స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
14వ అధ్యాయము
తా ॥ యుధిష్ఠిరుని పచనము - ఓ కృపాసింధు, మహాభాగ, సర్వవ్యాపి, సురేశ్వర, అమిత తేజంస్సంపన్నుడైన విష్ణువు ఇక్కడి తపస్సెప్పుడు చేశాడు శర్వుడైన మహాత్ముడు స్కందునకు చెప్పిన దానిని వరుస క్రమంగా అంతా నీవే చేప్పు అనగా వ్యాసుని వచనము - ఓ వత్స! చెప్పుతాను విను. ఓ నృపోత్తమ! ధర్మారణ్య ముందు ఒకసారి అమిత తేజస్సంపన్నుడైన విష్ణువు తపమాచరించాడు. స్కందుని వచనము - వంప, చంప,గయ వారాణసివీవి కన్న దేవవరము ఎట్లా అధికమైంది. వినువు అశ్వముఖుడు ఎట్లా ఐనాడు. ఈశ్వరుని వచనము - ఇక్కడ నారాయణుడు దేవుడు సుదుష్కరమైన తపమాచరించాడు. మూడు వందల దేవతల వర్షములు తపమాచరించాడు. మంచి ముఖము కలవాడుగా ఆతడైనాడు ఓ పుత్రక! మహా విష్ణువు! మంచి రూపము కొరకు తపమాచరించాడు. మహాద్యుతి గల సిద్ధస్థానమందు హరి అక్కడ అశ్వముఖుడైనాడు స్కందుని వచనము - మాకీవేళ హరి ఏ కారణంగా అశ్వముఖుడైనాడో, ఎట్లా అయినాడో చెప్పండి. మహా రివుల సంహరించే దేవదేవుడు, జగత్పతి ఎట్లా ఇట్లా ఐనాడు ఓ మహాభాగ! అనేక పాతకములు గూడా ఆతని నామంతో నశిస్తాయి. చాలా వేగంగా సూర్యోదయమందు చీకట్లు తొలగి పోయినట్లుగా ఆతని కర్మలు అద్భుతములు, అద్బుతాద్భుతములు అని వింటాము అన్ని జీవులకు పరమేశ్వరుడే కారణము ప్రాణ రూపంగా ఉన్న ఆ దేవుడు హయ రూపుడెట్లా ఐనాడు. అన్ని తంత్రములకు ఒకే రూపుడని చెప్పబడ్డాడు ధర్మాను పౌరులకు భక్తి గమ్యుడు, ముఖరూపుడు, సదాచి గుణాతీతుడు, విత్యుడు, సర్వగుడు, విరుణుడు ఈతడు స్రష్ట, పాలకుడు, హంత, అవ్యక్షుడు, అన్ని ప్రాణులకు అనుకూలుడు. మహా తేజస్సంపన్నుడు అట్టివాడు ఎందువల్ల అశ్వముఖుడైనాడు ఆతని రోమముల నుండి దేవతలు, వృక్షములు మొదలగునవి, పన్నగములు ఉద్భవించాయి. ఈ జగత్తంతా ప్రతికల్ప మందు ఆతని శరీరం నుండి పుట్తోంది. ఆతడే విశ్వప్రభువు. అతడే అత్యంత కారణము. ప్రలయ మందున విద్యలను యజ్ఞములను ఆతడు తిరిగి తెచ్చాడు వేదముల కొరకు ప్రయత్నించి దుష్టదైత్యున్ని అతడు సంహరించాడు. ఇంతటి మహా విష్ణువు ఎట్లా అశ్వముఖుడైనాడు. రత్నగర్భమైన భూమిని కృష్ణదేశమందు అవలీలగా ధరించి స్థావర జంగమాత్మకమైన జగత్తును అంత చక్కగా ఉంచినవాడు ఆ దేవుడు, విశ్వరూపుడు ఎట్లా ఎట్లా అశ్వముఖుడైనాడు
