స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
4వ అధ్యాయము
వ్యాసుని వచనము - ఇకముందు ధర్మరాజు చేసిన దానిని చెబుతాను. దానిని వింటే యమ దూతల భయము ఎక్కడా ఉండదు. (1) ధర్మరాజు వర్ధని అను ఆ ఉత్తమ అప్సరసను చూచాడు. మహారణ్యంలో ఈమె ఎవరు. సుందరమైన ఆవయవములు గలది, అతిసుందరి (2) ఈ వనము నిర్మానుషమైనది. సింహ వ్యాఘ్రములలో భయానకమైనది. ఈ పరమాశ్చర్యమును గమనించి ధర్మరాజు ఇట్లా అన్నాడు. (3) ధర్మరాజు వచనము - ఓ మానిని ఎందువల్ల ఒంటరిగా జనములేని అడవిలో తిరుగుతున్నావు. ఎక్కడి నుండి వచ్చావు. ఓ సుశోభన! నీవెవరి భార్యవు (4) ఓ సుందరమైన ఊరువులు గలదాన! నీవెవరి కూతురవు.ఓ శుభ నీవు అతిరూపవతివి. మనుష్యస్త్రీవా, గంధర్వస్త్రీవా, దేవతాస్త్రీవా, కిన్నరస్త్రీవా (5) అప్సరసవో కాక పక్షిజాతివా, కాక వనదేవతవా, రాక్షసివా, ఖేచరివాఎవరి భార్యవు అది చెప్పు (6) ఓ సుభ్రు! నాకు సత్యం చెప్పు అని అప్పుడు అర్కనుతుడు అన్నాడు. నీకేం కావాలి ఓభద్ర! నీవిక్కడేం చేయాలి అది చెప్పు (7) ఓ వామోరు! నీవిష్టపడితే నీకు కావలసిన, కోరికనిస్తాను (8) అనగా వర్థని ఇట్లా అంది - ఓ విభు! స్థావర జంగమమంతా ధర్మంలోనే ఉంది. ఆ ధర్కమనేది దుష్కరమైన కర్మ ఓ పుణ్యాత్ముడ! దాన్ని నువ్వెందుకు చేస్తున్నావు. (9) యముని వచనము - ఈశానుని రూపాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాను, ఓ భామీని. అందువల్ల నేను తపస్సు చేస్తున్నాను. పార్వతితో కూడిన శంకరుని చూడదలిచాను (10) కీర్తిని, సుఖాన్ని పొందుతాను. అందుకే ఇట దుష్కరకర్మను చేస్తున్నాను. ప్రతి యుగంలో వారు ఖ్యాతి కలగాలని నా కోరిక (11) వ్రత కల్పమందు, మహాకల్పమందు మళ్ళీ ఖ్యాతి కలగాలని నా కోరిక. ఈ కారణంగానే ఓ సుభ్రు! వరమమైన తపస్సును నేనాచరిస్తున్నాను (12) ఓ భధ్రే! ఎక్కడి నుండి నీ వొచ్చావో ఉన్నదున్నట్లుగా చెప్పు. ఏమివవి, ఎవని కారణంగా వచ్చావు, నిజాన్ని చెప్పు అని అనగా (13) వర్ధని వచనము - నీ తపస్సులోనే ఇంద్రుడు భయభీతుడైనాడు. అతనితో నేను పంపబడ్డాను. ఇక్కడ నీ తపస్సుకు విఘ్నం కల్గించే కొరకు వచ్చాను (14) ఇంద్రావన భయముతో భీతుడై ఇంద్రుడు, నీ సన్నిధికి నన్ను పంపించాడు. ఓ మహాభాగ! నేను సత్యం చెబుతున్నాను (15) అని అంది. సూతుని వచనము - అప్పుడు ఆమె సత్యవాక్యముతో ఆనందించిన యముడు ఆ మహాభాగ్యుడు ఆమెతో ఇట్లా అన్నాడు. నేను నీకు వరమివ్వదలిచాను (18) సర్వ భూతములకు చెడు పనులు చేసే వారికి నేను యముడను. జితాత్ములకు అందరు నరులకు ధర్మరూపుడను (17) ఆట ధర్ముడను నేను. ఓ వరారోహా ! నేడు, దుర్లభమైన వరాన్ని ఇస్తాను. అదంతా నీవు నన్ను త్వరగా అడుగు, ఓ అప్సరనలలో వరమైనదానా! (శ్రేష్ఠం) (18).
