స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
33వ అధ్యాయము
రాముడిట్లన్నాడు - శ్రీ మాత వచన ప్రకారము నేను జీర్ణోద్ధారము చేస్తాను. నాకు ఆజ్ఞనివ్వండి. మీకు తగిన విధముగా దానమిస్తాను. (1) ద్విజులు ఉత్తమ యజ్ఞమును చేసి యోగ్యువలు దానమును ఇవ్వాలి. అపాత్రునకు ఏ కొంచెము ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చినా అది సుఖకారికాదు (2) సుపాత్రదానము నావ వలె ఉభయులను ఎల్లప్పుడు తరింప చేస్తుంది. సుపాత్రదానము లోహ పిండముతో సమానమైనది. పగిలిపోయేది (3) ద్విజులార! జాతి మాత్రం చేత వివ్రత్వము కలుగదు. లోకంలో క్రియ బలమైనది క్రియహీనునకు ఫలితంలేదు (4) అందువల్ల పూజ్యతములైన సత్యవాదులైన బ్రాహ్మణులను పూజించాలి. యజ్ఞకార్యము సంభవిస్తే ఎప్పుడు దయ చూపండి (5) బ్రహ్మఇట్లన్నాడు - పిదప అందరు కలిసి పరస్పరము ఆలోచించుకొని కొందరప్పుడిట్లన్నారు. రామ! మేము శిల ఉంచ వృత్తితో జీవించే వారము (6) వరమైన సంతోషమును పొంది ఉన్నాము. ధర్మపరాయణులము. దానం స్వీకరించటం వల్ల మాకేలాంటి ప్రయోజనం లేదు(7) దశ సూనములతో సమానమైంది చక్రి (పాపము) పది పాపములతో సమానమైంది ధ్వజము. (కల్లమ్మేవాడు) పది ధ్వజములతో సమానమైంది వేశ్య. పదిమంది వేశ్యలతో సమానమైనవాడు రాజు (8) రాజు దగ్గర దానం గ్రహించుట మహా వరము. ఓ రామ! ఇది నిజము. అనుమానం లేదు. అందువల్ల మేము భయం కల్గించే ప్రతి గ్రహమును ఇష్టవడము (9) ఏకాహి ద్విజులు కొందరు (ఒకనాటి వ్రతం) కొందరు అయాచిత వృత్తి గలవారు. కొందరు ద్విజులు చిన్న జాడెడు (వంటకుండ) ధాన్యంతో జీవించేవారు. కొందరు షట్కర్మ తత్పరులు (10) అందరు త్రిమూర్తులచే స్థాపించబడ్డ వారే పృధక భావము, గుణములు కలవారు. కొందరిట్లా అంటారు, త్రిమూర్తుల ఆజ్ఞ లేకుండ మేము (11) దాన స్వీకారమును ఎట్లా చేస్తాము. శ్రీ కృతమైన తాంబూలమును తినము. దానంతో వచ్చిన ఆహారమును తినము (12) అప్పుడు రాముడు వసిష్ఠునితో విమర్శించి గురువుతో కూడి బ్రహ్మవిష్ణు శివాదులను స్మరించాడు (13) స్మరించిన మాత్రం చేత ఆ దేవతలు ఆ ప్రాంతమునకు వచ్చారు. కోటి సూర్యులతో సమానమైన కాంతి గల విమానములతో కూడి వచ్చారు (14) వారిని రాముడు తగినట్లుగా పూజించాడు. పరమానందంతో రాముడు అతి సుబుద్ధి మంతుడు ఆ విషయాన్నంతా వారికి నివేదించాడు (15) అధి దేవత వచనం ప్రకారము నేను జీర్ణోద్దారము చేయదలిచాను. ధర్మారత్యా మందు హరిక్షేత్ర మందు ధర్మకవ సమీపంలో చేయదలిచాను (16) అప్పుడు ఆ బ్రాహ్మణులందరు త్రిమూర్తులకు నమస్కరించి గొప్ప ఆనందంతో నిండినవారై కోరికలు నెరవేరి (17) అర్ఘ్య పాద్యాది విధులతో శ్రద్ధతో, వారిని పూజించారు. క్షణం సేపు విశ్రాంతి పొంది ఆ బ్రహ్మ విష్ణు శివాది దేవతలు (18) మహాశక్తి మంతుడు వినయంతో చేతులు జోడించిన వాడు ఐన రామునితో ఇట్లన్నారు (19)
