స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

13వ అధ్యాయము

 తా॥ వ్యాసుని వచనము - శంభునకు పశ్చిమ భాగమందు కశ్యపాత్మజుడు స్థాపించబడ్డాడు. ఆ మహాభాగుడు అక్కడున్నాడు. అది రవి క్షేత్రం అనబడుతోంది అక్కడ పుట్టిన వారు మహాదివ్యులు, రూప యావనములు కలవారు. నా నత్యావశ్వినులు (నా పత్య, అశ్విన) దేవతలు విఖ్యాతులు, రోగవాశకులు  యుధిష్ఠురుని వచనము - ఓ పితా మహ మహాభాగ దయతో చెప్పండి. మృత్యు లోకంలో అశ్వినుల ఉత్పత్తి ఎట్లా జరిగింది. సూర్యుడు రవి లోకం నుండి భూమిపై ఎట్లా అవతరించాడు. ఇదంతా మయనత అనుగ్రహించి చెప్పండి దానిని విన్నందువల్ల పాపములన్నింటి నుండి విముక్తులౌతారు, ఓ మహాభాగ అని అనగా వ్యాసుని వచనము ఓ భువ! ఊర్థ్వలోకపు కథను నీవు బాగా అడిగాను, ఓ నరశార్దూల! దానిని వింటే సర్వరోగముల నుండి విముక్తులౌతారు. విశ్వకర్మ కూతురు సంజ్ఞ అనువది శాంతిమంతుడైన మార్యుని వరించింది  సూర్యుని చూచి ఎప్పుడు సంజ్ఞ తన కన్నులను మూడువేది (కన్నుకొట్టేది) అందువల్ల కోపంతో అర్కుడు సంజ్ఞతో ఇట్లా అన్నాడు సూర్యుని వచనము - నన్ను చూచినప్పుడల్లా నీ కళ్ళను మూసుకుంటున్నావు కనుక ఓ మూఢురాల ప్రజా నంయమనం చేసే యముడు నీకు కలుతాడు అప్పుడు ఆమె చంచలమైంది, భయకులమైంది. ఆమెను చూచాడు. చంచలమేవ చూపులు గల ఆమెను చూచి సూర్యుడు మళ్ళి ఇట్లా అన్నాడు  నన్ను చూచినందువల్ల నీ దృష్టి విలోలితమైంది. అందువల్ల ఓసంజ్ఞ! విలోలితమైన తనయనుకంటావు, వ్యాసుని వచనము - ఆ పిదప ఆమెకు ఆ భర్త శావంతో, యముడు, యమున అని కలిగారు. యమున, ప్రసిద్ధమైన గొప్పది ఆ సంజ్ఞ సూర్య తేజస్సును పూంచని దాని వలె, ఆ భామిని చాలా దుఃఖంలో అప్పుడు మనస్సులో ఇట్లా ఆలోచించిందీ ఏంచేయను, ఎక్కడికెళ్ళను. ఎక్కడి వెళితే తృప్తి కలుగుతుంది. నా భర్తయైన ఆర్కుని కోపము ఎట్లా నశిస్తుంది. అని చాలా ఆలోచించి ప్రజాపతి కూతురు ఆమె అవ్వడు ఇట్లా తలచింది. ఓ మహా భాగులార! తండ్రి దగ్గరకు వచ్చింది తండ్రి ఇంటికి పోవటానికి నిశ్చయించుకున్నప్పుడు ఆమె, యశస్విని, ఆదేవి, సూర్యుని భార్య తన వీడను పిలిచి  ఆమెతో అంది, సూర్యుని దగ్గరనే, వెట్లాఉన్నావో నీవు అట్లా ఉండు అని అట్లాగే నా పిల్లలందు, మార్యుని యందు బాగా ప్రవర్తించాలి అని  నీకు బాగా అని పించకపోయినా చెప్పాడు. నా ఇష్టమెట్లాగో అట్లా ఉండాలి. ఓ అనఘ! నీవు, ఆ నంజ్ఞను నేనే అని చెప్పాలి ఇట్లా ఉండాలి, అని అనగా. 

