స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
37వ అధ్యాయము
వ్యాసులిట్లన్నారు . ఆ పిదప బ్రాహ్మణులందరు పవనాత్మజునితో ఇట్లన్నారు. ఇప్పుడు జన్మ సఫలమైంది. జీవనము సుజీవన మైంది (1) ఈ వేళ మా మోడలోకముల ధర్మము గృహములు ధన్యమైనవి. సకల పృథ్వి ధన్యమైంది యజ్ఞ ధర్మములు, అనేక విధముల ధన్యమైనాయి (2) శ్రీరామ భక్తునకు నమస్కారము. అక్ష విధ్వంసునకు నమస్కారము. రాక్షసుల పురాన్ని కాల్చిన వానికి వజ్రధారికి నమస్కారము. (3) జానకి హృదయాన్ని రక్షించిన వానికి, కరుణాత్మునకు, సీతా విరహతుడైన శ్రీరామునకు ప్రియమైన వానికి, (4) నీకు నమస్కారము ఓ మహావీర! భూమి యందు మునుగుతున్న మమ్మల్ని రక్షించు. బ్రాహ్మణులకు దేవుడవైన నీకు వాయుపుత్రునకు నమస్కారము (5) రామభక్తునకు నమస్కారము. గో బ్రాహ్మణ హితునకు నమస్కారము. రుద్రరూపునకు నమస్కారము. కృష్ణ భక్తుడవైన నీకు నమస్కారము (6) అంజనీ సూతునకు, సర్వవ్యాధి హరునకు నిత్యం నమస్కారము. నాగయజ్ఞో పవీతునకు, ప్రబలునకు నీకు నమస్కారము (7) స్వయముగా సముద్రము దాటిన వానికి, సేతుబంధమునకు కారకుడైన వానికి నమస్కారము (8) వ్యాసుని వచనము - ఈ స్తోత్రంతో వాయుపుత్రుడు సంతుష్టుడై ఇట్లన్నాడు - ఓ విప్రులార! మీ మన్సునకు ఇష్టమైన వరాన్ని కోరండి అనగా (9) విప్రుల వచనము - ఓ దేవేశ! నీవు తుష్టుడవైతే, ఓ ప్రభు! రామాజ్ఞా పాలక! ఓ హరి! లంకలో ఏ రూపం ధరించావో ఆ రూపాన్ని ఈ వేళ చూపించు (10) అట్లాగే పాప కారియైన ఆ రాజును నీవు ఈవేళ ధ్వంసము చేయి. దుష్టుడైన కుమారపాలుని ఆ ముని కూడా అనుమానం లేదు. (11) వృత్తిలోన ఫలమును వెంటనే పొందాలి. నీవు అట్లా చేయి. ఓ మహాబాహు! ప్రతీతి కొరకు చేయి. ఆలస్యం ఎందుకో మాకు చెప్పు. (12) నీయందు మనును నిలిపి ఆరాజు పుణ్యవంతు డౌతాడు. ఓ వీర నమ్మకం కల్గిస్తే ఆ రాజశాననాన్ని పాలిస్తాడు (13) త్రయీధర్మము పృథివి యందు విస్తరిస్తుంది. ఓ ధర్మ ధీర! మహావీర నీ స్వరూపాన్ని మాకు చూపు. (14) అనగా హనుమంతుడిట్లన్నాడు - నా రూపము శరీరము కలి యందు కళ్ళకు కన్పించదు. ఓ బాడబులార! అది తేజోరాశి మయమని దీవ్యమని తెలుసుకోండి (15) మీ స్తోత్రములతో పరమ భక్తితో చేసిన వాటితో నేను ప్రసన్నుడైనాను. బట్టతో కప్పబడిన నా రూపాన్ని చూపిస్తాను. చూడండి. (18) అ బ్రాహ్మణులతో ఆట్లా చెప్పగా వారు అన్నికార్యములకు నముత్సుడులై మహారూపము, మహాకాయము, వుచ్ఛముగల (17) దివ్య స్వరూపుడైన హనుమంతుని చూచి ఆనందించారు. ఎట్లాగో ధైర్యంచేసుకొని విప్రులు మెల్లమెల్లగా పలికారు.
