స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
9వ అధ్యాయము
వ్యాసుని వచనము - ఓ రాజసింహమ! పుణ్యమైన ఉత్తమమైన కథను వినండి. జగన్నాథుని స్తుతిస్తుండగా, ఆతడు ఇట్లా పలికాడు (1) విష్ణు వచనము - అందరు బ్రహ్మాదులు దేవతా శ్రేష్ఠులు ఎందుకొరకొచ్చారు. భూమి యందు అంతా క్షేమమేనా? ఎవరి వల్లనైనా భయమొచ్చిందా (2) అప్పుడు బ్రహ్మ ఆనందపడి ఆ కేశవునితో ఇట్లా అన్నాడు. వచరాచరమైన ముల్లోకములందు మాకు భయము లేదు (3) ఒక విజ్ఞాపన చేయటానికి నేను నీ దగ్గరికొచ్చాను. దానిని నేను చెబుతున్నాను. ఈ నా మాటలను వినండి. (4) పూర్వము ధర్ముడు షమైన ఉత్తమ తీర్థాన్ని స్థాపించాడు. ఓ దేవ, జనార్దన, నీ అనుగ్రహంతో దానిని నేను చూడదలిచాను (5) ఓ దేవదేవేశ! నీవు నేనక్కడికి వెళ్ళదలిచేటుగా నా మనసును మార్చు. ప్రధానమైన ధర్మారణ్యము ఉత్తమ తీర్థంగా మారేట్లు చేయి (6) విష్ణువు వచనము - మంచిది మంచిది, ఓ భాగ్యశాలి అక్కడికి త్వరగా వెళ్ళండి. ఆలసించకండి. నా మనస్సు కూడా అక్కడే ఉంది. నాకుగూడా దానిని చూడాలని కోరికగా ఉంది (7) వ్యాసుని వచనము - గోవిందుడు గరుడుని ఎక్కి త్వరగా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ధర్ముడు ఇంద్రుడు మొదలుగా దేవతలను, అట్లాగే ఋషి గణములను (8) బ్రహ్మవిష్ణువు మహేశుడు మొదలగు వారిని దూరం నుండే చూచాడు. ఆనంద పడ్డాడు కూడా. ధర్మరాజు, విష్ణువు మొదలుగా గల ఆ దేవతలను చూచి (9) పూజా సామగ్రిని తీసుకొని తన ఆశ్రమం నుండి అక్కడికి వారికి ఎదురుగా వచ్చాడు. ఆననము నుండి లేచి త్వరగా నవర్యకు కావలసిన వానిని తీసుకొని, ఒక్కొక్కరికి విడివిడిగా పూజచేశాడు (10) సూర్యుని కుమారుడై నయముడు శాస్త్ర ప్రకారము వారికి పూజ చేశాడు. గొప్పగా పూజించి ఆననములలో కూర్చో పెట్టాడు (11) యముని వచనము - ఓ దేవకీసుత! మీద యవల్ల ఈ క్షేత్రము తీర్థ రూపమైంది. మీరు సంతోషించి నందు వలన, శివుని కృపవల్ల ఈవేళ అది తీర్థమైంది (12) ఈ నాటికి నా జన్మ సఫలమైంది. ఈవాటికి నా తపస్సు ఫలించింది. ఇప్పటికి నా స్థానము నఫలమైంది. బ్రహ్మవిష్ణు మహేశుల నమాగమం వల్ల సార్థకమైంది. (13) వ్యాసుని వచనము - ఈ రకముగా నుతించగా అప్పుడు విష్ణువు మధురమైన మాటలతో ఇట్లా అన్నాడు. ఓ విభు! ధర్మరాజేంద్ర నేను నీ స్తోత్రంతో ఆనందపడ్డాను (14) వేను మహా ఆనందంలో ఉన్నాను. ఏదైనా కోరుకో. నీ కోరికను నెరవేరుస్తాను. నీ కిష్టమైన దానిని నీకిస్తాను. అనుమానం వదు. (15) యముని వచనము - ఓదేవేశ! నీవు ఆనందిస్తే నా వాంఛితాన్ని ఇవ్వదలిస్తే మహాపుణ్యమైన ధర్మారణ్య మందు ఋషుల ఆశ్రమాలను ఏర్పరచు (16) బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారో యాజ్ఞకులు ఎక్కడ యజ్ఞం చేస్తారో వేద ధ్వనితో కూడిన ఆ ప్రదేశము ఉత్తమ తీర్థమౌతుంది (17) ఈ తీర్థ మందు బ్రాహ్మణులు లేరు. జంతువులు పీడిస్తున్నాయి. అందువలన ఓ శారీ! నీవు బాడబులను అనేకమంది ఋషులను తీసుకొనిరా. ముల్లోకములలో నచరాచర మందంతా ధర్మారణ్యము వెలిగి పోయేట్టుగా చేయి (18).