 తా ॥ ఛాయా సంజ్ఞ ఇట్లా అంది - కేశగ్రహణం చేయనంత వరకు, శాపమివ్వనంత వరకు నేను అట్లాగే చేస్తాను. కేశాపఠరణ చేయనంత వరకు ఆ మాటలను ఆచరిస్తాను  అవి అనగా అవ్వడు ఆ పంజ తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ తపస్సుతో పావములన్నీ తొలగించుకున్న త్వష్టను చూచింది. ఆ విశ్వకర్మ ప్రేమతో ఆమెను ఆదరించాడు. పితృగృహమందు ఆమె కొంత కోలము, ఏ విందలు లేకుండా ఉంది అవ్వడు ఆ ధర్మమెరిగిన తండ్రి చాలా కాలం నుండి ఉన్న కూతురుతో ఇట్లా అన్నాడు. విశ్వకర్మ ప్రేమతో గౌరవ వురఃపరంగా కూతురుతో ఇట్లా అన్నాడు ఓ వత్సే! నిన్ను చూస్తున్నవారు, చాలాకాలం కూడా ముహూర్తంగా ఐపోతుంది. కాని ధర్మంలో ఏముంది బంధువుల ఇంటిలో చాలా కాలము ఉండటం స్త్రీలకు యశవ్కరము కాదు. భార్యయైన స్త్రీ, పితృ గృహంలో ఉండటం బాంధవులకు ఇష్టం కాదు నీవు త్రైలోక్య వాధుడైన సూర్యునితో భర్తతో కూడి ఉండాలి. ఓ వుత్రిక పితృగృహంలో చాలా రోజులు ఉండటం తగదు  అందువల్ల భర్త దగ్గరకు వెళ్ళు. నేను నిన్ను చూశాను. గౌరవించాను కూడా. ఓ శుభమైన చూపులదావ! మళ్ళీ కావలిస్తే నన్ను చూడటానికి రా అని అన్నాడు. వ్యాస వచనము - అవ్వడు ఆమె వెంటనే మునితో అట్లాగే తానీ అని పలికి, తండ్రిని పూజించి ఆమె ఉత్తరకురు భూములకు వెళ్ళింది సూర్యతాపమును ఇసవడనిది, ఆతని తేజస్సుకు భయపడేది బడబారూపమును ధరించి తపమాచరించింది  సూర్యుడు రెండవ అమెను సంజ్ఞ అనియే భావించి ఆమె యందు ఇద్దరు తనయులను, ఒక కన్యను మనోరమమైన దానిని పుట్టించాడు ఛాయ తన సంతాన మందు ఎంత ప్రేమగా ఉందో అట్ల సంజ యొక్క పుత్రిక పై వుత్రులపై ప్రేమగా ఉండలేదు. ప్రత్యేకంగా లాలించటంలో, భోజన మందు ప్రతిరోజు ప్రేమగా ఉండటంలేదు మనువు దానిని క్షమించాడు. యముడు దానిని సహించలేక పోయాడు. పిదప ఆతడు కోపంతో కొట్టడానికి కాలెత్తాడు. తిరిగి శాంతుడై ఆమెను తన్నలేదు అప్పుడు ఛాయా సంజ్ఞ కోపంతో ఆయముణ్ణి శపించింది. కొంచం చలిస్తున్న పెదవులు కలిగి, చేతులు వణుకుతుండగా మీ నాన్నకు భార్యయైన నాపై బలంగా పాదమెత్తుతావా. అందువల్ల నీ పాదము ఈ వేళ భూమి పై ఉంటుంది. అవి అనగా యముడు ఆ శావమును విని, తల్లిని అనుమానించినవాడై, తండ్రి దగ్గరకు వచ్చి నమస్కార పూర్వకముగా ఇట్లన్నాడు ఓ నాన్న! ఇది మహా ఆశ్చర్యకరమైనది. ఎక్కడా చూడబడలేదు కూడా. తల్లి వాత్సల్య రూపంలో వుత్రునకు శాపమిచ్చింది. చూడలేదు కూడా ఈ తల్లి ఎట్లావాతో అన్నదో, నా తలైతే అట్లా అనదు. ఈమె నా తల్లికాదు. గుణహీనులైన పుత్రుల పైన కూడా తల్లి గుణహీనంగా ప్రవర్తించదు.

