స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

3 అధ్యాయము

వ్యాసుని వచనము - ఓ నృప శార్దూల! పురాతనమైన శుభమైన కథను విను. దీనిని వింటే అన్ని పాపముల నుండి ముక్తులౌతారు. అనుమానము లేదు (1) ఒకసారి ధర్మరాజు చాలా దుష్కరమైన తపమాచరించాడు. బ్రహ్మమ హేశులు మొదలగు వారు చేయలేనిది, నీటియందు, వర్షమందు ఎండయందు సంచరిస్తూ చేశాడు (2) ఓ రాజ! మొదలు త్రేతాయుగ మందు ముప్పదివేల సంవత్సరాలు చేశాడు. అడవి మధ్య అశోక తరువు మొదలులో కూర్చొని (క్రింద) తపస్సు చేస్తున్నాడు (3) ఎండిన సన్నని నరములు కలిగి, చుట్టబడిన ఎముకల నమూహము గలవాడై (ఎముకలుతేలి) నిశ్చల ఆకారంతో ఉన్నాడు. వుట్టలోని పురుగులు కోట్ల కొలది అతని రక్తాన్నంతా తాగేశాయి. అందువల్ల ఎండిపోయాడు (4) మాంసములేని ఎముకలున్నాయి. స్ఫటికం రాయిలా నిశ్చలంగా ఉన్నాడు. శంఖము, మొల్లపూలు, చంద్రుడు, మంచు వీని వంటి మహా శంఖము (తొనలు, ఎముకలు) వంటి ప్రకాశించు తెల్లని కాంతి గలిగిన వాడు (5) సత్వ (గుణము) చే ప్రాణములు నిలిచి ఉన్నాయి. ఆయుష్షు మిగిలి ఉండటంచే రక్షింప బడుతున్నాడు. ఉచ్వాస నిశ్వాసముల గాలి నడకచే బ్రతికి ఉన్నాడని తెలుస్తోంది (6) రెప్పలూకొడ్తూ సంచరిస్తున్న జంతువులను దుర్మార్గులనుగా చేస్తున్నాడు. పింగళ వర్ణమై వెలుగుతున్న కాంతీ గల కన్నులతో దిక్కులను వెలిగిస్తున్నాడు (7) అతని తవననే దావాగ్ని శిఖలతో ముద్దాడబడి మనమై పోయింది. ఆ అడవి ఆతని శాంతీ అవే, ఉత్కృష్టనుధా వరముతో చెట్లన్నీ తడిసినాయి (8) తపస్సు అనేది నర రూపమును ధరించి సాక్షాత్తుగా తపస్సు చేస్తున్నట్లుగా ఉన్నాడు. ఆకారంలేని వాడు ఆకాంక్ష లేని వాడు, భక్తిని బంగారముగా చేసి తపస్సు చే వున్నాడు. (9) లేడి పిల్లలు గుంపుల కొలది అతనిని చుట్టి తిరుగుతున్నాయి. భయంకరంగా శబ్ధిస్తూ భయంకర ముఖాలతో అడవి జంతువులు (అడవిలో పుట్టినవారు) రక్షిస్తున్నారు (10) ఇట్టి మహా భయంకరమైన వానిని, ఇంద్రునితో సహా దేవతలందరు చూచారు. అందరికి అభయమిచ్చే మహాదేవుని ఆతడు ధ్యానిస్తున్నాడు (11) దేవతలు బ్రహ్మాదులు అందరు కైలాసానికి వెళ్ళారు. ఉమతో కూడి పారిజాతపు చెట్టునీడ యందు కూర్చున్న వానిని (12) చూచారు నంది, భృంగి మహా కాలులు, అట్లాగే ఇతరమైన మహాగణములు, కుమారస్వామి, భగవాన్ గణపతి, ఉన్నారు. అక్కడ దేవతలు. బ్రహ్మాదులందరు తమ తమ స్థావములందు నిల్చున్నారు (13). 