అప్పుడు సహస్రాక్షుడు, సహస్ర శీర్షుడు, సహస్ర పాదుడు ఐన విష్ణువు ధర్మవత్సలుడై తన రూపాన్ని వేయి విధములుగా చేశాడు. ఆయా స్థానములందున్న విప్రులను సదాచారులను శుభప్రతులను (19) సమస్త ధర్మములందు కుశలులను, సర్వశాస్త్ర విశారదులను, తపో జ్ఞానములందు ప్రసిద్ధమైన వారిని బ్రహ్మయ్య పరాయణులను ఏర్పరచాడు. పద్దెనిమిది వేల ఋషులను అందరిని ఏర్పరచాడు. (20) అనేక దేశములనుండి తీసుకొని వచ్చి అ దేవతలు వీరి వేర్పరచారు. త్రిమూర్తులు అనేక ఆశ్రమములు కల్పించారు (21)కృష్ణుడు ధర్మోపదేశం కొరకు ఆశ్రమములు కల్పించాడు. బ్రహ్మ శివుడు కల్పించారు. కేశవుడు అందరిని ఆయా వారికి యోగ్యములైన స్థానములందు ఆయా వారి ని ఉంచాడు (22) యుధిష్టురుని వచనము - వేద పారగులైన ఆ బ్రాహ్మణులు ఏవంశంలో జన్మించినవారు. సపరివారముగా పుత్ర పౌత్రులతో కూడిన అనేక మంది శిష్యులతో కూడిన అగ్ని హోత్ర పారాయణులైన అట్లా స్థాపించబడిన ఆ బ్రాహ్మణుల స్థానములు వామములు ఉన్నదున్నట్లుగా వారు చెప్పండి అని అన్నాడు (23) వ్యాసుని వచనము - ఓ నృప శార్దుల ధర్మారణ్యమందు నివసిస్తున్న (24) మహాత్ములైన బ్రాహ్మణులైన ఊర్ధ్వరేతసులైన వారి నామములను పుత్రపౌత్రుల వామములను వేను చెబుతున్నాను విను (25) ఓ పాండవశ్రేష్ఠ! బ్రాహ్మణుల ఇరువది నాలుగు గోత్రములను, వారి శాఖలను, ప్రశాఖలను, అట్లాగే వుత్రపౌత్రాదులము (26) చెప్తాను. పుత్రులు నూర్ల కొలది వేల కొలది అనేక మంది జన్మించారు. ప్రధానమైన ఇరువది నలుగురి పేర్లను చెప్తాను. ద్విజుల ఋషులు, ప్రవరలు చెప్పబడ్డాయి. వాటిని విను (27) భారద్వాజుడు, వళ్పుడు, కౌశికుడు, శుకుడు, శాండిల్యుడు, కాశ్యపుడు, గౌతముడు, ఛంధమడు (28) జాతూరి, వాత్సుడు, వశిష్టుడు, ధారణుడు, ఆత్రేయుడు, భాండిలుడు, లౌకరుడు, ఇంకా (29) కృపాయనుడు, ఉపమన్యువు గార్యుడు ముద్గలుడు మౌషకుడు, పుణ్యాసనుడు పరాశరుడు కౌండిన్యుడు ఇంకా (30) గావ్యాసనుడు వీరు ఇరువది నాలుగు మంది శ్రేష్టమైనవారు. జామదగ్న్య గోత్రమునకు చెందిన ప్రధానులు ఐదుగురే (31) భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వజామదగ్నులు ఈ ఐదుగురు శ్రేష్టులు, ఓరాజ! వీరు కీర్తి మంతులు, లోకప్రసిద్ధులు. (32) ఈ విధమైన గోత్రములందు జన్మించిన వాడబులు వేదపారగులు బ్రాహ్మణ పూజాది క్రియలాచరించేవారు రకరకాల యం త్రియాపరులు (33) గుణవంతులు, షట్ శర్మనిరతులు