స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
23వ అధ్యాయము
తా ॥ వ్యాసునివచనము – ఈ మీదట పూర్వం బ్రహ్మ ఏం చేశాడో దానిని చెబుతాను అదంతా ఈ వేళ చెబుతాను. ఏకాగ్ర చిత్తంతో వినండి దేవతలకు దానవుల కువైరం వల్ల యుద్ధం జరిగింది. మహాదుష్టమైన ఆ యుద్ధముందు దేవతలు సంక్లిష్ట మాననులైనారు. ఉద్వేగంతో వారు బ్రహ్మను శరణు వేడారు. దేవతలవచము - ఓ బ్రహ్మ ఏప్రకారంతోదైత్యులవధ జరుగుతుంది. త్వరగా వారు ఈ వేళ ఉపాయం చెప్పండి. బ్రహ్మవచనము - నేను శంకరుడు విష్ణువు మేము పూర్వము యముని తపస్సుకు సంతసించి ధర్మారణ్యాన్ని నిర్మించాము. ఆక్కడ చేసిన దానము, యజ్ఞము ఉత్తమ తపము అదంతా కోటి గుణితమౌతుంది. అనుమానం లేదు. పాపముని వుణ్యముని అంతా కోటి గుణితమౌతుంది. అందువల్ల దైత్యులు ఎప్పుడూ తిరస్కరించబడలేదు. ఓ సురలార! బ్రహ్మ వాక్యమును విని దేవతలంతా ఆశ్చర్యపడి, బ్రహ్మనుముందు పెట్టుకొని ధర్మారణ్యమును చేరారు అక్కడ వేయి సంవత్సరాలు, ముఖ్యమైన నత్రము (యజ్ఞం) ఆరంభించి, అంగిరసుని మార్కండేయుని ఆచార్యునిగా చేనుకొని, మహామతీయైన ఆతడు, అత్రిని కశ్యపుని హోతగా చేసుకొని, జమదగ్నినీ గౌతముని అధ్వర్యునిగా ఏర్పరచారు. భరద్వాజుడు, వసిష్ఠుడు ప్రత్యధ్వర్యులుగా ఏర్పాటైనారు. నారదుని వాల్మీకిని, నోదన కొరకు ఏర్పరచారు. (డ్రైవర్) బ్రహ్మాననమందు బ్రహ్మను ఆదరంతో ఉంచారు. దేవతలు నాలుగు కోనులంత వెడల్పు వేదిని చేశారు. యజ్ఞంలో జవం కొరకు ద్విజులందరిని పిలిచారు. వారుబుక్యజునసాము అధర్వ వేదములను పలుకుతున్నారు. గణనాథుని శంభుసుతుని, కార్తికేయుని, వజ్రధరుడైన, ఇంద్రుని, జయంతుని, చంద్రుని సూర్యుని నలుగురు ద్వార పాలకులు శూరులను దేవతలను ఏర్పరచారు. హవ్యవాహనుడు (అగ్ని) రక్షోఘ్న మంత్రముతో హోమం చేస్తున్నాడు తిలలు, యువలు మధువు ఆజ్యము కలిపి వేదమంత్రములతో అప్పుడు ఆ దేవతలు హోమం చేశారు ఓ నరేశ్వర.
తా ॥ 2 ఆఘారములు (నెయ్యి అగ్నిలో చల్లటం) 2 ఆజ్యభాగములు హోమం చేసి, ఆ పిదప ద్రాక్ష, చెరుకు పోక, వారింగ, నిమ్మ మాది ఫలములు ఉత్తరం నుండి (తర్వాత) నారికేళము దాడిమము యధాక్రమముగా మధువు, ఆజ్యము పాలు పోసినవి నువ్వులు శర్కర గలవి తండులములతో శతపత్రములలో (తామరపూలు) యజ్ఞములో మౌనంగా (మాటను అదుపులో ఉంచుకొని) హోమం చేయాలి. మహాభాగులు ఆలోచించి, యజ్ఞమును దక్షిణముగా చేసి ఉత్తమముగా శుభముగా యజ్ఞము చేసి ఆనందమును పొందారు. ఎడతెగని అన్నమును దీనులకు అంధులకు కృపణులకు పెట్టారు. విశేషించి బ్రాహ్మణులకు వారి కోరికననుసరించి అన్నము పెట్టారు. శర్కరతో చేసిన పాయనము, నేయి శాకములతో పాటు పెట్టారు. మండకములు (కేకుల వంటివి) వడియాలు, అపూపములు, మంచి గుమ్మడులు, వేయి లడ్డూలు, ఫేణిలు ఘర్ ఘరాదులు ఓదనము, కందిపప్పుతో చేసినది (దాలీ = దారీ = వగిలిన) శుభమైనది, అట్లాగే పెసరపప్పుతో చేసినది ఏర్పటముతో (చేసిన) వటికలు (గడ్డితోని) విచిత్రమైన లేహ్యములు శోంఠి, పిప్పళ్ళు, మిరియాలు వేసి చేసినవి గుగ్గిళ్ళు కోమలమైన మిరియాలు, శుభమైన నారికేళములు అల్లకలిగిన మిర్యాలు కూడిన దోసకాయ కుర, ఈ విధమైన అన్నములు రకరకాల శాకములు వీటితో బ్రాహ్మణులకు అందరికి భోజనం పెట్టి ధర్మారణ్యమందు నివసించే వద్దెనిమిదివేల, వుత్ర