స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

15వ అధ్యాయము

తా ॥ వ్యాసుని వచనము - బ్రహ్మాదీ సురలు అప్పడు తలను కనుగొనలేక పోయారు హా! ఇప్పుడేం చేద్దాం అని ఆజ్ఞానులు ఆలోచించారు దేవతలతో కూడిన బ్రహ్మ అప్పుడు విశ్వకర్మతో ఇట్లా అన్నాడు బ్రహ్మవచనము - ఓ విభు! విశ్వకర్మ ఎల్లప్పుడు కార్యకర్తవు నీవే. ధనుర్థారియైన విష్ణువు యొక్క మృదువైన ముఖమును త్వరగా నీవు చేయి అనగా దేవతల వర్థకి (వడ్రంగి) ఆతనికి నమస్కరించి, ఆతనిని స్తుతించి పరమ భక్తితో కమలోద్భవుడైన బ్రహ్మతో ఇట్లా అన్నాడు యజ్ఞకార్యాన్ని త్వరగా నాతో చేయించుకొని దేవతలంతా ఇట్లా అంటున్నారు. నాకు యజ్ఞభాగము లేదు, అని. మీ ముందు ఇంకేం చెప్పను. ఓ దేవ! దేవతలతోపాటు నాకు యజ్ఞభాగము రావాలి అనగా బ్రహవచనము - ఓ సురవర్ధక! అన్ని యజ్ఞములలో నీకు భాగాన్ని ఇస్తాను. సోమయజ్ఞ మందు త్రికోవిదులు, నిన్ను మొదలు పూజిస్తారు. ఓ వీర ఓ అసుర వర్థక విష్ణువు యొక్క శిరస్సును అతికించు అనగా విశ్వకర్మ అన్నాడు. దేవతలారా! శిరస్సు తెండి అని అనగా దేవతలంత ఆ శిరస్సులేదు అని అన్నారు, ఓ నృపసత్తమ! మధ్యాహ్నము కాగా సూర్యుడు ఆకాశంలో రథస్థుడై ఉన్నాడు అప్పుడు దేవతలంతా చూచారు. పిదప రథము నుండి గుఱ్ఱమును తెచ్చారు. ఓ మహిపాల! గుఱ్ఱము యొక్క కబంథము నుండి తలను ఛేదించి విష్ణువు యొక్క మొండి యందు, అతిచాతుర్యము కల విశ్వకర్మ తగిలించాడు. ఆ దేవదేవేశుని చూచి దేవతలుస్తుతిచేశారు  దేవతల వచనము - జగదీజ! నీకు నమస్కారము. ఓ కమల ఈక్షణ (కన్నులు) నీకు నమస్కారము సర్వప్రాణులకు నీవు రక్షకుడవు. పనులకు నీవే శరణము. నర్వదుష్ట సంహారకుడవు నీవే. ఓ హయగ్రీవ! నీకు సమస్కారము నీవు ఓంకారము, వషట్ కారము. స్వాహా, స్వధా ఈవెలుగు నీవే. ఓ సురేశాన! నీవు ఆద్యుడవు. ఎల్లప్పుడు నీవే శరణమవు  యజ్ఞము నీవే. యజ్ఞ పతివి నీవే. యజ్ఞం చేసే వాడివి నీవే. ద్రవ్యము, ఋత్విక్కు, స్వీకర్త అన్ని నీవే. నీ కొరకే హోమం చేయబడుతోంది. ఓ దేవ! నీవే శరణము నీవే వఖుడవు కరాల రూపంగల కాలము నీవు. సూర్యుడవు నీవు చంద్రుడవు నీవే. నీవే అగ్నిని, వరుణుడవు. కాలక్షయ కరుడవునీవే గుణత్రయము నీవే. గుణహీనుడవు నీవే. గుణములు విలయమునీవే, ప్రాణులన్నింటిలో రకుడవుగా ఉన్నవాడివి నీవే పశుపక్షి మానవులు మొ॥ స్త్రీ పురుషుల రెండి రూపము నీవే. నాల్గు రకముల కులము నీవే. ఎనుబది వాలుగు లక్షణముల వాడివి నీవే. దివాంతము, వక్షాంతము, మాసాంతము, హాయనము, యుగము, కల్పాంతము, మహాంతము కాలాంతము సర్వము ఓహరి! నీవే. ఓ నృప! ఈ విథముగా దేవతలు గొప్ప స్తోత్రములతో పొగడగా సంతుష్టుడై ప్రభువు దేవతలందరి ఎదురుగా ఇట్లా అన్నాడు.

