స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
32వ అధ్యాయము
వ్యాసులిట్లన్నారు - ఆ పిదప రాముని దూతలు రామునకు నమస్కరించి ఇట్లన్నారు ఓ రామ! మహాబాహు ఉత్తమ స్త్రీ, శుభ ఆనన (1) మంచి వస్త్రములు భూషణములు ఆభరణములు గలది, మృదువాక్యముల పల్కునది, ఒంటరిది, దుఃఖిస్తున్నది అట్టి ఆమెను చూచి మేము ఆశ్చర్య పోయాము (2) మేము దగ్గరగా వెళ్ళి ఆ సురసుందరిని అడిగాము. ఓ దేవి! నీవెవరు. దేవతా స్త్రీవా, దానవ స్త్రీవా, ఓ వరారోహ! (3) ఓ దేవి! రాముడు నీ గూర్చి అడుగుతున్నాడు ఉన్నదున్నట్లుగా అంతా చెప్పు అని, దానిని విని ఆమే మధురమైన వాక్కులతో ఇట్లా అంది (4), మీకు క్షేమం కలగని. నా అధికమైన దుఖాన్ని తొలగించగల రాముణ్ణి పంపండి, అని (5) దానిని విని రాముడు తొందరగా త్వరగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. దుఃఖ సంతురాలైన ఆమెను చూచి రాముడు స్వయంగా దుఃఖితుడైనాడు. అప్పుడు రాముడు చేతులు జోడించి ఇట్లా పలికాడు (6) రాముని వచనము - ఓ శుభే! నీవెవరవు ఎవని భార్యవు. ఎవరిచేత తిరస్కరింపబడి నిర్జన ప్రదేశంలో వదిలి పెట్టబడ్డావు. నీ ధనాన్నీ ఎవరవహరించారు ఓ తల్లి! అదంతా నాకు, చెప్పు (7) అని పలికి ప్రతి మంత్రులలో శ్రేష్ఠుడు రాముడు అతి దుఃఖితుడై మరోచక్రపాణి వలె దండము వలె ప్రణామ మాచరించాడు (8) ఆమె రామునకు నమస్కరించింది. రాముడు తిరిగి ఆమెకు నమస్కరించాడు. మిక్కిలి ప్రీతితో ఆనందించిన ఆమె మధురమైన వాక్కులతో అతనిని స్తుతించింది (9) ఓ పరమాత్మ పరఈశాన, దుఃఖహారి, సనాతన, నీవెందుకవతరించావో ఆ కార్యాన్ని నీవు నిర్వర్తించావు (10) రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ప్రముఖులు, ఖరదూషణ త్రిశిరులు మారీచుడు అక్షయ కుమారుడు. (11) అసంఖ్యాకులైన రౌద్రులైన రాక్షసులు యుద్ధంలో నీతో జయించబడ్డారు. (12) ఓ లోకేశ! నీ మంచి కీర్తిని ఈ వేళ ఏం చెప్పాలి. బ్రహ్మ నీ అంగం నుండి పుట్టిన పద్మం నుండి జన్మించాడు. ఆ పిదప నీవు ఉంచిన విశ్వాన్ని చూచాడు. వటపత్ర మందు బాలకుడెట్టా ఉన్నాడో చూచాడు. (13) లోకంలో దశరథుడు ధన్యుడు. నీ తల్లి కౌసల్య ధన్యురాలు. వారికి నీవు పరమ పురుషునిగా పుట్టావు గదా ఓ గోవింద, జగదీశ (14) ఏ కులంలో నీవు జన్మించావో ఆ కులం ధన్యమైంది. అయోధ్య ధన్యమైంది. నిన్నాశ్రయించిన లోకం ధన్యమైంది (15) ఆ వాల్మీకి ధన్యుడైనాడు. ఆతడు రామాయణం వ్రాశాడు కదా. ఆత్మబుద్ధితో కవి వి ప్రముఖ్యుల కొరకు, రానటువంటి (జరగబోయే) రామాయణం వ్రాశాడు. (16) నీవల్ల ఈ కులము పవిత్రం చేయబడింది, ఓ దేవ (17) లోకమంతా నిన్ను రాజు అని అనుకుంటుంది. నీవు స్వయంగా విష్ణ్వంశవు. రమణీయమైన గుణములతో నీవు స్వయంగా విష్ణువు.ఏదో ఒక లోక ప్రయోజనాన్ని ఆలోచించి, అవతరించి దాన్ని ఇక్కడ నిర్వర్తించే నీకు ఓ వత్స! విఘ్నము లేకుండుగాక (18).
