స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
7వ అధ్యాయము
వ్యాసుని వచనము - ధర్మవాపికి వచ్చి పితృ తర్పణము చేసిన వాని పితరులు పదునాలుగురు ఇంద్రులున్నంత కాలము తృప్తిని పొందుతారు (1) ఇక్కడ ఉన్న పితరులు పూజ్యులు స్వర్గానికి వెళ్ళిన పూర్వజులు పూజించతగినవారు. ముక్తినిచ్చే ఈ ధర్మవాదికి వచ్చి వారికి పిండములను ఇవ్వాలి (2) త్రేతాయుగ మందు ఐదు దినములు, ద్వాపర మందు మూడు రోజులు, కలియుగ మందు ఏకాగ్ర చిత్తంతో బ్రాహ్మణులు పిండ దానము చేయాలి (3) కలియుగం వస్తే మానవులు, లోకంలో లోలువులౌతారు. లోతులు వరదారరతులౌతారు. ఆడవారు అతిచవలులౌతారు (4) అందరు పరద్రోహ మందాసక్తి చూపుతారు, నరులు స్త్రీలు, నపుంసకులు అందరూ ఎప్పుడు ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఇతరుల తప్పులను ఎవ్వడూ చూపిస్తూ ఉంటారు. (5) ఇతరులను ఉద్వేగ వరుస్తుంటారు. తగాదాలు పెడ్తారు. మిత్రభేద మాచరిస్తారు. వారందరు ఇక్కడ శుద్దీని పొందుతారు. కాజేశులు స్వయంగా చెప్పారు (6) ఓ మహాభాగ ధర్మారణ్య పర్ణనను దీనిని మీరు చెప్పాను. శూలపాణి ఇక్కడ చెప్పిన ఫలాన్నంతా చెప్పాను. (7)వాక్ మనః కాయశుదులౌతారు. వరదారవరాట్ ముఖులౌతారు. ద్రోహబుద్ధి లేని వారౌతారు. (కుద్ధులు సమన్వభావులౌతారు. మాతా పితృ వరాయణులౌతారు (8) లౌల్యం లేని వారు, లోభ రహితులు, దాన ధర్మవరాయణులౌతారు. ఆస్తికులు, ధర్మజులు, స్వామిభక్తి కలవారౌతారు (9) పతివ్రతయైన స్త్రీ పతి శుశ్రూష కలదౌతుంది. అహింసకులు, అతిథి మర్యాదవరులు స్వధర్మనిరతులు ఔతారు (10) శానతుని వచనము - ఓ మహాభాగ! సర్వధర్మ విదులలో శ్రేష్ఠుడ! నూతవిను. నీవు చెప్పగా నేను గృహనుల సదాచారమును గూర్చి విన్నాను. (11) ఓ సూతజ! నా కోరిక ఒకటుంది. నాకివేళ దాన్ని చెప్పండి. పతివ్రతలందరి లక్షణము లేవో నాకు చెప్పండి. అనగా (12) సూతుడిట్లన్నాడు. - గృహంలో పతివ్రత కలవాని జీవనము నఫలమైంది. ఆమె కథ ఆమె అంగ ఛాయవలె పుణ్యము కల్గించేది, దానితో సమానమైంది (13) పతివ్రతలు, అరుంధతి, సావిత్రి, అనసూయ, శాండిలి, సతి, లక్ష్మీ, శతరూప (14) మేన, సువీతి, సంఖ, స్వాహా, వీరితో సమానమౌతారు. పతివ్రతల ధర్మములు ముని కీర్తించాడు (15) భర్త తింటే తాను తింటుంది. ఆతడు నిల్చుంటే తాను నిల్చుంటుంది. ఆతడు నిద్రిస్తే తాను నిద్రిస్తుంది. ఆతని కన్న తొలుతే మేల్కొంటుంది. (16) భర్తదేశాంతరమందుంటే తనను అలంకరించుకోదు. పనిమీద భర్తదేశాంతరగతుడైతే అలంకార ములన్నీ తీసేస్తుంది (17) అతని ఆయుస్సు వృద్ధి చెందే కొరకు భర్త పేరును ఉచ్చరించదు. ఎవ్వరు కూడా వరవరుషుని పేరు ఉచ్చరించదు (18).