తా ॥ శ్రీ భగవానుని వచనము - ఈ భూమియందు దేవ గణములంతా ఎందుకొచ్చారు. ఓ దేవతలార! దీనికి కారణమేమి. రాక్షసులేమైనా, మిమ్మల్ని పీడించారా  దేవతలిట్లన్నారు - దైత్యుల వల్ల భయము కలుగలేదు. మేము యజ్ఞకర్మ చేద్దామనే ఉత్సాహంలో ఉన్నాము. మేమందరము నీ దర్శనము కొరకు అసతులపై పది దిక్కుల చూస్తున్నాము అంతా నీ మాయా మోహితులు వ్యాకుల చిత్తులు, భయాతురులు మేము, ఉత్తమమైన నీ యోగా రూథరూపాన్ని చూచాము ఓ ఈశ్వర! నిన్ను మేల్కొలుపే కొరకు మేము చెద పురుగును ప్రేరేపించాము. అప్పుడు ఒక అపూర్వ విషయం జరిగింది. నీతల తెగిపోయింది సూర్యుని గువు తలను తెచ్చి అతిచతురుడైన విశ్వకర్మ అతలను అతికించాడు. ఓ విష్ణు! అందువల్ల హయగ్రీవుడవైనావు. ఓ ప్రభు అనగా విష్ణు వచనము - ఓ దేవతలార! నేను ఆనందించాను. మీకు కావలసిన వరమిస్తాను. దేవదేవుడను, జగత్పతిని ఐన నేను హయగ్రీవుడవైనాను. రౌద్రమైనది కాదు. వికృతరూపముకాదు. దేవతలంతా సేవించారు నన్ను. ఓ దేవతలార! నేను వరదుడవైనాను. హయాననుడను అని సంతోషించాను వ్యాసుని వచనము – యాగం చేశాక బ్రహ్మధీమంతుడు సంతుష్టమైన మనస్సులో చెదపురుగులకు, విశ్వకర్మకు యజ్ఞభాగము ఇచ్చి యజ్ఞాంత మందు ఇంద్రునకు నమస్కరించి దివమునకు వెళ్ళాడు. హయాననుడుగా హరి ఎందుకివాడో దానికి కారణము ఇది అని తెలుసుకో అని యుధిష్టిరుని వచనము - ఒక పాదంతో భూమినంతా ఆక్రమించినవాడు నిజంగా రోమముల ప్రతిరంధ్ర మందు విడివిడిగా వేలకొలది బ్రహ్మాండములు ఉన్నాయి. ఓ మహాద్యుతే! కన్పిస్తున్నాయి కూడా. ఆతనిని దరిని (అంతమును) వేదములు కూడా తెలుసుకొనలేవు. అతని తలతెగిపోవటం ఎట్లా జరిగింది. వ్యాసుని వచనము - ఓ పాండవ శ్రేష్ఠ! పౌరాణికమైన శభమైన కథను నీవు విను. ఈశ్వరుని చరిత్రను చరాచరములలో ఎవరూ తెలుసుకొనలేరు ఒకసారి బ్రహ్మసభకు ఇంద్రాది దేవతలు వెళ్ళారు. భూర్లో కాదులు అందరు స్థావరములూ, చరములూ దేవతలు, బ్రహ్మరులు అందరు పితామహుని నమస్కరించుటకు వెళ్ళారు. ఆ సభకు విష్ణువు కూడా వచ్చాడు. అది