స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
17వ అధ్యాయము
తా ॥ వ్యాసుని వచనము - దక్షిణ మందు స్థాపించబడిన శాంతా దేవి, మహాబలవంతురాలు, ఓ రాజ! ఆమె రకరకాల వస్త్రాలు ధరించేది, వనమాలతో అలంకరించబడింది ఆమె తామసి ఓ మహారాజ! ఆమె మధుకైట భనాశినీ శివ పత్నియైన ఆమెను విష్ణువు అక్కడ ఉంచాడు ఆమె ఎనిమిది చేతులు గలది, రమ్యమైనది, మేఘమువలె శ్యామల వర్గము గలది, మనోరమమైనది నల్లని వస్త్రమును ధరించింది దేవి, వ్యాఘ్ర వాహనమందు. కూర్చున్నట్లది ఏనుగు చర్మమును ధరించింది. (చుట్టుకుంది) దివ్య ఆభరణములతో అలంకృతమైంది. మంట, అక్షమాల, త్రిశూలము, కమండలుకు వీటిని ధరించింది. శుభమైనది అలంకరింపబడిన భుజములు కలది, దేవి, సర్వదేవతలతో నమస్కరింపబడినది, ఆమె ధనము, ధాన్యము, సుతులు, భోగములు తన భక్తులకు ఇస్తుంది దివ్యమైన కమలములతో కర్పూర అగరు చందనములతో ఆమెను పూజించాలి. ఆమెను ఉద్దేశించే, అక్కడే బ్రాహ్మణ వత్తములను పూజించాలి కుమారీలను ఏ విధమైన అన్నములలో భక్తి భావంతో పూజించాలి. ధూపదీపములతో మంచి పండ్లలో, మందులతో పూజించాలి దివ్యమైన వివిధ మాంసములతో, లేదా సిష్టంవల్ల చేసిన వస్తువులతో ధాన్యములతో, ఇతరములైన వివిధ ధాన్యములలో పాయసములతో వడియములతో ఓదనములతో నువ్వులు బెల్లము కల అపూపములతో చక్కగా పూజించాలి. స్తుతి పారములుతో, మనోహరములైన స్తోత్రములతోని పూజించాలి. ఆతని శత్రువులు నశిస్తారు. అంతట విజయం సాధిస్తాడు. రణముందు, రాజతుల మందు, ద్యూతమందు, జయ మంగళమును పొందుతాడు. ఓ మహారాజ! సౌమ్య, శాంత, కులమాతృత స్థాపించబడింది. ఆమె శ్రీమాతాప్రవర్ధమైంది. ఓ భూవతి ఆమెమహత్యాన్ని విను. కులమాత, మహాశక్తికలది, ఓ నృపవత్తమ! అక్కడ ఉంది. ఆమె కుమారి, బ్రహ్మపుత్రి రక్షణ కొరకు విధి ఏర్పాటుచేశాడు. ఆమోస్థానమత. పేరు శ్రీమాత. ఆమె త్రిరూప, ద్విజాతుల రక్షణ కొరకు నిర్మించబడింది. ఆదేవికమండలువు ధరించి, వుంటు భరణములతో అలంకరింపబడింది. అక్షమాల కలది, ఆమె శుభమైనది. ఆమె రూపము శుభమైనది. కుమారి, ఆదిమాత, స్థానమందరక్షించేది కూడా. దైత్యులను చంపేది, కోరికల నిచ్చేది. మహామోహమును నశింపచేసేది ఆదే వి భక్తిగమ్యమైనది. కుమారి, బ్రహ్మరుదు. రక్తవస్త్రము ధరించింది. మంచి రక్త చందనముతో పూయబడింది. రక్తమాల గలది, పదిచేతులు కలదిందు ముఖములు కలది, దేవతల కిశ్వరీ, చంద్రుని తలలో భూషణముగా గలది, మాతా. మరలతో అసురులతో నమస్కరింపబడేది సాక్షాత్తు సరస్వతి రూపము గలది, రక్షణ కొరకు విధి ఏర్పరచాడు. ఆమె ఓంకారము, మహాపుణ్యమైనది. కాజేశుడు నిర్మించాడు. ఋషులు, సిద్ధయక్షులు, మరలవన్నగులు, మానవులు మొదలగు వారితో నమస్కరించతగిన పాదయుగళము గలది. వారి మనసులోని కోరికను ఇస్తుంది. బ్రాహ్మణ జాతిహితము కొరకు సంస్థానమును పాలిస్తోంది. మంచి గుణములతో తల్లి తన స్వంత పుత్రులను రక్షించేట్లుగా రక్షిస్తుంది. దేవి, శ్రీమత, కులదేవత, రక్షిస్తుంది ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటే సర్వ ఉపద్రవములను నశింపచేస్తుంది.
