స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

38వ అధ్యాయము

 తా వ్యాసులిట్లన్నారు. పిదప ప్రభాత మందు స్వచ్చమైన దానియందు పూర్వాష క్రియలను ఆచరించి, శుభ వస్త్రములను ధరించి విడివడిగా ఫలములు చేతధరించి (1) రత్నాంగదములతో కూడిన భుజ దండములు కలవారై అంగుళీయకములతో భూషితులై, కర్ణాభరణములు గలవారై ఆనందంతో వచ్చారు (2) రాజద్వారమునకు చేరి బ్రహ్మవాదులు ఉన్నారు. వారిని చూచి రాజపుత్రుడు బలవంతుడు కొద్దిగా నవ్వాడు (3) రాముడు, హనుమంతుడు దగ్గరకు వెళ్ళి బ్రాహ్మణులు వచ్చారు. మంత్రులంతా వినండి. బ్రాహ్మణులను చూడండి (4) అని పలికి రాజు మౌనము వహించి ఉన్నాడు. ఆ పిదప ఇద్దరు ముగ్గురు ఆ పిదప అందరు బ్రాహ్మణులు క్రమంగా కూర్చున్నారు (5) రాజుగారిని ఏనుగులు రథములు పదాతి సైన్యం క్షేమంగా ఉందా అని అడిగారు. మహామనస్సు గల రాజు బ్రాహ్మణులతో పిదప ఇట్లన్నాడు. (6) అరిహంత అనుగ్రహంవల్ల అంతట వారు క్షేమమే. జినుని స్తుతించే నాలుక నాలుక. జినుని అర్చించే చేతులు చేతులు (7) జినుని యందు లీనమైన చూపులే చూపులు జనుని యందు అనురక్తి కలిగిన మనస్సే మనస్సు. అంతట దయ చూపాలి. అంతట జీవాత్మ పూజింప బడుతుంది. ఎల్లప్పుడు (8) యోగశాలకు వెళ్ళాలి. గురు వందనము చేయాలి నచకారము, మహామంత్రము రాత్రిం బగళ్ళు జపించాలి (9) వంచూషణ చేయాలి. శ్రమణులకు ఎల్లప్పుడు దానం చేయాలి. ఆ మాటలు విని బ్రాహ్మణులు పండ్లు కొరికారు. (10) దీర్ఘనిశ్వాసమును విడిచి రాజుతో ఇట్లన్నారు. ఓ రాజా! రాముడు చెప్పాడు. బుద్ధి గలిగిన హనుమంతుడు చెప్పాడు.(11) బ్రాహ్మణుల వృత్తిని ఇచ్చేయి. ఈ భూమియందు నీవు ధర్మిస్తుడివి. నీవు ఇచ్చిన ట్లౌతుంది. నేనిచ్చినట్లు కాదు. (12) రాముని వాక్యాన్ని నీవు రక్షించు. దాని నాచరించి నీవు సుఖినౌతావు (13) అనగా రాజిట్లన్నాడు. రామ హనుమంతు లెక్కడున్నారో అందరు అక్కడికే వెళ్ళండి. రాముడంతా మీకిస్తాడు. మీరిక్కడ ఏం లభించింది (14) ఇవ్వను ఒక్క గవ్వ కూడా ఇవ్వను. గ్రామ మివ్వను. మీ వృత్తి (జీవనము) ఇవ్వను. ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళింది (15) ఆ దారుణమైన మాటను విని బ్రాహ్మణులు కోపాడులులైనారు. రాముని కోపాన్ని సహించు. ఇప్పుడు హనుమంతుని కోపాన్ని సహించు. 