ఈ విధమైన మహాభాగులు, నానా దేశములందు జన్మించిన ద్విజులు వీరు (34) భార్గవ చ్యవన అపువాన రంజామదగ్నులతో కూడిన వారు పంచప్రవరులే. ఆత్రేయులు, అర్చనానసులు శ్యావాన్యులు అని ముగ్గురు (35) ఈ గోత్రమందు పుట్టిన విప్రులు దుష్టులు, వంకరగా పోయేవారు. దనవంతులు, ధర్మనిషులు, వేద వేదాంగపారగులు (38) దానభోగరతులు అందరు శ్రౌతస్మార్తములందు ఇష్టులు (381/2).
మాండవ్య గోత్ర మందలి వారు ఐదుగురు ప్రవరలతో కూడినవారు (37) భార్గవచ్యవన అత్రి ఆప్తువాన ఔర్వులు. ఈ గోత్రమందు జన్మించిన వివ్రులు ప్రతినతి పరాయణులు (38) రోగులు లోభులు దుషులు యజన యాజనరతులు. బ్రహ్మ క్రియా వరులు. ఓ కురుసత్తమ! మాండవ్యులంతా ఇట్టి వారు (39) గార్గ్య గోత్రమందు జన్మించిన వారికి ప్రవరులు ముగ్గురు. అంగిరుడు, అంబరీషుడు యౌవానాశ్వుడు అని ముగ్గురు (40) ఈ గోత్రమందు జన్మించినవారు మంచి నడవడిక గలవారు నిజం పలికేవారు శాంతులు, విన్న వర్ణముల వారు నిర్థనులు కుచేలులు (41) సహవాసము ననుసరించి పోయేవారు. వారిపై దయ గలవారు వేదశాస్త్రము లందు నిశ్చలమైన బుద్ధిగలవారు వల్పగోత్రమందలి ద్విజులకు ప్రవరులు ఐదుగురు (42) భార్గవ చ్యవన ఆప్నువాన ఔర్వ జమ దగ్నితులు. ఈ ఐదుగురు స్రవదులు వీరు బ్రహ్మ స్వరూపులు (43) శాంతులు దాంతులు మశీలులు ధర్మపుత్రులు గలవారు, వేదాధ్యయన పానులు, అన్ని పనులలో సమర్శలు (44) మంచి రూపం కలవారు, సదాచారులు, అన్ని ధర్మములలో నిసగలవారు దాన ధర్మరతులు అందరు అన్నదాతలు జలదానం చేసేవారు. (45) దయాళురు, సుశీలురు, నర్వప్రాణుల పాతం కోరేవారు. కాశ్యవులు బ్రాహ్మణులు ముగ్గురు ప్రవరులు కలవారు (48) త్యావుడు, ఆనవత్పారుడు, వైధ్రువుడు వీరు ముగ్గురు వేదజలు, తెలుపు వర్గం వారు నిసగలవారు యజతారతులు (47) ప్రియమైన వస్త్రధారులు కుహాదక్షులు ఎప్పుడూ గురుభక్తి గలవారు ప్రతి మానము గలవారు అన్ని ప్రాణులందు ప్రేమ గలవారు (48) మహా యజ్ఞముల నాచరిస్తారు. కాశ్యవ వంశమందలి బ్రాహ్మణులు ఇట్టి వారు ధారణ గోత్రజులు ముగ్గురు ప్రవరలతో కూడినవారు (49) అగస్తి దర్విశ్వేతాశ్వ దధ్య వాహనులను వారు ఇందు పుట్టిన వారు ధర్మకర్మల నాశ్రయించిన వారు (50) క్రూర కర్ములు వారందరు తిండిపోతలు, పొడుగాటి చెవులు పెద్దపండ్లు ద్విజులు ధవ వరాయణులు (51) తోవులు ద్వేషం కలవారు అందరికి భయం కల్గించేవారు. లోగాక్ష సగోత్రీకులైన బ్రాహ్మణులు సత్యము