ఆకర్షించి నా (లాగివా) ఏడవదు. కొట్టినా ప్రసన్నంగా ఉంటుంది. ఇది చేయి అంటే చేసాను. స్వామి అని అంటుంది. ఐ పోయిందే అనుకోండి అని చెప్తుంది (19) భర్త పిలువగానే ఇంటి పనులను వదలి త్వరగా వెళ్తుంది. ఓ నాథ! ఎందుకు పిలిచారో దానిని అనుగ్రహించండి. (చెప్పండి) అంటుంది (20) ద్వారంలో చాలా సేపు ఉండదు. ద్వారాన్ని ఆశ్రయిస్తూ ఉండదు. ఇవ్వతగని దానిని స్వయంగా ఏ కొంచము గాని ఏ సమయమందు గాని ఇవ్వదు కూడ (21) పూజకు అవసరమైన సామగ్రిని అంతా చెప్పకుండానే స్వయంగా సాధిస్తుంది. నియమంగా నీరు దర్భలు పూలు అక్షతలు కూరుస్తుంది (22) ఎదిరి చూస్తూ, ఆయా సమయములకు తగినట్లు శ్రేష్టమైన దానిని అంతా సిద్ధంగా ఉంచుతుంది. సంతోషంగా ఉద్వేగం లేకుండా (23) భర్త ఎంగిలిని తింటుంది. తనకు ఇష్టమైన అన్నము వండ్లు మొదలగు వానిని దూరంగా వదులుతుందీమె. సమాజ ఉత్సవ దర్శనంను వదులుతుంది (24) తీర్థ యాత్రాదులకు వివాహ ప్రేక్షాదులకు వెళ్ళదు. హాయిగా నిద్రిస్తున్న, సుఖంగా కూర్చున్న స్వేచ్ఛగా ఆనందిస్తున్న భర్తను (25) పనులకు అంతరాయమైనా ఎవ్వడూ లేవదు. స్త్రీ ధర్మ మందున్నవుడు (ముట్టు) మూడు రాత్రులు తన ముఖాన్ని చూపించదు (28) స్నానం చేసి శుద్ధి అయ్యే వరకు తన మాటను వినిపించదు భర్తకు. స్నానం చేసి భర్త ముఖాన్నే చూస్తుంది. ఇతరులది ఎవ్వడూ చూడదు. లేదా భర్తను మనసులో ధ్యానించి సూర్యుని చూడాలి (27) హరీ తాంబూలము, రవిక, మాంగల్య ఆభరణము ఇవి శుభమైనవి (28) కేశముల సంస్కారము, చేతుల మరియు చెవుల ఆభరణములు వీటిని భర్త ఆయుష్యమును కోరే వతివ్రత నిందించరాదు (29) భర్తను ద్వేషించే స్త్రీతో ఈమె ఎప్పుడూ మాట్లాడదు. ఎక్కడా ఒంటరిగా ఉండదు. ఎక్కడా నగ్నంగా స్నానం చేయదు (30) పతివ్రత, రోటి పై,రోకలి పై, కత్తి ఏట పై, సానపై ఇసురాయి పై, గడవ పై ఎవ్వడూ కూచోరాదు (31) గ్రామ ధర్మములు కాక ఎక్కడా ప్రాగల్ఫ్యములు (నాగరికత) చూపదు. భర్తకు దేని మీద అభిరుచో అక్కడే ఆమెకు ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ (32) స్త్రీలకు ఇదే వ్రతము. ఇదే వరమ ధర్మము. ఇదే పూజ. భర్త వాక్యమును దాటదు (33) నవంన తుడైనా, చెడు అవస్తయందున్న వాడైనా రోగగ్రనుడైనా, వృద్కడైనా, న్మురుడైనా, దుఃస్థిరుడైనా(బుద్ధిలో) వతి ఒక్క దాటరాదు (34) నేయి, ఉప్పు, ఇంగువాదులు ఐ పోయినా, పతివ్రత! భర్తతో లేవు అని చెప్పదు. (భోజన సమయంలో) లోహ పాత్రలందు భుజించదు (అన్నం ఉంచదు) (35) తీర్థ స్నానం కోరేదైనా ప్రతిపాదముల ఆలమును తాగుతుంది. శంకరుడు, విష వీరికన్న స్త్రీకి వతియే అధికము. (36)
