స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
28వ అధ్యాయము
తా ॥ వ్యాసుని వచనము - గోవత్సమునకు నైఋతి భాగంలో లోపాయష్టిక కన్పిస్తుంది. స్వయంభు లింగ రూపంలో అక్కడ స్వయంగా రుద్రుడున్నాడు. శ్రీ మార్కండేయుల వచనము - భాద్రపద మాసమందు కృష్ణ వక్షమందు సరస్వతి యొక్క మోక్ష తీర్థమందు బ్రాహ్మణులను విధి ప్రకారముగా పూజించి, వారికి దక్షిణను ఇవ్వాలి ఇరువదొక్క మారులు గంగలో భక్తితో పిండ ప్రదానం చేసి నందువల్ల వచ్చే ఫలము ఇక్కడ ఒక్కసారి తర్పణము వల్ల నరులకు లభిస్తుంది. నిశ్చయము లోహయష్టి యందు భాద్రపదం కృష్ణ పక్షంలో శ్రాద్ధం చేస్తే పితరులు ప్రేతయోని, వినిర్ముక్తులై స్వర్గంలో ఆనందిస్తారు మాకు అందరికి కలిపి తిలోదకమవ్వాలి. కృష్ణ పక్షమందు చంద్రోదయ మందు పిండము కాని ఉదకముకాని ఇవ్వాలి లోపాయష్టి (స్థలం) యందు, భాద్రపద అమావాస్య యందు జనలు శ్రాద్ధం చేయాలి. పితరులు ఇష్టమైతే వారి కొరకు శ్రాద్ధాచరణ అని మునులన్నారు సారస్వత జలమందు స్నానంచేసి పాలతో, తెల్ల నువ్వులతో పితృతర్పణ చేసిన వాని పితరులు తృప్తులౌతారు నిశ్చయము అక్కడ శ్రాద్ధమును నత్తుతో (పిండి) పాలతో నహ చేయాలి. ఆమావాస్య రోజు, పితరులకు మోక్షం కోరేవారు చేయాలి వస్త్రాది భూషితమైన ధేనువును రుద్ర తీర్థమందు ఇవ్వాలి. మోక్షాన్ని కోరేవాడు విష్ణు తీర్థమందు బంగారం దానం చేయాలి. గయలో పితృ రూపంలో జనార్దనుడు స్వయంగా ఉన్నాడు. ఆ పుండరీకాక్షుణ్ణి ధ్యానిస్తే ఋణత్రయం నుండి ముక్తుడౌతాడు అక్కడికి వెళ్ళి ఆ దేవదేవుని జగత్పతిని ప్రార్థించాలి. ఓదేవ! పితరులకు పిండమిచ్చే కొరకు గయకు వచ్చాను. ఈ పిండాన్ని నేను నీ చేతికిస్తున్నాను. ఓ జనార్ధన. పరలోకమునకు వెళ్ళిన వారికి నీవే దాతవు. ఈ మంత్రంతోనే హరిచేతి యందు ఇవ్వాలి, అక్కడ భాద్రపదం కృష్ణపక్షం చతుర్ధశి యందు పిండమివ్వాలి. పితరులకు అక్షయ తృప్తి లభిస్తుంది. అనుమానం లేదు ఇరువై ఒక్క మారులు గయ యందు పిండం భక్తితో ఇవ్వటం వలన తృప్తిని పొందుతారు. లోహయతి యందు భక్తితో, పితృ తర్పణం వల్లనే తృప్తిని పొందుతారు. ఇక్కడ నీటి తర్పణమిస్తే తృప్తిని పొందుతారు. అక్షయ్య మఖాన్ని పొందుతారు. వలప్రదుడు సుతులను, భక్తులను ఆరోగ్యమును ఇస్తాడు. అక్కడ న్యాయంగా సంపాదించిన డబ్బు కొంచెం ఇచ్చినచో మహా ఫలాన్ని ఇస్తుంది. ఆ తీర్థంలో స్నానం చేయటం వల్లనైనా సరే రుద్రుని అనుచరుడౌతాడు ఆని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు సంక్షేపముగా తీర్థ మాహాత్మ్య వర్ణనమనునది ఇరువది ఎనిమిదవ అధ్యాయము.
