స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
26వ అధ్యాయము
తా ॥ వ్యాసుని వచనము - మార్కండేయుడు ఆరంభించినది, స్వర్గ ద్వారము తొలగించినట్టిది. ఫల కాంక్షతో అక్కడ దేహత్యాగం చేసినవారు చివర ఆ ఫలితాన్ని పొందుతారు. విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. ఇంతకన్నా ఎక్కువగా చెప్పి ఏం లాభం. ద్వారపతి యందు నరులు విష్ణు లోకం పొందే కొరకు దేహత్యాంగ చేయాలి. కనిపించే జలమందు, అగ్నియందు ఉన్న నరులు సర్వపాప వినిర్ముక్తులై ఎప్పుడూ విష్ణు పురికి వెళ్తారు. వ్యాధిలేని వాడు భుజించకుండా వెళ్తే ఆతడు సర్వపాప వినిర్ముక్తుడై విష్ణుపురికి వెళ్తాడు శత వర్ష సహస్రముల చివరి వరకు స్వర్గమందుంటాడు. ఆ ద్విజుడు బ్రాహ్మణులకన్న ఉత్తమమైనది. పవిత్రమైనది. పావనమైనది భూమి మీద మరొకటి లేదు ఉపవానములతో తుల్యమైనది తపస్సు కర్మ ఏదీ లేదు వేదముకన్న పరమైన శాస్త్రము లేదు. తల్లికన్న మరో ఉత్తమ గురువు లేడు ధర్మము కన్న వరమైనది లేదు. ఉపవాసం కన్న ఉత్తమమైన తపస్సులేదు. ఇక్కడ స్నానం చేసి పిండోదక క్రియలు శ్రాద్ధము చేసిన వాని పితరులు బ్రహ్మ ఉన్నంత వరకు వగలు రాత్రి తృప్తినందుతారు. నరుడు ఆ తీర్థంలో స్నానం చేసి కేశవుని పూజిస్తే అన్ని పాతకముల నుండి ముముక్తుడై విష్ణులోకం పొందుతాడు. తీర్థములలో ఉత్తమ తీర్థముంది. విష్ణువు దగ్గరలో ఉన్న తీర్థమే ఆతడు ఆ తీర్థముందున్న వాని పావమంతా హరిస్తాడు. మోక్షములకు ముక్తినిస్తుంది. ధనార్థులకు ధనమునిస్తుంది. ఆయుస్సునిస్తుంది, సుఖమునిస్తుంది, సర్వ కామముల ఫలమునిస్తుంది మరో తీర్థంతో పనేమి, అక్కడ జనార్దనుడుండగా అందరి మీద దయచూపే కొరకు నిత్యము స్వయంగా ఉంటున్నాడు శ్రద్ధతో అక్కడ ఇచ్చిన కించిద్దానము కూడా అదంతా ఈ లోకంలో పరత్ర కూడా అక్షయమౌతుంది యజ్ఞము, దానము, తపము వీటిలో బుధుడు ఏ ఫలాన్ని పొందుతాడో అదిక్కడ స్నానమాత్రం తోనే లభిస్తుంది. మంచి సేవకులు గల శూద్రులు గూడా పొందుతారు ఏకాదశి యందు ఉపవశించి. ఇక్కడ శ్రాద్ధము చేసిన వారు పితరుల నందరిని నరకం నుండి ఉద్ధరిస్తారు. అనుమానం లేదు వరమాత్మయైన జనార్దనుడు అక్షయ్యమైన తృప్తిని పొందుతాడు అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ మందు ద్వారకా మాహాత్మ్య మనునది ఇరువది ఆరవ అధ్యాయము.
