స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

39వ అధ్యాయము

బ్రహ్మవచనము - ఓ పుత్ర ! పరమ రహస్యమైన విషయాన్ని చెబుతాను. విను ఈ బ్రహ్మవిదులు చాతుర్విద్యులు, మహాద్విజులు అని పిలువ బడ్డారు. (1) ప్రతీరోజు, స్వాధ్యాయము వషట్కరము హవనము) న్వధాకారములు చేస్తారు. రామాజ్ఞ పాలకులు, హనుమద్భక్తి తత్పరులు. ఒకసారి దేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చారు. వారు బ్రాహ్మణులను చూడదలిచారు. బ్రహ్మ విష్ణువులు ముందున్నారు (3) వచ్చిన ఆ దేవతలను చూచి వారు తమస్థానముల నుండి లేచారు. అర్ఘ్యము, పాద్యము, మధుపర్కము ఇచ్చి (4) పూజించి ఆ పిదప విప్రులు బ్రహ్మ మొదలుగాగల దేవతల ఎదుట, బ్రహ్మముందు కూర్చొని వారు వేదముల నుచ్చరించ సాగారు. (5) సంహిత, పదము, క్రమము, ఘన వీటిని ఉచ్చై: స్వరముతో ఋక్కులను, ఋగ్వేద సంహితను చదువ సాగారు. (6) సామగులు వివిధస్తోత్రములను చేయసాగారు. శాస్త్రములు, యాజకులు, పురోను వాక్యములు పఠించసాగారు. (7) చతురక్షరము(యజామహే) చతురక్షరము (అనుశౌషట్) ద్వ్యక్షరము (యజ) పంచాక్షరము (యేయజామహే),ద్వ్యక్షరము (నౌషటి) వీటివిఉయణ స్వరూపాన్ని జ్ఞాన పూర్వకముగా జపించినవారు (8) చివర బ్రహ్మపద ప్రాప్తిని పొందుతారు. ఇది నిజము నిజము, నేను చెబుతున్నాను. అందరు బ్రాహ్మణులు ఏకాగ్రమైన మనస్సుతో వేదపాదరతులైనారు వారి అంగణములలో మృగములు వెంట్రుకలను గోక్కుంటున్నాయి. బ్రాహ్మణులు వేదమాతను విధిపూర్వకముగా జపిస్తున్నారు (10) మృగముల పిల్లలు వారు, వారు చేతధరించిన దర్భలను తింటున్నాయి. అప్పుడు శత్రుత్వం లేకుండా ఉన్నఆ గృహమేధుల ఆశ్రమాలను చూచి (11) దేవతలెంతో ఆనందించారు వారిట్లు పరస్పరం అనుకొన్నారు. ఇప్పుడు త్రేతాయుగము. అందరు ధర్మ పరాయణులు. (12) కలిదుష్టుడు అని అన్నారు. పావుడైన ఆతడు ఏంచేస్తాడు. చాతుర్వి ద్యులను పిలిచి ఆ ముగ్గురు ఇట్లా అన్నారు. (13) మీకు, త్రైవిద్యులకు వృత్తికొరకు ఏర్పరుస్తున్నాము. మీకు విభాగం కల్పిస్తున్నాము. ఉన్నదున్నట్టుగా రక్షించుకోండి (14) ఇతః పూర్వము ముప్పది ఆరువేల వణిజులు అని ఏది చెప్పామో, త్త్రెవిద్యులు మూడు వేలన్నామో, పదిహేనువేల (15) చాతుర్విద్యులున్నారో పరస్పరము మిమీ వృత్తుల నాశ్రయించి, త్రైవిద్యులు మూడు భాగములు, అత్రులు, (ఇతరులు, త్రైవిద్యులు కానివారు, నాల్గు భాగములు (18) వణిజుల ఇంటికి వచ్చి, ప్రతిరోజు పౌరోహిత్యం నిర్వహించి భాగం పంచుకొని పొందాలి. ఇవి కాజేశులు ఏర్పరిచారు. (17) చాతుర్విద్య, త్రివిద్యులకు పవరస్పరము వివాహము లేదు. చాతుర్విద్యలు, త్రివిద్యలు నాచే చెప్పబడ్డాయి (18) మూడు భాగాలతో త్రైవిద్యులు, ఇతరులు నాల్గు భాగాలతో అనిజాతి విభాగాన్నికాజేశులు ఏర్పరచారు. (19) ఆ విప్రులు కృతకృత్యులై ఆ దేవతలను నమస్కరించారు. వృత్తిని కల్పించి, దేవతలు తమస్థానములకు బయలుదేరారు. 

ఏబది ఐదు గ్రామములలో ఆ బ్రాహ్మణులు నివసించేవారు. నాటినుండి వారు చాతుర్విద్యులని త్రివిద్యులని పిలువ బడ్డారు. (21) చాతుర్విద్యుల గోత్రాలు పదిహేను, భారద్వాజుడు, వత్సుడు, కౌశికుడు,3 కుశుడు (22) శాండిల్యుడు 5 కశ్యపుడు గౌతముడు, ఛాదనుడు 8 జాతకర్ణులు కుంతుడు వసిష్ఠుడు । ధారణుడు (23) ఆత్రేయుడు, మాండిలుడు 14 లౌగాక్షుడు 15అని. వారివారి స్థానముల నామము లను వరుసగా చెబుతాను. (24) సీతాపురము, శ్రీ క్షేత్రము, మగోడీ, జ్యేఠలోజ, శేరద, చేదము, తాలి, వనోడి, గోవ్యందలీ, కంటిచోషలీ, కో హెచం చందనము,ధలగ్రామము, సోహం,హాథం జం, కవడవాణకము, ప్రజన్హోరీవనోఢీ ఫీణాం, వగోలం, దృణము (27) థలజం, చారణం, సిద్దం, భాలజ, మహావీ, ఆఈయా, మలీఅ, గోధరీ, ఆమత (28) వాఠసుహాలీ, యాణజ, సానదీయ ఆనందీయ, పాటడి ఆ, టికోలీయ (29) గంబీ, ధ, మాత్రవాతయోర, వలోల, రాత్యంజ, రూపోలా, బోథణీ (30) ఛత్రోటా, అలుఏవా, వాసతడీ, ఆమత, జాషాసణా, గోతీయ, చరణీయ, దుధీయ (31) హాలోల, వైహోల, అసాల, సాలాడ, దేహాల, సౌహాసీయ, సింహాలీయ (32) ఏబదీ ఐదు గ్రామములు వరుసగా వారి స్వస్థానము రాముడు వీధి ప్రకారము బ్రాహ్మణులకు ఇచ్చాడు (33) ఇక మీదట స్వస్థానము లందలి గోత్రజులను చెబుతాను. అట్లాగే ప్రవరలను విధి పూర్వకముగా ఉన్నదున్నట్లు చెబుతాను (34) గోత్రదేవిని, అట్లాగే ప్రవరను తెలుసుకొని ద్విజులు స్వస్థాన మందున్నవారు స్వస్థాన మందు జన్మిస్తారు. (35) నారదుని వచనము-గోత్ర మెట్లా పుడుతుంది. కులము ఎట్లా తెలుసుకో బడుతుంది. దేవి ఎట్లా తెలుసుకో బడుతుంది. ఉన్నదున్నట్లుగా చెప్పండి అనగా (36) బ్రహ్మ వనము - సీతాపురము మొదట రెండు ప్రవరలదే కుశ, వత్సులు అని నాతో చెప్పబడ్డారు. (37) శ్రీ క్షేత్రం రెండవది ఇక్కడ మూడు గోత్రములవారు, ఛాందనన, వత్స, కుశులు (38) ముద్గల, కుశ భారద్వాజులది మూడవది శోహాలి నాల్గవది కుశ ప్రవరులది (39) జ్యేష్ఠల ఐదవది వత్సరుశులని చెప్పబడ్డారు. శ్రేయస్థానము ఆరవది భారద్వాజ, కుశులది 

