స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

36వ అధ్యాయం

నారదుడిట్లన్నాడు - ఆ తరువాత ఏమైందో నాకు తెలియ జేయండి. ఓ సువ్రత! ఓ (కథలు) చెప్పేవారిలో శ్రేష్ఠుడ! మొదటి నుండి చివరి దాకా అదంతా నాకు చెప్పండి (1) ఆ స్థానము ఎంతకాలం స్థిరంగా ఉందో నాకు చెప్పండి. ఎవరితో రక్షింప బడింది. అక్కడ ఎవరి ఆజ్ఞ నడిచింది. అనగా (2) బ్రహ్మ ఇట్లన్నాడు - త్రేతాయుగం నుండి ద్వాపరాంతం వరకు, కలియుగం వచ్చే వరకు పవనాత్మజుడు, హనుమంతుడొక్కడే రక్షకుడు (3) ఓ సుత! హనుమంతుడు కాక మరొకడు సమర్ధుడు కాడు. లంకను ధ్వంసము చేసినవాడు, ప్రబల రాక్షసులను చంపినవాడు (4) ఓ సువ్రత! రాముని ఆజ్ఞతో ఆతడే రక్షిస్తున్నాడు. బ్రాహ్మణుల ఆజ్ఞ అట్లాగే శ్రీమాత ఆజ్ఞ నడుస్తుంది (5) అక్కడున్న జనులకు ప్రతిరోజు ఎంతో ఆనందమైంది. అక్కడ ద్విజులు ఋక్, యజుర్, సామ వేదములను చదువసాగారు. (6) రాత్రింబగళ్ళు అథర్వణ వేదం కూడా అక్కడ చదువ సాగారు. సచరా చరమైన ముల్లోకము లందు వేద నిర్ఘోషము నుండి పుట్టిన శబ్దమే (7) ప్రతి గ్రామమందు ప్రతి పురమందు అక్కడ ఉత్సవము లౌతున్నాయి. నానా ధర్మముల నాశ్రయించి రకరకాల యజ్ఞములౌతున్నాయి (8) యుధిష్ఠిరు డిట్లన్నాడు - ఎప్పడైనా ఆ స్థానానికి భంగ మేర్పడిందా ఏర్పడలేదా, దైత్యులు, దుష్ట రాక్షసులు దాని నెప్పుడు జయించారు అని అనగా (9) వ్యాసులిట్లన్నారు - ఓ రాజా! నీవు బాగా అడిగావు. నీవు ధర్మజుడవు. ఎల్లప్పుడు శుచివి. తొలత కలియుగం వచ్చినప్పుడు ఏం జరిగిందో దాన్ని విను (10) లోకముల హితము కొరకు, కోరిక కోరకు, సుఖం కొరకు యజ్ఞం కూడా చెప్తాను. ఓ రాజ! అదంతా విను (11) ఇప్పుడు కలియుగం రాగా ఆముడని ఉండేవాడు. ఆతడు కాన్యకుబ్జాబాధిపతి. శ్రీమాన్, ధర్మజుడు, నీతి తత్పరుడు (12) శాంతుడు, దాంతుడు, సుశీలుడు, సత్యధర్మ పరాయణుడు, ఓనృపశ్రేష్ట! ద్వాపరాంత మందు, కలియుగం రాకముందు (13)అధర్మ భయం వల్ల కలి విశేషం వల్ల భయాదులతో, దేవతలందరు భూమిని వదలి నైమిశారణ్యాన్ని ఆశ్రయించారు. (14) రాముడు కూడా తన సహాయులతో కూడి సేతు బంధమునకు వెళ్ళాడు (15) యుధిష్ఠిరుడిట్లన్నాడు - కలివస్తే లోకంలో సుదుస్తరమైన భయ మెట్టిది. ఎవ్వడు (కలిలో) సురలు రత్న గర్భమైన వసుంధరను వదిలారు అనగా (16) వ్యానులిట్లన్నారు. ఓ నృవ! కలిధర్మాలు ఎట్లా ఔతాయో వాటిని నీవు విను. లోకులు అనత్య వాదులు, సాధునిందా పరాయణులు (17) దొంగ పనులందు ఆసక్తి కలవారు, అందరు పితృభక్తి లేనివారు. తమ గోత్రవు భార్యలందే ఆసక్తి కలవారు. చంచల ధ్యానము కలవారు (18) అందరు బ్రహ్మద్వేషులు, పరస్పర విరోధులు, శరణాగతులను చంపే వాళ్ళౌతారు, కలియుగంలో (19) బ్రాహ్మణులు వైశ్యుల ఆచారములందు ఆసక్తి కలవారౌతారు. కలియుగం వస్తే ద్విజులు సంధ్యాలోపం చేసే వారౌతారు (20). 