దేవతలిట్లన్నారు. దేవతల కపకారం చేసే రావణాదులను నీవు చంపావు. ఓ రామ! భాను వంశ విభూషణ! దానితో మేము అందరము సంతసించాము(20) మహాస్థానమును ఉద్ధరించి గొప్ప కీర్తిని పొందు (21) వారి ఆజ్ఞను పొంది ఆనందించి ఆ దశరథాత్మజుడు జీర్ణోద్ధారణ మందు అనంత గుణ ఫలమును కోరుకొని ఆరాజు (22) దేవతల సన్నిధి యందు వారి కార్యారంభమును చేశాడు. మహా పర్వతముతో సమానమైన శుభమైన శండిలమును పూర్వభాగంలో చేసి (23) దాని పైన బహిః శాలలు అనేక మైన గృహ శాలలు అనేకమైన బ్రహ్మ శాలలు అందమైన ఆకారములతో నిర్మింపచేశాడు (24) నిధానములతో కూడినవి గృహోపకరణములతో కూడినవి. కోట్లకొలది బంగారముతో నిండినవి, ధనవస్త్రాదులతో నిండినవి (25) ధనధాన్యములతో సమృద్ధమైనవి. అట్లాగే సర్వధాతువులతో కూడినవి. ఇవన్నీ ఏర్పరచి అప్పుడు వాటిని బ్రాహ్మణులకు ఇచ్చాడు (26) ఒక్కొక్కరికి పాలిచ్చే గోవులను నూరేసి ఇచ్చాడు. నాలుగు వేల నాలుగు గ్రామములను (27) వేదవిద్య నెరిగిన ద్విజులకు బ్రాహ్మణులకు దశరథాత్మజుడైన రాముడిచ్చాడు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురితో ఏర్పరుచబడిన బ్రాహ్మణులు వారు (28) అందువల్ల త్రయివిద్య అని లోకంలో కీర్తి వచ్చింది. ఈ విధముగా బ్రాహ్మణులకు మహాద్భుతమైన దానమును ఆతడిచ్చి. (29) ఆ రోజు తనను కృతకృత్యునిగా భావించాడు. బ్రహ్మతో విష్ణువుతో శంకరునితో ఇది వరలో ఎవరు స్థాపింపబడ్డారో (30) వారు జీర్ణోద్ధారం జరిగాక రామునితో పూజింపబడ్డారు. ముప్పది ఆరువేలమంది గోభుజులైన ఏ వణిక్ వరులున్నారో (పాలకులు) (31) వారిని, శుశ్రూష కొరకు హరిహరాదులైన దేవతలు ఇచ్చారు. శర్వుడు ఆనందపడి వారికి చేతనత్వం కల్పించాడు (32) తెల్లని గుణములు చామరములు, నిర్మలమైన ఖడ్గము వారికిచ్చాడు. వారు ద్విజ శుశ్రూష కొరకు అప్పుడు మేల్కొలుప బడ్డారు. (33) వివాహాదులండు. ఎప్పుడూ చామరము లుండాలి. అవి మంగళకరమైనవి. శ్రేష్టమైనవి. నా చిహ్నమైన చేతియందున్న శుభమైన ఖరాన్ని అప్పుడు ధరించాలి (34) గురుపూజను ఎల్లప్పుడు చేయాలి. కులదేవత పూజ మళ్ళీమళ్ళీ చేయాలి. వృద్ధి ఆగమములు వస్తే దక్షిణ వృద్ధిగా ఇవ్వాలి. (35) బ్రాహ్మణునకు ఏకాదశి రోజున శనివారమందు దానమివ్వాలి. నా ఆజ్ఞ ప్రకారము బాలవృద్ధులకు ఇవ్వాలి (36) మండలములందు శుద్రులైన వణిక్ వృత్తి యందున్న ఇతరులున్నారో వారు రామశానన పాలకులుగా లక్ష పాతికమంది ఏర్పరచబడ్డారు (37) వారిని మాండలీకులని అన్నారు. వారు రాజులు, మండలేశ్వరులు. వణిక్ శ్రేష్ఠులు ద్విజ శుశ్రూష కోరకు రామునిచే ఇవ్వబడ్డారు.
