స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

18వ అధ్యాయము

తా ॥ రుద్రువ వచనము - ఓ స్కంధ! మహాప్రాజ్ఞ! నేను చేసిన అద్భుతాన్ని విను. ధర్మారణ్య మందు మహా దుష్ఠుడు కర్ణాటక అను పేరు గలవాడు దైత్యుడున్నాడు  రహస్యముగా వచ్చి దంపతులకు విఘ్నము కల్గించేవాడు. అతనిని చూచి ఆతని భయంవల్ల లోకము నిరంతరము పరుగెత్తసాగింది. వణిజులు, బాడబాదులు తమ స్థానముల వదలి వెళ్ళిపోయారు. మాతంగి రూపమును పొంది ఈ శ్రీమాత ద్విజులను చంపే కర్ణాటకుడనే రాక్షసుణ్ణీ చంపింది, ఓ కుమార. అప్పుడు ఆ విప్రులందరు ఆ పనితో ఆనందించారు భక్తితత్పరులై వణిజులు స్తోత్రం చేశారు. పూజించారు కూడా. ప్రతి సంవత్సరము శుభమైన శ్రీ మాతా పూజను చేశారు అన్ని శుభకార్యములందు మొదట ఆమెను పూజించాలి. అప్పటి నుండి అతడు విఘ్నాన్ని చూడడు, ఓ పుత్రక!  యుధిష్ఠిరుని వచనము - ఈ దుష్ఠుడైన మహా దైత్యుడు ఎవరు? ఏ వంశమందు జన్మించినాడు. ఓ తండ్రి! అతడేమేమి చేశాడు. ఓ సువ్రత! అంతా చెప్పు వ్యాసుని వచనము ఓరాజ! కర్ణాటకునివి చేష్టితమును చెబుతాను విను. దేవతలకు, దానవులకు వాడు దుస్సహుడు, వీర్య దర్పితుడు దుష్టకర్ముడు, దురాచారుడు. మహాభటుడు. మహా ఉపద్రవం కల్గించేవాడు అన్ని లోకములను జయించ గలవాడైవాడు దేవతలు, ఋషులున్న చోటికి వెళ్ళి ఈ మహాసురుడు మోసంతో, లేదా బలంతోనైనా వీఘ్నం కల్గించేవాడు! ఓరాజా!  అతని భయంతో లోకంలో వేదాధ్యయనము లేకుండా పోయింది. బాడబులు దేవతలు నంధ్యాది ఉపాసనను చేయటం లేదు అక్కడ యజ్ఞములు జరగటంలేదు. దేవతల పూజలేదు. ప్రతిదేశమందు ప్రతి గ్రామ మందు ప్రతి పురమందు అంతట ప్రతీ తీర్థమందు అంతట ఆ అసురుడు విఘ్నం కల్గిస్తున్నాడు. కాని ధర్మారణ్యంలో ప్రవేశించటానికి శక్తుడు కాలేదు శక్తియైన శ్రీమాత భయం వల్ల దానవుడు విక్లబుడైనాడు. ఏ ఉపాయంతో అక్కడికి వెళ్ళాచ్చు అని ఆలోచించ సాగాడు మహాత్ములైన బ్రాహ్మణులకు విఘ్నమెట్లా కల్గించాలి. వేదాధ్యయనము చేసేవారు, యజ్ఞమందు కర్మను అధిష్టించిన వారు వారికి విఘ్నం ఎట్లా కలగాలి వేదాధ్యయన శబ్దమును దూరం నుండి విని ఆ రాక్షసుడు, వజ్రం దేబ్బతిన్న ఏనుగు వలె వ్యథ చెందాడు. ఓ రాజా!.