శాంతుని యందు శూరులు, భయుని యందు దీనులు, శ్రాద్ధ తర్పణములు లేనివారు, అసుర ఆచారము లందు ఆసక్తి కలవారు, విష్ణుభక్తి లేనివారు (21) ఇతరుల ద్రవ్యమందు అభిలాష కలవారు, లంచము యందు (ఉత్కచము) ఆసక్తి కలవారు. వివ్రులు స్నానం చేయకుండా భుజించేవారు. క్షత్రియులు యుద్ధం విడిచినవారు (22) కలియుగం వస్తే మలినులు, దుష్టవృత్తి గలవారు ఔతారు. అందరు మద్య పానరతులు ఔతారు. యజింప తగని వానికి యాజకు లౌతారు (23) స్త్రీలు భర్తలను ద్వేషించే వారౌతారు. కొడుకులు పితృద్వేష కరులౌతారు. అన్నదమ్ముల ద్వేషకులు క్షుద్రులు ఔతారు, కలియుగంలో (24) ఆవు పాలు మొదలగునవి అమ్మే వారౌతారు. బ్రాహ్మణులు ధనాసక్తి గల వారౌతారు. ఆవులు పాలివ్వవు, కలియుగం వస్తే (25) ఓ భారత! వృక్షములు ఎప్పుడూ ఫలించవు. కన్యలను అమ్మేవారు, లేగదూడలను అమ్మేందుకు కారకులు ఔతారు (26) విష విక్రయకర్తలు, రవి క్రయకార కులౌతారు. వేదం విక్రయం చేసేవారు కలియుగంలో కలుగుతారు (27) పదకొండు రోజులకే స్త్రీ గర్భం ధరిస్తుంది. అంతట జనులు ఏకాదశి ఉపవాసం నుండి విరతులౌతారు (28) బ్రాహ్మణులు తీర్థ సేవనరతులు కారు. బహు ఆహార పరులు బహునిద్రా నమాడులులు ఔతారు (29) అందరు కుటిల వృత్తి గల వారౌతారు. వేద నిందా పరాయణు లౌతారు. యతినిందా పరులౌతారు. పరస్పరము మోసగించుకునే ! వారౌతారు. (30) కలియుగంలో స్పర్శ దోష భయము కలుగదు. క్షత్రియులు రాజ్యహీను లౌతారు. మేచ్చుడు రాజౌతాడు (31) అందరు విశ్వాన పతులౌతారు, అట్లాగే గురుద్రోహ రతు లౌతారు. మిత్రద్రోహ రతులౌతారు. శిశ్న ఉదర పరాయణు లౌతారు (పొట్టనింపుకోవటం) (32) నాల్గు వర్ణముల వారు ఏకవర్ణలౌతారు. ఓ మహారాజ! కలియుగం వస్తే ఇట్లా ఔతుంది. నా మాట మరో రకంగా కాదు (33) దీనిని విని బలవంతుడైన కాన్య కుశరాజు గురువు యొక్క రాజ్యమునే చేస్తున్నాడు. అతని పేరు ఆముడు అని అంటారు (34) సార్వభౌమత్వమును పొంది ప్రజాపాలన తత్పరుడైనాడు. కలివల్ల ప్రజలకు పాపము యందు బుద్ధి కలిగింది (35) వైష్ణవ ధర్మాన్ని వదలి బౌద్ధధర్మాన్ని ఆశ్రయించారు. బౌద్ధా సన్యాసులతో బోధింపబడి ప్రజలు వారి ననుసరించ సాగారు (36) ఆ రాజు మహారాణి భామ అను పేరుతో ప్రసిద్ధమైంది. అన్ని లక్షణములతో కూడి ఆమె రాజు గర్భమును ధరించింది (37) పది మాసములు నిండాక ఆమెకు మంచి రూపము గల కన్యక జన్మించింది. రాజ్ఞికి పూర్ణచంద్రుని వంటి కాంతీగల కూతురు సకాలంలో జన్మించింది (38) ఆ అమ్మాయి రత్న గంగ అను పేరు గలిగినది. మణి మాణిక్యములతో అలంకరించ బడింది. ఒకసారి అదృష్టవశాత్తు దేశాంతరము నుండి ఒకరు వచ్చారు. (39) ఇంద్రసూరి అని ఆతని పేరు. ఈ కాన్యకుబ్జానికి వచ్చాడు. ఆ అమ్మాయికి పదహారేళ్ళు ఆ రాచ కూతురు వివాహమాడ లేదు (40) 

ఇంద్రసూరి (బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాడు) ఆతనిని రాకుమారి దాసిని మధ్యగా ఉంచుకొని కలిసింది శాబరిని మంత్రవిద్యను అతడు చెప్పాడు (41) శూలికర్మ విమోహితురాలై ఆమే ఏకచిత్తు రాలైంది. ఆమె మోహాన్ని పొంది ఆతని మాటలను ఆచరించ సాగింది (42) ఓ వత్స! క్షవణులతో బోధింపబడి ఆమే జైన ధర్మ పరాయణు రాలైంది. బ్రహ్మావర్తాధి పతియైన బుద్ధిమంతుడైన కుంభీపాలునకు (43) మహాదేవి యైన రత్నగంగను ఇచ్చాడు. ఆతడు పరాక్రమవంతుడు అనీ. వివాహంలో దైవమోహితుడై అతనికి మోహారకము గ్రామం / ఇచ్చాడు (44) ఆ పిదప ధర్మారణ్యమునకు వచ్చి రాజధానిని ఏర్పరచాడు. జైన ధర్మము ఏర్పరచి దేవతలను స్థాపించాడు (45) అన్ని వర్ణముల వారు జైన ధర్మాన్ని ఆశ్రయించిన వారైనారు. బ్రాహ్మణులు పూజించ బడటంలేదు. శాంతిక పౌష్టిక యాగాలు ఆచరింపబడటం లేదు. (46) ఎప్పుడూ దానం ఇవ్వటంలేదు. ఇట్లా కాలం గడుస్తోంది. శాసనాన్ని పొందిన బ్రాహ్మణులు అధికారమును కోల్పోయి రాత్రింబగళ్ళు (47) వ్యాకులమైన చిత్తం గల వారైనారు ఆ మహారాజు దగ్గరకు వచ్చారు కాన్యకుబ్జ మందున్న, శూరుడైన, పాఖండులతో చుట్టబడి రాజును చేరారు. (48) కాన్యకుబ్జం చేరాక కొన్ని రోజులకు, ఆ మూఢ బాడబులు శాంతంగా గంగ ఒడ్డులో ఉన్నారు (49) చారులు వెళ్ళి చెప్పగా, వారు రాజు ఎదురుగా వచ్చారు. రాజుచే పిలువబడ బ్రాహ్మణులు రోజ సభకు ఉదయం వచ్చారు (50) ఎదుర్కొనుట నమస్కరించుట మొదలగునవి రాజు ఆదరంతో చేయలేదు. పిదప నిల్చున్న బ్రాహ్మణులందరిని రాజిట్లా అడిగాడు (51) ఓ వివ్రులార! ఎందుకోసం వచ్చారు. ఏదైనా కార్యముంటే దాన్ని చెప్పండి