స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

27వ అధ్యాయము

తా ॥ సూతుని వచనము - అక్కడ దాని సమీపంలో ఉన్న మార్కండుడు చూచిన తీర్థము గోవత్సమను పేరు గలది. లోకమంతా ప్రసిద్ధమైంది. అక్కడ అంబికాపతి గోవత్స రూపంలో అవతరించి, ఆ జగత్పతి స్వయంభూ లింగ రూపంలో ఉన్నాడు  రుద్ర భక్తుడు, మహాబలుడు వరాహకుడని ఉండేవాడు. పరపురముల జయంచే ఆ రాజు వేట వస్తువులతో వేటాడు వారితో కుడి ఉన్నాడు ఆ రాజు యొక్క పదాతి (కాలిబంటు) మృగముల మధ్య యందున్న గోవత్సమును చూచి రాజుతో అన్నాడు. ఓ నృప సత్తమ కుతూహలం కలిగించే విషయాన్ని నేను చూశాను మృగ సమూహం మధ్య ఉన్న గోవత్సమును నేను చూశాను. ఆ దూడ తల్లి లేకుండా ఆ మృగములందే అనురక్తబంది చూడాలని కుతూహలంగా రాజు ముందు వదాతి సైన్యంతో అన్నాడు. నాకు చూపండి. గోవత్సము ఉన్న చోటును, అని ఆ పదాతి అడవికి వెళ్ళి ఆ వత్సమును రాజుకు చూపారు. తాలిబలమును చూచి భయపడి మృగములు పరుగెత్తాయి వస్తున్న ఏనుగులను సైన్యాన్నిచూచి గోవత్సము అప్పుడు నిలిచింది. రాజు ధాన్ని పట్టుకోదలచి ఆదరంతో సైన్యంలో ప్రవేశించాడు అక్కడున్న గోవత్సవాని రాజు స్వయంగా చూచాడు. రాజు పట్టుకోబోయేంతలో అదీ ఒక సముజ్జ్వల లింగంగా మారింది దానిని చూచి రాజు ఆశ్చర్యపడి, ఇదేమిటి అని ఆలోచించాడు. ఇట్లా ఆలోచిస్తున్నంతలో రాజు తన దేహాన్ని విడిచి దినమునకు వెళ్ళాడు ఇంతలో ఆకాశంలో అంతట దేవతల జయధ్వని వినిపించింది. ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది. ఆ క్షణంలోనే రాజు శివ లోకమునకు వెళ్ళాడు ఇంతలో ఆ శివ సంబంధమైన గోవత్సమును, బాలకమును ఎదుట ఉన్నదానిని చూచాడు. నిజంగా ఇది మహాదేవుడే, వత్సరూపి మహేశ్వరుడే  అని దానిని పట్టుకోవటానికి రాజు ప్రయత్నించాడు. దానిని పట్టుకున్నాడు కూడా. అప్పుడు ఆ దేవలింగము ఎంత ప్రయత్నించినా లేవలేదు. అప్పుడు దేవతలు ఈతనితో పాటు ఈశ్వరుని ప్రార్థించ సాగారు. దేవతల వచనము - ఓ సర్వ దేవేశ, భగవాన్, విభు మీరిక్కడే ఉండాలి. సర్వ లోకముల హితము కొరకు శుక్లలింగరూపములో ఉండాలి అనగా శ్రీ మహాదేవుని వచనము - ఓ దేవతలార! ఇక్కడ ఎల్లప్పుడు నేను లింగ రూపంలో ఉంటాను. భాద్రపద కృష్ణ పక్షం అమావాస్యనాడు ఆరోజు విధానం ప్రకారము స్నానంచేసి, లింగాన్ని పూజించిన వారికి భయముండదు పిండదానం లేనందువల్ల పూర్వజులు, శాశ్వతకాలము గౌరవనరకము ఘోరమైన కుంభీపాకమునకు పోయినవారు అనేక నరకములందున్న వారు, తిర్యగ్యోని గతులు వీరందరికి ఒక్కసారి పిండప్రదానం చేస్తే వారికి అక్షయమైన గతి కలుగుతుంది.

