్రహ్మవాదులు ఈ విథముగా ధర్మమాచరిస్తున్న కుశలాత్ముజులైన వారు వారు (4) స్థానమందలి ఆచారములను అధి దేవి మాటలను, ధర్మశాస్త్రము లందున్న దంతా కాజేశులు చెప్పిందంతా (5) పరం పరగా వచ్చిన ధర్మమంతా ఆ బాడబులు చెప్పారు (6) బ్రాహ్మణు లిట్లన్నారు - రక్త పాదములతో వ్రాసిన దానిని ఉపాసించే బ్రాహ్మణులు జాతి శ్రేష్ఠులు. వారికి బలి ఇవ్వాలి (కానుక) (7) రక్త చందనాన్ని సంపాదించి (కూర్చి) ఆ కులము ప్రసిద్ధమైంది. కుంకుమతో కాళ్ళంతా ఎర్రబడి గంధ పుష్పాదులతో అలంకరింపబడి (8) అంతా కలిసి వ్రాయ బడిందది అదే రక్త పాదమన బడుతోంది. రాముని వ్రాతను వారంతా చిత్తశుద్ధితో పూజించని (9) ద్విజులు ఎల్లప్పుడు రాముని కర ముద్రను పూజించని సదాచారమందు ఎవరు దోషులైతే, వ్యభిచారాదులు ఉంటే (10) వారిని దండించాలి అని విధి ప్రకారము ద్విజులు చెప్పారు. దండము ఇవ్వకుండా రామముద్ర చిహ్నం ధరించరాదు (11) ముద్రామానులను బాడబులని గుర్తించాలి. (12) కొడుకు పుడ్తే తండ్రి శ్రీ మాత కొరకు కానుక లివ్వాలి. నేయి వింశతి వలములు, బెల్లము, ఐదు ఫలములు (13) కొడుకు కలగగానే కుంకు మాదులతో అర్చించాలి. ఆరవ రోజున షష్టిని పూజించాలి (14) అక్కడ నేయితో కూడా బలి ఇవ్వాలి. వస్త్రములతో శ్రీ ఫలములతో కూడి (మారేడు) ఇవ్వాలి (15) కుక్కుమాదులతో అర్చించి శ్రీమాతకు భక్తితో ఇవ్వాలి. డబ్బు లోభము చేయరాదు.కులంలో సంతతి వృద్ధి చెందాలంటే చేయాలి (16) ఆ ద్రవ్యాన్ని అర్పించాలి. వృద్ధి యందు సిగ్గుచెంది తిరిగి ఇవ్వాలి. జన్మ యొక్క అనంతరమైన కార్యము జాతకర్మ యధావిధి చేయాలి (17) విప్రులచే అనుసరింపబడే వృత్తిని కూడా విభజిస్తున్నాము. మొదట వృత్తివల్ల లభించేది ఎంత ఉందో (18) ఆ వృత్తిలోని అర్థ భాగాన్నీ గోత్ర దేవికి అర్పించాలి. వణిజులైతే వారికి పుత్రుడు కల్గితే రెండింతలు దేవికి అర్పించాలి (19) మాండలీయులైన శూద్రులు వేయింతలు అర్పించాలి. అడాలజులు మూడింతలు గోభుజులు నాల్గింతలు అర్పించాలి (20) అని ఇట్లా చెప్పబడింది. ఇతరమైనది శూద్ర జాతులలో (అర్పించాలి) విధి వశంవల్ల హత్యా దోషము ఎవని కైనా కల్గితే (21) వేదశాస్త్ర విదులు అతనికి విధిగా దండము వీధించాలి. తప్పులేని వానిని దండిస్తే న్యాయవాది అన్యాయ వాదౌతాడు. (22) పంక్తి భేదాన్ని ఆచరించే నాడు వేయి గోవులను చంపిన వాడౌతాడు. వృత్తిభాగ విభజన న్యాయ విచారణ శ్రీరామ దూత యొక్క ముందర ఆచరించాలి. అని నిశ్చయము.
