స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

16వ అధ్యాయము

తా ॥ యుధిష్ఠిరుని వచనము - రాక్షసులకు దైత్యులకు యక్షులకు, పక్షులకు ధర్మారణ్యమందు నివసించేవారికి భయం నశించే కొరకు కాజేశులు నానా రూపముగా అనేకమైన శక్తులను స్థాపించారు. వాటి స్థానములను పేర్లను, వాటి యథార్థ రూపములను నాకు చెప్పండి అనగా వ్యాసుని వచనము - ఓ పార్థ మహాబాహ, ధర్మమూర్తి, నృపోత్తమ విను. కాజేశులు స్థానమందుంచినది శక్తి అను పేరు గలది. గోత్రవ మ దారిక యందు శ్రీమాత, శ్రేష్ఠమైన నందాపుర మందు శాంత బ్రాహ్మణ ముఖ్యుల రక్షణ కొరకు నాలుగు దిక్కులందు ఈ నలుగురున్నారు ఓ నృపోత్తమ! తమ తమ స్థానము లందు దేవతలందరితో కూడి ఉన్నారు. మన మధ్య యందున్న వారంతా బ్రాహ్మణుల రక్షణ కొరకు. ఓ మహారాజ! సావిత్రి అను పేరుగల ఆమె మంగళ కరమైనది. అసురుల సంహారము కొరకు దేవతలు జ్ఞానజను స్థాపించారు. గాత్రాయి ఆడవక్ష రూపంగల దేవి. ఛత్రజ ద్వారమందుండేది. చూట అను పంక్తి గలది, శీహోరీ, పివృలాశావురి, ఇంక ఇతరమైన అనేక శక్తులు భయము నుండి రక్షణ కొరకు స్థాపించబడ్డాయి ప్రతిచి, ఉదీచి, దక్షిణదిక్కులందు ఆమె దేవతలతో స్థాపించబడింది. ఆమె రకరకాల ఆయుధముల ధరించింది. రకరకాల ఆభరణములతో అలంకరించబడింది రకరకాల వాహనములను అధిరోహించింది. ఆమె నానా రూపములను ధరించింది కూడా. రకరకాల కోవములతో కూడింది, రకరకాల భయములను తొలగించేది యథాయోగ్యముగా యథాస్థాన మందు పది దిక్కులలో మాత ఉంచతగినది. గరుడుని అధిరోహించింది, త్రిశూలమును ధరించింది సింహము నధిరోహించింది ఓటర్ల రూపముగలది, వారుణీపానంతోదర్పించింది. ఖడ్గము, డోలువారు బాణములు గల చేతులతో వెలుగుతోంది. శుభమైన ఆసనము కలది రక్త వస్త్రముతో చుట్టబడినది బలిసిన ఎత్తైన పయోధరములు గలది, ఉదయిస్తున్న సూర్యబింబము వంటి తాంతి గలది మదముతో కదులుతున్న కళ్ళు గలది ఈ విధముగా ఈమె మహాదివ్యమైనది అవ్వడు కాజేశులతో స్థాపించబడింది. నత్యమందిరమందుండే సర్వప్రాణుల రక్షణ కొరకు స్థాపితమైంది ఓ నృపశార్దూల! ఆ దేవి స్తుతించబడి, పూజింపబడితే, కోరికోరికలన్నింటిని ఇస్తుంది. ఓ నృపనత్తమ! ధర్మారణ్యంనకు వశ్చిమ భాగంలో స్థాపించబడినది శుభమైనది ఛత్రజా. అక్కడ ఉండి విప్రులను రక్షిస్తోంది. ఎంతో శక్తి గలది భైరవ రూపమును ధరించి రాష్ట్రముల వధ కొరకు, విప్రులకు అభయమిచ్చే కొరకు ఆయుధములను ధరిస్తోంది ఆమె ఎదురుగా నీటితోని ఉత్తమమైన నరప్పు ఏర్పరచ బడింది. ఓమహాభాగ! ఈ సరస్సు యందు స్నానాదితర్పణం చేసినవారు  పిండదానాదికము చేసిన వారి క్రియ అంతా అక్షయమౌతుంది. భూమి యందు పడిన అంజలులను దివ్యమైన వానివి ధూపదీ పాదికములనుచేపిన వానిని ఎప్పుడూ వ్యాధులు బాధించవు. శత్రునాశనమౌతుంది కూడా. మరల అక్కడ తన శక్తి కొలది బలిదానాదులను చేయాలి శత్రువులు నశిస్తారు. ధనము ధాన్యము వృద్ధి ఔతుంది. ఓరాజ! శక్తి అంశతో మనోరమమైన ఆనంద అనే శక్తి బ్రాహ్మణుల రక్షణ కొరకు స్థాపించబడింది, ఓ భూపతి! ఆమె మాహాత్మ్యమును విను.

తా ॥ ఆమె (ఆనంద) శుక్ల అంబరముల ధరించింది. దివ్యమైనది బంగారు ఆభరణములతో అలంకరించబడింది సింహము పై అధిరోహించింది. నాలుగు చేతులు గలది. చంద్రుని తలలో ధరించింది. తీగ వంటి ముత్యాలహారము గలది వీన ఉన్నత వయోధరములు గలది అక్షమాల, ఖడ్గము హస్తమందు గలది తాడుతోనరము వీటిని ధరించినది. దివ్య గంధవరమునకు ఆధారమైనది, దివ్య మాలతో అలంకరించబడింది  ఆనంద సాత్విక శక్తి. ఆ పట్టణ మందు పూర్వముండేది ఓ రాజ! ఆమెను కూర్పరము రక్త చందనము వీటితో పూజించాలి మధు, ఆజ్యము, శర్కర వీటితో కూడిన శుభ్రమైన పాయసములతో భుజింపచేయాలి. భవాని ప్రతి కొరకు కుమారి పూజ కూడా చేయాలి, ఓ రాజ! అక్కడచేసిన జపము, హోమము, అక్కడ ఇచ్చిన దానము, ధ్యానము ఇవన్నీ ఓరాజా! అక్కడ అక్షయమౌతాయి. ఇందులో అనుమానము లేదు నృపోత్తమ! ఆ స్థానమందు చేసినది మూడు గుణములైతే అది దానికి మూడురెట్లు అధికమౌతుంది. సాధకునకు ధనము, దార (భార్య) ఆది సంపదలు తప్పక లభిస్తాయి హానికాని రోగము కాని శత్రువులు తొని, దుష్కృతముని ఉండవు. అతని గోవులు వృద్ధి చెందుతాయి. ఆతని ఇల్లు ధన ధాన్యాదులతో నిండి పోతుంది శాకిని భయము ఆతని కుండదు. రాజునకు శత్రువులుండరు. వ్యాధి భయముండదు. అంతట విజయవంతుడౌతాడు చతుర్థశ విద్యలు ఈతనికి, చదివిన చదువువలె భాసిస్తాయి. ఆనందకి నాశ్రయించిన నరుడు భూమి యందు సూర్యునిలా వెలుగుతాడు. అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వార్థమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు ఆనంద స్థావన వర్ణన మనునది పదునారవ అధ్యాయము.