స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

34వ అధ్యాయము

వ్యాసులిట్లన్నారు - ఈ విధముగా ధర్మజుడైన రాముడు పూర్వము జీర్ణోద్ధారాన్ని చేశాడు. శ్రీ మాతవచనంతో బ్రాహ్మణుల పాతం కొరకు (1) యుధిష్ఠిరుని వచనము - ఓ బ్రహ్మన్! రాముడు. పూర్వము ఏలాంటి శాసవాన్ని వ్రాశాడు. త్రేతాయుగముందు సత్యమందు చేసిన శాసనమేది, దయతో చెప్పండి అనగా (2) వ్యాసుడిట్లన్నారు- శ్రేష్టమైన దివ్యమైన బరులార్కుడు అధిష్ఠించిన ధర్మారణ్యమందు, శూన్యస్వామియైన నారాయణ ప్రభువుండగా (3) నర్వజ్ఞుడైన గణ నాయకుడు రక్షణాధిపతియై యుండగా, భవసాగరమందు మగ్నులైన వారిని తరింపచేపే యోగిని ఉండగా (4) ఆక్కడ రామశాననము, రాశువుని పేరుతో ధర్మశాస్త్ర ప్రకారము వ్రాయబడిన తామ్ర శాసనమును గూర్చి విను (5) అది మహాచర్యకరమైనది. అనేక యుగముల నుండి ఉన్నట్టిది. ధాతువులన్ని నశిస్తాయి. సువర్ణము నశిస్తుంది (6) ద్విజశాసనము అక్షయము. అక్కడ ప్రత్యక్షంగా కన్పిస్తోంది. తామ్రశాసనము నాశనంకాకపోవడానికి అక్కడ కారణం ఉంది. (7) వేదోక్తమైనదంతా విష్ణువే చెప్పాడు. పురాణములందు, వేదములందు ధర్మశాస్త్రములందు (8) అంతట అనేక భావములతో కూడిన విష్ణువు పొగడబడుతున్నాడు. అనేక దేశములందు, ధర్మములందు, అనేక ధర్మములను ఎరిగినవారు (9) అనేక బేధములతో అంతట ఏమవే ఉన్నాడని అంటున్నారు. ఆ పురాణ పురుషోత్తముడు సాక్షాత్తుగా అవతరించాడు (10) దేవతల శత్రువులను నశింపచేసే కొరకు, ధర్మరక్షణ కొరకు, అవతరించాడు. ఓ నుత! ఆతడు ఈ అవివాళాత్మకమైన శాసనాన్ని ఇచ్చాడు (11) ఆతని ప్రతాపంవల్ల రాళ్ళు జలమధ్యం నుండి దాటించాయి. లంక వానరులతో చుట్టబడింది. అవలీలగా రాక్షసులు చంపబడ్డారు (12) మృతుడైన ముని పుత్రుని రాముడు యమలోకం నుండి తెచ్చాడు. ఆతడు దుందుభిని చంపాడు. కబంధుని కూడా అట్లాగే చంపాడు. (13) తాటక చంపబడంది. ఏడుతాటి వృక్షములు పడగొట్టబడ్డాయి. ఖరుడు, దూషణుడు త్రిశిరుడు, మహాసురుడు (14) చతుర్దశ సహస్ర రాక్షసులు వేగంగా యుద్ధంలో చంపబడ్డారు. ఆతడిచిన ఈ శావనము అక్షయం కాకుండా ఎట్లా ఉంటుంది (15) స్వయంగా తన వంశవర్ణనను వ్రాసి, విధి వూర్వకముగా దేశకాలాదీకమంతా వ్రాశాడు (18) తన ముద్రగలిగిన దానిని వేదవిదులకు (తైవిద్యావిదులకు) ఇచ్చాడు. నలుబదినాలుగు సంవత్సరాల రాముడు ధశరథాత్మజుడు ఇచ్చాడు (17) ఆ కాలమందు మహాఆశ్చర్యము జరిగింది, ఓ బారత అక్కడ బంగారువంటి అట్లాగే వెండివంటి (18) నీరు తీర్థమందు ప్రవహించింది. దేవఋషి పితరులకు తృప్తినిచ్చేది. తను వంశనాయ కుడైన రాముని ఎదుట అది సూర్యునిచే చేయబడింది (19) ఆ మహాశ్చర్యాన్ని చూచి రాముడు విష్ణువును పూజించాడు. రాముని విచిత్ర లేఖనములతో ఈ ధర్మశాసనము వ్రాయబడింది (20).