 తా ॥ పళ్ళతో పళ్ళను కొరుకుతూ కోపంతో నిఃశ్వాసములు విడిచాడు. తన పెదవులను కొరుక్కుంటూ రెండు చేతులను పిసుక్కుంటూ ఓ మారిష! ఇటునటు పిచ్చి దానిలా తిరిగాడు. సన్నిపాత దోషంతో మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లాగే దానవుడు వరంగా ధర్మారణ్య సమీపంలో ఉండి ప్రవర్తించాడు. దూరం నుండే భయపడుతు తవను కొలుస్తున్నట్లు భ్రమ పడుతున్నాడు వివాహ కాలమందు బ్రాహ్మణ రూపము ధరించి బ్రాహ్మల దగ్గరకు వచ్చి ఎదిరింప శక్యముకాని ఆ రాక్షసుడు ఉత్తమమైన దంపతులను తీసుకొని భూమిపై నుండి ఆకాశమున కెగిరాడు. ఆ రాక్షసాధముడు ద్వేషం వల్ల జాతి స్వభావం వల్ల, ఆ పావుడు స్వయంగా రమించోడు ఈ విధముగా ధర్మారణ్య ము నుండివాడు అనేక మంది దంపతులను తీసుకొని పోయి దేవతలకు భరింపరాని పాపము చేశాడు ఈ దుష్టుడు భూమిపై ఎల్లప్పుడు దంపతులకు విఘ్నం కల్గించేవాడు. ఆ పురవర మందు మహా ఘోర తరమైన కర్మచేస్తూ ఉండేవాడు అక్కడ ఉద్విగ్నులై ద్విజులంతా వదిదిక్కులకు పరుగెత్తేవారు. భూదేవులంతా మనోరమమైన ఆ స్థానమును వదలివెళ్ళి పోయారు ఎక్కడెక్కడ గొప్ప తీర్థముందో అక్కడంతా ద్విజులు వెళ్ళిపోయారు. ఓ నృపోత్తమ! ఆ సమయమందు ఆ నగరము ఎవ్వరు లేకుండా ఐంది అక్కడ వేదాధ్యయనము లేదు. యజ్ఞములు జరగటం లేదు. కరాటుని భయముతో బాధపడి మనుష్యులు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఓ రాజా! ద్విజులందరు గొప్ప కీర్తిగల వణిజులు అందరు ఒక చోట చేరారు. తమకు తోచిన అభిప్రాయాన్ని ఆలోచనను చెప్పటానికి అద్విజరఖులు కర్ణాటుని వధోపాయమును ఆలోచించ సాగారు. వారు ఆలోచిస్తుండగా అదృష్టవశాత్తు అశరీరవాణి పలికింది అన్ని దుఃఖములను అవహరించే శ్రీమాతను ఆరాధించండి. దైత్యులందరిని నశింపచేపేది, ఉపద్రవముల నన్నిటిని నశింపచేసేది  దానిని విని వాడవులంతా ఆనందంతో నిండిన కళ్ళు గలవారై ఉత్తమమైన ఐలిని తీసుకొని శ్రీమాత దగ్గరకు వచ్చారు మధు, క్షీరము, పెరుగు, నెయ్యి, శర్కర ఐదింటి ధారను కలిగి, ధువము, దీవము, చందనము, పూలు, రకరకాల పండ్లు బాబులు వెళ్ళారు. రకరకాల ధాన్యము, అన్నము, అపూపములు, నేయితో చేసిన వంటకములు వడియాలు, వేయిగల పాయనము, గుగ్గిళ్ళు తీసుకెళ్ళారు. సోహాలికలు (వాగళ్ళా?) దీపాలు, పచ్చివడియలు నల్లవాలు పూయబడిన, తొమ్మిది రంధ్రములు కలిగిన, చంద్రబింబముతో సమానమైన మండకములు (చేతులు) ఏర్పరచాగు  వంచామృతములో స్నానము చేయించి గంధోదకము, ధూప దీపములు నైవేద్యముతో ఈశ్వరిని సంతృప్తి పరచారు కర్పూరముతో కూడిన నీరాజనములలో పుష్పములతో, దీవములతో సుచందనములతో సర్వ ఉపద్రవములను నశింపచేసే శ్రీ మాతను సంతృప్తి పరిచారు .

తా ॥ శ్రీమాత, జగన్మాత, బ్రాహ్మి సౌమ్య, వరప్రద, మూడు రూముల ధరించి ఆమె ముల్లోకములను రక్షిస్తుంది వేదముల రూపములో ఆమె వత్యమందిరమున రక్షిస్తోంది, ఓ ధర్మాలు ఓతేంద్రియులు, తాత్ములు ఐన ఆ ద్విజోత్తములంతా కలిశారు వారందరు ఆమెను పూజించారు. చందనాదులతో సంతోషపరిచారు. నాక్, మనస్సు, శరీర కర్మలతో స్తోత్ర మారంభించారు. బ్రహ్మపుత్రికి ఎదురుగా నిలిచి ఏకాగ్రచిత్తము గలిగి భావపూర్ణముగా నుతించారు. విప్రుల వచనము - బ్రహ్మపుత్ర నమస్కారము బ్రహ్మచారిణి నమస్కారము. ఓ జగన్మాత నమస్కారము. ఎప్పుడూ ఆంతటికి వెళ్ళగలిగేదానా నమస్కారము ఆకలి, నిద్రలు నీవే. దప్పిక నీవే క్రోధము, విద్రమత్తు మొదలగునవి నీవే. నీవు శాంతివి. నీవురతివి. నీవు యవు, విజయవు బ్రహ్మవిష్ణు మహిళాదులతో మతించబడేదానివి మరేశ్వరివి. సావిత్రి శ్రీవి, ఉమవు నీవు మాతవు బ్రహ్మవిన సురేశానులు, నీవు ఆధారముగా ఉన్నారు. ఓ జగన్మాత! నీకు నమస్కారము. ధృతి,పుష్టి రూపముగా గల దావివి. రతి, క్రోధవు, మహామాయవు, ఛాయవు, జ్యోతిః స్వరూపమువు. వసతి అంతములను చేసే దేవి ఎప్పుడు కార్య కారణములు ఇచ్చే దానివి భూమి, తేజస్సు, వాయువు, సలిలము, ఆకాశము