దంతాలి ఏడవది భారద్వాజ కుశుల దేవస్థానము ఎనిమిదవది. (41) అక్కడ కుశకుత్స భలో ద్వాజ గోత్రములు. తొమ్మిదవది రాజపురము, భరద్వాజ ప్రవర్తకము (42) పదవది కృష్ణవటము కుశ ప్రవరము పదకొండవది దహలోడమువత్స శ్రవరము (43) చేఖలీ పన్నెండవది పౌర కుశ ప్రవరము (44) చించోదఖము, దేహోలోడీ, అత్రయ వత్ప రుత్పరులు, భారద్వాజీ కోణము వారు, భారద్వాజ, గోలం దృణాశకులు, (45) థలత్యజులు ఇద్దరుకుశ, ధారణులు, వారణసిద్దం స్వస్థానంగా గలవారు కుత్స గోత్రీకులు (46) భాలజులు కుత్స వత్పులు మోహోవీలు అకుశులు. ఈ యాశ్లీఆలుశాండిలులు, గోధరీ పాత్రులు (47) ఆనందీయులు ఇద్దరు భారద్వాజ శాండిలులు, పాటడీలలు, కుశులు (48) వాసండీలు జాస్వులు కౌత్పమణులు వత్స ఆత్రేయులు, గీతులు ఆకుశ గౌతములు (49) చరణీతలు భారద్వాజులు. దుధీ ఆధారణమలు, సోన్నా మాండిల్యులు (50) వైలోలులు, హుశులు, అసాలులు కుశులు ధోరణులు (51) వాలోలులు వత్స ధారణీయులు, దేలోలులు కుత్సు గోత్రములు చెప్ప బడ్డాయి. యధాక్రమముగా స్వస్థానములు నాచే చెప్ప బడ్డాయి. (53) శీతవాదీయులని చెప్పబడ్డవాళ్ళు కుశవత్సులు. విశ్వా మిత్రుడు, దేవరాతుడు, మూడవది దలము (54) భార్గవచ్య వనఆప్ను వానఓర్వ జమదగ్నులు, వచార్ద శేష పుటలులు గోత్ర దేవ్యులుగా చెప్పబడ్డారు (55) అని ఇది ప్రథమగోత్రము (1) శ్రీ క్షేత్రమురెండవది రెండు గోత్రములది. ఛాందనసులు వత్సులు. ఇద్దరు దేవతలు (58) ఆంగిరన అంబరీషయా దవాళ్వ. భృగుచ్య వనఆప్ను వానఔర్వ జమదగ్నులు (57) దేవి, భట్టారిక రెండవది శేపలా, ఈ వంశమందు ఉద్భవించిన వారిని గూర్బి విను ఓ మునిసత్తమ. (58) క్రోధనులు, సదాచారులు, శ్రేత సార్ర క్రియూవరులు పంచయజ్ఞరతులు. ఎప్పుడు సంబంధ మాశ్రయించిన వారు క్షతజ్ఞులు, క్రతుజులు, వారందరు నృవసత్తములు (59) అని రెండవ గోత్రము. మూడవది మగోడో ఆ రెండుగోత్రములది. భారద్వాజ, కుత్సులు. ఇద్దరు దేవీలు. 

ఆంగిరస బార్ష న్పత్య భారద్వాజులు. విశ్వామిత్ర దేవరాతులు మూడు ప్రవరలు (61) శేష లాబుధల అని చెప్పబడ్డారు ధార శాంతి అట్లాగే. ఈ గ్రామ మందు జన్మించిన బ్రాహ్మణులు సత్యవాదులు (62) ద్విజ పూజ క్రియాయుర్తులు. నానా యజ్ఞ క్రియాపరులు. ఈ గోత్ర మందు జన్మించిన ద్విజులంతా మునీశ్వరులు (63) అని మూడవ గోత్రము నాల్గవది శీహాలియా గ్రామము రెండు గోత్రములు. విశ్వామిత్ర దేవరాతులు మూడవది ఔదలుడు (64) వారిదే విచచాఈ. ఆమె గోత్ర దేవిగా చెప్పబడింది. ఈ గోత్రమందు జన్మించిన వారు దుర్బలులు, దీనమనసులు (65) అబద్ధాలాడే వారు, లోభులు, ఓ నృపసత్తమ. అన్ని విద్యలలో ప్రవీణులు. బ్రాహ్మణులు, ఓ బ్రహ్మసత్తమ (66) అని నాల్గవస్థానము. జ్యేష్ఠలోజ, ఐదవస్వ స్థానమనబడింది. వతశీయులు, కుత్సశీయులు అని రెండు ప్రవరలు (67) ఆవరివృవా ప్రయౌవనా శ్వభృగుచ్యవన ఆప్నోర్వ జమదగ్నులు (68) వత్సగోత్రమునకు చచాఈ, కుత్సగోత్ర జశాంతా వీరితో ఐదుగురితో, ముగ్గురితో కూడిన ద్విజులు బ్రహ్మ స్వరూపులు. (69) శాంతులు దాంతులు సుశీలులు, ధనముపుత్రులు కలవారు వేదాధ్యయన మానులు, అన్ని పనులలో నేర్పరులు (70)  సురూవులు సదాచారులు, అన్నీ ధర్మాలలో, నిష్ట గలవారు ఇందలి వారు దానధర్మరతులు. జలదులు, ద్విజులు, (71) అని ఐదవస్థానము. శరథ గ్రామమందలి వారు రెండు ప్రవరలు గల వారు కుశభారద్వాజులు. అట్లాగే దేవీద్వయము. (72) విశ్వామిత్ర దేవరాత ఔదలులు ఆంగిర సబార్హస్పత్య భారద్వాజులు (73) మహాలక్ష్మి కమల, రెండవది యక్షిక. ఈ గోత్రమందు జన్మించినవారు. శ్రౌతస్మార్తరతులైన బుధులు (74) వేదాధ్యయన శీలులు. తావసులు, ఆరీమర్థనులు. రోషవంతులు, లోభులు, దుష్టులు, యజనయాజ నరతులు,బ్రహ్మక్రియాపరులు. అందరు బ్రాహ్మణులు. నాచే పుట్టించ బడ్డవారు (75) అని ఆరవ స్థానము. దంతాలీయులు భారద్వాజ కుత్స శాయులు. ఆంగీరస, బార్హస్పత్య భారద్వాజులు (76) యక్షిణ దేవి రెండవది కర్మల ఈ గోత్రమందు జన్మించినవారు బాడబులు ధనవంతులు, శుభులు (77) వస్త్ర అలంకరణములు గలవారు, ద్విజభక్తి పరాయణులు. బ్రహ్మభోజ్య పరులు, ధర్మ పరాయణులు. (78) అని ఏడవస్థానము. వడోద్రీయ అన్వయజాతులు. నాలుగు ప్రవరలవారు. కుశ, కుత్స, వత్స భారద్వాజులు (79) వారి ప్రవరలను వారి గోత్రములను క్రమంగా చెప్తాను. విశ్వామిత్ర దేవరాత ఔదలులు 