పురాణములలో ఎట్లా చెప్పబడిందో అది అట్లాగే కన్పించింది. కళ్ళు మూసుకొని నిల్చున్న వారితో అందరితో ఆతడు ఇట్లన్నాడు (19) ఋషీశ్వరులార! భక్షించే కొరకు ఈ పండ్లు తీసుకోండి. ఓ వివ్రులార! ఇవి భక్షిస్తే అతి తృప్తి కలుగుతుంది. (20) ధర్మారణ్యం లేకుండానే మీ ఆకలి చాల్లారుతుంది, నిశ్చయము (21) వ్యానులిట్లన్నారు - ఆకలిగొన్న విప్రులు అప్పుడు ఫల భక్షణము చేశారు. అమృత ప్రాశన పలె వారికి తృప్తి కలిగింది (22) దప్పిక, ఆకలి, లేకుండా పోయాయి. విప్రులు ఆనందించారు ఓ రాజ! త్వరగా ఆశ్చర్యంతో కూడిన మనస్సు కలవారైనారు (23) అప్పుడు అంజనీ పుత్రుడన్నాడు. ఓ ద్విజులార! కలివస్తే రామేశ్వర శివుణ్ణి వదలి నేను అక్కడికి రాను. (24) నేనిచ్చే గుర్తును తీసుకొని అక్కడికి వెళ్ళండి. ఆ రాజుకు ఇది నిజమనిపించాలి, అనుమానంలేదు (25) అని పలికి చేయెత్తి రెండు భుజముల నుండి విడిగా వెంట్రుకలు తీసుకొని రెండు పుటకలు చేశాడు (26) భూర వ్రతములతో చుట, విప్రకక్షులు ఇచ్చాడు. వామపక్ష యందలి వాటిని వామ మందు, దక్షిణ మందలి వాటిని దక్షిణ మందు ఇచ్చాడు. (27) రామ భక్తునకు కోరికనిచ్చేది ఇతరులకు క్షయముచే సేది అని చెప్పి రాజు పలికినప్పుడు చిహ్నమివ్వండి (28) అప్పుడు త్వరగా వామ కక్షమందున్న దొప్పను ఇవ్వండి. లేదా ఆ రాజు యొక్క ద్వారమందు దొప్పను పారేయండి (29) ఆతని సైన్యాన్ని గృహమును, కోశాగారాన్ని మండిస్తుంది. మహారాణి పుత్రులు. అంతా కాలిపోతారు (30) ఎప్పుడైతే వృత్తిని గ్రామములను వణిజులకు బలిని, ముందున్న దానిని ఏ కొంచమైనా అదంతా ఇస్తాడు. ఓ బాడబులార! (31) వ్రాసి, నిశ్చయం చేసుకొని ఆతడు పూర్వంవలె ఇవ్వాలి. చేతులు జోడించి రాజు ఎప్పుడు నమస్కరిస్తాడో (32) ఓ ద్విజోత్తములార! రాముడు ఇదివరలో ఇచ్చిన వృత్తిని పొంది ఆ పిదప దక్షిణ కక్ష యందున్న ఈ వెంట్రుకల పుటికను (33) పారవేయండి. అప్పుడు సైన్యము ముందులాగే ఔతుంది. గృహములు, కోశము పుత్రపౌత్రాదులు అట్లాగే జీవిస్తారు. (34) వారు అగ్నితో విడువ బడుతూ ఆ క్షణంలోనే కనిపిస్తారు. అని హనుమంతుడు చెప్పి వరమైన అమృత మయవాక్యములను విని (35) విప్రులు ఆనందిం చారు, నాట్యం చేశారు.మిక్కిలి పాడారు. కొందరు జయజయధ్వానాలు చేశారు. పరస్పరము నవ్వుకొన్నారు.(36)పులకాంకి త శరీరులై మాటిమాటికి స్తుతించారు. ఉత్సాహం గల కొందరు ఆతని తోకను పట్టుకొని ముద్దాడారు.
