స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

20వ అధ్యాయము

తా ॥ వ్యాసుని వచనము – ఇక ముందు శివ తీర్థమును గూర్చి చెబుతాను. అక్కడ ఈ దేవుడు శంకరుడు పునర్జన్మ ధరుడైవాడు కట్టబడి దేవదేవువశు, శంకరుడు, త్రిలోచనుడు భూమండల మందు పార్వతిచే పారవేయబడ్డాడు, ఓ మహాభాగ అవశ్యమైన మోహాన్ని పొంది రాత్రింబగళ్ళు తెలుసుకోలేక పోయాడు. త్రిలోచనడు జడంగా మారితే పుంస్త్రీ నపుంసకులు జడమైనారు ఆతడు బుద్ధుడుకాగా కల్పాంతమైనట్టుగా ఉంది. పార్వతి, త్వరగా ఆతనిని బంధించింది  యుధిష్ఠిరుని వచనము - ఇది చాలా పెద్ద ఆశ్చర్యము. మీరు చెప్పిన మాట ఆశ్చర్యము. శివుడు సర్వదేవతలకు గురువు, యోగులకు కూడా ఎల్లప్పుడు గురువు పార్వతి అతనిని ఎందుకు బంధించింది. శివుడు కదలిక లేకుండా ఎట్లా ఐనాడు. దానికి కారణమేమిటో చెప్పండి. నాకు చాలా కుతూహలముగా ఉంది వ్యాసుని వచనము – ఓ రాజా! పార్వతి ఎదుట, అథర్వణ ఉపవేదమందలి రకరకాల మంత్రి సమూహములను శివుడు ప్రకాశింప చేశాడు. శాకిని, డాకిని, కాకిని, హాకిని, ఏకిని, లాకిని, ఈ ఆరు భేదములను ఇక్కడ కీర్తించాడు వాని నుండి భీజమునుద్ధరించి ఒకచుట్టు కలిగిన మాల చేయబడింది. ఓ నృపోత్తమ! పార్వతి ఎదుట శంభుడు చెప్పాడు మంత్రోద్ధారము చేస్తే అది వాటిలో ఎనిమిది విధాలౌతుంది. ఓ అనఘే! మహాదుష్ఠమైన ఆశాకిని స్త్రీని సాధించాలి దానితో శ్రీపార్వతి వచనము – ఓ నాథ! నీవు ఆరే భేదములని చెప్పాను. ఊ నాథ ఈషడ్వితశక్తులు, నీవొక్కడినే, ఆరు రకాలని చెప్పిన దానిని కూడిన (దాచిన) దానిని నాకు చెప్పు శ్రీ మహాదేవుని వచనము - దేవాసురులతో మానవులలో చెప్పతగనిది, ఓ మహాదేవి పార్వతి వచనము - సర్వరూప నీకు నమస్కారము. వృషభ ధ్వజా! నీకు నమస్కారము. జటలేక, నీలకంఠ నీకు నమస్కారము కృపావింధు, కాలరూపా నీకు నమస్కారము. ఈ రకమైన అనేక విధములైన కోమలములైన వాక్యములతో కరుణానిధిని అద్రి తనయ సంతోషపరచి, దండమువలే నమస్కరించి, రెండు పాదములను పట్టుకుంది. దయాపరుడై ఆమెతో ఇట్లవాడు  ఓ భద్రే నన్నెందుడు స్తుతిస్తున్నావు. నీ మనసులోని కోరికను అడుగు అనగా పార్వతి వచనము - వాటన్నిటి సమాహారమును ధ్యానముతో సహా, విస్తారంగా నాకు చెప్పు. ఒకవేళ నేను నీకు వల్లభనైతే (ప్రియమైతే) సందేహము లేకుండా, అంతో, ఏం మిగలకుండా చెప్పు  ఆనగా. 