అని అనగా (52) బ్రాహ్మణు లిట్లన్నారు ఓ నరాధివ ! ధర్మారణ్యము నుండి నీ దగ్గరకు ఇక్కడికి వచ్చాము . ఓ రాజ! నీ కూతురు భర్త కుమార పాలకుడు (53) ఆతనివల్ల అద్భుతమైన బ్రాహ్మణుల శాసనములుప్తమైంది. ఇంద్రసూరి జైన ధర్మాన్ని ప్రేరేపిస్తున్నాడు. (54) అనగా రాజు ఇట్లన్నాడు - మిమ్మల్ని మోహేరక పురంలో ఎవరు స్థాపించారు. దీనినంతా ఓ బాడబులార! వృత్తాంత మంతా ఉన్నదున్నట్లుగా చెప్పండి (55) అనగా బ్రాహ్మణులిట్లన్నారు. పూర్వము బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మమ్ముల స్థాపించారు. బుద్ధిగల ధర్మారాజు కోరిక మేరకు. ఈ శుభ్రమైన స్థానంలో రాముడు పిదప నగరాన్ని ఏర్పరచాడు (56) రామచంద్రుని శాసనాన్ని చూచి ఇతర రాజులు కూడా ధర్మ పూర్వకముగా దీనిని పాలించారు. ఓ రాజ! శాసనాన్ని అనుసరించారు (57) ఇప్పుడు నీ అల్లుడు బ్రాహ్మణులను పాలించటంలేదు. ఆ బ్రాహ్మణుల మాటలను విని రాజు విప్రులతో ఇట్లన్నాడు (58) ఓ బ్రాహ్మణులార! మీరు త్వరగా వెళ్ళండి. నా ఆజ్ఞగా ఇట్లా చెప్పండి, రాజు కుమారపాలునితో బ్రాహ్మణుల ఆలయాలను ఇచ్చేయి అని (59) ఈ మాట విని ఆ పిదప విప్రులు చాలా ఆనంద పడ్డారు. పిదప చాలా ఆనందంతో వెళ్ళి ఆ మాటను ఆతనితో చెప్పారు (60). 

మామగారి మాటను విని రాజు ఇట్లన్నాడు. కుమారపాలుని వచనము - రాముని శాసనమును నేను పాలించను ఓ విప్రులార! (61) పశుహింసా పరాయణులైన బ్రాహ్మణులను యజ్ఞంలో వదులుతాను. అందువల్ల హింస కుల మీద నాకు భక్తిలేదు. ఓ ద్విజులరా! (62) అనగా బ్రాహ్మణు లిట్లన్నారు - నీవు పాఖండ ధర్మంలో శాసనాన్ని లోపింప చేస్తావా ఓ రాజ! మంచిగా పాలించు కోపంతో పాపమందు మనసుంచకు (63) అనగా రాజిట్లన్నాడు అహింస పరమధర్మము అహింస గొప్ప తపస్సు. అహింస పరమజ్ఞానము, అహింస ఉత్తమ ఫలము (64) గడ్డి పోచల మీద, చెట్ల మీద, పక్షుల మీద, నరుల మీద, పురుగుల మీద, నల్లుల మీద ఇతరమైన వాటి మీద, మేకల మీద, గుఱ్ఱముల మీద, గజముల మీద (65) సాలె పురుగుల మీద పాముల మీద, అట్లాగే మహిషము (బర్రె) మొదలగు వానిమీద దయచూపాలి. సూక్ష్మమైన వాటితోను, గొప్ప వాటితోను జంతువులు సమానమైనవి. ఓ విప్రులార! (66) మీరు విప్రులు హింసా పరాయణులై ఎట్లా ప్రవర్తిస్తున్నారు. వజ్రతుల్యమైన ఆ మాటను విని ఆ బ్రాహ్మణులు (67) క్రోథంతో ఎర్రనైన చూపులు గలవారై వారంతా ఇట్లన్నారు. (68) బ్రాహ్మణుల వచనము - అహింస ఉత్తమ ధర్మము. నీవు చెప్పినది ఇది సత్యము. ఐనా ఉత్తమ ధర్మముంది. ఏకాగ్రత మానసుడవై విను (69) వేద విహితమైన ఏ హింసుందో ఆది హింసకాదు. అని నిర్ణయము. శస్త్రంతో ఏదిచంపబడుతుందో, అప్పుడు జంతువులలో ఏ పీడ కలుగుతుందో (70) అదే ఆధర్మముగా లోకంలో ఉంది, ఓ ధర్మవిదులలో శ్రేష్టుడ! శస్త్రం లేకుండా జంతువులు, వేదమంత్రములతో చంపబడుతాయి (71) ఆ హింస జంతు పీడాకరమైనది కాదు, సుఖం కల్గించేది. పరుల కుపకారం చేయటం పుణ్యం, పరులను పీడించటం పాపం (72) వేదోదితమైన హింసను చేసి కూడా పాపముల పాలుగాడు. బ్రాహ్మణుల మాటలను విని తిరిగి ఇట్లన్నాడు (73) రాజు వచనము - ఉత్తమమైన ధర్మారణ్యము బ్రహ్మాదులకు ఉత్తమ క్షేత్రము. బ్రహ్మవిష్ణు మహేశాదులు వారు ఇప్పుడిక్కడ లేరు (74) మనుష్యుడైన రాముడు చెప్పిన ధర్మము ఇక్కడ లేదు. మీ రక్షణ కొరకు విడువబడ ఆ వానరుడు ఎక్కడున్నాడో (75) మీ శాసనాన్ని చూడలేదు. దానిని నేను పాలించటంలేదు. అనగా అప్పుడు బ్రాహ్మణులు కోపావిష్కలై ప్రత్యుత్తర మిచ్చారు (76) బ్రాహ్మణుల వచనము - ఓరి మూడ! మదలోలువుడవైన నీవు ఇట్లు మాట్లాడుతున్నావురా. రాక్షసుల వినాశనం కొరకు ధర్మ రక్షణకొరకు (77) ఆ రాముడు చతుర్భుజుడు, భూమి పై మనిషిగా జన్మించాడు. గతిలేని వారికి గతి కల్పించేవాడు. ఆతడు ధర్మ పరాయణుడు దయాళువు. కృపాలుడు ప్రాణుల పరిపాలించే వాడు (78) అనగా రాజిట్లన్నారు - ఇప్పుడు రాముడెక్కడున్నాడు, వాయు నందనుడెక్కడున్నాడు. విడిపోయిన మేకల్లా వాళ్ళంతా పోయారు. హనుమంతు డెక్కడ, రాముడెక్కడ (79) ఒకవేళ రాముడు, హనుమంతుడు అంతటా ఉన్నట్లైతే, ఇప్పుడు బ్రాహ్మణుల సహాయం కొరకు వస్తాడని నేననుకుంటున్నాను (80) హనుమంతుణ్ణీ కాని రాముణ్ణి కాని చూపించండి. మీకేమైనా నమ్మకం ఉంటే, దానిని నాకు చూపండి, ఓ బ్రాహ్మణులార (81) అప్పుడు వారిట్లన్నారు, రాముడు హనుమంతుని దూతగా చేశాడు. నలుబది నాలుగు నూర్లకంటే ఎక్కువగా గ్రామములను ఇచ్చాడు ఓరాజ! (82). 