అన్ని నీవే. ఓ మహావిద్య! నీకు నమస్కారము. మహాజావనుయి, పాపరహితురాల  ప్రాంతారి, దేవరూపు రావు, క్లీంకారి, మహాద్యుతివి. ఆది, మధ్య, అవసానములు నీవే. మమ్ములను మహాభయము నుండి రక్షించు మహాపాపి, దుష్టాత్ముడు, ఈ దైత్యుడు, ఇప్పుడు బాధిస్తున్నోడు. రక్షణ రూపిణివి నీ వొక్కదానివే. మాకుల దేవతవు మహాదేవి రక్షించు రక్షించు మహేశ్వరి కాపాడు కాపాడు. ద్విజాతులకు విఘ్నము కళించే దుస్తదా నవుని సంహరించు ఈ విధముగా బ్రాహ్మణులు దేవిని, మహామాయను మతించగా, కరాటుని చంపే కొరకు, ద్విజాతుల హితము కొరకు ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. వరము అడగండి అని పలికింది శ్రీ మాత వచనము - ఓ బ్రాహ్మణులార! ఎవరు మిమ్మల్ని భయ పెట్టారు. ఎవరు మిమ్మల్ని ఉద్వేగపరిచారు. అతడి విషయంలో నేను కోపం ఉన్నాను. ఓ విప్రులార! ఆతనిని యమ మందిరానికి పంపుతాను మిమ్మల్ని ఏడించిన వాడి ఆయుస్సు క్షీణించిందని తెలుసుకోండి. ద్వితులకు మీకు వరమిస్తున్నాను. యధేష్టముగా చెప్పండి  మీ భక్తికి సంతసించాను. ఓ విప్రులార! చేస్తాను. అనుమానం లేదు అనగా ద్విజులన్నారు. కరాటుడను వాడు మహా రౌద్రుడైన దానవుడు మదగర్వితుడు సత్య మందిరములో ఉన్నవారికి నిత్యము విస్మము కల్గిస్తున్నాడు బ్రాహ్మణులను, సత్యశీలురను, వేదాధ్యయన తత్పరులను వారివి ఆ శత్రువు ప్రతిరోజు ద్వేషంతో ద్వేషిస్తున్నాడు. ఓ మహామతి! వేదాన్ని ద్వేషించేవాడు దుష్టుడు. ఓ మహాద్యుతి! ఈతనివి చంపు అని అన్నారు

తా ॥ వ్యాసుని వచనము - అట్లాగే కానీ అని పలికి ఆకుల దేవత దేవి నవ్వి, భక్తుల రక్షణ కొరకు వీని వధ కొరకు ఉపాయమును ఆలోచించి ఓ నృపనత్తమ! పిదవ శ్రీమాత! కోపపరురాలైంది. కోపంతో కనుబొమలు ముడిచింది. కళ్ళ చివరి భాగాలు బాగా ఎబడ్డాయి చాలా కోపం కలదైంది, అగ్నివలె మండి పోతోంది. ఓ భారత! ఆమె ముఖం నుండి, నేత్రముల మండి, ముక్కు నుండి, చెవుల నుండి, పెద్ద జ్వాలలు రాసాగాయి ఆ తేజస్సుతో తామ రూపముగల మాతంగి అనునది పుట్టింది. నల్లగా ఉంది. భయంకరమైన ముఖము. చూడశక్యము కాని ముఖంతి గలది. రక్తపు మాలలు, వస్త్రములు (ఎర్రని) ధరించింది. మదంతో తిరుగుతున్న కళ్ళుగలదామె. ఆ శ్రీమాత అప్పుడు న్యగ్రోధ వృక్షసమివమందు కూర్చుంది పదునెనిమిది భుజములు గలది. ఆతల్లి. శుభమైనది, పురోభవమైనది. ధనుర్బాణములు ధరించింది. అదేవి ఖడ్గము దాలు ధరించింది  గొడ్డలి, చిన్నకత్తి, త్రిశూలము, పానపాత్ర ధరించింది, గద, సర్పము, వరిము (ఇనుపకట్లగుదియ) శివుని విల్లు పాశము ఇవి ధరించింది అక్షమాల ధరించింది. మద్య కుంభాన్ని వెంట ధరించింది. శక్తి, రోకలి, ఉగ్రమైన కత్తెర, తలపుర్రె వీటిని ధరించింది ముళ్ళు గలిగిన రేగును ధరించింది. పెద్ద ముఖము గలది (నోరు) వెంట్రుకలు నిక్కబోడిచేటుగా దొమ్మియుద్దము, మహాయుధము అక్కడ జరిగింది. ఓ నృపోత్తమ! కరాట దానవునకు మాతంగితో యుద్ధం జరిగింది యుధిష్ఠిరుని వచనము యుద్ధము ఎట్లా జరిగింది. ఎట్లా తొలగిపోయింది. ఎవరు గెలిచారు ఓ ధర్మజ్ఞ. మారిష! (ఆర్య) దాన్ని వాడు చెప్పండి  అనగా వ్యాసుని వచనము - ఓ రాజేంద్ర ! దైత్యవిలో జరిగిన యుద్దమందు ఏం జరిగిందో ఒక్కసారి విను. పూర్వము ఎట్లా జరిగిందో అదంతా త్వరగా చెబుతాను  స్త్రీలు నశమైన విప్రులు, వణిలు, వారి కథ చెప్తాను. ఓ నృపోత్తమ! ధర్మారణ్యముందు చైత్రమాసం లాగా వ్రతమును ఆశ్రయించిన ఆ విప్రులు గారిని వివాహమాడారు. తమ స్థానము ముఖమైనదిగా గ్రహించి, అట్లాగే ఉత్తమమైన తీర్థరాజమున్నదవి అక్కడి వివాహాన్ని చేస్తూ ఆ ద్విజోత్తములు కలిశారు. ఆ మహాశవమందు కోటి కన్యల సమూహము అక్కడ ఒక్కటైంది. ఓ మహాప్రాజ్ఞ! ధర్మారణ్యంలో కలిశారు. ఇది సత్యము. నేను సత్యం చెబుతున్నాను చతుర్ధి యొక్క అవర రాత్రమందు అభ్యంతరం నుండి అగ్నిని తెచ్చారు. బ్రహ్మకు ఆసనము వేసి, అగ్నికి ప్రదక్షిణం చేశారు.