పలికేవారు. (52) వారి ప్రవరులు ముగ్గురు. వారు తత్వజ్ఞాన స్వరూపతులు. ఆ ప్రవరులు కశ్యప వత్స వసిష్టులు. (53) సదాచారులు, ప్రసిద్ధులు, వైష్ణవులు, అనేక వృత్తులవారు. ఒంటినిండా రోమములు గలవారు నల్లవి రంగు గల బ్రాహ్మణులు (54) శాంతులు, దాంతులు, మశీలురు, ఎప్పుడు తమ భార్య యందు ఆసక్తి గల వారుకు శికన గోత్ర మందలి వారు ముగ్గురు ప్రవరులు కలవారు (55).
విశ్వామిత్రుడు దేవరాతుడు ఔదలుడు అని ముగ్గురు. ఈ గోత్రమందు పుట్టినవారు దుర్బలులు, దీనమానవులు (58) అబద్దాలనాడే వారు వివ్రులు సురూపులు రాజషులు. అన్ని విద్యలలో ఆరితేరిన వారు బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలవారు (57) ఉపమన్యు గోత్రం వారు ముగ్గురు ప్రవరులను కలవారు. వసిష్మడు భరద్వాజుడు ఇంద్ర ప్రమదుడను వారు (58) ఈ గోత్రమందలి బ్రాహ్మణులు క్రూరులు, వక్రబుద్ధి గలవారు, దూషించతగిన వారు, ద్వేషించేవారు, తుచ్ఛులు అన్ని సంగ్రహించే లక్షణం కలవారు (59) తగాదాలు పెట్టుటలో సమర్థులు ధనవంతులు అభిమానం గల వారు ఎవ్వడూ దుస న్వభావం గలవారు అట్లాగే చెడు సహవానం కోరేవారు (60) రోగులు దర్బలులు నిర్ణీతవృత్తి లేనివారు. వాత్స్య గోత్రమందలి విప్రులు ఐదు ప్రవరులను కలవారు. (61) భార్గవచ్యవన ఆప్నువాన, జమదగ్ని, ఔర్వులు వారు. ఇందలి బ్రాహ్మణులు లావు పాటివారు బహబుడులు (62) సర్వకర్మలలో నిష్ణాతులు, నర్వ ధర్మములలో నిశ్చలబుద్ధిగలవారు. వేదశాస్త్రార్థ నిపుణులు. యజన యాజనరతులు (63) సదాచారులు గురువులు బుద్ధి ద్వారా (దీర్ఘకాలాన్ని గూర్చి ఆలోచించేవారు) దీర్ఘదర్శులు. వాత్స్యాయన వగోత్రేయులు. ఐదుగురు ప్రవరులు కలవారు (64) భార్గవ చ్యవన ఆప్నువాన ఔర్వ జమదగ్నికులువారు. వూర్వోక్త ప్రవరులే ఈతనికి చెప్పాము. మీరు భారత ! (65) ఈ గోత్రమందు పుట్టిన వారు ఎల్లప్పుడు పాత యజ్ఞం అంటే ఇష్టం కలవారు. లోభులు, క్రోథం కలవారు. చాలా సంతతి కలిగి ఉంటారు (68) స్నాన దానాదు లందు ఆసక్తి కలవారు అన్నీ ఇస్తారు. జితేంద్రియులు. వేల కొలది వాడి కూప తటాకములకు కర్తలు, ప్రతశీలురు గుణజులు, మూర్తులు, వేదాలు వదలిన వారు (67) కౌశిక వంశంలో జన్మించిన వారు ముగ్గురు ప్రవరలు కలవారు. విశ్వామిత్ర అవుమరీ కౌశికులు వారు (68) ఈ గోత్రంలో జన్మించిన వారు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు శాంతులు, వాంతులు, సుశీలురు