స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
10వ అధ్యాయము
వ్యాసునివచనము - ఓనరుడా! ధర్మారణ్యంలో జరిగిన దానిని శుభమైన దానిని ఇష్టమైన దానిని జరిగినట్లు చెప్తాను విను. నేను చెప్పేది అన్ని పావన మూహములను నశింప చేసేది. (1) అవ్వడు ఓరాజ! విష్ణువుతో ప్రేరేపింపబడి బ్రహ్మము ధేనువును పిలిచి దానితో ఇట్లా అన్నాడు. (2) విప్రులకు అనుచరులను ప్రసాదించు ఒక్కొక్క బ్రాహ్మణునకు ఇద్దరిద్దరు, శుద్ధమైన ఆత్మ కల వారిని ఇవ్వు! ఓ తల్లి నన్ననుగ్రహించు (3) అనగా అట్లాగే అని ఆ మహాధేనువు భూమిపై పాలతో వ్రాసింది. దాని హంకారము నుండి శిఖ నూత్రములను ధరించిన నరులు బయటికొచ్చారు. (4) ముప్పది ఆరు వేల వణిజులు. వారు మహాబలవం తులు, యజ్ఞోపవీతం కలవారు, మహాదక్షులు, సర్వశాస్త్ర విశారదులు (5) ద్విజ భక్తి కలవారు, బ్రహ్మకు చెందిన వారు, వారు తపోన్వితులు. మురాణజులు, నదాచారులు ధార్మికులు, బ్రహయే ఆహారముగా గలవారు (6) న్వర్గంలో దేవతలు ప్రశంసిస్తున్నారు. వీరిని ధర్మారణ్య నివాసులు తపస్సు అధ్యయనము దానము వీటి యందు, అన్ని కాలములందు ఇంద్రియములనతిక్ర మించిన వారు (7) ఒక్కొక్క బ్రాహ్మణునకు ఇద్దరిద్దరు అనుచరులు ఉండండి. బాడబునకు ఏ గోత్రమో (8) ఆతని అనుచరునకు అదేగోత్రము అని వ్యవస్థనేర్పరచి ఆ ప్రాంతమందున్నారు. (9) ఆ పిదప దేవతలు అనుచరులను శిష్యులుగా చేసారు. బ్రహ్మ చెప్పినదంతా వారి క్షేమము కొరకే (10) వారి మాటలను ఆచరించండి. వాళ్ళకు కావలసినది ఇవ్వండి. ప్రతిరోజు, నమిధలు పుష్పములు దర్భలు తీసుకురండి. (11) వీరి ఆజ్ఞ ప్రకారం నడవండి. ఎవ్వడు ఎక్కడ వారిని అవమాన పరచకండి. జాతకర్మ నామకరణము అన్నప్రాశనము (12) క్షౌరము, ఉపనయనము, మహానామ్ని మొదలగునవి క్రియాకర్మాదులు , దానము ఉపవాసము మొదలగు వ్రతములు (13) వీరి అనుజ్ఞతో చేయాలి. కాజేశులు దీనిని చెప్పారు. వీరి అనుజ్ఞ లేకుండా ఎవరైనా కార్యం ఆరంభిస్తే (14) దర్శము కాని శ్రాద్ధకర్మ గానీ శుభము కాని, అశుభము కాని ఆచరిస్తే దారిద్ర్యము, పుత్ర శోకము, కీర్తి నాశము (15) కలుతాయి. రోజురోజు రోగములతో బాధపడుతారు. ఎవ్వడూ ముఖవడరు. అట్లాగే అని పలుకగా అప్పుడు దేవతలు శక్రాది దేవతా శ్రేష్ఠులు (16) కామధేనువు ముందున్న వారందరు స్తోత్రం చేయసాగారు. దేవతలు, బ్రహ్మవిష్ణు, మహేశ్వరులు కృతకృత్యులై అవ్వడు ఇట్లా స్తుతించారు (17)
దేవతలందరికి నీవు తల్లివి. నీవు యజ్ఞమునకు కారణము. నీవు నర్వతీర్థములకు తీర్థస్థానము నీవు ఎప్పుడూ పుణ్య స్వరూపురాల! నీకు నమస్కారము (18) శశి సూర్యల వలె ఎర్రనైనది ఆమె లలాట మందు వృషభ ధ్వజుడు, ఆమె హుంకార మందు సరస్వతి, వాగులందరు ఆమెకు కంజలములు గుఱ్ఱపు (19) గిట్టల వంటి ఆమె వృష్ఠ భాగమందు గంధర్వులు వెలుగు వేదములు, ముఖాగ్రమందు అన్ని తీర్థములు, స్థావరములు