అతనికి పూజ చేయాలి, ఆ సమయంలో లేదా ఎల్లప్పుడూ విఘ్నేశాంతి కొరకు అతని దేహానికి నూనె వూయాలి (24) నానివిధ పుష్పములు ధూపదీవ ఫలములు ఇవ్వాలి. పూజిస్తే హనుమంతుడే ఆతని కోరికలు నెరవేరుస్తాడు (25) ప్రతి పుత్రుని ఆతని ఎదుటనే ఉంచాలి. ఇతరత్ర కాదు మొదట శ్రీమాత, వకుళ స్వాములకు భాగం ఇవ్వాలి (26) పిదపనే విప్రులు గ్రహించాలి, అని నిశ్చయము. వివ్రులు ఒక దగ్గర చేరాక వ్యాయాన్యాయ విచారణలో (27) మొదట నిర్ణయాన్ని మనసులో ధృవ వరచుకొని పిదప అక్కడున్న బ్రాహ్మణులకు విన్పించాలి. కేవలము ధర్మబుద్ధితో నిర్ణయం చేయాలి. పక్షపాత ముండరాదు. (28) అందరికి సమ్మతమైన కార్యము వీకృతం చేయదు. నిర్ణయం చేసి వివ్రుడు సభలో భయపడేట్టయితే (29) ఆతడు చెప్పిన దాన్ని కాదనవచ్చు. ఆతని మాటను వినరాదు. నిరాకరించిన దానిని నిర్ణయిస్తే బాడబులంతా కలిసి (30) ఆతనితో భోజన పానాదులు అన్ని బహిష్కరించాలి. ఆతనికి పిల్లనివ్వ రాదు. ఆతని సహవాసి కూడా అలాంటి వాడే (31) అందరు బ్రాహ్మణులు కలిసి ఆతనిని దండించాలి. భోజనము, కన్యకాదానము చేయకుండుటే దండన అని దాశరథి మతము (32) స్థలము కాని మరొకటి కాని పొందటానికి ఏదైనా పాపం చేస్తే అది వట్టి తడిగానే అన్నంలో ఉంటుంది. కనుక అన్నాన్ని వదలాలి (33) అట్లా చేస్తే ఆ పావమునకు భాగస్వామి ఔతాడు. దానికి దండము శాస్త్ర ప్రకారమే. శక్తి ఉండి కూడా ఎల్లప్పుడూ న్యాయమాచరించని వాడు (34) పావభాగి ఔతాడు. ఇది నత్యము అనుమానం లేదు. దుష్టకర్మల నుండి, పాపుల నుండి లంచం తీసుకొన్నవారు ఆ పాపాన్నంతా పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. (35) ఆతని అన్నాన్ని తీసుకోరాదు. ఆతని కన్యను స్వీకరించరాదు. పుత్రులకు కూడా ఎవడు హిత మాచరిస్తాడో (36) ఆ నరుడు ఈ నియమములన్నిటిని పాలించాలి అనుమానం లేదు. అని ఈ విధముగా ఆ బాడబులు వత్రము వ్రాసుకొని ఎంతో ఆనందించారు (37) ఘోరమైన కలియుగం వస్తే పాపం చేయకుండా చేశారు. అని తెలుసుకొని వారంతా న్యాయ ధర్మములను ఆచరించారు (38) వ్యాసుని వచనమిట్లా - కలియుగం వస్తే బ్రాహ్మణులంతా ఇటు నటు స్థాన భ్రష్టు లౌతారు. అన్యాయవు వక్షాన్ని వహిస్తారు. వక్షపాతం వహిస్తారు (39) పందిని వేటాడే వాళ్ళతో మేచ్ఛ గ్రామములలో భుజిస్తారు. కలియుగంలో వారు వేద భ్రష్టులౌతారు.