ఆంగిరన, అంబరీష, యౌవనాశ్వులు, భార్గవచ్యవన ఆప్నువానఔర్వజమదగ్నులు (81) ఆంగీరస, బార్హస్పత్య భారద్వాజులు. కర్మలక్షీమల, ధారభట్టారిక (82) నాల్గవదిక్షేమల. వరుసగా గోత్రమతలు. ఈ గోత్రమందు జన్మించినవారు ఎప్పుడు పంచయజ్ఞరతులు (83) లోభులు, క్రోధులు, బహప్రజులు.స్నానదానాది నిరతులు ఎప్పుడు వినిర్ణిత ఇంద్రియులు (84) వేలకొలది వాపి కూపతడాగముల కర్తలు వ్రత శీలురు గుణజ్ఞులు, మూర్తులు, వేద వివర్జితులు (85) అని ఎనిమిదవ స్థానము. గోదణీయ మను గ్రామ మందున్న వారు రెండు గోత్రముల వారు వత్సగోత్రులు, భారద్వాజులు (86) భృగుచ్యవన ఆప్నువాన ఔర్వ పురోధనులు తొలి దేవత శీహరీ రెండవది యక్షిణి (87) ఈ గోత్రమందు జన్మించిన బ్రాహ్మణులు ధనధాన్య సమన్వితులు. అమర్షము గలవారు. లౌల్య హీనులు ద్వేషం కలవారు, కుటిలులు (88) హింసకులు, ధనలుబులు, (89) అని నవమస్థానము. కంటవాడీ ఆ గ్రామబ్రాహ్మణులు. కుశ గోత్రోద్భవులు. వారి ప్రవర్తనను చెప్తాను విను. (90) విశ్వామిత్రుడు, దేవరాతుడు ఉదలుడు అని ముగ్గురు, చచాఈ దేవత (91) క్రతువులు ఆచరిస్తారు. సంతుష్ట చితులు. ఏకాగ్ర మనస్కులు. అన్ని విద్యలలో కుశలులు బ్రాహ్మణులు సత్యవాదులు. (92) అని పదవ స్థానము. వేఖలోయులు కుత్స వంశోద్భవులు మూడు ప్రవరలవారు (93) విశ్వామిత్ర దేవరాత ఉదలులు. వారికి చచా ఈ దేవత కులరక్షణ చేసేది (94) అందలి బ్రాహ్మణులు మహాత్ములు సత్యవంతులు, గుణవంతులు, తపస్వులు యోగులు, వేదవేదాంగ పారగులు (95) సాధువులు, సదాచారులు, విష్ణుభక్తి పరాయణులు స్నాన సంధ్యాపరులు ప్రతిరోజు భగవన్నివేదన భుజించేవారు (96) ఈ వంశమువారు ఇట్టి వారని చెప్పాను ఇక ముందు విను (97) అని ఏకాదశ స్థానము. దేపాలోడీలు తుత్సవ వరకలవాడు. ఆంగీరస, అంబరీష, యువనాశ్వులు, (98) శ్రీశేషదుర్బలఅనిగోత్రదేవి. కుత్పవంశజాతులుమంచి నడవడి కలవారు, సత్యం భాషించేవారు (99) వేదాధ్యయన శీలులు, ఇతరుల తప్పులు వెతికేవారు. అమర్ష లౌల్యము కలవారు హీనులు ద్వేషం కలవారు కుటిలులు 

హింసకులు, ధనలబులు కుత్స వంశమువారు అని ద్వాదశ స్థానము (101) కోహె యందలి బ్రాహ్మణులు మూడు గోత్రముల వారు భారద్వాజులు, వత్సులు, కుశులు (102) గోత్ర క్రమముగా ప్రవరలు చెప్తాను. భార్గవచ్యవన ఆప్నువాన, ఔర్వ, జమదగ్నులు (103) కుశ ప్రవరులు మూడు ప్రవరలు కలవారు విశ్వామిత్ర, దేవరాత, ఉదలులు. (104) తొలుత యక్షిణీ రెండవది శీహరీ మూడవది, చచా ఈ దేవత క్రమంగా గోత్రములకు చెందినవారు (105) ఈ గోత్రమందలి విప్రులు శ్రోతస్మార్తరతులు, బుధులు. వేదాధ్యయన శీలులు, తావసులు, అరమర్ధనులు (106) రోష వంతులు, లోభులు, దుష్టులు, యజనయా జనరతులు. అందరు బ్రహ్మ కర్మపరులు, ద్విజోత్తములు (107) అని పద మూడవ స్థానము. చాందడ భేర జాతులు భారద్వాజన ముద్భవులు. ఆంగిరన బార్హస్పత్య భారద్వాజులు. (108) యక్షిణి వీరి దేవత. భారద్వాజులు బ్రహ్మ స్వరూపులు (109) శాంతులు దాంతులు, సుశీలులు, ధనవుత్రన మన్వితులు. ధర్మారణ్య ద్విజులు శ్రీములు క్రతుకర్మకో వీదులు (110) అందరు గురుభక్తి రతులు తమ కులాన్ని వెలిగించే వారు (11) అని పదునాల్గవ స్థానము. ధలగ్రామ జాతులు భారద్వాజ సముద్భవులు. ఆంగిరస బార్హస్పత్య భారద్వాజులు (112) ఇందలి బ్రాహ్మణులు ధనవంతులు శుభులు, వస్త్ర అలంకారో పేతులు, ద్విజభక్తి పరాయణులు (113) బ్రహ్మభోజ్యవరులు అందరు ధర్మపరులు. యక్షిణి గోత్రదేవి. రక్షిణి కూడా (114) అని పంచదశ స్థానము. మా ఊతీయులు రెండు గోత్రములవారు భారద్వాజ కశ్యపులు. ఇద్దరు దేవతలు (115) చాముండ యక్షిణులు, కశ్యవ, అవత్సార నైధ్రువులు (116) ఆంగిరస బారన్నత్య భారద్వాజులు. ప్రియవాక్యులు, మహాదక్షులు, గురుభక్తి రతులు (117) ప్రతిష్ఠ గలవారు, సర్వభూత హితమందా సక్తులు. యజ్ఞములు చేయువారు కౌశ్యపులు. (118) అందరితో యజ్ఞం చేయించేవారు, ఉత్తమ యాజ్ఞికులు (119) అని షోడశస్థానము హాథీజణులు వత్సులు, భారద్వాజులు గోత్రదేవతలు జ్ఞానజ, యక్షిణులు 