అని పలికి హనుమంతుడిచ్చిన ఎడమ చంకయందున్న (పుట్టిన) పుటిని ఆతని నిలయ మందుంచి బ్రాహ్మణులు తిరిగి వెళ్ళారు (17) బ్రాహ్మణ సమూహం వెళ్ళాక అగ్ని జ్వాలలతో వ్యాకులమైంది. అక్కడ అంతా అగ్ని మయమైంది (18) రాజు వస్తువులు కాలిపోతున్నాయి. ఛత్ర చామరములు కోశాగారములు అన్నీ ఆయుధాగారము (19) పట్టపు రాణులు, రాజపుత్రులు అనేకములైన గజ అశ్వములు, విమానములు కాలిపోతున్నాయి. వాహనములు కాలిపోతున్నాయి. (20) విచిత్రములైన పల్లకీలు, వేలకొలది రధములు కాలిపోతున్నాయి. అంతటా కాలిపోవటాన్ని చూసి రాజు కూడా బాధపడ్డాడు (21) ఆతని రక్షకుడెవ్వడూ లేడు. మానవులు భయవిక్లబులైనారు. ఆ అగ్ని మంత్ర యంత్రములతో కాని మూలికలతో కాని సాధ్యం కాదు (22) రామునకు కోపం వస్తే కోట్ల కొలది కుటములనైనా నశింప చేస్తాడు. అక్కడ అన్నీ నశిస్తాయి. కుమార పాలకుడు ఒక లేఖ్ఖా. (23) అందరు అ మంటలను చూచి నగ్న క్షవకులు అప్పుడు చేతులలో పాత్రలు ధరించి శుభమైన దండలు తీసుకొని (24} రక్త కంబళములను తీసుకొని మాటిమాటికి వణుకుతు పాదుకలు లేకుండానే అందరు తలో దిక్కు పారిపోయారు (25) కోలాహలము చేస్తూ, పరుగెత్తండి అని అరుస్తూ వెళ్ళారు. విప్రముఖ్యులు మనల్ని అందర్ని కాల్చారు. అనుమానం లేదు (28) కొందరి పాత్రలు భగ్నమైనాయి. కొందరి దండములు భగ్నమైనాయి. నష్టులైనారు. వివస్త్రులైనారు. వీతరాగుల మని పల్కుతున్నారు. (27) అర్హంతులే కొందరు పరుగెత్తసాగారు. వహ్నిని ఆందోళన పరుస్తూ గాలి వీచనారంభించింది (28) విప్రుల క్షేమము కొరకు హనుమంతుడు పంపాడు. అప్పుడు రాజు ఇటునటు పరుగెత్తుతూ (29) ఎక్కువగా అడుగులేస్తూ, ఏడ్చాడు. బ్రాహ్మణులెక్కడున్నారు అని మాట్లాడుతున్నాడు ప్రజల వలన తెలుసుకొని ఆ రాజు బ్రాహ్మణులున్న చోటికి వెళ్ళాడు. (30) రాజు త్వరగా వెళ్ళి వారి పాదములను గ్రహించి, రాజు భూమి పై మూర్ఛితుడై వడ్డాడు. (31) వినయతత్పరుడై రాజు, విప్రులతో ఇట్లన్నాడు. దశరథ రాముని జపిస్తూ రామ, రామ అని వులుకుతూ. 