తా ॥ స్థాలీపాకమును చేసి, అవ్వడు శుభమైన వేదికలు చేసి, నాలుగు చేతులతో, కలశములు ధరించి, వాగ పాములు కలవారై వారు. పిదప ద్విజులు శుభ్రమైన వేద మంత్రమును చదువుతున్నారు. తిరుగుతున్న దంపతులను తగినట్లుగా చుట్టి ఉన్న  ఆ బాడబులు, బ్రహ్మతోకూడి అక్కడ బాగా ఆనందించారు. తార స్వరముగా ధ్వనించగా వేదవిఠోష చేస్తున్నారు గొప్పవైన ఆ శక్తంలో ఆకాశమంతా నిండి పోయింది. బ్రాహ్మణులు చేపే వేద ధ్వనివి, సరసన ఆదానవుడు విని అవసము నుండి వెంటనే లేచాడు. చైతన్యము కోల్పోయి సైన్యంతో కుడి, పరుగెత్తుతున్న భృత్యులందరితో, ఇతరమైన వారితోను ఆతడిట్ల అన్నాడు బాడబుల నుండి పుట్టిన ఈ శబ్దము ఎక్కడుందో వినండి. ఆతవి ఆ మాటను వివి రైలేయులు త్వరగా వెళ్ళారు. విభ్రాంతచేతన్కలై అందరు ఇటు అటు పరుగెత్తారు. కొందరు ధర్మారణ్యమునకు వెళ్ళారు. అక్కడ ద్విజాతులు కన్పించారు ఓ నృప! వివాహ సమయ మందు వారు వేదములను చదువుతున్నారు. దురాత్ముడైన కరాటునకు అంతా నివేదించారు దానిని విని రక్తం వలె ఎర్రనైన కళ్ళు గలవాడై, ఓ మహాభాగ ఆకాశంలో ఉండి అప్పుడు ఆ రాక్షమడు దైత్యమాయను చేస్తూ, సర్వాలంకారములతో కూడిన దంపతులను హరించాడు, ఓ  రాజ! అప్పుడు ఆ బాడబులందరు కలిసి భువనేశ్వరిని చేరి, బుంబుం అవి శబ్దము రక్షించు, రక్షించు అని పలికారు దానివి విని విశ్వజనని, మాతంగి, భువనేశ్వరి సింహ వాదం చేస్తూ త్రిశూల శ్రేషమును ధరించి వచ్చింది. అప్పుడు దేవిశ్రీ కళాటునకు యుద్ధం ఆరంభమైంది. ఋషులు వణిజులు, బ్రాహ్మణులు చూస్తున్నారు చూస్తుండగా రోమహర్శకమైన పంతుల వమరము జరిగింది. మదవిహ్వలుడైన పువును మాతంగి, అస్త్రములలో ఛేదించింది ఆ రాక్షసుడు కూడా ఒక బాణంతో ఆమె వక్షః స్థల మందు కొట్టాడు. వాడుకూడా, ఆమె త్రిశూలంతో కొట్టగా ఇంద్రియ వైకల్యమును పొందాడు. ఆ దేవిని వాడు పిడికిళ్ళతో ఆ రాక్షసుడు కొట్ట సాగాడు. వానిని దేవి త్వరగా నాగపాశంలో బంధించింది.