అను - యుధిష్ఠిరునివచనము - ఆవణిజులు, విప్రులు దేశదేశములకు వెళ్లారు. మారిష । వారు ఏ చిహ్నములతో గుర్తింప బడుతారు (41) వీరు ఏ గోత్రమందు జన్మించారు. ఏ బాబులు మహాబలులు అని ఎట్లా తెలుస్తుంది. అని అనగా (42) వ్యాసుని వచనము - పరాక్రమముతో వారి గోత్ర సంజ్ఞ తెలుస్తుంది. ఎవడెవడు ఏ పనిచేస్తున్నాడో అది వానికి గుర్తు. (43) అవటంకములతోనే వారిని గుర్తిస్తాము. మరో విధంగా గుర్తించలేము. గోత్రలతో, ప్రవరలతో అవటంకములతో గుర్తిస్తాము. ఓ రాజ (44) మోడ బ్రాహ్మణ నత్తములు ద్విజులు గుర్తింపం బడుతారు. ఓ రాజ, అని అనగా (45) యుధిష్ఠిరుని వచనము - వీరి గోత్రములను ప్రవరలను మీ ముఖంనుండి విన్నాము. వీరు ఏ శాఖలకు చెందినవారో (చదివేవారో) దానిని వారు చెప్పండి. ఓ పితామహ అని అనగా (46) వ్యాసుని వచనము - అక్కడక్కడ ఉన్నవారు మాధ్యందినీయులు మహాబలు అని తెలుసుకో. దర్భలనాశ్రయించి కొందరు విప్రులు గుణవంతులున్నారు. (47) ఋక్ అధర్వణలకు చెందిన శాఖలవారు నష్టమేవారు. ఈ విధముగా ధర్మ సంభవులైన బాడబులు ఉంటున్నారు. (48) ధర్మారణ్య మందున్న బాడబులు పుత్ర పౌత్రాన్వితులైనారు. శూద్రులందరు మహాభాగులు పుత్రులు పౌత్రులు కలవాడారు. (49) ధర్మారణ్య మహాతీర్థమందు వారంతా ద్విజ సేవ తులైనారు. రామాజ్ఞనుపాలిస్తున్నారు (50) ఆజ్ఞయందలిఆదరముచే వీర్యవంతుడైన హనుమంతుడు కూడా కలియుగం వస్తే ఆజ్ఞను పాలించాలి (51) హనుమంతుడు అక్కడ ప్రతిరోజు అదృష్ట రూపంతో భ్రమిస్తున్నాడు. త్త్రెవిద్యులు, చాతుర్విద్యులు బాడబులున్నచోట ఉన్నాడు. (52) సభయందు కూర్చున్నవారు అన్యాయంతో పాపం చేస్తే న్యాయకర్తలకు జయము అన్యాయ కారులకు అవజయము కలుతుంది. (53) కొడుకు, తండ్రి, భ్రాతలు ఎవరైనా అపరాధంచే స్త్రీ వారిపై పక్షపాతం చూపితే వాని పై వాయుజుడు కోపగిస్తాడు (54) హనుమంతుడు కోపగిస్తే ధననాశం కల్గిస్తాడు. పుత్ర నాశము చేస్తారు. అట్లాగే స్థాన నాశనము కూడ చేస్తాడు. (55) సేవకొరతు నిర్మింపబడిన శూద్రుడు విప్రులను సేవించకపోతే, వృత్తిని ఇవ్వకపోతే వారిని హనుమంతుడు కోపగిస్తాడు. (56) అర్థనాశము, పుత్రనాశము, స్థాననాశము, మహాభయము వీటిని వాయు పుత్రుడు రాముని వాక్యాన్ని స్మరిస్తూ కల్గిస్తాడు (57) ఎక్కడో అక్కడ ఉన్న విప్రులుని రూద్రులుకాని ఓ రాజ! వారు రాఘవుని అనుగ్రహం వలన నిర్థనులు కారాదు. (58) ఎవడు మూడుడై, అధర్మాత్ముడై పాపులను పాషండులను ఆశ్రయించాడో తన విప్రులను వదలి, వారినిజ్ఞాతులను గా భావిస్తాడో (59) వాని పూర్వజన్మలోని వుణ్యము భస్మమౌతుంది. తప్పదు. ఇతరులకు కొద్దో గొప్పో చేసిన దానము (60)ముందేట్టా జరిగేదో, ముందు బ్రహ్మవిష్ణు శివులుచే సేవారో ఇప్పుడు అతని దానమును అట్లా హవ్యమును, కవ్యమును దేవతలు గ్రహించరు. పూర్వజులు గ్రహించరు (61).