 తా ॥ యముని ఈ మాటలను విని, చీకట్లను తొలగించే. ఆ సూర్య భగవానుడు, ఛాయ సంజ్ఞను పిలిచి ఎక్కడికెళ్ళావు అని ఆడిగాడు  ఆత్వష్ఠతనయ ఇట్లా అంది - ఓ విభావసు నేను సంజ్ఞను, నీ భార్యను. నీ వల్ల నాకు ఈ సంతానం కలిగింది  సూర్యుడు ఆమెను ఎన్నిసార్లు అడిగినా ఇట్లాగే చెప్పింది. నిజం చెప్పలేదు. అప్పుడు సూర్యుడు కోపించి ఆమెను శపించబోయాడు అవ్వడు ఆమె సూర్యునకు ఉన్నదున్నట్లు చెప్పసాగింది. విషయం తెలిపిన సూర్యుడు త్వష్ట ఇంటికి వెళ్ళాడు.  అప్పుడు త్వష్ట త్రిలోక పూజితుడైన సూర్యుని పూజించాడు. ఓ భాస్వన్! శక్తిలేకుండా (భార్య) నా ఇంటికొచ్చానేమిటి, అనీ సంజ్ఞను గూర్చి అడిగాడు. యథార్థ విషయాన్ని సూర్యునికిట్లా చెప్పాడు. ఆమె వా ఇంటికి నీవు పంపగా వచ్చింది, ఓ రవి అనగా సూర్యుడు సమాధి యందుండి, బడబా రూపధారియైన తపమాచరిస్తున్న ఆమెను ఉత్తరకురు భూముల్లో చూచాడు సూర్యుని తేజస్సును సహించలేనిది, దానితో చాలా ఏడింపబడి, తన ఛాయారూపమును వదలి, అగ్ని లాంటి తన నిజరూపంతో ధర్మారణ్యమునకు వచ్చి, మదుష్కరమైన తపస్సు చేసింది. ఓ భూపతె ! ఛాయా పుత్రుడైన శనిని చూచి, మరొకడైన యముని చూచి అప్పుడే సూర్యుడు ఆశ్చర్య పడి, దుసలైన (రాల) పుత్రులను చూచి, అసలు విషయం తెలుసకోవటానికి క్షణకాలం ధ్యానం చేశాడు. ధ్యానించి ఆ కారణాన్ని తెలుసుకొన్నాడు తేజోవంతుడనైన నన్ను (ఆరోగ్యం కల) చూడటానికి అసమర్ధురాలై కిరణముల వేడితో శరీరం కాలిపోగా ఆమె, పతివ్రత తపమాచరించింది.ఏళ్ల సంవత్సరాలు గడిచాక వెళ్ళి ఏం తపమాచరించిందో చూడ దలచాడు సూర్యుడు. ఈ విధంగా ఆలోచించి తీవ్రంగా మనోవేగంతో వరమైన ధర్యారణ్య మందు సంజ్ఞ తపస్సు చేస్తున్న పుణ్యమైన తపోవనమునకు వెళ్ళాడు. వచ్చిన సూర్యుని చూచి ఆమె బడబ ఐంది (ఆడ గుఱ్ఱము) అప్పుడు సూర్యుని భార్య సంజ్ఞ ఆడ గుఱ్ఱమైతే పిదప సూర్యుడు గుఱ్ఱమైవాడు. మ్రాణమందు (ముక్కులో) లింగమును పెట్టాడు. వారిద్దరికి సంయోగమైంది అప్పుడు అజంటలైన అశ్వినులు భూమిపై జన్మించారు. ఎడమగిటవల్ల అక్కడ జలము వుట్టింది  భూమి భాగాన్ని కదలించగా అక్కడ కుండం ఏర్పడింది. రెండవ కుండము వెనుకనున్న (సగము) చరణములతో కళినది ఉత్తరమందు నది గల కాశికి కురుక్షేత్రము మొదలగునవి వలె, ఈ కుండమందు స్నానం చేస్తే గంగావుంతో సమానమైన ఫలం లభిస్తుంది. అని మునికి చెప్పారు.ఈ తప్తకుండమందు అంత ఫలం లభిస్తుంది అనుమానం లేదు. అక్కడ స్నానం చేయటంవల్ల సర్వపాపముల నుండి ముక్తులౌతారు  కుష్ఠాది వ్యాధులతో పీడింవబడే దేహము తిరిగి కలుగదు. ఓ భూవ! నీకు అశ్వినీ దేవతల ఉత్పత్తి కారణమును దీనిని చెప్పాను.