తా ॥ అప్పుడు ఆ దైత్యుడు గరుడాద్రాన్ని పంధించాడు. ఆమె శరీరమును వడవేసే వారాయణాస్త్రమును సంధించింది ఈ విధముగా ఒకరినొకరు ఆకర్షించి జయం కలగాలనే కోరికతో యుద్ధం చేయసాగారు. పిదప దైత్యపుంగవుడు ఉక్కుతో చేసిన గదను తీసుకొని పరవీరులను సంహరించేవాడు మాతంగిపై కోపగించినవాడై కొట్టాడు. కోపగించిన దేవి పిడికిలి దెబ్బలతో రాక్షసుని పొడిపొడి చేసింది అ ముష్టి ప్రహారములతో మూర్ఛితుడై పడిపోయాడు. పిదప త్వరగాలేచి సంతోషంతో చేత శక్తిని ధరించి ఆమెపై దానవుడు శతఘ్నిని విసిరాడు. ఆ శుభానన మాతంగి, ఆదేవి, శక్తిని ఛేదించింది  ఆ సుభ్రువు గట్టిగా నవ్వింది, వజ్రసన్నిభ ఆమె శతఘ్నిని నశింపచేసేసింది. ఈ విధముగా పరస్పరము శస్త్రముల గుంపులతో వరస్పరము ఏడించుకో సాగారు  పిదప త్రిశూలంతో కొట్టగా అది హృదయంలో తగిలింది. ఆ రాక్షసుడు మూర్ఛ నుండి తేరుకొని రావమాయ చేశాడు అక్కడ చూస్తున్న వారికి ఆ మహాసురుడు కన్పించకుండా పోయాడు. పిదవ దేవి పానము సేవించింది. ఎర్రని కళ్ళలో వవ్వింది ఆదేవి వచరాచరమైన త్రిలోకములందు, అంతట ఉన్న ఆతనివి ఎక్కడ దాక్కున్నొవు. ఎక్కడున్నావు. అని అడుగుతోంది. వీవిప్పుడు నాకు సమాధానం ఇవ్వు అని అంది. కర్ణాటక మహాదుష్ట త్వరగారా యుద్ధం చేయి అని అంది ఆ పిదప దారుణము, భయానకమున మహాయుద్ధము జరిగింది. సుమహాబల ఆమె ఆ రాక్షసుని చంపే కొరకుమై రేయమును (చెరుకు రసపుకల్లు) తాగింది ఆవేదన మతంగి కోపంతో ఆ రాక్షసుని నోట్లో పెట్టుకుంది. ఆ ఎదవ దానవుడు రౌద్రుడై ఆమె నాసా రంధ్రము నుండి బయటికొచ్చాడు  మదపూరితుడై ఆ దైత్యుడు కరాటుడు తిరిగి యుద్ధం చేశాడు. ఆ పిదప మదవూరితమైన మాతంగిదేవి కోపగించి వళ్ళతో బాగా కొరికి మాటిమాటికి నమిలింది. శవము, ఎముకలు, మేధను వీటితో కూడిన, మణి మాంసాదులతో నిండిన నఖ రోమములతో కూడిన అసురుని ఉదరమందుంచుతుంది. వాని ఓ చేతితో నోరు ఎండి పోయింది. ఒక చేతితో నాసిక భాగము. అడ్డగించబడింది. పిదప మహాబలుడైన దైత్యుడు కర్ణరంధ్రము నుండి బయటికొచ్చాడు. ఆ పిదప ఆ మహాదేవి భూమిపై వానికి ఇట్లా పేరు పెట్టింది.  కర్ణరంధ్రము నుండి వచ్చాడు కనుక వీడు కర్ణాటుడు అని విజ్ఞులు తెలుసుకోవాలి అని. ఆ దైత్యుడు జల దర్పితుడై తిరిగి యుద్ధం కొరకు వచ్చాడు.

 తా ॥ అక్కడి అమరుడు గర్జిస్తూ ఆయుధములు ధరించి యుద్దమందు నిల్చున్నాడు.  దుఃసహుడైన ఆ దైత్యుని చూచి మరల మరల ఆలోచించి మాతంగి ఆతని వధోపాయమును ఆలోచించ సాగింది. ఓ భారత! దేవి మాతంగి మదవూరితమై ఆలోచిస్తుండగా ఆ కర్ణాటుడు మాయా రూపమును ధరించి, కుసుమాయుధుడై, తెల్లని వరుడై, అంబుజ పత్రముల వంటి కళ్ళుగలవాడై, పదహారు వంవత్సరముల వయను కలవాడై దేవి దగ్గరకు వచ్చి ఇట్లన్నాడు. ఓ శోభన! నీవు నన్ను వరించు అవి శ్రీ సూత వచనము - నీవు ఇవ్వడు చెప్పింది బాగుంది. దైత్యరాజ! ఇది మునిశ్చితము. భువనత్రయ మందు నీరూపంతో సమానమైన వాడు మరొకడులేడు. ఓ అనురోత్తమ! నేను పూర్వము ప్రతిజ్ఞ చేశాను దానిని విన్నావా. నా చెల్లెలు