స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
1 అధ్యాయము
శ్రీగణేశాయనమః
శ్రీగణేశునకునమస్కారము - ముల్లోకముల యొక్కసంసారసాగరమును దాటుటకు ఏభ్రువుయొక్క నిర్మల ప్రకాశము పడవలా ఉపయోగపడుతుందో, ఎవని వల్ల ఇదంతా వెలుగుతుందో ఎల్లప్పుడూ సృష్టింపబడి, రక్షింపడి కలిగి ఉందో, ఎవడు చైతన్యమనే వన ప్రమాణములో విలడు, వేదాంతముల చేత తెలుసుకోదగిన వాడో, విభవో ఆట సహజమైన విమల ప్రకాశము గలవరుడైన శ్రీరామచంద్రుని నమస్కరిస్తున్నాను (1) భార్యలు, పుత్రులు, ధనము, పరిజనులు, బంధువర్గము ప్రియమైనవారు తల్లి, అన్నదమ్ములు, తండ్రి, మామగారింటినారు, భృత్యులు, ఐశ్వర్యము, విత్తము, విద్యరూపము, స్వచ్ఛమైనభవనము, యవ్వనము, యువతులు ఇవన్ని మరణ సమయ మంధు వ్యర్థము. ధర్మమొక్కటే తోడుగా ఉండేది. (2) నైమిషారణ్య మందు నిమిష క్షేత్రముందు శౌనకాదులు ఋషులు వేయి(మందికూడి) సంవత్సరములు స్వర్గలోకము కొరకు నత్రయాగము ఆచరించారు. (1) ఒకసారి శౌనకాదులు వచ్చి పనతువి చూచి, చాలా సంతోషమును పొంది మంచి మనస్సు గలిగి తమ కళ్ళతో అతన్ని తాగేసారు (చూచారు) చిత్రమైన కథలను వినుటకు అక్కడ ఋషులు చుట్టూ చేరారు. (2) మహాత్ముడైన ఆ తపస్వులు కూర్చున్న దపలో మహర్షణుడు వినయంగా, ఒక ప్రత్యేకమైన ఆసనమును పంపాడు (3) సుఖంగా ఆతడు కూర్చున్నది చూపి, విశ్నుములు లేవని గమనించి, ఋషులు ఏవో కొన్ని ప్రాస్తా వికమైన కథలను అడిగారు (4) ఓ నాయన! పూర్వము అన్ని వురాణములను మీ నాయన గారు మీరు చెప్పారు కదా! నీవు కూడా కొన్ని, అవన్ని లోమహర్షణికి చెప్పావుగదా (5) ఓసూత! పాపముల నశింప చేసే పుణ్యమైన ఒక కథను చెప్పు. దానిని విని నూరు జన్మల నుండి కలిగిన పాపము విలయమౌతుంది. (6) నూతుని వచనము - భారతి యొక్క పాదద్వయమును, గణనాథుని పాదద్వయము నమస్కరించి దేవతలందరికి నమస్కరించి నేను చెబుతున్నాను. (7) శక్తులను, వస్తువును, గ్రహములను యజ్ఞాది దేవతలను, శుభప్రదమైన వివ్రులకు కవి ముఖ్యులకు, అందరికి నమస్కరించి (8) అభీష్టదేవతలను, (స్త్రీలు) గురునత్తముని నమస్కరించి, శుభులైన దేవతలను (వురుషులు), విశ్లేషించ రామాదులను నమస్కరించి (9) చెప్తున్నాను. వారి విస్మరిస్తేత్రి విథములైన పాపముల నుండి ముక్తులౌతారు. ఇందులో అనుమానంలేదు. వారి అనుగ్రహంతో నేను తీర్థములయొక్క ఉత్తమ ఫలమును చెప్పబోతున్నాను. అందరిని నియమించే ధర్మాత్ముని గూడా నమస్కరించి (10) చెప్తున్నాను. ధర్మారణ్య వతి ఎల్లప్పుడు ముల్లోకములకు వతి, భవానీ వతి, పాపముల నుండి మిమ్ము రక్షించేవాడు. స్థిరమైన భోగ యోగములకు సులభుడు, దేవుడు ఆ ధర్మేశ్వరుడు. అందరి హృదయాలను జీవకళతో వ్యాపించి ఉన్నవాడు. అతనిని ఎల్లప్పుడు ధ్యానించు మనుజులు నంసార కారాగృహమున కుతిరిగిరారు (11).