ఈ గోత్రమందు జన్మించినవారు ఎల్లప్పుడు పంచయజ్ఞము లందు ఆస్తిక కలవారు. లోభులు, క్రోధముకల వారు, సంతానము కలవారు, చాలా విషయాలు తెలిసినవారు. (121) స్నానదానములందు అసక్తిని కలవారు, విష్ణుభక్తి పరులు. వ్రతశీలురు, గుణముల జ్ఞాన మందు మూర్థులు, వేదవర్ణితులు (122) అని పదునేడవ స్థానము. కవడ్వాణజ్ఞులు బ్రాహ్మణులు, భారద్వాజులు, కుశులు, యక్షిణి చచాఈ దేవతలు (123) ఆంగిరస బార్హస్పత్య భారద్వాజులు వవరులు. విశ్వామిత్ర దేవరాత ఔదలులు (124) ఈ గోత్ర మందు జన్మించిన వారు. సత్యవాదులు వ్రతములు జయించినవారు, జితేంద్రియులు రూపవంతులు, అల్పాహారులు, అందమైన ముఖం గలవారు (125) ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు, పురాణజ్ఞులు, మహా దానపరాయణులు, ద్వేషం లేనివారు, లోభం కలవారు వేదాధ్యయన తత్పరులు (126) దూరాలోచన కలవారు, మహాతేజస్వంతులు, మహామాయా మోహితులు (127) అని పదునెనిమిదవ స్థానము. జనోరీ బ్రాహ్మణులు కుశప్రవర కలవారు. విశ్వామిత్ర, దేవరాత ఔదలులు (128) మహామాయతారణి గోత్రదేవి ఈ వంశమందు జన్మించినవారు బాబులు భరింపరాని వారు (129) మహోత్కటులు మహాకాయం గలవారు, ప్రలంబులు, మహోద్దతులు, కష్టమైన రూపం గలవారు నల్లనివారు, సర్వశాస్త్ర విశారదులు (130) అధికంగాభుజించేవారు, దనవంతులు, దక్షులు, ద్వేషముపావము లేనివారు, మంచివస్త్ర ముభూషణము లుకలవారు వికృత రూపులు బ్రాహ్మణులు, బ్రహ్మవాదులు (131) అని పందొమ్మిదవ స్థానము. వనోడీయులు మూడు గోత్రములవారు. కుశకుత్స భారద్వాజులు, (132) విశ్వామిత్ర దేవరాత ఔదలులు. ఆంగిరస అంబరీష యువనాశ్వులు (133) ఆంగిరస బార్హస్పత్య భారద్వాజులు. శేషలశాంత (134) ధారశాంతి వీరు గోత్ర దేవతలు ఈ గోత్రమందు జన్మించిన వారు దుర్బలులు, దీన మనసులు (135) అబద్దాలాడు వారు, లోభులు, ఓ రాజ! అన్ని విద్యలలో కుశలురు, బ్రాహ్మలు బ్రహ్మ విత్తములు (136) అని ఇరువదవస్థానము. కీణావాదన కస్థానము ఇరువది ఒకటవది. ఇక్కడి బ్రాహ్మణులు భారద్వాజులు శుభులు (137) ఆంగిరస బార్హస్పత్య భారద్వాజులు, యక్షిణి గోత్రదేవీ (138) ఈ గోత్ర మందు జన్మించిన బ్రాహ్మణులు ధనవంతులు, శుభులు, వస్త్ర అలంకారములా గలవారు. ద్విజభక్తి పరాయణులు (139) భగవన్ని వేదనతినేవారు. ధర్మ పరాయణులు (140) అని ఇరువది ఒకటవస్థానము. 

గోవిందణ స్థానమందు జన్మించిన బ్రహ్మనత్తములు కుశగోత్రము వారు మూడు ప్రవరలు (141) విశ్వామిత్రుడు, దేవరాత, ఔదలులు చచ ఈ మహాదేవి గోత్రదేవి (142) ఈ గోత్రమందు జన్మించినవారు బ్రహ్మవేదులు, క్రతువులు ఆచరిస్తారు. ఆనందంతో ఏకాగ్రచిత్తంతో యజ్ఞం చేస్తారు. (143) అన్నివిద్యలలో కుశలుడు. బ్రహ్మ విత్తములు పవిత్రులు (144) అని ఇరువది రెండవ స్థానము. ధలత్యజులు రెండు గోత్రముల వారు ధారణము, నంకుశము, అని గోత్రములు (145) అగస్త్యుడు, దార్డ్యచ్యుతుడు, రథ్యవాహనుడు విశ్వామిత్ర దేవతరాత ఔదలులు (146) ఛత్రజా, ధలజా అని దేవతలు. ధారణస గోత్రము వారు బ్రహ్మవిత్తములు (147) త్రిప్రవరులు. ప్రసిద్ధులు, సత్వవంతులు, గుణవంతులు. ఆవంశ మందు జన్మించినవారు ధర్మకర్మల నాశ్రయించినవారు (148) ధనవంతులు. జ్ఞాననిష్ఠులు తపోయజ్ఞ క్రియల నిష్ఠులు. మోఢక జాతివారికి ఇది ఇరువది మూడవ స్థానము. అని ఇరువది మూడవస్థానము వారణ సిద్ధబ్రాహ్మణులు జ్ఞాన విత్తములు ఈ గోత్రమందలి వ్రులు సత్యవాదులు జితప్రతులు. జితేంద్రియులు, సురూపులు అల్పాహారులు, శుభాననులు సర్వ సన్నద్ధులు, పురాణజులు, మహాదాన పరాయణులు (151) ద్వేషరహితులు, లోభమానులు వేదాధ్యయనతత్పరులు. దీర్ఘదర్శులు. మహాతేజులు మహామాయావిమోహితులు. ఇది ఇరువది నాల్గవస్థానము శ్రేష్టమైనది (153) భాలజులు బ్రాహ్మణులు సత్యవాదులు (154) వత్సగోత్రులు కుశగోత్రులు. వారివ్రవరలు, ఐదు, మూడులు. భృగుచ్యవన ఆప్ను వాన ఔర్వ జామదగ్నులు (155) ఆంగిరస అంబరీష యావ్వవాశ్వులు శాంత శేషల ఇద్దరు దేవతలు ఈ వంశమందు జన్మించినవారు మంచి నడవడిక కల వారు సత్యవాదులు శాంతులు,భిన్నపరులు, నిర్థనులు, కుచేలులు (157) గర్వం కలవారు, లౌల్యం గలవారు వేదశాస్త్రములందు నిశ్చలులు. మోడజాతుల ఇరువది ఐదవ స్థానమీది (158) మహావీ ఆలుబ్రాహ్మణులు బ్రహ్మవిత్తములు ఇక్కడ ఒక గోత్రమువారే కుశ గోత్రమది.పవిత్రమైనది (159) విశ్వామిత్ర దేవరాత ఔదలులు. చవాఈ దేవత వీరికి రక్షగాఉంది.   

