స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

6వ అధ్యాయము

వ్యాసుని వచనము - సాధువులకు ఉపకారము కొరకు, గృహస్థా శ్రమ వాసుల ధర్మమును వారెట్లా చేస్తారో దానిని ఉన్నదున్నట్లుగా నీకు చెబుతాను (1) ఓ వత్స! నరుడు గృహస్థాన ముందుండి ఈ జగత్తునంతా పోషిస్తున్నాడు. దానితోనే తను కోరుకున్న లోకములను జయిస్తున్నాడు (2) పితరులు, మునులు, దేవతలు, భూతములు, మనుష్యులు, క్రిములు, కీటకములు, పక్షులు, పితరులు, అసురులు (3) వీరంతా గృహస్తుని ద్వారా బ్రతుకుతున్నారు. అతని నుండే తృప్తిని పొందుతున్నారు. ఇతని ముఖాన్ని చూస్తుంటారు. మాకు నీళ్ళు ఇస్తాడు అని (4) నర్వమునకు ఆధార భూతమైనది, వేదమయమైన గోమాత, ఓవత్స. ఈ గోమాత యందు విశ్వమంతా ఉంది. విశ్వమునకు హేతువుగా భావింపబడింది. గోమాత (5) ఋక్ షృషభాగము, యజుస్సు సరిహద్దు భాగములు (సంధి భాగములు) సామము కడువు(పొదుగు) రొమ్ములు. ఇష్టా పూర్తము కొమ్ములు సాధువుల సువచనములు (సాధుసూక్తము) వెంట్రుకలు (8) శాంతి పుష్టులు మలమూత్రములు. వర్షములు పాదములు వాటి పై నిలిచి ఉంది. పదక్రమ జటవునములలో, లోకాలను బ్రతికిస్తోంది. (7) ఓ పుత్రక! స్వాహాకార స్వధాకారములు, వషట్తారము హన్తకారము అట్లాగే ఇతరమైనది ఆమె వాలుగు చనుమొనలు (స్తనములు) (8) స్వాహాకార స్తనమును దేవతలు. పితరులు స్వధాతారమును మునులు వషట్ కారమును అట్లాగే దేవ భూతమరేశ్వరులు (9) హస్త తారమును మనుష్యులు ఎల్లప్పుడు ఈ స్తనములను తాగుతున్నారు. ఈ విధముగా ప్రతిరోజు మూడు వేదములను చదివించాల్సిందే. (10) వాటిని నశింపచేసే పురుషుడు అనంత పాపములను చేసినవాడౌతాడు. ఆతడు అంధతామిస్ర నరకంలో చీకట్లో మునుగుతాడు (11) ఏ మానవుడు ఈ ధేనువును స్వర్గంలోని అమరాదులైన దూడలతో సహ ఉచిత కాలమందు పూజిస్తారో ఆతడు స్వర్గమునకు తగిన వాడౌతాడు. (వెళ్తాడు) (12) అందువల్ల ఓ పుత్ర! మనుష్యుడు, దేవఋషి పితృ మానవులను భూతములను ప్రతిరోజు పోషించాలి. తన శరీరాన్ని తాను పోషించుకున్నట్లుగా (13) అందువల్ల స్నానం చేసి శుచియై దేవ ఋషి పితృ తర్పణము చేయాలి (బ్రహ్మ) యజ్ఞం అయ్యాక, నీటితో సకాల మందు చక్కగా తర్పణ చేయాలి. (14). మల్లెపూలతో గంధపుష్పములతో దేవతలను పూజించి మానవుడు ఎదవ అగ్మితర్పణ చేయాలి. అట్లాగే బలులను ఇవ్వాలి (15) నక్తం చరులైన భూతములకు బలిని ఆకాశం నుండి ఇవ్వాలి. పితరులకు దక్షిణాభిముఖుడై అట్లాగే ఇవ్వాలి (16) గృహనుడు, దాని యందు శ్రద్ధ కలవాడై, చక్కగా ఉంచబడిన మనస్సు కలవాడై పిదప నీటిని తీసుకొని వాటియందే అర్పణ సత్కారమును చేయాలి (17) ఆయా దేవతలను పేరు పేరున ఉద్దేశించి వారివారి స్థానములందు (నీరు) ఉంచాలి, ప్రాజ్ఞుడు. ఈవిధముగా బలిని గృహమందు ఇచ్చి, గృహమందు గృహవత శుచియై (18) పిదప ఆచమించి ప్రాజ్ఞుడు ద్వార అవలోకనము చేయాలి. (181/2

పిదప ముహూర్త కాలములో ఎనిమిదవ భాగ సమయం వరకు (ముహూర్తం = 48 నిమిషాలు) అతిధి కొరకు ఎదురు చూడాలి) (19) అక్కడికి వచ్చిన అతిథిని అర్ఘ్య పాద్య ఉదళంతో పూజించాలి. ఆకలి గొన్నవాడు, వచ్చినవాడు, బ్రాంతుడు, యాచినున్నవాడు, ఆడించనుడు (20) ఐన బ్రాహ్మణుని అతిథి అని అనాలి. బుధుడు శక్తి కొలది ఆతనిని పూజించాలి. పండితుడు, అతడి ఆచారాన్ని గూర్చి అడగొద్దు. వేదాధ్యయనమును గూర్చి అడగొదు (21) అందమైన ఆకారమున్నా అవాళరిటైవా ఆతణి ప్రజావతి అని భావించాలి. ఆతని స్థితి అనిత్యము (నిత్యంకాదు). అట్లా ఉంటాడు కాబట్టే అతనిని అతిథి అంటాడు (22) ఆతనికి పెట్టి తినే నరుడు, అమృతం తింటున్నాడు. ఎవరి ఇంటి నుండి అతిథి ఆశలు భగ్నమై మరల పొతాడో (23) ఆతడు దుష్కృత్యమును ఇంటి వానికి ఇచ్చి, పుణ్యమును తీసుకొని వెళ్తున్నారు. శారదానం ఇచ్పో నీటిని ఇచ్చే అతనిని నరుడు శక్తి కొలది పూజించాలి. దానితోనే దాని నుండి ముక్తుడౌతాడు (24) యుధిష్ఠిరుని వచనము - వివాహములు, బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, అమరము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని ఎనిమిది విధములు (25) వీటి విధానమును చెప్పండి. అట్లాగే చేయాల్సింది ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. అట్లాగే గృహముల ధర్మములను వారు మీరు విశ్లేషించి చెప్పండి, అని అనగా (26) పరాశరుని వచనము - బ్రహ్మవివాహమనగా - వరుని పిలిచి, కన్యనలంకరించి ఇవ్వటం. ఆతని పుత్రుడు ఇరువది ఒక్క తరముల పురుషులను పవిత్రులను చేస్తాడు. (27) దైవ వివాహమనగా - యజమందున్న ఋత్విజునకు కన్య నిచ్చుట. ఆతని పుత్రుడు పదునాలు తరముల వారిని పవిత్రులను చేస్తాడు. అర్శమనగా వరుని దగ్గర రెండు ఆవులను తీసుకొని కన్య నిచ్చుట. అతడి పుత్రుడు ఆరు తరముల వారిని పవిత్రులచేస్తాడు (28) ప్రాజాపత్యమనగా, ఇద్దరు కలిసి ధర్మమును ఆచరించుట. వరుడు వధువు తమ ఇష్ట పూర్వకముగా వరవ్పరం మిత్రభావంతో వివాహమాడుట గాంధర్వము. రాక్షస మన