తా ॥ ఓ భూవతి! అప్పుడు బ్రహ్మాది దేవతలు అక్కడికొచ్చారు. అనుకున్న దానికన్న ఎక్కువగా ఇచ్చే సంజరు భర్తయైన కల్మష రహితుడైన సూర్యుని వారు  అక్కడ సూర్యుని వకుళమను పేరు గల వనమునకు అధిపతిగా జేసివారు పూజించారు. ఆ పిదప సంజ్ఞ తన పూర్వ రూపాన్ని పొందింది అక్కడ ఆమెను స్థాపించారు. ఆ ఇద్దరిని కూడా (కుమారులను) స్థాపించారు. ఓ మహామతి, రాజ, ఈ తీర్థ ఫలాన్ని చెబుతున్నాను. విను ఓ కురుశ్రేష్ఠ! ఇది ఆది స్థానము. దేవతలకు కూడా దుర్లభమైనట్టిది. శ్రద్ధ కలవాడై, జితేంద్రియుడై రవి కుండంలో నరుడు స్నానం చేస్తే  మహా నరకంలో ఉన్న పితరులను కూడా ఆతడు తరింపచేస్తాడు. పితృదేవతలకు సంతర్పణ చేసి శ్రద్ధతో ఆనీరు తాగితే  అది ఎక్కువైనా తక్కువైనా అదంతా కోటిగుణితమౌతుంది. సప్తమి, ఆదివారం చంద్ర సూర్యుల గ్రహణము అప్పుడు రవికుండంలో స్నానం చేసినవారు తిరిగి గర్భవానమును పొందరు. సంక్రాంతి, వ్యతీపాతము, వైధృతము పర్వము పూర్ణిమ, అమావాస్య కృప శుక్ల పక్షములోని చతుర్ధశి వీటిలో రవితుండమందు స్నానం చేసినవారు తోటి యజముల ఫలితాన్ని పొందుతారు మానవుడు ఏకాగ్రచిత్తంతో బతులమందలి ఆరుని పూజించాలి. సూర్యుడు వెలిగినంత కాలము ఆతడు పరమ స్థానము నందుంటాడు ఆతనికి లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. నంతతిని, మఖమును పొందుతాడు. శత్రువర్గము నాశనమౌతుంది. సూర్యుని ప్రసాదంవల్ల అగ్ని భయము కలుగదు. వ్యాఘ్ర భయము, ఏనుగుల నుండి భయము లేదు. నర్పభయముండదు. భూత ప్రేతములతోనూ, భయముండదు బాల గ్రహములన్నీ రేవతి, వృద్ధ రేవతి అవన్నీ నశిస్తాయి. ఓ బకులార్క! నీకు నమస్కారము ఆతని ఆవులు వృద్ధి నందుతాయి. ధన ధాన్యములు అట్లాగే వృద్ధి నందుతాయి. వంశం విచ్చేదం లేకుండా ఉంటుంది. బరులార్కునకు నమస్కరిస్తే ఒకే సంతానం గల స్త్రీ సంతానం లేని, చచ్చిన సంతానం గల స్త్రీ వంధ్య, విరూపం గల ప్రలు విషకన్యలైన స్త్రీలు  వీరందరు ఈ కుండంలో స్నానంచేస్తే ఆయా దోషముల నుండి ముక్తులౌతారు. సౌభాగ్య శ్రీ అన్ని విధములను సుతులను, రూపమును పొందుతుంది ఆరునెలల నుండి వ్యాధిగ్రస్తుడైన మనిషి కూడ రవికుండంలో స్నానం చేస్తే అన్ని రోగముల నుండి ముక్తుడౌతాడు రవిక్షేత్ర మందు ఉదక తర్పణం చేసిన వారి పితరులు తృప్తిని పొందుతారు, ప్రళయం వచ్చేంత వరకు.