ఈ గోత్ర జాతులు సత్యవాదులు, జితేంద్రియులు సత్యవ్రతులు, సురూపులు అల్పాహారులు, శుభాననులు (181) దయాళులు, కృపాళులు, సర్వభూత హితాసకులు. ఇది బ్రహ్మవాదులఇరువది ఆరవస్తానము (162) తమ్మునితో కూడిన రామునిచే స్తుతింపబడ్డారు. తమ్ముని కూడాను (163) అని ఇరువధి ఆరవస్థానము. తియాతీయ అనే ఇరువది ఏడవస్థానము గూర్చి చెబుతున్నాను ఈ స్థానమందు జన్మించిన వారు వేదసారగులు (184) వేద సత్తములు ఇక్కడివారిని శాండిల్య గోత్రము వారని అన్నారు. పంచప్రవరులు. జ్ఞానజదేవత (165) కౌశ్యప, అవతార, శాండిల, ఉసిత, దేవలులు ప్రవరులు. స్తానదేవత జ్ఞానజ (166) ఈవంశమందుపుట్టినద్విజులు, సూర్యవర్చసులు. చంద్రుని వలె చల్ల నైనవారు. ధర్మారణ్య మందున్నారు (167) సదాచారులు, వేదశాస్త్ర పరాయణులు యాజ్ఞకులు శుభాచారులు సత్యశౌచ పరాయణులు (168) ధర్మజ్ఞులు, దానశీలులు, నిర్మలులు. మదముతో ఉత్సుకులు. తవః స్వాధ్యాయ నిరతలు. వ్యాయ ధర్మ పరాయణులు. ఇది నమ్ర వింశతి తమస్థా నమని. బ్రహ్మ విత్తములన్నారు (169) అని ఇరువది ఏడవస్థానము. గోధరీయులైన బ్రాహ్మణులు జననత్తములు. వారిగోత్రములుమూడువరసగాఇట్లా (170) ధారణస, జాతూ కర్ణకౌశికులు. (171) ధారణన గోత్రులు మూడు ప్రవరలవారు అగస్తీదార్డచ్యుత, ఇధృవాహనులు. (172)వసిష్ఠ ఆత్రేయ జాత కరులు రెండవవారు విశ్వామిత్ర, మాధుచ్ఛంద, అనువరణులు మూడవ గోత్రం, (173) మాలేయా, యక్షిణీ, మహాయోగీ గోత్రదేవతలు (174) ఈ వంశమందు జన్మించినవారు బ్రాహ్మణులు సత్యవాదులు, అలౌల్యులు, మహాయజ్ఞులు, వేదాజ్ఞ పాలించువారు (175) అని ఇరువది ఎనిమిదవ స్థానం. వాటగ్రహాల జాతులు మూడు గోత్రముల వారు ధారణవత్స (176) కుత్సులు. అట్లాగే గోత్ర దేవతలు. ధారణ నగోత్రులు మూడు ప్రవరలవారు (177) అగస్తి, దార్థచ్యుత, ఇథవాహనులు వత్సులు (178) భృగుచ్యవన, ఆప్నవాన, ఔర్వ, జామదగ్నులు. కుత్సులు మూడు ప్రవరులవారు (179) ఆంగిరన, అంబరీష, యౌవనాశ్వులు. దేవతలు, ఛత్రజా, శేషలా (180) జ్ఞానజలు క్రమంగా గోత్రదేవతలు. ఈ గోత్రమందలి విప్రులు నత్యవాదులు, జితేంద్రియులు (181) సురూపులు, అల్పాహారులు, మహాదాన పరాయణులు, ద్వేషరహితులు, లోభంకలవారు, వేదాధ్యయన తత్పరులు (182) దీర్ఘదర్శులు. మహాతేజులు, గొప్ప కోరికలు కలవారు, వేదాధ్యయన తత్పరులు (183) అని ఇరువది తొమ్మిదవ స్థానము. మాజజ స్థానమువారు రెండు గోత్రముల వారు శాండిల్య కుశగోత్రములు (184) కాశ్యవ, అవతార, శాండిల్య అసిత, దేవలులది ఒక గోత్రము (185) జ్ఞాన జాదేవి. కుశగోత్రులు మూడు ప్రవరలవారు (186) విశ్వామిత్ర, దేవరాత, ఔదలులు, జ్ఞానదదేవి (187) ఈ గోత్రమందలివారు దుర్బలులు, దీనమనసులు, అనత్యభాషలు, లోభులు (188) నర్వవిద్యాకుశలులు, బ్రాహ్మణులు, బ్రహ్మసత్తములు (189) అని ముప్పదవస్థానము. సాయద మరో స్థానము పవిత్రమైనది. కుశప్రవరులు (190) విశ్వామిత్ర, దేవరాత, ఓదలులు ప్రవరులు. జ్ఞానద గోత్రదేవి (191) ఈ గోత్రమందలి వారు దుర్బలులు, దీనమనసులు, అనత్య భాషులు, లోభులు (192) నర్వవిద్యాకుశలులు, బ్రహ్మవిత్తములు (193) అని ముప్పది ఒకటవ స్థానము. ఆనందీయ సంస్థాన గోత్రీకులు ఇద్దరు. భారద్వాజ, శాండిల్యులు (194) అంగిరన, బారుస్పత్య, భారద్వాజలు ఒకరు. చచా ఈ గోత్రదేవి (195) కాశ్యవ, అవతార, శాండిల్య, అనిత, దేవలులు రెండవవారు. 

జ్ఞానజా దేవి గోత్ర దేవత. ఈ గోత్రమందు జన్మించినవారు నిర్లోభులు, శుద్ధ మానసులు (197) అనుకోకుండా వచ్చిన దానితో సంతృప్తి పడేవారు బ్రాహ్మణులు, బ్రహ్మ విత్తములు (198) అని ముప్పది రెండవ స్థానము. పాటడీయ మరో స్థానము. పవిత్రమని చెప్పబడింది. కుశ గోత్రీకులు మూడు ప్రవరలవారు (199) విశ్వామిత్ర దేవరాత, ఔదలులు. ఈ గోత్ర మందలివారు వేదశాస్త్ర పరాయణులు (200) మద ఉద్ధురులు. న్యాయమూర్గ ప్రవర్తకులు. (201) అని ముప్పది మూడవ స్థానము. టీకోలీయ మరో స్థానము కుశగోత్రము. విశ్వామిత్ర, దేవరాత, ఔదలులు (202) చచాఈ దేవత గోత్రదేవి ఈ గోత్రమందలి విప్రులు శ్రుతిన్మృతి పరాయణులు (203) రోగులు, లోభులు, దుష్టులు, యజన యాజనరతులు. బ్రహ్మకియా పరులు వీరంతా మోడులు (204) అని ముప్పది నాల్గవ స్థానము. గమీధాణీయులు ముప్పది ఐదవవారు. ధారణన గోత్రము, మహాబలాదేవి (205) అగస్తిదార్డచ్యుత, ఇధృవాహనులు ప్రవర ఈ వంశమందలి బ్రాహ్మణులు బ్రహ్మతత్పరులు (206) అలౌల్యులు, మహా ప్రాజ్ఞలు, వేదప్రాజ్ఞులు, వేదాజ్ఞా ప్రతిపాలకులు (207) అని ముప్పది ఐదవ స్థానము. మాత్ర అనుష్ఠానము ఉత్తమ పవిత్ర స్థానము ప్రాణులందరికి ఇక్కడి వారు కుశగోత్రులు (208) విశ్వామిత్ర దేవరాత ఔదలులు ప్రవర. మహాదేవి, జ్ఞానద నర్వలోక రక్షిణి దేవత (209) ఈ గోత్రమందు జన్మించిన బ్రాహ్మణులు. దేవతత్పరులు స్వాధా, వషట్ కారములు చేస్తూ, వేదశాస్త్ర ప్రవర్తకులు (210) అని ముప్పది ఆరవ స్థానము. నాతమోర మరొక పవిత్ర స్థానము. మూడు ప్రవరలు కల కుశగోత్రము ఇక్కడ ఉంది (211) విశ్వామిత్ర, దేవరాత, ఔదలులు. జ్ఞానజదేవి గోత్రదేవి (212) ఈ వంశమందు జన్మించిన బ్రాహ్మణులు బ్రహ్మవిత్తములు ధర్మజులు, నత్యం వలికేవారు వ్రతదాన పరాయణులు (213) అని ముప్పది ఏడవ స్థానము. బలోల పవిత్రమైన మరొక స్థానము. మూడు ప్రవరల కుశగోత్ర మిక్కడ ఉంది (214) ముందు చెప్పిన ప్రవరలే. మానదేవి ఈ వంశీకులు పరమమైన వారని చెప్పబడ్డారు. వీరిని కాజేశులు నిర్మించారు. (215) అబద్దా లాడేవారు. లోభులు. అన్ని విద్యలలో కుశలురు బ్రహ్మసత్తములు (216) అని ముప్పది ఎనిమిదవ స్థానము. రాజ్యజ అని మరొక స్థానము. లౌగాక్ష ప్రవరగలది. కాశ్యప, అవత్సార వసిష్ఠులు ప్రవర (217) యోగిని భద్ర గోత్రదేవి. ఈ వంశమందలి వారు బ్రాహ్మణులు వేద తత్పరులు (218) స్నాన, హోమ, దాన వరాయణులు, నిత్య ధర్మరతులు, నిత్యనైమిత్తిక కార్యవరులు (219) అని ముప్పది తొమ్మిదవ స్థానము. రూపోలా మరోస్థానము పవిత్రమైనది. పుణ్యమిచ్చేది. మూడు గోత్రములు ముగ్గురు దేవతలు. 