ఆతని దాసుని దాసుడను రామునకు ద్విజు నరుదాసుడను. అజ్ఞానమనే చీకటితో గుడ్డివాణ్ణి ఇప్పటిదాకా గుడ్డిగానే ఉన్నాను (33) నాకు కాటుక లభించింది. రామనామమనే గొప్ప ఔషధము. రాముని వదలి ఏ నరులు ఇతర దేవుణి ఉపాసిస్తారో, వారు అగ్నితో దహిస్తారు. నేనెట్లా మూఢచేత నుణ్ణో ఓస్వామి! (34) హరి భాగీరథి, విప్రులు వివ్రులు, భాగీరథి, హరి, భాగీరథి, హరి, విప్రులు ముల్లోకములందు వీటి సారమొక్కటే (35) విప్రులు, భాగీరథ, హరి స్వర్గమునకు సోపానము. రామనామమనే గొప్పతాడులో వైకుంఠ మందు ఎవనితో తీసుకుపోబడుతాడో (వాడు అదృష్టశాలి) (36) అనే రాజు నమస్కరిస్తూ చేతులు జోడించి ఇట్లా అన్నాడు - ఓ విప్రులార! అగ్నిని శమింప చేయండి. మీ శాసనమును ఇస్తాను (37) ఓ విప్రులార! ఇప్పుడు నేను దాసుణ్ణి. నా మాట మరో రకంగా కాదు. బ్రహ్మహత్య వల్ల ఏ పాపం వస్తుందో వరదారాభి గాములకు ఏ పాపం వస్తుందో (38) మద్యం తాగే వారికి ఏ పాపం వస్తుందో, సువర్ణస్తేయులకు ఏ పాపం వస్తుందో గురువతులకు ఏ పాపం వస్తుందో, ఆ పావం నాకు రాని (39) మీరు ఏ కోరికలు కోరితే ఆయా కోరికలను ఇస్తాను. విప్రభక్తి ఎప్పుడూ ఆచరించాలి. అట్లాగే రామభక్తి కూడా (40) ఓ బ్రాహ్మణులార! మరో విధంగా చేయాల్సింది నాకు లేదు (41) వ్యాసులిట్లన్నారు - ఓ భూవ! ఆ సమయమందు విప్రులు దయాళువులైనారు. మరో వుటిక ఏదైతే ఉందో దానిని శావశాంతి కొరకు ఇచ్చారు (42) రోమములు పడిపోగా ఆ సైన్యమంతా బ్రతికింది. దిక్కులు ప్రసన్నమైనాయి. దిక్కులయందు కల్గిన స్వరములు (శబ్దం) శాంతమైనాయి (43) ప్రజలు స్వస్తులైనారు. హర్షంతో నిండిన మనస్సు కలవారైనారు. ముందు మాదిరిగా పుత్రపౌత్రాదికము అట్లాగే ఉన్నారు (44) ముందటిలాగే లోకులు విప్రుల ఆజ్ఞను పాలించే వారైనారు. విష్ణు ధర్మమును వదలి మరో ధర్మాన్ని వారెరుగరు (45) కొత్త శాసనమును చేసి ముందు మాదిరి విధి పూర్వకముగా ఏర్పరచారు. శాస్త్ర ప్రయోజకులైన పాషండులు వెళ్ళగొట్టబడ్డారు. (46) ఉత్తమ అథమ, మధ్యములైన వేద బాహ్యలు నష్టమైనారు. ముప్పది ఆరువేల మంది గోభూజులెవరైతే ఉన్నారో పూర్వం (47) వారి మధ్య నుండి అడవీజ వణిక్ జనులు పుట్టారు. బ్రాహ్మణులకు శులాష కొరకు రాజు వారిని ఏర్పరచాడు (48) నదాచారులు, నునిపుణులు, దేవ బ్రాహ్మణ పూజకులు, పాఖండ మార్గమును వదలి, వారు విషభక్తి వరులైనారు (49) జాహ్నవి తీరమునకు వచ్చి విద్యులకు రాజు శాసనం ఇచ్చాడు. ఎప్పుడైతే వారికి భక్తి పూర్వకముగా శాసనమిచ్చాడో (50) అప్పుడు స్థాన ధర్మము నుండి వెళ్ళి పోయిన ఆ బాడబులు తిరిగి వచ్చారు. ఆ బ్రాహ్మణులు, క్లేశమను భవించిన వారు రాజుతో ఇట్లా విజ్ఞాపన చేశారు.