బ్రహ్మవచనము - అనంత రూప నీకు నమస్కారము. నీల కంఠ నీకు నమస్కారము. తెలుసుకో వీలు కాని స్వరూపము కలవాడ, కైవల్యుడ, అమృతుడ (14) నమస్కారము. ఎవని అంతము దేవతలు తెలుసుకోలేరో ఆతనికి నమస్కారము. మాటలతో పొగడ శక్యముకాని, చిదాతుడైన ఆతనికి నమస్కారము (15) యోగులు తమ హృదయ కోశమందు ప్రార్థనలతో నిశ్చలంగా ఉండి జ్యోతి న్వరూపునిగా ఎవరిని చూస్తారో అట్టి శ్రీ బ్రహ్మకు నమస్కారము (18) కాలమునకు వరుడు, కాలుడు, స్వేచ్చగలవాడు, పురుషుడు (పరమాత్మ), గుణత్రయ న్వరూపుడు, ప్రకృతి రూపుడు, అట్టి ఆతనికి నమస్కారము (17) వత్వరూప విష్ణువునకు, రజోరూప బ్రహ్మకు, తమోరూప రుద్రునకు ఉనికి, వృష్టి, నాశము వీటిని చేసేవానికి (18) బుద్ధి స్వరూపునకు, మూడు రకములైన అహంకార రూపుడు అట్టి వానికి నమస్కారము. పంచతన్మాత రూపునకు, ప్రకృతి రూపునకు నమస్కారము (19) స్వరూపునకు, పంచ జ్ఞానేంద్రియముల రూమునకు నమస్కారము. భూతల రూపునకు, విషయూత్మున కు నీకు నమస్కారము (20) బ్రహ్మాండరూపునకు, అందులో వవంచేవానికి నీకు నమస్కారము. క్రిందనున్న పై నున్న విశ్వరూపునకు నీకు నమస్కారము. (21) అనిత్యరూపునకు, నిత్య రూపునకు, నత్తు ‘అనత్తుకు’ పతివి ఐన నీకు నమస్కారము. భక్తుల మిది దయతో, స్వేచ్చగా నీ రూపమును ప్రదర్శించే వాడ (22) నీ, విశ్వావమే వేదములు. నీ వేదములే ఈ సమస్త జగత్తు, విశ్వము భూతములు (ప్రాణులు) నీ పాదములు స్వర్గము, (ఆకాశము) నీశిరము (23) వాట్ల నుండి అంతరిక్షము, రోమములు, వనస్పతీ కలిగాయి. చంద్రుడు మనస్సు నుండి పుట్టాడు. నీ కన్నుల నుండి సూర్యుడు కలిగాడు (24) అంతానీవే. ఓదేవ! అంతా నీయందే అట్టి స్తోత్రములు, స్తుతించ తగినవాడు అన్నీ ఇక్కడ నీవే. ఓ ఈశ! ఇదంతా నీవు నివసించతగినది నమస్కారము నీకు. నీరు మరల మరల నమస్కారము (25) అని మహాదేవుని నుతించి, దండమువలె భూమి యందు పడి నమస్కరించినారు. అప్పుడు శంభువు వరమివ్వదలిచాను. ఏం కావాలి అని అడిగాడు (26).

మహాదేవుని వచనము - బృహస్పతి మొదలుగా దేవతలందరు ఎందుకు విచారంగా ఉన్నారు. ఓ బ్రహ్మ! మీ దుఃఖమునకు కారణమేమో నాకు చెప్పండి (27) బ్రహ్మవచనము – ఓ నీలకంఠ, మహాదేవ, దుఃఖ నాశక, అభయమిచ్చే వాడ, నేను నీకు చెప్పే మా. దుఖమేమో నీవు విను (28) ధర్మాత్ముడైన ధర్మరాజు కూడా భరింపరాని తపమాచరిస్తున్నాడు. దేవతల యొక్క ఏ ఉత్తమ పదవిని కోరి ఈతడు. తపస్సు చేస్తున్నాడో తెలియదు (29) ఆ తపస్సులో ఇంద్రుడు మొదలుగా అందరు భయపడినారు. ఆతడు చాలా కాలం క్రితమే తనమనస్సును మీ పాదములందు సమర్పించాడు. ఓ దేవేశ! ఆతనిని లేవండి తపస్సు నుండి ఆ ధర్మరాజు తపస్పుతో ఏం కోరుకుంటున్నాడు. (30) అని ఈశ్వర వచనము. ఆ ధర్ముని నుండి మీకు భయం లేదు. నేను నిజం చెప్తున్నాను (31) దినౌకనులైన ఆ దేవతలందరు కూడి అక్కడి నుండి లేచి, రుద్రునకు ప్రదక్షిణము చేసి, మరల నమస్కరించి (32) ఇంద్రునితో కలసి అందరు కైలాసము నుండి తిరిగి వచ్చారు. అందరు వ్వర్గవానులు అప్పుడు త్వరగా తమ తమ స్థానములకు వెళ్ళారు (33) ప్రభువు, ఈశ్వరుడు ఐన ఇంద్రుడు కూడా తన సుధర్మసభకు వెళ్ళాడు. అక్కడ అతడు నిద్రపోలేక పోయాడు. సుఖంగా లేడు. ఊరట పొందలేదు (34) మనస్సులో అనుకున్నాడు నాకు విన్నం వస్తోంది అని. దేవుడు, శచీపతి అప్పుడు గొప్ప చింతను పొందాడు (35) నా స్థానాన్ని అపహరించుటకు, ఆచరించ వీలులేని తపమాచరిస్తున్నాడు అతడు అని భావించి దేవతలందరి నిలిచి ఇట్లా వలికాడు(36) ఇంద్రుని వచనము - దేవతలందరు వినండి, నా దుఃఖ తారణమేమిటో నేను చాలా కష్టపడి సంపాదించిన దాన్ని యముడు కోరుతున్నాడా ఏమిటి అని. బృహస్పతి దేవతలందరిని చూచి ఇట్లా అన్నాడు (37) బృహస్పతి వచనము - తపస్సునకు శక్తిలేదు. కనుక దీనౌకనులార, వీఘ్నం కల్గించటానికి ఉర్వశి మొదలగువారిని పిలిచి అక్కడికి పంపండి (38) వాళ్ళను పిలిచే కొరకు ద్వారపాలకుడు వెళ్ళాడు. ఆతడు వెళ్ళి వారిని తీసుకొని ప్రభు త్వరగా వచ్చాడు (39) వచ్చిన వారితో ఇంద్రుడిట్లన్నాడు. పెద్ద పని వచ్చింది త్వరవడి, అందరు వేగంగా ధర్మారణ్యానికి వెళ్ళండి (40) అక్కడ ధర్మరాజు చాలా దుష్కరమైన తపమాచరిస్తున్నాడు. హాస్యము, భావ ప్రకటన, ఓర చూపులు, గీతనృత్తములు మొదలుగా గల వానిలో (41) ఆయువంతుడైన వానిని (అహింసి) లోభ పెట్టండి. తవః స్థానము నుండి దిగజారుతాడు అని. దానిని విని అట్లా ఆ అప్సరస గణములు (42) వరస్పరము ఆలోచించుకొని ఆచరించుటకు ఉద్యమించారు. దేవలోకంలోని శ్రేష్ఠమైన వనిత ఆ ఉర్వశి ధర్మారణ్యమునకు బయలుదేరింది (43).

వారు వుష్ప వరమును ఆతని శిరసు పై (శక్రుని) కురిపించారు ఆతనిని స్తుతించారు. ఎదవ దేవతలతో, వివ్రులతో చుట్టూ పొగడ బడుతూ (44) మిక్కిలి ఆనందముతో పరమ పావనమైన వనమునకు బయలుదేరారు. బిల్వము, జిల్లేడు, చండ్ర చెట్లతో తుడినది వెలగ, ఉమ్మెత్తలతో నిండినది (45) అక్కడ సూర్యుడు వెలగటం లేదు పెద్ద చీకటిగా ఉంది. జనులు లేరు, మనుష్యులు లేరు. అనేక యోజనముల విశాలమైంది (46) మృగములతో సింహములలో పరమైన ఇతర వన చరములతో నిండింది. వుష్పించిన చెట్లతో నిండింది. చాలా మనోహరమైన వచ్చని గడ్డితో నిండి ఉంది (47) విశాలమైనది. మధురవాదము గల వక్షుల ధ్వనితో ప్రతి ధ్వనిస్తోంది వుంస్కోకిలల వాదములతో నిండినది కీచురాళ్ళగుంపుల ధ్వనితో ప్రతిధ్వనిస్తోంది. (48) పెరిగిన వికటములైన వృక్షములతో, వాటి సుఖకరమైన నీడలతో కూడినది, భూ ప్రదేశము చెట్లతో కప్పబడింది. మిక్కిలి శోభతో కూడి ఉంది (49) పూలు లేని వృక్షములేదు. పండు లేని చెట్టు లేదు. ములుగల చెట్లు లేదు. ఈ అడవిలో తుమ్మెదలతో చుట్టబడని చెట్టు లేదు (50) పక్షుల నాదములతో, పుష్పముల అలంకారములతో చాలా అందంగా ఉన్నాయి. అన్ని ఋతువులలోని పూలతో