సూతులిట్లనిరి - ఒకసారి ఆ ధర్ముడు బ్రహ్మసభకు వెళ్ళాడు. ఆ సభను ఆతడు చూచి అప్పుడు జ్ఞాన నిష్ఠుడైనాడు (12) దేవతలతో మునులతో ఆక్రమింవబడిన సభను చూచి ఆశ్చర్యపడినాడు. దేవతలు, యక్షులు, నాగులు, పన్నగులు, అప్సరసలు, (13) ఋషులు, సిద్ధులు, గంధర్వులు, తమతమ వనములందు కూర్చొని ఉన్నారు. ఆ సభ నుఖకరముగా ఉంది. ఓబ్రహ్మ! అంత చల్లగా లేదు. అంత వేడిగా లేదు. (14) ఆకలి, దప్పిక, నివారు పొందటం లేదు. సభ శ్రేష్టములైన నానా రూపములై నమణులతో చేయబడినట్లుగా ఉంది. (15) ఆ సభ స్తంభములతో భరించబడింది శాశ్వతమైనది. నాశములేనిది. దివ్యములైననానా విధములైన భావములలో వెలిగిపోతూ అమితంగా ప్రకాశిస్తోంది. (18) చంద్రుని సూర్యుని అగ్నిని అతిక్రమించిన స్వయం ప్రభ కలది. స్వర్గము యొక్క వృష్ఠ భాగమందు ఉండి వెలుగుతోంది. సూర్యుని భయపెడ్తున్నట్టుగా ఉంది. (17) ఆ సభ యందు రకరకములైన దేవ మనుష్యులను ఆ భగవంతుడు శాసిస్తున్నాడు. వర్వ లోక పితామహుడైన ఒక్కడే బ్రహ్మ స్వయముగా ఎల్లవుడు శాసిస్తున్నాడు. (18) ఈ ప్రభువును ప్రజాపతులు అనుసరించి ఉన్నారు. దక్షుడు, ప్రచేతసుడు, పులహుడు మరీచి ప్రభువైన కశ్యపుడు (19) భృగువు, అత్రి, వసిషుడు, గౌతముడు, అంగిరుడు, పులస్త్యుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు (20) అధర్వుడు, అంగిరసుడు, వాలఖిల్యులు, మరీచిషులు, మనస్సు, అంతరిక్షము, విద్యలు,వాయువు, తేజసు జలము భూమి (21) శబ్దస్పర్శలు, రూపము, రసము, గంధము, ప్రకృతి, వికారము, సదన త్కారణములు (22) అగస్త్యుడు, మహా తేజస్సు గల వీర్యవంతుడైన మార్కండేయుడు, జమదగ్ని భరద్వాజుడు, సంవర్తుడు, చ్యవనుడు (23) మహాభాగుడు దుర్వాసుడు, ధార్మికుడు ఋష్యశృంగుడు, యోగాచార్యుడు మహా తపస్సంపన్నుడు భగవంతుడైన ననత్కుమారుడు (24) అసితుడు దేవలుడు. తత్వ విదుడైన జైగీషవ్యుడు, ఆయుర్వేదము, అషాంగములు, గాంధర్వము (25) చంద్రుడు, నక్షత్రములు, కిరణములు గల సూర్యుడు, వాయువులు, తంతువులు, సంకల్పము, ప్రాణము (26) మహావ్రత పరాయణులైన మూర్తి మంతులైన మహాత్ములు, వీరు, ఇతరులు అనేక మంది బ్రహ్మను చక్కగా ఉపాసించారు. (27) అర్ధము, ధర్మము, కామము, హర్షము, ద్వేషము, తమము, దమము, గంధర్వ అప్సరసల గణములుతూడి ఆ సభకు వస్తున్నారు (28) శుక్రాదులు, గ్రహములు, వాని సమీప మందున్నవి ఇతరములైనవి, మంత్రములు, రథంతరము, హరికన్, వసుమానులు (29) మహితుడైన విశ్వకర్మ అందరు వస్తువులు, పితృ గణములందరు అన్ని హవిస్సులు (30)
ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వవేదము అట్లాగే అన్ని శాస్త్రములు (31) ఇతి హాసములు, ఉపవేదములు అన్ని వేదాంగములు, మేధ, ధృతి, సతి, ప్రజ, బుద్ధి, యశము, సంవత్సరములు (32) ఆ దివ్యమైన కాలచక్రము నిత్యమైన, అక్షయమైన అవ్యయమైన (కాలము) మనో వేగము గల దేవవత్నులందరు (33) గార్హపత్యములు, వాక మందు చరించు వారు ఏతరులు లోక విశ్రుతమైన వారు, సోమవులు, ఏక శృంగులు అట్లాగే తవసులందరు (34) వాగులు, నువరులు, యజ్ఞ పశువులు పితామహుని సేవిస్తున్నారు. స్థావరములు, జంగమములు, అట్లాగే ఇతరములైన మహాభూతములు (35) పురందరుడైన దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, అన్ని ఇచ్చే మహాదేవుడు ఉమతో కూడి ఇక్కడికి ఎల్లవ్వడు వేళాడు (38) ఎల్లప్పుడు దేవతలు నారాయణుడు అట్లాగే ఋషులు వెళ్తారు. వాలఖిల్య ఋషులు, అట్లాగే యోనిజలైన వారు, నిజులు కానివారు (37) ముల్లోకములలో చూడబడుతున్న స్థాణుజంగమములు ఆ సభ యందు అక్కడ తనతో కలిసి కూర్చోగా ఆ ధగ్మవిదుడు తెలుసుకొని, (38) దేవతలతో మునులతో ఆక్రమించబడిన దానిని చూచి, అత్యాశ్చర్యము నొంది, గొప్ప ఆనందంతో కూడిన వాడై, శరీరం పులకరించగా (39) అక్కడ మహా తేజ స్సంపన్నుడైన ధర్మము పాపముల నశింపచేసే కథను అమిత జన్పింపన్నుడైన వ్యానుడు చెప్పిన దానిని విన్నాడు (40) ఆ ధర్మారణ్య కథ దివ్యమైనది అట్లాగే చాలా మనోహరమైనది. ధర్మ అర్థ కామ మోక్ష ఫలములను ఇచ్చేది కూడా (41) వుత్రపౌత్ర ప్రపౌత్రాదుల వలమును ఇచ్చేది కూడా ధరించుట వలన (ధారణ) వినుట వలన, చదువుట వలన, చూచుట వలన కూడా ఫలమిచ్చేది (42) బ్రహ్మాండములో జరిగిన ఆ విస్తారమైన కథను విని, ఆనందంతో విప్పారిన కనులు గలవాడై బ్రహ్మ అనుజ్ఞ పొంది (43) ధర్మాత్ముడైన ఆతడు వనివెరవేరింది కనుక వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు ధర్ముడు పితామహుడైన బ్రహ్మకు నమస్కరించి (44) అప్పుడాతనిచే అనుజ్ఞ పొంది యమ శాననమును ఈతడు వెళ్ళాడు. పితామహుని అనుగ్రహము వలన పుణ్య ప్రదమైన (45) దివ్యమైన పవిత్రమైన పావ నాశకమైన ధర్మారణ్య కథను విని, అనుచరులతో కూడి సంయమిని (తననగరం) గూర్చి ఆతడు వెళ్ళాడు (46) అమాత్యులు అనుచరులతో కూడి యముడు తన నగరం ప్రవేశించాడు. ఇంతలో మహా తేజస్సంపన్నుడు ముని వంగవుడు నారదుడు (47) చూరశక్యముకాని (తేజస్సుకల) వాడు, దయగలవాడు, నమదర్శి, తపోనిధి, విషు భక్తి పరాయణుడు, తనప్పుతో దగ్ధమైన (నశించిన) దేహము కలవాడు (48) నర్వత్ర వెళ్ళ గలవాడు, అన్ని తెలిసినవాడు, ఎల్లప్పుడు శుచియైన నారదుడు, వేదాధ్యయన శీలుడు ఆ సభకు వచ్చాడు (49).