తిరిగి వచ్చి ఈ స్థానమందు పదమూడు గ్రామముల నిచ్చాడు. కాశ్యపి యందు గంగ యందు పదహారు మహాదానము లిచ్చాడు (83) బ్రాహ్మణులకు, సుశోభనమైన గ్రామముల నిచ్చాడు. తిరిగి ముప్పది ఆరువేల ఏబది ఆరునూర్ల శ్రేష్ఠులైన వైశ్యులు జన్మించారు (84) మాండలికులు అనే పేరుతో లక్షపాతిక వణిజులను ఇచ్చాడు. (85) ఆ రాజన్నాడు. ఓ బాడబులార! మీరంతా కలిసి ఆ మారుతిని చూపండి అని. ఆయన కల్పించినంత మాత్రంలో పూర్వస్థితిని కల్పిస్తాను (86) నమ్మకం కల్గిస్తే నేను బ్రాహ్మణుల మాటలను ఆచరిస్తాను. అప్పుడందరూ వేద ధర్మ పరాయణు లౌతారు (87) లేని పక్షంలో అంతటా జన ధర్మంలో ఉండండి అనగా వారంతా రాజు మాటవిని తమతమ స్థానములకు తిరిగి వచ్బారు (88) బాడబులు భిన్నమనసులై ఇక్కడ కోపంతో గుడ్డివాళ్ళైనారు. ఉచ్చ్వాన నిశ్చ్వాసములు వదులుతూ (విటుర్పులు) హా హా! అని అరుస్తున్నారు. (89) పండ్లు కొరుకుతున్నారు. అందరూ చేతులు పిసుక్కుంటున్నారు. ఇక పిదప ఏం చేద్దాము అని ఎట్లా చేద్దామని పరస్పరము మాట్లాడు కుంటున్నారు. (90) బాడబలంతో కూడి ఉత్తమమైన ఆలోచన చేశారు. రాముని మాటను మనసులో స్మరించి, అంజనీసుతుని ధ్యానించి (91) బాడబులు, చాలా వృద్ధులైన వారుకూడా కూడి బ్రాహ్మణమేల చేశారు. వారిలో అందరికన్న వృద్ధుడైన బ్రాహ్మణుడు శుభమైన మాటనన్నాడప్పుడు (92) మనము అరువది నాల్గు గోత్రముల వారము డెబ్బది రెండు ఉన్నామో మనము తమతమ గోత్రమునకు ప్రతినిథియై ఒక్క గ్రామము వారమై (93) తమతమ వర్గమునకు ఒక్కొక్కడు బుద్ధిమంతుడు బ్రాహ్మణుడు వెళ్ళాలి. రామేశ్వరము సేతుబంధమునకు వెళ్ళాలి. అక్కడ హనుమంతుడున్నాడు (94) అందరూ అక్కడికి వెళ్ళండి. ఆ రాముని పార్శ్వానికే రోగములు లేకుండా ఆహారం వదలి క్రోథమును విడిచి, మాయ నుండి విడివడి (95) ఏకాగ్ర మనస్కులై అందరూ ఆయనను స్తుతించండి, ధ్యానించండి, జపించండి. పిదప దశరథరాముడు బ్రాహ్మణుల యందు దయచూపి (96) అచలమై యుగయుగ మందుండే శాసనాన్ని ఇస్తాడు. గొప్ప తపస్సుతో తుష్టుడై అనుకున్నది (కోరింది) ఇస్తాడు (97) ఏ వర్గానికి చెందిన ఏ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళడో వాణ్ణి వర్గం నుండి వెలివేయాలి. స్థాన ధర్మముల నుండి వదలాలి అనుమానం లేదు (98) వణిక్ వృత్తితో దానికి సంబంధము లేదు. వానితో వివాహ సంబంధము వద్ధు. గ్రామ విషయంలో సంబంధము వద్ధు. అన్ని చోట్ల ఆతడు బహిష్కృతుడే (99) ఆ సభా వాక్యమును విని వారిమధ్యలో శుచియైన ఒక బ్రాహ్మణుడు, మాటచతురుడు, దక్షుడు, శబ్ద శక్తి నెరిగినవాడు బ్రాహ్మణులకు మూడు ధ్వనులు విన్పిస్తూ (పాట, ఆట, వాద్యం) (100) ప్రతి మాటకు తాళం వాయిస్తూ నిలబడి ఈ మాటలన్నాడు. అసత్యవాదులకు, ఇతరులను నిందించే వారికి ఏ పాపం వస్తుందో, పరదారలను పొందితే, పరద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో నరునకు (101) మద్యం తాగితే బంగారం దొంగిలిస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపం, పోవటానికి వెనుకాడిన వాడికి వస్తుంది. ఎక్కువగా చెప్పి ఏంలాభం. ఓ ద్విజోత్తములార! నిజంగానే వెళ్ళండి (102). 

ఆ దారుణమైన మాటను విని వెళ్ళటానికి మనస్సు నిర్ణయించింది. వెళ్తున్న ఆ బ్రాహ్మణుల గూర్చి రాజు కుమార పాలకుడు విని (103) వారిని పిలిచి కృషికర్మ గాని భిక్షాటనం గాని నానా గోత్రులైన బ్రాహ్మణులకు కలుగ చేస్తాను. అనుమానం లేదు (104) ఆ మాటను విని అందరు బాధపడి ఇంతకన్న ఇంకేం జరుగుతుంది. అని మూడు వేల మంది అప్పుడు ఏకమైనారు. (105) మనం అంతా కలిసి రాముని దగ్గరకు వెళ్దాము అనుమానం లేదు. బ్రాహ్మణులు పరస్పరము హస్తాక్షర ప్రదానం చేసుకున్నారు (106) చేతులు జోడించి బ్రాహ్మణులు ఈ వాక్యం పలికారు. ఇక్కడ వేదవిద్య నశిస్తోంది. వేదమూర్తి కోపిస్తాడు. (107) అందువల్ల పద్దెనిమిది వేల మందిమి అక్కడికే వెళ్ళాలి. అప్పుడు వణిజుడు అందరు గోధుజులను పిలిచి (108) ఇట్లన్నాడు. నృపశ్రేష్ఠుడు బ్రాహ్మణులను వారించాలి అని (109) వ్యాసుని వచనము - జైన ధర్మమందు తగులని గోభుజులు, ఉత్తమ వణిజులు, వృత్తికి భంగం కల్గుతుందనే భయంతో మౌనంగానే ఉండిపోయారు. (110) ఈ బ్రాహ్మణులను ఎట్లా వారించాలి. వారు వహ్ని రూపులు. వారు కాల్చి వేస్తారు శాపాగ్నితో. ఓ నరవతి ద్విజులు మృత్యు పరాయణులు (111) అడాలయ మందు పుట్టిన శూద్రులను పిలిచి రాజు, బయల్దేరటానికి సిద్దంగా ఉన్న బ్రాహ్మణులను వారించమని చెప్పాడు (112) వారి మధ్యలో కొందరు జైన ధర్మ మాశ్రయించినవారు. రాజాజ్ఞ ప్రకారం వారు బ్రాహ్మణుల మధ్యకు వారించటానికి వెళ్ళారు (113) కొందరు శూద్రులిట్లన్నారు - లక్ష్మణునితో కూడిన రాముడెక్కడున్నాడు. బలవంతుడైన ఆంజనేయుడెక్కడ. ఓ బ్రాహ్మణులార! ఈ కాలాన్ననుసరించి మాట్లాడాలి. (114) వెళ్ళశక్యం కాని వ్యాఘ్రుములతో సింహములతో కుడిన వనగజములు గల అడవిలోకి పుత్రులను భార్యలను, ఇళ్ళను, ప్రియమైన ప్రాణములను వదలి (115) ఎందుకు వెళ్తున్నారు. దుష్ట శాసనం గల రాజ్యంలో వారిని వదుల్తారా ఓ బ్రాహ్మణులార! అనగా దానిని బాడబులు విని కొందరు ఆ వాక్యంతో మనస్సులో స్మరించారు (116) ఇట్లా అనుకున్నారు. పది హేను వేల మంది బ్రాహ్మణులు రాజు నుండి భయం వల్ల లోభం వల్ల దానం వల్ల అదంతా అట్లాగే కాని అని అనుకున్నారు. (117) వృత్తి కల్పనతోనే గడుపుదాము. కృషి కర్మ చేద్దాము లేదా భిక్షాటన చేద్దాము (118) పిదప ఆ పదిహేను వేలమంది బ్రాహ్మణులు దారుణమైన మాట అన్నారు వారితో, ఇతరులు ఇష్టం వచ్చినట్లు వెళ్ళని (119) రాముడిచ్చిన శాసనము మీకుండని, అనుమానం లేదు. త్రయివిద్యులైన బాడబులందరు విఖ్యాతులు (120) మూడు వేలమందే త్రయివిద్యులు ఐనారు (121) రాజిట్లన్నాడు - నాల్గవ భాగం రాజ్యపు భూమిని ఇస్తున్నాను. అందువల్ల జ్ఞాతి బంధము ఇకముందు నాల్గు విధములే అని (122) 

చ్యవనుడు మీకు కన్యనిస్తాడు. మీరు కన్యను పొందండి. వృత్తి గానీ సంబంధం గాని మీకు ఎప్పుడూ ఉండదు. (123) అనీ అనగా ఆ రాజు మాటను విని త్రవిద్యులైన బాడబులు సంకేతము నుండి మరలకుండా తమ తమ స్థానములకు వెళ్ళారు. (124) పదిహేను వేలమంది బ్రాహ్మణులు చాతుర్విద్యులైన బ్రాహ్మణులు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళారు. (125) ఆ రోజును చింతా విష్టమైన మనస్సుతో ఏలాగో గడిపి, తమ వుత్రులతో, వినయం గల భార్యలతో నివారించ బడుతూ కూడా (128) అందరూ ఏకాగ్ర మనస్కులై నిద్రించలేదు. బ్రాహ్మ ముహూర్తమందు లేచి,లౌకిక మాయను వదలి (127) ప్రియమైన పుత్రులను, భార్యలను, గృహములను వదలి, బాడబ పుంగవులందరు గ్రామం చివర కలిశారు (128) మూడువేలమంది నిత్యాహ్నిక క్రియలు నిర్వర్తించిన వారై, వివ్రులకు దక్షిణనిచ్చి కులమాతను పూజించి (129) విన్నసంఘముల నాశం కొరకు, దక్షిణ ద్వారమునకు వచ్చి అక్కడున్న గణనాయకుని సింధూర పూలమాలతో పూజించి (130) కుల స్వామిని సర్వార్థ సాధకుని