తా ॥ అన్ని విఘ్నములను తొలగించేది, శ్రీమాతను తలచుకుంటే చాలు. వివాహము, ఉపవీతము, సీమంతము, శుభకర్మలు, వీనియందు భక్తుల అన్ని కార్యములందు శ్రీమాత ఎప్పుడూ పూజింపబడుతుంది. దేవుని లంబోదరుని, పూజ చేసి కర్మ ఆరంభించినట్లే శుభకార్యములన్నిటిలో శ్రీమాతను పూజించి ఆరంభించాలి. ఓ నృప. బ్రాహ్మణులకు ఏ కొంచెము భోజనము గాని పెట్టినా లేదా పరస్పరము నివేదన చేసినా సత్ఫలితమిస్తుంది. ఆమెకు నివేదించ కుండ చేస్తే విఘ్నాన్ని పొందుతారు అందువల్ల ఆమెకు నివేదించి ఆ పిదప కర్మ ఆరంభించాలి. ఆమె వరంలో కర్మలన్ని అవిఘ్నంగా సిద్ధిస్తాయి. హేమంతము, శిశిరకాలము వస్తే ధర్మపుత్రికను పూజించాలి. బంగారు పాత్ర యందుగాని, వెండి పాత్ర యందుగాని ఆమె బొమ్మను గీసి పూజించాలి. ఉత్తమమైన పాదుకను శ్రీ మాతకు నివేదించాలి. నువ్వులు వుసిరితో కూడిన నీటిలో స్నానం చేసి శుచి వస్త్రములతో, వూలమాలతో మనోహరమైనదు కూలములతో పూజించాలి. శుభ్రమైన చందనములు పూయాలి. కుంకుమతో సిందురానకముతో, కర్పూరము, ఆగురు, కస్తూరి వీటితో కూడిన బురదతో వూయలి కర్ణికారములతో కూరములలో తెల్లని ఎర్రని కరవీరములతో (గన్నేరు) చంపకములతో మొగిలి పూలతో పాటు మమములలో యక్ష కర్దమములలో (కర్పూరము, అగరు చందనము, కస్తూరి, తక్కోలము, కుంకుమ పువ్వు వీనితో చేయబడిన వూత వస్తువు) ఖండింపబడని బిల్వ పత్రములతో పాలాశ జాతి పుష్పములతో పూజించాలి. మినుములతో చేసిన వడియములలో, అపూవము, అన్నము, మొదలగు వానిలో దానిమ్మలలో(ఏలకులతో) శాతసంచయములతో సంతోష పరచాలి జగదంబికను ధూప దీపాద పూర్వకముగా పూజించాలి. ఆమె బుద్ధితోనే కుమారీలను, బ్రాహ్మణులను భుజింప చేయూలి. ఓ నృప! నేతితో కూడిన పాయనములతో శర్కరతో కూడిన వానితో పక్వాన్నములతో మోదాకాదులలో భక్తి భావంతో తృప్తి పరచాలి. ఒక్కొక్క బ్రాహ్మణుడు తృప్తిపడితే దానికి వేయింతలు వలము పొందుతారు దైత్యవూతక స్తోత్రమును (దుర్గాసప్తశతి) మాటి మాటికి చదువాలి. ఏకాగ్ర మనస్కుడై శ్రీమాతను స్తుతించినవా రికి సంతసించి వరమిస్తుంది. ఆమెకు స్నానం చేయించినా, పూజించినా స్తుతించినా వరమిస్తుంది. సర్వ అరిష్టములను నశింపచేస్తుంది. ధర్మపుత్రిక సంతాన హీనుడు సంతానాన్ని పొందుతాడు. ధన హీనుడు ధనవంతుడౌతాడు. రాజ్యం కోరేవాడు రాజ్యం పొందుతాడు. విద్యను కోరేవాడు, విద్యను పొందుతాడు. సరస్వతి ప్రసాదం వల్ల (అనుగ్రహం) పొందుతాడు, అనుమానము లేదు శ్రేయోర్ధి లక్ష్మిని పొందుతాడు. భార్యను కోరేవాడు భార్యను పొందుతాడు. సరస్వతి ప్రసాదం వల్ల (అనుగ్రహం) పొందుతాడు అనుమానము లేదు దేవతలకు కూడా దుర్లభమైన వరమమైన స్థానమును చివరి దశలో పొందుతాడు నిత్యము. సరస్వతి అనుగ్రహం వల్ల నరుడు పొందుతాడు అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మ ఖండమందు పూర్వభాగ మందు ధర్మారణ్య మాహాత్మ్య మందు శ్రీ మాతా మహాత్మ్య వర్ణన మనునది పదునేడవ అధ్యాయము.