ఆతని చూచి ధర్ముడు భార్యతో సేవకులతో కూడి త్వరగా ఆనందంతో కూడి వేగంగా ఎదురేగుతూ (50) ఓ తపోధన! నీ రాకతో, నేడు నా జన్మ సఫలమైంది, నా కులము సఫలమైంది. వేటి నా ధర్మము సఫలమైంది (51) శాస్త్ర ప్రకారము అర్ఘ్య పాద్యాది విధులతో పూజచేసి, సాక్షార్దండ ప్రణామము చేసి, శాస్త్ర ప్రకారము కూర్చొన్నాడు (52) తనదైన, మహా దివ్యమైన, రత్న కాంచనములతో అలంకరించబడిన ఆసనమందు కూర్చొన్నాడు. సభ అంత చిత్ర మందు దిద్దినట్లుగా (కదలకుండా) ఉంది. గాలి లేనప్పుడు దీపం నిశ్చలంగా ఉన్నట్లు ఉంది (53) కుశల ప్రశ్నలు వేసి స్వాగతంతో ఆతనిని అభినందించి, ధర్మారణ్య కథను స్మరిస్తూ మిక్కిలి ఆనందాన్ని పొందాడు (54) ఆనందించిన అంతరాత్మతో నారదుని పూజించాడు. ఆనందంతో ఉన్న యముని చూచి నారదుడు ఆశ్చర్యకరమైన ముఖము కలవాడై (55) మనస్సులో ఇట్లా ఆలోచించాడు. యముడు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు. అని చాలా ఆనందము కల ఆతనిని యమ రాజ స్వరూపుని చూచి, ఆశ్చర్యమైన మనస్సుకల ఆతనిని అప్పుడు నారదుడు ఇట్లా అడిగాడు (56) నారద వచనము - నీవు ఆశ్చర్యకరమైన దానిని దేనిని చూచావు. ఏమి గొప్ప పదము నీకు లభించింది. నీవు దుషుడివి, నీ కర్మ దుషము, నీ ఆత్మదుషము, క్రోధరూపమును ధరించినవాడవు (57) పావులను శిక్షించుట ఈ విధమైన నీకు ఈ మహత్తరమైన రూపమేమి. నీకీ సౌమ్యరూపము ఎట్లా కలిగింది. ఓ ప్రభు! ఇది నా సంశయము. (58) ఈ వేళ నీవు ఆనందంతో కన్పిస్తున్నోవు. అందుకు కారణమేమి. ఓ మహాయ! నీ హరమునకు కారణాన్ని చెప్పు. అని (59) అనగా ధర్మరాజు ఇట్లా అన్నాడు - ఓ బ్రహ్మపుత్ర ! దీనీని చెబుతాను, వీను అనుమానం వద్దు. పూర్వము నేను, నమస్కరించుటకై బ్రహ్మ మందిరమునకు వెళ్ళాను (60) సర్వలోకములతో పూజింపబడే సభా మధ్యమందు కూర్చొని, ధర్మవర్గముతో కూడిన అనేక కథలను అక్కడ విన్నాను (61) కథలు పుణ్య ప్రదములు, ధర్మయుతములు, రమ్యములు, వ్యాన ముఖము నుండి