తా ॥ వరాహరూపమును ధరించి హిరణ్యాక్షుని సంహరించినవాడు మహాతేజ స్వంతుడు, సుపవిత్ర రూపంలో జలసాగరము ప్రవేశించి, సాగరములతో పర్వతములతో కూడిన భూమినంతా ఎత్తిన వాడు దంష్ట్రాగ్రమందు అవలీలగా భూమినెత్తిన వాడు, కపిల (ఎర్రని) వరాహ రూపము ధరించి శోకము నశింప చేసిన ఆ దేవుడు, ఈశానుడు హయగ్రీవుడెట్లా ఐనాడు. ఆ ఈశానుడు ప్రహ్లాదుని కొరకు భయావహరూపమును ధరించి సర్వదుష్టని వారకమైన మహాదైవమైన నారసింహరూపం ధరించి పర్వత అగ్ని సముద్రము లందున్న భర్త సత్తముని రక్షించాడు నంధ్యా కాలమందు దుష్మడైన హిరణ్యకశిపుని సంహరించాడు. ప్రహ్లాదునకు ఆనందాన్ని కల్గించే ఇంద్రానన మందు అతణ్ణి ఉంచాడు. ప్రహ్లాదుని కొరకు నృసింహ రూపాన్ని ధరించాడు. విరోచనుని ఎదుట ఈతడు యాచకుడైనాడు. అశ్వమేథ యజ్ఞమందు బలితో పూజింపబడి ఆతని భూమిని లాగుతున్నాడు. రోదస్సు అంతా మూడు పాదములుగా కొలువ బడింది విశ్వరూపమెత్తి బలిని పాతాళానికి పడతోశాడు. ఇరువది ఒక్కమారులు భూమి యందలి క్షత్రియులను చంపి భూమిని, గొప్ప ఓజస్సుతో బ్రాహ్మణులకు ఇచ్చాడు. హైహయవంశపు రాజును చంపాడు తన తల్లిని చంపాడు బాలుని రూపంలో ఉండి దుస్థ నడవడిక గల తారక అను పేరు గల రాక్షవివి విశ్వామిత్రుని అనుగ్రహం వలన ఈ భూమి పై చంపాడు లీలామానుషరూపధారియై విశ్వామిత్రుని యజ్ఞమందు పదునాలుగు వేలమంది రాక్షసులను బలంతో చంపాడు శూర్పణఖను చంపాడు త్రివరులను చంపాడు. సుగ్రీవుని కారణంగా వాలిని చంపి, సుగ్రీవుని సహాయం పొంది సముద్రంపై సేతువును నిర్మించి, రణంలో దశావనుని చంపి, ధర్మారణ్యమునకు వచ్చి బ్రాహ్మణులను పూజించాడు. బ్రాహ్మణులకు అనేక గ్రామములను దానముచేసి, సవాధికారము ఇచ్చి, ధర్మ వారి యందు స్నానం చేసి, గోవులను దానం చేశాడు దురాత్ములను నిగ్రహించి, సాధువులను పాలించి, ఇట్లాగే ఇతర కర్మలు ఈ భూమిపై చేశాడని విన్నాము అవలీలగా విలాసం కొరకు చేసిన ఆ దేవుడు అశ్వముఖుడెందుకైవాడు. యాదవ వంశంలో పుట్టి పూతన శకటాదులను చంపి అరిష్టం కల్గించే దైత్యువి కేశుని వృకాసుర బకాసురులను చంపి, శకటామర, మహాసర, తృణావర్త, ధేనుకులను చంపి మల్లులను, కంస జరాసంధులను, కాలయవనుని చంపినవాడు హయాననుడు ఎట్లా ఐనాడు. రణమందు తారకాసురుని జయించి, ఆయుతుని షట్ వురములను జయించి పదహారు వేల కన్యలను వివాహమాడిన, ఈ విధముగా అమానుషముల వాచరించిన అతడు అశ్వముఖుడు ఎట్లా ఐవాడు భక్తులందరిని రక్షించేవాడు దురాత్ములందరిని సంహరించే వాడు, ధర్మాన్ని స్థాపించే ఆకల్కి కూడా విష్ణు పదమందువ్నాడు మీరు చెప్పింది చాలా ఆశ్చర్యకరమైన అంశము. ఓ త్రిపురాంతక! దీనికంతకూ కారణమును నాకు చెప్పండి.