నర్వధర్మవరులు (89) సంతాన హీనులు, ప్రేమపానులు, తేజోహీనులు, బ్రాహ్మణులు, భారద్వావగోత్రులు ఐదు ప్రవరలు కలవారు (70) ఆంగిరస, బార్హస్పత్య, భారద్వాజ, సైన్యన, గార్గ్య అని వంచ ప్రవరలు కలవారు (71) ఈ గోత్రమందు పుట్టిన బాడబులు ధనవంతులు, శుభమైన వారు వస్త్ర అలంకారములు గలవారు బ్రాహ్మణ భక్తి కలవారు (72) భగవన్ని వేదనమందు ఆసక్తి కలవారు అందరు అన్ని ధర్కర్యము లందు ఆసక్తులు. తాశ్యప గోత్రమందు జన్మించినవారు ముగ్గురు ప్రవరులు కలవారు (73) కాశ్యవ అవతార రైబ్యుల ముగ్గురు ప్రసిద్ధులు. ఈ గోత్రమందు పుట్టిన వివ్రులు రక్తాక్షులు క్రూరదృష్మలు (74) జిహ్వచాపల్యము కలవారు వారంతా వారంతా వరమార్థ చింత కలవారు ధనహీనులు రోగులు దొంగతనము అబద్ధమాడేవారు (75) అందరు శాస్త్రార్థము తెలిసినవారు, వేదము న్కృతులు దీనిని వదలినవారు శునక గోత్రమందు బుట్టినవారు వివ్రులు, ధ్యాన పరాయణులు (78) తపస్వులు యోగులు వేదవేదాంగ పారగులు (781/2).
సాధువులు, సదాచారులు, విష్ణుభక్తి పరాయణులు (77) పొట్టి శరీరము కలవారు. భిన్న వర్ణముల వారు అనేక మంది భార్యలు కలవారు బ్రాహ్మణోత్తములు. దయాళువులు. సరళ స్వభావులు శాంతులు, భగవన్నివేదపరులు (78) కౌసకన మందు పుట్టిన వారు మూడు ప్రవరుల గలవారు భార్గవ శాన హోత్ర రత్స్య ప్రమదుడు అనువారు ముగ్గురు (79) ఈ వంశ మందు పుట్టిన బాడబులు, దుస్పహలు ఓ రాజ! చాలా గర్వం కలవారు, మహాకాయులు, మదోద్దతులు, పొడగరులు (80) దుఃఖించేవారు, నలుపు రంగు వారు సర్వశాస్త్ర విశారదులు, బాగా భోంచేసేవారు, మాసవంతులు, సమర్థులు రాగ ద్వేషములను విడిచినట్లుంటారు (81) మంచి వస్త్రములు, భూషణములు, రూపము గలవారు, బ్రహ్మను గూర్చి వాదించే బ్రాహ్మణులు వసిష్ఠ గోత్రమందు పుట్టిన వారు ముగ్గురు ప్రవరులను గలవారు (82) వృషుడు, భారద్వాజుడు, ఇంద్ర ప్రమదుడు. ఈ గోత్రమందు పుట్టిన బ్రాహ్మణులు వేదవేదాంగ పారగులు (83) దళితులు, యజ్ఞశీలుడు, పువ్వరం కలవారు, ముఖవంతులు ద్వేషం కలవారు, ధనవంతులు సంతాన వంతులు, గుణవంతులు (84) విశాల హృదయులు, శూరులు, శత్రు సంహారతులు గౌతమ సగోత్ర మందు పుట్టినవారి ప్రవరులు ఐదుగురు (85) కౌత్స్యగార్గ్య ఉమవాహ, అసిత, దేవలులు ఈ గోత్రమందు పుట్టిన వారు పరమ పావనమైన వివ్రులు (86) అందరు పరోపకారులు బ్రతినతి పరాయణులు, దొంగ జపం చేసేవారు, తుటిలులు, మోసపు వృత్తి గలవారు (87) నానా