చరములు కుడా (20) ఇటువంటి అనేక విధములైన మాటలతో ఆమెనుమతించారు. సంతోషించిన ఆమె ప్రసన్నమై ఆ ధేనువు ఏంచేయాలి అడిగింది (21) దేవతలిట్లన్నారు ఓ మాత! దేవి ఈ శుభమైన అనుచరులను అందరిని నీవు సృష్టించావు. ఓ మహాభార! నీ అనుగ్రహం వల్ల బ్రాహ్మణులు సుఖవంతులైనారు. (22) అని అన్నాక ఓ రాజ! ఈ సురభి యశస్విని, స్వర్గానికి వెళ్ళింది. పిదప బ్రహ్మ విష్ణు మహేశాదులు అక్కడే అంతర్థానమై వారు (23) యుధిష్టురువి వచనము - ఆ మహాతేజులు, గోవునకు జన్మించినవారు, అనుచరులు భార్యలు లేనివారు. మరివారు ఎట్లా వివాహమాడారు. ఓ బ్రహ్మ వారికి ఎప్పుడు వుత్రులు కలిగారు అనగా (24) వ్యాసుని వచనము - వారి వివాహం కొరకు రుద్రుడు యముడు గంధర్వ కన్యలను తీసుకొని వచ్చి భార్యలనుగా కల్పించారు. (25) యుధిష్కరుని వచనము – ఆగంధర్వ రాజెవడు ఆతని పేరేమి. ఆతడెక్కడ ఉన్నాడు. ఆతని కన్యలెంత మంది. వారినడవడిక ఎటిది. ఇవన్నివాడుచెప్పండి. అనగా (26) వ్యాసుని వచనము – ఓ నృప! విశ్వావసువను పేరు గల ప్రసిద్ధుడైన గంధర్వాధిపతి ఉన్నాడు. ఆతని ఇంటిలో ఆరువది వేల మంది కన్యలున్నారు. (27) అంతరిక్షంలో గంధర్వ నగరమని శుభమైన ఇల్లుంది. యావన వంతులు, మంచి రూపవంతులు శుభులు గంధర్వణులైన కన్యలువారు. (28) ఓ రాజ! రుద్రుని అనుచరులైన శుభాననులైన నందిభృంగి అనువారు ఆ కన్యలను అంతకు ముందే చూచారు. శివునితో చెప్పారు. (29) ఓ మహదేవ! విభు, గంధర్వ నగరంలో ఇది వరకు చూచాము. విశ్వావసు గృహంలో వేల కొలది లెక్కింపరానంత మంది కన్యలున్నారు. (30) వారిని బలవంతంగా తెచ్చి గోభుజుల కివ్వండి. అనగా విని ఆ పిదప త్రిపురమ్నుడు ఐన సదాశివ దేవుడు (31) విజయుడను పేరుగల దూతను పంపాడు, ఓ భారత! అరిందముడైన విశ్వావసుడున్న చోటికి ఆతడు వెళ్ళి (32) శివుడు చెప్పిన వథ్యమైన మాటను చెప్పాడు (321/2)
తా॥ ఓ మహాభాగ! ధరారణ్య మందు కాజేశుడు నిర్మించిన ఉంచిన వాడబులు వేదవేదాంగ పారగులు అక్కడున్నారు. వారికి వరిచర్య కొరకు తామ ధేనువును ప్రార్థించారు ఆమె చేసిన శుభాచారులైన వణిజులున్నారు. వారయోనిజులు. ముప్పది ఆరువేల మంది కుమార్తెలున్నారు. వారు మహాశక్తి మంతులు. శివుడు పంపగా నేను నీ దగ్గరికొచ్చాను. ఓ మహాభాగ కన్యల కొరకు వచ్చాను. ఇవ్వుము. ఇవ్వుము అని అడిగాడు గంధర్వునీ వచనము. దేవతలనందరిని గంధర్వులందరిని వదలి, ఓ మహామతి! లోకంలోని మనుష్యులకు ఎట్లా ఇస్తాను. అని అనగా దానిని విజయుడు విని వెళ్లి పోయాడు. ఆ గంధర్వ చరిత్రనంతో చెప్పాడు వ్యాసుని వచనము - భగవాన్, లోక శంకరుడు కోపంతో కూడినవాడై వృషభము పై కూర్చొని, సదాశివుడు చేత హలము ధరించి ప్రభువు! భూత ప్రేత పిశాచాదులలో వేల మందితో చుట్టబడి, అట్లాగే ఆ పిదప దేవతలు, నాగులు, భూతబేతాళ ఖేచరులు. చాలా కోపంతో కూడిన వారై వేలకొలది వచ్చారు. సైన్యం