రాముడు రెండు చామరములను ఒక ఖడ్గమును ఇచ్చాడు. ప్రతిష్ఠా వీధి పూర్వకముగా కులస్వామిని సూర్యుని ఇచ్చాడు (39) చతుర్వేదములతో కూడిన బ్రహ్మను స్థాపించాడు. మహాశక్తిని శ్రీ మాతకు, అట్లాగే శూన్యమునకు స్వామియైన హరిని స్థాపించాడు (40) విఘ్నములను నశింపచేసే కొరకు ద్వారమందున్న గణపతిని స్థాపించాడు. అట్లాగే దేవతలను కూడా స్థాపించాడు. (41) వీరుడు ఏడు అంశములు గల మేడలను ఏర్పరచాడు. మంగల పూర్వకముగా ఏ పనిచేసినా (42) కొడుకు పుట్టినప్పుడు జాతకర్మ, ఆన్నప్రాశనన, పుట్టు వెంట్రుకలు, లక్ష హోమము, కొంచెం దానం చేసినా, ధాన్యముగాని ఇచ్చినా (44) వస్త్రములు, ధేనువులు, బంగారు, వెండి ఇచ్చినా, బ్రాహ్మణులకు శూద్రులకు దీనులకు అనాథలకు గుడ్డివారికి ఇచ్చినా (45) మొదట బకులార్కువట పిదప శ్రీమాతకు ఇవ్వాలి వరులు. నిర్విఘ్న కార్య సిద్ధి కొరకు నిరంతరము భాగమివ్వాలి (46) నా మాటనతిక్రమించి మరో రకంగా చేసే నరుని ఆ కర్మకు విఘ్న మేర్పడుతుంది, అనుమానము లేదు (47) పలికి రాముడు పందించిన మనస్సులో దేవతలకు ఐవులను, అందమైన ప్రాకారములమ (48) దుర్గ ఉపకరణములతో కూడిన వానివి, విశాలమైన రాజవీధులను, కుండములను, సరస్సులను, కొలనులను ఏర్పరచాడు. (49) ధర్మవాపులను, కాపులనుమ, అట్లాగే ఇతరమైన దేవ నిర్మాణములను అందమైన థర్మారణ్యంలో ఏర్పరచాడు.(50) వేద విద్య గలిగిన ముఖ్యులకు మిక్కిలి శ్రద్ధతో, ఇవి ఏర్పరచి ఇచ్చాడు. రాగి రేకు యందున్న రామ శాసనాన్ని ఎవరు నశింపచేస్తారో (61) వారి పూర్వలు నరకంలో పడిపోతారు. భవిష్యత్తులో వారికి సంతతి కలుగదు. వాయుపుత్రుని పిలిచి పిదప రాముడు ఇట్టన్నాడు (52) ఓ వాయుపుత్ర! మహావీర ! నీకు పూజ ఏర్పడుతుంది. ఈ క్షేత్ర రక్షణ కొరకు నీవిక్కడ ఉండు (53) ఆంజనేయుడు ఆ వాక్యమును నమస్కరించి శిరసా వహించాడు. ఈ విధముగా జీర్ణోద్ధారము చేసి అప్పుడు కృతకృత్యుడైనాడు (54) అప్పుడు శ్రీ మాతను పూజించి ప్రసన్నమైన మనస్సుతో, శ్రీమాతకు నమస్కరించి, రాఘవుడు ఇతర తీర్థములను నమస్కరించాడు (55) ఆ దేవతలంతా బ్రహ్మను ముందుంచుకొని తమ తమ స్థానములకు వెళ్ళారు. (58) నీవు కోరినది నెరవేరుతుంది అని రాముని ఆశీర్వదించాడు. విప్రుల స్థావన మొదలగునవి. ఓ రామ! బాగా చేశావు (57) పుణ్యవంతుడవైన నీవు మాకు దయగలిగేట్టు చేశావు. అని స్తుతిస్తూ ఆ దేవతలు తమ స్థానములకు వెళ్ళారు (58) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు వూర్వార్థమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు శ్రీరామ చంద్రుడు పురమునకు తిరిగి వచ్చుట అనునది ముప్పది మూడవ అధ్యాయము.