ద్విజులందరు దానిని చూచి సంసార భయ బంధనము దీని వల్ల కలుగదని ఇది సర్వ రక్షకమని భావించారు. (21) పాపిష్టులు, దురాచారులు, మిత్రహరతులు వారికి హెచ్చరిక కొరకు ప్రసిద్ధమైంది. పూర్వము (22) రామలేఖ విచిత్రములతో విచిత్రమైన రాగి వట్టక మందు శాసన మందు ఈ వాక్యములున్నాయి కన్పిస్తున్నాయి. ఓ నారద (23) పితరలు చెబుతున్నారు. పితామహులు చెబుతున్నారు. భూమిదుడు వంశంలో జన్మించాడు. ఆతడు మమ్ములను తరింపచేస్తాడు (24) ఈ భూమి అనేకమంది రాజులతో అనేక విధములుగా అనుభవించ బడింది. ఎవనెవనికి ఎప్పుడీ భూమి ఉందో అప్పుడప్పుడు వానికి ఆ ఫలము (25) భూమి నిచ్చువాడు అరవై వేల సంవత్సరాలు స్వర్గ మందుంటాడు. దానిని ఛేదించే వాడు, దాని కంగీకరించే వాడు వీరిద్దరు అన్ని సంవత్సరాలే (60వేల) నరక మందుంటారు (26) వటుతారులతో ఒత్త బడుతూ సమ్మెటలతో కొట్టబడుతూ పాశములతో బాగా బంధింపబడుతు గొప్ప స్వరముతో అరుస్తారు (27) దండములతో తలపై కొట్టబడుతూ, అగ్నిని కౌగిలించుకొని, చిన్నకత్తితో ఛేదించబడుతూ గొప్ప గొంతుతో అరుస్తాడు (28) మహాఘోరమైన యముని దూతలు బాధిస్తారు. బ్రాహ్మణ వృత్తి ఏలోవకుడైతే ఈ విధముగా మహా దుషలైన మహా గణములలో వారు పీడింపబడుతారు (29) పిదప తిర్యక్ యోనిని పొందుతాడు. రాక్షస యోనిని కాని కుక్క యోనిని కొని పొందుతాడు. సర్పము ఆడ పులి, ఆడ నక్క, పిశాచ స్త్రీ, మహా భూతములకు భయంకరమైన యోని నొందుతాడు (30) భూమిని అంగుళము హరించినవాడు ఎంతో పాపం చేసినట్లు, భూమిని అంగుళము దానం చేసినవాడు ఎంతో పుణ్య మాచరించినట్లు (31) వేయి అశ్వమేధ యాగములు, నూరు రాజసూయయాగములు, నూరుగురు కన్యల దానము ఒనరించిన వాడు పొందే ఫలితమును భూమిదానం చేసిన వాడు పొందుతాడు (32) ఆయుస్సు, కీర్తి, సుఖము, ప్రజ్ఞ, ధర్మము, ధాన్యము, ధనము, జయము, సంతానము ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. భూదానం చేసినవాడు ఎల్లప్పుడు సుఖమునందుతాడు (33) భూమిని ఒక్క అంగుళమైన హరించిన నరులు, వ్యర్ధమైన అడవులలో నీరు లేనిచోట, ఎండిన తొర్రలలో నివసిస్తారు. ఇచ్చిన దానిని తిరిగి హరించువారు నల్ల పాములై జన్మిస్తారు (34) వేయి తటాకములతో నూరు అశ్వమేథములతో, కోటి గోవుల దోసములతో భూమిని సారించిన వాడు శుదుడౌతాడు (35) ఇక్కడ ఇచ్చిన వాటిని ధనమును ధర్మ అర్థయశస్కరమైన దానములను, ఔదార్యంగా బ్రాహ్మణులకు ఇచ్చిన వాటిని సాధువైన వాడెవడు తిరిగి తీసుకుంటాడు (36) కదులుతున్న అధికమైన ఆకులవలె చంచలమైన జీవలోకంలో, తృణలనంవలె ముసారం గలిగి సంసార సౌఖ్యం ఉండగా, దురాశాపరుడై, బ్రాహ్మణ శాసనమును ఎవడు అవహరిస్తాడు. నరకమనే గహసమైన గుంతలోని సుడిలో వడడానికి ఎవడుతుకవడుతాడు (37) ఈ మవాని ఏ రాజులు పొందారో వారు దీనినంతా వదలి (అనుభవించి) వెళ్ళారు. ఎవ్వనితో కూడా ఈ భూమి గతంలో వెళ్ళలేదు. ఇవ్వడు వెళ్ళటంలేదు. భవిష్యత్తులోనూ వెళ్ళదు. ఈ భూమి యందున్న దంతా నశించేది, కీర్తి ఒక్కటే స్థిరమైనది. ఈ విధముగా భూమిని ఉపయోగించిన వారైనా, కీర్తిని పొగొట్టుకోరాదు. (38) రాజులందరికి ఒక్కతే చెల్లెలు ఈ లోకంలో, బ్రాహ్మణునికిచ్చిన భూమిని అనుభవించరాదు, దానిమీద వెన్ను తీసుకోరాదు (39) భూమిని ఇచ్చి రాబోయే రాజులను, రామచంద్రుడు మళ్ళీ మళ్ళీ ఇట్లా యాచిస్తున్నాడు. ఇది ధర్మసేతువు. రాజులందరికి సమానమైనదే. మీ మీ కాలములలో మీరు దీనిని పాలించాలి (40).

భూమి యందు ఈ వంశమందు ఏ రాజైనా జన్మిస్తే ఆతడు నేను చెప్పిన దానిని పాలిస్తే ఆతనికి నేను స్వాధీనుణ్ణి (41) రాముడు శాసనాన్ని వ్రాసి చతుర్వేద పారగులైన బ్రాహ్మణులను పూజించి బుద్ధి మంతుడు, వసిష్ఠుని సన్నిధిలో వారికిచ్చాడు (42) ఆ బ్రాహ్మణులు రాముని ఆజ్ఞతో శుభమైన ఆశాసనాన్ని తీసుకొన్నారు. అది రాగిది బంగారు వర్ణములు గలది ధర్మమైనది ధర్మమునకు అలంకారమైనది (43) భక్తి కాములై పూజ కొరకు దానిని రక్షించారు. దివ్యమైన చందనముతో, వాసన గల పూలతో (44) అట్లాగే బంగారు పూలతో, అట్లాగే వెండి పూలతో, శుభ్రమైన దానిని ఆ బ్రాహ్మణులు పూజించారు. (45) దాని ఎదుట స్వచ్ఛమైన నేయితో దీపం పెట్టారు. దానిలో ఏడు వత్తులు వేశారు. ద్విజులు ప్రతిరోజు అర్ఘ్యము ఇచ్చేవారు. ఓ రాజ (46) బ్రాహ్మణులు, భక్తి పూర్వకముగా ప్రతిరోజు నైవేద్యము పెట్టేవారు. రామ, రామ, రామ అని మంత్రాన్ని కూడా ఉచ్చరిస్తున్నారు (47) భుజించేటప్పుడు, నిద్రించేప్పుడు, తాగేటప్పడు, వెళ్ళేప్పుడు, కూర్చున్నప్పుడు, సుఖమందు లేదా దు:ఖమందు రామ మంత్రాన్ని ఉచ్చరించేవారు (48) వానికి దుః ఖ దౌర్భాగ్యము కాని ఆధి వ్యాధి భయము కాని లేదు. ప్రతిరోజు అతని ఆయుస్సు శ్రీ బలము పెరుగుతున్నాయి. (49) రామనామముచ్చరిస్తే చాలు దారుణమైన పాపం నుండైన ముత్తుడౌతాడు. నరకానికి వెళ్ళడు. శాశ్వత గతిని పొందుతాడు. (50) వ్యాసులిట్లన్నారు అని పలికి రాముడు తనను కృతకృత్యునిగా తలిచాడు. అప్పుడు ప్రదక్షిణం చేసి అనేక మంది బ్రాహ్మణులకు నమస్కరించి (51) అధికమైన దానము గోవులు, అశ్వము, బఱ్ఱెలు రథము మొదలగునవి ఇచ్చాడు. పిదప తన వారిని అందరిని ఉద్దేశించి ఇట్లా అన్నాడు (52) సూర్యచంద్రులున్నంత వరకు మీరందరు ఇక్కడే ఉండండి. భూమిమీద మేరు పర్వతం ఉన్నంత కాలము, ఏడు సముద్రములు ఉన్నంత కాలము (53) మీరిక్కడే ఉండాలి, అనుమానం లేదు. ఎప్పుడైతే బ్రాహ్మణులు,రాజులు ఈ భూమి పై ఆ శాసనాన్ని గౌరవించరో (54) లేదా శూరులైన వణిజులు మదమాయ విమోహితులై నా ఆజ్ఞను పాటించరో, నా మాటను తలచరో (55) ఓ బ్రాహ్మణులారా అప్పుడు వాయువుత్రుని స్మరించండి. స్మరించినంత మాత్రంతో హనుమంతుడు వచ్చి (56) వారిని త్వరగా భస్మం చేస్తాడు. నామాట ప్రకారం చేస్తాడు. ఇది సత్యము, అనుమానం లేదు. ఈ రమ్యమైన శాసనమును, ఏ రాజుపాలిస్తాడో (57)  వానికి వాయుపుత్రుడు ఎల్లప్పుడు సౌఖ్యాభివృద్ధిని కల్గిస్తాడు. పుత్రులను పౌత్రులను ఇస్తాడు. సాధ్వియైన పత్నిని, యశస్సును, జయమును ఇస్తాడు (58) అని పలికి హనుమంతుని ప్రబోధించి రామదేవుడు సైన్యంతో, పరిజనంతో కూడి తిరిగి వెళ్ళాడు (59) వాదిత్రముల శబ్దములతో అంతట తన శుభ ఆగమనాన్ని సూచిస్తూ, తెల్లని గొడుగు కలిగి, నరులు చామరములు వీయగా అయోధ్యా నగరిని చేరి చాలా కాలం రాజ్యం చేశాడు. (60) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మ ఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రహ్మ నారద సంవాదమందు శ్రీరాముడు బ్రాహ్మణుల కొరకు శాసనపట్ట ప్రదాన వర్ణన మనునది ముప్పది నాల్గవ అధ్యాయము.