బలవంతముగా కన్యనెత్తుకొని పోవుట. వజనులు దీనిని నిందించారు. (29) మోసంతో కన్యను హరించుట పైశాచము. దీనిని నిందించారు. ఇది ఎనిమిదినది. తరుచుగా క్షత్రియులకు వైశ్యులకు గాంధర్వ అమర రాక్షన వివాహములు చెప్పబడ్డాయి. (30) ఈ ఎనిమిదవది పాపిష్టమైనది. పాపిష్టులకు నంభవమైనది. సవర్ణమైన స్త్రీతో వివాహంలో చేతిని గ్రహించాలి. శరమును క్షత్రియ స్త్రీతో ధరించాలి. (కత్తికి వివాహాం) (31) మునుగోల (గుఱ్ఱాన్ని కొట్టేది)ను వైశ్య స్త్రీతో ధరించాలి. వస్త్రము చివరి భాగమును శూద్ర స్త్రీతో ధరించాలి. అసవరులైన స్త్రీలతో వివాహం అయ్యే సందర్భంలో పైది విధించబడింది. వివాహ సందర్భంలో సుతులందు చూడబడింది ఇది (32) అన్నీ పర్గముల వారు ఎవరులతో వివాహంలో పాణినే (చేతినే) గ్రహించాలి. ఇది విధి. ధర్మమైన వివాహమందు, నూరు సంవత్సరాల ఆయుస్సు గల ధర్యమైన పుత్రులు జన్మిస్తారు (33) అధర్మం వలన ధర్మరహితులైన మందభాగ్యులు, ధనము, ఆయుస్పులేని వారు వుత్తారు. కాలమును గమనించి భార్యను చేరటం అనేది గృహముల యొక్క ఉమ ధర్మము (34) లేదా స్త్రీల కోరిక ననుసరించి పొందాలి. లేదా కామము కల్గిన రీతిలో పొందాలి. పురుషుడు పగటిపూట స్త్రీని పొందుట మిక్కిలి ఆయుః క్షిణకరమని అన్నారు (35) బుద్ధిమంతుడు శ్రాద్ధవు దినమందు అన్ని పర్వ దినములలో భార్యను పొందరాదు. అట్లా మోహం వల్ల స్త్రీని పొందితే ఉత్తమమైన ధర్మము నుండి చ్యుతుడౌతాడు. (36) ఋతు కాలంలో మాత్రమే భార్యను పొందేవాడు, తన భార్యను మాత్రమే పొందే వాడు, వాడు ఎల్లప్పుడు బ్రహ్మచారి అని గ్రహించాలి. ఆతడు గృహస్థా శ్రమంలో ఉన్నవాడు నిజంగా (37)

ఆర్ఘవివాహంలో ఆవులు అని ఏది చెప్పామో అది అక్కడ ప్రశస్తమైంది (ఇతరత్రకాదు) కన్య నుండి శుల్కమును ఏ కొంచమూ (అణువు) తీసుకోరాదు. కన్యను విక్రయించే పాపాన్ని చేసిన వాడౌతాడు (38) అసత్యమును అమ్మటం వలన కల్పకాలము మల మందలి పురుగులను భుజిస్తూ ఉంటాడు. అందువల్ల నరులు కన్య యొక్క ధనమును అణువైనా తీసుకొని బ్రతుకరాదు (39) అటి చోట ఆనందపడి మహాలక్ష్మి దాన జలంతో వస్తుంది. వాణిజ్యము, వీచ సేవ, వేదములను చదువక పోవటం (40) తువివాహము క్రియలోపము ఇవన్ని కులంలో పతనానికి కారణాలు. వివాహాన్ని యందు గృహ్యకర్మను ప్రతిరోజు గృహము ఆచరించాలి (41) పంచయజ్ఞ క్రియలను నిత్యం చేసే వంటను చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రతిరోజు పంచసూన