స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

24వ అధ్యాయము

తా ॥ వ్యాసుని వచనము - ఈ తీర్థ మాహాత్మ్యాన్ని నేను మీ ఎదురుగా చెప్పాను. ఓ మహీపతి! ఇది అనేక పూర్వ జన్మలలో కల్గిన పాతకముల నశింపచే సేది స్థానములన్నింటిలో ఉత్తమ స్థానము. మిక్కిలి గొప్ప క్షేమకర ప్రదేశము. స్కందుని ఎదురుగా పూర్వంధీమంతుడైన మహా రుద్రుడు చెప్పాడు ఓ పార్థ నీవక్కడ స్నానంచేసి అన్ని పాపముల నుండి ముక్తుడవౌతావు. ఆ వ్యాన వాక్యాన్ని విని ధర్మరాజు, యుధిష్ఠిరుడు ధర్మాత్మజుడు అప్పుడు ధర్మారణ్యము ప్రవేశించాడు. మహా పాతకముల నాశనం కొరకు సాధుపాలన తత్పరుడై వచ్చాడు అక్కడ తీర్థములందు స్నానం చేసి, దేవాలయములను దర్శించి, ఇష్టాపూర్వము మొదలుగా అన్ని కార్యములు తనకు నచ్చిన రీతిలో చేసినవారు పావ వినిర్ముక్తులౌతారు. తిరిగి తమ ఇంటికి చేరిన వారు తమ రాజ్యాన్ని ఇంద్ర ప్రస్థము వలె శాసిస్తారు. ఓ మహాసేన (కుమారస్వామి) ఇక్కడికి వచ్చి దీనిని విన్న నరోత్తములు భుక్తిని ముక్తిని పొందుతారు. అనుమానము లేదు  పార్థివ భోగములన్ని పొంది పిదప నిర్వాణాన్ని పొందుతారు. శ్రాద్దకాలం వచ్చినపుడు దీనిని చదివిన ద్విజాతులు పితరులు చంద్రుడు, సూర్యుడు, భూమి ఉన్నంత కాలము ఉద్ధరింపబడతారు. మహాత్ముడైన వ్యాసుడిట్లా చెప్పాడు. ద్వాపరయుగమందైతే  నీటి మాత్రం చేతవే ధర్మవాపి యందు గయా శ్రాద్ధఫలము కలుగుతుంది అని. ఇక్కడికి వచ్చిన నరుని పాపము యమ పాదమందుంటుంది లోకముల హితము కొరకు ధర్మపుత్రుడిది చెప్పాడు. అన్నము లేకున్నా, దర్బలులే తిన్నా, ఆసనము లేకున్నా  కోటి జన్మలలో చేసిన పాపము నీటితో నశిస్తుంది. మంచి శృంగములు గల ధేనువులను వేయింటిని కురుజాంగల మందు సూర్యగ్రహణ మందు దానంచేస్తే కలిగే పుణ్యము ధర్మవాపి యందు తర్పణం చేస్తే కలుగుతుంది నేను మీకు ఈ ధర్మారణ్య వృత్తాన్నంతా చెప్పాను. దీనిని విన్న బ్రహ్మహత్యా పాతకి, గోహత్య పాతకి సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. ఇరువది యొక్క మారులు గయలో పిండదానం చేయటం వల్ల వచ్చే పుణ్యము, దీనిని ఒక్కసారి వింటే లభిస్తుంది. అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వభాగ మందు ధర్మారణ్య తీర్థ మాహాత్మ్య ప్రభావ కథన మనునది ఇరువది నాల్గవ అధ్యాయము.