విన్నటువంటివి. ధర్మమ అర్థములతో కూడినవి. అన్ని పాప సమూహములను నశింప చేసేవి (62) ఆ కథలను విని సర్వపాపముల నుండి, బ్రహ్మహత్య నుండి ముక్తులౌతారు. ఓ ముని! నూటొక్కటి పితృగణములను తరింపచేసేవి (63) నారదుని వచనము - ఆ కథలెట్టివో, నీవు విన్న ఆ కథలను నాకు వినిపించు. ఓ మహాబాహు! యమ! నేను ఆ కథను వినదలిచాను (64) అనగా యముడిట్లన్నాడు - ఒకసారి బ్రహ్మలోకంలో నేను బ్రహ్మను నమస్కరించుటకు వెళ్ళాను. కార్యమేది, అకార్యమేది తెలిసికొనుటకు అక్కడికి వెళ్ళాను (65) ఓ మునిసత్తమ! నేనక్కడ అద్భుతాన్ని చూచాను, విన్నాను కూడా. కృష్ణ ద్వైపాయనుడు చెప్పిన దివ్యమైన ధర్మారణ్య కథను విన్నాను.
ఓ బ్రహ్మన్ ! బ్రహ్మాండ ముందున్న, మహా పుణ్యమైన శుభమైన కథను విని, గుణములతో నిండిన, సత్యము కలిగిన ఆ కథతో కల్గిన ఆనందముతో సంతసించి ఉన్నాను. (67) ఓ మునిశ్రేష్ట! మీ రాక కారణము కూడా మరో ఆనందకర విషయము. మీ రాక శుభమునకు, సుఖమునకు, క్షేమమునకు, జయమునకు కారణము (68) ఈ వేళ నేను కృతకృత్యుణి ఐనాను. ఓ ముని! ఈ వేళ నేను సుకృతిని. మీ పాద ద్వయ దర్శనము వలన ఈ వేళ నేను నిజంగా, ధర్ముడను పేరు కలవాళ్లే నాను (69) ఓ నారద! ఈ వేళ నేను పూజ్యుడను కృతార్థుడను ధన్యుడను ఐనాను. మీ పాదానుగ్రహం వలన ముల్లోకములలో నేను పూజ్యుడనైనాను (70) నూతుని వచనము - ఈ విధమైన మాటలతో ముని నత్తముని సంతోష పరిచాడు. అప్పుడు ముని శుభమైన ధర్మారణ్య కథను మిక్కిలి భక్తి కలిగి చెప్పమని అడిగాడు (71) నారదుని వచనము - ఓ ధర్మ వ్యాసుని ముఖము నుండి శుభమైన ధర్మారణ్య కథను విన్నాను. అదంతా నాకు వివరంగా ఉన్నదున్నట్లుగా చెప్పు (72) అనగా యముని వచనము - ఓ బ్రహ్మన్ ! నేను ఎల్లప్పుడు సుఖ దుఃఖములు గల ప్రాణుల విషయంలో వ్యగ్రుడను. వారి వారి కర్మల ననుసరించి సుఖము కన్న ఇతరమైన గతిని ఇచ్చేవాడిని (73) ఐనా సాధు సంగమము ధర్మము కొరకే ఏర్పడుతుంది. అది ఈ లోకమందు, పరలోకమందు