వృక్షములు, సుఖకరమైన నీడలు ఇస్తూ నిండి ఉన్నాయి (51) పూలతో నిండిన కొమ్మలు గల చెట్లు గాలితో కదిలింవ బడి విచిత్రంగా వుష్ప వృష్టిని వదులుతున్నాయి. ఆ చెట్లు (52) ఆకాశాన్ని తాకుతూ బాగా పోషింవబడి (బలిసి) వక్షుల మధుర కూజితములు గలిగి చెట్లు పావన గల పూలతో కూడి వెలిగి పోతున్నాయి (53) పూల బరువుతో వంగిన చిగుళ్ళ యందు కూర్చొని మధువును కాంక్షించే తుమ్మెదలు మధురమైన శబ్దములు కలవై ధ్వనిస్తున్నాయి (54) ఆమోదవు (వాసన) అంకురములతో అలంకరింపబడిన అనేక ప్రదేశములను లతా గృహములతో చుట్టబడిన, మనస్సునకు ఆనందమును పెంచే ప్రదేశములను (55) చూస్తూ మహా తేజము గల ఆమె ఆనందపడింది. పరవృరము కలిసిపోయిన కొమ్మలుగల పాదములతో పూలతో నిండిన వానితో (58) మహేంద్ర ధ్వజ విభమైన వావిలో ఆ వనము ప్రకాశిస్తోంది. గాలి సుఖకరంగా, చల్లగా, మంచి వాసన గలిగి వూల వుప్పొడిని మోస్తూ వస్తోంది (57) ఇటువంటి గుణములతో కూడిన ఆవనమును ఆమె అప్పుడు చూచింది. అక్కడ అప్పుడు సూర్యుని నుండి పుట్టిన (దివలె) పవిత్రమైన చుట్టూ శోభిస్తున్న (58) మనోరమమైన ఉత్తమ ఆశ్రమమును ఆమె చూచింది. యజమానులైన వాలఖిల్యులతో చుట్టబడినది ముని గణములతో కూడుకొనినది అది (59) వృక్ష శాఖలందు వేలాడుతున్న అనేక అగ్ని స్థానములతో, ధూమపాన కణములు గల, దిక్కులే వస్త్రముగా గల (నగ్నమైన) యతులతో కూడినది (60) పాలించబడే అడవిమృగములు తిరిగి సౌమ్యముగా మారాయి. పిల్లులు ఎలుకలతో, ముంగివలు, పాములతో (61) సింహములు లేడి పిల్లలతో కూడి సత్వరూపము కలిగినవిగా ఐనాయి. సహోదరులు క్రీడించినట్లు అవీ వరస్పరము ఆడుకొంటున్నాయి. అక్కడ దూరంగా వనం కన్పించింది. అప్పుడు దేవుడు ఇంద్రుడు ఇట్లా అన్నాడు (62).

ఇంద్రుని వచనము - ఈతడు ధర్మరాజు ఉగ్రమైన తవముందున్నాడు, నా రాజ్యాన్ని కాంక్షిస్తూన్నాడీతడు. ఈ ప్రయత్నం వివర్తించేందుకు ప్రయత్నించండి. (63) ఈతని తపస్సుకు విఘ్నం కల్గించండి. ఇది నా ఆ అక్కడికి వెళ్ళండి. ఇంద్రుని మాటను విని, ఉర్వశి, తిలోత్తమ (64) సుకేశి, మంజునతోష వృతాచి, మేనక, విశ్వాచి, రంభ, ప్రమోద, చారుభాషిణి (65) పూర్వచిత్తి, నురూప, అనుమోచ, యశస్విని వీరు, ఇంతా అక్కడున్న ఇతరులు చాలా సేపు ఆలోచించారు (66) ఒకరినొకరు చూచుకొని భయంతో, అనుమానపడుతూ, యముడు, ఇంద్రుడు, వీరిద్దరు మనకు స్థానము (67) ఈ విధంగా చాలా ఆలోచించి ఓ భారత! వర్ధనీ అమ పేరుగలది, అప్సరనలందరిలో శ్రేష్టమైనది అన్నీ ఆభరణములతో కూడినది (68) ఇట్లా అంది. ఓ శుభానన! ఉర్వశి, ఎందుకు బాధపడుతావు. దేవతల కార్యసిద్ధి కొరకు మాయా రూపబలములో వర్ణ ధర్మమునకు తగినట్లు చేస్తాను, ఓ ఇంద్ర అని అనగా (69) ఇంద్రుని వచనము - ఓ మహాభాగే! బాగుంది. వర్ధనీ అను పేరుగల ఓ సువ్రతే, త్వరగా వెళ్ళు నీవే స్వయంగా ఓ భద్రే! కృశోదరి పనిచేయి (70) ధీరులను వంచటంలో వీపుతాక ఇతరులు