భర్తను కాదని, వ్రత ఉపవాస నియమములను ఆచరించే స్త్రీ భర్త, ఆయుష్యమును హరిస్తుంది. చనిపోతే నరకమునకు పోతుంది (37) భర్త చెప్పగానే క్రోధంతో ప్రత్యుత్తరమిచ్చే స్త్రీ గ్రామముందు ఆడ కుక్కగా వుంది. జనం లేని అడవిలోనైతే ఆడ నక్కగా పుడ్తుంది (38) స్త్రీలకు వరమైనది ఒక నియమం చెప్పబడింది. భర్తపాదములను పూజించి, నిశ్చయమైన మనస్సుతో భుజిస్తుంది (39) ఉచ్చమైన ఆసనం పై కూర్చోరాదు. ఇతరుల ఇంటికి పోరాదు. అక్కడ కఠిన వాక్యములను ఎప్పుడూ పలుకరాదు (40) గురువుల సన్నిధి యందైనా పెద్దగా మాట్లాడరాదు. మాటలను చేర్చరాదు (ఇక్కడివక్కడ చెప్పటం) (41) భర్తను వదలి రాత్రిపూట చరించే దుర్మతి గల స్త్రీ చెట్టు తొర్రలో నిద్రపోయే క్రూరమైన ఆడ గుడ్లగూబగా జన్మిస్తుంది (42) భర్తకొడ్తే తిరిగి భర్తను కొట్టేదైతే ఆమె ఆడపులి ఎద్దులను తినేది ఔతుంది. ఇతర పురుషుని అనుగ్రహించే (ప్రేమించే) స్త్రీ మెల్లెకన్నుగలదిగా ఔతుంది. (43) భర్తను వదలి తానే మధుర పదార్థములనే స్త్రీ గ్రామంలో పంది గానూ ఔతుంది. మలము తనేదో లేదా, ఎగిరే నక్కనో ఔతుంది (44) హుం అని పలకటం ద్వారా అ ప్రియం చేసే స్త్రీ మూగ దౌతుంది. పవతిని చూచి ఎప్పుడూ ఈర్ష్యపడే స్త్రీ మాటిమాటికి దుర్భగ (గయ్యళి) ఔతుంది. భర్త కన్ను గప్పి మరొకనిని అన్యుని చూచే స్త్రీ (45) విముఖ, కురూప, ఒంటికంటిది ఔతుంది. బయటి నుండి వస్తున్న భర్తను చూచి, త్వరగా నీటితో, ఆసనముతో తాంబూలముతో, విసన కర్రతో కాళ్ళు పిసకటము మొదలగు వానీతో (46) మంచి మాటలతో, చెమటను తొలగించే ఇతర క్రియలతో భర్తను సంతోషపరిచే స్త్రీ ఉంటే ఆమె సంతోష పడితే ఆమె వల్ల ముల్లోకములు ప్రతిని పొందినట్లే. తండ్రి మితంగా ఇస్తాడు. అన్నదమ్ములు, కొడుకు వీరు కూడా మితంగానే ఇస్తారు (47) అమితంగా ఇచ్చే భర్తను ఎవతి పూజించదు. భర్త దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతములు భర్తయే. అందువల్ల అన్ని వదలి భర్త నొక్కనినే పూజించాలి (48) జీవహీనుడైన దేహి క్షణంలో అశుచియైనట్లు, భర్తృ హీనమైన స్త్రీ బాగా స్నానం చేసినా ఎప్పుడూ అశుచియే (49) అమంగలములన్నింటి కంటే విధవ ఇంకా అమంగల మైనది. విధవ దర్శనం వల్ల కార్యసిద్ధి ఎక్కడ ఎప్పుడూ జరుగదు (50) ఒక్కతల్లిని వదలి అందరూ అమంగల కరమైన వారే. ఆమె ఆశీమను కూడా ప్రాజ్ఞుడు వదలాలి, ఆమె ఆశీస్సు సర్పవిషము వంటిది (51) బ్రాహ్మణుడు కవ్యావివాహా సమయ మందు అనిపిస్తాడట ఆమెతో భర్తకు సహచరి కావాలి. అతడు బ్రతికి ఉన్నా మరణించినా కూడా (52) భర్తను గృహము నుండి పితృవనము వరకు సంతోషంగా అనుసరిస్తుంది. అట్లాచేస్తే అడుగడుగున అశ్వ మేధ యాగ ఫలమును పొందుతుంది, అనుమానము లేదు. (53) పాములు పట్టేవాడు పామును చుట్టనుండ బలవంతంగా లాగినట్లుగా యమ దూతలను దాటి వెళ్ళి స్వర్గమందున్న పతిని చేరుతుంది సతి (54) ఆ పతివ్రతను చూచి యమదూతలు, వరుగెత్తి పోతారు. పతివ్రత యొక్క గొప్పతనాన్ని (తేజస్సును) చూచి సూర్యుడు మండిపోతారు. అగ్ని బూడిదైపోతుంది (55).