నహితులైన బ్రాహ్మణులను భుజింపజేయాలి. ప్రతిదినము దేవతలు వాడవులను భుజింప చేస్తున్నారు. ఈ విధముగా వేయి వంవత్సరాలు దేవతలు యజ్ఞం చేసి పిదప దైత్యవధ చేసి నిర్భయత్వాన్ని పొందారు. వారు దేవతలంతో, మరుద్గణములు త్వరగా స్వర్గానికి వెళ్ళారు. అట్లాగే అప్పరపలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్ళారు. రమ్యమైన కైలాసమునకు, విష్ణు వల్లభమైన వైకుంఠమునకు, మహాపుణ్యమైన బ్రహ్మ లోకమునకు దేవతలంతా చేరిచాలా ఆనందించారు. ఉత్తమమైననందనము చేరి ఆనందించారు. తమ తమ స్థానాల్లో స్థిరులై అందరు నిర్భయులై ఉన్నారు. పిదప చాలా కాలం తరువాత మరో కృతయుగ మందు లోహాసురుడు మదోన్మత్తుడు ఎప్పుడూ బ్రహ్మవేషం ధరిచేవాడు
తా ॥ వచ్చి విప్రులందరిని ధర్మ విత్తములను భయపెడ్తాడు. శూద్రులను వణిజులను దండ(వుదెబ్బల)ముతో కొడ్తాడు. యజ్ఞాదులు ధ్వంసం చేస్తాడు. హోమ ద్రవ్యాలు భక్షిస్తాడు. వేదికలను, బావులను చూచి కష్మలంతో పాడు చేస్తాడు. పుణ్యభూములను మాత్రము విడిచి వురీషముతో పాడు చేస్తాడు. ఓ రాజ! వాడు దుఃఖముతో స్త్రీలను దూషిస్తాడు. అప్పుడు బాడబులందరు లోహానుర భయాతురులై, నష్టులైన వరివారులైవ దాదిత్కులకు వెళ్తారు. ఆవణిజులు భయోద్విగ్నులై బ్రాహ్మణులను అనుసరిస్తారు. మహాభయంతో భాగా భయపడి దూరము పోయి, విచారించి బ్రాహ్మణులతో, శూద్రులతో అందరు ఏకమై వెళ్తారు. పుణ్యతమమైన ముత్తారణ్యమునకు నిర్జనమైన చోటికి వారు వెళ్తారు. ఓ నరేశ్వర! చాలా కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ గ్రామము వణిక్ నామముతో పిలువబడింది. వారు నివసిస్తున్నారు లోహాసుర భయముతో విప్రనామముతో నిర్మితమైంది. వణిజులు నిర్మించారు. కాబట్టి ఆ పేరుతో పిలిచాడు శంభువు శుంభు గ్రామమని లోకంలో ప్రసిద్ధమైంది. విఖ్యాతిని పొందింది. కొందరు భయంతో నష్టులైన వణిజులు మొదట వారు కొద్ది దూరం పోయి ఉత్తమమైన గ్రామము ఏర్పరచారు. విప్రుల ఆగమనాన్ని కాంక్షిస్తూ వారు వనతి కల్పించారు. మండలము అనే పేరుతో గ్రామమేర్పరచి నివసించారు. వివ్రుల సహవాసంనకు దూరులై కొందరు వణిజులు లోహానుర భయార్ధితులై వేరే మార్గమున పోయిన వారు ధర్మారణ్యమునకు కొద్ది దూరంగా పోయి విచారించ సాగారు. మనం ఏ మార్గంలో వచ్చాము. ద్విజాతులు ఏ మార్గంలో వెళ్ళారు. అని చాలా చింతను పొంది అక్కడైతే నివసించారు అన్యమార్గంలో వెళ్ళారు కాబట్టి ఆ పేరొచ్చింది. ఈ భూమి యందు అడాలంజమని గ్రామమును ఏర్పరచారు ఏ గ్రామంలో నివసించే వణిజుడు ఏ పేరు గలవాడౌతాడో ఆ గ్రామమునకు ఆతని పేరే ఏర్పడిందీ, ఓ పృథ్వివతి! వణిజులు అట్లాగే విప్రులు భయార్జితులై మోహం పొందారు. అందువల్ల వారందరు మోహ అనే సంజ్ఞను పొందారు ఇట్లా ప్రకాశము నశించారు. వారు పది దిక్కులకు వెళ్ళారు కూడా. ధర్మారణ్య మందు బాడబులు కాని వణిజులు కాని ఉండరు అవ్వడు ధర్మారణ్యము వసించే వారు లేకుండా ఐంది. దుర్లభమైంది. నర్వ తీర్థములకు భూషణమైంది. దాన్ని లోహాసురుడు అట్లాచేశాడు నష్టద్విజము, నష్టతీర్థముగా ఆ స్థానాన్ని చేసి, దానవుడు అధికమైన ఆనందాన్ని పొంది పిదప తన ఇంటికి వెళ్ళాడు. అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు జాతిభేద వర్ణన మనునది ఇరువది మూడవ అధ్యాయము.