తా॥ శ్రీ రుద్రుని వచనము - ఓ మహాబాహు! బాగా అడిగావు. దానికి కారణాన్ని చెపుతాను. హయగ్రీవ కృష్ణుని కథను చెబుతాను. ఏకాగ్రమానమనుడపై విను వ్యాసుని వచనము - పూర్వం దేవతలు భూమి పై యజ్ఞమారంభించారు. రుద్రుడు మొదలగువారు అందరు వేదమంత్రములతో పిలువ సాగారు.అందరు వైకుంఠానికెళ్ళారు. తన నివానమైన క్షీరాబ్దికి వెళ్ళారు. పాతాళమునకు కూడా వెళ్ళినారు. ఐనా కృష్ణ దర్శనము కాలేదు మోహావిష్ణులై అందరు ఇటు అటు పరుగెత్తారు. వారికి బ్రహ్మ రూపుడైన జనార్ధనుడు కన్పించలేదు. ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరు ఆలోచించసాగారు. ఈ మహా విష్ణువు ఎక్కడికెళ్ళాడు. ఏ ఉపాయంతో ఈతనిని చూడగలుగుతాము తలవంచి బృహస్పతికి నమస్కరించి ఆ దేవునితో ఇట్లా అన్నారు. ఓ దేవదేవ! మహావిష్ణువు ఎక్కడున్నాడో దయతో చెప్పండి. అనగా బృహస్పతి వచనము - మహాత్ముడు, ఏ కారణముగా యోగ రూపుడైనాడో తెలియదు. యోగీశ్వరుడు అచ్యుతుడైన హరి, విష్ణువు యోగ రూపుడైనాడు క్షణకాలము తన ఆత్మలో ధ్యానించి బృహస్పతి విష్ణువు స్థానాన్ని తెలిపాడు. జగత్పతియైన దేవుడు ఉన్నచోటికి దేవతలంతా వేళ్ళారు ధ్యానమందున్న ఆ జనార్ధనుని విష్ణువును వారు చూచారు. కృత్యవంటి ఆకారముగల, చేత శరము ధరించిన రాక్షసులను చంపే దానిని స్మరించగా అది వచ్చి ఆ సభను చూచి విష్ణువును మేల్కొలిపే మార్గాన్ని చెప్పింది. చెద పురుగులు అల్లిత్రాడును ప్రయత్నంతో చేదిస్తే ఆ శబ్దంతో హరి స్వయంగా మేల్కొంటాడు అని వారితో అప్పుడు చెప్పింది దేవతల వచనము - హరి మేల్కొనేట్లుగా మీరు ధనురుణమును తినండి. ఓ చెదపురుగులార! మేము యజ్ఞం కొరకు ప్రభువునకు విన్నవించుకుంటాము అనగా చెదపురుగులు ఇట్లా అన్నాయి. నిద్రాభంగం, కథలో అడుచెప్పడం, ఆలుమగల స్నేహాన్ని భగ్నం చేయటం, తల్లి పిల్లలను వేరు చేయటం వీటిని చేసేవారు నరకానికి పోతారు జగన్నాథుడు యోగా రూఢుడైనాడు. వనధి యందున్నాడు. ఆతడు మహాబలుడు. ఆ జగదీశునకు విఘ్నం కల్గించలేము అనగా బ్రహ్మవచనము - ఈ దేవతల పనిని మీరు చేస్తే మీకు అన్నింటిని భక్షించే శక్తి వస్తుంది. యజ్ఞసిద్ధి అయ్యేట్టుగా చెయ్యండి. ఓ చెదపురుగులార! ఓ వత్స! ఆ చెదపురుగుల నాయకురాలు మళ్ళా ఇట్లా అంది వజ్ర వచనము - జగన్నాథుడు దుఃఖ సాధ్యుడు. మలయానిలము వంటివాడు. దేవతలతోపూజనందే ఆతనిని మేమెట్ల లేపాలి, ఓ బ్రహ్మన్ నాకు యజ్ఞంతో పనిలేదు. నాకు దేవతలతో పనిలేదు. ఓ దేవతలార! అన్ని యజ్ఞ కార్యములలో నాకు భాగమివ్వండి అనగా దేవతలిట్లన్నారు. యజ్ఞములలో ఎల్లప్పుడు మనం వమ్రికి భాగము ఇద్దాము. యజ్ఞము కొరకు ఇచ్చిన దానిలో మేం భాగం ఇస్తాము. మాటను చెప్పినట్లు చేయి అనగా బ్రహ్మకూడా సరే అని అన్నాడు. వమ్రి తన పనిని ఆరంభించింది. గుణ భక్షణము మొదలుగా కర్మనంతా అది చేసింది, ఓ నృప! యుధిష్ఠిరుని వచనము - సమాధిలో ఉన్న ఈతనిని లేపటానికి దేవతలు గుణభంగంచేయించటం, ఇది పత్యంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ ప్రవర్షి! సత్యవతినుత! వ్యాసుని వచనము - వ్యగ్రచిత్తులై (భయం) దేవతలంతా హరిడార్కుకమును లాగారు. ఏ కారణంగా విష్ణుమాయా మోహితులైనారో తెలియదు వారు ఆనందంలో విష్ణువు ఎదుట పుటను వదలపాగారు. పిదప పర్వతమంపైన పుట్టను, ధనుస్సు కోటి (కొప్పు) వక్కకు తీసుకెళ్ళారు గుణమును తినివేయగా ఆ క్షణంలోనే అది చెడిపోగా, అల్లెతాడు, బాణము, కొ ప్పులతో పాటు తలతెగి స్వర్గానికి పోయింది తలతెగిపోగా ఆ దేవతలంతా చాలా కలత చెందిన మనసు కలవారై, వారంతా తలను వెతికేకొరకు అన్ని దిక్కుల పరుగెత్తారు అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు విష్ణు శిరోవాశమనునది పదునాల్గవ అధ్యాయము.