శుభమైనది. శ్యామా (పేరు) విప్రుణ్ణి వివాహం చేసుకో దలిచింది. ఆమెను బ్రాహ్మణుల రక్షణ కొరకు మానాన్న ఉంచాడు. ఓ దైత్యుడ! ఆమె కేవలము శ్యామలాంగి. సర్వ లోకములకు హితము కోరేది ఆ కన్యను ఎవరూ వరించరాదని ఆమెను ఏర్పరచాడు. నీ శుభాన్ని త్వరగా చెప్పు. నీ ఉపాయం విన్నాను. ఎంత శుభమైంది. నా భగిని ఉంది. ఓ దైత్యేంద్ర. శ్యామల అని పేరుగలది. ఓ శూర! నీ కొరకు రక్షించాను. ఆమెను మొదట వివాహముడు ఆ తండ్రి ఆమెను తీస్తాడు. ఓ మహావీర! శుభమైన ఈమెను నీవు వరించు వెళ్ళు అనగా శ్యామల కోపం గలదైంది అప్పుడు కర్ణాటకుడు క్రోధుడై, గట్టదైన శక్తిని తమకొని, ఆ దుష్టాత్ముడు శ్యామలను చంపి కొరకు పరుగెత్తాడు వచ్చిన అసురుని చూచి శ్యామల, సుమహా మనస్సు గలదై, ఆ దుష్టచేతపడు వివాహం కొరుతు వస్తున్నాడని ఆతవి అభిప్రాయమును గ్రహించింది అక్కడ శ్యామలకు, అనురవరునకు గొప్ప యుద్ధం జరిగింది. ఓరోజ! ఈ భూమి యందు మూడు నెలలు వంతుల సమరం జరిగింది మాఘమాసం కృష్ణ తృతీయనాడు ధర్మారణ్య మందు గొప్ప యుద్ధమున మధ్యాహ్న సమయ మందు కర్ణాటను వాడు వడవేయబడ్డాడు, ఓ భూవ! దేవి ఎక్కడ పడవేసిందో అక్కడ కర్ణాటుడు పడ్డాడు. వాని ఉత్తమమైన తల పర్వత శిఖరమువలె పడింది భూమి అంతా, సముద్రములు, ద్వీపములు, పర్వతములతో వహకంపించింది. ఆ పిదప బ్రాహ్మణులు సంతిష్టులై, ఓ మాత నీకు జయము అని పలికారు గంధర్వవతులు గానం చేశారు. అప్సరపలు నాట్యం చేశారు. పిదవ ఉత్సవం చేస్తూ శుభప్రదమైన గీత నృత్యములు చేశారు పాయనములలో, వడియాలలో, మోదకములతో, నైవేద్యములతో, మంచి మాటలతో స్తుతించారు. వరమైన మెటేరక స్థానమందు వారు స్తుతించారు.

తా ॥ శ్రీమతిని పూజిస్తే ఆమె నుతసౌఖ్య ధనములను ఇస్తుంది. మహోత్సవము వచ్చినప్పుడు మాతంగిని పూజించటం మంచిది ఆమెను స్థాపించి, ధనవుత్ర అర్ధసిద్ధి కొరకు పూజించేవారు సుఖమును, కీర్తిని, ఆయుష్యమును, యశస్సును, పుణ్యమును పొందుతారు వ్యాధులు నశిస్తాయి. ఆదిత్యాది గ్రహములు శుభప్రదమౌతాయి. భూతవేతాళ శాకినులు జంభాదులు (రాక్షసులు) ఏడించరు ప్రేతాదుల పీడనము ఎక్కడా కలుగదు. అప్పుడు విప్రులు ఆనందపడి స్తోత్రము చేయటము ఆరంభించారు  శ్రీ మాతను, శక్తులను, మాతంగిని స్తుతించారు. మహా ఆనందంతో కూడినవారై మహాదేవి శ్యామలను స్తుతించారు బ్రాహ్మణులిట్లన్నారు – ఓ మాత! నీవీ విధముగా మాకు రక్షకురాలివి. స్థానమందు ఉండు. దంపతుల హితము కొరకు, బ్రాహ్మణులు ఉద్వేగం పొందకుండా ఉండేందుకు ఇక్కడ ఉండు. అని. మాతంగి వచనము - ఓ మహాభాగులార! ఓ ద్విజులార! ఈమీస్తవంలో మీ విషయంలో నేను సంతుష్టు రాలవైవాను. మీ మనస్సునకు నచ్చిన వరాన్ని కోరండి. బ్రాహ్మణులిటన్నారు - ఓదేవి! నీ మనస్సులో ఏం ఉందో, దానిని బలిగా ఇస్తాము. మా దంపతుల రక్షణ కొరకు నీవు స్థిరంగా ఉండు అనగా దేవి వచనము - ద్విజులందరు మఖంగా ఉండండి. మీరు ఏడకలుగదు. నేనుండగా దుర్ధరులైన రాక్షసులు కాని ఏ ఇతర దైత్యులు తావి కివి భూతప్రేతములుకొని జంభాదులు గ్రహాలు కాని