సూర్యుని పూజించి, ఆదరంతో మహాశక్తి యైన శ్రీ మాతను పూజించి (131) జ్ఞానము నిచ్చే గోత్రమాతయైన శాంతకు నమస్కరించి, వెళ్ళటానికి సిద్ధమైన వారై, వారు పరమానందాన్ని పొందారు (132) చాతుర్విద్య ద్విజులు తిరిగి పిలిచి, వారితో తిరిగి కలుసుకోవటానికి కారణమేమిటో అడిగారు (133) విప్రులిట్లన్నారు - మీరు వెళ్ళద్దు. వెళ్ళినా త్వరగా రండి (134) రాముడిచ్చింది త్వరలో ఏర్పరుస్తాము అని అనగా చతుర్విద్యా ద్విజోత్తములు దానిని విని ఇట్లన్నారు (135) ద్విజులకు స్థానంలో కాని వృత్తితో కాని పనిలేదు. మేము తిరిగి రాము. తిరిగి చెప్పొద్దు (136) రవూద్వహుడు మీకు వృత్తి నిచ్చాడు. ఓ ద్విజ సత్తములార! జవహోమ అర్చనాదులతో ఆ వృత్తికి పోదాము (137) ఆ పదిహేను వేల మంది తిరిగి వారితో ఆదరంగా ఇట్లన్నారు. అగ్ని సేవార్థ తత్పరుల మేమేమిక్కడుండాలి (138) అందరి కార్యసిద్ధి కొరకు మీరక్కడికి వెళ్ళాలి. పరస్పరము అందరికి తోడ్పడుతూ వృత్తిని గడుపుదాము అనుమానం లేదు (139) మీ మాటలను వదలి వృత్తి హీనులు కండి. అప్పుడు వారి మధ్య నుండి ఒక చాతుర్విదుడు ఇట్లన్నాడు (140) చాతుర్విద్యుని వచనము - ఓ ద్విజులార! పూర్వము మనకు రాముడు వృత్తినిచ్చాడు. చాతుర్విద్యులు మహాసత్వులు. స్వధర్మం పాలించే వారు (141) యాజన అధ్యయనములు కలవారు కాజేశులు నిర్మించారు. దానమును ఇచ్చి రాముడు మీతో ఇట్లన్నాడు (142) స్థానాన్ని వదలి పోరాదు. అని నియమం చేశాడు. అపత్కాలమందు మహా బలవంతుడైన వాయుపుత్రుని స్మరించాలి అని (143). 

అని రాముడు పూర్వం మీమీ స్థానమందుంచాడు గదా. రాముని వాక్యాన్ని కాదని ఎట్ల వెళ్లారు. (144) అందువల్ల మీకు వేము చెప్పేదేమంటే కార్యసిద్ధి కొరకు వెళ్ళండి. కార్యసిద్ధి కొర కు మేము ముహోమార్చనాదులు చేస్తాము. దానితో త్వరగా మీకు కార్యసిద్ధి ఔతుంది. నిజం, నిజం, అనుమానం లేదు. అవే మాటను విని ఆ బ్రాహ్మణులు వెళ్ళటానికి (148) నన్నాహ మారంభించి మొదట వెళ్ళటానికి మనసులో అనుకున్నారు. అప్పుడు అక్కడి నుండి మూడు వేల మంది బ్రాహ్మణులు బయలుదేరారు. (147) దేశంనుండి మరో దేశానికి, వనం నుండి మరో వనానికి ప్రతి తీర్థ మందు శ్రాద్ధం చేస్తూ పూర్వజులను బాగా తృప్తి పరుస్తూ (తర్పిస్తూ) , (148) రామ, రామ అని తలుస్తూ హనుమంత అని తలుస్తూ, ఒక పూట భుజిస్తూ, సదాచారులై బ్రాహ్మణులు మెల్లమెల్లగా వెళ్ళారు. దానవ్వకారాన్నివదలి, శాంతులై సత్యవ్రత పరాయణులై హనుమద్దర్శ నార్థులై వారు చాలా మార్గం వెళ్ళారు. (150) ఏకాగ్ర మనస్సుతో మూడు కాలము లందు రోజు సంధ్యను ఉపాసిస్తున్నారు. ఈ రకంగా వెళ్తున్న వారికి శుభశుకనము లైనాయి. (151) ఈ రకంగా వెళ్తున్నవారికి బాటబత్తెము జారిపోయింది. (ఐపొయింది) వారు శ్రాంతులైనారు. గ్లానీని పొందారు. అంతా గొప్ప దీనస్థితికి వచ్చారు. (152) కొద్దిదూరం వెళ్ళి ఆ పిదప ఒక్కడుగు వేయటానికి కూడా అసమర్థులై వారు. మనస్సులతో నిశ్చయించుకొని, తమ మనస్సును దృఢపరచుకొని (153) హనుమంతుని చూడకుండా మేము గృహములకు వెళ్ళము. శ్రీవిద్యులు, రామేశ్వర హరి ఉన్న చోటికి వెళ్ళారు. (154) దృఢ నిష్ట గలవారు, సత్యపరులు కంద మూల ఫలములు భోజనములుగా గలవారు. రామ, రామ హనుమంత అని ధ్యానిస్తున్నారు. (155) వారు నియమం స్వీకరించి, అన్న ఉదకములు వదిలి, దప్పితో, ఆకలితో పీడింపబడుతూ వ్రత పరాయణులై వెళ్ళారు.