శాస్త్రార్థములందు నిపుణులు, నానాభరములతో అలంకృతులు, చెట్లు మొదలగు పనులలో కుశలులు. దీర్ఘరోషం కలవారు రోగులు (88) ఆంగిరస గోత్రమందు జన్మించిన వారు ముగ్గురు ప్రవరులను గలవారు. అంగీరస, అంబరీష యావనాశ్వులు (89) ఈ గోత్రమందు జన్మించిన వారు సత్యం మాట్లాడేవారు, జితేంద్రియులు మంచి రూపం కలవారు, అల్పాహారులు, శుభమైన ముఖం కలవారు (90) మహావ్రతము కలవారు, పురాణాలు, మహాదాన పరాయణులు, దోషరహితులు, లోభం కలవారు, వేదాధ్యయన తత్పరులు (91) దీర్ఘ దర్శులు, మహాతేజస్సంపన్నులు, మహామాయతో మోహమందిన వారు. శాండిలస గోత్రము వారు, ప్రవరత్రయము కలవారు (92) అసితుడు, దేవలుడు, శాండిలుడు ఈ గోత్ర మందలివారు అదృష్ట శాలులు, పొట్టివారు బ్రాహ్మణ శైషులు (93) నేత్ర రోగం కలవారు, మహా దుష్కలు, మహాత్యాగులు, ఆయుష్య హీనులుతగాదాలు కల్పించుటలో నమర్శలు, అన్నిటిని సంగ్రహించే ఆసక్తి కలవారు (94) మలిన స్వభావులు అభిమానం గలవారు, జ్యోతికశాస్త్ర విశారదులు. ఆత్రేయ నగోత్రమందలి వారు వంచప్రవరలుకలవారు (95)
ఆత్రేయ, ఆర్చనాసన, శ్యావాశ్వ, అంగిరన అత్రులు ఈ వంశమందు పుట్టిన బ్రాహ్మణులు నూర్యవర్చస్సు గలవారు (96) అందరు చంద్రుని వలె చల్లని వారు ధర్మారణ్యమందున్నారు. సదాచారులు మహాదక్షులు శ్రుతి శాస్త్ర పరాయణులు (97) దళితులు, శుభాచారులు, నత్యశాచ వరాయణులు, ధరలు దానశీలురు విరలులు మహా ఉత్సాహం కలవారు (98) తపః స్వాధ్యాయనిరతులు వ్యాయ ధర్మపరాయణులు (99) యుధిష్ఠిరుని వచనము - ఓ మహాబాహం, ధర్మారణ్య కథామృతమును చెప్పండి. దానిని వింటే వరమైన వధపావము నుండి ముక్తులౌతారు. (100) వ్యాసునివచనము - ఓ రాజ! చాలా దుర్లభమైన ఈ కథను చెప్తాను, విను. (101) యక్షులు రాక్షసులు పిశాచాదులు, బ్రాహ్మణులను బాధ పెడున్నారు. ధరారణ్యం సమీపంలో జృంభరుడను యక్షుడుండేవాడు. (102) వాడు ధర్మారణ్య మందు నివసించిన వారిని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడు. పిదప బ్రాహ్మణులు దేవతలకు నివేదించారు. (103) ఓ దేవతలార! మేము యక్షులు రాక్షసులతో అవమానింప బడ్డాము. వారి భయంతో ఈవేళ ఈ ఉత్తమమైన స్థానాన్ని వదలి పెడ్తున్నాము. అనుమానం లేదు. (104) అనగా అప్పుడు దేవతలు గంధర్వులు అక్కడ ఆ ప్రదేశంలోనిదులను, వర యోగినులను శ్రీ మాతృప్రభృతులను స్థాపించారు (105) బ్రాహ్మణుల రక్షణ కొరకు, లోకము లక్షనము కొరకు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క యోగినిని అప్పుడు స్థాపించారు (106) ఏ గోత్రమును ఏ శక్తి రక్షించగలదో ఏ శక్తి పాలించటంలోన మర్థురాలో, ఆ గోత్రమునకు ఆమె కులదేవత అని అక్కడ ఏర్పడింది. (107)