వాక్కులతో రాముని స్తుతించి, నీవు ఇప్పుడు నాథుడవై ఉండగా నేను చాలా కాలము శూన్యంగా ఉన్నాను. దోషం ఎట్లాగుందో అట్లాగే ఉంది. (19) ధర్మారణ్య క్షేత్రమునకు నేను అధి దేవతను పన్నెండు సంవత్సరాలు గడిచాయి. నేను దు: ఖిస్తునే ఉన్నాను. (20) ఇదంతా నిర్జనము ఓ మహామతి! దీనిని ఉద్ధరించు ఓ రామ! లోహాసురుని భయం వల్ల విప్రులందరు పది దిక్కులకు (21) వెళ్ళిపోయారు. వణిజులందరు చాలా దుఃఖితులై యథా స్థానములకు వెళ్ళారు. ఓ రామ! ఘోరభయంకరుడైన ఆ రాక్షసుని దేవతలు చంపారు (22) మహామాయ, దురాధరుడు, దురత్యయుడు ఆ రాక్షసుడు దీన్ని ఆక్రమించి ఉన్నాడు. భయంతో అతి శంకితులై ఆ జనులు తిరిగి రావటం లేదు (23) ఇప్పటికి వన్నెండు సంవత్సరాల నుండి ఇది శూన్యాలయము. నేను అనాథవలే ఉన్నాను. నా కొలను యందు జనులు స్నానదానము లాచరించేవారు (24) అట్టి దానిలో ఓ రామ! ఇప్పుడు పందులు పడున్నాయి. భర్తలతో కూడి స్త్రీలు జలక్రీడా పరాయణులయ్యేవారు ఈ కొలనులో (25) అక్కడ జలాశయంలో దున్నపోతులు వస్తున్నాయి. ఆడు కుంటున్నాయి. మంచి పుష్పముల సమూహము ఎక్కువగా ఇది వరలో ఉన్న ఈ చోట (26) ఇప్పుడు సింహ వ్యాఘ్రములతో కూడి ముండ్ల చెట్లతో త్రోవ అడ్డగించ బడుతోంది. ఎక్కడైతే పిల్లలు నిరంతరం ఆడుతున్నారో (27) ఆడపిల్లలు (వులిఆట) (చిత్త) చిత్రకమనే ఆట ఆడేవారో, ఎక్కడ బ్రాహ్మణులు నిరంతరము వేదగానం చేశారో (28) అక్కడ ఈ వేళ అతి భయంకరమైన నక్క కూతలు విన్పిస్తున్నాయి. ఎక్కడ అగ్నిహోత్ర ధూమము ప్రతి ఇంట్లో ఇదివరలో కన్పించేదో (29) అక్కడ ఈ వేళ ఎక్కువగా మిక్కిలిగా పొగతో కూడిన దావాగ్ని కన్పిస్తోంది. ఎక్కడ బ్రాహ్మణుల ఎదుట నర్తకులు ఆనందంతో నాట్యం చేసేవారో (30) అక్కడే ఈ వేళ భూత భేతాళములు ప్రేతములు మోహంతో నాట్యం చేస్తున్నాయి. మంత్ర (రాజకీయం) తత్పరులై ఏ సభలో రాజులు కూర్చునేవారో (31) ఆ స్థానంలో ఈ వేళ గవయమృగములు, ఎలుగుబంట్లు, ఏడు పందులు కూర్చుంటున్నాయి. ఎక్కడ బ్రాహ్మణుల, వణిజుల ఆ వానములుండేవో (32) అక్కడ రాతి గోడలలో బిలములు కన్పిస్తున్నాయి. వృక్షముల కోటరములు ఇక్కడ అంతటా గవాక్షములలో ఉన్నాయి (33) నాల్గు మూలల యజ్ఞవేదిక ఇదివరలో చాలా ఎత్తుగా ఇక్కడ ఉండేది. అక్కడ ఈ వేళ పాముల వుట్టలతో నిండిపోయి కన్పిస్తున్నాయి (34) ఓ నృపోత్తమ! రామ! నా నివాసము ఇలా ఉందని తెలుసుకో. బ్రాహ్మణులు నివాసం కొరకు విడిచి వెళ్ళిన ఈ ప్రదేశము అంతా శూన్యంగా ఉంది (35) అందువల్ల వారు చాలా దుఃఖం కలుతోంది. అందువల్ల ఓ నరేశ్వర! నన్ను రక్షించు అనగా దీనిని విని రాముడు మాటకారి రాముడు ఇట్లా అన్నాడు (38).