ఒకడంటాడు నా ప్రయత్నంతో కార్యం తప్పకుండా ఔతుంది, అని. మరొకడంటాడు ఓ మహాభాగ! నేనీ పని చేశాను, అని (38) తరువాత హనుమంతు డన్నాడు. ఇక్కడ మూడు రాత్రులు ఉండండి. రామ తీర్థ ఫలాన్ని ఓ బాడబులార! పొందుతారు అని (39) అట్లాగే అని ఆ విప్రులు బ్రహ్మయజ్ఞాన్ని చేశారు. పెద్ద బ్రహ్మఘోషతో ఆ వనం చెవిటిదైంది (40) మూడు రాత్రులు విప్రులు ఉండి వారు వెళ్ళటానికి నిశ్చయించారు. రాత్రియందు హనుమంతుని ఎదుట భక్తితో వారు ఇట్లా పలికారు. (41) బ్రాహ్మణుల వచనము - సునిర్మలమైన ధర్మారణ్యానికి మేము ప్రొద్దున వెళ్తాము. ఓ తండ్రి మమ్ములను నీవు మరువరాదు. క్షమించండి, క్షమించండి. అని (42) పిదప వాయుసుతుడు పర్వతం నుండి పెద్దరాయిని పెద్ద దానిని వాలు మూలల ఉన్నదానిని పదియోజనముల విస్తారమైన దానిని (43) పరచి వారితోఇట్లా అన్నాడు. ఓ ద్విజులార! శిలయందు, నేను రక్షిస్తుండగా విగతజ్వరులై శయించండి (44) అని విని పిదప వారందరు సుఖప్రదమైన నిద్రను పొందారు. ఈ విధముగా వారు కృతకృత్యులై నిశాముఖమందు (సాయం) నిద్రించారు. (45) రుద్రాత్ముడైన రామశానన పాలకుడైన హరిదయగలవాడై విప్రుల రక్షించే కొరకు ధరాతల మందున్నాడు (46) వ్యాసు లిట్లన్నారు. అర్థరాత్రి అయ్యాక అందరు నిద్ర పోయారు. తండ్రిని ప్రార్థించాడు. నీవు దయగలవాడివి (47) ఓ సమీరణ! ఈ బ్రాహ్మణులను వారిస్థానములకు పంపించు అని పిదప నిద్రలో కప్పబడిన వారిని వాయుపుత్రునితో చెప్పబడి (48) కొడుకుతో చెప్పబడి తండ్రి ఆ శిలను ఎత్తి వారితో కూడా ఎత్తి బ్రాహ్మణులను స్వస్థానమునకు పంపించాడు (49) బ్రాహ్మణులు ఆరు మాసములలో దాటిన మార్గమును, మూడు ముహూర్తములలో దాటించాడు. వారు ధర్మారణ్య మునకు వచ్చారు (50) తిరుగుతున్న శిలను చూచి ఒక బ్రాహ్మణుడు మరో ద్విజుని ఎదుట వాత్స్య గోత్రమందు జన్మించిన వాడు.సంగీత విద్వాంసుడు అవ్యక్త మధురంగా పాడాడు (51) పాడ తగిన పాటలను విని వారాశ్చర్య పడ్డారు. ప్రభాతం చాలా ప్రసన్నంగా ఉండగా ఒకళ్ళోకళ్ళు లేచారు (52) అందరూ ఆశ్చర్యపడి ఇట్లన్నారు. ఇది కలాకాక భ్రమనా అని. తొందర పాటుతో లేచి సత్య మందిరాన్ని చూచారు (53) అంతర్బుద్ధితో వాయుదేవుని ప్రభావం గమనించి వివ్రులు వేద ధ్వనిని విని చాలా ఆనందపడ్డారు (54) లోతులు గ్రామీణులు ఆ గొప్ప రాయిని చూచి అందరు అద్భుతమని తలిచారు. ఇదేమిటి, ఇదేమిటి అని (55) ఆ అద్భుతాన్ని లోకులు ప్రతి ఇంట్లో చెప్పుకున్నారు. బ్రాహ్మణులతో నిండిన శుభమైన ఆ గొప్పశిల (56) మంచిదో చెడ్డదో మనకు తెలియదు అని లోకులు పరస్పరము ఈ మాటను అనుకుంటున్నారు.