ఓ భూపతి! మాట జారిన విప్రులు ఎవరున్నారో వారిని తొలగించు. ఇచ్చిన వృత్తి కొరకు వారిలో పరస్పరము వినాదం జరిగింది (52) న్యాయ ప్రదర్శన కొరకు సభాసదులను ఏర్పరచారు. హస్తాక్షరములు కన్పించాక విడి విడిగా ఇచ్చారు. (53) దీనిని విని రాజు తులాదానము చేశాడు. ఆ దానాన్ని ఇస్తుండగా చాతుర్విద్యులు ఇట్లా అన్నారు (54) మనం దానిని వదిలాం తీరిగి దాన్ని ఎట్లా తీసుకుంటాం. వారందరు హేరక ద్విజులు స్తానంనుండి నివారించబడ్డారు. (55) వారు పది హేను వేలమంది వేదవేదాంగ పారగులు. పిదప రామాను వర్తియైన రాజు వారిని (58) పిలిచి ఆ బాడబులలో జాతి భేదమును చేశాడు. త్రయివిద్య బాడబులు ఎవరున్నారో వారు. సేతు బంధమునకు (57) వెళ్ళారు. వారే వృత్తి భాజులౌతారు. ఇతరులు వృత్తిభాజులు కారు. చాతుర్విద్యత్వం పొందిఅ క్కడికి వెళ్ళనివారు (58) న్నారో వారికి వణిజులతో సంబంధంలేదు. వారితో వివాహం కూడా లేదు. జాతిభేదం అయ్యాక గ్రామవృత్తితో సంబంధంలేదు (59) ద్విజభక్తి పరులైన శూద్రులు పాఖండులతో కలవనివారు, జైన ధర్మం నుండి మరలిన వారు ఆరోభూజులు (శూద్రులు) ఉత్తములు (60) ఖండ నిరతులైన వారు రామశాసన లోపతులు, బ్రాహ్మణులు శూద్రులు అంతా ప్రతిబంధంతో తుడినవారే (61) నత్య ప్రతిజ్ఞను చేసినవారు అక్కడివారు సుఖులైనారు. చాతుర్విద్యులను గ్రామంబయట ఆరాజు నివసించేశాడు. (62) రాముడు కోపగించనట్లుగా నేను ఏర్పరచాలి. రామునకు వంటి ముఖ్యులైన వారు రామునకు అనుకూలులైనారు (63) వృత్తి బాహ్యులుగా చేయబడ్డ వారిని చాతుర్విద్యులుగా గుర్తించాలి. కుమార పాలకుడు రాజు అప్పుడు కృతకృత్యుడైనాడు (64) అప్పుడు బ్రాహ్మణుల ఎదుట రాజు వినయంగా ఇట్లా పలికాడు. నాడు గ్రామ వృత్తి లోపించలేదు. ఇది దైవ నిర్మితము (65) స్వయముగా దోషమచరించిన దానికి ఎవరిని నిందించ పనిలేదు. అడవిలో కాష్ఠ వర్షం వల్ల దైవ యోగం వల్ల వహ్ని ఏర్పడినట్లు (66) అభిజ్ఞాన హేతువు కొరకు మీరు వణాన్ని చెప్పారు. రాముని శాసనం చేసి వాయుపుత్రుని కొరకు (67) మీరు బాడబులు వ్యావృతులైనారు. ఆ దోషము ఎవరి పై వేస్తాము. అవసానమందు హరిని స్మరించి, మహాపావ యుతుడైనా (68) త్వరగా విష్ణు లోకమునకు వెళ్లాడు. అనుమానం ఎట్లా ఉంటుంది. మహాత్పుణ్యో దయమందు నరులకు బుధియో విషయ మందు ఏర్పడుతుంది (69) పాపోదయ కాలమందు బుద్ధి విపరీత మౌతుంది. జగత్రయమును ధర్మంతో ఎవడు పరిపాలిస్తాడో (70) భూతములకు ఎవడు అంతరాత్మనో ఆ విషయంలో సంశయం హితము కాదు. ఇంద్రాది దేవతలు, వెనకాది తపోధనులు (71) ఇక్కడ ముక్తి కొరకు అర్చిస్తారు. అందులో అనుమానంలేదు. హితము అది వేయి నామములతో సమానము, రామనామము గానం చేయబడితే. 

