స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
22వ అధ్యాయము
తా ॥ స్థానవాసినులైన యోగినులు కాజేశునితో నిర్మింపబడ్డవారు ఎవరు. ఏ స్థానమందు ఏ దేవత వారెలాంటి వారు, నాకు చెప్పు అనగా వ్యాసుని వచనము - సర్వ జ్ఞుడవు కులీనుడువు. ఓ అనఘుడ నీవు బాగా అడిగాను. ఓ యుధిష్ఠిర! నేనంతా చెబుతాను మీగలకుండా నానా ఆభరణములతో భూషణములతో కూడిన వారు నానా రత్నములతో శోభిస్తున్నవారు, రకరకాల వస్త్రములు ధరించినవారు, రకరకాల ఆయుధములు కలవారు నానా వాహనములు కలవారు నానా స్వరములతో గర్జించువారు వివ్రుల భయనాశము కొరకు కాజేశులు నిర్మించారు ప్రాచియుందు దక్షిణమందు, పడమర ఉత్తరమందు వారిని ఏర్పరచారు. ఆగ్నేయ నైఋత వాయవ్య ఈశాన్యము లందును కూడా ఆశావురీ, గాత్రా ఈ ఛత్రా ఈ జ్ఞానజా, పిప్పలాంబా, శాంతా, సిద్ధా భట్టారిక కదంబ, వికటా, మీరా, నువర్ణా, వనజా, మాతంగీ, మహాదేవీ, వారాహీ ముకుటేశ్వరీ భద్రా, మహాశక్తి, సింహర, మహాబలావీరు ఇంతేకాక ఇతరులు అనేకమంది స్థాపించబడ్డారు చెప్పటానికి శక్తిచాలదు. దేవతలు (స్త్రీలు) నానా రూపధరులు నానా వేషముల నాశ్రయించినవారు స్థానము నుండి ఉత్తరరదిగ్భాగమందు నమీవంలో ఆశాపూర్ణా పూర్వమందు ఆనందా నందదాయిని దేవి ఉంది. ఉత్తర మందు దేవతా స్త్రీలు నానారూపములు ధరించి ఉన్నారు. జలదానంతో తర్పితులై ఇష్టమై నకోరికలను తీరిస్తారు నైఋతి దిగ్భాగమందు శాంతినిచ్చే శాంత ఉంది. సింహము పై ఆసీనురాలు, నాల్గు చేతులుగలది, వరముల నిచ్చేది భట్టారి మహాశక్తి అక్కడే ఉంది స్తుతించిన పూజించిన భక్తి గల భక్తులకు భయమును నశింపచేస్తుంది. స్థానంనుండి ఏడవకోను యందు క్షేమ లాభ ఉంది. ఆమె విలేవనములతో నిండింది. పూజ్యమైనది. ధ్యానిస్తే చాలు సిద్ధిని వ్రసాదిస్తుంది. పూర్వదిక్కు యందు లోకములతో, బలిదానంతో తృప్తి నందింప బడే దేవత పరివారంతో తుడి నడై శక్తి ముక్తులను కల్గిస్తుంది. అంచిత్య రూవము, చరిత్ర గలది. సర్వ శత్రువులను నశింప చేసేది. మూడు సంధ్యలందు ప్రత్యక్షంగా కన్పిస్తుంది. స్థానం నుండి ఏడవ కోసు యందు దక్షిణ మందు వింధ్యవాసిన ఉంది. ఆయుధములు కలది. రూపము గలది. భక్తుల భయము తీర్చేది. పశ్చిమ ముందు నింబంజ దేవీ అంత భూమి నాశ్రయించింది. మహాబల ఆమెను చూస్తే చాలు నయనములకు ఆనందం కలుతుంది. స్థానమునకు ఉత్తర దిగ్భాగ మందు అంతభూమి నాశ్రయించింది శక్తి. ఐహసు వర్ణము గల రుద్రాక్షలు గలది. ఆమెను పూజిస్తే ఆమెను వర్ణమునిస్తుంది. స్థానము నుండి వాయువ్య కోణమందు కోసు దూరంలో ఆశ్రయించినది క్షేత్రధరా మహాదేవి, సంకేతముగా బేకను ధరించింది. వురమునకు ఉత్తరాదిగ్భాగ మందు కోసు దూరంలో కర్ణిక ఉంది. అందరికి ఉపకారం చేయటంలో ఆసకురాలు. స్థానమందలి ఉపద్రవముల నశింపచేసేది స్థానము నుండి నిరతిదిగ్భాగ మందుబ్రహ్మాణీ ప్రముఖులున్నారు. నానా రూపముల ధరించిన దేవతలు జలతలు ఉన్నారు. అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు దేవతాస్థాపన మనునది ఇరువది రెండవ అధ్యాయము.