కూడా క్షేమమునకే, సుఖమునకే (74) వ్యాన ముఖము నుండి చెప్పబడిన బ్రహ్మ సన్నిధిలో విన్న దంతయు. మనుష్యుల హితము కొరకు చెబుతాను (75) సూతుని వచనము - బ్రహ్మ సభలో విన్నదంతయు యముడు చెప్పాడు. ఆ మధ్య అవసానములు అంతా చెప్పాడు. ఇందులో అనుమానము లేదు (76) కలి ద్వాపరముల మధ్య యుధిష్ఠిరుడైన ధర్మపుత్రుని దగ్గరకు ఈ నారదుడు వెళ్ళాడు. ధర్మ సుతుని భూలోకంలోని రాజ్యమునకు (77) పచ్చి శ్రీ హరి అంశమైన నారదుడు కన్పించాడు. మండుతున్న అగ్నిలా ఉన్నాడు. బాలసూర్యుని వంటి చూపులు గలవాడు (78) కుడివైపు కప్పబడిన విపులమైన జడల నమూహమును ధరించాడు. చంద్ర కిరణముపలె తెల్లనైన వస్త్రముల ధరించారు. బంగారు భూషణములు గలవాడై (79) చంకయందు వేలాడే మహతి అనెడు వీణను నఖీని వలె గ్రహించాడు, నల్లని జింక చర్మమును పై భాగమున కలిగి, బంగారు యజ్ఞోపవీతము కలిగి (80) దండము, కమండలువు చేత ధరించి, సాక్షాత్తు మరొక అగ్నిలా ఉన్నాడు. లోకంలోని రహస్యమును ఛేదించేవాడు. విగ్రహములకు (తగాద) గుహ వంటి వాడైన (నిలయము) (81) మహర్షి గణములతో కూడిన, విద్వాంసుడైన, గాంధర్వ వేద (సంగీతము) విదుడైన, వైరకే యందు నిపుణుడైన, విప్రుడైన, మరొక కలివంటి వాడైన వాడు బ్రాహ్మ (నారదుడు), (82) దేవ గంధర్వ లోకములకు తొలి వక్త, మంచి నిగ్రహము కలవాడు, చతుర్వేదములను గానం చేసేవాడు, హరి నదుణములను కీర్తించే వాడు (83) ఆ నారదుడు వీవ్రర్షి బ్రహ్మలోకమందు తిరిగేవాడు, అవ్యయుడు ఆతడు ధర్మరాజు పాలించే నగరమునకు ఆనందంతో వచ్చాడు (84) అక్కడ కుర్చున్నవారు రాజ శ్రేష్ఠులు, మహాత్ములు, గొప్ప గొప్ప గంధర్వులు కూర్చున్నారు (85) లోకములన్ని తిరుగుతు ఆ మహర్షి శ్రేష్ఠుడు ఇక్కడి కొచ్చాడు. గొప్ప తేజన్పుకల నారదుడు ఋషులతో కూడి అప్పుడు అక్కడకి వచ్చాడు (86) వచ్చిన ఆ నారద ఋషిని చూచి అన్ని ధర్మములు తెలిసిన ఆ ధర్మరాజు సింహాసనము నుండి లేచి అప్పుడు ఎదురుగా వెళ్ళాడు.