కర్మలు చేయాలి (42) రోలు, నూరేరాయి, పొయ్యి, నీటి కుండ, చీపురు కట్ట. ఈ ఐదు సూనములను తొలగించే కారణాలుగా ఐదు క్రతువులు చెప్పబడ్డాయి. గృహస యొక్క శ్రేయస్సును పెంచేవి (43) పతనం బ్రహ్మ యజ్ఞము ఔతుంది. తర్పణము పితృ క్రతువు ఔతుంది. హోమము దేవయజ్ఞము ఔతుంది భూత బలిభూత యజ్ఞమౌతుంది. అతిథి పూజ నృయజ్ఞమౌతుంది (44) వైశ్వదేవం మధ్యలో వచ్చిన అతిథి, సూర్యుడు తెచ్చిన అతిథి(సాయంకాలపు అతిథి) అనీ అంటారు. అతిథి కన్న ముందే వీళ్ళు భుజించొచ్చు. ఇందులో సంశయించాల్సింది లేదు (45) పితృదేవ, మనుష్యులకు ఇచ్చాక తింటే గృహాను భుజించినట్లు. అన్నాన్ని ఇవ్వకుండా తింటే కేవలము తన ఉదరాన్నీ నింపుకునేవాడు (46) వైశ్వదేవం చేయని వారు, అతిథ్యాన్ని వదలిన వారు, ద్విజులు వేదాలు వచ్చిన వారైనా వారంతా వృషలులు అని గ్రహించాలి (చండాలురు) (47) వైశ్వదేవం చేయకుండా తినే బ్రాహ్మణాధములు, ఈ లోకంలో అన్న హీనులై పెదవ తాకినీని పొందుతారు. (48) వేదోక్తమైన తెలిసిన కర్మను ప్రతిరోజు, జాగ్రత్తగా చేయాలి. శక్తి కొలది చేస్తే ఉత్తమమైన పద్ధతిని పొందుతాడు (49) షష్ఠి అష్టములలో పాపము, నూనె యందు మాంస మందు ఎప్పుడూ ఉంటుంది. చతుర్ధశి యందు, పదునైదవదినమందు (పంచదశి) (పూర్ణిమఅమావాస్య) కత్తి యందు, భగమందు పావుంటుంది. (50) ఉదయిస్తున్న సూర్యుణ్ణి, అస్తమిస్తున్న సూర్యుణ్ణి, నడినెత్తి సూర్యుణ్ణి చూడరాదు. రాహువు ముటన (గ్రహణంలో) సూర్యుణ్ని వృత్తాకారంలో ఉన్న సూర్యుణ్ణి చూడరాదు (51) తన రూపాన్ని నీటిలో చూచుకోరాదు. బురదలో పరుగెత్తరాదు. నగ్నంగా ఉన్న స్త్రీని చూడరాదు. నగ్నంగా ఉండి నీళ్ళలోకి దిగరాదు. (52) దేవాలయము, బ్రాహ్మణుడు, వనంతము, భూమి, ఆవు, వీటని, జాతి వృద్ధుడు, వయో వృద్ధుడు, విద్యా వృద్ధుడు ఐనవానిని (53) అశ్వత్థము, పవిత్ర స్థలంలో ఉన్న అత్తిచెట్టు, గురువు, నీటితో నిండినకుండ, సిద్ధాన్నము, పెరుగు, సిద్ధార్థుడు, వీరిని చూస్తే వెళ్తూ వెళ్తూనే ప్రదక్షిణం చేసి వెళ్ళాలి (54).

రజస్వలను సేవించరాదు. భార్యతో కలిసి తినరాదు. ఒంటి వస్త్రముతో తినరాదు. ఎత్తైన ఆననమందు కూర్చుండి భుజించరాదు (55) అశుచియైన స్త్రీని చూడరాదు, తేజస్కాముడైన ద్విజోత్తముడు. పితరులను దేవతలను సంతృప్తి పరచకుండ ఎక్కడా అన్నము తినరాదు (56) దీర్ఘకాలము జీవించాలని కోరేవాడు వక్వాన్నమును (మాడింది) మాంసమును తినరాదు (అవత్వం తినాలి) మార్గంలో