తా ॥ పిదప ఆవలాహక రాజు దేవతలందరితో కూడి నర్వ దేవతలకు సమీపముగా ఆలింగాన్ని స్థాపించాడు  లోకం లహితం కొరకు అనేక దానాలు చేశాడు. ఈ విధంగా పూజిస్తుండగా రుద్రుడు స్వయంగా వచ్చాడు  రుద్ర వచనము - ఈ రాత్రియందు మనులు శ్రద్ధాభక్తి సమన్వితులై దేవేశుని పూజించిన వారి పుణ్యము అనంతమైనది  గీతశాస్త్ర వురః పరముగా జాగరము చేసిన వారు ఆమర్త్యులు నూటొక్క కులమును ఉద్ధరిస్తారు  పరమాద్భుతమైన గోవత్పలింగమును చూడనంత వరకు తీర్థములు నైమిషము, పుష్కరము, గయ, ప్రయాగ, ప్రభాసము (తీర్థము) ద్వారక, మథుర అర్బుదము ఇవన్నీ గర్తిస్తాయి. గోవత్సమునకు వెళ్ళాలని మనసులో తలిస్తే చాలు అప్పుడు తన వంశములోని వారంతా ఆనందంతో నృత్యం చేస్తారు. ఇది నిశ్చయము మాటవి వచనము - అక్కడ అద్భుతమైన మరో వృత్తాంతముంది. దానిని వినండి, ఓ ద్విజులార! దానిని విన్న మాత్రం చేత నర్వషావ క్షయమౌతుంది దేవతలంతా కలిసి పురాతనమైన లింగాన్ని స్థాపించాక విష్ణువు, దేవతలందరు ప్రతిష్ఠించిన శక్తివల్ల ఆ లింగము ప్రతిరోజు మాత్రం ప్రమాణంగా వృద్ధి చెందసాగింది. అప్పుడు ఆ మునులు దేవతలు భయపడి ఆతనిని శరణువేడారు దేవతల వచనము- ఓ దేవేశ! నీ వృద్ధిని ఉపసంహరించుకో. దానివల్ల లోకము లకుమే లౌతుంది. ఇట్లా అనగా అప్పుడు లింగం నుండి ఆశరీరవాణి ఇట్లా పలికింది శివవాణి వచనము - ఓ లోకములార! మీకు భయమక్కరలేదు. ఈ ఉపాయం వినండి. ఒక చండాలుని తమకొని వచ్చి నా ఎదురుగా ఉంచండి. తప్పదు  వారు చండాలురను తీసుకొని వచ్చి దేవుని ఎదురుగా ఉంచారు. ఐవా ఆతని వృద్ధి తిరిగి ఆగిపోలేదు వాక్ ఇట్లపలికింది - కర్మచండాలుని తెచ్చి నా ఎదురుగా ఉంచండి, ఓ జనులార. అనగా మహదాశ్చర్య కరమైన ఆ మాటను విని, అట్టి వాణ్ణి వెతకటానికి ప్రయత్నించారు  వారు గ్రామములు పురములు వెతుకుతూ కొద్దిగా కర్మయందు ఆసక్తి గల పాపిని ఒకనిని బ్రాహ్మణ బ్రువుని (ఆట్లా పిలుస్తారు కాని ఆ లక్షణాలులేవు) చూచారు  బరువుతో కూడిన వృషభములను మధ్యాహ్నమందు నడిపిస్తున్న వానిని ఆకలి, దప్పిక, శ్రమ కలిగిన బలహీనమైన వానిని నడిపిస్తూ, క్రూరమైన మనముగల వానిని  స్నానం చేయకుండా చలిది తింటున్న వానిని తీసుకొని జగదురువున్న దేవేశుడున్న చోటికి వచ్చారు ఆదరించి దేవాలయ అగ్రభూమి యందు ఆతనిని నిలిపారు. గోవత్సాగ్రమందు ఉంచబడ్డ వాడై వాడు త్వరగా భస్మమైవాడు.