శాకిన్యాది గ్రహాలు కాని పర్పములు, వ్యానదులు కాని నేను శాసిస్తుండగా ఎక్కడ ఏడించవు. వివాహం వస్తే మహోత్సవ మాచరించాలి. దపంతుల హితము కొరకు నరుడ! ఎప్పుడూ నన్ను పూజించాలి. ఆతని సకల బాధలను వేను నశింపచేస్తాను. అనుమానము లేదు ఆధులు (మనో వ్యధలు) వ్యాధులు (శారీరకమైనవి) ఉండవు. క్లేశము కొని తొట్రుపాటుతానీ ఉండవు. వరము సౌఖ్యమును, యశస్పు, పుణ్యము, ధనము వీటిని ఎల్లప్పుడు పొందుతాడు. అతనికి అకాల మరణముండదు. వానికి వాతపిత్తాదికములు ఉండవు. విప్రుల వచనము - ఏవిధి ప్రకారము పూజ చేయాలి. నైవేద్యము ఎట్టి దుండాలి. ఓ తల్లి! ధూవం ఎట్లా ఉండాలి. పూజను ఎట్లా ఏర్పరచాలి అనగా –

 తా ॥ శ్రీ దేవి వచనము - ఓ విప్రులార! వామాట వినండి. బంగారు మయమైన ఆతుయందు దేవి రూపం రాసి పూజించిన వారు దంపతులు చిరాయువులౌతారు  లేదా వెండి పాత్రలో గాని లేదా కాంస్య పాత్రలో గాని పదునెనిమిది భుజములు గల దేవిని వ్రాయలి. ఆమె ఒంటినిండా చందనం పూయాలి. చాట, బాణములు, చేతియందు శ్వానము, పద్మము శ్రేష్ఠము, ఒక కత్తెర చేయించాలి. అమ్ములపొది ధనుస్సులు  డాలు, పాము, గద తాంస్యంతో చేసింది, చర్లకోల, శంఖము, చక్రము, శుభ్రమైన గదముసలము, ఉభమైన గడియ (వంటిది) ఖట్వాంగము, ఐదరి, మనోరమమైన అంకుశము ఈ పద్దెనిమిది ఆయుధములతో భువనేశ్వరి కూడి ఉంది  ఆ దేవి కుండములుండేట్లు దించాలి, బాహనూ పురములు కలదిగా చిత్రించాలి. కేయూర ముక్తా పద్మములు, మండల కలదానివిగా చిత్రించాలి. మాతృతాక్షరంతో చుట్టబడింది. అంగుళీయకములతో కూడి ఉంది. రకరకాల ఆభరణముల శోభతో కూడింది. ఈ విధముగా భువనేశ్వరిని చిత్రించి  ద్విజోత్తములార! ప్రతిష్ఠ కొరకు మాతంగి అవి ప్రవర్తివి కల్గించండి. హృద్యమైన చందనముతో, పుష్పములతో పూజించాలి బుద్ధిమంతుడు యక్ష కర్దమమును తెచ్చి మాతంగిని పూజించాలి.గుగ్గిలంలో ధూపం వేయాలి. మంచి వాసన గల వేయితో దీపం పెట్టాలి. దంపతులు శుభ్రమైన వారికే వీరంలో అర్ఘ్యమివ్వాలి సుమనోరమమైన దేవతలకు నాలుగు ప్రదక్షిణలు చేయాలి. వస్త్రపు ఉత్తరీయమును కప్పుకొని దంపతులు నిలబడి  మాతంగి యొక్క ఉత్తమమైన మాధ్వీకమును (ఇవృదువ్వుకల్లు) ప్రొక్షించుకొని, పానముచేసి, నుదీయుతుడు గీతవాదిత్రముల ధ్వనులతో మాతంగిని పూజించాలి  సువానులు ఆ రూపములే మాతంగీ సంభవులు అని పూజించాలి. ఎదురుగా దంపతులు నృత్యం చేయాలి. సర్వ ఉపద్రవముల శాంతి కొరకు రకరకాల అన్నములతో నైవేద్యములు ఇవ్వాలి. పద్దెనిమిది రకముల శుభమైన నైవేద్యములు ఇవ్వాలి. బభమైన వడియాలు, అప్పాలు, పాలు చెక్కర గలవి వరమైన బల్లాకరము, యూములు, వేయించిన గుగ్గిళ్ళు, సొహాలి, అన్నవటము, లాప్పిళము, పద్మ చూర్ణకము? నేయములు, విమలములు, పర్పటములు, శాలతాదులు, శుభ్రమైన మనోరమమైన ఆనూపమునకు చెందిన పూరణము చేయాలి బాగా వండిన అలచంతలు అక్కడ దంపతులు ఏర్పరచాలి. పేజీలు, గోపికలు మనోరమమైనవి అక్కడ చేయాలి. పేజీలు, గోపికలు మనోరమమైన అక్కడ చేయాలి.ఈ పదునెనిమిది ఇతరమైన వక్వ అన్నములు ఏర్పరచాలి.