మూత్రం చేయరాదు. పుట్ట పైన, బూడిదలో కూడా చేయరాదు (57) ప్రాణులున్న పల్లవు ప్రాంతములందు, విలబడి, వెళ్తూ వెళ్తూ మూత్రం చేయరాదు. బ్రాహ్మణుని, సూర్యుని, అగ్నిని, చంద్రుని, నక్షత్రాలను, గురువులను (58) బాగా చూ మల మూత్రవిసర్జన చేయరాదు. అగ్నిని ముఖంతో ఊదరాదు. స్త్రీని నగ్నంగా ఉన్నదానిని చూడరాదు (59) పాదములను అగ్ని యందు కాపరాదు. వస్తువును ఆశుచి యందు వేయరాదు. ప్రాణి హింసను చేయరాదు. రెండు సంధ్యాకాలములందు భుజించరాదు (60) ప్రాతః సాయం సంధ్యల యందు బుధుడు ఎక్కడికి వెళ్ళరాదు. పాలు తుడువుతున్న ఆవును చూడరాదు. ఇంద్ర చావమును చూపరాదు (81) శూన్యంలో ఒంటరిగా ఎక్కడో ఒంటరిగా నిద్రించరాదు. నిద్రిస్తున్న వాణ్ణి లేపరాదు. ప్రయాణం ఒంటరిగా చేయరాదు. (దారిలో ఒకడే వెళ్ళరాదు). దోసిలితో నీరు త్రాగరాదు. (62) వగలు సారం తీసిన పెరుగును (చల్ల) తినరాదు. రాత్రి పెరుగును తినరాదు. స్త్రీ ధర్మము గల దానికి నమస్కరించరాదు. రాత్రులందు తృప్తి కలిగే వరకు తినరాదు (63) నృత్య గీత వాద్యములందు అతి ప్రేమ పనికిరాదు. కాంస్య పాత్ర యందు కాళ్ళు కడుగరాదు. తాను శ్రాద్ధము చేసి, జ్ఞానం లేనివాడై వరధంలో తిన్నవాడు (64) ఐతే దాతకు శ్రాద్ధ ఫలము లేదు. భోక్త పాపమును తిన్నవాడౌతాడు. ఇతరులు వాడే వస్త్రమును, చెవులను ధరించరాదు (65) పగిలిన పాత్రలో తినరాదు. అన్ని మొదలగు వానిలో దూషితమైన దానిపై కూర్చోరాదు. గోపృష్ణ మందు ఎక్కటం, (పేశ ధూమము. నదుల ఒడు (66) బాల ఆతవము, వగటి నిద్ర వీటిని దీర్ఘకాలము జీవించదలచిన వాడు వదలాలి. స్నానం చేసి గాత్రమును తోముకో రాదు (కడుగుకొను) శిఖను దారిలో విప్పరాదు (67) చేతులు శిరస్సు కదల్చరాదు. ఆసనమును కాళ్ళతో లాగరాదు. చేతితో గాని స్నాన వస్త్రంతో గాని గాత్రాన్ని తుడువరాదు (68) శరీరమును కుక్కనాకితే మళ్ళీ స్నానం చేస్తే శుద్ధమౌతుంది. పండ్లతో ఎప్పుడు రావి వెంట్రుకలు, గోళ్ళు పీకరాదు. (69) శుభము కొరకు గోళ్ళతో గోళ్ళను తీయటం వదలాలి. రాబడి కాలంలో ఒకవనివి వదలాల్సి వస్తే ఆ పని ప్రయత్న పూర్వకంగా మళ్ళీ చేయరాదు (70).