తా ॥  ఈ స్థలము చండాల స్థలమని ఈ భూమి యందు ప్రసిద్ధమైంది. అక్కడున్న వారు ఇప్పటికి ఆ ఆలయాన్ని చూడటం లేదు నాటి నుండి ఆ లింగము సామ్యభావాన్ని పొందింది. ద్విజుడు లింగాన్ని చూడటం వలన పాపాలన్నీ కడగబడి పవిత్రుడైనాడు పాపములన్ని పోయి ప్రతిరోజు గోవత్సమును పూజించ సాగాడు. విశ్లేషించి కృష్ణవక్ష చతుర్ధశి రాగానే వచ్చి  దేవుడైన త్రిశూలి యొక్క ఈ అద్భుతాన్నీ భక్తితో విన్న నరుడు అన్నీ పాపముల నుండి ముక్తుడౌతాడు సూతుని వచనము - గోవత్సమని ప్రసిద్ధమైంది, వరులకు పరమ పుణ్యము నిచ్చేది. అనేక జన్మల పాపాన్ని నశింపచే సేది. అని మార్కండేయుడు చెప్పాడు ఆ తీర్థంలో ఒక్కసారి స్నానం వల్ల నరులకు రుద్రలోకం వస్తుంది. పావముతో కొట్టబడిన ఆత్మకల వారికి, పాప దేహవిశుద్ధి కొరకు స్నానం అవసరము. రూపంలో తర్పణం వల్ల శ్రాద్ధం వల్ల తృప్తత. విశేషించి భాద్రపదంలో కలియుగంలో పక్షాంతమందు ఐతే సంతృప్తినిస్తుంది  గయలో ఇరువది ఒక్క మారులు తర్పణ చేస్తే పితరులకు పరమతృప్తి కానీ గంగకు పకంలో ఒకసారి తృప్తి  అక్కడి గవత సమీపమందు గంగ రూపకం ఉంది. అక్కడ తిలోదకమిచ్చిన తర్పించబడ్డవాడు సద్గతిని పొందుతారు  నరకము నుండైనా పితరులు సువుణ్యుడు సుమేధస్సు కలపోడు ఇచ్చే గోదానమును, ఆ తీర్థంలో ఇచ్చే దానిని ప్రశంసిస్తారు, ఓ మునీశ్వరులార విప్రునకు స్వర్ణదానం చేస్తే అది నరుని రుద్ర లోకానికి తీసుకెళ్తుంది. శివక్షేత్రమందు నరస్వతి, గంగ, గంగ రూపకము ఒక్కచోట చేరిన ఈ మూడు స్వర్గ అపవర్గ ములకు కారణము. ఋషులు సిద్ధులు ఈ తీర్థాన్ని సేవించారు. ఇది అంతట ప్రసిద్ధమైంది రెండు పీలువులు అక్కడున్నాయి. ఆ తీర్థాన్ని మునులు సేవించారు. స్నానం వల్ల స్వర్గాన్నిస్తుంది. పానం వల్ల పాపముల నుండి శుద్ధిని కల్గిస్తుంది కీర్తనం వల్ల పుణ్యాన్ని కల్గిస్తుంది, సేవనం వల్ల వరమముక్తినిస్తుంది. బ్రహ్మహత్య చేసినవారు, మాతృ హత్య చేసిన వారు పిల్లలను చంపిన వారు, గోవులను చంపిన వారు, శూద్రులను, స్త్రీలను చంపిన వారు, గరళమిచ్చు వారు, అగ్ని పెట్టేవారు, గురుద్రోహారతులు, తపస్వి నిందడులు కూటసాక్ష్యం చెప్పేవారు, పరుల తప్పులు చెప్పేవారు, పరుల గుణములు దాచే వారు సర్వ పాపమయులు వీరంతా భక్తితో లింగాన్ని దర్శిస్తే ముక్తులౌతారు. అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండమందు పాతాల ఖండముందు ధర్మారణ్య మాహాత్మ్య మందు వలాహక ఉపాఖ్యాన వర్ణనమనునది ఇరువది ఏడవ అధ్యాయము.