(158) ఈరకంగా బాధపడుతున్న ద్విజుల భక్తికి స్థానమైన రాముడు ఉద్విగ్నమైన మనస్సు కలవాడై హనుమంతునితో ఇట్లన్నాడు (157) ధర్మము తెలిసిన ఓ పవనాత్మజ! నీవు బ్రాహ్మణుల కొరకు త్వరగా వెళ్ళు. ధర్మా రథ యమందున్న వాడబులందరు బాధపడుతున్నారు. (158) నా మనస్సు కాలిపోతుంది. మరో విధంగా నాకు శాంతిలేదు. విప్రులకు దుఃఖం కల్గించేవానిని శాసించాలి. అనుమానం లేదు. (159) బ్రాహ్మణులు బాధ పడినందువల్ల నేను కూడా బాధపడినాను, ఓ కపి. నన్నువదిలి విప్రులను రక్షించే కొరకు త్వరగావెళ్ళు. (160) రాముని మాటను విని, రాఘవునకు నమస్కరించి చాలా దయగలవాడై హనుమంతుడు వచ్చాడు. (181) బ్రాహ్మణుల పరీక్షించే కొరకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. శ్రమతో దుర్బలులైన బ్రాహ్మణులతో పరమ భక్తితో ఇట్లన్నాడు. (162) చేతి నుండి కమండులువును వదలి, చేతులు జోడించి, అందరికి నమస్కరించి ఇట్లా అన్నాడు. (163)ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళదలిచారు. ఎందుకు వెళ్తున్నారు. ఈ దారుణమైన అడవిలో అని అనగా (164)  

బ్రాహ్మణులిట్లన్నారు - ధర్మారణ్యం నుండి మా దుఃఖం నివేదించే కొరకు వచ్చాము. మేము రాముని దర్శనం కొరకు వెళ్తున్నాము (185) అన్ని కోరికలిచ్చే మహా తీర్థమైన సేతుబంధం వెళ్తున్నాము. నియమమందున్నాము మా దేహాలు క్షీణించాయి. రాముని చూడాలని ఉత్సాహ పడుతున్నాయి (186) రామేశ్వర దేవుడెక్కడున్నాడో, వాయుసుతుడు కవి ఎక్కడున్నాడో అని అనగా దానిని వీని బ్రాహ్మణుడు ఇట్లన్నాడు. రాముడెక్కడ, వాయుజుడెక్కడ (187) సేతుబంధ రామేశుడెక్కడ, ఓ ద్విజులారా! చాలా దూరం. వ్యాఘ్ర సింహములతో నిండింది, ఇది ఉగ్రవనము చాలా ఘోరతరమైనది (188) ప్రాణులు అక్కడికి వెళ్ళి తిరిగి రారు. అది అంత ఉగ్రమైంది. ఓ మహాభాగులార తిరిగి వెళ్ళండి. నా మాటవినండి. (189) లేదా వెళ్ళండి ఓ విప్రులార! చిరంజీవులు కండి. సుఖంగా ఉండండి., వృద్దుని మాటలను విని బాడబులు ఒకే మనస్సు కలవారై (170) ఓ విప్రుడ మేముంతా రామపార్శ్వమునకు వెళ్తాము, అనుమానం లేదు. ఒక వేళ మార్గమధ్యంలో మరణిస్తే రామ లోకము పొందుతాము. (171) బ్రతికి తే రాముని వల్ల వృత్తిని పొందుతాము అనుమానం లేదు. మాకు రాఘవుడు కాకుండా మరోమరొక శరణు లేదు. (172) అని పలికి అందరు రామదర్శన తత్పరులై వెళ్ళారు. సాయంకాలాన్ని గడిపి స్వచ్ఛమైన ప్రభాతమందు (173) బ్రహ్మరూపియైన హనుమంతుడు వృదుడు పూర్వగుణములు కలవాడు కమండలువు ధరించిన వాడు, బుద్ధిమంతుడు, అభదన తత్పరుడు (174) ఓ బాడబులార! మీరంతా ఏ స్థానంనుండి ఇక్కడికి వచ్చారు. మహా లాభము ఎక్కడుంది. వివాహ ఉత్సవముని ఎక్కడుంది. (175) అని అనగా ఆతని మాటను విని బాడబులు ఆశ్చర్యపడ్డారు. ఆదరంతో ప్రణామ పూర్వకముగా విజ్ఞప్తి చేశారు. ఇట్లా చెప్పారు. (176) మా పూర్వ వృత్తాన్ని వినండి. మహా ఆశ్చర్యకరమైనది. ఓ బ్రహ్మణ! నీవు దయగల వాడవుగా కన్పిస్తున్నావు (177) తొలుత సృష్ట్యారంభమందు కేశవుడు స్థాపించాడు. శివుడు, బ్రహ్మ వీరితో త్రిమూర్తులలో మేము స్థాపింపబడ్డాము (178) పిదప శ్రీరాముడు జీర్ణోద్ధార రూపంలో స్థాపించాడు. ఆదరంతో హరి రాజు గ్రామములు బ్రతుకు తెరువు కల్పించాడు. (179) నాలుగు వందల నలుబది నాలుగు సంఖ్యగల వారికి పదమూడు గ్రామములను పూజకొరకు ఏతావురంతో కలిపి ఇచ్చాడు. (180) ద్విజుల పాలన కొరకు ముప్పది ఆరువేల వైశ్యులను ఏర్పరచాడు. వారికి గోపూజులని పేరు వారికి లక్షపాతిక మంది శూద్రుల కల్పించాడు (181) వారు మూడు రకాలుగా జన్మించారు వారు గోపూజ అడాలజ, మాండలీయులని మూడు విధాలు (182) వృత్తి కొరకు అమూల్యమైన రత్నకోటులను ఆతడు వారికిచ్చాడు. అప్పుడు వారు మేడ 18000 వేలు, గోభూజులు 18000వేలు మాండలీయులు 1,25,000 అడాలజులు 18,000వేలు (183) ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ ఇప్పుడు ఆముడను రాజు రామచంద్రుని శాసనాన్ని దుర్మతియై మన్నించటం లేదు (184) ఆతని అల్లుడు దుష్టుడు. కుమార పాలకుడని పేరు. ఎప్పుడూ పాషండులు అతని చుట్టూ ఉంటారు. అతడు కలిధర్మం కలవాడు (185). 