తన ఇంటికైన దొడ్డి దారి గుండా ఎప్పుడూ ప్రవేశించరాదు. ఆట తెలియని వారితో ఆడరాదు. ధర్మాన్ని చెడగొట్టే వారితో కలిసి కూచోరాదు. రోగులతో కలిసి కూచోరాదు (71) ఎక్కడా నగ్నంగా పడుకోరాదు. చేతిలో భుజించరాదు. తడిసిన పాదములు చేతులు ముఖము కలిగి భుజిస్తే ఆతడు ఎక్కువ కాలము జీవించడు (72) తడిసిన పాదాలలో నిద్ర పోరాదు. ఎంగిలితో ఎక్కడికి కదలరాదు. వడకలో భుజించరాదు, బ్రాహ్మణుడు వడకలో నీరు కూడా తాగరాదు (73) చెవులతో కూర్చోరాదు నిల్చొని నీరు తాగరాదు. అంతా పులుసుతో తినరాదు. ఆరోగ్యం కావాలనుకునే వారు (74) మలమూత్రముల చూడరాదు. ఎంగిలితో శిరస్సును తాకరాదు. ఉముక, నిప్పు కణికలు, బూడిద, వెంట్రుకలు, పుస్తెలు వీటచోట అధిష్ఠించి ఉండరాదు (75) వత్తులతో సహవాసము పతనము కొరకే ఔతుంది. శూద్రునకు ఎకైన ఆనవాన్ని మంచమును ఎప్పుడూ ఇవ్వరాదు (76) ఇస్తే బ్రాహ్మణుడు బ్రాహ్మణ్యము నుండి హీనుడై పోతాడు. శూద్రుడు ధర్మము నుండి హీనుడై పోతాడు. శూద్రులకు ధర్మోపదేశం చేస్తే అది తన శ్రేయనునే నశింపచేస్తుంది (77) శూద్రులకు బ్రాహ్మణ శుశ్రూష పరమ ధర్మమన్నారు. తలను చేతులతో గోక్కోవటము మంచిది కాదు (78) శూద్రునకు వైదిక మంత్రాన్ని ఎప్పుడూ బోధించరాదు. విప్రుడు బ్రాహ్మణ్యము నుండి, శూద్రుడు ధర్మము నుండి హీనులౌతారు. అట్లాచేస్తే (79) చేతులతో కొట్టటం (చప్పట్లు) ఎడవటము, వెంట్రుకలు తెంవటము (ఇవన్నీ అకారణంగా చేయటం), శాస్త్రమునకు భిన్నంగా నడవటం మాటి మాటికి, లుబ్ధుని నుండి దానం తీసుకోవటం (80) ఇవన్నీ చేసే బ్రాహ్మణుడు ఇరువది ఒక్క నరకములకు పోతాడు. ఆకాల మేము గర్ణనము, వర్షఋతువు యందు దుమ్ము వర్షించటము (81) రాత్రిపూట మహాబాల ధ్వనులు (లేదా సుడిగాలి) వీటిని అనధ్యాయముగా గమనించాలి. తోకచుక్క వడటము, భూకంపము, మధ్యరాత్రులలో దిక్కులు తగలబడటము (82) సంధ్యలు, వృషలుడు సమీప మందు ఉండటము, రాజ్యము పోవుట, సూతకము వది అష్టకములు (పూర్ణిమతరు వాతి సప్తమీ, అష్టమి, నవములు, అష్టకములు ) బహుళ చతుర్దశి, క్రోధదినము, ప్రతి వద (83) పూర్ణిమ, అష్టమి, విటశ్రేష్టుడు, రాష్ట్రవిప్లవము, ఉపాకర్మ ఉత్సర్గము, కల్పాదులు, యుగాదులు. (వేదములు చదవటంను మానటం. ఇది ఆరునెలల కొక సారి చేస్తారు. అదే ఉత్సరము) (84) ఆరణ్యకములు చదువుట ఐవాక, బాణముల ధ్వని విన్నాక, సాభముల ధ్వని విన్నాక (తూర్పునందలి ఆడ ఏనుగ) ఇవన్నీ పైవి అనధ్యాయ దినములు ఈ అనధ్యాయ దినములందు ఏ కొంచెము, ఎక్కడా చదువరాదు (85) బహుళ చతుర్ధశి, అష్టమి, వంచదశి (పూర్ణిమ, అమావాస్యలు) ఈ రోజులలో ఎప్పుడు బ్రహ్మచారిగా ఉండాలి. ఇతరుల భార్యను పొందుట ఆయుష్యము లేకుండా చేస్తుంది. అందువల్ల దానిని దూరంగానే వదలాలి. వైరిసేవను కూడా వదలాలి (86).