తా ॥ శ్రీరుద్రుని వచనము - ఓదేవి! సమాహారము వల్ల కలిగే ఫలాన్ని నీవు చెప్పొద్దు. మంత్ర కూటము. మొదలుగా తత్వమంతా నేను చెబుతాను  ఓ వరాననే! అన్ని కూటముందు మాయా బీజమును చెబుతాను. అన్నింటి మధ్యమ వర్షము బిందువాదాది శోభితము వహ్నిబీజము, వాత వహితము, కూర్మదీయముతో కూడినది. ఆదిత్య వైభవమైన భీజము ఎల్లప్పుడు శక్తి భీజము నుండి ఉద్భవించింది వీటి కూటమే ఆద్య బీజము, ద్వితీయము విభువున కిష్టమైనది. మూడవది అగ్ని బీజము, ఇది, ఇందు బిందువుతో కూడినది చతుర్థము శేషముతో కూడినది బ్రహ్మ భీజము, ఋషి కూడా. పంచమము తాల బీజము. వస్త్రము పార్థివ బీజకము సప్తమ, అష్టమములు, బాహ్యమైనవి, నృసింహముతో కూడినవి. నవమ మందు రెండవది ఒకటే. దశమము అష్టకటకము  ఓ వరచారిణి! రుద్రాక్ష మందు వాటి భీజము విపరీతమైనది. చతుర్ధశ మందు చతుర్ధ్యర్ధము కలది వృథ్వీ బీజముతో కూడినది ఓ మేనకాత్మజ! కూటములైన శేష అక్షరములు కొన్ని రక్షింపబడ్డాయి. శివపత్ని భూమి మీద వడివాక ఆమెను రాముడు ఆశ్వాసించాడు. అప్పడు త్రిపురాంతకుడు నవ్వుతూ, ఓ భద్రే! నీవు పడిపోయావు. జవశక్తి నీరు కల్గుతుంది. మరణము, మోహనము, వశ్యము, ఆకర్షణము, క్షోభణము నీవు వేటిని కోరుకుంటే అవి అవి నీకు సిద్ధిస్తాయి దానిని విని దేవి, దుష్టచిత్తము కలదై చిరునవ్వు నవ్వుతూ ఉంది. శంభువు ఆమెకు తూటశేషములైన వీరములను చెప్పాడు విధి ప్రకారము సాధించు అని కృపా సింధువు పలికాడు. కైలాసము నుండి హరుడు త్వరగా ధర్మారణ్యమునకు వెళ్ళాడు  వృషభ ధ్వజుడున్న చోటు తెలుసుకొని దేవి కూడా అక్కడికి వెళ్ళింది. ఓ నృపోత్తమ! ఆ క్షణంలోనే భూమి యందు ధర్మారణ్యమందు పడిపోయింది  జడలు, చంద్ర ఉరగములు, బలము, వృషభము మొదలుగా ఆయుధములు, ముండమాల, కౌపీనము, బ్రహ్మయొక్క కపాలము పడిపోయాయి. గణములు, భూతప్రేతములు అంతట పదిదిక్కులకు వెళ్ళారు. దేవుడు మహేశ్వరుడు తాను వినంజ్ఞముగా ఉన్నానని (తెలివి తప్ప) తెలుసుకున్నాడు చెమట నుండి పుట్టిన గణములు అలాగే కూటాదులు అందుండి పంచకూటములను పుట్టించారు. అది అదిమూలి కొరకు.

తా ॥ ఓమహారాజ! ఆ సాధకులు జప హోమ పరాయుణులై ప్రేతాననులై వారంతా కాల కూటము పై ఉండి  తమకు తాము అనుకుంటున్నారు పినాకికి మెక్షమెట్లా కలుగుతుంది అని. పిదప కష్టముతో కూడినదైనా గౌరి వహ్ని భయముతో ఆతురయైంది వారు శివుని గౌరవించారు. గౌరి సిగ్గుతో తలవంచుకొంది. శంకరుని ఆదేశమును చేయదలచి ఆమె అక్కడ ఉండి తపమాచరించింది. పంచాగ్ని సేపనం చేస్తూ, ధూమ్రపానం చేస్తూ అధోముఖంగా ఉండి కూటాక్షరములతో స్తుతించింది. వాటితో వృషభధ్వడు ఆనందపడినాడు ఓ రాజ! ఇది ధరాక్షేత్రము, పావఘ్ననము. సర్వకామముల నిచ్చేది. దేవతలు మునిగేది, శుభ్రమైనది, ఈ స్థానంలో ఉండి ఓ నృప! ఆశ్వయుజం కృష్ణ పక్షము చతుర్ధశి యందు అక్కడ స్నానం చేసిన, పానం చేసిన సర్వ పాపముల నుండి ముక్తులౌతారు. దేవేశుని పూజించి, విధి ప్రకారము ఉపవసించాలి. శాకిని, డాకిని, వేతాలురు పితరులు గ్రహములు గ్రహముల అధిష్ఠించిన వారు పీడించరు. ఓ వరానన! ఇది సత్యము. సాంగమైన రుద్ర జపమును అక్కడ చేస్తే పాపముల నుండి ముక్తులౌతారు మూడు రకములైన రోగములు నశిస్తాయి. ఇది సత్యము. ఇదంతా నేను చెప్పాను. దేవ మజ్జనకమును గూర్చి విను వేల కొలది అశ్వమేధములు భూరి దక్షిణలతో చేసినా అంతఫలమును, ఈ కథను విన్న, వినిపించిన నరులు పొందుతారు పుత్రులు లేనివారు పుత్రులను, ధనములేని వారు ధనమును, ఆయురారోగ్యము ఐశ్వర్యములను, పొందుతారు, అవమానము లేదు మనోవాక్కాయములతో కల్గిన పాపము త్రివిధము. అదంతా స్మరణవల్ల కీర్తన వల్ల నశిస్తుంది ధన్యమైనది. యశస్కరము, ఆయుః కారకము సుఖ సంతాన దాయకము. ఈ మాహాత్మ్యము. దీనిని విన్నవారు సర్వ సౌఖ్యాన్వితులౌతారు సర్వ తీర్థములలోని పుణ్యము, సర్వధానముల ఫలము, సర్వయముల పుణ్యము అదంతా ఈ కథా శ్రవణము వలన కలుతుంది ఓ రాజా! అని శ్రీ స్కాంద మహాపురాణమందు, ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు, పూర్వభాగ మందు ధర్మారణ్య మాహాత్మ్య మందు ధరాక్షేత్ర వర్ణనమనునది ఇరువదవ అధ్యాయము. 


 

శ్రీ:
అథ శ్రీస్కాందే మహాపురాణే తృతీయే బ్రహ్మఖండే ధర్మారణ్యఖండః  (పూర్వభాగము)

శ్రీగణేశాయనమః