వర్ధని వచనము - ఎల్లప్పుడు రమ్యమైన ఇంద్ర స్థానమందు వాడు సుస్థిరత్వాన్ని కళించు. ఓ ధర్మభృతులలో శ్రేషుడ. స్వామీ! లోకముల క్షేమము కొరకు నాకీ వరమివ్వు (19) అనగా యముని వచనము - అట్లాగే కానిమ్మని ఆమెతో అన్నాడు. ఇంకొక వరాన్ని త్వరగా కోరుకో. ఉత్కృష్టమైన వరాన్ని ఇస్తాను. నేను నీ గానంతో సంతుష్టుడనైనాను (20) వర్ధని వచనము - ఈ స్థానమందు, మహాక్షేత్ర మందు ఓ మహామతి! నా పేర ఒక తీర్థము కావాలి. అది అన్ని పాపములను నశింపచేసేది కావాలి. నా పేరుతో ప్రసిద్ధం కావాలి. (21) అక్కడ చేసిన దానము, హోమము, తపము, వతనము అక్షయము కావాలి. వర్ధమాన నరో వరాన్ని ఐదు రాత్రులు సేవించినవారి (22) పూర్వజులు ప్రతిరోజు తర్పణములు ఇవ్వబడి ఆనందించాలి. ఆమెతో ధర్ముడు అట్లాగే అని పలికి నిలబడి మౌనంగా ఉండిపోయాడు. ఆ ధర్మునకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆమె దీవమునకు వెళ్ళింది (23) వర్ధనివచనము - ఓ దేవేశ! భయపడవదు. అర్కసుతుడైన యముని ఈ తపస్పు స్వార్థపరమైనది. ధర్మము కొరకు యశస్సు కొరకు ఆచరిస్తున్నాడు (24) వ్యాస వచనము - వర్ధని, ఆశుభానన, ఆ ఇంద్రునితో పూజింపబడి, మంచిది, మంచిది, ఓ మహాభాగే! నీవు దేవతల కార్యాన్ని చేశావు (25) ఓవరారో ! నీవు నిర్భయురాలవు. నీవు ఎప్పుడు సుఖంగా జీవించు యశస్సు, సౌఖ్యమును రమ్యమైన శ్రియమును నీవు పొందుతావు ఓ శుభాననే ! (28) దేవతలు నిర్భయముగా ఆనందించిన మనస్సులతో అట్లాగే అని ఆమెతో అన్నారు. ఇంద్రునకు నమస్కరించి ఆమె తన శుభమైన స్థానమునకు వెళ్ళిపోయింది. (27) సూతుని వచనము- అప్పరస వెళ్ళి పోయాక ఓ రాజేంద్ర! ధర్ముడు యథావిధిగా ఉన్నాడు. మహాపరమైన, లోకములకు ఉద్వేగాన్ని కల్గించే తపమాచరించాడు. (28) జ్యేష్ఠ మాన మందు సూర్యుడు తపింప చేస్తుండగా పంచాగ్నుల మధ్య, చాలా దుఃనహమైన, దేవతలు కూడా ఆచరించలేని తవసును చేశాడు, ఓరాజ (29) పిదవ నూరు సంవత్సరాల వరకు యముడు మౌనంగా ఉన్నోడు. నూర్ల కొలది వుట్టలతో చుట్టబడి కట్టెవలే ఉన్నాడు (30) అనేక వక్షుల సమూహములు అక్కడ గూళ్ళు కల్పించుకోగా ఆ యముడు కూర్చోగా ఎక్కడా వ్రతము (ప్రతి) కన్పించటం లేదు, ఓరోజ! (31) దేవేశుడు, అనిందితుడు ఐన ఉమావతిని స్మరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు యక్షులు చెదరిన మనసు కలవారై కైలాస శిఖరమునకు శివుని సన్నిధికి తిరిగి వచ్చారు. (32) దేవతల వచనము - ఓ మహాదేవ ! రక్షించు, రక్షించు. ఓ శ్రీకంఠ! జగత్పతి, భూతమునకు భవ్యమునకు (జరుగబోయేది) ఈశుడ, మమ్ములను రక్షించు. ఓ వృషభధ్వజ! మమ్ముల రక్షించు. ఓ కృపానాథ! నీవు దయ గలవాడవు. ఓ శంకర, విన్నం కలగకుండా చూడు (33) ఈశ్వరుని వచనము - దేవతలకు ఎవరు అవకారం చేశారు. ఎవరు దేవతల మావాన్ని మర్దించారు. భూలోకంలో స్వర్గంలో నాగ లోకంలో, ఆలస్యం చేయకుండా, ఎక్కడ అవతారం జరిగిందో త్వరగా చెప్పు (34) ఈ త్రిశూలంతోనే లేదా ఈ కపాలముతోవే లేదా ఈ పాశుపతముతోనే వానిని యుద్ధంలో సంహరిస్తాను. ఇక్కడికెందుకొచ్చారో నాకు త్వరగా చెప్పండి (35) అనగా దేవతల వచనము - ఓ కృపాసింధు! దేవేశ, లోకములకు ఆనందదాయి. ఈ వేళ భయము మనిషి నుండి కాదు, వాగుల నుండి కాదు దేవదానవుల నుండి కాదు (36) ఓ మహాదేవ! భూలోకంలో మహా ఆకృతి గల ప్రేతనాథుడు మహా ఘోరమైన ఆత్మకార్యము నందున్నాడు. అది అతనిని బాధ పెడుతుంది. అనుమానము లేదు (37) గొప్ప తపస్సు ఆచరిస్తూ తనను తానే బాధ పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ కారణముగా ఇక్కడ మేమందరము దేవతలము ఉద్విగ్నంగా ఉన్నాము. ఓ సదాశివ! నిన్ను శరణు వేడాము. ఏం చేయదలిచావో అది చేయి అని అన్నారు (38).
సూతుని వచనము - వృషభమును ఎక్కిన వృషభమును ధ్వజమందు గల దేవతల మాటను విని ఆయుధములు తీసుకొని మనోహరమైన కవచమును ధరించి ధర్మదేవత ఉన్నచోటకి వెళ్ళాడు, శివుడు (39) ఈశ్వరుని వచనము - ఈ నీ తపస్సుతో ఓ ధర్ముడ! నా మనస్సు నంతుష్టమైంది. వరమడుగు, వరమడుగు, వరమడుగు అని అన్నాడు (40) నీ వెటువంటి కోరికలను కోరుతున్నావో, నీ మనసులో ఎటువంటి కోరికలున్నాయో అడుగు. ఓ భద్రుడ! నీవు దేన్ని దేన్ని అడిగితే అవన్నీ నీకిప్పుడిస్తాను. (41) అని సూతుని వచనము - ఇట్లా మాట్లాడుతున్న మహేశ్వరుని, దేవుని చూచి, ఓరాజా! పుట్ట నుండి లేచి చేతులు జోడించి లోకనాథుడు, అరిందముడు ఐన శివుని శుద్ధమైన వాక్కులతో స్తుతించాడు(42) ధర్మరాజు వచనము - ఓ ఈశ్వర నీకు నమస్కారము. యోగరూపి నీకు నమస్కారము. ఓ తేజోరూవ, నీలకంఠ నీకు నమస్కారము. (43) ధ్యానించే వారికి తగిన విధమైన రూపం గలవాడ, భక్తిచే లభించేవార నీకు నమస్కారము. బ్రహ్మరూవ, వినురవే నీకు నమస్కారము (44) సులుడ, సూక్ష్ముడ, అణురూపుడ నీరు నమస్కారము. ఓ కామరూపుడ, సృష్టి స్థితి అంతములను చేసేవాడ నీకు నమస్కారము. (45) నిత్యుడ, సౌమ్యుడ, మృడుడ హరి నీకు నమస్కారము. వేడి వ్వరూపుడ, చల్లని కిరణముల వాడ నీకు నమస్కారము (46) సృష్టిరూపి, లోకపాల నీకు నమస్కారము నీకు నమస్కారము. ఉగ్రుడ, భీముడ, శాంతరూవ నీకు నమస్కారము (47) అనంతరూవ, విశ్వరూప నీకు నమస్కారము. శరీర మందు భన్మము ధరించిన వాడ నీకు నమస్కారము. చంద్ర శేఖర నీకు నమస్కారము. ఐదు ముఖముల వాడ, మూడు కన్నుల వాడ నీకు నమస్కారము, నమస్కారము (48) సర్పము ఆ భరణంగా కలవాడ గోచీని ధరించినవాడ, అంధకుని సంహరించిన వాడ, దక్షుని పావమును తొలగించినవాడ నీకు నమస్కారము కాముని దహించిన వాడ, త్రిపురారి నీకు నమస్కారము, నమస్కారము (49) నేను చెప్పిన ఈ నలుబది నామములను చదివిన వారు శుచియై మూడు కాలములందు చదివిన వారు, విన్నవారు (50) గోహత్య చేసినవారైనా, కృతఘ్నుడైన నురను తాగే వారైనా, గురుతల్పగుడైన, బ్రాహ్మణ హంత ఐన, బంగారపు దొంగ ఐవా శూద్ర ప్రీ భర్తఐనా (51) స్త్రీలను బాలురను చంపే వాడైవా పాపియైన అబద్ధమాడే వాడైనా, అవాచారుడైనా, దొంగయైనా, వరుల భార్యలను పొందేవాడైనా (52) వరులను నిందించేవాడైనా, ద్వేషించేవాడైనా, వృత్తిలో లోపంచేసేవాడైనా, చేయకూడనిది చేసేవాడైనా, చేసిన దాన్ని చెరచేవాడైనా, బ్రహ్మద్వేషి, బ్రాహ్మణాథముడైనా వీరెవరైనా నర్వపాపముల నుండి ముక్తులౌతారు. వారు కైలాసమునకు వెళ్తారు (53).
సూత ఉవాచ -
సూతుని వచనము - ఈ విధముగా అనేక వాక్యములతో ధర్మరాజు మాటి మాటికి స్తుతించి, మహా భక్తితో తలవంచి నమస్కరించగా, వ్వయముగా (54) అప్పుడు శివుడు ఆనందపడ్డాడు. అప్పుడు శుభమైన ఈ మాటను శివుడు వలికాడు. ఓ మహాభాగ! నీ మనసులో ఉన్న వరాన్ని కోరుతో, అవి అనగా (55) యముని వచనము - ఓ దేవేశ! నా మీద దయతలచి నీవు ఆనందుడవైతే, ఓ మహాభాగ, పచారాచరమైన ముల్లోకములలో (58) ఈ స్థానము నా పేరుతో ప్రవర్ధమయ్యేట్టు లోకంలో (దాన్ని) చేయండి. ఛేదించరాని, భేదించరావి వుణ్యము ఇచ్చే పావవాశకముగా (57) ఈ స్థానమును చేయండి. ఓ మహాదేవ! నా వల్ల మీరు సంతుష్టి నందితే. అప్పడు ఓ రాజ! ఆ స్థానము తాళీతుల్యమయ్యేట్టుగా శివుడు వరమిచ్చాడు. ఆవరమిచ్చి, మళ్ళా ఇట్లా అన్నోడు శివుడు. ఓ పత్తముడ! ఇంతో వరాన్ని కోరుతో అవి (58) ధర్మువి వచనము - ఓ దేవేశ! నా మీదదయతలచి సంతుష్టినందితే ఇట్లా చేయండి, ఓ మహాభాగ! వచరాచరమైన ముల్లోములలో, యుగ యుగములలో కీర్తిని పొందేటుగా వరమీయండి (59) అనగా ఈశ్వరుని వచనము - ఓ యమ! నీ కోరికంతా చెప్పు, చేస్తాను. నీ తప్పుతో వేను సంతోషించాను. నీకీప్పితమైన వరాన్ని ఇస్తాను. అని అనగా (80) యముని వచనము - ఓ దేవ ! శంకర! వా వాంఛితమును ఇచ్చేటితే ఈ స్థాన మందు, మహాక్షేత్రమందు ఎల్లప్పుడు నా పేరుతో పనించు (61) ధర్మారణ్యమనే పేరును పచరాచరమైన ముల్లోకములలో కలిగేటుగా చేయి, ఓదేవ, మహేశ్వర (62) అని అనగా ఈశ్వరుని వచనము - యుగ యుగములలో ఎల్లప్పుడూ ధర్మారణ్యమనే పేరుతో ఇది ఖ్యాతిని పొందని ఓదేవ! నీ పేరులో స్థాపించబడి ఇది ఖ్యాతిని పొందుతుంది. ఇంకా ఇంకేదైనా ఏ కొంచెం ఉన్నాదాన్ని చెప్పు. దాన్ని కూడా చేస్తాను అనగా (63) యముని వచనము - రెండు యోజనముల విస్తీర్ణము గలిగి నా పేరుతో ఉత్తమమైన తీర్థము కావాలి. అది ముక్తికి స్థానము, శాశ్వతము సర్వదేహులను పవిత్రీకరించేది తావాలి (64) ఈగలు, పురుగులు, పశు పక్షి (చిలుకాదులు) మృగాదులు, పక్షులు (పెద్దవి) భూత భేతాళురు, పిశాచ ఉరగ రాక్షసులు (65) త్రీ పురుషులు, ఎవరైవ్ కొని నా పేరుగల ధర్మడను పేరు గల ఒత్ర మందు తమ ప్రియమైన ప్రాణములను వదిలితే వారికి శాశ్వతమైన ముక్కలుగని అవి అనగా (68) ఇట్లాగే కొమ్మని బ్రహాదీ దేవతలందరు వలికి పుష్ప వర్గాన్ని కురుపిమా చాలా ఆనందాన్ని పొందారు (67) దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వ వతులు గానం చేశారు. పవిత్రమైన గాలులు వీచాయి. అప్పరవల గణములు వాట్యం చేశారు (68) సూతుని వచనము - యముని తనస్సుతో, భక్తితో సంతోషించిన వేదాశివుడు యమునితో రమ్యమైన, మంచిదైన మవోరమమైన మాటనన్నాడు (89) ఓ తండ్రి! (ప్రేమతో సంబోధన) నా కనుజ్ఞ ఇవ్వు. త్వరగా వెళ్ళాలి. దేవతలకు హితం చేసే కొరకు శ్రేష్ఠమైన కైలాస పర్వతానికి వెళ్ళాలి అనగా (70).
యముని వచనము - ఓ మహేశ్వర! నా స్థానమును నీవు వదలి పెట్టటం తగదు. మీ మాటవల్ల ఇది కైలాసము కన్న అధికమౌతుంది, దేవ! (71) శివుని వచనము - నీవు బాగా చెప్పావు. ఒక అంశతో, వేనిక్కడ ఉండటం యుక్తము. నీ మంచి స్థానమును, సునిర్మలమైన దాన్ని నేను విడువలేదు (72) నా పేరుతో ఇక్కడ విశ్వేశ్వర మహా లింగము కల్గుతుంది. అని పలికి మహాదేవుడు అక్కడే అంతర్థానమైనాడు. (73) శివుని మాట వలన అక్కడ అవ్వడు అద్బుతమైన లింగము కలిగింది. దాన్ని చూచి దేవతలు ఏ పేరు ఉందో ఆ పేరుతో పిలిచారు (74) ధర్మారణ్యమందు సురోత్తములు తమ తమ పేర్లతో అప్పుడు లింగాన్ని సృష్టించారు. ఏ దేవునిది. ఏ లింగమో అది ఆ దేవుని పేరుతో పిలుప బడింది (75) సూతుని వచనము - ధర్ముడు స్థాపించిన లింగము ధర్మేశ్వర మనబడింది. దానిని స్మరిస్తే, పూజిస్తే సర్వ పాపముల నుండి ముక్తులౌతారు (78) ఏ బ్రహ్మ యోగులకు గమ్యస్థానమో, ఏ బ్రహ్మ అందరి హృదయాల్లో ఉన్నాడో, ఎవని లింగము స్వయంభువమని ఉందో అట్లా ఉన్నదానిని (77) భూతనాథుని పూజిస్తే జనులు వ్యాధుల నుండి ముత్తులౌతారు. అక్కడ ఆ ఎదవ మనోరమమైన ధర్మ వాపిని ఏర్పరచాడు (78) తోటి తీర్థముల నీటిని తీసుకొని వచ్చి ఈ బావి యందు విడిచాడు. ఇది