స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
8వ అధ్యాయము
యుధిష్ఠురుని వచనము - ఓ విభు! పుణ్యమైన ధర్మారణ్య కథను వింటుంటే నాకు తృప్తి కలగటం లేదు. మీరు చెబుతున్న కొద్ది నా మనస్సు ఉత్సాహపడుతోంది. ఆ తరువాత ఏమైందో చెప్పండి. నాకు చాలా కుతూహలంగా ఉంది. అని అనగా (1) వ్యాసుని వచనము - ఓ పార్థ స్కంద పురాణమందున్న మహాపుణ్యమైన కథను విను. స్కందువడు శివుడు చెప్పిన శుభమైన ధర్మారణ్యమందు పుట్టిన కథను (2) సర్వ తీర్థముల ఫలమునిచ్చే, నర్వ ఉపద్రవముల నశింపచేసే కథను విను. కైలాస శిఖరమందు తూర్పున్న దేవదేవుని జగధ్గురువును, ఐదు ముఖముల వానిని, పది భుజముల వానిని, మూడు కన్నుల వానిని శూలపాణిని (3) కపాలము ఖట్వాంగము చేత ధరించిన వానిని, నాగము యజ్ఞోపవీతముగా కలవానిని, ప్రమథ గణములతో చుట్టబడిన వానిని, సురలు, అసురులు వీరితో నమస్కరింపబడుతున్న వానిని (4) నానా రూపములుగా నానాగుణములు కలవానిగా కీర్తింపబడుతున్న వానిని, నారద ప్రముఖులతో కూడిన వానిని గంధర్వులతో, అప్సరసలతో సేవింపబడుతున్న వానిని ఐన ఆ ఉమాపతిని అక్కడ ఉన్న మహాదేవుని నమస్కరించి ఆతని సూతుడు ఇట్లా అన్నాడు. (5) స్కందుని వచనము-స్వామీ! ఇంద్రాది దేవతలు బ్రహ్మాదులు అందరు నీ ద్వారమునకు వచ్చారు. నీ దర్శనమందే ఆసక్తులైనారు ఓ దేవ! ఏమి ఆజ్ఞాపిస్తున్నారు. మీ ముందున్నాను. చేయదలిచాను అని అనెను. (6) వ్యాసుని వచనము - నందుని మాటను విని ఆసనమునుండి లేచి హరుడు, వృషభమును ఎక్కకుండానే వెళ్ళదలచాడు (7) వెళ్ళదలచిన శివుని చూచి స్కందుడు ఇట్లా అన్నాడు (8) స్కందుని వచనము- ఓ దేవ! దేవతల పని ఏమిటి? నిన్ను త్వరగా ఎందుకు పిలిచారు. ఓ కృపాసింధు ! వృషభమును వదలి ఎక్కడికెళ్తున్నాను. మీరు దయగలిగితే నాకు చెప్పండి (9) దేవదానవుల యుద్ధమా? ఇంకా మహత్తరమైన కార్యమేదైనా ఉందా (10) అనగా శివుని వచనము - నేనెందుకు ఆందోళన కలిగి ఉన్నానో ఏకాగ్రంగా విను. భూతల మందు, మహాపుణ్యమైన ధర్మారణ్యమనే స్థానముంది (11) ఓషడానన! దేవతలతో కలిసి అక్కడికి వెళ్ళదలిచాను నేను. (12) అనగా స్కందుని వచనము - ఓ మహాదేవ! ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏంచేస్తారు. ఓ జగన్నాథ! అక్కడ చే సేదేమిటో వివరంగా చెప్పండి అనగా (13) శివుని వచనము - ఓ పుత్ర! మనసునకు ఆహ్లాదాన్ని కలిగించే మాటను విను. అన్ని వృత్తములకు ఆది. సృష్టి స్థితికరమైనది. గొప్పది (14) ప్రళయం ఏర్పడ్డాక అంతట చీకటి ఆవరించింది. అప్పుడు నిరుణము, అవ్యయము, బీజము ఐన బ్రహఒక్కటే ఉండింది (15) గుణములతో మొదట మహత్ అనే ద్రవ్యం సృష్టించబడింది అని అంటారు (16) మహాకల్పం వచ్చాక చరాచరములు నశించాక, జలరూపియైన జగన్నాథుడు లీలగా ఆనందిస్తూ (17) చాలా కాలం గడిపాక ఆతడు పృథివి మొదలుగా గల తత్వములతో, వదివేల శాఖలతో మనోరమమైన చెట్టును పుట్టించాడు (18) విశాలంగా ఫలములతో నిండింది. స్కంధ కాండములతో శోభించేది. పండ్ల సమూహం (చాలా పండ్ల) కలిగినట్టిది, జడలతో కూడింది. ఒక పెద్ద మర్రి చెట్టు అది (19).