రహస్యం కనుక బ్రహ్మకూడా ఏ మాత్రం గర్వం లేకుండ అవ్వడు ఇట్లా అన్నాడు. ఓ దేవతలార! వినండి. మూడింటికి గొప్ప కారణమైన వాడెవడు  ఓ దేవతలార! బ్రహ్మ ఈశ విష్ణువుల మధ్యలో ఎవరు గొప్పో నిజం చెప్పండి అనగా ఆ మాటను విని దేవతలు అశ్చర్యపడ్డారు అవ్వడు దేవతలన్నారు. ఓ దేవతలార! మాకు తెలియదు. అని బ్రహ్మపత్ని అప్పుడు నరేశ్వరుడైన విష్ణువుతో అంది. మా ముగ్గురు దేవతలలో ఎవరు గొప్పొ చెప్పు అని విష్ణువువచనము - ముల్లోకములు విష్ణుమాయా బలము వలన మెహితమైపోయి, అని అప్పుడు బ్రహ్మ ఇట్లన్నాడు. ఓ విభు! నీకు తెలియదు నీ మాయా బలముతో మొహం పొందటంలేదు అనగా ఇట్లా కాదు. నీవు గర్వహింసాపరుడవు. జగద్కర్తగా, జగత్ప్రభుడవుగా పెద్ద వానిగా అందరు నిన్ను గుర్తించటంలేదు. విష్ణుమాయా వృతులు అంతా నశించేవారు అనగా అప్పుడు బ్రహ్మ రోషంతో క్రుద్ధుడై ముఖంజేవురించగా కోపంతో ఇట్లా అన్నాడు. ఓ విష్ణు! నా మాటవిను. ఏ ముఖంతో సభలో ఈ మాట అన్నావో ఆ నీముఖము (తల) త్వరగా, కొద్ది కాలంలోనే పడిపోనీ. అనగా ఇంద్రుడు ఋషులు మొదలగు వారంతా హాహాకారాలు చేశారు విష్ణువు విషయంలో బ్రహ్మను క్షమింపచేశారు. దేవతోత్తములు విష్ణువు ఆ మాటను విని, సత్యము సత్యమౌతుందిది అని ఆ పిదప మహా తేజస్సంపన్నుడైన విష్ణువు తీర్థమును ఉత్పత్తి చేసి, ఆసురేశ్వరుడు ధరారణ్యమందు తపస్సు చేశాడు.

తా ॥ హయగ్రీవుడైన జనార్దనుడు గుఱ్ఱపు తల గల తన ముఖం చూసుకొని ఓ భారత! శాస్త్ర ప్రకారముగా ఆ మహాభాగుడు తపమాచరించాడు. ఎవరూ చేయలేనంత తపమాచరించాడు. అత్మలో ఆత్మ (తానుతానే) సంతుష్టమైంది  బ్రహ్మకూడా తవము చేయువాడై మూడు వందల సంవత్సరాలు తపమాచరించాడు. విష్ణు మాయూ వివాహితుడై విష్ణువు ఎదురుగానే ఉండి తపమాచరించాడు. యజ్ఞము కొరకు ఆహ్వానించాడు. దేవదేవుడు జగత్పతి సంతుష్టడై ఓ బ్రహ్మ! ఈవేళ నీకు ముక్తి లభించింది నీ మాయ భరింపరానిది వరమును పొంది బ్రహ్మ ఆనందముతో నిండిన హృదయం కలవారై వాడు. అందరికీ మేలు కొరకు జనార్ధనుడు మధురమైన మాటను