కుత్స, వత్స, భారద్వాజులు, అంగిరస, అంబరీష యావనాశ్వులు ఒకరు (221) భృగుచ్యవన, ఆప్నువాన, ఔర్వ జామదగ్నులు రెండవ వారు. ఆంగిరన భారద్వాజ, బార్హస్పత్యులు మూడవవారు (222) క్షేమలాదేవి, ధారభట్టారిక, క్షేమల వీరు గోత్ర మతలు ఈ గోత్ర మందలి వారు పంచయజ్ఞ రతులు, లోభులు, క్రోధనులు, అధిక సంతతివారు (224) స్నానదానాది నిరతులు, విజితేంద్రియులు, వేల కొలది వాపి కూపతటాకములకు కర్తలు (225) అని నలుబదవ స్థానము. బోధాణీ పరమ పవిత్ర స్థానము, పాపనాశకము, కుశతాళికులు గోత్రము వారు (228) విశ్వామిత్ర దేవరాత ఓదలులు ప్రవర. విశ్వామిత్ర, అఘమర్షణ కౌశికులు మరో ప్రవరవారు (227) యక్షిణి, తారణి దేవతలు వరుసగా ఈ గోత్రమందలివారు దుర్బలులు, దీనమనసులు (228) అబద్ధా లాడువారు, లోభులు. సర్వ విద్యా కుశలులు బ్రహ్మసత్తములు (229) అని నలుబది ఒకటవ స్థానము. ఛత్రోటా సర్వలోకములతో పూజింపబడే మరోస్థానము. కుశ గోత్రము ముగ్గురు ప్రవర (230) విశ్వామిత్ర దేవరాత ఓదలులు చచో ఈ దేవత గోత్రదేవి (231) ఈ వంశమందలి వారు వేదశాస్త్ర పరాయణులు గొప్ప జన్మకలవారు న్యాయమార్గ ప్రవర్తకులు (232) అని నలుబది రెండవ స్థానము. నలుబది మూడవది ఖల స్థానము. వత్ప గోత్రోద్భవులు, విప్రులు కృషికర్మ ప్రవర్తకులు. (233) గోత్రజా జ్ఞానజాదేవి వంచప్రవరులు. భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వ జామదగ్న్యులు (234) ఈ గోత్రమందలి విప్రులు శ్రేతాగ్ని సేవించేవారు వేదాధ్యయన శీలులు, తాపసులు, అరమర్దినులు (235) రోషవంతులు, లోభులు హృషలు. యజనయాజనరతులు. సర్వభూతములందు దయగలవారు. పరోపకారులు (238) అని నలుబది మూడవ స్థానము. వాసంతర్యులు కుశగోత్రులు. విశ్వామిత్ర దేవరాత ఔదలులు ప్రవర (237) చచాఈ గోత్రదేవి ఈ వంశమందలి వారు బ్రహ్మతత్పరులు (238) నరోపకారులు ఇతరుల చిత్రాన్ని అనుసరించేవారు ఇతరుల సొమ్ముకు విముఖులు. పరమార్గ ప్రవర్తకులు (239) అని నలుబది వాల్గవ స్థానము. ఈ తరువాతి స్థానము జా ఖానణము. వాత్స్య గోత్రము. గోత్రజ, శ్రీహరీ దేవతా వంచప్రవరలు.  

భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వ పురోధనులు. ఈ వంశమందలి బ్రాహ్మణులు సుఖవానం కలవారు విప్రులు స్థూలకాయులు. తెలిసినవారు. సర్వ కర్మరతులు (241) అందరు ధర్మమందు విశ్వాసం కలవారు. సర్వలోక పూజితులు. వేద శాస్త్రార్థములలో నిపుణులు. యజన యాజన రతులు (242) సదాచారులు సురూపులు దీర్ఘదర్శులు. బొజ్జగలవారు. శ్రీ పురీ దేవత కులదేవత (243) అని నలుబది ఐదవ స్థానము నలుబది ఆరవ స్థానము మోటులది. గోతీ ఆ అని స్థానం. కుశ గోత్రము (244) విశ్వామిత్ర, దేవరాత, ఔదలులు ప్రవర (245) రాక్షసుల భంజింపచేసే యక్షిణి దేవత ఈ వంశమందు జన్మించిన బ్రాహ్మణులు బ్రహ్మతత్పరులు (246) ధర్మమందు బుద్ధిగలవారు. ధర్మశాస్త్ర మందు నిష్ట గలవారు (247) అని నలుబది ఆరవ స్థానము. నలుబది ఏడవస్థానము వరలీ అనుస్థానము పవిత్రమైనది (248) భరద్వాజ గోత్రము ప్రవరులు అట్లాగే యక్షిణి కులదేవి (249) ఆంగిరస, బారుసత్య, భారద్వాజులు ప్రవర ఈ వంశమందలి బ్రాహ్మణులు పవిత్రమూర్తులు (250) వారి మాటలవల్లనే పాపులైన, నరులు శుద్ధి నొందుతారు (251) అని నలుబది ఏడవస్థానము. మరొక స్థానము దుధీయము రెండు గోత్రములు ధారణనము ఆంగిరనము (252) అగస్తీదార్డచ్యుత ఇధృవాహనులు ప్రవర చత్రా ఈ మహాదేవి రెండవ ప్రవర (253) ఆంగిరన అంబరీష, యౌవనాశ్వులు. జ్ణానదశేషల ప్రాణులందరికిని జ్ణానద (254) ఈ వంశ మందు జన్మించిన బ్రాహ్మణులు దుఃనహలు మదోత్కటులు మహాకాయులు. ప్రలంభులు (ఇతరుల పై ప్రభావంచూపేవారు) మదోద్ధతులు. క్లేశరూవులు, కృష్ణవరులు. సర్వశాస్త్ర విశారదులు. బహుభుక్కులు. ధనవంతులు, దక్షులు, ద్వేషము పాపములేని వారు (256) అని నలుబది ఎనిమిదవ స్థానము. హాసోలానం, స్వస్థానమును గూర్చి. శాండిల్యగోత్రము, వంచ ప్రవరలు (257) భార్గవచ్యవన అప్నువాన ఔర్వజామదగ్న్వులు. పవిత్రమైన పావనాశకమైన యక్షిణి దేవత (258) ఈ వంశమందు పుట్టిన బ్రాహ్మణులు స్థూలదేహులు. లంబోదరులు, లంబకరులు, లంబహస్తులు మహాద్విజులు (259) రోగం లేనివారు దైవ స్వరూపులు, సత్యవ్రత పరాయణులు (260) ఇది నలుబది తొమ్మిదవ స్థానము. 