పూర్వీకులతో వదులబడిన తనను అవమాన పరుచుకోరాదు. ఎప్పుడూ ఉద్యమించేవానికి శ్రీ, విద్యలు దుర్లభములు కావు. (లభిస్తాయి) (87) సత్యం పలకాలి. ప్రియంగా పలకాలి. అ ప్రియమైన సత్యాన్ని పలుకరాదు. ప్రియమైన అబద్ధాన్ని పలుకరాదు. ఇది ధర్మముగా విధించబడింది (88) వాగ్వేగమును, మనోవేగమును, నాలుక వేగమును విడిచి పెట్టాలి. రహస్యంగా ఉండే వెంట్రుకలనైవా, వాటిని ముడ్తే అశుచుయౌతాడు (89) కాళ్ళు కడగిన నీరు, మూత్రము, ఎగిలి నీరు, ఉమ్మి, శ్లేష్మ రోగి వీరిని గృహానికి దూరంగా పారవేయాలి (90) రాత్రింబగళ్ళు శ్రుతులను జపించటము వలన, శుచి ఆచారములను ఆచరించుటవలన, ద్రోహంలేని బుద్ధితోను బ్రాహ్మణుడు పూర్వజన్మను వరించాలి. (చవచ్బు) (91) ప్రయత్న పూర్వకముగా పెద్దలకు నమస్కరించాలి. వారికి తన ఆసనమును ఇవ్వాలి. వినయంతో భుజములు వంచి నిలబడాలి. పిదప వారిని అనుసరించాలి. (92) వేదములు, బ్రాహ్మణులు, దేవతలు, రాజు, సాధుజనులు, తపస్వులు, పతివ్రతా స్త్రీలు వీరలను ఎప్పుడూ నిందించరాదు (93) ఐదు మట్టి పిండములను (ముద్దలు) తీసుకొని, ఇతరుల జలాశయములందు స్నానం చేయాలి. శ్రద్ధతో, యోగ్యుని చేరి ఆతనికి ఏదో కొంచము ధనమును (94) శాస్త్ర ప్రకారము దేశకాలములందు ఇస్తే అది అనంత ఫలాన్ని ఇస్తుంది. భూదానం చేసేవాడు మండలాధీ శుడౌతాడు. అన్నం పెట్టే వాడు అంతటా ముఖంగా ఉంటాడు (95) నీరు దానం చేసేవాడు మంచి రూపం గల వాడౌతాడు. అన్నం ఎక్కువగా ఇచ్చేవాడు ఆరోగ్యవంతు డౌతాడు. దీనం దానం చేసేవాడు నిర్మలమైన కళ్ళు గల వాడౌతారు. గోదానం చేసేవాడు సూర్యలోకానికి వెళ్తాడు (96) బంగారం దానం చేసేవాడు దీర్ఘాయుష్మంతు డౌతాడు. నువ్వులు దానం చేసేవాడు మంచి సంతానవంతు డౌతాడు. గృహం దానం చేసేవాడు, చాలా పెద్ద భవనంనకు ప్రభువౌతాడు. వస్త్రదానం చేసేవాడు చంద్ర లోకానికి వెళ్తాడు (97) గుఱ్ఱము దానం చేసేవాడు దివ్యమైన దేహం కలవాడౌతాడు. వృషభమును ఇచ్చేవాడు లక్ష్మీ వంతుడౌతాడు. పలకి దానం చేసేవాడు నుంచి భార్యకల వాడౌతాడు. మంచి పర్యంతమునిచ్చేవాడు కూడా సుర్యుడౌతాడు (98) శ్రద్ధతో స్వీకరించే వాడు శ్రద్ధతో ఇచ్చేవాడు వీరిద్దరు స్వర్గానికి వెళ్లారు. అ శ్రద్ధకలవారు అధఃపతితులౌతారు. (99) అబద్ధం వల్ల యజము నాశనమౌతుంది. ఆశ్చర్యం వల్ల తవను నాశనమౌతుంది. దానం లేకపోతే కీర్తి నశిస్తుంది. బ్రాహ్మణులను అవమానం చేస్తే ఆయుస్సు నశిస్తుంది. (100) గంధము, పుష్పము, దర్భలు, ఆవులు, తాళము, మాంసము, పాలు, పెరుగు, మణులు, చేపలు, ఇల్లు, ధాన్యము వీనిని వచ్చిన దానిని (లభిస్తే) స్వీకరించాలి. (101) తేనె, నీరు, పండు, గడ్డలు, కట్టెలు, అభయము, దక్షిణ వీటిని గూడ ని కృష్ణుని నుండి వచ్చిన వానిని గ్రహించాలి (102) దానుడు, మంగలి, గోపాలుడు, కులమిత్రుడు, వ్యవసాయం చేసే రైతు, వీరు శూద్రవర్గంవారైనా వీరికి భోజనం పెట్టాలి. అట్లాగే తన ఆత్మను నివేదించుకునే వారికి భోజనం పెట్టాలి (103) ఈ విధముగా ఈ ఆచార ధర్మము ధర్మారణ్య నివానులకు చెప్పబడింది. ప్రతివృతులలో చెప్పబడిన ఈ ధర్మము యుధిష్టరునకు చెప్పబడింది. (104) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశితి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు సదాచార లక్షణ వర్ణన మనునది ఆరవ అధ్యాయము.