 తా ॥ వేయి, శర్కరతో కూడినని, కములతో కూడినవి ఏర్పరచాలి. రాత్రి జాగరణ చేయాలి. సువాసినిని పూజించాలి. వేయి యందు దంపతులకు ముఖావలోకనము చేయించాలి. ఉత్పాత వరిశాంతి కొరకు పరస్పరము అట్లా చేయాలి. ఈ విధముగా శుభమైన మాతంగి పూజను నేను చెప్పాను పూజించని వారికి ఆమె విన్నం కల్గిస్తుంది. దంపతుల మరణము, ధననాశము మహాభయము క్లేశము, రోగము, అగ్గిపుట్టటము వంటివి చూస్తాడు అందువల్ల బుద్ధిమంతులైన విప్రులు మాతంగిని పూజించాలి  బ్రాహ్మణుల వనంలో దంపతులందరికి వణిజులకు మహాదేవి ఎల్లప్పుడు విఘ్నాలు లేకుండా చేస్తుంది వాళ్ళు అట్లాగే అని అన్నాక మళ్ళీ ఇట్లా పలికింది. ఓ బ్రాహ్మణులార! మీరంత వివాహాది మహోత్సవమును గూర్చి వినండి. నా మాటను విని అట్లాగే విధానమాచరించండి. వివాహ కాలము రాగా దంపతుల ముఖము కొరకు నిర్వశ్నుము కొరకు తన పేవతులతో కూడి ఆచరించాలి. సంబంధీకులందరికి కళ్ళకు కాటుక పెట్టాలి  (భూమధ్య మందు అర్ధచంద్రునితో సమానమైన రూపాన్ని వ్రాయాలి. దానిపై మనోహరమైన బిందువున వ్రాయాలి ఓ విప్రులార! ఇట్లాచేస్తే శాంతి లభిస్తుంది. మరోరకంగా రాదు. ఈ అందమైన తిలకము పుత్రవృద్ధిని కళించేది. పర్వవినుములను తొలగించేది. సర్వ దుఃస్థితులను వ్యాధులను నశింపచేసేది వ్యామని వచనము - ఓ వరాధిప! ధర్మారణ్య మందలి ప్రజలందరు శాంతులైనారు. సత్యమందిర మందలివారు దేవియైన మాతంగి దయవల్ల గొంతులైనారు ఏదన, సంతోషించిన హృదయాలు గల విప్రులు, విధి నుతను పూజించారు. ప్రతివర్షమందు మాతంగి పూజను ఆచరించాలి మను కృష్ణమందు తృతీయ యందు భక్ష్య భోజ్యాదులతో పూజించాలి. కర్ణాటువీ ఉత్పత్తి తిరిగి మళ్ళీ జరిగింది భయంవల్ల ఆ స్థానమును వదలి దక్షిణ దిశకు వెళ్ళాడు. వెళ్తూవెళ్తూ ఆదైత్యుడు యకురూపుడై మాట్లాడివాడు ధరారణ్యమండువు ఓ ద్విజలార! అంతా నామాట వినండి. వణిజలు కూడా వినండి. గొప్పదైవ ఈ మాటమ ఆచరించండి  మాఘ మాసంలో నా ప్రీతి కొరకు భూమియందు ఎల్లప్పుడు నిన్నుములు లేకుండా ఉండేందుకు త్రిదళ ధాన్యముతో విశ్లేషించి మూలకములతో పూజించాలి. పురుషుడు నియత ప్రతుడై నువ్వుల నూనెతోనైనా చేయాలి. నిరంతరము యక్ష్మప్రీతి కొరకు ఒంటి పూట భుజించాలి.

తా ॥ ఇక్కడ బాలురు కాని యువతులు కాని వృద్ధులు కాని అందరు ప్రతి సంవత్సరము యక్ష్మవ్రతమును ముఖ్యంగా చేయాలి ఏ ఇంట్లో ఎంతమంది పురుషాకార రూపంలో ఉన్నారో వారు ఏక భక్తరతులై (ఒకపూట భోజనము) ఆతని ఆహ్వానించాలి  పిల్లవాని కొరకు తల్లి వ్రతం చేస్తుంది. లేదా తండ్రి అన్నలు చేస్తారు. ఎవవి కొరకు వ్రతం చేస్తారో వానికి భయము కాని రోగము కాని బంధనము కాని ఎక్కడా కలుగవు. భర్త కొరకు స్త్రీ ఆచరించాలి. ఆమెకు శక్తి లేకపోతే ఇతరులతో చేయించాలి ఇట్లా ఆదేశించి దైత్యుడు సత్యమందిరం వదిలాడు. ఆతడు దక్షిణ దిక్కుగా వెళ్ళి ఉత్తమమైన సముద్ర తీరమందు  ఓ నరాధివ! ఆ కర్ణాటుడు విశాలమైన దేహాన్ని పొంది ఆ ప్రదేశమును తన పేరుతో ఏర్పరచాడు ఎక్కడైతే అన్ని వస్తువులు, అధికముగా ధనధాన్యములు ఉంటాయో దానిని ఆ కర్ణాటదేశమును చుట్టి చాలా కాలము ఉన్నాడు. ఓ రాజ! ఓ నరనత్తమ! పుణ్యమైన ధర్మారణ్య కథను చెప్పాను. శ్రీమాత మాహాత్మ్యాన్ని ఎవరు వింటారో, ఎవరు వినిపిస్తారో వాళ్ళకులంలో ఎప్పుడూ అరిష్టము కలుగదు. సంతాన హీనులు సంతాన వంతులౌతారు. ధన హీనులు సంపదను పొందుతారు. శ్రీ మాత ప్రసాదము వలన, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి. అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వభాగమందు ధర్మారణ్య మహాత్మ్య మందు మాతంగి కర్ణాటక ఉపాఖ్యాన వర్ణన మనునది పదునెనిమిదవ అధ్యాయము.