వైహాలాఖ్యము స్థానము ఏబది యవది. కుశగోత్రము, మహాబలదేవి (261) ఈ గోత్రమందలి విప్రులు దుష్టులు, కుటిల గాములు, ధనవంతులు, ధర్మ నిష్ఠులు. వేదవేదాంగ పారగులు (262) దాన భోగరతులు అందరు శ్రాత మందు నిష్ఠ గలవారు (263) అని ఏబదవ స్థానము. అసాలా పరమ స్థానము. రెండు గోత్రములు కుశ, ధారణలు (264) విశ్వామిత్ర దేవరాత దేవలులు (ఔదలులు) జానజ గోత్రదేవి (265) అని ఏబది ఒకటవ స్థానము. ఏబది రెండవది స్థానము నాలోలావత్స, ధారణ సగోత్రములు (266) ప్రవరలు ముందు చెప్పాము. దేవతలు ముందలివారే. ఈ వంశమందలివారు వవిత్రులు. ఉత్తములు (267) ఎక్కువగా చెప్పటం అనవసరం. ఇక్కడి వివ్రులంతా సజ్జనులు. అందరు శుద్భలు మహాత్ములు. కులపరం పరగా వచ్చినవారే (268) అని ఏబది రెండవ స్థానము. దేహాలము బ్రాహ్మణులకు పరమ స్థానము. అక్కడ కుశ వంశపు బ్రాహ్మణులు జన్మించారు. ప్రవర ముందు చెప్పిందే దేవత ముందు చెప్పినట్టిదే (269) ఆ గోత్రమందలి బ్రాహ్మణులు ముందు చెప్పిన గుణములు కలవారు (270) అని ఏబది మూడవ స్థానము. సోహావీయ పురమున, మూడు గోత్రముల వారు. భారద్వాజ, ఖ్యాత, వత్సములు (271) యక్షిణి, జ్ఞానజ, సిహోలీ దేవతలు. ఈ వంశ పరీక్షముందే చెప్పబడింది. (272) అని ఏబది నాల్గవ స్థానము. ఇక ఏబది ఐదవ స్థానము. సంహాలియా స్థానము. రాముడిచ్చాడు (273) అక్కడి బ్రాహ్మణులు కుత్స గోత్రమువారు బ్రహ్మ వర్చస్సు కలవారు స్వధర్మ నిరతులు, కర్మనిరతులు (274) ఆంగీరస, అంబరీష, యౌవనాశ్వులు ప్రవర శాంతాదేవి శాంతి కర్మలలో శాంతినిచ్చేది (275) అని ఏబది ఐదవ స్థానము. ఈ విధముగా, గోత్రములు, స్థానములు, బ్రాహ్మణుల ప్రవరలు (గోత్రదేవి, గుణములు) చెప్పాను. (276) ఇక ముందు త్రైవిద్యుల గూర్చి చెప్తాను. వరుసగా వారి స్వస్థానముల చెప్తాను (277) శీల మొదటిది. మండోర రెండవది. ఏవడి మూడవది. గుందరాణా నాల్గవది. (278) కల్యాణీ ఐదవది దేగామ ఆరవది. నాయకపురం ఏడవది డలీ ఆ ఎనిమిదవది (279) కడోవ్య తొమ్మిదవది. కోహాట్య పదవది. హరిడీయ పదకొండవది, భదుకీయ పన్నెండవది.  

సంప్రాణవ, కందరావ, వాసరోవా పదమూడవది. శరండావా పదునాల్గవది (281) లోలాసణ పదిహేనవది. వారోల పదహారవది. నాగల పురము పది హేడవది (282) బ్రహ్మ వచనము - చాతుర్విద్యులు నాగతులు, పునరాగతులు ఆ రమ్యమైన చోట ఆ బ్రాహ్మణులు వాసం చేశారు (283) ఇరువది నాలుగు సంఖ్యాకులు రామ శానస మందు కోరిక గలవారు. హనుమంతుని గూర్చి వెళ్ళారు. తిరిగి మరలా వచ్చారు (284) ఆ దోషంవల్ల వారంతా స్థాన భ్రంశ మందారు. కొంత కాలం గడిచాక వారికి విరోధ మేర్పడింది (285) చిన్న ఆచారులు, భిన్న భాషీయులు, వేషం సంశయాస్పద మైంది. వారంతా బ్రాహ్మణులు, పదిహేనువేల బ్రాహ్మణులు (286) కొందరు కృషి కర్మవరులు, కొందరు యజ్ఞ పరాయణులు. కొందరు మల్లులు. కొందరు వేదపాఠకులు (287) కొందరు ఆయుర్వేద మందు ఆసక్తి కలవారు. కొందరు రజక యాజకులు. కొందరు సంధ్యా స్నాన పరులు కొందరు నీలకర్త్వు ప్రయాణికులు (288) కొందరు సాలె వారిని యాచించేవారు దారం తయారు చేసే వారిని యాచించేవారు. కలి వస్తే ద్విజులు భ్రష్టు లౌతారు. అనుమానం లేదు (289) ఓ రాజ! కలియుగం వస్తే శూద్రులలో జాతిభేదం వస్తుంది. భ్రష్టాచారులను తెలుసుకొని జాతీ బంధంతో పీడితులౌతారు (290) భోజన, ఆచ్చాదనము లందు తమవారిచే వదలి పెట్టబడుతారు. సహవాసతో ఎప్పుడూ ఎవరూ కన్యను చేసుకోరు. పిదప ఆ వణిజులు కలిలో తైలకారు లౌతారు (291) కొందరు కలకారులు. కొందరు తండుల కారులు. కొందరు రాజ పుత్రాశ్రితులు కొందరు నానావర్ణముల నాశ్రయించిన వారు కలి వస్తే కొందరు వణిజులు భూమి పై భ్రష్టులౌతారు (292) వారి ఆచారములు వేరు. సంబంధములు వేరు చేయబడ్డాయి. కొందరికి సీతాపురంలో నివాస మేర్పడింది (293) కొందరు సాశ్రమతీ తట మందు, కొందరు ఎక్కడో ఒకచోట ఉండిపోయారు. సీతాపురం నుండి ఇంతకుముందు ఎవరొచ్చారో, భయపడి (294) “సౌభ్రమతి” ఉత్తర తీరమందు, శ్రీ క్షేత్రమందు ఎవరున్నారో, ఎవడైతే వారికి సుఖవానముగా స్థానమును ఇచ్చారో (295) తిరిగి వారు వెంటనే ఆ సీతావురానికి స్వయంగా వెళ్ళారు. తిరిగి వచ్చిన వారికి ఏబది ఐదు గ్రామాలను ఇచ్చారు (296) రాముడు మోఢ విప్రులకు అక్కడ నివాస మేర్పరచారు. వృత్తి బాహ్యలైన విప్రులు ధర్మారణ్య మందున్నారు (297) వణిజ వృత్తి యందు గ్రామవృత్తి యందు మాకేమి ప్రయోజనం లేదు. మాకు వాసము మాత్రము రుచిస్తోంది (298) అనీ అనగా ఆతైద్యులతో అనుమతించబడి, ఆ గ్రామములలో ఆ విప్రులు చాతుర్విద్యులు బ్రాహ్మణులు (299) న్వకర్మ నిరతులై శాంతులై కృషికర్మ పరాయణులైనారు. ధర్మారణ్యానికి కొద్ది దూరంలో వారు ఆవులను మేపసాగారు (300). 