అప్పుడు వినయంతో అవనతుడై అ ప్రేమతో నమస్కరించాడు. శాస్త్ర ప్రకారము ఆతనికి అతనికి తగిన ఆసనమును ఇచ్చాడు (88) ఆవును, మధుపర్కమును, అర్ఘ్యమును ఇచ్చాడు. రత్నములతో అన్ని కోరికలర్పిస్తూ ధర్మమెరిగిన ఆతడు పూజించాడు (89) యథాధిగా పూజను పొంది ఆ ధర్మ విదుడు సంతోషించాడు. ఓ మహాభాగ! నీవు క్షేమమా. నీ తపస్సు కుశలమే కదా (90) దుష్కడైన రాక్షసుడెవడైనా స్వర్గభూవతిని బాధించటములేదుకదా. ఓముని! నీవు కల్యాణ రూపుడవు. నీవు సురలు, అసురులతో నమస్కరించబడే వాడివి. అంతట వెళ్ళగలనాడివి అన్ని ఎరిగిన వాడివి. ఓ బ్రహ్మపుత్ర! కృపావిధి (91) నారదుని వచనము - అన్ని విధముల వాకివేళ కుశలమే. బ్రహ్మయొక్క అనుగ్రహం వలన ఎల్లప్పుడు కుశలమే. ఓ మహాభాగ! ధర్మపుత్ర! యుధిష్ఠిర! నీవు కుశలమేకదా (92) ఓ రాజేంద్ర! తమ్ములతో తడి నీ మనస్సు ధర్మకార్యములందు రమిస్తోంది కదా. భార్యలతో, పుత్రులతో, భృత్యులతో, గజములు, గుణములు వీటన్నిటితో క్షేమంగా సుఖిస్తూ ఉన్నావు కదా (93) ఓ ధర్మజ! ఔరసులైన వుత్రులను వలె ప్రజలను ధర్మంతో పాలిస్తున్నావా. ఇందులో ఆశ్చర్యమేముంది, ఆ ప్రజలు నీ పాలనతో ధన్యులు (94) పాలన, పోషణ ఇదియే రాజుల ధర్మము, నిశ్చయము, ఆయా ధర్మముల భోక్తవు నీవే అని ఈ విధముగా మనువు చెప్పాడు (95) యుధిష్టరుని వచనము - మీపాద స్పర్శతో నా రాష్ట్రము క్షేమము. ఓ మహాభాగ! నీ దర్శనంతో నేను పాపములన్ని పోయినవాడనైనాను (96) నేను ధన్యుణి, కృతకృత్యుణి. ఈభూమియందు నేను భాగ్యవంతుణి. నేనీనాటికి నుకృతినై వాను. నీ వంటి బ్రహ్మపుత్రులు నా ఇంటికి రావటం వలన (97) ఓముని సత్తమ! ఓ బ్రహ్మ ! ఈ వేళ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు. సాధువులను అనుగ్రహించుటకొరకే వస్తారు. మీకు ఏ పనితో మాత్రం ఏం ప్రయోజనం (అవసరంలేదు) (98) నారదుని వచనము - ఓ నృవ శ్రేష్ఠ ! నేను శమనుని దగ్గర నుండి వచ్చాను. బ్రహ్మ ఎదురుగా వ్యాసుడు చెప్పిన పౌరాణికమైన శుభమైన కథను (99) ధర్మారణ్యమునకు చెందిన దివ్యమైన, సర్వ సంతాపముల తొలగించే కథను ఏకథవింటే పాపములన్నింటి నుండి, బ్రహ్మహత్య నుండి ముక్తులౌతారో ఆ కథను (100) పదివేల హత్యలను శమింపచేసే, తాప త్రయముల నశింపచేసే కథను, ఏకథను అతిభక్తితో వింటే కఠినుడు మృదువుగా మారుతాడో ఆ కథను (101) ధర్మరాజు నా ఎదురుగా చెప్పిన ఆ కథను విని వచ్చాను అనగా ఆతనిని అమేయమైన ఆత్మకల యుధిష్టరుడు ఆ ధర్మముచే ఆనందం కల్గించే కథను అడిగాడు (102) యుధిష్టురుని వచనము - ఓ ద్విజసత్తమ! ధర్మారణ్యా శ్రితమైన పుణ్యకథను నాకు అనుగ్రహంతో లోకముల హితమును కాంక్షిస్తు చెప్పండి అని అనగా (103) నారదుని వచనము - ఇది మాకు స్నాన కాలము వారు కథలు చెప్పే సమయము కాదు. ఐనా ఓ రాజ! వినండి. నేను ఉపదేశాన్నిస్తున్నాను (104) మాసములలో మాఘమాసము ఉత్తమము స్నాన దావాదికములందు శ్రేష్ఠము. ఆ మాఘమాసంలో స్నానం చేసిన వాడు సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. (105) ఓ రాజా! నీవు ఇప్పుడు గంగలో స్నానం చేయటానికి త్వరగా వెళ్ళు. ఓ నృపోత్తమ! ఈ రోజు వ్యాసుడొస్తాడు (106) ఓ మహాభాగ! ఆతనిని, నీవు అడుగు,నీకు శుభమైన దానిని వినిపిస్తాడు. సర్వతీర్థముల ఫలమును, అద్భుతమైన పుణ్యమును (107) వాని గతము, వర్తమానము, భవిష్యత్తు వానిలో ఉత్తమ, అధమ మధ్యమములు అదంతా ఇతి హానములలో ఉన్న దానిని చెబుతాడు (108) ధర్మారణ్యము యొక్క పురాతనమైవ సకల వృత్తాంతమును సత్యవతీ పుత్రుడైన వ్యాసుడు నీకు అంతా చెబుతాడు (109).