కదులుతుండగా పెద్ద హాహాకారం జరిగింది. భూదేవి కంపించింది. దిల్పాలురు భయాళురులైనారు. అప్పుడు ఘోరమైన గాలులు వీచాయి. దిక్కులందలి దిగ్గజములు అరవసాగాయి. వ్యాసుని వచనము - అట్లా వచ్చిన భయంకరముగా చలించిపోతున్న ఆ మహావ్యాన్ని చూచి గంధర్వ నగర మందలి వారందరు పది దిక్కులకు నాయకుడు లేకుండా వెళ్ళారు. న్నప! గంధర్వరాజు, నగరాన్ని వదలి మేరువునకు వెళ్ళాడు. యౌవనో పేతులైన, రూపదార్య సమన్వితులైన కన్యలను తీసుకొని అందరిని వణిజులకు ఇచ్చాడు. ఓ న్నప! వేదోక్తవిధితో దేవసన్నిధి యందు గవాత్మజులు అప్పుడు గంధర్వునకు ఆజ్య భాగమును ఇచ్చి దేవతలకు, పూర్వజులకు, చంద్ర సూర్యులకు యమునకు మృత్యువునకు ఆజ్య భాగమును అప్పుడిచారు. శాస్త్ర ప్రకారము- ఆజ్యభాగములనిచ్చి ఆ శుభ ప్రతులు వరించారు. నాటి నుండి గాంధర్వ వివాహము జరిగినప్పుడు ఇప్పటికీ అంతట మిక్కిలి ఆజ్యభాగమును స్వీకరిస్తున్నారు ముప్పది ఆరువేల మంది కుమారులు ఇవ్వబడ్డారు. వారికి పుత్రులు పౌత్రులు నూర్లకొలది వేలకొలది ఐనారు అందువల్ల వారందరు దాసత్వమందే ఉన్నారు. క్షత్రియులు మహావీరులు కింకరులుగా ఐనారు.
తా ॥ ఓ రాజ! ఆ పిదప దేవతలు అందరు అప్పుడు ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళారు. దేవతలు వెళ్ళిపోయాక బ్రాహ్మణులందరు ఈ స్థానమందు నివసిస్తున్నారు ఓ రాజ! పుత్ర పౌత్రులతో కూడి, ఎవరి నుండి భయం లేకుండా ఈ స్థానమందు నివసిస్తున్నారు. వేదముల వెరిగిన వారు వేదాలు చదువుతూ ఒకచోట శాస్త్రార్థమును చర్చిస్తూ కొందరు విష్ణువును, కొందరు శివుని జపిస్తున్నారు. కొందరు బ్రహ్మను జపిస్తున్నారు. కొందరు యమసూక్షాన్ని వతిస్తున్నారు. యాచకులు హోమం చేస్తున్నారు. అగ్నిని ఉపాసిస్తున్నారు. నువ్రత! స్వాహాకార స్వధాతార వషటి కారములతో ఉపాసిస్తున్నారు. శబ్దములతో అంతా నచరా చరమై త్రైలోక్యము వవిత్రమైపోతుంది. మహాదక్షులై నవజులు బ్రాహ్మణ శుశ్రూష యందు ఉతుకులుగా ఉన్నారు. శుభమైన దివ్యమైన ధర్యారణ్య మందువారు మంచిని గలవారై ఉన్నారు. అన్నపానాదులు, వమిధలు, కుశలువండు వెుదలగునవి అన్ని బ్రాహ్మణులకు సమకూరుస్తూ ఆగవాత్మజులైన వణిజులున్నారు. వణిజుల స్త్రీలు, పుష్ట ఉవ హారములను, స్నాన వస్త్రాదులు, ఉతుకుట, పొత్రము మొదలగు వాటిని ఏర్పరుచుట, మార్జనము, (ఊడ్చు) మొదలగు శుభక్రియలు చేస్తున్నారు. తరుగుట, నూరుట మొదలగు శుశ్రూషలు ఆ బ్రాహ్మణులకు కాజేశుని మాట ప్రకారంవారు చేస్తున్నారు. ద్విజులంతా ఆనంద పరవశులైనారు. దివారాత్రములు, సంధ్యలందుజేశాదులను ఉపాసిస్తున్నారు. అని శ్రీస్కాంద మహాపురాణమందు ఏకాశీతి సాహస్య్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్యభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు వణిక పరిగ్రహ వర్ణనమనునది పదవ అధ్యాయము.