తా ॥ ఓ పుత్రక! ఈక్షేత్రమందు కన్యాదానం చేసినవారు, వివాహంలో పవిత్రమైన ఆత్మకలవారై బ్రహ్మలోకంలో వెలుగొందుతారు గోదానము, శయ్యాదానము పగడము, గుఱ్ఱము, దాసి, బఱ్ఱె, మంట, నువ్వులు, దానితో బంగారము  వీటిని తిలమయమైన (కపిల) ధేమవును ఈ క్షేత్రమందు దానం చేయాలి. ఓ భారత! చెప్పులు, గొడుగు కంబలి మొదలగు వానిని దానం చేయాలి అట్లాగే లక్షరుద్ర హోమము, రుద్ర అతి రుద్రములు చేయాలి. ఆ స్థానంలో శ్రద్ధతో ఏదైనా, దానం చేయాలి. ఓ తండ్రి! ఒక్కొక్క దాన ఫలాన్ని ఉన్నదున్నట్లు చెబుతాను విను. దానం వల్ల ఈ లోకంలో పరలోకంలోను భోగములను పొందుతాడు వివాహము చేసినందు వల్ల మనుష్యులు రాజ్యాన్ని పొందుతారు. మనుష్యులు భార్యవలన ధర్మరామ అర్థములను పొందుతారు. అనుమానంలేదు  పూజ వల్ల సుఖమును జన్మజన్మలలో పొందుతారు. సప్తమీ ఆదివారం నాడు బకులార్కుని స్మరించిన వారు జ్వరము, శత్రువు, వ్యాధి, వీటి నుండి భయమును పొందరు  యుధిష్ఠిరుని వచనము - సూర్యునకు బడులార్కుడవే పేరు ఎట్లా కలిగింది, ఓ ముని! దీన్ని అడుగుతున్న మారు, ఓ శ్రేష్టుడా! యథార్థాన్ని చెప్పండి  వ్యాసుని వచనము - ఓ రాజేంద్ర సూర్యుని కొరకు, ఏకాగ్ర మనస్సుతో సంజ్ఞ, భర్త యొక్క తేజః శాంతి కొరకు బకుల వృక్షము క్రింద తపమాచరించింది సూర్యుడు వస్తున్నాడని గమనించి ఆమె ఐడంగా మారింది. ఐతుల వృక్ష సమీపంలో సూర్యుడు మిక్కిలి శాంతించాడు  అప్పు డు రాణి మనోహరులైన దివ్యులైన మడులను తనది. అందువల్ల ఈ రవి పేరు బడులార్కుడని ప్రసిద్ధమైంది.అక్కడ స్నానం చేసిన వారిని వ్యాధి పీడించదు. ధర్మము అర్థము మము వీటిని పొందుతాడు అనుమానం లేదు  ఆరు మాసములలో ఎర్ధిని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు. నరుడు ఓ మహారాజ! బకులార్కుని ఈ వైభవాన్ని చెప్పాను  అని శ్రీ స్కాంద మహా పురాణముందు ఏకాశీతి నహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండనుందు వూర్వభాగ మందు ధర్మారణ్య ఉపాఖ్యాన మందు బకులార్క మాహాత్మ్య కథనమనునది పదమూడవ అధ్యాయము.