స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

25వ అధ్యాయము

తా ॥ సూతుని వచనము - ఇంకా ఇంకో ఉత్తమమైన తీర్థ మాహాత్మ్యాన్ని చెబుతాను. ధర్మారణ్యమునకు నత్య లోకము నుండి సరస్వతి ఎట్లా వచ్చిందో చెబుతాను  సుఖంగా కూర్చున్న, మహా మునులతో సేవించబడుతున్న మార్కండేయుని, బాలసూర్యుని వంటి కాంతి గల వానిని, సర్వ శాస్త్రములలో విశారదుని నర్వ తీర్థమయుని, దివ్యుని ఋషులలో శ్రేష్టుని, ద్విజుని, ఆ సనమందున్న వానిని, మంచి యోగిని, ధన్యుని, పూజ్యుని, దృఢవ్రతుని యోగాత్ముని, పరుని, శాంతిని, కమండలు ధరుని, విభుని, ఆక్షసూత్ర ధరుని, శాంతుని, అట్లాగే కల్పాంత మందు ఉండే వాడిని కలతలేని వానిని, జ్ఞానిని, స్వస్తుని, పితామహునితో సమానమైన ద్యుతి గల వానిని, సమాధి యందున్న వానిని, ఆనందంతో వికసించిన కళ్ళు గల వానిని, ఇట్టి వానిని చూచి నమస్కరించి, స్తుతించి, తగిన విధముగా మార్కండేయునితో మునులిట్లా అన్నారు. ఓ భగవాన్! నైమిషారణ్య మందు, ద్వాదశ వార్షిక నత్రమందు (యాగం) మీరు అవతరింప చేసిన నది, బ్రహ్మసుతయైనది నరస్వతి అక్కడే ఆ భూమి యందే అట్లాగే గంగావతరణము చేయబడింది కదా కులపతియైన శౌనకముని ఎదుట చెప్పబడుతుండగా, ఇతరులు కూడా వింటుండగా సూతముని చెప్పాడు గదా. ఆ మహా ఆఖ్యానము విన్నాక అది మా హృదయములో నిలిచిపోయింది. అది పాపఘ్ని పుణ్యములు కల్గించేది. దర్శన మాత్రం చేతనే ప్రాణులకు పుణ్యదాయి  అనగా మార్కండేయుని వచనము - ధర్మారణ్య మందు నేను సత్యలోకము నుండి సరస్వతిని తీసుకొచ్చాను. ఓ బ్రాహ్మణులార! సురేఖాద్రి యందు అనది శరణార్థులకు శరణీయమైనది భాద్రపద శుక్ల పక్ష ద్వాదశిన పుణ్యవంతమైనది. మునులు గంధర్వులు సేవించే ద్వారవతి తీర్థమందు  ఆ రోజు ఆ తీర్థముందు పిండ దానాదులు చేయాలి. చేస్తే ఆ ఫలం వస్తుంది. పితరులకు ఇచ్చింది అక్షయమౌతుంది.మహత్ ఆఖ్యానము ఇదంతా పాపనాశిని, పుణ్యదాయిని, పవిత్రములన్నింటి కన్న పవిత్రమైనది. మహా పాతకముల నశింపచే సేది సర్వ మంగళములకు మంగళ ప్రదము పుణ్యమైనది. ఈ నరన్వతి జలము. ప్రభాసాంత మందు స్వర్గమందు ఏ పుణ్యముందో దానికన్న ఊర్థ్వమైనదది చెప్పేదేమి. సారస్వత జలము నరుల బ్రహ్మహత్య పావమును తొలగిస్తుంది. నరులు నరస్వతిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణ చేసిన, పిదప పిండ దానము చేసిన వారు తిరిగి స్తనంధయులు (రొమ్ముపాలు తాగేవారు) కారు (జన్మించరు) కోరికలనిచ్చే గోవు (కామధేనువు)లు ఇష్టమైన ఫలముల నిచ్చినట్లు అట్లాగే నరస్వతి నది స్వర్గ అవవర్గములకు ఒకే కారణమైనట్టిది. అని శ్రీ స్కాంద మహాపురాణము నందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు సరస్వతి మాహాత్మ వర్ణనమనునది ఇరువది ఐదవ అధ్యాయము.