పిదవ జనార్దనుడు వాసుదేవుడు పిల్లవాడుగా మారి, విశ్వ నిర్మాణము చేయదలచి ఆతడు వటపత్ర మందు శయనించాడు (20) అతని నాభి కమలము నుండి లోకకర్తయైన బ్రహ్మ జన్మించాడు. అనేక ఆకారములతో ఒక రూపంలేని అంతా జలమయమైన దాన్ని చూచి (21) వేగంగా, ఉద్వేగముతో, లోక పితామహుడైన బ్రహ్మ ఓ పుత్ర! అప్పుడు ఇట్లా అన్నాడు. ఏం చేయాలి అని (22) అప్పుడు దైవవశాత్తు అ శరీరవాణి ఆకాశంలో పుట్టింది. ఓ విధి! ధాత! నా దర్శనమయ్యేటట్టుగా తపమాచరించు అని (23) బ్రహ్మ లోకపితామహుడు ఆ మాటను విని, ఘోరమైన, వరమ దుష్కరమైన గొప్పతవస్సును ఆచరించాడు.(24) అప్పుడు బాల రూపములో ఉన్న ఆ కమలావతి నవ్వి, దయతో, బాలుని చేష్టలతో మధురంగా ఇట్లా అన్నాడు (25) శ్రీ విష్ణు వచనము - ఓ పుత్ర! నీవు ఈ వేళ విధి ప్రకారము బ్రహ్మాండ గోళమును చేయి. పాతాళము, భూతలము, సింధు, సాగరతాననము (26) వృక్షములు, గిరులు, రెండు తాళ్ళు గలవి పశువులు, పక్షులు, గంధర్వులు, నదులు, యక్షులు, రాక్షసులు (27) వ్యాఘ్రుములు మొదలగునవి, ఎనుబది నాలుగు యోనుల యందున్న జీవులు, తరుగుల్మాదులు, చెమట నుండి పుట్టినవి (వురుగులు), మాయువు నుండి పుట్టేవి, అండజములు (28) ఇరువది ఒక్క లక్ష యోనులు ఒక్కొక్క దానికి చెందినవి. అన్నీ నీవు త్వరగా సృష్టించు అని పలికి అంతర్థానమైనాడు. చెప్పబడినట్లుగా బ్రహ్మ బ్రహ్మాండమునంతో నిర్మించాడు. (29) ఆ బ్రహ్మ సృష్టించిన బ్రహ్మాండమందు - ప్రభువైన విషవు ప్రజాపతి, స్థాణువు, నురగురువు, సూర్యుడు, ప్రచేతసుడు, వరమేష్ఠులు (30) దక్షుడు, దక్షపుత్రులు, సప్తర్పులు, ప్రజాపతులు ఇట్లా ఇరువది ఒక్కరు జన్మించారు. (31) అప్రమేయుడైన ఒక పురుషుడు అట్లాగే వంశ ఋషులు కలిగారు విశ్వేదేవులు ఆదిత్యులు, వస్తువులు, అశ్వినీ దేవతలు, (32) యక్షులు, పిశాచులు, సాధ్యులు, పితరులు, గుహ్యకులు, పిదప విద్వాంసులు, ఎనిమిది మంది స్వచ్ఛమైన వారు బ్రహ్మరులు కలిగారు (33) రాజర్షులు అనేక మంది అన్ని మంచి గుణములు కలవారు, దివము, నీరు, పృథివి, వాయువు, అంతరిక్షము, దిక్కులు (34) సంవత్సరములు, ఋతువులు, మానములు, వక్షములు, అహోరాత్రములు, కల, కాష్ఠ ముహూర్తాదులు, నిమేషాది భాగములు (35) నక్షత్రములతో కూడిన గ్రహచక్రము, యుగములు, మన్వంతరాదులు లోకంలో కనిపించేది. ఇతరమైన దంతా కల్గింది. (36) ఈ కన్పిస్తున్న స్థావర జంగమాత్మకమైన చక్ర మంతా, యుగక్షయము సంప్రాప్తించినవుడు ఈ జగత్తంతా తిరిగి సంక్షిప్త రూపాన్ని పొందుతుంది. ఓ పుత్ర! (37) మార్పు వచ్చినప్పుడు ఋతువు యందు ఋతు చిహ్నములు నామ రూపములు చూస్తామో అవి అవే అట్లాగే వత్స! యుగాదికము అవి అవే (పాతవే) (38).