శ్రీమాత, తారణి, దేవి, ఆశాపూరి, గోత్రవ, ఇచ్చా ఆర్తినాశిని, పిప్పలి, తారవశ (108) జగన్మాత, మహామాత, సిద్ధ, భట్టారిక, కదంబ, వికారమీత, సువర్ణవసుజ, (109) మాతంగి, మహాదేవి, వాణి, ముకుటేశ్వరి, భద్రి, మహాశక్తిసం హారి, మహాబల (110) చాముండ, మహాదేవీరు ఆయూగోత్రములమాతలు, బ్రహ్మవిష్ణు మహేశాదులు అక్కడ రక్షణ కొరకు వారినుంచారు (111) వారిని స్వధర్మనిరతులైన బ్రాహ్మణశ్రేష్ఠులు ఎల్లప్పుడూ పూజిస్తారు. వాటి నుండి యోగినులు తమ తమ కాలమందు చక్కగా రక్షించగా (112) బాబులు, పుత్రపౌత్రులతో కూడ క్షేమంగా ఉన్నారు. ఆ పిదప దేవతలు, గంధర్వులు హర్ష నిర్భరమానములై, మంచి విమానముల నెక్కి అమృతాశనులు న్వర్గమునకు వెళ్ళారు. (113) ఓ రాజ! నూరు సంవత్సరాలు గడిచాక బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, జ్ఞావకం వచ్చి కుతూహలముతో ధర్మారణ్య ప్రేక్షణ కొరకు (114) వచ్చారు. అప్పుడు ప్రభాతమందు సూర్యుడు ఉదయించాక విమానముల నధిరోహించి, అప్సరస, గణములు సేవిస్తుండగా, (115) గంధర్వులు గానం చేస్తుండగా వైతాళికులు పొగడుతుండగా వారోచ్చారు. ఓ రాజ! ఆధర్మారణ్యంలో ద్విజులు, నమిధలు, పూలు,కుశలు, (116) అనేకము తెచ్చే కొరకు ఆ ఆశ్రమములను వదలి అందరు,తలోదిక్కు వెళ్ళారు మహేశ్వరుడు,మాన్యమైన ఆ ఆశ్రమ ప్రాంతాన్ని చూచి (117) ధర్మజుడై ఇట్లా అన్నాడు. ఓ విభ! బాడబులు కష్టపడుతున్నారు. వారి శుశ్రూష కొరకు శుశ్రూష చేసే వారిని కల్పించాలి. అని నా అభిప్రాయము. (118) శంభువు మాటను దేవదేవుడైన జనార్దనుడు విని సత్యము సత్యము అని వలికి బ్రహ్మతో ఇట్లా అన్నోడు (119) ఓ బ్రహ్మ బ్రాహ్మణులను శుశ్రూష కొరకు ఎవరినైనా కల్పించు అని. ఈ వాటికి సృష్ఠి శాశ్వతమైనది. బ్రాహ్మణ సమూహములు ఆనందిస్తాయి సుఖిస్తాయి. అనగా విష్ణువు వాక్య మునుని లోక పితామహడు బ్రహ్మ (120) కామధేనువును స్మరించాడు. స్మరించినంతలో ఆ క్షణంలోనే అక్కడికి ఆ ఆవు వచ్చింది, పవిత్రమైన ధర్మారణ్యానికి (121) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందుపూర్వార్థ మందు ధర్మారణ్య మాహాత్మ్య మందు గోత్ర దేవకథన మనునది తొమ్మిదవ అధ్యాయము.