యమ తీర్థ స్వరూపము. ఈ మనోరమమైన దానిలో స్నానం చేయాలి. (79) దేవతలు, పరమాత్మను ధ్యానించే ఋషుల స్నానము కొరకు ఇది ఏర్పరచారు. అక్కడ స్నానంచేవి, ఆ నీరు తాగి నర్వపాపముల నుండి ముక్తులౌతారు (80) నరుడు ధర్మవాది యందు స్నానం చేసి ధరేశ్వర శివుని చూచిన సర్వపాపముల నుండి ముత్తుడౌతాడు. తల్లి గర్భంలో ప్రవేశించడు (81) అక్కడ స్నానం చేసి సరుడు యమతర్పణం చేసిన వ్యాధి దోషములు నాశనమౌతాయి. క్లేశ (కోపం) దోషములు ఉపశమిస్తాయి. యమునకు, ధర్మరాజునకు, మృత్యువునకు, వైవస్వతునకు, కాలువకు, దధ్నునడు (ధరించే వానికి) పరమేష్టికి (82) వృకోదరునకు, వృత్తునకు (అగ్ని), దక్షిణేశునకు ఇటువంటి నీకు నమస్కారము నీలునకు, చిత్రగుప్తునకు, చిత్రునకు, వైచిత్రునకు నీకు నమస్కారము (83) ఈ విధముగా చెప్పి యముని కొరకు ధర్మవాది యందు తర్పణం చేసిన వారికి అక్షతలతో, ఈ వామములతో తర్పణ చేసినవారికి ఉపద్రవము కలగదు (84) రోజు విడిచి రోజు వచ్చే జ్వరము, మూడు రోజులకోసారి, నాలుగు రోజులకోసారి వచ్చే జ్వరము ఒక వేళలో వచ్చే జ్వరము అట్లాగే శీత జ్వరము (85) ఇవన్ని నరుని పీడించవు. ఈతని బుద్ధి ఇట్టిదై ఆ వైపు ఉంటే (యముని పై) రేవతి మొదలగు గ్రహములు, దోసములు, డాకివి, కినులు (86) ఏడించవు. ధనధాన్య సమృద్ధి కలుతుంది. ఎల్లప్పుడు నంతతి వృద్ధి ఔతుంది. స్నానం చేసి భూతేశ్వరుని పూజించి, ఇంద్రియముల జయించి (87) అంగములలో కూడి రుద్ర జపము చేస్తే వ్యాధి దోషముల నుండి ముక్తులౌతారు. అమావాస్య, సోమవారము, వ్యతీపాత, యోగము, వైధృతి యోగము, సంక్రాంతి, గ్రహణము ఈ పై వాని యందు నరులు అక్కడ శ్రాద్ధము చేయాలి అని అన్నారు (88)
వేయి సంవత్సరములు శ్రాద్ధం చేసిన దానిని, నిరసించి ఇక్కడ చేసిన పువ్వులతో కూడిన ఉదకతర్పణాన్నైనా పితరులు తింటారు. కనుక ఇక్కడ మనుష్యుడు తిలతర్పణం చేయాలి (89) ఇరువది ఒక్కమారులు గయలో పిండ దానం కన్నా ధరేశ్వరంలో ఒక్కసారి ఇచ్చిన పితరులకు అక్షయమౌతుంది (90) ధర్మేశునకు పశ్చిమ భాగంలో విశ్వేశ్వరుని అంతరంలో ధర్మవాపిని ప్రసిద్ధమైంది ఉంది. అది స్వర్గమునకు మెట్లను కల్గిస్తుంది. (91) శివుని కొరకు ధర్మబుద్ధి కలిగిన ధర్మునితో పూర్వం నిర్మింపబడింది. అక్కడ స్నానం చేసి జలపానం చేసి పితృదేవతలకు తర్పణ చేస్తే (92) శమీవత్ర మంత ప్రమాణంతో నరుడు పిండదానం చేస్తే మహాపుణ్యమైన ధర్మవాపి యందు చేస్తే తిరిగి గర్భవాసాన్ని పొందడు (93) ఓ రాజా! కుంభీపాక నరకము, మహా రౌద్రమైన రౌరవ నరకం నుండి, అంధ తామిన్ర నరకం నుండి