కత్తులుతారు, ఓ సుభ్రు! అనగానే వర్ధని అట్లాగే నలికి ధర్మరాజు ఉన్న చోటికి వెళ్ళింది. (71) గొప్ప పాములతో మవోరమమైన రూపాన్ని కల్గించుకొని, కుంకుమతో, తాటుకలో, వస్త్రములతో భూషణములతో అలంకరించుకొని,(72) పూలు, వస్త్రములు కలిగి చిరుగడ్డాలు వడుము యందు వెలుగుతుండగా, పాదమందు, ధ్వనిస్తున్న, కష్టం కళించే సొమ్ములను అలంకరించుకొని (73) అనేక రకములైన అలంకరింప తగిన సొమ్ములతో అలంకరించుకొని, రకరకములైన చందనములను పూసుకొని, రకరకాల పూలమాలలు ధరించి, వటు వస్త్రము కవ్వకొని, శుభయైన ఆమె (74) బాగా శుద్ధమైన వీణను చేతధరించి, పేర్వాంగ సుందరియైన ఆమే అక్కడ మూడు రకములైన నాట్యమును లోకమనోరమముగా చేసింది (75) తార స్వరముతో మధురములైనవి, వేణునాదముతో కూడినది (76) మూర్ఛవాతాలములతో కూడినది, తంత్రీలయములతో నమన్వితమైనది ఆ నాట్యము. జితాత్ముడైన ఆ ధర్మరాజు క్షణకాలంలో త్వరగా చలించిన మనస్సు కలవాడై నాడు. ఆనృపాత్మజుడు ధర్మరాజు అవ్వడు అట్లా ఐనాడు. (77) అనగా ధర్మరాజు వచనము (యుధిష్ఠిరుడు) ఓ బ్రహ్మన్! ఓ బ్రహ్మనత్తమ! నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. బ్రహ్మను పొందిన అతనికి తవసు విచ్ఛేదము ఎట్లా జరిగింది (78) ఈ భూమి, న్వర్గము ధర్మమందున్నాయి. పాతాళము ధర్మములోనే ఉంది. చంద్ర సూర్యులు జలముగాలి అగ్ని ధర్మమందున్నాయి. (79) ఈ విశ్వమంతా ధర్మంలోనే ఉంది. అట్టి ధర్మము ఎట్లా ఒకే ఆ విషయమందు లగ్నమైనాడు ఓ స్వామి! ఆ వైయగ్ర్యమును (ఒకే వస్తువు యందు మనస్సు లగ్నము) ఉన్నదున్నట్లుగా చెప్పి, ఓ సువ్రత అనగా (80)

వ్యాసుని వచనము - సాహసముల నుండి వేతనము నరకమునకు కారణము ఈ యోని కుండము భూమి యందు కుంభీ పాక (నరక) నమముగా సృష్టించబడింది (81) మనస్వులను నేత్ర రజువులతో గట్టిగా బంధించి దర్శిస్తారు. కుచ్చ రూపములైన మహాదండ ములతో కొట్టబడుతున్న వానిని, చైతన్య రహితునిగా చేసి (82) త్వరగా నరకమందు వడవేస్తారు. ఓ నృవనత్తమ! సర్వప్రాణులకు మోహం కల్గించేది వారి ఇట్లా నిర్మించబడింది. (83) అయ్యో మనః స్థ్యైర్యము, వ్యాకుల పాటు లేకుండా నత్యం వినటము ఎంత వరకంటే, సుచేత నులముందు మదించిన స్త్రీ వల (ఉరి) వలె ఉండనంతవరకే (84) తపోభివృద్ధి దానము, దయు, దమము, స్వాధ్యాయ వృత్తము, శౌచము, ధృతము, వ్రతము (85) ఇవన్నీ ఎంతవర కంటే, చంచలమైన, భయపడిన లేడి దృష్టివంటి దృష్టిగల స్త్రీని చూడనంత వరకే. తల్లి దండ్రి, అన్నదమ్ములు సహృజనులు (88) లజ, భయము, స్వాచారము, జ్ఞానము, ఔదార్యము, ఐశ్వర్యము ఇవన్నీ ఎంతవరకు వెలుగుతాయంటే, మదించిన స్త్రీ అనే పాశములతో బధింపబడి వడిపోడో అంతవరకే (87) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవ బ్రహ్మఖండమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు ఇంద్రుని భయమును చెప్పుట అనునది మూడవ అధ్యాయము.