ఇట్లా పలికాడు. ఇక్కడ మహాక్షేత్ర మౌతుంది. పుణ్యప్రదమైనది, పావనాశకమైనది. విధి విష్ణుమయము ఔతుంది. ఈ ప్రదేశము, అనుమానములేదు ఓ రాజ! ఇది ఈ తీర్ఘమహిమ అట్లా హరిహయ తీరుడైవాడు. పూర్వముఖముతో తిరిగి శుభాననుడైవాడు ఓ నవ! అప్పుడు కృష్ణుడు కోటి మన్మథులంత సౌందర్య వంతుడైనోడు. బ్రహ్మకుడా దేవతల మూడు వందల సంవత్సరాలు తపమాచరించాడు సావిత్రి కూడా తపమాచరించింది. ఇక్కడ విష్ణుమాయ బాధించదు. మాయతో చేయబడిన ఐదవతల శార్దూలముది (దానిని శివుడు హరించాడు. అదే బ్రహ్మ విష్ణువునకు శాపమిచ్చిన ముఖము) ధర్మారణ్య మందు, పూర్వము ఆ ముఖమును హరుడు ఛేదించి రమ్యము చేశాడు. ఆతనికి వరమిచ్చి విష్ణువు ఏదవ కన్పించకుండా పోయాడు వీధి అక్కడ త్రిలోచన తీర్థమును స్థాపించాడు. ముకేమను పేరు గల దేవుని మోక్షతీర్ధము, ఓ అరిందమ! ఆ నురవుడు కూడా దేవతలు పేవించే తన స్థానమునకు వెళ్ళాడు. అక్కడ మరణించిన వారు తర్పణముతో తృప్తి పొంది స్వర్గమునకు వెళ్తారు స్నానం చేస్తే అశ్వమేథవలము స్నానం చేస్తే గోదానం వల్ల కలిగే ఫలము కలుగుతాయి. పుష్కరాది తీర్థములు, గంగాది నదులు స్నానం కొరకు ఇక్కడి కొస్తాయి. దేవతలు, వితరులు వస్తారు. కార్తికమానం కృత్తికానక్షతనుందు ముకేశుని పూజించినవారు రమ్యమైన దేవ నరమందు స్నానంచేసి, జనార్దునుని నమస్కరించి వారు, భక్తితో ఆచరించినవారు పాపములన్నింటి నుండి ముక్తులౌతారు స్వేచ్చగా భోగముల ననుభవించి ఆతడు విష్ణులోకమునకు వెళ్ళుతాడు. సంతాన హీనురాలు, ఒతే సంతానం గల స్త్రీ చనిపోయిన సంతానం కల స్త్రీ పుట్టగానే చచ్చే సంతానం గల స్త్రీ ఒకే వస్త్రంతో భార్యా భర్తలు శాస్త్ర ప్రకారము స్నానం చేస్తే, వంతాన ప్రాప్తికి ప్రతిబంధకమైన ఆదోషాన్ని (ముక్తేశుడు) నశింపచేస్తాడు తప్పదు. మోక్షేశ్వరుని అనుగ్రహంతో పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు. పత్యము గలవారై ఏకాగ్రచిత్తంతో పండ్లను ఇస్తే వెదురు పాత్ర యందుంచి ఇస్తే ఆ స్త్రీ దోష విముక్తురాలౌతుంది.