ముక్తుడౌతాడు. ఇందులో సంశయం లేదు (94) సూతుని వచనము - ఉత్తమ నరుడు ధర్మవాపి యందు ఒక సంవత్సరం తర్పణ చేయాలి. ఋతువు, మాసము పక్షములందు తర్పణ చేయాలి. లేనిచో ఫలించదు (95) బర్హిషదులు (కుశలపై తూర్పువేవారు) అగ్నిని భుజించేవారు (ఉదరాగి, కోపాగ్ని) ఆజ్యపులు, సోమవులు, వీరంతా ఈ వాది యందు తర్పణ చేస్తే ఉత్తమమైన తృప్తిని పొందుతారు (98) కురుక్షేత్రము మొదలగు క్షేత్రములు, అయోద్యాది వురములు, పుష్కరాదులు (తీర్థము) ఇవన్ని ముక్తికి మారు పేర్లుగా ఉన్నాయి (97) అవన్నీ సమానమైనవి. కాని ధర్మరూపము వాటన్నిటికన్న అధికము, మంత్రము, వేదములు, యజ్ఞములు, దానములు, వ్రతములు (98) ఇవన్నీ ఇక్కడ ఆచరిస్తే అక్షయమౌతాయి. ఇక్కడ జపిస్తే, దానం చేస్తే ఓ నరేశ్వర! అది అక్షయమౌతుంది. అధర్వ వేదములో సునిధమైన అభిచారము, ఇంతా, ఇతరమైనవి (99) అవన్నీ ఆ స్థానంలో చేస్తే సిద్ధిని పొందుతాయి. ఓ నృవశ్రేష్ఠ! ఆది తీర్థమును కాజేశులు (క,అజ, ఈశ) సేవించారు (100) ఆది పిధికి స్థానము సుసౌమ్యము -బ్రహ్మాదులు దానిని సేవించారు. కృతయుగంలో యుగము తాలమునకు త్రేతా యుగమందు ఐదు లక్షల సంవత్సరముల కాలమునకు (101) ద్వాపరమందు ఒక లక్షకాలమునకు కలియందు ఒక దినమునకు ఫలం లభిస్తుంది. ఓ బ్రహ్మ ధర్యారణ్య వర్ణసను దీనిని నేను చెప్పాను. ఇక్కడ ఫలమంతా ద్వైపాయనుడిట్లా చెప్పాడు (102) సూతుని వచనము - ఇక ముందు మనోరమమైన ధర్మ వాక్యాన్ని చెబుతాను. దేవతల పాతం కొరకు ఆజ్ఞాపించి చెప్పిన దానిని చెబుతాను (103) ధర్ముని వచవము - ఈ క్షేత్రమందు విష్ణు మాయా మోహితులై మహా దుష్టమైన వరదారగమనము, స్వరపేయదులు (104) వికృతములైనవి ఇతరములన్ని ఆచరించినవారు నరకానికి పోతారు. ఇతర క్షేత్రములందు చేసిన పాపము ధర్మారణ్య మందు నశిస్తుంది (105) ధర్మారణ్య మందు చేసిన పాపము వజ్రపు పూతలా ఉంటుంది. పుణ్యము, అట్లాగే పాపము శుభాశుభమైనది ఏ కొంచమైన (106) అదంతా రోజు పెరుగుతుంది. సంవత్సరాలు, వార్డు అవి అట్లా తాములకు తామములను ఇచ్చేది. మిగులకు ముక్తి నిచ్పేది (107) సిద్ధులకు సిద్ధి నిచ్చేది, ధర్మారణ్యము అని ఎవ్వరు చెప్పబడింది. సంతానహీనుడు వంశాన్ని పొందుతాడు. ధవహీనుడు ధనవంతుడౌతాడు (108) వుణ్యమైన ఈ ఆభ్యాసమును పూర్వం ధర్ముడు చెప్పాడు. భక్తిలో విన్న నరుడు రావి వారిని, వినిపించిన వారు వీరికి గోవపాత్ర దాన ఫలము లభిస్తుంది. చివర ఆతడు హరి పురమునకు వెళ్తడు (109) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు క్షేత్ర స్థావన మనునది నాలుగవ అధ్యాయము.