బౌద్ధ ధర్మంగల ఇంద్రసూరి అవేజైనునితో ప్రేరేపింపబడి, రాముడిచ్చిన శాసనాన్ని, ఆతడు లుప్తం చేశాడు. అనుమానం లేదు. (186) కొందరు వణిజులు అట్టి వారే ఆతని యందు మనస్సుగల వారైనారు. వారు రాముని, మహా మతియైన హనుమంతుని నిషేధిస్తున్నారు (187) నమ్మకం కలగకుండా ఇవ్వను అని నిశ్చయించాడు దానిని తెలుసుకొని బ్రాహ్మణులు రాముని శరణు వేడ వచ్చారు (188) హనుమంతుడు, మహావీరుడు, రామాజ్ఞ పాలించేవాడు. అందువల్ల ఓ మహామతి మేమంతా రాముని దగ్గరకు వెళ్తున్నాము (189) ఆంజనేయుడు మాట మా కోరికను ఇవ్వని పక్షంలో, మేము ఆహారం లేక వ్రతమందుండి ప్రాణాలను వదుల్తాము. (190) మేము మీకు చాలా చెప్పాము, మీరడిగారు. స్నేహభావాన్ని గమనించి త్వరగా మీ వృత్తి ఏమిటో చెప్పండి (191) హనుమంతుడిట్లన్నాడు – ఓ విప్రులార! కలియుగం వస్తే దేవదర్శన మెక్కడౌతుంది. ఓ విప్రులార! కలియుగం వస్తే దేవదర్శన మెక్కడౌతుంది. ఓ విప్రులార! మంచి ముఖం కావాలంటే వెనక్కి వెళ్ళండి (192) వ్యాఘ్రు సింహములతో నిండిన, వనగజము లాశ్రయించిన శూన్య వనమందు, అధికంగా దావాగ్నికల వనంలో ప్రవేశించటం శక్యంకాదు (193) అనగా వివ్రులన్నారు - దివసంగడిచాక ఇట్లా చెప్పావు, ఓ వివ్ర! ఈ రోజే వచ్చి నీవు ఇట్లాగే మాట్లాడుతున్నావు (194) నీవెవరు, బ్రాహ్మణ రూపంలో ఉన్న రాముడివా కాక వాయుజునివా. ఓ స్వామి! మహాద్విజ! దయచేసి మీరు నిజం చెప్పండి. (195) అనగా బ్రాహ్మణుని ఎదుట తాను దాచిన దానిని హనుమంతుడు చెప్పసాగాడు. ఓ వివ్రులార! నేను హనుమంతుణ్ణి అని నన్ను నిశ్చంగా తెలుసుకోండి. ఓ విప్రులార! (198) తన నిజరూపమును ప్రకటించి, గొప్ప తోకను చూపిస్తూ అన్నాడు (197) హనుమంతుడిట్లన్నాడు. ఇది సముద్రము. ఇది మనోరమమైన సేతుబంధమే సాక్షాత్తుగా ఈతడు రామేశ్వర దేవుడు గర్భవాసాన్ని నశింపచేసేవాడు (198) ఇది శ్రేష్టమైన నగరము. లంక అని ప్రసిద్ధమైంది. రాముని శోకమును హరించే సీత నాకు ఇక్కడ లభించింది (199) ఓ ద్విజశ్రేష్ఠులారా! నేను కాకుండా ఇతరులు తర్జని అంతదూరం దాటి ముందుకు వెళ్ళలేరు. అది బంగారు మయంగా వెలుగుతోంది. ఆ రాజ్యమందు విభీషణుడున్నాడు . (200) రాముడు స్థాపించాడు ఆతనిని. ఇది లంక అనే మహానగరము నియమమందున్నవారు సాధు బృందములు తీర్థయాత్ర ప్రసంగంలో (చేసేప్పుడు) (201) గంగా సలిలమును తెచ్చి రామేశుని అభిషేకించి ఈ మహాభారములను వేశారు. సాగరం మధ్యలో కన్పిస్తున్నాయి (202) దృఢ ప్రతులైన ఆ సాధువులు దానితో నిష్పావులైనారు. పుణ్యోదయమందు వృద్ధి పాప మందు హాని కలుతుంది. (203) పూర్వము చాతుర్విద్యులైన ద్విజాతులు స్థానభ్రష్టులు చేయబడ్డారు. తిరిగి జీర్ణోద్ధారము పేరుతో రాముడు వారిని స్థాపించాడు. ఓ విప్రులార! పూర్వజన్మలో నేను హరిపూజ చేశాను (204) ఇప్పుడు నిశ్చలమైన భక్తితో మీ సేవ కన్పిస్తోంది. అపుణ్యప్రభావంతో సంతుష్టుణ్ణి మీకు వరమిస్తాను (205) ఈ భూమియందు నేను ధన్యుణ్ణి. కృతకృత్యుణ్ణిణి. సుభాగ్యుణ్ణి. ఈ రోజునా జీవితం సఫలమైంది. నా జీవితము సుజీవనమైంది. (206) నేను బ్రాహ్మణుల పాదముల సమీపానికి చేరాను (207) వ్యానులిట్లన్నారు. హనుమంతుని చూస్తూనే వారు పులకాంకిత శరీరులై గద్గదమైన గొంతుకతో, వాక్య విశారదులైన వారు ఇట్లా పలికారు (208) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సమ్హితయందు తృతీయ బ్రహ్మఖండమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు హనుమత్ నమాగమ మనునది ముప్పది ఆరవ అధ్యాయము.