అన్ని తేజస్సులు పతివ్రతా గొప్పతనం ముందు కంపిస్తాయి. తన రోమముల సంఖ్య ఎంత ఉందో అన్ని పదివేల కోట్ల సంవత్సరాలు (56) పతివ్రత, భర్తతో సుఖిస్తూ స్వర్గ సుఖాన్ని అనుభవిస్తుంది. ఆతల్లి ధన్యురాలు, లోకంలో ఆ తండ్రి ధన్యుడు (57) ఆ భర్త ధన్యుడు, ఎవరి ఇంట్లో వతివ్రత ఉందో తండ్రి వంశమువారు, తల్లి వంశమువారు, భర్త వంశమువారు, మూడేసి మూడేసి తరములు పతివ్రత పుణ్యంతో స్వర్గసుఖాన్ని అనుభవిస్తారు (58) శీలభంగముతో చెడు నడవడిక గల స్త్రీలు మూడు తులముల వారిని పతితుల జేస్తారు. తండ్రికి, తల్లికి, భర్తకు ఇక్కడ పై లోకంలో దుఃఖాన్ని కల్గిస్తారు (59) పతివ్రత పాదాలు భూమిని ఎక్కడెక్కడ స్పృశిస్తాయో, ఆ ప్రదేశాన్ని పవిత్రమైన తీర్థ భూమిగా గౌరవించాలి. ఆ అడుగులు భారములు కావు (60) సూర్యుడు, చంద్రుడు, గంధర్వులు కూడా తమ పవిత్రత కొరకు పతివ్రత స్పర్శను భరిస్తారు. మరోరకంగా కాదు (61) వీళ్ళు ఎల్లప్పుడు పతివ్రతా స్పర్శను కోరుకుంటాయి. గాయత్రితో పాప వాశనము లేదు. పాతివ్రత్యంతో ఆమె పాపాన్ని నశింప చేస్తుంది. (62) ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు లేరా. రూప లావణ్యములతో అహంకరించే వాళ్ళు. కాని స్త్రీ పతివ్రతయైనది, విశ్వేశ్వరుని అనుగ్రహం వల్లనే లభిస్తుంది (63) గృహస్థునకు భార్యములము. సుఖమునకు భార్య మూలము. ధర్మవలము కొరకే భార్య సంతానవృద్ధి కొరకు భార్య. (64) వరలోకము ఈ లోకము ఈ రెండు భార్యవల్లనే జీవిస్తున్నాయి. గృహంలో భార్య ఉంటే స్త్రీ దేవపితృ అతిథులకు తృప్తి కల్గించవచ్చు. ఎవడి ఇంటిలో పతివ్రతయైన భార్య ఉంటుందో అతడు గృహన అని తెలుసుకోవాలి. (65) గంగలో మునగటం వల్ల శరీరం పావనమైనట్లుగా పతివ్రతను చూచి గృహము పావనమౌతుంది (66) మంచము పై పడుకునే విధవలైన స్త్రీ భర్తను అధః పతితుణ్ణి చేస్తుంది. అందువల్ల వతికి సౌఖ్యం కలిగే కొరకు భూమి యందు వేరుండాలి (67) విధవమైన స్త్రీ ఎవ్వడూ తలంటు స్నానము చేయరాదు సున్నిపిండి వగైరాలతో వళ్ళురుదుకోవటం వగైరాలు ఆమె ఎవ్వడూ సుగంధద్రవ్యములను అనుభవించే రాదు. (68) భర్తకు దర్భలు, నువ్వులు వీటిలో ప్రతి రోజు తర్పణం చేయాలి. నాను గోత్రాదులు చెప్తూ అతని తండ్రికి, ఆతని తండ్రి తండ్రికి కూడా తర్పణ చేయాలి (69) పతివి మదిలో తలచి, విష్ణు పూజ చేయాలి. మరోరకంగా కాదు. విష్ణు రూప ధరుడైన హరివి చూస్తూ ఎల్లవ్వడు పతివే ధ్యానించాలి (70) పరలోకంలో భర్తకు సంతోషం కలిగే కొరకు, ఈ లోకంలో ఉన్నవ్వడు భర్తకు ఏదేది బాగా ఇష్టమో, ఏదేది తన భర్తకు ఇష్టంగా ఉండేదో అవన్నీ గుణవంతుడైన వానికి దానం చేయాలి (71) వైశాఖము, కార్తికము ఈ మాసాలలో విశేష నియమాలను పాటించాలి. స్నానము, దానము, తీర్థయాత్ర మాటి మాటికి పురాణ శ్రవణము ఇవి ఆచరించాలి (72)
వైశాఖ మందు జల కుంభములు కార్తీకంలో వేయి దీపములు దానం చేయాలి. మానుముందు ధాన్యము, నువ్వులు ఇవ్వాలి. ఇవి స్వర్గలోకంలో ప్రధానమైనవి (73) వైశాఖంలో పానీయశాల ఏర్పరచాలి, దేవునకు గలంతిక నివ్వాలి (శివాలయంలో శివుని తలపై ఒక పాత్ర ఉంటుంది. దాని నుండి ఒక్కొక్క చుక్క నీరు శివుని తలపై పడుంటుంది. అది గలంతిక) వటవ్రేళ్ళు, విసన కర్ర, గొడుగు, సన్నని వస్త్రములు, చందనము (74) కర్పూరము వేసిన తాంబూలము, అట్లాగే పూల దానము ఇవన్ని వైశాఖంలో చేయాలి. అనేక జలపాత్రములు అట్లాగే పుష్పగృహములు (75) విచిత్రములైన (రకరకాలైన) పానములు, ద్రాక్ష ఫలములు, అరటిపండ్లు బ్రాహ్మణులకు దానంచేయాలి. వా భర్త ఆనందపడవి అవి (76) కార్తీక మందు యవల అన్నమును తినాలి. లేదా ఒంటిపూట అన్నంతవాలి. వంకాయ, కందగడ్డ, దూలగొండి (గడ్డ) వీటిని తినొద్దు. (77) కార్తీక మందు నునెను వదలాలి. కాంస్య పాత్రను వదలాలి (వాడొద్దు) కార్తిక మందు మౌనంగా ఉండే నియమముందు మంచి గంటను దానం చేయాలి (78) ఆరులో భోంచేసే వ్రతమందు వేయితో నింపిన తాంవ్య పాత్రను దానం చేయాలి. భూమి శయ్యావ్రత మందు దూది గల అందమైన వడకను దానం చేయాలి (79) ఫలమును వదిలి పెడ్తే దానిని దానం చేయాలి. రుచులలో దేనిని వదిలితే ఆ రుచి గల వస్తువును దానం చేయాలి. ధాన్యమును త్యాగం చేస్తే ఆ ధావ్యాన్ని దానం చేయాలి లేదా వడ్లు దానం చేయాలి. అలంకరించిన బంగారము గల అవును మించిపైనా దానం చేయాలి (80) అన్ని దానములు ఒక ఎత్తు, దీపదానము ఒక ఎత్తు కార్తీకంలో దీపదానం యొక్క పదహారవ కళను గూడా ఇతర దానములు పొందలేవు. (81) ఈ విధముగా ఇవి మొదలుగా గల నియమములు విధవలకు చెప్పబడ్డాయి. ఓ రాజ! వీటి దానం యొక్క ఈ ఫలము ఇతర దానముల వల్ల ఎప్పుడూ రాదు (82) విచక్షణుడు ధర్మవాదికి వచ్చి దానం చేయాలి. రోజుకోటి విధముల వృద్ధి చెందుతుంది. అవి బ్రహ్మవాక్కు (83) ధర్మేశ్వరుని ముందుండి నువ్వులు, ఆవు వీటిని దానం చేస్తే (నువ్వులంత నల్లని మచ్చలు గల ఆవు కావచ్చు) నువ్వు లెన్నున్నాయో అన్ని సంవత్సరము ల కాలము స్వర్గలోకమందు వెలిగి పోతాడు (84) ధర్మక్షేత్రమునకు వచ్చి శ్రద్ధగా శ్రాద్ధం చేస్తే, అతని పితృ దేవతలు వారి సంవత్సర కాలము తృప్తిగా ఉంటారు. ఇది నిశ్చయము. (85) ఇతరులైన స్వర్గమందున్న వాని పూర్వులు, నరకమందున్న వారు తిర్యక్యమును పొందియున్నవారు, భూతాదులుగా ఉన్నవారు (86) వారందరి నుద్దేశించి యథావిధిగా ధర్మరూప మందు శ్రాద్ధము చేయాలి. ఇక్కడి మనుష్యులు, భూమి మీద గ్రద్దాది తర్పణం వదిలితే, దానితో వారు, పిశాచత్వమును పొందినవారు అక్కడ తృప్తిని పొందుతారు. (87) ఓ పుత్రక! స్నాన వస్త్రంతో పుట్టిన నీరు భూమిపై పడి, ఆ నీటితో, వృక్షరూపము నందిన వారికి తృప్తి కలుగుతుంది (88).