తా ॥ ఓ నృప! దేవతలు అగ్నిష్టోమ ఫలమును పొందుతారు బ్రహ్మ విష్ణువు, శివుడు పరమమైన తపమాచరించారు. ధర్మారణ్య మందు మూడు సంధ్య లందు దేవవరమందు స్నానం చేసి ఆ పిదప దేవతలు మోక్తేశ్వరుని శంభుని అక్కడ స్థాపించారు. అక్కడ సాంగముగా జపమాచరించిన వారు, తిరిగి స్తన్యపానం చేయరు ఓ మహరాజ! ఈ విధముగా ఆ క్షేత్రము భువన త్రయమందు ప్రసిద్ధమైనది. అక్కడ పితరులకు శ్రద్ధతో శ్రాద్ధము చేసిన నరుడు సప్త గోత్రములను ఉద్ధరిస్తాడు. కులము వారిని నూట ఒక్కరినీ ఉద్ధరిస్తాడు. దేవ వరము చాలా రమ్యమైనది. రకరకాల పూలతో కూడినది. శ్యాము వర్ణము కలది. అన్ని విధములైన కలువ పూలతో, రకరకాలైన జల జంతువులతో కూడినది  బ్రహ్మ విష్ణు మహేశాదులతో, సురలతో మనుషులతో సేవించబడినది. నదులు యక్షులు మునులు సేవించినట్టిది. అన్ని విధముల శుభమైనది యుధిష్ఠిరుని వచనము - ఓ ద్విజోత్తమ! ఆ స్థానమందు ఆ సరస్సు ఎట్లా ప్రసిద్ధి చెందింది. దాని రూపాన్ని దాని ప్రకారాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పండి అనగా వ్యాసుని వచనము - ఓ మహాప్రాజ్ఞ! ధర్మపుత్ర! యుధిష్ఠిర బాగుబాగు. దాని సంకీర్తన వల్ల నిజంగా సర్వపాపముల నుండి ముక్తులౌతారు మిక్కిలి స్వచ్చతరమైనది శీతమైనది. గంగోదకముతో సమమైన కాంతి గలది, పవిత్రమైనది మధురమైనది రుచికరమైనది దాని నీరు, ఓ నృపోత్తమ! మహా విశాలమైనది గంభీరమైనది మనోరమమైనది. ఆదేవ ఖాతము, అలలు మొదలగు వానితో గంభీరమైనది నురుగుతో మడులతో నిండినది చేపలు, కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళతో నిండినది. శంఖములు, ముత్యములు మొదలగు వానితో కూడినది, రాజ హంసలతో బాగా శోభిస్తున్నది మర్రిజువ్వి, వృక్షములతో కూడినది, రావి మామిడి చెట్లలో చుట్టబడినది. చక్రవాకములతో కూడినది. కొంగలు, సారసపక్షులు, లకుముకిపిట్టలు వీటితో కూడినది అందమైన మంచి వాసనగల స్వచ్చమైన గొడుగు వంటి (పెద్ద) ఆతులతో బాగా శోభిస్తున్నట్టిది, పక్షులన్నింటితో సేవించబడుతున్నది, పారసాదులతో బాగా శోభిస్తున్నట్టిది, ఓ భూమివ! దేవతలలో మునులతో బ్రాహ్మణులతో నరులతో (కూడియున్నది) సేవించబడుతున్నది, దుఃఖమును నశింపచే పేది, పాపములన్నిటిని నశింపచేసేది ఆద్యంతములు లేని చరిత్ర గలది, సిద్ధమండలములతో సేవింపబడేది, ఎల్లప్పుడు స్నానాదుల ద్వారా, ఓ నృపసత్తమ! ఆ సరస్సు అట్టిది దాని తటమందు జల తర్పణమును శాస్త్ర ప్రకారము చేసిన వాని కులమందు ప్రీతలు ఉండరు, పదునాలుగు రింద్రులున్నంత కాలము అక్కడ శాస్త్ర ప్రకారము కన్యాదానము చేసినవారు, ఓ భూవతి! బ్రహ్మలోకమందు జల ప్రళయమొచ్చేదాక ఉంటారు బఱ్ఱెను, గృహదాసిని, వంతానము కల సురభిని, బంగారము, విద్య, భూమి రథము, ఏనుగు, వస్త్రములు వీటన్నిటిని అక్కడ శ్రద్దగా ఇచ్చినవారు అక్షయమైన స్వర్గమును పొందుతారు. దేవత మాహాత్మ్యమును శివుని సన్నిధి యందు చదివిన వారు దీర్ఘాయువును, సౌఖ్యమును పొందుతారు, అనుమానము లేదు ఈ అద్భుతమును భక్తితో వినిన నరుడు కాని, వారిని వారి కులములో శ్రేయస్సు కలుతుంది, కల్పాంతమందు కూడ, ఓ యుధిష్ఠిర! హయగ్రీవుని కారణముగా ఇదంతా నేను చెప్పాను. దాని కాంతులు (తీర్థము) సర్వపాపములు, తొలగించే కొరకే అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ మందు హయగ్రీవుని కథ వర్ణించుట అనునది పదునైదవ అధ్యాయము.