శ్రీరాముని వచనము - నాల్గు దిక్కులకు వెళ్ళిన నీ బ్రాహ్మణులను నేను గుర్తెరుగను. వారెంతమందో నాకు తెలియదు, ఆ బ్రాహ్మణుల నామ గోత్రములు నాకు తెలియదు (37) ఎట్లా గుర్తించాలో గోత్రమేమిటో ఉన్నదున్నట్లు తెలువుము. అక్కడి నుండి వారందరిని తీసుకొని వచ్చి తమ తమ స్థానములందు వారిని ఉంచుతాను (38) అనగా శ్రీ మాత ఇట్లా అంది. - ఓ నరేశ్వర! విష్ణు బ్రహ్మ మహేశ్వరులతో ఏ బ్రాహ్మణులు స్థాపించబడ్డారో వారు పదునెనిమిది వేలు బ్రాహ్మణులు, వేదపారగులు (39) ఈ లోకమందు వేద విద్య యందు వారు ప్రసిద్ధులు, ఓ అమిత ద్యుతి గల రామ! అరువది నాలుగు గోత్రముల బ్రాహ్మణులు ఎవరైతే ప్రతిష్ఠింప బడ్డారో (40) వారికి శ్రీమాత త్రయి విద్యను ఇచ్చింది. ధర్మ పరాయణులైన వైశ్యులు ముప్పది ఆరువేలు ఏర్పరుచ బడ్డారు (41) వారు మంచి నడవడిక గలవారు. బ్రాహ్మణుల కుటాష యందు ఆసక్తి కలవారు. బహులార్కుడను రాజు తన పేరుతో సహా వెలిగి పోతున్నాడు (42) అశ్విని కుమారులు దేవతలు, కుబేరుడు ఖర్చును నింపేవాడు. నేను అధిష్ఠాత్రిని. నన్ను భట్టారిక అని అంటారు (43) శ్రీ సూతులిట్లన్నారు - కొందరు స్థానాచారులు, కొందరు కులాచారులు. శ్రీ రాముని ఎదుట పురాతనమైన దీనిని శ్రీమాత అంతా చెప్పింది. (44) అమె మాటను విని రాముడు ఆనందాన్ని పొందాడు. నిజము నిజము మరి మరి నిజము నీవు నిజం చెప్పాను. (45) నీవు నిజం చెప్పావు కనుక ఆ పేరుతో నే శుభమైన నగరము ఏర్పడుతుంది. ఓ జగన్మాత! ఆ సత్య మందిరంలో నిన్ను వసింపచేస్తాను. (46) ఈ ఉత్తమమైన సత్య మందిరము ముల్లోకములలో ఖ్యాతిని పొందని (47) అని పలికి రాముడు నూరువేల కొలది తన భృత్యులను బ్రాహ్మణులను తిరిగి తెచ్చేకొరకు పంపించాడు (48) ఏదేశానికి, ప్రదేశానికి, అడవికి, నదీతీరానికి దగ్గరిచోటికి యధా స్థానమందుగాని గ్రామమందు గాని అక్కడక్కడ గాని (49) ధర్మారణ్య వాసులైన బ్రాహ్మణులు ఎక్కడెక్కడికి వెళ్ళారో వారందరిని అర్ఘ్యపాద్యములతో పూజించి ఇక్కడికి వారిని తీసుకురండి (50) ఇక్కడ నేను బ్రాహ్మణులను ఎప్పుడు చూస్తూ ఉంటానో అప్పుడే భుజిస్తాను (51).