అక్కడ చాలామంది,  ద్విజ బాలకులు గోపాలులు చాతుర్విద్యులు శిశువులు వారిధేనువులను మేప సాగారు. వారికి భోజనం కొరకు, అన్నపానాది సత్కారమును (301) యువతులు, విధవలు, బాలకులు తెచ్చారు (302) కొంతకాలానికి వారికి పరస్పరము ప్రేమ కల్గింది. గోపాలులు ప్రేమతో ద్విజబాలికలను కుమారిలను అనుభవించారు (303) వారంత గర్బవతు ల్యారు. వారిని ద్విజసత్తములు చూచారు. ఇళ్ళనుండి వారిని వెళ్ళగొట్టారు. పాపకర్మచే వారిని ధిక్కరించారు. (304) వారికి పుట్టిన కుమారులు కాతీభులు, గోలకులు వారు భూలోకమందు ధోనుజులని కీర్తిపొందారు (గోవర్థనజాతి) (305) వృత్తి బాహ్యులైన ఆ విప్రులు ప్రతిరోజు భిక్షచేయసాగారు. త్త్రెవిద్య ద్విజన్ముల గూర్చి మరింకావినండి. (306) కుష్టురోగి, వంగువు, మూర్ఖుడు, బధిరుడు, కాణుడు, కుజ్జుడు, మాటరానివాడు (నత్తి) (307) కన్యతలను పొందని వీరు చాతుర్విద్యుల నాశ్రయించారు. గొప్పదనంతో కుమారికలు వారి సుతులను (308) వివాహ మాడారు. వారికి కల్గిన సంతానము, త్రిదలజులని ఈ భూమి పై ప్రసిద్ధి నొందారు (309) అ బ్రాహ్మాణులు పరస్పర ము మిశ్రన ముద్భవులు వృత్తి నాశ్రయించారు. మరొకటి విద్య బ్రాహ్మణుల గూర్చి వినండి (310) రాముడిచ్చిన గ్రామాన్ని వన్ను తీసుకొనే కారణం కొరకు, ద్విజులంతా ఏకమై గ్రామం నుండి బలి తీసుకొని (311) నగభాగ మిచ్చారు. అర్థభాగము దాచారు (డబ్బు) ఆ బ్రాహ్మణులు లౌల్యం కలవారై ఇది లభించిందను కొన్నారు. (312) మహాస్థానమునకు వెళ్ళారు. వారాశ్చర్య పడ్డారు. వారిమధ్య ఒకబ్రాహ్మణుడు కోపంతో వారితో ఇట్లా అన్నాడు. (313) విప్రునిమాట - లౌల్యం కలవారై అబద్ధ మాడుతున్నారు. బ్రహ్మస్వమందు అతిలోలువులై పుత్రపౌత్ర వినాశనం తెచ్చుకుంటున్నారు. (314) విషము విషము కాదు. బ్రహ్మస్వము (బ్రాహ్మడిసొమ్ము) విషమౌతుంది. విషము ఒకడినే చంపుతుంది. బ్రహ్మస్వము పుత్రపౌత్రుల చంపుతుంది. (315) బ్రహ్మాస్వంతో పుత్రదార గృహములుధమైతే బ్రహ్మాన్వంతో నాశితులైవారు కూడా మిగలరు. (318) బ్రహ్మ స్వహారకుడు ఎప్పుడూ స్వర్గా న్నిపొందడు. బ్రాహ్మణుని పిడుకనైనా/పేడనైనా తీసుకున్నవారు. (317) పిదప మూడు జన్మలు నరకం వెళ్తారు. పూర్వజులు వారిచ్చిన (తిలోదకాన్నీ) ఉదకాన్ని తాగరు (318) క్షయాహమందు (తద్దినంరోజు) ఆతడిచ్చిన నాంగడోదక క్రియలను తినరు. సంతానం కలుగదు. కలిగినా జీవించరు. (319) దైవవశాత్తు బ్రతికితే భ్రష్టాచారు లౌతారు. (320) ఏకాదశ విప్రులిట్లన్నారు - ఓ విప్రులార! అబద్ధం చెప్పలేదు. మమ్మల్నెందుకు దూషిస్తున్నారు. తప్పు లేనప్పుడు, కటువుగా మాట్లాడటం తగునా (321) దానిని విని బ్రాహ్మణులు, గ్రామమందు పన్నులు వసూలు చేసే వణిజుని అడిగారు. అతడు దానికి కారణం చెప్పాడు (322) ఓ ద్విజగత్తములార! వణిజులే నాకు బలి(కానుక) ఇచ్చారు. అదంతా శుద్ధమైన మనస్సుతో బ్రాహ్మలకు చెప్పాను. (323) అప్పుడు సగమే అని గ్రహించి ఆ ద్విజ పుత్రులు కుపితులైనారు. ఆ పిదప ఆ పదకొండు ద్విజులు వృత్తి నుండి బహిష్కరించ బడ్డారు. (324) ముల్లోకములలో ఏకాదశులు సమానమైన జాతులుగా ప్రసిద్ధికెక్కారు. వారితో వివాహ సంబంధముని జరుగదు (325) ఏకాదశనములు, గ్రామం బయట ఉన్నవారు. ఈ విధముగా భేదము లేర్పడ్డాయి. మోథ బ్రాహ్మణులలో నానా రకాలుగా కాలక్రమంలో యుగాన్ననుసరించి జ్ఞాతులకు, వృషునకు భేదములు (328) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర నంతయందు తృతీయ బ్రహ్మఖండ మందు పూర్వభాగమందు, ధర్మారణ్య మాహాత్మ్యమందు జ్ఞాతి భేదవర్ణన మనునది మువృది తొమ్మివ అధ్యాయము.