తనతోటి బ్రాహ్మణులను మోసగించి ఇతరులకు ఇచ్చినవాని జన్మార్జిత పుణ్యము ఆ క్షణంలోనే భస్మ మౌతుంది (62) బ్రహ్మ విష్ణు శివులతో పూజింపబడిన ద్విజోత్తములున్నారో, వారికి విముఖులైన శూద్రులు ఎవరున్నారో వారు రౌరవ నరకంలో నివశిస్తారు (63) లౌల్యం వల్ల కులా చారమును గోత్రాచారమును లోపింప చేసినవారు మోహితులై స్వాచార మాచరించని వారు (64) సర్వ నాశమౌతారు, ఆ క్షణంలోనే భస్మమౌతారు. అందువల్ల అందరు కులాచారము, అట్లాగే స్థానాచారము (65) గోత్రాచారము తమ ద్రవ్యానుకూలత కొలది పాలించాలి. ఈ విధముగా ఓ రాజ! పురాతనమైన ధర్మారణ్యాన్ని గూర్చి నీకు చెప్పాను (66) దానిని దేవదేవులైన బ్రహ్మవిష్ణు శివాదులు స్థాపించారు. కృత యుగంలో ధర్మారణ్యము, త్రేతమందు సత్యమందిరము, ద్వాపరంలో వేదభవనము, కలిలో మోహారకమనీ పిలువబడింది. (67) బ్రహ్మవచనము - ఓ పుత్ర! దీనిని అధిక శ్రద్ధతో విన్నవారి (పాపాలు నశిస్తాయి) ధర్మారణ్య మాహాత్మ్యము అన్ని పాపముల నశింపచే సేది (68) మనోవాక్కాయముల వల్ల కల్గిన త్రివిధ పాపము దీనిని వినటం వల్ల ఒక్కసారి కీర్తించటం వలన అదంతా నాశనమౌతుంది. (69) అది ధన్యమైనది. కీర్తిని కల్గించేది. ఆయుస్సునిచ్చేది. సుఖమును సంతానాన్ని ఇచ్చేది. నరుడు సర్వసౌఖ్యములు లభించే కొరకు ఈ మాహాత్మ్యాన్ని వినాలి, ఓ వత్స! (70) సర్వ తీర్థములవల్ల కలిగే పుణ్యమును సర్వక్షేత్ర దర్శనంవల్ల కలిగే ఫలమును దర్మారణ్యమును సేవించి పొందుతారు (71) నారదుని వచనము - మీ ముఖాంబుజము నుండి ధర్మారణ్య మాహాత్మ్యము విన్నాము. ధర్మనాపి యందు ధర్ముడు సుదుష్కరమైన తపమాచరించాడు (72) ఆ క్షేత్రమహాత్మ్యాన్ని నేను మీ నుండి విన్నాను. మీకు జయమగుగాక ధర్మారణ్యాన్ని చూచే కొరకు వెళుతాను (73) ఓ చతుర్ముఖ మీ వాక్యజల ప్రవాహంతో నేను పవిత్రుణ్ణైనాను. (74) వ్యాసుని వచనము - ఓ పాండునందన! ఈ ఆఖ్యానాన్ని అంతా చెప్పాను. దీనిని విన్న మానవుడు గోసహస్రదాన ఫలమును పొందుతాడు (75) సంతానహీనుడు సంతాన వంతుడౌతాడు. ధనహీనుడు ధనవంతుడౌతాడు. రోగి రోగహీనుడౌతాడు. బందుడు బంధవిముక్తుడౌతాడు (76) విద్యనార్జించే వారు విద్యను పొందుతారు. ఉత్తమమైన కర్మ సాధనను పొందుతాడు. తీర్థయాత్ర ఫలమును, కోటికన్యాదాన ఫలమును పొందుతాడు (77) నరుడు కానివారిని భక్తితో విన్నవారు ఓరాజ! నరకాన్ని చూడరు. కులములోని ఇరువది ఒక్క తరముల వరకు (78) శుభమైన, ప్రదేశమందుంచి, పట్టు వస్త్రమందుంచి, పురాణ పుస్తకమును ప్రయత్న పూర్వకముగా శిష్టుల అనుమతితో, తగిన విధంగా గంధమాలలతో విడివిడిగా పూజించాలి. ఓరాజ! గ్రంథం నమాప్తి చెందాక, పురాణం చెప్పిన వారిని పూజించాలి (80) సంపూర్ణ ఫలసిద్ధి కొరకు దానాదులతో న్యాయమని పించిన రీతి పూజించాలి. ముద్రికను, కుండలములను బంగారు బ్రహ్మసూత్రమును (81) గంధమాల్య అను లేపనములతో కూడా విచిత్ర వస్త్రములను దేవునివలె వూజించి పాలిచ్చే ఆవును దానంచేయాలి (82) ఈ విధముగా ధర్మారణ్య కథను విధి ప్రకారము వినినవారు ధర్మారణ్య నివాన ఫలమును పొందుతారు, అనుమానంలేదు. అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగము, ధర్మారణ్య మాహాత్మ్యమందు ధర్మారణ్య నివానుల వ్యవస్థ వర్ణనము, ధర్మారణ్య పురాణ శ్రవణ మాహాత్మ్య వర్ణనము అనునది నలుబదవ అధ్యాయము. అని ద్వితీయమైన ధర్మారణ్య మాహాత్మ్యము సమాప్తము. పూర్వభాగము సమాప్తము.