సూతుని వచనము - ఈ విధముగా బ్రహ్మ కొడుకైన నారదుడు పలికి అక్కడే అంతర్థానమైనాడు. ఆతడు వెళ్ళాక ఆ రాజు మంత్రులతో కూడి క్రీడించసాగాడు (110) ఇంతలో సత్యవతి పుత్రుడు అక్కడికి వచ్చాడు. అని విదురుడు ధర్మరాజుకు తెలియజేశాడు (111) సూతుని వచనము - ముని వచ్చాడని విని అందరు ఆనందంతో నిండి పోయారు. ధర్మరాజుతో కూడి అందరు భీమాదులు లేచారు (112) పిదప ఎదురేగి, తలవంచి ఆనందించాడు. దండము వలె ఆతనికి నమస్కరించి అప్పుడు తమ్ములతో కూడి (113) మధుపర్క వీధిలో సుశోభనమైన పూజను చేసి సింహాసన మందు కూర్చోబెట్టి అప్పుడు యోగ క్షేమములు విచారించాడు (114) ధర్మమెరిగిన వాడు పుణ్యమైన దివ్యమైన కథను వినిపించాడు. కథ చివర మునిసింహముతో ఇట్లా అన్నోడు (115) యుధిష్ఠిరుని వచనము - ఓ బ్రహ్మన్! నీ దయవలన నేను శ్రేష్ఠమైన కధలను విన్నాను. ఆ వద్ధర్మములు, రాజ ధర్మములు, మోక్ష ధర్మములు అనేకంగా విన్నాను (118) పురాణ ధర్మములు అనేక వ్రతములు విన్నాను అనేక రూపములైన తీర్థముల గూర్చి, అన్ని దేవాలయముల గూర్చి విన్నాను. (17) ఇప్పడు శుభ్రమైన ధర్మారణ్య కథను వినదలిచాను. దానిని వింటే బ్రహ్మవధాది పాపము నశిస్తుంది. (118) ధర్మారణ్య మందున్న తీర్థముల గూర్చి ఉన్నదున్నట్లుగా వినదలిచాను. ఇది ఎవరు నిర్మించిన స్థానము. దీనిని ఎందు కొరకు నిర్మించారు (119) దీనినెవరు రక్షించారు. పాలించారు. ఏ కాలంలో ఇది నిర్మించబడింది. ఇంతకు ముందు ఇక్కడ ఏమేమి జరిగింది. అడుగుతున్న నాకు దీనిని చెప్పండి (120) గతంలో వర్తమానంలో భవిష్యత్తులో ఆ స్థానంలో ఏం జరుగుతుందో అదంతా ఈ రోజు చెప్పండి. తీర్థముల గూర్చి ఉన్నదున్నట్లుగా చెప్పండి (121) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు యుధిష్ఠిర ప్రశ్న వర్ణనమనునది ప్రథమోఽధ్యాయము.