వ్యాసులిట్లన్నారు - పిదవ ద్విజుల పుత్రులు పౌత్రులు వచ్చారు. వారిట్లన్నారు. ఓ బ్రాహ్మణులార! అదృష్టవశాత్తు వచ్చారు. బాటయందున్న మీరు వచ్చారు (58) వారు ఆనందించిన మనస్సు గలవారై ఆనందంతో ఎదురువెళ్ళారు. ప్రత్యుతాన అభివాదనలతో అట్లాగే ఆలింగనములతో (59) ఆఫ్రూణాదులను చేసి తగినట్లు పూజచేశారు. అంతా వివరంగా చెప్పారు. త్వరగా తామెట్లా వచ్చామో చెప్పారు (60) అప్పుడు వారందరిని గంధ తాంబూల, కుంకుమలతో పూజించి శాంతి పాఠం చదువుతూ ఆనందంతో తమ గృహాలకు వెళ్ళారు (61) ఆనంద మహా పీఠమందు ప్రాతః కాలమందు బాటసారులు లేచారు. ఉత్కంఠతో ఆనంద పూరితులై వారు మహాస్థానాన్ని చూచారు. (82) పరము ఆశ్చర్యాన్ని పొందారు. ఇదేమి ఉత్తమ స్థానము అని. ఇదైతే దక్షిణ ద్వారమందు ఇక్కడ శాంతి పాఠం చదువ బడుతోంది. (63) ఇళ్ళు అందంగా కన్పిస్తున్నాయి. ఇంద్రుని గృహం వలె ఉన్నాయి. అగ్నివలె, అందమైన కులమాతల ప్రాసాదములు కన్పిస్తున్నాయి (64) అని బ్రాహ్మణులు అంటుండగా మహాశక్తి పూజకొరకు వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ బ్రాహ్మణ సమూహాన్ని చూచాడు (65) విప్రులను సభాసదులుగా చూచి ఆనందించాడు. ఓ విప్రులార! అదృష్టవశాత్తు వచ్చారు. ఓ బాటయందలి ద్విజులార! అని అన్నాడు (66) పిదప విప్రులు లేచారు. పూజను గ్రహించి వచ్చారు. వారు పరస్పరము ప్రత్యుతాన అభివాదములు చేసుకున్నారు (67) యథాయోగ్యముగా యథావిధిగా వేగంగా వారిని పూజించారు. హరీశ్వరుని వృత్తాంతమును విప్రుని ఎదుట చెప్పారు (68) వధికుల మాటలను విని బ్రాహ్మణులు హర్షవూరులై వారు శాంతి పాఠం చదువుతూ ఆనందంతో తమ గృహములకు వెళ్ళారు (69) ఆలోచించి ప్రొద్దున అందరు కలిసి జ్యోతిష్కులతో ప్రతిష్ఠింపబడి బ్రాహ్మ ముహూర్త మందులేచి బ్రాహ్మణులు కాన్య కుబ్జము వెళ్ళారు (70) కొందరు పల్లకీలలో కొందరు గుఱ్ఱాలపై కొందరు రథాలపై కొందరు మేనాలలో కూర్చొని రకరకాల వాహనాలలో వారు వెళ్ళారు (71) ఆ పురమునకు చేరి గంగయొక్క శోభసతట మందు ధీరులు వసతిని ఏర్పరచుకున్నారు. స్నానదానాది కర్మలు చేశారు (72) చారుడొకడు చూచి రాజు ఎదుట చెప్పాడు. అనేకమైన అశ్వములు, మేనాలు, రథములు చాలా ఎదులు (73) విప్రులకిక్కడ కన్పిస్తున్నాయి. ధర్మారణ్య నివాసులకు. తప్పకుండా వారు వచ్చి ఉంటారు. రాజన్నాడు నా ఎదుట (74) వారిని చూపించు నేను పూర్వము వారిని కపిసన్నిధికి పంపాను (75) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మ ఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రాహ్మణులు తిరిగి వచ్చుట వర్ణనము అనునది ముప్పది ఏడవ అధ్యాయము. పిదవ ద్విజుల పుత్రులు పౌత్రులు వచ్చారు. వారిట్లన్నారు. ఓ బ్రాహ్మణులార! అదృష్టవశాత్తు వచ్చారు. బాటయందున్న మీరు వచ్చారు (58) వారు ఆనందించిన మనస్సు గలవారై ఆనందంతో ఎదురువెళ్ళారు. ప్రత్యుతాన అభివాదనలతో అట్లాగే ఆలింగనములతో (59) ఆఫ్రూణాదులను చేసి తగినట్లు పూజ చేశారు. అంతా వివరంగా చెప్పారు. త్వరగా తామెట్లా వచ్చామో చెప్పారు (60) అప్పుడు వారందరిని గంధ తాంబూల, కుంకుమలతో పూజించి శాంతి పాఠం చదువుతూ ఆనందంతో తమ గృహాలకు వెళ్ళారు (61) ఆనంద మహా పీఠమందు ప్రాతః కాలమందు బాటసారులు లేచారు. ఉత్కంఠతో ఆనంద పూరితులై వారు మహాస్థానాన్ని చూచారు. (82) పరము ఆశ్చర్యాన్ని పొందారు. ఇదేమి ఉత్తమ స్థానము అని. ఇదైతే దక్షిణ ద్వారమందు ఇక్కడ శాంతి పాఠం చదువబడుతోంది. (63) ఇళ్ళు అందంగా కన్పిస్తున్నాయి. ఇంద్రుని గృహంవలె ఉన్నాయి. అగ్నివలె, అందమైన కులమాతల ప్రాసాదములు కన్పిస్తున్నాయి (64) అని బ్రాహ్మణులు అంటుండగా మహాశక్తి పూజ కొరకు వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ బ్రాహ్మణ సమూహాన్ని చూచాడు (65) విప్రులను సభా సదులుగా చూచి ఆనందించాడు. ఓ విప్రులార! అదృష్టవశాత్తు వచ్చారు. ఓ బాటయందలి ద్విజులార! అని అన్నాడు (66) పిదప విప్రులు లేచారు. పూజను గ్రహించి వచ్చారు. వారు పరస్పరము ప్రత్యుతాన అభివాదములు చేసుకున్నారు (67) యథాయోగ్యముగా యథావిధిగా వేగంగా వారిని పూజించారు. హరీశ్వరుని వృత్తాంతమును విప్రుని ఎదుట చెప్పారు (68) వధికుల మాటలను విని బ్రాహ్మణులు హర్షవూరులై వారు శాంతి పాఠం చదువుతూ ఆనందంతో తమ గృహములకు వెళ్ళారు (69) ఆలోచించి ప్రొద్దున అందరు కలిసి జ్యోతిష్కులతో ప్రతిష్ఠింపబడి బ్రాహ్మముహూర్త మందులేచి బ్రాహ్మణులు కాన్యకుబ్జము వెళ్ళారు (70) కొందరు వల్ల కులలో కొందరు గుఱ్ఱాలపై కొందరు రథాలపై కొందరు మేనాలలో కూర్చొని రకరకాల వాహనాలలో వారు వెళ్ళారు (71) ఆ పురమునకు చేరి గంగయొక్క శోభసతట మందు ధీరులు వసతిని ఏర్పరచుకున్నారు. స్నానదానాది కర్మలు చేశారు (72) చారుడొకడు చూచి రాజు ఎదుట చెప్పాడు. అనేకమైన అశ్వములు, మేనాలు, రథములు చాలా ఎదులు (73) విప్రుల కిక్కడ కన్పిస్తున్నాయి. ధర్మారణ్య నివాసులకు. తప్పకుండా వారు వచ్చి ఉంటారు. రాజన్నాడు నా ఎదుట (74) వారిని చూపించు నేను పూర్వము వారిని కపినన్నిధికి పంపాను (75) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మ ఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రాహ్మణులు తిరిగి వచ్చుట వర్ణనము అనునది ముప్పది ఏడవ అధ్యాయము.