భూమి యందు పడిన యవల గింజలతో దేవత్వ మందిన వారికి తృప్తి కలుగుతుంది. (89) పిండములను ఎత్తుతూ ఉంటే భూమిపై పడిన అన్నకణములతో, పాతాళమును పొందిన వారికి తృప్తి కలుగుతుంది (90) వర్ణ ఆశ్రమ ఆచార క్రియలలో లోపమాచరించిన వారు, అ సంస్కృతులైనవారు, వివన్నులు వారంతా ఇక్కడి నమ్మార్జన జలమును ఆశించేవారు (కడిగిననీరు) (91) భుజించాక ఆచమనం చేస్తే అప్పుడు క్రిందపడిన బ్రాహ్మణుల జలముతో, ఇతరులైన వారు తృప్తిని పొందుతారు (92) యజమానుని యొక్క బ్రాహ్మణుల జల అన్నముల నిక్షేపము (క్రిందపడ అన్నము వగైరా) ఇతరులు తాకనిది శుచియైనదే (93) నరకంలో పుట్టిన వారు, అక్కడ ఇతర యోనులలో జన్మించిన వారు (ఉన్నవారు) ఇక్కడ శ్రాద్ధమును నిర్వర్తిస్తే తృప్తిని పొందుతారు, ఓ వత్స! (94) అన్యాయంగా సంపాదించిన ద్రవ్యంతో నరులు శ్రాద్ధం చేసినచో, దానితో చండాల వుల్కసాది యోనులలో నున్నవారు తృప్తి నందుతారు (95) ఆతడు అనేక మంది బంధువులను ఈ విధంగా తృప్తిపరచాడు. శ్రాద్ధం చేయటానికి శక్తి లేకపోతే శాకములతోనైనా (తూరగాయలలో) ఫరవాలేదు (96) అందువల్ల నరుడు భక్తితో శాస్త్ర ప్రకారము శాకములతో శ్రాద్ధము చేస్తాడు. శ్రాద్ధం చేస్తున్న వాని కులము ఏ మాత్రము నశించదు (97) పాపమాచరిస్తే, ఆ పావమంతా తప్పకుండా వృద్ధి చెందుతుంది. పాపం చేసిన వారి పాపము నరక మందు ఫలిస్తుంది. ఇందులో అనుమానం లేదు (98) పుణ్యముగా పాపము గాని తాను చేసిన శుభా శుభకర్మము అందతా ధర్మారణ్యంలో వృద్ధి చెందుతుంది, నీలయము, ఓ మహారాజశ్రేష్ఠ! (99) కాములకు కామముల నిచ్చేది యోగులకు ముక్తినిచ్చేది నదులకు సిద్ధిని చ్చేది. ధర్మారణ్యము అని, ఎల్లప్పుడూ చెప్పబడుతోంది. (100) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మండ మందు పూర్వభాగ మందు ధర్మారణ్య క్షేత్ర మహాత్మ్య మందు ధర్మారణ్య వర్ణన మనునది ఏడవ అధ్యాయము.