శివుని వచనము - ఇక ముందు పౌరాణికమైన శుభమైన కథను చెప్తాను. పుత్ర! బ్రహ్మయొక్క వంశాను కీర్తనమే (39) బ్రహ్మయొక్క మానస పుత్రులు ఆరుగురు మహర్షులు. వారు అత్రి, మరీచి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతువు (40) మరీచికి కశ్యపుడు, కశ్యపుని నుండి చివరివారు ప్రజలు. దక్షునకు పదముగ్గురు కన్యలు అదృష్ట శాలులు కలిగారు (41) అదితి, దితి, దనువు, కాలా, ధనాయు, సింహిక, క్రోథ, ప్రొవా, వృషా, వినత కపిల (42) కండూ, నునేత్ర వారిని కశ్యపునకిచ్చి వివాహం చేశాడు.అదితి యందు వన్నెండు మంది ఆదిత్యులు, మంచి ముఖము గలవారు కలిగారు (43) సూర్యుని వలన ధర్మరాజు కలిగాడు. ఆతడు దీనిని పూర్వం నిర్మించాడు. ధర్ముడు నిర్మించిన ప్రధానమైన ఈ ధర్మారణ్యాన్ని చూచి దానిని నేను ధర్మారణ్యమని అన్నాను. ఓ స్కంధ! ఇది పుణ్యము నిచ్చేది. (44) స్కందుని వచనము - ధర్మారణ్య కథ పరమ పావనమైనది. ఓ మహేశ్వర! అదంతా వినదలిచాను. చెప్పండి అనగా (45) ఈశ్వరుని వచనము - ఇంద్రాది సకల దేవతలు, బ్రాహ్మణులు కూడా అన్వయించారు. నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ క్షేత్రము పాపముల నశింపచేసేది (48) స్కందుని వచనము - ఓ శశిశేఖర ! దానిని చూడటానికి నేను కూడా వస్తాను అనగా (47) సూతుని వచనము - పిదప స్కందుడు, రుద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని, సిద్ధులు, గంధర్వులు, శుభలైన అప్సరనలు (48) పిశాచులు, గుహ్యతులు అందరు, ఇంద్రుడు, వరుణుడు, నాగులు అందరు శుక్రుడు వాచస్పతి వచ్చారు (49) గ్రహములు, నక్షత్రములు, ఎనిమిది మంది నువులు ధ్రువాదులు, అంతరిక్షచరులందరు ఇంకా నాగవానులితరులందరు వచ్చారు (50) బ్రహ్మాది దేవతలంతా మిక్కిలి ఆనందంతో వైకుంఠం వెళ్ళారు. అమిత తేజస్సుగల విష్ణువుతో సంభాషించే కొరకు వైకుంఠం వెళ్ళాడు. బ్రహ్మకూడా (51) ఆ వైకుంఠమునకు లోకపితామహుడైన బ్రహ్మవెళ్ళి, ముహూర్త కాలము ధ్యానించి, బ్రహ్మ ఆనందంతో విష్ణువుతో ఇట్లా అన్నాడు (52) బ్రహ్మవచనము - కృష్ణ ! కృష్ణ! ఓ మహాబాహు! కృపాళు, వరమేశ్వర నీవు సృష్టికర్తవు,లయకారుడవు. నీవు జగత్తులకు తండ్రి (రక్షకుడవు) (53) ఓ విష్ణు! సౌమ్య! నమస్కారము గరుడ ధ్వజ! నీకు నమస్కారము. కమలా కాంత, బ్రహ్మరూపి నీకు నమస్కారము (54) విశ్వరూప, మత్స్యరూప నీకు నమస్కారము. దైత్యనాశక, భక్తులకు అభయమిచ్చే వాడ నీకు నమస్కారము (55) కంసుని సంహరించిన వాడ నీకు నమస్కారము. బలదైత్యుని జయించిన వాడ నమస్కారము. బ్రహ్మ ఇట్లా స్తుతించగా ఆ జనార్దనుడు ప్రత్యక్షమైనాడు (56) పీతాంబరుడు, మనశ్యాముడు, పాముల శత్రువును వాహనంగా గలవాడు, చతుర్భుజుడు, మహాతేజుడు, శంఖ చక్ర గదాధరుడు (57) ఐన విష్ణువును దేవతలందరూ స్తుతించారు. అమిత విక్రముడైన ఆ దేవుడు విద్యాధరులతో నాగులతో అందరితో పొగడ బడి (58) ఆ దేవుడు భాస్కరుని కన్న అమితమైన తేజస్సుగలవాడు లేచాడు. కోట రత్నముల కాంతితో వెలుగుతున్న కిరీట ఆభరణములతో అలంకరించబడిన వాడు లేచాడు (59) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి నహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వభాగ మందు ధర్మారణ్య మాహాత్మ మందు విష్ణు నమాగమ మనునది ఎనిమిదవ అధ్యాయము.