బ్రాహ్మణులను అవమానించి ఎవరు వస్తారో ఆతనిని నేను చంపుతాను. శిక్షిస్తాను. నగరం నుండి బయటికి బహిష్కరిస్తాను (52) ఆ దారుణమైన దుః సహమైన దుష్ప్ర ధర్షణమైన మాటను విని రామాజ్ఞాను పాలించే దూతలు అందరు పది దిక్కులకు వెళ్ళారు (53) బ్రాహ్మణుల నంతా వెతికారు. అందరూ లభించారు ఆనందించారు. చెప్పిన ప్రకారము అర్ఘ పాద్వములలో పూజించారు. (54) వినయ ఆచార పూర్వకముగా విది ప్రకారము స్తుతించారు. రాముని మాటను వివరిస్తూ ఆ బ్రాహ్మణుల నందరిని ఆహ్వానించారు. (55) పిదప ఆ బ్రాహ్మణులందరు తమ సేవకులతో కూడి వేద శాస్త్ర పరాయణులైన వారందరు బయల్దేరటానికి ప్రయత్నించారు (56) బహుమన పురస్పరముగా రాముని దగ్గరకు వచ్చారు. వచ్చిన బ్రాహ్మణులను చూచి రాముడు పులకించిన శరీరం కలవాడై (57) దాశరథియైన ఆ రాముడు తనను కృతకృత్యువిగా తలిచాడు. త్వరత్వరగా ఆతడు లేచినాడు. ముందు పదాతి సైన్యం వెళ్ళింది (58) చేతులను జోడించి ఆనంద బాష్పములు వదులుతూ మోకాళ్ళ మీద భూమిపై వంగి ఇట్లా అన్నాడు (59) బ్రాహ్మణుల అనుగ్రహంవల్ల నేను కనులా వరుడను. విప్ర ప్రసాదం వల్ల ధరణీ ధరుడనునేను. బ్రాహ్మణుల అనుగ్రహంవల్ల జగత్పతివి నేను. బ్రాహ్మణుల అనుగ్రహం వల్ల నాకు రాముడనే పేరు (60) అని పలికిన ఆ రాముని మాటలలో ఆ బ్రాహ్మణులు ఆనందపడి జయాశీస్సులతో పూజించి దీర్ఘాయువు కమ్మని పలికారు (61) వారు రామునితో ఆకర్షింపబడి పాద్యము, అర్ఘ్యము, అపనము మొదలగు వానితో గౌరవింపబడిరి. దండములా నమస్కరించి బ్రాహ్మణులను అతడు మతించాడు (62) చేతులు జోడించి నిలబడి వారికి పాదాభి వందనము చేశాడు. విచిత్రమైన ఆసనములను బంగారు ఆభరణాలమ (63) వారికిచ్చాడు. దశరథాతుడైన రాముడు ఉంగరాలు, వస్త్రములు, యజ్ఞోపవీతములు, కర్ణాభరణములు వారికిచ్చాడు (64) రకరకముల రంగులు గల ధేనువులను బ్రాహ్మణముల కిచ్చాడు. ఒక్కొక్క నూరు ఆవులు కుండెడు పాలిచ్చేవి. దూడలు గలనీ ఆట్టి ఆవుల నిచ్చాడు (65) వస్త్రములు కలిగి, మెడలో గంటగలిగి బంగారు కొమ్ములతో అలంకరింపబడ్డవి ఆ ఆవులు, వెండిగిట్టలు, రాగివృషములు గలవి. కాంస్య పాత్రలతో కూడా కూడిన వానివి ఇచ్చాడు (66) అని శ్రీ స్కాంద మహాపురాణముందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మండ మందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రహ్మనారద సంవాదమందు నత్యమందిర స్థావన వర్ణన మనునది ముప్పది రెండవ అధ్యాయము.
