స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
2 అధ్యాయము
వ్యాసుని వచనము - భూదేవతకు లలాట మందు తిలకము, లక్ష్మీ అనే తీగకు చక్కని ఆలవాలము (పాదు) వాగ్దేవత జలకేళికి రమ్యమైన దేశము అట్టి దానిని ఇప్పుడు ఏమి దాచకుండా వర్ణిస్తాను (1) ఓరాజా! నీవు బాగా అడిగాను. వారణాసి కంటే అధికాధికమైనది, ధర్మారణ్యము. ఓరాజ శ్రేష్ఠ మిక్కిలి శ్రద్ధగా విను (2) అన్ని తీర్థములు అక్కడే ఉన్నాయి. అందువల్ల ఊషరం అనబడుతుంది. బ్రహ్మవిష్ణు శివుడు మొదలగు వారితో ఇంద్రాదులతో సేవించబడుతోంది. (3) లోకపాలురతో, దిక్పాలురతో మాతలతో శివశక్తులతో గంధర్వులతో అప్సరసలతో యజ్ఞకర్మలతో సేవించబడేది (4) భూతవేతాల శాకిని గ్రహదేవ, అధి దేవతలతో ఋతు మాన వక్షములతో సుర అసురులతో సేవించబడేది. (5) ఓ నృవ! అది ఆదిస్థానము అట్లాగే అన్ని సౌఖ్యములనిచ్చేది. అనేక యజ్ఞములతో ముని నత్తములతో, సేవింపబడేది (6) సింహ వ్యాఘ్రములతో ఏనుగులతో అట్లాగే రకరకాల పక్షులతో, గోమహిష్యాదులతో సారసములతో (పక్షి) మృగనూకరములతో (7) సేవించబడేది. ఓ నృవశార్దూల ! రకరకాల మృగములతో కూడినది. ఇక్కడ మరణించిన పక్షులు కీటకాదులు (8) పశువులు, వ్యాఘ్రములు, జలచరములు, క్షలచరములు కేచరములు, భూచరములు, డాకినులు, అట్లాగే రాక్షసులు (9) వీటన్నిటికి నూటొక్కటితో తడి (తరములు) శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. అవన్నీ విష్ణులోకమునకు వెళుతాయి. అనుమానము లేదు (10) పూర్వజులైన పదిమంది పూర్వులను వదిమంది అవరమైన వారిని తరింపజేస్తుంది. యవలు, వడ్లు, నువ్వులు, నేయి, బిల్వపత్రములు, దూర్వ (11) బెల్లము నీరు వీటితో అక్కడ పిండిము చేసిన వారు, ఓనాథ! వారు సప్తగోత్రములను ఉద్ధరిస్తారు. ఏ కోత్తరశతము కులమును ఉద్ధరిస్తారు (12) అనేక విధములగు వృక్షములతో కూడినది, లతలు పొదలతో నుశోభితము ఎల్లప్పుడు పుణ్యమునిచ్చేది. అది ఎల్లప్పుడు ఫలములతో కూడినట్టిది (13) ఆధర్మారణ్యము, ఓ భూపతి ! వైరము లేనట్టిది. భయరహితమైనది. గోవ్యాఘ్రములు క్రీడిస్తాయి. అట్లాగే మార్జార మూషకములు కలసి ఆడుకుంటాయి (14) కప్ప పాముతో ఆడుతుంది. మనుషులు రాక్షసులతో ఆడుతారు. ఈభూమిపై ధర్మారణ్యము నిర్భయముగా ఉంది. (15) మహానందమయమైనది, దివ్యమైనది పావనమైన దానీ కన్న వరమ పావనమైనది. కుంజములలో ఉండి కోకిల అవ్యక్త మధురముగా గొంతెత్తి అరుస్తోంది. (16) అప్పుడు పావురము ధ్యానమందున్నవారు వింటారని వారిస్తోంది. అభయంతో, నెమలి, ఆడనెమలిని వదలిమౌనంగా ఉంటోంది. (17) వెన్నెలను భుజించే చకోరము నక్త ప్రతమువలె ఉంది. గోరువంకలు సారం చదువుతున్నాయి. చిలుకను నంభోదిస్తున్నాయి. (18) దరిలేని నంసార సింధువున ఫారమును అంది ఇవ్వగలువాడు శివుడు అని. ఆలస్యంగానైనా గృహంనుండి ధర్మవనానికి వెళ్ళిన వానికి (19) అశ్వమేధము కన్న అధికమైన ధర్మము అతనికి అడుగడుగున వస్తుంది. శావ, అనుగ్రహములు ఇవ్వగల సమర్ధ బ్రాహ్మణులు అక్కడున్నారు. (20) పద్దెనిమిది వేల మంది ఆ పుణ్యకార్యమందు ఉంచబడివారు. ముప్పదిరువేల మంది భృత్యులున్నారు. వారు వణిజులుఈ లోకంలో (21) బ్రాహ్మణ భక్తి కలిగినవారు బ్రాహ్మణ హితము కోరేవారు, వారు అయోనిజులు. పురాణము నెరిగివారు. సదాచార సంపన్నులు, ధార్మికులు, శుద్ధమైన బుద్ధి కలవారు. ధర్మారణ్య మందు నివసించే వారిని స్వర్గమందు దేవతలు ప్రశంసిస్తున్నారు (22).
యుధిష్టురుని వచనము - దేవతలు ధర్మారణ్యమనే పేరును ఎప్పుడు పెట్టారు ఎందువల్ల ఈ భూమిపై పావనమైంది. పావనమని కదా నిర్మించారు (23) ఎందువల్ల ఏ కారణం వల్ల తీర్థభూతమైనదో (స్థానము) దానిని నాకు చెప్పండి. ఎంత మంది బ్రాహ్మణులు ఏ కారణముగా అక్కడ ఉంచబడ్డారు ఎవరుంచారు (24) పద్దెనిమిది వేల మందిని ఎందుకుంచారు. బ్రహ్మసత్తములైన ఆ బ్రాహ్మణులు ఏ వంశమందు జన్మించారు (25) అన్ని విద్యలలో నిష్ణాతులు, వేద వేదాంగ పారగులు, ఋగ్వేదమందు. నిష్ణాతులు, యజుర్వేద మందు శ్రమించినవారు (26) సామ వేదాంగ సారము ఎరిగినవారు, వేదముల నెరిగిన ధర్మసత్తములు, తపోవిదులు, శుభాచారులు, సత్యవ్రత పరాయణులు (27) మాసోవ వాపములతో, చాంద్రాయణాదులతో కృశించినవారు, వేదాచారులు, బ్రాహ్మణహితులు ఏ కారణంగా (ఎవరిచే) భృత్యులైనారు. చెప్పే వారిలో ఉత్తముడ! అదంత సంపూర్ణముగా మొదటి నుండి నాకు చెప్పండి (28) దానవులు, దైతేయులు, భూత వేతాళ సంభవులు, రాక్షసులు, పిశాచులు వారినెందుకు ఎందుకు వేధించలేదు (29) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు, తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వార్ధమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు యుధిష్ఠిర ప్రశ్నవర్ణన మనునది ద్వితీయ అధ్యాయము.