ఆతని యందు నమ్మకం లేకుండా సిద్ధి ఎలా కలుగుతుంది. నా జన్మలో చేసిన పుణ్యాన్ననుసరించి విష్ణువు గుర్తులు ఇచ్చాడు (73) పాఖండుడనై నేనే పాపం చేశానో అది మీకు నేను చేసే నమస్కారం వల్ల నశించని. కోపాన్ని వదలి నాపై మీరు అనుగ్రహించండి. (74) బ్రాహ్మణుల వచనము - ఓ రాజా! నీ ధర్మం లోపించింది లభించినవి కూడా నశించాయి. మహాత్ములకైనా జరుగవలసినవి తప్పకుండా జరుగుతాయి. (75) శివుడు నగ్నంగా ఉండటం, హరి పాము పై నిద్రించుట ఇదంతా దైవ కృతము సుఖము దు: ఖములకు ప్రభువాతడు. (76) త్రైవిద్యులు సత్యప్రతిజ్ఞులు రామశాసనాన్ని పొందని మేము ఎక్కడ ఉంటామో ఆ స్థానాన్ని మాకివ్వు (77) వారిమాట విని బ్రాహ్మణుల సుఖాన్ని కోరి, వారి స్థానాన్ని వారికిచ్చాడు. దాని పేరు సుఖవాసము (78) బంగారము, పూలు, వస్త్రములు, గోవులు, కోరికలిచ్చేవి, అన్ని స్వరాలంకారములు, అనేక విధముల వస్తువులు కూడా ఇచ్చాడు (79) రాజు చాలా శ్రద్ధతో ఇచ్చిఆనందించాడు. త్రిమూర్తులు ఎవరిని స్తాపించారో వారు త్రయివిద్యులు (80) ముఖవాసనమందు నాల్గవ వారుగా రాజుతో స్థాపించబడ్డవారు ఆద్విజశ్రేష్ఠులు కలియుగంలో చాతుర్విద్యులైనారు. (81) చాతుర్విద్యులంతా ధర్మారణ్యమందు స్థాపించబడ్డారు. ఆ మహాత్ముడైన రాజునకు వేదోక్తమైన ఆశీస్సుల నిచ్చి (82) రథములతో, అశ్వములతో మోయబడుతూ కృతకృత్యులైన బ్రాహ్మణులు, చాలా ఆనందంతో వారు మెహెరకమును చేరారు. (83) ద్విజులు పౌషశుక్ల త్రయోదశి రోజున శాసనాన్నిపొందారు కులదేవతనుద్దేశించి బలప్రదానము చేశారు. (84) శాస్త్ర ప్రకారము ప్రతిసంవత్సరము బలిదానము చేయాలి. మహాత్ముడైన పురుషుడుమంగళస్నానంచేయాలి (85) ఆరోజుగీత, నృత్యవాద్య ములనుచేయాలి. ఆమాసంలోఆరోజు వారికి వృత్తి నాళంకానివిధంగాచూడాలి. (88) దైవవశాత్తుకాలందాటిపోతే, వృద్ధివచ్చే వక్షంలో, అప్పుడు మొదటిదిచేసి పిదప వృద్ధిది ఆచరించాలి (87) భిన్నప్రపాప్రాయులైన (రెండుకాల్వలు) మోడవంశజులైన త్రైవిద్యులు, అట్లాగే చాతుర్వేదులు గోత్ర పూజ చేస్తారు.జనార్థనుడు నిద్రించినప్పుడు వరమధ్య మందు గోత్రపూజ చేయాలి. పౌషమందు లోంచేసి, లోతస్మార్తము లెవ రాచరిస్తారో (89) అప్పుదుడు కులదేవతలు కోపగించి నాశనం చేస్తారు. వివాహ మహోత్సవ కాలమందు మౌంజీ బంధాదికర్మ యందు (90) అప్పటి నుండి గణనాథుని ముహూర్తము ఉత్తమము (91) వండబడిన బ్రాహ్మణులు ఆమరాజుతో తనశాసనంవల్ల పదిహేనువేల సంవత్సరాల పిదప వారు సుఖవానకమునకు వెళ్ళారు (92) ఏబది ఐదు గ్రామములను పూర్వం రాముడు స్వయంగా ఇచ్చాడు. అక్కడున్న వణిలు బాగా వారికి వృత్తి కల్పించారు (93) అడాలజులు, మాండ లీయులు, గోభూజులు, పవిత్రకులు, బ్రాహ్మణులకు వృత్తివిచ్చువారు (జీవనం కల్గించువారు) బ్రహ్మ సేవ యందు తత్పరులు (94) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రాహ్మణుల శాసన వృత్తి ప్రాప్తి వర్ణన మనునది ముప్పది ఎనిమిదవ అధ్యాయము.